సాక్షి, ఢిల్లీ: ఏపీలో లిక్కర్ అక్రమ రవాణా కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్ కేసిరెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన సిట్ వైఖరిపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘సిట్ అతి చేస్తోంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది.
లిక్కర్ అక్రమ రవాణా కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటివరకు ఏం కనుగొన్నారని సిట్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని కోరుతూ.. మరోవైపు పోలీసు కస్టడీకి తాము సిద్ధంగా లేమని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది. ముందుగా సిట్ వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై దృష్టి పెడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే కేసును కొట్టివేస్తామని హెచ్చరించింది. అనంతరం, తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి: వెలిగొండలో క్రెడిట్ చోరీ..


