దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘ఐ యామ్ గేమ్’.
నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు.
వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 3న విడుదల చేస్తోంది.
సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


