breaking news
Special Investigation Team (SIT)
-
మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న సిట్‌ను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించింది. ఈ సిట్‌కు అదనపు డీజీ స్థాయికి తక్కువ కాని అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సిట్‌లో ఎవరెవరు ఉంటారన్న వివరాలను మూడు రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ కు అందచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్‌ను ఆదేశించింది. అసలు ఓఎంఆర్ షీట్లు, విజయవాడలో ఫిజికల్ వాల్యుయేషన్ సమయంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లు, సమాధాన పత్రాలపై ఉన్న బార్ కోడ్లు, వాటినుంచి సేకరించిన వివరాలన్నీ ఒకేలా ఉన్నాయో లేదో సరిపోల్చాలని కూడా స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏవిధంగా తనిఖీ చేస్తారో, అదే రీతిలో ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే మెరిట్ లిస్ట్‌లో చివరిగా ఎంపికైన అభ్యర్థి కంటే కింద ఉన్న 100 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా పరిశీలించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. పైన పేర్కొన్న నిర్దిష్ట అంశాలపైనే కాకుండా (బార్ కోడ్లు, ఓఎంఆర్ షీటు వంటివి), దర్యాప్తు సంస్థ ఇతర శాస్త్రీయ మార్గాల ద్వారా కూడా అక్రమాలను వెలికితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఎలాంటి స్థానిక ప్రభావం లేకుండా ఉండటానికి, రాష్ట్రం వెలుపల ఉన్న ఏదైనా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణుల సహాయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ అధికార బలంతో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపిక కాని అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తక్షణమే వారందరినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నాన్–ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్‌కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా ఎంపికైన అభ్యర్థుల మాదిరిగానే విచారించాలని సిట్‌కు తేల్చి చెప్పింది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. అన్ని అప్పీళ్లపై మార్చి 16న తిరిగి విచారణ జరుపుతామంది. ఈ ఆదేశాల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సిట్‌ను ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్ల నేపథ్యంలో గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. మరోవైపు ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారు కూడా అప్పీళ్లు దాఖలు చేశారు. అలాగే వీరు పలు అభ్యర్థనలతో అనుబంధ పిటిషన్లు సైతం దాఖలు చేశారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేయాలని, గ్రూప్–1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాల మీద నమోదైన క్రిమినల్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ రిపోర్టును కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు నియమించిన కమిటీ పరిశీలించిన ఆన్సర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్‌కి ఇవ్వాలన్న అభ్యర్థనలతో మరికొన్ని అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్‌ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్‌షీట్‌లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌లతో సమావేశమై చార్జ్‌షీట్‌లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్‌షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్‌ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌కు చీఫ్‌గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్‌కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్ అధికారి నారాయణరెడ్డి, నాన్ కేడర్ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్ రావు, ఏసీపీ సీహెచ్ శ్రీధర్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్ చీఫ్‌గా ఉన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు గత వారంలో సిట్ అధికారులు కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్ బృందం కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. అప్పట్లో రాధాకిషన్‌రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లిరావడం, ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కేసీఆర్ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్విగ్నం.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌లోని నందినగర్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత.... ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్‌కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన నందినగర్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలివారు. బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్‌కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
‘రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదని.. సిట్ అంటే సీఎం ‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ సిట్ విచారణపై హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో..సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం,రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదు.కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం.పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం.చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. సిట్ అంటే సిట్ కాదు. ఇది CIT సిట్..‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారు పోలీసులు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోంది. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావు మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్లు?. మా నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు.గజ్వేల్ నుండి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రెండేళ్లుగా చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదు అందుకే రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నడు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు. ఇది కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ రైతుల కష్టాలు పట్టవు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీల అమలు చేయరు కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వాలే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని,కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని పేర్కొన్నారు. -
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హత్యానేరం కన్నా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్న వేళ.. మరోవైపు సీఎల్పీ మీడియా హాల్లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారుఅన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్ఎస్లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు. -
కేసీఆర్ ఒక్కరికే అనుమతి! సిట్ విచారణ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందినగర్ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను గంటల తరబడి సిట్ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్‌కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్‌పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. ‘సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్ నందినగర్‌లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు ‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నందినగర్‌కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో క్రైమ్ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్‌కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ ఆదివారం ఉదయం నందినగర్‌కు చేరుకోనున్నారు. -
రేపు సిట్ విచారణకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ రానున్నారు.సిట్‌కు కేసీఆర్.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్.. తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదు...హరీష్‌రావు ఆఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్‌గా నందినగర్ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. రేపు(ఫిబ్రవరి 1న) మధ్యాహ్నాం 3గం. టైంలో నందినగర్ నివాసంలో విచారణకు తమకు అందుబాటులో ఉండాలని ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో విచారణ జరపాలన్న ఆయన విజ్ఞప్తిని టెక్నికల్ రీజన్ చూపిస్తూ తిరస్కరించింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని.. అందుకే ఆ ఇంటికి నోటీసులు అంటించామని సిట్ చెబుతోంది. అయితే గోడకు అంటించే నిబంధన ఏదీ లేదని.. పైగా ఇలా అంటించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లీగల్ టీం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు.. హరీష్‌రావు అఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉందని.. అయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌కే సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేసు విచారణకు సంబంధించి నోటీసులు పంపడం కోసం రిజిస్టర్డ్ పోస్టు, కోర్టు తదితర ప్రక్రియల ద్వారా సర్వ్ చేయడం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. గోడకు అతికించడం సరైన నోటీసు సర్వ్ చేసినట్లుగా పరిగణించబడదని.. ఈ లెక్కన కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అంటోంది. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల మాట మరోలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. (రాజేంద్ర కుమార్ వర్సెస్ యూపీ అవాస్ ఎవమ్ వికాస్ పరిషత్ సివిల్ అప్పీల్ నెం. 14604 of 2024 ప్రకారం).. ఇంటి గోడలపై నోటీసులు, ప్రకటనలు అతికించడం వంటి చర్యలు చట్టబద్ధం కాదు. ఇది ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కిందకే వస్తుంది. దీనికిగానూ జరిమానా, శిక్షలు విధించవచ్చు. కానీ, కేసీఆర్‌కు సిట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం జారీ చేసింది. దర్యాప్తు జరుగుతున్న కేసులో సాక్షిగా లేదంటే విచారణ కోసం ఓ వ్యక్తిని పిలిచే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది సాధారణంగా అఫిక్స్డ్ నోటీసు (Affixed Notice) అనే ప్రక్రియలో భాగమేనని అంటున్నారు. ఒక వ్యక్తి నోటీసు స్వీకరించనప్పుడు లేదంటే ఆ నోటీసుల స్వీకరణకు గనుక అందుబాటులో లేకపోతే కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థలు ఇలా ఇంటి గోడలకు నోటీసులు అతికించడం ద్వారా సర్వ్ చేసినట్లుగా పరిగణిస్తాయి. కాబట్టి.. ఈ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం తప్ప బీఆర్ఎస్కు మరొ మార్గం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
రేపే విచారిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్‌లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. సీఆర్పిసీ సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం ఇచి్చన నోటీసులకు స్పందించిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్‌కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజా నోటీసులు ఇచ్చారు. ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు. సుదీర్ఘంగా చర్చించి.. కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో..గురువారం ఇచి్చన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. లేదంటే హైదరాబాద్‌లో మీరు చెప్పిన చోటుకే మేము వస్తామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఎంచుకోవాలని కేసీఆర్ కోరారు. విచారణ కోసం ఎర్రవల్లికి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ శుక్రవారం న్యాయ నిపుణులతో భేటీ అయింది.సుదీర్ఘ మంతనాల తర్వాత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల అఫిడవిట్లు, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల్లో ఉన్న నివాస చిరునామా ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ‘మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, అలాగే సీఆర్పీసీ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం, అధికారిక రికార్డుల్లో ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ నిర్వహించేందుకు దర్యాప్తు అధికారి నిర్ణయించారు..’అని వెల్లడించారు మీరు కోరినట్లుగా ఎర్రవల్లిలో విచారించడం కుదరదని చెప్తూ.. అధికారిక రికార్డుల్లో ఉన్న నివాసాన్నే (నందినగర్‌లోని ఇల్లు) విచారణ స్థలంగా నిర్ణయించిన విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.అదే సమయంలో..‘విచారణ సందర్భంగా అనేక సున్నిత ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డుల పరిశీలన అవసరం. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా హైదరాబాద్ నివాసం (నందినగర్)లో విచారణకు అందుబాటులో ఉండగలరు..’అని సిట్ స్పష్టం చేసింది. కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ సీఆర్పిసీలోని సెక్షన్ 160 ప్రకారం జరిగే ఈ విచారణకు సంబంధించి చట్టంలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడి పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలకు చెందిన వాళ్లు ఫలానా ప్రాంతానికి వచ్చి తమ వాంగ్మూలం నమోదు చేసుకోవాలని కోరే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో నోటీసుపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. -
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
శబరిమల కేసులో నటుడు జయరామ్ విచారణ
శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం. శుక్రవారం చెన్నైలోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్.. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకూ సుపరిచితుడే. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక (కాపలాదారు) విగ్రహాలు మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్‌ల నుండి బంగారం పోయినట్లు ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్.. ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఇక.. ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్‌లు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో(90 రోజుల) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ.. మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: శబరిమల గోల్డ్ కేసు.. ఏపీకి లింకు! నటుడ్ని ప్రశ్నించే చాన్స్ -
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
కేసీఆర్‌కు సిట్ సెకండ్ నోటీసు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని సిట్ పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళే రెండో నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్‌కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చింది. వయసురిత్యా(65 ఏళ్లు పైబడడంతో) పీఎస్కే రావాల్సిన అవసరం లేదని.. నగర పరిధిలోనే ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నోటీసులను నందినగర్‌లోని నివాసానికి వెళ్లి కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులు అందజేశారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడి నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్‌కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. కానీ ఫాంహౌజ్‌లోనే తనను విచారణ జరపాలని సిట్‌ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తోంది. వీలైతే ఇవాళ సెకండ్ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ జరపొచ్చని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సాక్షిగా పరిగణిస్తూ సీఆరీ్పసీలోని సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలిసిన సమాచారం ఇవ్వాలని ఆయన్ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటివరకు కొందరు ప్రభుత్వ అత్యున్నత అధికారులు మినహా అందర్నీ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో సిట్ అధికారులు చట్ట ప్రకారం ఆయనకు ఓ వెసులుబాటు ఇచ్చారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. అలా కాకుంటే మీరు కోరిన చోటుకే తాము వస్తామంటూ పేర్కొన్నారు. నందినగర్ నివాసానికి వెళ్లి.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తొలుత ఇందులో కేవలం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉన్నారు. దీని దర్యాప్తు కోసం తొలుత అనధికారిక సిట్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడిస్తూ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారింది. సిట్ బృందం ప్రణీత్‌రావుతో పాటు మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేసింది.మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత ఏడాది వరకు సిట్ అధికారులు కేవలం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, బాధితులతో పాటు ఇతరుల్నీ విచారించారు. కాగా గత నెలలో ఈ కేసు దర్యాప్తు కోసం డీజీపీ బి.శివధర్‌రెడ్డి అధికారిక సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్‌ను దీనికి చీఫ్‌గా నియమించారు.ఆ తర్వాత దూకుడు పెంచిన సిట్ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకు నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ నెల 19న మాజీ మంత్రి హరీశ్‌రావు, 22న మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 27న మాజీ ఎంపీ సంతో‹Ùరావులకు నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయంలో విచారించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించడంతో పాటు వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎర్రవల్లి నివాసంలో కుదరదు..! విచారణ జరిగే ప్రాంతానికి కేసు దర్యాప్తు అధికారితో పాటు మరికొందరు కూడా రావాల్సి ఉంటుందని కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ వివరించింది. ఎర్రవల్లి నివాసంలో విచారణ కుదరదని పరోక్షంగా స్పష్టం చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతాన్ని చెప్పాలని కోరింది. ఎక్కడకు వచ్చి విచారించాలనే సమాచారాన్ని కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి తెలపాలని సూచించింది. బందోబస్తుపై పోలీసుల దృష్టి.. కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచి్చనా.. అధికారుల బృందం నందినగర్‌లోని ఇంటికి వెళ్లాల్సి వచి్చనా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆయా మార్గాలతో పాటు పరిసరాలనూ గమనించారు. ఎక్కడెక్కడ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి? ఎక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లింపులు విధించాలి? అనే అంశాలను పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహంబంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజ రుకావాలంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలతో పా టు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. -
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
కేసీఆర్ లేఖపై సిట్ స్పందన
హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.ఇవాళ.. కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్‌కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు(శుక్రవారం, జనవరి 30న) కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నాం 3గం. విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్నవాళ్లు.. దర్యాప్తు కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. వయసురిత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పీఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి దశలో బీఆర్ఎస్ హయాంలో పని చేసిన పోలీస్ అధికారులను, కేసీఆర్ పేషీలో పని చేసిన ఉన్నతాధికారులను సిట్ ప్రశ్నించింది. వీళ్లిచ్చిన స్టేట్మెంట్లతో రెండో దఫా విచారణలో.. వరుసగా రాజకీయ నేతలను సిట్ విచారణ జరుపుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.అయితే ఇదొక లొట్ట పీసు కేసు అని, పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నోటీసుల అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. -
భయపడేదే లేదు
సాక్షి, హైదరాబాద్: ‘సిట్ అధికారులు నన్ను ఏ కారణంతో పిలిచారో తెలియదు. అడిగిన ప్రశ్నలనే మళ్లీమళ్లీ అడిగారు. సిట్ విచారణకు భయపడేదే లేదు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సుమారు ఏడు గంటలపాటు సాగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘సిట్ అధికారులు ఒక టీవీ సీరియల్ తరహాలో సాగదీత ధోరణిలో ప్రశ్నలు వేసి 300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు. విచారణ పేరిట గంటలకొద్దీ టైంపాస్ చేయడం మినహా వేరే విషయమంటూ లేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే..‘గత రెండేళ్లుగా ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలు, అవినీతిని బీఆర్ఎస్ నాయకత్వం నిత్యం ఎండగడుతుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం రేవంత్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నాడు. ఏదో ఒక కథను సృష్టించి ప్రజలను భ్రమింప చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎవరినో పక్కనపెట్టి నన్ను విచారణ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. సిట్ విచారణలో కేటీ రామారావు తప్ప ఇంక ఏ రావూ లేడు. మంత్రులతోపాటు మా ఫోన్లు కూడా ప్రస్తుతం ట్యాప్ అవుతున్నాయని ఈరోజు జరిగిన విచారణలో బయటపడింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లీకుల పేరిట కథనాలకు బాధ్యులెవరు? ‘రెండేళ్లుగా లీకులిస్తూ మీడియాలో వచ్చే కథనాలతో మా పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరని సిట్ అధికారులను ప్రశ్నిస్తే.. మీడియా రాస్తే మాకేం సంబంధం అంటూ సిట్ చేతులు దులుపుకుంది. విచారణ పేరిట లీకులివ్వడం మంచి పద్ధతి కాదని చెప్పా. యూట్యూబ్ చానళ్లు, మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమైతే సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని అడిగా. లీకుల పేరిట నడిపిన కథనాలు, మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభ, మా వ్యక్తిత్వ హననం దృష్ట్యా లీకులను నిరోధించాలని కోరా. ప్రభుత్వం ఇచ్చే లీకుల ఆధారంగా వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.మా ఎమ్మెల్యేలు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో లేదో చెప్పాలని సిట్ అధికారులను అడిగితే సంబంధం లేదని నీళ్లు నములుతున్నారు. ఓ మంత్రి కూడా ఆయన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ చేసిన వ్యాఖ్యలపైనా సిట్ అధికారులు తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంతోపాటు కాంగ్రెస్ మంత్రులు, నేతలపై వస్తున్న ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. ‘‘నాపై ఏడు కేసులున్నాయని ప్రవీణ్ ఆరోపణలు చేశారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి. రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. BRS leader Sri R.S. Praveen Kumar, IPS (Retd), is hereby called upon to furnish complete and specific details of the alleged seven (07) criminal cases purportedly registered against the SIT Chief (myself) within two (02) days from the date of receipt of this notice. #Hyderabad… pic.twitter.com/yynhWo1TMU— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 23, 2026 -
ఇదో కాలక్షేప కథాచిత్రం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ సిట్ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకు వీరుల ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అంటూ వ్యాఖ్యానించారు.సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్ ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సిట్ అధికారులను అడిగితే సమాధానం లేదు, మా వ్యక్తిత్వ హననానికి గురిచేసిన వాళ్ల చర్యలు ఏవి అని అడిగాను. వేధింపుల తప్ప.. సిట్ అడిగినదాంట్లో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు.‘‘నాకు మద్దతు పలికిన పార్టీ నాయకత్వానికి- సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలీసుల సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను సిట్‌ను ప్రశ్నించాను. మాపై తప్పుడు ప్రచారం, లీకులు ఇస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాను. ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించినట్లు కథనాలు నిజామా? అని అడిగాను. హీరోయిన్‌పై కథనాలు వాస్తవం కాదని పోలీసులు ఖండించారు...మా నాయకుల ఫోన్ ట్యాప్ కావడం లేదా అని నేను అడిగా. మంత్రి ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు.. నిజమేనా అని అడిగాను. సిట్ అధికారులు ఫోన్ కాల్స్ మాట్లాడటమే సరిపోయింది. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకైనా.. ఎన్ని సార్లు అయినా వస్తాం. సింగరేణి టెండర్లలో సీఎం - మంత్రుల మధ్య వాటాల పంచాయతీపై హరీష్‌రావు బయటపెట్టారు...సీఎం అనుచరుడు 3 వందల కోట్ల టెండర్ గురించి గన్ పెడితే, మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్ ఎందుకు లేదు?. ఖాకి బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదు? సిట్ అడిగిందే అడగడం - తిప్పి తిప్పి అడగడం తప్ప ఏమి లేదు. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. మాకు కుటుంబాలు ఉన్నాయి మీడియా వాస్తవాలను రాయాలి. నన్ను ఒక్కరినే విచారణ చేశారు. తారక రామారావు, సిట్ అధికారులు తప్ప ఎవరూ లేరు. మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ చెప్పింది... నేను సహకరిస్తానని చెప్పాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ట్యాపింగ్ నేరమేం కాదు.. ఆ మాట రేవంతే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్ డైవర్షన్చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్, హరీష్ పోరాడుతున్నారు. ఈ-కార్ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. అదొక చెల్లని సిట్ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్‌తో మరొక సిట్ వేశారు. ఈ సిట్‌కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్‌కు చీఫ్‌గా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్‌పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్‌పై విచారణ జరగాలి. నిజంగా సిట్ వేయాలనుకుంటే.. చెక్ డ్యామ్‌లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్ స్కామ్‌పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్ వేశారు. దేశ రక్షణపై రేవంత్‌రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్. -
కేటీఆర్ కు సిట్ సూటి ప్రశ్నలు ఇవే..!
-
చిరు నవ్వుతో.. సిట్ విచారణకు కేటీఆర్
-
కాంగ్రెస్‌లో దండుపాళ్యం ముఠా.. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అంతులేని కథలా సాగుతోందని.. నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ కేసులో సిట్ విచారణ బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారాయన. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎన్నికేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అని కేటీఆర్ అన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా.. అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఉంది. ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులు? రేవంతా? అధికారులా?. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదేళ్లపాటు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేశా. ప్రభుత్వం పోలీసులు కలిసి గత రేండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఎంక్వైరీలకు భయపడేది లేదు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. అయినా పిలిస్తే 10సార్లు విచారణకు వెళ్తా.. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు చెప్పారు. ఆ కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు. అలా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రొగ్రాం అని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వాళ్ల దోపిడీ బయటపెడతామనే నోటీసులు, విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని కేటీఆర్ అన్నారు. -
సిట్ ముందుకు కేటీఆర్
-
కేటీఆర్ విచారణపై సిట్ ప్రకటన
కేటీఆర్ సిట్ విచారణ.. లైవ్ అప్డేట్స్కేటీఆర్ విచారణపై సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా సజ్జనార్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెం. 243/2024 కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు అనుగుణంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు 23 జనవరి 2026న ఒక నోటీసు జారీ చేయబడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:00 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించబడింది.నోటీసుకు అనుగుణంగా కేటీఆర్.. సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయనను వివరంగా విచారించడం జరిగింది. కేసులోని సంబంధిత అంశాలను రాబట్టడం జరిగింది. వాటిని రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నారు. ఆయన ఏ సాక్షులను సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆదేశించబడింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం.రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, ప్రముఖులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది పౌరులపై విస్తృతంగా అనధికారిక, చట్టవిరుద్ధమైన ఫోన్ నిఘా, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన క్రైమ్ నెం. 243/2024 కేసు విషయంలో మాత్రమే కేటీఆర్‌ను ఈరోజు విచారించడం జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని పేర్కొంటూ, కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు తప్పుదోవ పట్టించే నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు గమనించబడింది. దర్యాప్తు సంస్థ ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం కలిగి లేదు. దర్యాప్తు చట్టానికి అనుగుణంగా, నిష్పక్షపాతంగా వృత్తిపరంగా నిర్వహించబడుతోంది.In continuation of the further investigation in Crime No. 243 of 2024 of Panjagutta Police Station, and pursuant to the constitution of a Special Investigation Team (SIT), a notice was issued to Sri K. T. Rama Rao, former Minister and MLA, Sircilla, on 23 January 2026, directing… pic.twitter.com/R5QPjfxrDZ— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 23, 2026 కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్మీట్తెలంగాణ భవన్‌కు బయల్దేరిన కేటీఆర్ముగిసిన విచారణకాసేపట్లో బయటకు రానున్న కేటీఆర్. కేటీఆర్‌ను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించిన సిట్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు కేటీఆర్ విచారణసీరియల్లా సిట్ విచారణ : బండి సంజయ్సిట్ విచారణ సీరియల్లా ఉందిప్రభుత్వ పెద్దల డైరైక్షన్లోనే సిట్ విచారణసిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదుకేటీఆర్ను ఎందుకు విచారణకు పిలిచారు కొనసాగుతున్న సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు కేటీఆర్‌తో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావులను కలిపి ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదుదేశ భద్రత కోసం అత్యంత గొప్యంగా జరపాల్సిన ట్యాపింగ్ విషయాన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారుకు ఇడ్చారుహరీష్ రావు, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ సంపద కాపాడందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది తెలంగాణ సంపద నైనీ కోల్ బ్లాక్‌ను దోచుకునే ప్రయత్నం చేస్తే కేటీఆర్,హరీష్ రావు అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్, పార్మలా ఈ రేసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై టైమ్ పాస్ చేస్తోంది సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌ను సిట్ పేరుతో వేదించడం ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదుస్వాతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేస్తారు.దేశ అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తోంది.ఆనాడు దివంగత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు.టెలిఫోన్ ట్యాపింగ్ తప్పుకాదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ కేవలం పోలీసులు మాత్రమే చేస్తారు.ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు.దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా సీఎం రేవంత్ వ్యవహార శైలి ఉంది.మంత్రులు, సీఎం ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు!ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదుప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్యాపింగ్‌ను వాడుతున్నారురేవంత్ రెడ్డికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు.సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.పంజాగుట్ట కేసులో వేసిన ఎస్ఐటీ చట్ట వ్యతిరేకంఆ సిట్ సభ్యులు 350 మందిని విచారించారు.ఆ విచారణలో ఏ ఒక్కరూ కేటీఆర్, హరీష్ రావు పేరు చెప్పలేదు ఆ సిట్‌తో నాయకుల పేర్లు రాలేదు కాబట్టి... సజ్జనార్‌తో మరో సిట్ వేశారు.సజ్జనార్‌తో వేసిన సిట్ రెండోది.. నాయకులను వేధించే సిట్.. ఈ సిట్‌కు భాద్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు.ఆనాడు ఇంటలిజెన్స్‌లో సజ్జనార్,శివధర్ రెడ్డి ఉన్నారు.ఆనాడు రేవంత్ రెడ్డి 50లక్షలు ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డిని ఎలా పట్టుకున్నారు అనేది సజ్జనార్, శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలి.సిట్ నన్ను విచారణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేశాను కేటీఆర్ సిట్ విచారణసజ్జనార్ సిట్ ముందుకు కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ సిట్ ఏర్పాటుసజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిట్ సభ్యులుఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన ఏపీసీ పీ.వెంకటగిరి,ఎస్పీ ఎం.రవీందర్ రెడ్డి కేటీఆర్‌ను విచారించనున్న సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సభ్యులు సిట్ కార్యాలయం లోపలికి వెళ్లిన కేటీఆర్కేటీఆర్ ఒక్కడినే లోపలికి అనుమతించిన పోలీసులుహరీష్రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బయటేజూబ్లీహిల్స్ పీఎస్ బయట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీస్ బందోబస్తుసిట్ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణసిట్ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ వెంట హరీష్రావులోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులుతెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతసిట్ కార్యాలయానికి బయల్దేరిన కేటీఆర్ఆ సమయంలో కార్యకర్తల అత్యుత్సాహంఅడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులుతెలంగాణ భవన్ గేట్ వద్ద తోసుకున్న పోలీసులు, కార్యకర్తలుకాసేపు ఉద్రిక్తతగాయపడ్డ మహిళా కార్యకర్తలుసిట్ విచారణకు బయల్దేరిన కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కేటీఆర్ వెంట కీలక నేతలు పార్టీ శ్రేణులులోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులుసిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం.. భారీ బందోబస్తు ఏర్పాటుతెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్రెండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ప్రభుత్వం, పోలీసుల కుట్రనోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్ గేమ్బీఆర్ఎస్ ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మాదిరాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. పదేళ్లు రాష్ట్రం కోసమే పని చేశాంఅక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నాపై దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారుఈ వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు? సీఎం రేవంతా? అధికారులా?ఎమ్మెల్యేగా, మంత్రిగా చిత్తశుద్ధితో పని చేశా. ఎంక్వైరీలకు భయపడేది లేదు. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు అన్నందుకే నోటీసులు ఇచ్చారు సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రోగ్రాం మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వారి దోపిడీ బయటపెడతామనే మాకు నోటీసులు ఇస్తున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలను కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాఈ కేసుతో నాకు సంబంధం లేదుప్రజల దృష్టి మళ్లించేందుకే కుతంత్రాలుసీఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారుఅయినా పిలిస్తే పదిసార్లైనా విచారణకు వెళ్తాఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుమరికాసేపట్లో సిట్ విచారణతెలంగాణ భవన్లో కీలక నేతలతో కేటీఆర్ సమాలోచనలుతన న్యాయవాదులతో మాట్లాడుతున్న కేటీఆర్కేటీఆర్ వెంట సిట్ కార్యాలయానికి వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులుపోలీసులు అడ్డుకునే చాన్స్తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావుతెలంగాణ భవన్ వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుకోకాపేట టెంపుల్ ట్రీ నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుతొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ రానున్న కేటీఆర్కేటీఆర్తో పాటే హరీష్ రావుతెలంగాణ భవన్ చేరుకున్న కార్యకర్తలు, అభిమానులుపార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేటీఆర్10 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్10:30 కు బయలుదేరి జూబ్లీహిల్స్ పీఎస్‌కి వెళ్ళనున్న కేటీఆర్రాత్రి బీఆర్ఎస్ లీగల్ టీంతో సమావేశమైన కేటీఆర్,హరీష్ రావుఇప్పటివరకు ఈ కేసులో విచారించిన వ్యక్తులను ఏం ప్రశ్నించారు?కేటీఆర్‌ను ఏం ప్రశ్నించబోతున్నారు అనే విషయాలను బ్రీఫ్ చేసిన లీగల్ టీంబీఆర్ఎస్ నేతలు,ఓయూ విద్యార్థుల అరెస్ట్కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు సిట్ విచారణకు కేటీఆర్.. ఓయూ విద్యార్థుల అరెస్ట్అర్దరాత్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులుబీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపుజూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోన్ ట్యాపింగ్ కేసులో నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకేటీఆర్ను విచారించనున్న జాయింట్ సీపీ విజయ్ కుమార్,ఏసీపీ వెంకట గిరికేటీఆర్ విచారణ కోసం ప్రత్యేక ప్రశ్నలు సిద్దం చేసిన సిట్జూబ్లీహిల్స్ పీఎస్,తెలంగాణ భవన్ వద్ద భారీ భద్రతజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోలీస్ స్టేషన్‌కి రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు రంగంలోకి లోకల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్మరికాసేపట్లో కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు కేటీఆర్కేటీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా!కేటీఆర్‌కు వీరతిలకం దిద్దిన మహిళా నేతలుతెలంగాణ భవన్లో కీలక నేతలతో భేటీఅనంతరం మీడియాతో మాట్లాడే అవకాశంఅక్కడి నుంచే సిట్ విచారణకు కేటీఆర్.. కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సీపీ సజ్జనార్ నేతృత్వంలోని బృందంకేటీఆర్ను విచారించనున్న వెంకటగిరి అండ్ టీంఇంతకు హరీష్‌రావును విచారించిన ఇదే బృందంవిచారణకు రావాలంటూ నోటీసులుకేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులుసీఆర్పీసీ 160 సెక్షన్ కింద విచారణకు రావాలని పిలుపునందినగర్ నివాసంలోని వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేతఇవాళ ఉదయం 11గం. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు -
కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. హరీష్‌రావు రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ సిట్ నోటీసులపై హరీష్‌రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారన్న హరీష్.. అటెన్షన్ డైవర్షన్లకు భయపడబోమన్నారు. ‘‘నాకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంటే పడతాం’’ అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.నీ బావమరిది కుంభకోణం బయటపడొద్దనే ఈ డైవర్షన్ డ్రామా. ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. నేను, కేటీఆర్ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారంటూ హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్.. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం’’ అని హరీష్ తేల్చి చెప్పారు. -
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లతో సంబంధం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావును ప్రశ్నించింది. కొన్ని కీలకాంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా చానెల్ అధినేత శ్రవణ్‌రావులతో జరిగిన సంప్రదింపులు, సమాచార మారి్పడి ప్రధాన అంశాలుగా అధికారులు ప్రశ్నలు సంధించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగానూ కొంత వివరణ కోరారు. ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ శ్రవణ్ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్‌రావు అక్కడే ప్రణీత్‌రావును కలిశారు. శ్రవణ్ తనకు ఉన్న పరిచయాలను వినియోగించి రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారని, వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది సిట్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లతో సంబంధం ఏంటి? అని హరీశ్‌రావును ప్రశ్నించింది. వివిధ కోణాల్లో ప్రశ్నలు ఈ ముగ్గురితో 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావుతో హరీశ్‌రావు సంప్రదింపులు జరిపారని, వీరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్‌రావుతో పాటు హరీశ్‌రావు ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో మాజీ మంత్రిని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు లబ్ధి చేర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనూ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడంతో పాటు అధికార పక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రశ్నించారని తెలిసింది. ఏమీ లేదు.. అంతా తూచ్!: హరీశ్‌రావు తన న్యాయవాదితో కలిసి జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అయితే న్యాయవాదిని అనుమతించని పోలీసులు కేవలం హరీశ్‌రావుతోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రమే లోపలకు పంపారు. ఉదయం 10.57 గంటలకు లోనికి వెళ్లిన హరీశ్‌రావు సాయంత్రం 6.25 గంటలకు బయటకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి, సంయుక్త పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్, డీసీపీ రితిరాజ్ తో కూడిన బృందం ఆయన్ను విచారించింది. విచారణ ముగిసి బయటకు వచి్చన హరీశ్‌రావు మీడియాను ఉద్దేశించి ‘ఏమీ లేదు.. అంతా తూచ్..ఉత్తిదే’అంటూ వెళ్లిపోయారు.అరెస్టులు.. అస్వస్థత.. ఉద్రిక్తత మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి తెలంగాణ భవన్‌కు వచి్చ, సిట్ ఎదుట హాజరైన హరీశ్‌రావు.. విచారణ తర్వాత కూడా అక్కడికి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై ఆందోళనకు దిగడంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తల అరెస్టు సందర్భంలోనూ ఠాణా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
ముగిసిన హరీష్ విచారణ.. ఏడు గంటలు ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ ముగిసింది. ఈ కేసులో హరీష్ రావును సిట్.. దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. హరీష్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ నుంచి హరీష్.. తెలంగాణ భవన్ బయలుదేరారు. కాగా, కాసేపట్లో తెలంగాణభవన్‌లో హరీష్.. మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హరీష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది చిల్లర రాజకీయం చేస్తున్నారు. అంతా ట్రాష్.. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం. ప్రతీ నిమిషానికి అధికారులకు పై ఫోన్లు, ఆర్డర్స్ వచ్చాయి. మా లీగల్ టీమ్‌ను మాత్రం లోపలికి అనుమతించలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొనసాగుతున్న హరీష్ విచారణసాక్షిగా పిలిచి ఏడు గంటల పాటు స్టేషన్లో ఉంచడంపై న్యాయవాదుల అభ్యంతరం.విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణ.పీఎస్ ఎదుట పలుమార్లు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన.బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.బీఆర్ఎస్ మహిళా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.డీఎసీలం వాహనాల్లో నాయకుల తరలింపు. జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు జూబ్లీహిల్స్ పీఎస్‌లో హరీష్‌రావు.. కొనసాగుతున్న సిట్ విచారణజూబ్లీహిల్స్ పీఎస్‌లో కొనసాగుతున్న హరీష్‌రావు విచారణహరీష్ను ప్రశ్నిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల ఉత్తర్వులను సిట్‌కు అందజేసిన హరీష్రావుఇప్పుడూ ఏం తేలదు: హరీష్‌రావు లాయర్హరీష్రావు వెంట లాయర్ రామచందర్రావును లోపలికి అనుమతించని సిట్కోర్టులే హరీష్‌రావుకు క్లియరెన్స్‌లు ఇచ్చాయిఫోన్ట్యాపింగ్తో హరీష్‌రావుకు ఎలాంటి సంబంధం లేదుఇప్పుడు విచారణలోనూ అదే తెలుస్తుందిసిట్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు హరీష్రావుజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న హరీష్రావులోపలికి ఒంటరిగానే వెళ్లిన హరీష్రావుషేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి సాగనంపిన బీఆర్ఎస్ కీలక నేతలుడీఎస్పీ స్థాయి అధికారి హరీష్‌రావును ప్రశ్నించే అవకాశంరేవంత్ డైరెక్షన్.. సిట్ యాక్షన్.. ఏం జరుగుతుందో చూద్దాం అంటున్న హరీష్రావుసిట్ ముందుకు హరీష్‌రావు.. తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి బయల్దేరిన హరీష్రావుమరికాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుఓ వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కేసులో విచారణ జరపనున్న సిట్2023 ఎన్నికల నాటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్‌రావు వాంగ్మూలం నమోదు చేయనున్న సిట్?ఇప్పటిదాకా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్‌రావును ప్రశ్నించే చాన్స్ రేవంత్.. డ్రామాలు ఆపు: హరీష్ రావుఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతోందిఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డిడైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే నాకు నోటీసులు పంపించిందిహామీలపై ప్రశ్నించినందుకే నాకు ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపారునేను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడాల్సిన అవసరం లేదుఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదు.. ప్రశ్నించడం ఆపేది లేదుమున్సిపల్ ఎన్నికలు వచ్చాయనే ఈ డ్రామాలురేవంత్.. చిల్లర రాజకీయాలు కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుఅన్ని ప్రశ్నలకు మేం సమాధానం చెబుతాంకాంగ్రెస్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాంరేవంత్ రెడ్డి కేబినెట్ వాటాలు, దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటాండైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ తప్పించుకోలేరుమున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం.. ఓడించి గట్టి బుద్ధి చెబుతాంతెలంగాణ భవన్ వద్ద మీడియాతో హరీష్ రావు 👉తెలంగాణ భవన్లో ముగిసిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల భేటీ తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నేతలునేతలతో భేటీ కానున్న హరీష్రావుఅక్కడి నుంచే సిట్ కార్యాలయానికి హరీష్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రిని ప్రశ్నించనున్న సిట్తెలంగాణ భవన్‌కు భారీ చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఇటు తెలంగాణ భవన్.. అటు జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు 👉నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. తెలంగాణ భవన్లో కీలక నేతలతో సమావేశం. అక్కడి నుంచే సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు..చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టే.. హరీష్రావునిన్న రేవంత్ బావమర్ది బాగోతాన్ని ఉదయం బయటపెట్టాసాయంత్రానికి సిట్ నోటీసులు పంపారుడైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ నోటీసులురాత్రి నేను హైదరాబాద్‌లో లేనిది చూసి నోటీసులు అందించారురాత్రే హుటాహుటిన సిద్ధిపేట నుంచి వచ్చాఎలాంటి తప్పు చేయలేదు.. చట్టాన్ని గౌరవిస్తాం.. అందుకే విచారణకు హాజరవుతున్నాతాటాకు చప్పుళ్లకు భయపడేది లేదుఎన్నికల హామీలను అమలు చేయకుండా.. అక్రమాలు చేస్తున్నారుప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారుమాకు నోటీసులు కొత్త కాదు.. పోరాటాలు కొత్త కాదుప్రతీ ఎన్నికల సమయంలో ఈ డ్రామాలు ఆడుతున్నారురేవంత్రెడ్డి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటాంతన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు 👉మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు హరీష్‌రావు, కేటీఆర్.. హరీష్‌రావు నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు👉హరీష్‌రావు నివాసానికి కేటీఆర్.. ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్👉లాయర్లతో భేటీ అయిన హరీష్‌రావు.. సిట్ విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చ👉కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో సుప్రీం కోర్టు హరీష్‌రావుకు ఉపశమనం ఇచ్చిందని.. కానీ, హరీష్‌రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందునే డైవర్షన్ డ్రామా చేస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావులు ఆ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్లో మరికాసేపట్లో భేటీ కానున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే భారీగా చేరుకున్నాయి. అక్కడి నుంచే నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్తారని సమాచారం. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ వేళ.. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులను మోహరింపజేశారు. హరీష్‌రావును మాత్రమే లోపలికి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. 👉హరీష్ రావు తన ఫోన్ ట్యాంపింగ్ చేయించారంటూ ఓ వ్యాపారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేయగా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ సర్కార్‌కు చుక్కెదురైంది. అయినప్పటికీ ఈ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. 👉ఈ కేసు విచారణలో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ముందుంచే అవకాశం లేకపోలేదు. తొలిసారి విచారణకు వస్తుండడంతో.. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపైనా ఆయన వాంగ్మూలం నమోదు చేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు..ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు విచారణతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యుల బృందం హరీష్ రావు ప్రశ్నించనుంది. -
శబరిమల నెయ్యి విక్రయాల్లో అవకతవకలపై సిట్
శబరిమల ఆలయంలో ఆడియా శిష్టం నెయ్యి అమ్మకాలలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఎస్పీ మహేష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.ఇటీవలి బంగారు తాపడాల చోరీ ఘటన నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైన పబ్లిక్, సంస్థాగత పరిశీలనలో ఉన్న శబరిమలలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఇది దేశంలోని అత్యంత ప్రముఖ ఆలయాల్లో ఒకటైన శబరిమల పరిపాలన, ఆర్థిక పర్యవేక్షణపై ఆందోళనలను మరింత పెంచుతోంది.శబరిమల స్పెషల్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి, మంగళవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కె.వి. జయకుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కొండపై వివిధ కౌంటర్ల ద్వారా విక్రయించే ఆడియా శిష్టం నెయ్యి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నేరపూరితంగా దుర్వినియోగం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ)కి చెందిన కొందరు స్వార్థ అధికారులు ఆలయ నిధులను మళ్లిస్తున్నారని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.“ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులోని కొంతమంది ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను మనస్సాక్షిగా నిర్వర్తించడంకన్నా నిధులను స్వాహా చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేసిన కోర్టు, రెవెన్యూ ఆదాయ నిర్వహణలో బోర్డు ఉద్యోగులు అనుసరిస్తున్న సాధారణ, నిర్లక్ష్య ధోరణిని పదేపదే ఖండించింది. పారదర్శకత, జవాబుదారీతనం అనేవి ఇకపై పరిపాలనా విచక్షణకు సంబంధించిన అంశాలు కాకుండా, బలమైన సాంకేతిక భద్రతలతో కూడిన చట్టబద్ధమైన బాధ్యతలుగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టి, మొత్తం రూ.36.24 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఇందులో సుమారు రూ.13 లక్షలు 13,679 ఆడియా శిష్టం నెయ్యి ప్యాకెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం దేవస్వం బోర్డు ఖాతాలో జమ కాలేదని ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి అమ్మకాలను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్న అధికారి సునీల్ కుమార్ పొట్టిని సస్పెండ్ చేసినట్లు దేవస్వం బోర్డు ఇప్పటికే హైకోర్టుకు తెలియజేసింది. -
ఆ రెండు కేసులపై సజ్జనార్ నేతృత్వంలో సిట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన కేసుల్లో సిట్ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్‌లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్‌లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది.సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యులుఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్‌ఇ)జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీసి. శంకర్ రెడ్డి (ఇన్స్పెక్టర్, సీఐ సెల్)పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్) -
మంత్రిని తప్పించి తంత్రిని ఇరికించే కుట్ర!
శబరిమల ఆలయ బంగారు చోరీ కేసు మళ్లీ రాజకీయ వేడిని రాజేసింది. తంత్రి(ప్రధాన అర్చకుడు) కందరారు రాజీవరు అరెస్టును బీజేపీ ఖండిస్తోంది. అంతేకాదు.. ఈ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలకు దిగింది. కేసుతో సంబంధం ఉన్న మాజీ దేవాదాయ శాఖ(దేవస్వం) మంత్రి కడకంపల్లి సురేంద్రను వదిలేసి.. తంత్రిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకున్నారని అంటోంది. తంత్రిని అరెస్టు చేశారు, కానీ మంత్రిని విడుదల చేశారు. ఎందుకో చెప్పాలి? అంటూ కేరళ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధాన అర్చకుడి అరెస్ట్ త్వరగతిన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు కే సురేంద్రన్, బీడీజేఎస్ నేత తుషార్ వెల్లప్పల్లి తదితరులు రాజీవరు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ కేసులో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ చేస్తోంది. సిట్ తన రిమాండ్ రిపోర్టులో కుట్ర ఆరోపణలకు ఆధారం లేదని కే సురేంద్రన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యవహారంలో తంత్రికి ఆర్థిక లాభం ఏమీ లేదని.. అయినప్పటికీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్న దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, సభ్యుడు కేపీ శంకర్‌దాస్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మంత్రిని రక్షించే కుట్రేనని ఆరోపించారు. తంత్రి అరెస్టునకు నిరసనగా.. జనవరి 14న మకరవిళక్కు సందర్భంగా ఇళ్లలో ‘‘అయ్యప్ప జ్యోతి’’ వెలిగించి నిరసనలు తెలియజేస్తామన్నారు. శబరిమలలో (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని దాత అయిన బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్ని కృష్ణన్ తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్టుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే తదనంతర పరిణామాలతో హైకోర్టు సైతం ఈ దర్యాప్తున పర్యవేక్షిస్తోంది.చోరీ జరిగిన సమయంలో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవస్వం మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలంతో డిసెంబర్ చివర్లో ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. ఆయన పాత్ర లేదని నిర్ధారణ రావడంతో ప్రశ్నించి వదిలేసింది.సిట్ ప్రకారం నిందితుల వాంగ్మూలంలో ఇలా ఉంది.. ప్రధాన అర్చకుడు రాజీవరుకు బంగారు పూత పనులు జరిగిన విషయం తెలుసు. ఇది ఆచార నియమాలకు విరుద్ధం. ఇది కూడా ఆయనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా రాజీవరేన. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉంది. శబరిమల గోల్డ్ చోరీ కేసులో రాజీవరుతో కలిపి 11 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఆయన నివాసాల్లో సిట్ సోదాలు జరిపింది. అయితే జైలులో అస్వస్థతతో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుత సీజన్లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ నాయర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు, వారి సంబం«దీకుల నుంచీ వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11కి సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. మరోపక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావు తదితరులనూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ వేగం పెంచింది. ప్రత్యేకంగా ఆర్ఆర్ మాడ్యూల్ ప్రభాకర్‌రావు 2023 ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సంబంధీకులు, అనుచరులపై నిఘా ఉంచారని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ మాడ్యూల్’పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు (ఎస్వోటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్‌రావు దీన్నీ పర్యవేక్షించారు. ప్రభాకర్‌రావు హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, రియల్టర్లు కూడా ఉన్నారని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ తదితరాలను పర్యవేక్షించడానికి కొందరు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి సహా మరికొందరు నంబర్లు కలిపి ఏర్పాటు చేసిన మాడ్యూల్‌కు ప్రభాకర్‌రావు ‘ఆర్ఆర్ మాడ్యుల్’అనే పేరు పెట్టినట్లు తెలుస్తోది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మాడ్యూళ్లలో ఉన్న వారి ఫోన్లను సర్వకాల సర్వావస్థల్లోనూ పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కొందరు అత్యాధునిక ఉపకరణాలతో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఇళ్ల సమీపంలో తాత్కాలిక వార్రూమ్స్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొండల్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు ఇచ్చింది. ఇవాళ(ఆదివారం జనవరి 4) జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. డివైజ్‌తో ట్యాపింగ్ చేసినట్లు నవీన్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించే అవకాశముంది.కాగా, ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారగా.. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
రైతు ఫిర్యాదుతో.. పాన్ ఇండియా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు
ముంబై: ఓ రైతు పంట కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ప్రకృతి సహకరించలేదు. పంట దిగుబడి రాలేదు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు రైతుల్ని ఆశ్రయించారు. ‘నీ కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాం’ అని నమ్మించారు. అప్పుల భారంతో బాధపడుతున్న రైతు ఒప్పుకుని కిడ్నీ ఇచ్చాడు. అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని కాకుండా, కొంత మాత్రమే ఇచ్చారు. మోసపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ బయటపడింది.మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం పాన్-ఇండియా స్థాయిలో నడుస్తున్న కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసింది. ఈ రాకెట్లో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు దేశవ్యాప్తంగా దాతల నుంచి కిడ్నీలను సేకరించి, వాటిని కాంబోడియా, చైనా సహా పలు దేశాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది.పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీలో పనిచేస్తున్న డాక్టర్ రవీందర్ పాల్ సింగ్, తిరుచిరాపల్లిలోని ఒక ప్రముఖ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజరత్నం గోవిందస్వామి ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం మింతూర్ గ్రామానికి చెందిన రైతు రోషన్ కూలే. అప్పుల బారిన పడి అతను కాంబోడియాలో తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నకిలీ డాక్టర్‌గా వ్యవహరించిన రామకృష్ణ సుంచు, మధ్యవర్తి హిమాన్షు భారద్వాజ్ వంటి వ్యక్తులు అరెస్టయ్యారు. వీరి వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా విశ్లేషణల ద్వారా పెద్ద నెట్వర్క్ బయటపడింది.దర్యాప్తులో తిరుచిరాపల్లికి చెందిన ఆస్పత్రిలో అనధికారిక శస్త్రచికిత్సలు జరిగాయని, భారద్వాజ్ మొదట కిడ్నీ దాతగా, తర్వాత మధ్యవర్తిగా మారాడని పోలీసులు గుర్తించారు. అతని కిడ్నీని 2024 జూలై 23న తిరుచ్చిలో తొలగించినట్లు ఆధారాలు లభించాయి. ఈ రాకెట్లో ప్రతి కిడ్నీ మార్పిడి ధర 50 లక్షల నుండి 80 లక్షల వరకు ఉండేది. డాక్టర్ సింగ్ ఒక్కో శస్త్రచికిత్సకు 10 లక్షలు, డాక్టర్ గోవిందస్వామి 20 లక్షలు, మధ్యవర్తి సుంచు 20 లక్షలు పొందేవారు. కానీ దాతలకు మాత్రం కేవలం 5–8 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. అన్ని లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగేవి.డాక్టర్ సింగ్ ఢిల్లీలో అరెస్టయ్యాడు. డాక్టర్ గోవిందస్వామి మాత్రం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. -
సిట్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపిన సిట్ నెక్ట్స్ ఏం చేయబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావు విచారణ ద్వారా.. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్‌రావు టీమ్ అప్రమత్తమైందని సిట్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి.. 2022 అక్టోబర్ చివరి వారంలో ప్రభాకర్‌రావు–రాధాకిషన్‌రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్‌రావు సిట్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. .. ఈ నేపథ్యంలోనే సిట్ గురువారం ఆనాడు సీఎస్‌గా పని చేసిన సోమేశ్‌కుమార్‌తోపాటు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందంటూ ప్రభాకర్‌రావును సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ వాంగ్మూలాన్నీ సిట్ సేకరించింది. ‘నన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. కేసీఆర్ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్‌హౌస్ తతంగంపై సిట్ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్‌రావు ఎలా వేధించారని సిట్ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా అని నందకుమార్ విచారణ తర్వాత మీడియాకు తెలిపారు. ఆనాడు అధికారపక్షంలోని నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిపి మరీ ప్రభాకర్‌రావును విచారించారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్‌రావుతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 16వ తేదీ నాటికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈలోపే ఆ పెద్దలను విచారించే అవకాశం కనిపిస్తోంది. -
బీఆర్ఎస్ నేతలపైనా ఎందుకు నిఘా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ తమ కస్టడీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఈ విషయంపైనే రెండు రోజుల క్రితం మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిపి విచారించారు. ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ గురువారంతో ముగిసింది. బీఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్‌రావుతోపాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. ఢిల్లీ నుంచి నిఘా పరికరాలు.. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచి్చందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్‌రావు టీమ్ అప్రమత్తమైందని సిట్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి 2022 అక్టోబర్ చివరి వారంలో ప్రభాకర్‌రావు–రాధాకిషన్‌రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన అక్రమ ట్యాపింగ్‌పైనా ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్‌రావు సిట్ అధికారులతో చెప్పారు. ఈ నేపథ్యంలోనే సిట్ గురువారం నాటి సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచి్చందంటూ ప్రభాకర్‌రావును సిట్ ప్రశ్నించింది. నాడు డీజీపీకి ఫిర్యాదుచేశా: నందకుమార్ ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ వాంగ్మూలాన్నీ సిట్ సేకరించింది. ‘నన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. కేసీఆర్ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్‌హౌస్ తతంగంపై సిట్ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్‌రావు ఎలా వేధించారని సిట్ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా’ అని నందకుమార్ మీడియాకు తెలిపారు. -
మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లను విచారించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్లు ట్యాప్ చేయించానని గతంలో పోలీసులకు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ క్రమంలో.. మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను కూడా మరోసారి సిట్ విచారించినట్లు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను మరోసారి సాక్షులుగా విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లను విచారించి.. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రస్తుతం రెండో దఫా కస్టోడియల్ విచారణ జరుపుతోంది సిట్. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో పని చేసిన సివిల్ సర్వెంట్స్ అధికారులను మరోసారి విచారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. ఎస్ఐబీ ఓస్డీగా ప్రభాకర్‌రావును ఎలా నియమించారని సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే నవీన్ చంద్ హయాంలోనే ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు పని చేశారు. దీంతో.. ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనేదానిపై నవీన్ చంద్‌ను విచారించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. డిసెంబర్ 25వ తేదీతో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో సిట్ కస్టోడియల్ ఎంక్వైరీ వేగం పుంజుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్ (Special Investigation Team) ఏర్పాటైంది. ఈ సిట్‌కు హైదరాబాద్ కొత్వాల్ (పోలీస్ కమిషనర్) సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. కొత్త సిట్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు సహా మొత్తం 9 మంది అధికారులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జన్నార్ నేతృత్వంలోని కొత్త సిట్ సభ్యులు..రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాసిద్దిపేట సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్మాదాపూర్ డీసీపీ రితిరాజ్మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డిగ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డిరాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్.రావుజూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి (దర్యాప్తు అధికారి)టీజీనాబ్ డీఎస్పీ సీహెచ్.శ్రీధర్హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేందర్ రావుకాగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఐటీఏక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పీఎస్‌లో కేసు (క్రైం నంబర్ 243/2024) నమోదైంది. ఈ కేసుపై కొత్తగా ఏర్పాటైన సిట్ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని సూచించారు. -
అమెరికా ఫోన్లో ఏముంది?.. ప్రభాకర్‌రావుకు సిట్ సూటి ప్రశ్న!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాచీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ విచారణ ఆరో రోజుకు చేరుకుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) SIT కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విచారణలో నోరు మెదపని ప్రభాకర్ రావు ఆరో రోజు కూడా సిట్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటలు దాటవేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో.. సిట్ అధికారులు ప్రభాకర్ రావు కదలికలపై సీసీ కెమెరా నిఘా పెట్టారు. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్‌కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు పెట్టమని ఎవరు చెప్పారు? అని సిట్ ప్రశ్నిస్తోంది. అయితే డేటా డిలీట్ పై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న ఐఫోన్ లో క్లౌడ్ డేటా ఓపెన్ చేసినట్లు,ఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చినట్లు? అంటూ రాజకీయ ప్రముఖుల సీడీఆర్ డేటాతో ప్రభాకర్‌ని సిట్ ప్రశ్నించింది. ఎందుకు ట్రేస్ చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ అమాత్యుల పాత్ర ఉందా? అని ప్రశ్నించగా ఆ మాటలు దాటవేస్తూ.. విచారణకు ప్రభాకర్ రావు ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు 5ఐ క్లౌడ్, 5జిమెయిల్ ఖాతాల్లో ఉన్న డేటాపై సిట్ దర్యాప్తు చేసింది. గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ 2 అకౌంటల పాస్వర్డ్ ఇవ్వడంతో డేటా కనిపించకుండా ఉండటంతో సిట్ వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపింది. దానితో సిట్ ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు. మరోవైపు సింక్ అయిన డేటా యాపిల్, జిమెయిల్ కంపెనీల నుండి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఆ డేటాతో పాటు విచారణలో ప్రభాకర్ నోరు మెదిపితే కీలకమైన ఆధారాలు సిట్‌కు లభించనున్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుండి తొలిగించానని ప్రభాకర్ రావు సిట్‌కు తెలిపారు.ప్రభాకర్ రావు వాగ్మూలంపై వాస్తవం ఎంత అనేది జీమెయిల్,యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంది. -
ప్రభాకర్ రావు నాన్ కోపరేషన్.. సిట్‌కు కొత్త తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్‌రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాత్రి వరకూ కొనసాగిన విచారణ అనంతరం, రెండో రోజు కూడా కీలక అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్టు సమాచారం.విచారణ పురోగతిని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలిస్తోంది.గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. FSL నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, సింక్ అయిన డేటా వివరాల కోసం యాపిల్, జిమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియలో సిట్ ఉంది. క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా, లాగిన్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే తన డివైస్ల నుంచి తొలగించింది కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందన్నది యాపిల్, జిమెయిల్ సంస్థల నుంచి వచ్చే డేటాతో తేలనుంది.రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు?, ఆదేశాలు ఎవరిచ్చారు?, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ దర్యాప్తు వేగం పెంచింది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగే అవకాశం ఉంది. -
జుబీన్ గార్గ్ మరణంపై చార్జిషీట్
గౌహతి: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆర్గనైజర్, వ్యక్తిగత సెక్రటరీ సహా నలుగురు నిందితులపై హత్య అభియోగాలు మోపింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. సెపె్టంబర్ 19న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అభిమానుల ఆందోళనల నేపథ్యంలో ఈకేసును దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు, అనేక అరెస్టులు, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం శుక్రవారం ఉదయం సిట్.. 3500పేజీల చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఈకేçసులో 300 మందికి పైగా విచారించినట్లు, ఏడుగురిని అరెస్టు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ చార్జిషీట్‌ను నాలుగు పెద్ద ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జుబీన్ అభిమానులు కోర్టు బయట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ నినాదాలు చేశారు. -
హార్డ్‌డిస్క్‌ల కోణంలో..
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు శుక్రవారం సిట్ కార్యాలయంలో లొంగి పోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉన్న సిట్ ఆఫీస్‌కు వచ్చారు. ఈయన్ని అధికారులు వారంపాటు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించనున్నారు. తొలి రోజు సిట్ ఏసీపీ పి.వెంకటగిరితోపాటు సంయుక్త పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఎస్ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్న అధికారులు తొలిరోజు ధ్వంసం చేసిన, రీప్లేస్ చేసిన హార్డ్‌డిస్క్‌ల కోణంలో ప్రశ్నించారు. ఆధారాలు మాయం చేయడానికే..: సుదీర్ఘకాలంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రభాకర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే 2023 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్–కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లానని, అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఆఫ్ చేయించానని మరో నిందితుడు, ఎస్ఓటీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రణీత్‌రావు వెల్లడించారు. ఈ వార్ రూమ్‌లో ఉన్న 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 26 హార్డ్ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతోపాటు మరో ఏడింటిని కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌ల్ని మూసీ నదిలో పారేసినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు. ఇదంతా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే చేసినట్లు అతడు వెల్లడించిన నేపథ్యంలో ఆ హార్డ్‌డిస్క్‌ల కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. వీటికి ప్రభాకర్‌రావు స్పందిస్తూ నిర్ణీత కాలం తర్వాత డేటాను ధ్వంసం చేసే నిబంధన ఎస్ఐబీలో ఉందని, తమ వద్ద దేశ భద్రతకు సంబంధించిన, సున్నిత సమాచారం ఉంటుందని, అందుకే అలా చేస్తుంటామని చెప్పారు. అయితే నిబంధనల మేరకు కేవలం డేటాను డిలీట్ చేయాల్సి ఉండగా హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం, రీప్లేస్ అనేది కేవలం ఆధారాలు మాయం చేయడానికే అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.ఈ కారణంగానే ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతోపాటు ఐక్లౌడ్, క్లౌడ్ల పాస్‌వర్డ్స్‌ను మార్చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనికి స్పందించిన ప్రభాకర్‌రావు తాను ఎలాంటి ఆధారాల ధ్వంసానికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా అధికారులు మూసీ నది నుంచి, గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం పరిసరాల నుంచీ కొన్ని ఆధారాలు గతంలో సేకరించారు. ఈ వివరాలను ప్రభాకర్‌రావు ముందు ఉంచి ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.బెదిరింపు వసూళ్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలతోపాటు ఎవరి ఆదేశాల మేరకు ఈ నేరాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలనూ సిద్ధం చేశారు. ప్రతి రెండు గంటలకు కాసేపు విరామం ఇస్తూ విచారించారు. ప్రభాకర్‌రావు కోరినప్పుడల్లా విశ్రాంతి, మందులు ఇస్తున్నామని, రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆయన నిద్ర కోసం కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్‌కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్‌లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్‌లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్‌లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్‌లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్‌షోర్ ఛానెల్‌లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్‌లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్‌లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
సిట్ విచారణపై జోగి రమేష్ కొడుకు సంచలన కామెంట్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ తన స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. -
Zubeen Garg: సింగర్ కేసులో సంచలన ప్రకటన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని.. అదొక హత్య అని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అస్సామీస్తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబీన్ సెప్టెంబర్ 19వ తేదీన సింగపూర్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కల్చర్‌ను ఖండాంతరాలు దాటించిన గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయించింది హిమంత ప్రభుత్వం. జుబిన్ గర్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని.. నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని హిమంత తెలిపారు. నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. డిసెంబర్లో హత్య కేసులో ఛార్జ్‌షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు మాత్రం మృతిలో ఎలాంటి అనుమానాలు లేవనే అంటున్నారు. ఈ నెల మొదట్లో జుబిన్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం, టాక్సాలజీ నివేదికలను అస్సాం పోలీసులకు పంపించారు కూడా. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్‌ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. మరోవైపు.. జుబిన్ బ్యాండ్‌మేట్ శేఖర్జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషనర్ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానాలు వయక్తం చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ గమనించానని.. అయినా కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని.. తీరికగా వైద్యం అందించారని ఆరోపించారు. ఈ వాంగ్మూలంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: వైవీ
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో గురువారం ఏపీ సిట్ అధికారులు ఆయన్ను విచారించారు.అనంతరం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బాధ్యత గల పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు స్వామి వారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వ్యాఖ్యలపై సిట్ అధికారులు తనను స్పష్టత ఇవ్వాలని కోరారన్నారు. 2019 నుంచే కాకుండా 2014 నుంచి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే..‘ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వామి వారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులకు వాస్తవాలు తెలియాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. దేశ సర్వోన్నత న్యాయ స్థానం సిట్‌ను నియమిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత విచారణ చేయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కీలక పదవుల్లో ఉండే వ్యక్తులు కామెంట్ల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.2024 జూన్‌లో నాలుగు ట్యాంకుల ద్వారా కల్తీ నెయ్యి (అడల్టెడ్) సరఫరా చేశారా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేకుంటే ఏ విధంగా కల్తీ జరిగిందో నిర్ధారించాలని సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నాలుగు ట్యాంకుల కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారా? లేదా? విచారణ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చింది. మొదట వాటిని నివృత్తి చేయాలని సిట్ అధికారులను కోరాను. అయితే, అధికారులు విచారణ పూర్తి కాలేదని చెబుతున్నారు. కానీ, ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో కల్తీ నెయ్యిలో విజిటబుల్ ఆయిల్స్ వంటివి మాత్రమే కలిశాయని పొందుపరిచారు.విచారణలో భాగంగా ల్యాబ్ రిపోర్టులో వచ్చిన అంశాలనే చార్జిషీట్లో పెట్టామని చెబుతున్నారు. చార్జిషీట్‌లోనే వెనక్కి వెళ్లిన ట్రక్కులు మళ్లీ వేరే పేరుతో వచ్చాయని, వాటిని వాడారని పొందుపరిచారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందా.. లేక పామాయిల్, ఇతర వాటి ద్వారా కల్తీ జరిగిందా అని సిట్ అధికారులు చెప్పాలి. పది రోజుల నుంచి ఓ వర్గం మీడియాలో నా మాజీ పీఏ చిన్నఅప్పన్నను అడ్డుపెట్టుకుని నేను అవినీతికి పాల్పడినట్టు దు్రష్పచారం చేయడం దారుణం. ఆయన 2014–18 వరకు మాత్రమే నా దగ్గర పని చేశాడు. ఆ తర్వాత ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి పీఏగా, కొన్నేళ్లు తెలంగాణాకు చెందిన మరో ఎంపీకి పీఏగా చేసినట్టు సమాచారం ఉంది. అయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి దు్రష్పచారాన్ని అడ్డుకోవాలి. స్వామి వారి ప్రతి రూపాయి కాపాడాం 2014 నుంచి కూడా విచారణ చేయాలని కోరాను. టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే కోట్లాది రూపాయిల ప్రాజెక్టులు ఉంటాయి. నేను ఎప్పుడూ నీచంగా ఆలోచించలేదు. శ్రీనివాస్సేతు బిడ్జి కోసం సుమారు రూ.690 కోట్లు కేటాయిస్తే.. మేము రూ.90 – 100 కోట్లు వరకు తగ్గించి నిర్మాణం చేసి ప్రారంభించాం. స్వామి ప్రతి రూపాయి కాపాడటానికి శ్రమించాం.టీడీపీ ప్రభుత్వం రూ.1,100 కోట్లు స్వామివారి కానుక నిధులు ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మేము వాటిని జాతీయ బ్యాంకుల్లోకి మారి్పంచాం. ప్రైవేటు బ్యాంకులో డబ్బు ఉంటే ఏదైనా ఇబ్బందులు వస్తే భక్తుల కానుకలు నిరీ్వర్యం అయిపోతాయని డిపాజిట్లను విత్ డ్రా చేశాం. అది జరిగిన ఒకట్రెండు నెలల్లోనే ప్రైవేటు బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇలా స్వామివారి కానుకలు కాపాడాం. శ్రీవాణి పథ కంతో దళారులను నిర్మూలించాం. దేశ వ్యాప్తంగా దేవాలయాలు నిర్మించాం. పద్మావ తి హృదయాలయ ఆస్పత్రిల్లో చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి నిధులు వెచి్చంచాం. -
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు
-
మిథున్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ మళ్లీ కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. మళ్లీ మిథున్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంలో మిథున్‌రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. మళ్లీ మిథున్‌రెడ్డిని కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి మిథున్‌రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలపై అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్ఆర్ కంపెనీ సమర్పించింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది. అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం గత నెల (సెప్టెంబర్ 29న)బెయిల్ మంజూరు చేసింది. -
కర్ణాటక ఓటర్ల జాబితా మోసాలపైసిట్ ఏర్పాటుకు సుప్రీం నో
న్యూఢిల్లీ: బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మేము పిటిషనర్ తరఫు వాదనలు విన్నాం. ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)గా దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. పిటిషనర్ కావాలంటే ఎన్నికల సంఘం ముందు తన అభ్యర్థనను ఉంచవచ్చు’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహిత్ పాండే చేసిన అభ్యర్థనను సైతం ధర్మాసనం త్రోసిపుచి్చంది. ఇలాంటి సందర్భాల్లో తగిన న్యాయ మార్గాలను అనుసరించవచ్చని సుప్రీం సూచించింది. -
ఐపీఎస్ ఆత్మహత్యపై సిట్
చండీగఢ్: హరియాణాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి వై.పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో సత్వర, నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు శుక్రవారం ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తును నిరీ్ణత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సిట్‌కు చండీగఢ్ ఐజీ పుప్పేంద్ర కుమార్ నాయకత్వం వహిస్తారు. చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్, సిటీ ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఎస్డీపీవో (సౌత్) గుర్జీత్ కౌర్, సెక్టార్ 11 పోలీస్ స్టేషన్ (వెస్ట్) ఎస్‌హెచ్‌వో జైవీర్ రాణా సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ మంగళవారం చండీగఢ్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడం తెలిసిందే. ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. ‘కేసులోని ఆరోపణల తీవ్రత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని... ఐజీపీ, యూటీ, చండీగఢ్ పర్యవేక్షణలో కేసుపై సత్వర, నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి సిట్ ఏర్పాటు చేశాం..’అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 156/2025లోని అన్ని అంశాలపై సిట్ దర్యాప్తు చేయాలని, ఇందులో సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల విచారణ, నిపుణుల అభిప్రాయాలు, న్యాయ సలహాలు వంటివి కాలపరిమితిలో చేపట్టి, పూర్తయ్యాక తుది నివేదికను సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. అసంపూర్తి ఎఫ్ఐఆర్.. పూరణ్ కుమార్ ఆత్మహత్యపై ఎఫ్ఐఆర్ నమోదైన ఒకరోజు తర్వాత, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమనీత్ పి.కుమార్ స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్లో సమాచారం అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ను సవరించి, నిందితులందరి పేర్లు ఉండేలా రూపొందించాలని ఆమె పోలీసులను కోరారు. ఈ మేరకు చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్‌కు రాసిన లేఖలో, ఎఫ్ఐఆర్లో చేర్చిన బలహీనమైన ఎస్సీ/ఎస్టీ చట్టం సెక్షన్లను సవరించాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన ఐపీఎస్ అధికారి.. తన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్లో కొంతమంది అధికారులు కుల వివక్షతో చేసిన వేధింపుల వివరాలను కూడా పేర్కొన్నారు. బుధవారం చండీగఢ్ పోలీసులకు అమనీత్ కుమార్ ఇచి్చన ఫిర్యాదులో, హరియాణా డీజీపీ, రోహ్తక్ ఎస్పీపై సెక్షన్ 108 బీఎన్ఎస్, 2023 (ఆత్మహత్యకు ప్రేరణ), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని ఇతర నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని తక్షణమే అరెస్టు చేయాలని అభ్యర్థించారు. పూరణ్ కుమార్, ఇటీవల రోహ్తక్ సునారియాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) ఇన్స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. హరియానా ప్రభుత్వ ప్రతినిధి బృందంతో జపాన్‌లో పర్యటిస్తున్న అమనీత్ కుమార్ భర్త ఆత్మహత్య సమాచారం తెలిసి, బుధవారం హుటాహుటిన చండీగఢ్‌కు చేరుకున్నారు. ఉన్నత స్థాయి అధికారుల వ్యవస్థీకృత వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆమె ఆరోపించారు. ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన స్థలం నుంచి పోలీసులు మంగళవారం స్వా«దీనం చేసుకున్న వస్తువులలో వీలునామా, సూసైడ్ నోట్ ఉన్నాయి. సూసైడ్ నోట్లో డీజీపీ, రోహతక్ ఎస్పీ ఆత్మహత్యకు పాల్పడిన పూరణ్ కుమార్.. తన సూసైడ్ నోట్లో అనేక మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నారు. ప్రధానంగా హరియాణా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తనను వేధించారని, అపఖ్యాతి పాలు చేశారని ఆరోపించారు. దీని ఆధారంగా చండీగఢ్ పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనల కింద గురువారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై సెక్షన్ 108 ఆర్/డబ్లు్య 3(5) (ఆత్మహత్యకు ప్రేరణ), 3 (1) (ఆర్) పీవోఏ (అకృత్యాల నివారణ) ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చండీగఢ్ పోలీసులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు. -
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్‌లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్‌ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్‌ను అనుసరించింది. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్‌పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
అక్రమ మద్యం కేసులో సిట్ రాజకీయం.. బయటపడ్డ నిజాలు
-
‘సిట్’ తీరు మోసపూరితం
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో దర్యాప్తు చేస్తున్న ‘సిట్’.. సాక్షాత్తూ కోర్టు పట్ల మోసపూరితంగా వ్యవహరించిందని విశ్రాంత ఐపీఎస్ అధికారి కాల్వ ధనుంజయరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సిట్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ ఇలా అసాధారణంగా వ్యవహరించలేదన్నారు. చార్జిషీట్లో పలు లోపాలను ప్రస్తావిస్తూ, వాటిని సరిదిద్దాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించినా సిట్ ఆ పని చేయకుండా తప్పును కోర్టుపై నెట్టేస్తోందని నివేదించారు. ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో నిందితుల పాత్రపై నిర్దిష్ట ఆధారాలు సేకరించలేకపోయిన సిట్, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల గురించి చెబుతూ బెయిల్‌ను అడ్డుకుంటోందన్నారు. చట్ట ప్రకారం 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో బెయిల్ పొందేందుకు నిందితులకు అవకాశం ఉంటుందన్నారు. అయితే సిట్ ఉద్దేశపూర్వకంగా ప్రతిసారీ 89వ రోజునే చార్జిషీట్లు దాఖలు చేస్తోందని తెలిపారు. దర్యాప్తు పూర్తి కానప్పటికీ నిందితుల బెయిల్‌ను అడ్డుకునేందుకే ఇలా చేస్తూ వస్తోందని కోర్టుకు నివేదించారు. ఒకే కేసులో వేర్వేరుగా, ఎంపిక చేసుకున్న విధంగా, కావాల్సిన సమయంలో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తోందన్నారు. ఏ ఒక్కరూ బెయిల్‌పై బయటకు రాకుండా చేసేందుకే సిట్ ఇలా అనుచితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆధారాల్లేకపోయినా జైల్లోనే ఉంచాలని చూస్తోంది...నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛే కోర్టుల పరమావధి అవుతుందని నిరంజన్‌రెడ్డి వివరించారు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తును నిరాటంకంగా కొనసాగించుకోవచ్చునని, అయితే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు నిందితులను జైల్లోనే ఉంచాలని కోరడానికి వీల్లేదన్నారు. సిట్ ప్రస్తుత కేసులో నిందితులను జైల్లోనే ఉంచాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు కేవలం 16 మందిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. దర్యాప్తులో కొత్తగా తేల్చేది ఏమీ లేకపోయినా, ఆధారాలు ఏమీ లేకపోయినా మిగిలిన నిందితులకు బెయిల్ రాకుండా చేసేందుకు పలు చార్జిషీట్లు దాఖలు చేస్తోందన్నారు. సిట్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందన్నారు. సాంకేతిక కోణంలో ఈ కేసును చూడరాదని నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, దర్యాప్తు పూర్తయినంత వరకు ఆ వివరాలతో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తున్నామన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సందేహాల నివృత్తి నిమిత్తం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజున తీర్పు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే డీఫాల్ట్ బెయిల్...వాస్తవానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు తమ ముందున్న అన్ని ఆధారాలను పరిగణనæలోకి తీసుకున్నాకే ధనుంజయరెడ్డి తదితరులకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. డీఫాల్ట్ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ కేసులో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్నింటి కంటే వ్యక్తిగత స్వేచ్ఛే సర్వోత్కృష్టమైందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా సిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టడానికి రాజ్యాంగం అంగీకరించదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకున్న ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు 24 గంటలకు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని, నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగరాదన్నదే చట్టం ఉద్దేశమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు న్యాయస్థానాలు పరిరక్షకులుగా ఉంటాయన్నారు. పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చునని, అయితే దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే కోర్టులు సహజంగా బెయిల్‌ను తిరస్కరిస్తుంటాయన్నారు. దర్యాప్తు పేరుతో నిందితులను అలా జైల్లోనే ఉంచేస్తామంటే కుదరదని, అందుకే చట్టం 60, 90 రోజుల గడువును విధించిందని నివేదించారు. ఈ గడువులోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత నిందితులను జైల్లో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదని స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్‌కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్‌లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫోన్ డివైస్‌లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్‌రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు సూచించింది. -
బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా చార్జిషీట్
‘‘సిట్ చార్జిషిట్‌లో పొందుపరచాల్సిన వాటిని పొందుపరచకుండా తప్పంతా ఏసీబీ కోర్టు మీదకు నెడుతోంది. అత్యంత ముఖ్యమైన సాక్షుల వివరాలు, వారు ఏం చెప్పారన్న విషయాలను ప్రస్తావించలేదు. కీలకమైన వివరాలు లేకపోవడంతో ఆ చార్జిషిట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఒక్క ఏసీబీ కోర్టే కాదు. ఏ కోర్టు కూడా అలాంటి చార్జిషిట్‌ను విచారణకు స్వీకరించదు. చార్జిషిట్‌లోని లోపాలను ఎత్తిచూపిన ఏసీబీ కోర్టు... వాటిని సరిదిద్దాలని చెప్పినా సిట్ ఆ పని చేయలేదు. అసంపూర్ణ చార్జిషిట్‌కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు’’‘‘ఏసీబీ కోర్టు వారి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించకపోవడం తప్పని చెబుతున్న సిట్, వారు చేసిన తప్పులను మాత్రం చెప్పడం లేదు. లోపభూయిష్ట, అసంపూర్ణ చార్జిషీట్‌ను చార్జిషిట్గా పరిగణించే అవకాశం లేకపోవడంతోనే ఏసీబీ కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది’’ –సీనియర్ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవేసాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో బెయిల్ రాకుండా చేసేందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హడావుడిగా చార్జిషిట్ దాఖలు చేసిందని పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరఫు సీనియర్ న్యాయవాదులు తప్పెట నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే హైకోర్టుకు నివేదించారు. 90 రోజులు దాటితే నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉండడంతో, పూర్తి వివరాలు లేకుండానే చార్జిషిట్ వేసిందని వివరించారు. అందులో కీలక అంశాలను విస్మరించిందని తెలిపారు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డిలకు ఏసీబీ కోర్టు ఇ చ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్... హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.తమ చార్జిషిట్‌లో పలు లోపాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇ చ్చిన ఆఫీస్ మెమోరాండంను సైతం సవాల్ చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు... ఏసీబీ కోర్టు జారీచేసిన ఆఫీస్ మెమోరాండంపై స్టే విధించింది. అలాగే ఆఫీస్ మెమోరాండం ఆధారంగా డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు వెలువరించిన తీర్పులోని పలు అంశాలను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ రద్దు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన విచారణను గురువారం కూడా కొనసాగించారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే డిఫాల్ట్ బెయిల్ బాలాజీ గోవిందప్ప తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు, వారి న్యాయవాదులు మొదటినుంచి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి చట్టం, న్యాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు. అసంపూర్తి చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో... పిటిషనర్ల రిమాండ్ 90 రోజులు పూర్తి కావడంతో వారికి కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇ చ్చిందని తెలిపారు. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. ⇒ మద్యం అక్రమ కేసులో రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెబుతున్న సిట్... ఇప్పటివరకు రూ.40 కోట్లనే సీజ్ చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తుచేసిందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని సిట్ అధికారులు ప్రతిపక్ష నేత ఖాతాలో వేయడానికి కూడా వెనుకాడరన్నారు. ⇒ చార్జిషీట్ దాఖలు తరువాత తదుపరి దర్యాప్తు గురించి కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని, కానీ ఈ అక్రమ కేసులో ఏసీబీ కోర్టుకు సిట్ అలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. అలా చెప్పనందున దర్యాప్తు మొత్తం పూర్తయినట్లే అవుతుందని తెలిపారు. చార్జిషిట్ వేసిన తరువాత అందులోని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఏసీబీ కోర్టుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ కీలక డాక్యుమెంట్లను సిట్ అసలు ఏసీబీ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లకు బెయిల్ రాకుండా చేసేందుకు ప్రతి దశలోనూ సిట్ ప్రయతి్నస్తూ వ చ్చిందన్నారు. డిఫాల్ట్ బెయిల్ నిందితుల హక్కు.. చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేని చార్జిషిట్‌ను దాఖలు చేసినప్పుడు కోర్టులు నిందితులను 90 రోజులకు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిన సంగతిని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగానే ఏసీబీ కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ ఇ చ్చిందని వివరించారు. ఇలాంటి సందర్భాల్లో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం మినహా మరో అవకాశం లేదన్నారు. డిఫాల్ట్ బెయిల్ నిందితుల హక్కు అని, దీనిని ఏ ఒక్కరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ⇒ చార్జిషిట్‌ను విచారణకు తీసుకున్నప్పుడే సీఆర్పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌ను పొడిగించాల్సి ఉంటుందని, అయితే ఈ అక్రమ కేసులో సిట్ చార్జిషిట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు తీసుకోలేదని, అందువల్ల నిందితులకు సెక్షన్ 167(2) కింద రిమాండ్‌ను పొడిగించినట్లు అవుతుందని అన్నారు. ఏసీబీ కోర్టు జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే చట్ట ప్రకారం పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారని వివరించారు. తొందరపాటుతో వ్యవహరించలేదన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సీనియర్ న్యాయవాదులూ... సుప్రీంకోర్టుతో సహా వివిధ హై కోర్టులు వెలువరించిన తీర్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల బెయిల్ రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్ధించారు. ⇒ అంతకుముందు సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం నాటి వాదనలను కొనసాగించారు. తమ వాదనలను, ప్రస్తావించిన తీర్పులను ఏసీబీ కోర్టు పరిగణించలేదన్నారు. అన్ని వివరాలతో చార్జిషీట్ వేశామని, దానిని విచారణకు తీసుకోవాలా లేదా అన్నది ఏసీబీ కోర్టు ఇష్టమని తెలిపారు. తమ చార్జిషిట్‌ను విచారణకు తీసుకోకుండా ఏసీబీ కోర్టు తప్పు చేసిందన్నారు. పైగా తాము తప్పు చేశామంటూ... పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ ఇ చ్చిందన్నారు. ⇒ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డిల తరఫున వాదనలు ముగియడంతో ధనుంజయరెడ్డి తరఫున వాదనలను వినేందుకు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. -
జగన్ మీద విషం.. అడ్డంగా బుక్కైన ఈనాడు
కూటమి పాలనలో ఎల్లో మీడియా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా.. టీడీపీ కరపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విషం చిమ్మింది. తీవ్ర ఆరోపణలు.. పచ్చి అబద్ధాలతో.. నిసిగ్గుగా ఓ కథనం ఇచ్చింది. ఈ క్రమంలో.. సంబంధం లేని అంశాలను జోడించి ప్రజల్లో అపోహలు కలిగించే తీవ్రంగా ప్రయత్నం చేసింది. లాయర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా నడిపించింది. సోదా సమయంలో సిట్ సభ్యులు తమతో పాటు లోపలికి ఓ బ్యాగ్ తీసుకెళ్లడం, అలాగే ఓ ప్రైవేట్ వాహనం రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనంలో ఉన్న వస్తువులను కార్యాలయంలోకి చేరవేసి.. మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారనే ఆ అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఒకవైపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ నానాతిప్పలు పడుతుంటే.. మరోవైపు తప్పుడు కేసు కోసం ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని.. జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ కథనాలు అచ్చేసింది. ఇక.. చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం ఇంతకు ముందూ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై పలు అవాస్తవ కథనాలు ప్రచురించింది. మార్గదర్శి అక్రమాలపై చంద్రబాబు విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబు ప్రాపకం కోసం ఈనాడు బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా కథనం కూడా బాబుకు అనుకూలంగా, జగన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అల్లేసిందనేనని వైఎస్సార్సీపీ అంటోంది.మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు వేదికగా మార్చుకున్న ఈనాడు.. రాజకీయ అనుకూలత కోసం నిజాన్ని వక్రీకరించడంలో మరోసారి తన పాత్రను బహిరంగం చేసుకుందనే విమర్శ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. -
తప్పుడు సాక్ష్యాలు.. అసత్య ప్రచారాలు
సాక్షి, అమరావతి : మద్యం విధానంపై అక్రమ కేసులో కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెర తీస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది. అందులో తాజా అంకంగానే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట సిట్ హైడ్రామా నడిపింది. ముందస్తు పన్నాగంతోనే టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా సిట్ అధికారుల ద్వారానే తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నించడం విస్మయ పరిచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వ ఈ తాజా కుట్ర కూడా బొల్తా కొట్టింది. కొండను తవి్వనంత హడావుడి చేసిన సిట్.. చివరికి అక్కడ ఎలుక కూడా లేదని తెలుసుకుని చేతులెత్తేసింది. వైఎస్ జగన్‌పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన తాజా కుట్ర వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ వాహనం.. అందులో బ్యాగులు, సామగ్రి.. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపార వేత్త నర్రెడ్డి సునీల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆయన కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాల పేరుతో రాద్ధాంతం చేశారు. సోదాలు నిర్వహించేందుకు ఉన్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు. సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. హైదరాబాద్‌లోని న్యాయవాది సునీల్ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరఫు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. కానీ వారిని సిట్ అధికారులు లోపలికి అనుమతించ లేదు. దాదాపు 4 గంటలపాటు వారు కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్ అధికారులు అడ్డుకోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులను అనుమతించాలి. అందుకు భిన్నంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనుక తప్పుడు సాక్ష్యాలను సృష్టించే కుతంత్రం ఉన్నట్లు స్పష్టమైంది. కార్యాలయంలోకి వెళ్లేటపుడే సిట్ అధికారులు తమతో పాటు ఓ బ్యాగును లోనికి తీసుకువెళ్లారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ వాహనం అక్కడికి చేరుకుంది. ఆ వాహనంలో కొన్ని బ్యాగ్‌లు, ఇతర వస్తువులు ఉండటాన్ని చూసి సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాదులు గేటువద్ద అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని ఎందుకు లోపలకు తీసుకువెళ్తున్నారని నిలదీసినా.. సిట్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ముందు ఒక బ్యాగ్‌ను తమతోపాటు లోనికి తీసుకువెళ్లిన అధికారులు ఆ తర్వాత ఈ వాహనంలోని మరికొన్ని బ్యాగ్‌లను, ఇతర వస్తువులను, ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వీటిని సోదాల సమయంలో సునీల్‌రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్లుగా కట్టు కథ వినిపించాలన్నది సిట్ అధికారుల ఉద్దేశం. ఆ వాహనంలోనే సిట్‌కు సంబంధం లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఉండటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో దు్రష్పచారానికి పాల్పడుతున్నారన్నది స్పష్టంగా వెల్లడవుతోంది. సన్నిహితులంటే ఎలా ఉంటారంటే... » న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్ రెడ్డి నివాసంలో సోదాల పేరుతో హైడ్రామా సాగించిన సిట్ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ తమకు అలవాటైన రీతిలో టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ వెంటనే అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించింది. » వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓ సాధారణ పరిచయస్తుడైన న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్‌రెడ్డిని పట్టుకుని ఆయనకు అత్యంత సన్నిహితుడని.. మద్యం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అవాస్తవ కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారానికి తెగబడింది. అసలు అత్యంత సన్నిహితుడని ఎవర్ని అంటారో ఈనాడుకుగానీ, ఇతర టీడీపీ ఎల్లో మీడియాకు గానీ తెలుసా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. » అత్యంత సన్నిహితులు అంటే ఎలా ఉంటారు అంటే.. చంద్రబాబు–ఈనాడు ఎండీ కిరణ్, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 చానల్ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు చంద్రబాబును తరచూ కలుస్తూ ఉంటారు. టీడీపీ అక్రమాలకు వత్తాసు పలుకుతారు.. చంద్రబాబు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చంద్రబాబుకు చిన్న సమస్య రాగానే జాకీలెత్తి మోస్తుంటారు. జీవితకాలం మా బాబుగారే సీఎంగా ఉండాలంటూ భజన చేస్తుంటారు.. బాబుగారు క్వాంటం కంప్యూటింగ్ అన్నా, ఏఐ అన్నా, బుల్లెట్ రైలు అన్నా ఆహా ఓహో అని కీర్తిస్తుంటారు.. » న్యాయవాది అయిన సునీల్ రెడ్డి వ్యాపారవేత్తగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గత పదేళ్లలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు నాలుగైదుసార్లు కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఏనాడూ రాజధానివైపు రానే లేదు. వైఎస్ జగన్‌ను కలిసిందీ కూడా లేదు. మరి సునీల్ రెడ్డి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడని టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ఎలా సూత్రీకరిస్తుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. » టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు సిట్ ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ సాగిస్తున్నారని, అందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ బురద చల్లుతోందన్నది స్పష్టమవుతోంది. -
మద్యం అక్రమ కేసు.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది. -
అంతా కూటమి కుతంత్రం
సాక్షి, అమరావతి: కుట్రలు... పన్నాగాలు... బెదిరింపులు... వేధింపుల మధ్య... అబద్ధపు వాంగ్మూలాలు... తప్పుడు సాక్ష్యాలతో మద్యం అక్రమ కేసును నడిపిస్తోంది ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్). కక్షసాధింపే లక్ష్యంగా... దెబ్బతీయడమే ఉద్దేశంగా... అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లింది. వాటిని నిజం చేయడానికి అనుబంధ కథలతో నానాతంటాలు పడుతోంది. తాజాగా అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. చార్జిషీట్ కాపీలు, పెన్‌డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల లిస్ట్ ఇవ్వడం మినహా తాము అడిగిన లోపాలను సరిదిద్దలేదని న్యాయస్థానం పేర్కొనడాన్ని బట్టి... సిట్‌ది ఎంత భేతాళ కుట్రనో స్పష్టం అవుతోంది. కాగా, మద్యం అక్రమ కేసులో సిట్ మొదటినుంచి ఇదే ధోరణిలో వ్యవహరిస్తోంది. లేని స్కాంను ఉన్నట్లుగా చూపేందుకు కిందామీద పడుతోంది. ఎల్లో మీడియాకు లీకులిస్తూ రక్తి కట్టిస్తోంది. మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసినవారితో బలవంతంగా వారికి కావాల్సినట్లు ‘164 స్టేట్మెంట్’ ఇప్పించి, అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం యథేచ్ఛగా సాగించింది. ఆపై వారితో ఇష్టం వచ్చిన కథలను బలవంతంగా చెప్పించే తంతు నడిపించింది. ఇక్కడ సిట్ ఎంత అన్యాయంగా, దారుణంగా వ్యవహరించింది అంటే... అసలు కుంభకోణమే లేనప్పటికీ బురదజల్లడమే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేసింది. ఇదే అదనుగా... అందుకు తగినట్లుగా ఈనాడు, ఎల్లో మీడియా తానతందాన అంటూ బరితెగించి కథనాలు వండివార్చడం మొదలుపెట్టాయి.అసలు వ్యాపార భాగస్వాములు వారే...!రాజ్ కేసిరెడ్డి... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొనసాగిన పలువురు సలహాదారుల్లో ఒకరు. అంతమాత్రానికే మద్యం అక్రమ కేసులో ముడిపెట్టింది సిట్. వాస్తవానికి రాజ్ కేసిరెడ్డి... విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)లే వ్యాపార భాగస్వాములు. ఈ విషయం ఆధారాలతో బయటకు వచ్చింది కూడా. ఇక కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్ బినామీ అని అందరికీ తెలిసిందే. కానీ, ఎల్లో మీడియా మాత్రం పొరపాటున కూడా మాటమాత్రంగానైనా ఈ విషయాన్ని ప్రస్తావించదు. ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ... కళ్లున్న కబోదిలా ప్రవరిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంపై మాత్రం యథేచ్ఛగా బురదజల్లుతూ తన కపట బుద్ధిని బయటపెట్టుకుంటోంది.‘అప్రూవర్ కుట్ర’లతో...అక్రమ కేసు కుతంత్రంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌లను తీవ్రంగా వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది కూటమి ప్రభుత్వం. వారి ద్వారా అప్రూవర్ కుట్రకు కూడా తెగించింది. వాస్తవానికి వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తీవ్రంగా వేధించారు. ఆయన డెప్యుటేషన్ ముగిసినా ప్రభుత్వం రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వెంటాడి వేధించింది. వారు చెప్పినట్లు వింటే అప్రూవర్‌గా మారుస్తామంది. చివరకు సిట్ చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనను రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.» బెవరేజెస్ కార్పొరేషన్ చిరుద్యోగులు సత్యప్రసాద్, అనూష సహా పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వేధించి బలవంతంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ఇలా ఇచ్చేందుకు సమ్మతించనివారిపై సిట్ ప్రతాపం చూపింది. » కట్టుకథలను మించిన భేతాళ కథలతో కుతంత్రాలు పన్నిన సిట్... ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టు చేసింది. నిజానికి మద్యం విధానం ఫైలు అసలు సీఎంవోకు రాదు. కానీ, సిట్ తన కపట ఉద్దేశాలతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను మద్యం అక్రమ కేసులో ఇరికించింది. ఇక బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్. ఆయనకు అసలు మద్యం విధానంతో సంబంధమే లేకపోయినా, భేతాళ కుట్రలు పన్ని లక్ష్యంగా చేసుకుంది.కుతంత్రాలు పటాపంచలవడంతో.. కొత్త కట్టుకథలతో...అసలు లేని మద్యం కుంభకోణంలో అనేక కుతంత్రాలకు పాల్పడిన ప్రభుత్వం పలుసార్లు తలబొప్పి కట్టించుకుంది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి చెందిన ఫాంహౌస్‌లో రూ.11 కోట్లు దొరికాయంటూ హడావుడి చేసింది. ఈ విషయమై నంబర్లుతో సహా నోట్ చేయాలని కోర్టు నిలదీసేసరికి ఎల్లో మీడియా సాయంతో ఇంకో భేతాళ కుట్ర అల్లింది. అదే రోజు... మరోచోట రూ.కోట్ల నగదు లభ్యమైందని.. అదంతా మద్యం సొమ్మేనని ముడిపెట్టింది. » వెంకటేష్‌నాయుడు తన ఫోన్లో చిత్రీకరించిన వీడియో ఇదిగో అంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువుల మీద మరో భేతాళ విక్రమార్క కథను అల్లుతోంది. వైఎస్సార్ కుటుంబం, గత ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో... వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి పాత్ర ఉందంటూ ఆయన పీఏను విచారించే పేరుతో సిట్ కొత్త డ్రామా నడిపిస్తోంది. దీనిపై ఎల్లో మీడియాలో రకరకాల లీకులిస్తూ బురదజల్లుతోంది. అసలు అనిల్ రెడ్డి ఏపీలోనే ఉండరు. అయినా ఆయన పాత్రపై అసత్యాలు ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఈకేసులో అన్నీ అభూత కల్పనలే లక్ష్యంగా సిట్ విచారణ సాగుతోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు. -
కొనసాగుతున్న కక్ష.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. -
ఏడుగంటల పాటు నారాయణస్వామి విచారణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మద్యం విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా.. టీడీపీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం ముందుకెళ్తున్న ఏపీ ‘సిట్’ తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టార్గెట్ చేసింది. డెబ్భై ఐదేళ్లు దాటిన ఈయన్ను ఏడు గంటలపాటు పనికిరాని ప్రశ్నలతో వేధించింది. తిరుపతి జిల్లా పుత్తూరులో నారాయణస్వామి ఉంటున్న ఇంటికి సిట్ అధికారులు శుక్రవారం ఉ.10 గంటల సమయంలో వచ్చి సా.5 గంటల వరకు నారాయణస్వామిని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ఒప్పందాలు, లావాదేవీలు, మద్యం సరఫరా తదితర అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు తీసుకొచ్చిన మద్యం పాలసీలో చాలా లొసుగులున్నాయని, ఎవరి ప్రోద్బలంతో లిక్కర్ ఆర్డర్లను ఆన్లైన్లో కాకుండా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడంతో.. మరోమారు విచారణకు రావాలంటూ అధికారులు నారాయణస్వామికి నోటీసులిచ్చారు. విచారణ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రశ్నలన్నింటికీ బదులిచ్చా.. విచారణ పూర్తయ్యాక నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చా. వాళ్ల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాను. మరో సారి విచారణకు రావాలంటే సరేనన్నాను. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలను మానసికంగా వేధించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ ‘సిట్’ అని పార్టీ నాయకులు తెలిపారు. -
మాతోనే బేరసారాలా?
ఈ కేసులో సిట్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్ఫల యత్నం.– ఏసీబీ ప్రత్యేక కోర్టుసాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ (సిట్) తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి యత్నిస్తోందని, ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తప్పుబట్టింది. పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈమేరకు మద్యం విధానం కేసులో నిందితులుగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) పూర్వ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ స్పెషల్ ఆఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్‌లకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అరెస్ట్, అభియోగాల నుంచి తప్పించుకోవడానికే దొడ్డిదారిన దాఖలు చేశారని పేర్కొంది. అప్రూవర్‌కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ట్రయల్ పూర్తయ్యే వరకు వారిని కస్టడీలోనే ఉంచి తీరాలని స్పష్టం చేసింది. అప్రూవర్‌గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోద యోగ్యత లేదని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు సారాంశం ఇదీ... అప్రూవర్‌గా మారుతామన్న వాగ్దానంపై బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు... ‘చట్ట ప్రకారం అప్రూవర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదు. అప్రూవర్‌కు క్షమాభిక్ష ప్రసాదించిన తరువాత అతన్ని బెయిల్‌పై విడుదల చేయడానికి వీల్లేదు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచి తీరాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 306(4) (బీ) అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమన్న వాగ్దానంపై బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధిస్తోంది. బెయిల్‌తో సంబంధం లేకుండా అప్రూవర్ సాక్ష్యం నమ్మదగినదిగా, మరకలు లేనిదిగా ఉండాలన్నదే ఈ నిషేధం వెనుక ఉన్న తర్కం. అప్రూవర్ భవిష్యత్తులో బెయిల్ పొందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులను కేసులో ఇరికించవచ్చు లేదా సాక్ష్యాన్ని మార్చవచ్చు. అందువల్ల అప్రూవర్‌గా మారుతానన్న వాగ్దానాల లాంటి వాటిపై బెయిల్ ఇవ్వడం న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. బెయిల్ పిటిషన్లను ఆయా కేసుల్లోని పూర్వాపరాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందే గానీ, అప్రూవర్‌గా మారుతానన్న వాగ్దానాల ఆధారంగా కాదు...’ అని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వం పిటిషనర్లను అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది...! ‘పిటిషనర్లు దర్యాప్తునకు కొంత మేర సహకరించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ పీపీ చెప్పారు. అయితే ఇది ఎంతమాత్రం సరిపోదు. ఈ మొత్తం కేసులో తన పాత్ర గురించి, ఇతర నిందితుల పాత్ర గురించి పూర్తి వాస్తవాలను తెలియచేయాల్సి ఉంటుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే పలు షరతులు విధించాలని స్పెషల్ పీపీ చెబుతున్నారు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు నిందితులను కస్టడీలో ఉంచకుండా బెయిల్‌పై విడుదల చేస్తే వారు కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ ఏమీ లేదు. శక్తివంతులైన సహ నిందితులు గతంలో తమకున్న సాన్నిహిత్యంతో పిటిషనర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయపెట్టడం చేయవచ్చు. అందుకే అప్రూవర్‌ను ట్రయల్ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచాలని చట్టం చెబుతోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ఈ కేసులో ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది..’ అని న్యాయస్థానం తన తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన నిందితులను అప్రూవర్‌గా మార్చడం ఓ నిష్ఫలయత్నం... ‘శరీరానికి తల ఎంత ముఖ్యమో వీరు కూడా అంతే ముఖ్యం. తల తొలగిస్తే మొత్తం శరీరం కుప్పకూలిపోతుంది. అందువల్ల ప్రధాన నిందితులను ప్రాసిక్యూషన్ (సిట్) అప్రూవర్‌గా తీసుకోలేదు. ఈ కేసులో ప్రధాన నిందితులను అప్రూవర్లుగా మార్చలేరు. ప్రాసిక్యూషన్ దర్యాప్తు పూర్తి చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్పల యత్నం...’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.ముందస్తు బెయిల్ కోసం దొడ్డిదారిన పిటిషన్లు...‘ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో వారు క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి, అభియోగాల నుంచి విముక్తి పొందేందుకు దొడ్డిదారిన వీరు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ప్రతిపాదనతో ఈ వ్యాజ్యాలు వేశారు. అయితే ఇలాంటి పద్ధతులకు చట్ట అమోద యోగ్యత లేదు...’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.కోర్టుతోనే బేరసారాలు.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే!‘ఈ కేసులో తాము అప్రూవర్‌గా మారతామని, ఇందులో భాగంగా తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వేర్వేరుగా సీఆర్పీసీ సెక్షన్ 306 కింద పిటిషన్లు దాఖలు చేశారు. అవి లోపభూయిష్టంగా ఉండటంతో ఈ కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. తదనుగుణంగా వాటిని రిటర్న్ చేసింది. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదు. సవరణలతో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయలేదు. అప్రూవర్లుగా మారే విషయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లకు సదుద్దేశం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే గానీ అప్రూవర్లుగా మారే ప్రసక్తే లేదన్నట్లుగా పిటిషనర్ల తీరు. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారతామనడం కోర్టుతో బేరసారాలు చేయడమే అవుతుంది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. అంతేకాక ఇది పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోంది. ఈ తీరు సీఆర్పీసీ సెక్షన్ 306 (4) (బీ) కింద నిర్దేశించిన విధానానికి పూర్తి విరుద్ధం. ఈ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేవి. కాబట్టి పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఈ కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించడం లేదు..’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్‌ను పొడిగించింది. -
కేసీఆర్ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్ కాల్స్‌నే ట్యాప్ చేశారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్‌కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్‌లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.ముఖ్యమంత్రి ఫోన్‌ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ అన్నారు. -
కేసిరెడ్డి కేసులో.. బాబుకు ఊహించని దెబ్బ
-
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
SIT బండారం బట్టబయలు.. మధ్యలో రెచ్చిపోతున్న బీజేపీ ఎంపీ
-
SIT సీన్ రివర్స్.. కోర్టు నుంచి పరార్.. అబ్బా కథ అడ్డం తిరిగిందే
-
Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..
-
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
అడ్డంగా దొరికిన సిట్!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో జప్తు చేసిన రూ.11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ రూ.11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్‌ను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే, ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్‌ను కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రూ.11 కోట్ల జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ చెప్పగా, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక 2024 ఎన్నికలకు ముందే ఈ రూ.11 కోట్లను దాచిపెట్టినట్లు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరానివో నిగ్గు తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. రూ.11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డ్ చేసేందుకు ఓ అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాజ్ కేసిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఉంటే స్లిప్ చూపమనండి..కేసిరెడ్డి తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి, దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమకున్న సమాచారం మేరకు ఆ రూ.11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సిట్‌పై తమకు ఏ విధమైన నమ్మకమూ లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారి (ఐవో)ని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేశామని చెప్పారు. ఈ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ, సిట్‌ను నమ్మలేమని, ఒకవేళ రూ.11 కోట్లను డిపాజిట్ చేసి ఉంటే డిపాజిట్‌కు సంబంధించిన బ్యాంక్ స్లిప్పును చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ స్లిప్పును 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చన్నారు. డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచేలా బ్యాంకును ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంటలో డిపాజిట్ స్లిప్పును తీసుకొస్తానని వెళ్లారు. గంటలు గడిచినా కూడా ఆ అధికారి తిరిగి రాలేదు. ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. -
ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.ఆంధ్రప్రదేశ్ పోలీసుల సిట్ బృందం చెప్పిన లెక్క. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.త్వరలో ఇంకో చార్జిషీట్‌ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్‌ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.వరుణ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో ప్రధాన నిందితు డైన రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్ చేసినట్టు న్యాయస్థానానికి సిట్ చెప్పింది. 2024 జూన్‌లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్ చెప్పినట్టు సిట్ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్ కుంభకోణం డబ్బేనని సిట్ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సిట్ సీజ్ చేసినట్టు చెబుతున్న ఫామ్‌హౌస్ తీగల విజయేందర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్లో తెలిపారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్‌హౌస్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. సీజ్ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్ నుంచి ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్ ఫాయిల్ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్‌లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్ చెప్పి ఉండాలి. పిటిషన్ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్‌కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్‌కు ప్రత్యేకంగా తెలిపారు.ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్‌హౌజ్ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్‌గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్‌కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్ ప్రకటన గండి కొట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్‌ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్‌లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్‌లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 జూన్‌లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్‌కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్‌కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్‌కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్‌రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్‌లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్‌ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్‌ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్‌పైనా ఉన్న నెంబర్‌ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్‌కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్‌లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్‌ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్‌ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు
-
లిక్కర్ కేసులో సిట్ కుట్ర బట్టబయలు.. నోట్ల కట్టల తారుమారు..?
-
Dharmasthala: ధర్మస్థళ మిస్టరీ ఉత్కంఠ.. వెలుగులోకి కీలక ఆధారాలు
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. 👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. -
Big Question: జైల్లో బాబు రాసిన కథ
-
‘ధర్మస్థళ’ కేసులో దొరకని అవశేషాలు
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు. -
నోట్ల కట్టల మాటున బాబు
పాతాళభైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడిని తలదన్నే రీతిలో సీఎం చంద్రబాబు రోజుకో క్షుద్ర రాజకీయానికి తెరతీస్తున్నారు. తాను ఏంచెప్పినా ఎస్ బాస్ అనే పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను మంత్రదండంగా చేసుకుని రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా ఏకంగా న్యాయస్థానాన్ని కూడా బురిడీ కొట్టించేందుకు తెగిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్టుతో డ్రామాను రక్తి కట్టించేందుకు ప్రయత్నించి సిట్ బోల్తా పడింది. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు గత శనివారం హైదరాబాద్‌లోని వికాట్ కంపెనీ కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హడావుడి చేసింది. అది ఫలించకపోవడంతో తాజాగా నగదు జప్తు కుతంత్రానికి తెరలేపింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు రెడ్‌బుక్ కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం రోజుకో రీతిలో నడుపుతున్న హైడ్రామాలో తాజా ఎపిసోడ్ ఇదిగో ఇలా ఉంది..సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసు దర్యాప్తులో ఏస్థాయికైనా దిగజారతామనేలా సిట్ మరో బరితెగింపునకు పాల్పడింది. నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. ఇన్నాళ్లైనా ఒక్క ఆధారమూ చూపలేకపోయారని సాక్షాత్తు కోర్టు తప్పుబట్టడంతో నోట్ల ‘కట్ట’కథకు సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి శంషాబాద్ మండలం కాచారంలో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. ఆ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగానే సిట్ హైడ్రామాకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సిట్ ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులు, సాక్షులను బెదిరించి, వేధించిన విషయం తెలిసిందే. కాగా, లేని ఆధారాలు సృష్టించాలని, ఏదో ఒక విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. దాంతో రాజ్ కెసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించేందుకు ప్రయత్నించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం స్క్రిప్ట్‌ను అమలులోకి తెచ్చింది. అదేమిటంటే... » వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా కాచారంలోని విజయేందర్‌రెడ్డికి చెందిన సులోచన ఫామ్‌హౌస్‌కు తరలించారు. అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ నగదు తీసుకెళ్తే ఎవరైనా మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి ఈ విధంగా ముందు జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చాక కుట్రలో రెండో అంకం మొదలుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున సిట్ అధికారులు విజయేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు..రూ.11 కోట్లను జప్తు చేసినట్లు డ్రామా రక్తి కట్టించారు. ఈ నగదంతా రాజ్ కెసిరెడ్డిదేనని..2024 జూన్ నుంచే ఇక్కడ ఉంచారంటూ కట్టుకథను మీడియాకు లీకు చేశారు. కానీ, టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ పన్నాగం బూమరాంగ్ అయ్యింది. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే సిట్ కుట్ర బెడిసికొట్టింది. చిత్తు కాగితాల అట్టపెట్టెల్లో అంత డబ్బు దాచారా?కట్టుకథతో నమ్మించేందుకు సిట్ చేసిన పన్నాగం నవ్వులపాలైంది. గతంలో ఎప్పుడూ సోదాల్లో దొరకని డబ్బు, అకస్మాత్తుగా పుట్టుకు రావడమే దీనికి కారణం. పైగా ఏకంగా 14 నెలలుగా అక్కడే ఉన్నట్లు తెలపడాన్ని బట్టి చూస్తే... ఇదంతా సిట్ పన్నాగం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు విజయేందర్‌రెడ్డి అనుకూలంగా మారాకనే ఇదంతా జరగడం గమనార్హం. వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి? నివాసంలోని సొమ్మును వేరేవాళ్లదిగా ఆయనతోనే చెప్పించడం ఏమిటి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక అర్థరాత్రి చకచకా పుట్టుకొచ్చి పట్టుబడినది అని చెబుతున్న నగదు అంతా ఒకే తరహా అట్టపెట్టెల్లో (ఆఫీసుల్లో ఏ4 తెల్ల కాగితాల బండిల్స్ పెట్టేవి) ఉండడం ఆశ్చర్యపరిచింది. స్టేషనరీ సామగ్రి పెట్టే సాధారణ 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్లను ఉంచారని చెప్పడం సిట్ విస్మయకర తంతు ఏవిధంగా ఉందో తెలుస్తోంది.బెయిల్‌ను అడ్డుకోవడానికే సిట్ కుట్రలుసిట్ అధికారులు ఇంత చీప్ ట్రిక్కు ఎందుకు పాల్పడ్డారన్నదే కదా సందేహం... అక్కడే ఉంది అసలు కథ. ఈ కేసులో తాము అక్రమంగా అరెస్టు చేసినవారికి బెయిల్ రాకుండా కోర్టును తప్పుదారి పట్టించడమే సిట్ లక్ష్యం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయింది. కేసులో ఏ1గా పేర్కొన్న రాజ్ కెసిరెడ్డిని సిట్ ఏప్రిల్ 21న అరెస్టు చేసింది. వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ, సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దీంతో 90 రోజుల తరువాత బెయిల్ ఇచ్చేందుకు సాంకేతికంగా మార్గం సుగమైనట్టే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు అదే విషయాన్ని ప్రస్తావించింది. వివిధ సంస్థల పేరిట బ్యాంకులో ఉన్న నగదును జప్తు చేయడం మినహా సిట్ అధికారులు దర్యాప్తులో ఏం గుర్తించారు? ఏం సాధించారు? అని ప్రశ్నించింది. దాంతో సిట్ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అందుకే లేని ఆధారాన్ని ఉన్నట్టు చూపాలని భావించి హడావుడిగా విజయేందర్‌రెడ్డిని తమ కుట్రలో పావుగా చేసుకున్నారని స్పష్టమవుతోంది. రూ.11 కోట్లు జప్తు చేసినట్టు, ఆ నగదు రాజ్ కెసిరెడ్డిది అని కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. » అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరుల బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ ఇదే రీతిలో శనివారం హైడ్రామా సాగించింది. హైదరాబాద్‌లోని వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయంలో సోదాల పేరుతో హడావుడి చేసింది. కోర్టు నుంచి అనుమతి లేకుండా సిట్ అ«దికారుల బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద రాద్ధాంతం సృష్టించి...భయపెట్టేందుకు ప్రయత్నించింది.లోకేశ్ సన్నిహితుడు కిలారి సిట్ అధికార ప్రతినిధా!?రూ.11 కోట్ల జప్తు స్క్రిప్ట్ కథ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నడిపించారన్నది తేటతెల్లమైంది. ఆ నగదును జప్తు చేసినట్టు టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు మంత్రి లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ తెలపడమే దీనికి నిదర్శనం. ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేదు. సిట్‌తో అధికారికంగా సంబంధం లేదు. కానీ, సిట్ అధికార ప్రతినిధి అన్నట్టుగా బుధవారం తెల్లవారుజామునే రూ.11కోట్ల జప్తు చేసిన ఫొటోలు, సమాచారం ఇవ్వడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే, ఈ జప్తు కథ అంతా టీడీపీ కేంద్ర కార్యాలయం డైరెక్షన్లోనే సాగిందన్నది స్పష్టమైంది. కట్టుకథలో తాజా పాత్రధారి వరుణ్మద్యం అక్రమ కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తంను నోట్ల కట్టల కట్టు కథలో సిట్ పాత్రధారిగా చేసుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే తాము ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేసి నగదును గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. అక్రమ కేసులో ఏ 40గా పేర్కొన్న వరుణ్ విదేశాలకు పరారయ్యారని సిట్ ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చింది. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేసింది. విదేశాల్లో ఉన్న వరుణ్ పురుషోత్తం హఠాత్తుగా హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో మరి...? అంటే సిట్ ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించిందని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కొసమెరుపు: విజయేందర్‌రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సరిగ్గా సులోచన ఫామ్‌హౌస్‌కు ఎదురుగానే ఉంటుంది. దీంట్లోనే రాత్రికిరాత్రే రూ.కోట్ల నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. కానీ, అవి ఆయనవి కావు అని.. రాజ్ కెసిరెడ్డివని చెబుతుండడం. ఆ నగదు నాది కాదు.. రూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుట్రను రాజ్ కెసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ తన కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కెసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేశారు. విజయేందర్‌రెడ్డి కుటుంబానికి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీ, ఇతర వ్యాపారాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఏటా వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాపార సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు. తాను ఫాంహౌస్‌లో నగదు దాచలేదని నివేదించారు. -
కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్పడుతోంది. కేసును ‘సెన్సేషన్’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాల పేరుతో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ బాస్‌లకు అన్నింట్లోనూ ‘ఎస్’ అనే పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. దీంతో మరో కుతంత్రం రచించింది. బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్‌లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్ కొత్త ఎత్తుగడ వేసింది. ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ కొత్త పన్నాగం పన్నింది. వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్ బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్ ఉద్యోగులతో సిట్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్ మార్క్ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న వికాట్ కంపెనీ కార్యాలయంలో సిట్ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను జప్తు చేసి సిట్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సీజ్ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో గానీ సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్‌లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. కుంభకోణం జరిగితేనే కదా?లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ వికాట్ కార్యాలయంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. ఆ నెపంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలురాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్ సిట్‌ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.పచ్చ గ్యాంగ్ దాదాగిరీ... పరిశ్రమలు పరార్రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. » వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్ స్టీల్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.» సిమెంట్ దిగ్గజం వికాట్ గ్రూప్ యూరప్‌లో టాప్ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.» అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.» పల్నాడులో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. » రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. » శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. » సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. » శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్ సోదాలువికాట్ కార్యాలయాల్లో కూడా..2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వికాట్ గ్రూప్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బంజారాహిల్స్‌లోని వికాట్ కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్ డివైజ్‌లను సీజ్ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
సిట్ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్‌రెడ్డి ఆవేదన
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నానుమాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన. -
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్ చార్జ్జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్ తన చార్జ్‌షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్కే దక్కుతుంది. కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్... కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.⇒ సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్‌బుక్ కుతంత్రం బట్టబయలవుతోంది.కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అంటూ బురిడీ కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్జషీట్లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్ కాల్స్, వందలాది వాట్సాప్ చాటింగ్‌ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్ యత్నించింది. పోనీ ఆ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్ చార్జ్జషీట్లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్‌కాల్స్, చాటింగ్లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యంవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్‌బుక్ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సిట్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్‌షీట్‌ను స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్‌జషీట్ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్ బరితెగించి ప్రకటిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి.. లోకేశ్ బినామీ కేశినేని చిన్ని భాగస్వామి ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్‌కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారు. ⇒ కేశినేని చిన్ని మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్ కేసిరెడ్డి..వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబుగానీ ఇటు సిట్‌గానీ స్పందించకుండా మౌనం వహించడం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.బాబు కుట్ర కథే... సిట్‌తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటేచంద్రబాబు సిట్ ద్వారా రెడ్‌బుక్ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్‌బుక్ కుట్ర అమలుకు సిట్ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్‌జషీట్ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్ రిపోర్టులు, చార్జ్‌జషీట్ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్కే సాధ్యపడింది. రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్‌బుక్ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్ ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమేడిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇక బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్‌యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్‌కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. టీడీపీ సిండికేట్‌కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్‌విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానంనాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే.సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణవైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతమద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?డిస్టిలరీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్‌తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్ కోడ్ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్‌కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరిట్‌ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్ జగన్‌వేనని సిట్‌తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్ హోటల్ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్‌కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్ పెట్టడంతో పాటు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? -
బాబు కుతంత్రం..‘అప్రూవర్’ తంత్రం
భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్(ఏ3)లను బెదిరించి, అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొందరు సిట్ అధికారులతో కలసి న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అప్రూవర్ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధించారు. సిట్ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్ యత్నిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్ లొకేషన్! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నిందితుల సెల్ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్ టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకున్నామని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్ టవర్ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరంలో వేలాది సెల్ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్ అధికారులు రిమాండ్ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్ అధికారులు సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్ ఇన్వాయిస్లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్ ఇన్వాయిస్‌లనీ సిట్ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది. -
లేని లిక్కర్ స్కాం ఉన్నట్టుగా.. వాళ్లే టార్గెట్‌గా సిట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా.. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా సిట్ అధికారులు పనిచేస్తున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు. రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. రూ.35 వేల కోట్లు అంటూ పవన్ కల్యాణ్ బొంకారు. ప్రభుత్వ పెద్దలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ పేర్కొంటుంది. ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్సీపీ మండిపడింది. కోర్టుల్లోనే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అంటోంది. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. -
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది. సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్‌షీట్ రూపంలో కూడా కొనసాగించింది.మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్శనివారం ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. ⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. అవాస్తవాల పుట్ట.. రెడ్‌బుక్ కుట్ర సిట్ చార్జ్షీట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు సిట్ చార్జ్‌షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్లో పునరుద్ఘాటించారు. తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్‌ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
మిథున్ రెడ్డి సిట్ విచారణపై ఉత్కంఠ
-
మిథున్ రెడ్డి విచారణపై దేవినేని అవినాష్ రియాక్షన్
-
విచారణపై మిథున్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
విచారణకు మిథున్ రెడ్డి.. సిట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
-
Telangana phone tapping case: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
సాక్షి,కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితో పాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు సిట్ విచారణలో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు పీఆర్వో, పీఏల స్టేట్మెంట్ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బాధితుల్ని సాక్షులుగా పరిగణిస్తూ వారినుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వాళ్లు కచ్చితంగా న్యాయస్థానం వరకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయో చూపిస్తోంది. నేతలతో పాటు వారి కుటుంబీకులు, అనుచరుల సంభాషణల ఆడియోలను వినిపిస్తూ, సంబంధిత పత్రాలను చూపిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్‌రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. రాజకీయ నాయకులతో పాటు వారి సంబంధీకుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ ఆ ఆడియోలను ‘పెద్దలకు’ షేర్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. ప్రస్తుతం సిట్ సాక్షులకు ఈ ఆడియోలను వినిపించడంతో పాటు వివిధ లేఖల్ని చూపిస్తోంది. ఆ తర్వాతే వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వారి వాంగ్మూలం నమోదు చేస్తోంది. కొందరు సాక్షులు, నిందితుల్ని ఎదురెదురుగా పెట్టి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. అప్పటి ప్రభుత్వం దిగజారి వ్యవహరించింది..ప్రణీత్‌రావు బుధవారం మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో పాటు కామారెడ్డికి చెందిన వివిధ పార్టీల నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా ఫహీమ్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఫోన్ ట్యాప్ అయిందని డీసీపీ నుంచి సమాచారం అందింది. నా ఫోన్‌తో పాటు నా భార్య, డ్రైవర్ ఫోన్లనూ ట్యాప్ చేశారు. అధికారం కోసం నీచానికి దిగజారారు. బహుశా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే ఎన్నికల ముందు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు..’ అని చెప్పారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచానికి దిగజారింది. తల్లి, పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది..’ అని చెప్పారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం వరకు దాదాపు 235 మంది వాంగ్మూలాలను సిట్ నమోదు చేసినట్లు తెలిసింది. -
ట్యాపింగ్ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారు: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు ప్రశ్నించి ఈటల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం సాగదీస్తారు?. ఎంత కాలం విచారణ జరుపుతారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకెంత కాలం విచారిస్తారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకమే అక్రమం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. అనేకసార్లు నా ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ నేతలే కాదు.. జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లూ ట్యాప్ చేశారు. గవర్నర్ ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు?. ఎవరి అండతో ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్న చట్టపరంగా శిక్షించాలి.. అని ఈటల డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. బీజేపీ లీగల్ సెల్‌తో కలిసి సిట్ కార్యాలయానికి సాక్షిగా ఇవాళ్టి విచారణకు ఈటల హాజరయ్యారు. బీజేపీ నేత ప్రేమేందర్ స్టేట్మెంట్ను కూడా అధికారులు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్‌రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్‌రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్‌కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్‌రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్‌రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. -
‘చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం కోసమే పోలీసులు తనపైన, తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ఆయన చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇదీ.‘ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు వస్తానని చెప్పా’‘మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ సిట్ కార్యాలయానికి వస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు కేవలం నా సెల్‌ఫోన్‌కు ఒక చిన్న మెసేజ్ పెట్టి ఉన్నా మీ సిట్ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు.. రాత్రివేళ కూడా ఏ రోజూ నా సెల్‌ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా. మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తోంది.బతుకుతెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం తప్పేంటి?. మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా!. సిట్ విచారణ ప్రారంభించి 365 రోజులవుతుంది. ఏ రోజయినా, ఏ ఒక్కరైనా, చివరకు ఏ పేపర్, ఏ చానల్ అయినా నిన్నటివరకు నా పేరు ప్రస్తావించిందా? లేదుకదా. కనీసం నిన్నటి వరకు మీ సిట్ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా?. ఒక చిన్న నోటీస్ అయినా ఇచ్చారా?. ఎప్పుడైనా పిలిచారా?. లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!.’‘చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది’గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎలా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది.. మా పాత గన్మెన్లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్ అధికారులు కొట్టినట్టు మీ చేత మళ్లీ నన్ను కూడా కొట్టిస్తారేమో!. అది కూడా కానిచ్చేయండి. చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది. ఈసారి నా ఒక్కడినే కాదు.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల నా కొడుకు మోహిత్‌రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు. ఒక్క మోహిత్‌నే ఎందుకు. ఇంట్లో ఇంకా నా భార్య, నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి చంద్రబాబును, చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింపచేయండి. మాకేం పర్లేదు. మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వరస్వామి మాలో ఉన్నాడు. జీవితం అంతా పోరాటాలే ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది. ఎదుర్కొంటాం. సగౌరవంగా తిరిగి వస్తాం. ఆలస్యమైనా సత్యమే జయిస్తుంది అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్ చేయండిమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్రెడ్డివిజయవాడ స్పోర్ట్స్: ‘లేని మద్యం కేసును తెరపైకి తెచ్చి అందులో నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదంతా సీఎం చంద్రబాబు కుట్ర. అక్రమ అరెస్టులతో మా కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ఈ కేసుతో మా నాన్నను, అన్నను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మా కుటుంబంలో నేను, నా తల్లి మాత్రమే మిగిలి ఉన్నాం. ఇంకెందుకు మా ఇద్దర్నీ కూడా అరెస్ట్ చేయండి’ అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి వాపోయారు. న్యాయవాది ఎం.వాణితో కలిసి హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి బుధవారం వచ్చారు. అనంతరం మీడియాతో హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అత్యాచారానికి గురైన బాలికను, అన్యాయమైపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తన తండ్రి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారన్నారు. ఈ ఘటనతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధం లేదని సాక్షాత్తు బాలిక తండ్రే బహిరంగంగా వెల్లడించారని గుర్తు చేశారు ఆయన తమను పరామర్శించేందుకు వచ్చారే తప్ప ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన తరువాత ఈ కేసును తీసేశారని చెప్పారు. మేమెప్పుడూ మద్యాన్ని పంచలేదు కూడా..‘మద్యం అంటేనే మా కుటుంబానికి పడదు. మద్యం మహమ్మారి మా తాతయ్యను పొట్టన పెట్టుకుంది’ అని హర్షిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా ఏనాడూ తాము మద్యం పంపకం చేయలేదని వెల్లడించారు. అలాంటిది తమ కుటుంబ సభ్యులపై మద్యం కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. తన తండ్రి, అన్నను మద్యం కేసుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అక్రమ కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. -
ప్రభుత్వ కుట్ర.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్‌ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్‌పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్‌రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు. గన్‌మెన్‌కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలంచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్‌కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు. తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారిఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తుడా వాహనంపై కట్టుకథలుగత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్‌గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారుఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు. ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది. కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్‌మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్‌కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది. సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.కట్ అండ్ పేస్ట్ కుట్రేముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్‌నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణవిజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్‌రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. -
రెడ్ బుక్ అరాచకం.. హింసలు, వేధింపులు
-
సుప్రీంకోర్టు చెప్పినా సిట్‌కు లెక్కే లేదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్‌లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది. అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూడదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.మా పని మాది..సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్ వత్తాసు పలికింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది. -
సిట్ అధికారులకు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ
తాడేపల్లి : నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి. ఈ మేరకు సిట్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?, అది నిజం కాదు కనకే కదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి.. పోలీస్ అధికారులపై అబద్ధాలు చెప్పగలరా?, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్‌మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది’ అని మోహిత్ రెడ్డి నిలదీశారు.ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి’ అని అన్నారు.తప్పుడు స్టేట్మెంట్లు కోసం కుట్రలు పన్నుతుంది మీరే కదా?, అంతా పారదర్శకంగానే జరుగుతుందని దేవుడు ముందు ప్రమాణం చేయగలరా?,నిజంగానే సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరే దమ్ముందా?, తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి’ అని మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన పలుమార్లు ఇప్పటికే ఆరోపించారు.తాను కూడా ఫోన్‌ట్యాపింగ్ బాధితుడినేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహేష్‌కుమార్ గౌడ్ సిట్ కార్యాలయానికి చేరుకోగా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బయటకు పంపించారు.2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది: మహేష్ గౌడ్సిట్ ముందు హాజరైన అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకువచ్చాయన్నారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు నేతల కనుసన్నల్లోనే పనిచేశారు. ఫోన్ ట్యాప్‌తో రాజకీయ లబ్ధి పొందారు’’ అని మహష్ గౌడ్ ఆరోపించారు. -
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్‌ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్‌రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
ట్యాపింగ్ కేసు.. వ్యూహం మార్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.ఎస్ఐడీలోని ఎస్ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్‌రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్‌రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్‌రావు శనివారం మరోసారి సిట్ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్‌ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడం. ఎస్ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.ఎస్ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్‌ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబీకి చెందిన 42 హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.రెండు టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.అప్పట్లో ఎస్ఐడీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్‌రావు ఖండిస్తుండటంతో సిట్ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్‌రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్‌రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
దాటవేత ధోరణిలో సమాధానం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావును సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్‌రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్ ప్రస్తావించింది. ట్యాపింగ్‌తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, వారి నంబర్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు ప్రశ్నించారు.కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్ డిటేల్స్ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్‌రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్‌రావుతో కలిపి ప్రభాకర్‌రావును విచారించిన సిట్ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.హార్డ్‌డిస్క్ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్‌రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్‌కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్ అధికారులు అలాంటప్పుడు ఎస్ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్‌రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్‌డిస్‌్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్‌రావు సిట్ అధికారులకు తెలిపారు. అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులను సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్‌రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్‌రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్‌ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్‌రావు నుంచి వచ్చాయని ప్రణీత్‌రావు చెబుతుండగా... ప్రభాకర్‌రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. -
సిట్ అడిగింది తెస్తారా? ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత విచారణలో అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు బృందం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో వాడిన సెల్ఫోన్లు(రెండు), ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్‌లను తీసుకురావాలని ఆయన్ని అధికారులు ఆదేశించారు. వీటి ద్వారా ఈ కేసులో కీలక సమాచారం రాబట్ట వచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఆయన వాటిని తీసుకొస్తారా? అధికారులకు అందిస్తారా? ఏదైనా కారణం చెబుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారంలోకి వెలుగులోకి వచ్చాక.. ఆయన అమెరికా వెళ్లారు. సుమారు 15 నెలల తర్వాత సుప్రీం కోర్టులో అరెస్ట్ నుంచి ఊరట లభించడం, పైగా విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల 8వ తేదీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆపై ఆ మరుసటిరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి 8గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్.. ఫోన్ ట్యాఇపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ, ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు ఎస్ఐబీకి చెందిన హార్డ్‌డిస్క్‌ల డాటా మాయం చేశాడని విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు. ఎస్ఐబీలో పాత హార్డ్ డిస్క్‌ల స్థానంలో కొత్తవి పెట్టడం.. కొన్ని దశాబ్దాలుగా నిఘా వర్గాలు దాచిన ఉగ్రవాద, తీవ్ర వాద సమాచారం మాయం కావడంపైనా ప్రభాకర్ రావును ఆరా తీశారు. అయితే వీటిలో దేనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు రెండో రౌండ్ విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం విధానంపై నమోౖదెన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా’ అని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవ#తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖరెడ్డిని మూడు రోజులు, కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ఎలా! కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాదులు నాగార్జునరెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్ సీజ్ చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎల్రక్టానిక్ డివైజ్‌లను, మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎలా పంపుతారని ప్రశి్నంచారు.ఈ కేసును మొదట్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వారు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమరి్పంచలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే బాధితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ సమరి్పంచిన మెమోలో సైతం ఏ మెటీరియల్ సీజ్ చేశారనే విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమరి్పంచలేదన్నారు. సిట్ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికçప్పుడు విచారణ అధికారి ఆర్.శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిట్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో ‘కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు. మీరు డైరెక్ట్‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలి’ అని న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు బాధితుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కొనసాగిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సాక్షులను బెదిరించకుండా, ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
విచారణ పేరుతో వేధింపులు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.సిట్ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి. -
ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: మద్యం విధానం కేసులో మద్యం తనకు సీఆర్పీసీ 160 నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిసు ఇచ్చే పరిధి ఏపీ సీఐడికి లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్‌కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మే 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
‘సిట్’ చిలకమ్మ.. కట్టుకథలు
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్‌రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్‌రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
సిట్ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు
-
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్‌బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
రేపు సిట్ విచారణకు హాజరవుతా: రాజ్ కేసిరెడ్డి
అమరావతి: తాను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ఈ విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. ఇక తన ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుజేత సిట్ విచారణకు హజరవుతున్నట్లు పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అక్రమ కేసే.. బాబు కుట్రే!
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్‌కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్‌రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్‌రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్‌రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు) సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ గ్రూప్‌నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్‌రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్‌రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్‌రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్‌రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్‌రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. -
సిట్ కార్యాలయానికి YSRCP నేత మిథున్ రెడ్డి
-
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్‌లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్‌బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. -
కిడ్నాప్‌లు.. బెదిరింపులు
సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ అరాచకం సృష్టిస్తోంది. లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడిని సిట్ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వెళ్లి కిరణ్ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు. ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్‌గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా? అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్బుక్కే రూల్ బుక్ అని పేట్రేగిపోతూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్ అధికారుల వేధింపులకు తార్కాణం. మేం చెప్పినట్లు వినాల్సిందే విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్‌బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్ కసిరెడ్డినే కాకుండా యావత్ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.21న హాజరుకండి తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనంఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది. వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు. -
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు కుట్రదారు, లబ్దిదారుగా సాగిన కుంభకోణాల కేసులను నీరుగార్చేందుకు ఎంతకైనా తెగిస్తామని సీఐడీ పదే పదే స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ఎంతగా అంటే.. ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి బి.సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు ఏకంగా 10 నెలలపాటు చార్జ్షీట్లు దాఖలు చేయకుండా సాగదీయడం గమనార్హం.తాజా బదిలీల్లో హిమబిందును రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో 2023లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్ నివేదిక పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. కేసులు నీరుగార్చే కుట్ర.. సాక్షులకు బెదిరింపులు రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబుపై అవినీతి కేసులను సీఐడీ అటకెక్కించింది. ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు, అధికారులను బెదిరించి బెంబేలెత్తిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేయిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా సీఐడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్.. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను గత ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి సీఐడీ అధికారులు ఆ వివరణలతో సహా చార్జిషీట్లను సిద్ధం చేశారు. కానీ గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని సీఐడీ చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను పునఃదాఖలు చేయక పోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. చంద్రబాబు, నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గతంలో సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్‌గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా.. నిందితుడా.. అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీఐడీ తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సీఐడీ ఆ చార్జ్షీట్లను పునఃదాఖలు చేయకపోవడం గమనార్హం. అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సీఐడీ చార్జ్షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. న్యాయమూర్తిపైనే ఇంటెలిజెన్స్ నిఘా! చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం కలకలం సృష్టించింది. ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటలిజెన్స్ అధికారులు తిష్ట వేసి, ప్రతి కదలికనూ గమనిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం. నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించారు. న్యాయమూర్తి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పోలీసు అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. -
శ్రవణ్ ఫోన్లపైనే సిట్ ఫోకస్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ!
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్‌ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. -
వీర విధేయులతో ‘సిట్’
పచ్చ చొక్కాలు ధరించలేదు.. అదొక్కటే తక్కువ..! ఖాకీ దుస్తులు వేసుకున్నాగానీ రెడ్‌బుక్ కుట్రలు అమలు చేయడంలో నాలుగాకులు ఎక్కువే చదివారు..! ఇదీ చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీరు!! వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సీఐడీ దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేక చేతులెత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకే సిట్‌ను ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులను ఏరికోరి మరీ సిట్‌లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డే అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతిరెడ్బుక్ కోసమే.. తెలంగాణ నుంచి ఏపీకిసిట్లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడి కుటుంబానికి టీడీపీతో బలమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును అందుకే చంద్రబాబు పట్టుబట్టి మరీ ఏపీకి డిప్యుటేషన్‌పై రప్పించుకుని రెడ్‌బుక్ కుట్ర అమలు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి ఎస్పీగా ఉండగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన వేధించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో టికెట్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు దుర్మరణం చెందటానికి ఎస్పీగా ఆయన వైఫల్యమే ప్రధాన కారణం. అయినప్పటికీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టింది. ఆ వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. అనంతరం మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా నియమించింది.పచ్చ బాస్‌కు వీరవిధేయుడుసిట్ ఇన్చార్జ్గా నియమితులైన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు వ్యవహార శైలి ఆది నుంచి తీవ్ర వివాదాస్పదమే. అసలు డీజీ స్థాయి అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీకి అప్పగించిన కేసును... ఐజీ స్థాయి అధికారి అయిన రాజశేఖర్‌బాబు నేతృత్వంలోని సిట్‌కు అప్పగించడం వెనుకే పక్కా కుట్ర దాగుంది. సాధారణంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సిట్ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇన్చార్జిగా నియమించరు. వారు తమ జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కీలక బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.సాధారణంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి సిట్ ఇన్చార్జ్ లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు విరుద్ధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును సిట్ ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. టీడీపీకి ఆది నుంచి వీరవిధేయుడుగా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి టీడీపీకి వీర విధేయుడనే ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించ లేదు. పైగా అదే తనకు అదనపు అర్హతగా భావించారు. గతేడాది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే విజయవాడ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించారు. వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అరాచక పర్వానికి అడ్డుకట్ట పడింది. చెబితే చాలు.. ఎంత అడ్డగోలు పనైనా చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారనే ఏకైక అర్హతతోనే ఆయన్ని సిట్ చీఫ్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని, అక్రమ కేసులను దగ్గరుండి పర్యవేక్షించింది రాజశేఖర్బాబే! ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు మహారాష్ట్రకు తరలించేసింది.‘స్పా’ంటేనియస్ అధికారి కొల్లి శ్రీనివాస్సిట్లో మరో సభ్యుడైన ఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అత్యంత వివాదాస్పదం. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. ‘స్పా’లలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనే ప్రధాన సూత్రధారి. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది.ఆ ఇద్దరూ అంతే...!సిట్‌లో మిగిలిన ఇద్దరు సభ్యులు సీఐడీ అదనపు ఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు కూడా అంతే. గతంలో ఆర్.శ్రీహరి బాబు గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బ్లాక్ మెయిలింగ్ కుట్రలకు సహకరిస్తూ ఎమ్మెల్యేల కాల్ డేటాను అక్రమంగా సేకరించి ఇచ్చారు. దాంతో నాడు శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అదే అర్హతగా భావించి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది. సిట్‌లో మరో సభ్యుడిగా ఉన్న నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఇతర అధికారులపై ఒత్తిడి తేవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన మాటే చెల్లుబాటైందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అంతటి టీడీపీ వీర విధేయుడు కాబట్టే ఆయన్ను సిట్‌లో సభ్యుడిగా చేర్చారు. -
రెండోసారి గంట సేపు విచారణ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు బుధవారం రెండోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు వచ్చిన ఆయనను అధికారులు దాదాపు గంటపాటు ప్రశ్నించారు. శనివారం మొదటిసారి సిట్ ముందు హాజరైనప్పుడు అధికారులు, శ్రవణ్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం సైతం సుదీర్ఘంగానే విచారించాలని భావించారు. అయితే హెచ్‌సీయూ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో కేవలం గంట మాత్రమే ప్రశ్నించి పంపిస్తూ.. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. శ్రవణ్‌రావు గతంలో ఓ టీవీ చానల్‌ను నిర్వహించారు. ఆ చానల్‌ను ఎందుకు తీసుకున్నారు? దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోపక్క దుబాయ్‌లో సొంత ఫ్లాట్ ఉన్న శ్రవణ్, ఇటీవల రెండు నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఫ్లాట్ ఎప్పుడు? ఎలా? ఖరీదు చేశారనే అంశంతో పాటు ఆ ఐదుగురు ఎవరని పోలీసులు అడిగారు. కాగా, పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా శ్రవణ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదని తెలు స్తోంది. శనివారం విచారణ సందర్భంగా శ్రవణ్‌రావు తాను 2023 ఎన్నికల సమయంలో ఓ సర్వే చేశానని. దాని వివరాలను ప్రభాకర్‌రావుతో పంచుకున్నానని చెప్పారు. ఆయనతో పాటు ఆయన ద్వారా పరిచయమైన ప్రణీత్‌తో తప్ప మరే ఇతర అధికారి, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేదంటూ శ్రవణ్‌రావు వాదిస్తున్నారు. అయితే ఆ సర్వే ఎవరి సూచనల మేరకు చేశారు? అందుకు సంబంధించిన నగదు ఎవరు చెల్లించారు? అనే అంశంపై పోలీసులు ప్రశ్నించినా.. శ్రవణ్ నుంచి సామాధానం రాలేదని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ 2 ఫోన్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని తీసుకువచ్చి అప్పగించాలని శనివారమే స్పష్టం చేశారు. అయితే బుధవారం ఆయన ఓ పాత సెల్‌ఫోన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది చూసి షాక్‌కు గురైన పోలీసులు గతంలో వాడినవి కావాలని స్పష్టం చేశారు. ఆ రెండు సెల్ఫోన్లను ఎనిమిదో తేదీన విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్లను మార్చే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఆయన నుంచి సరైన సహకారం లభించడం లేదని పోలీసులు చెపుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్‌రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్‌పై సిట్ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.‘‘ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయి’’ అని రేవంత్ అన్నారు.ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. -
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్‌ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్‌కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్‌చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
రెడ్‌బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్‌గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్‌ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్‌కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్‌ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా పని చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్‌గా నియమించారు.పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్‌బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్‌లో సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎంతంటే అంతే..సిట్‌లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాంఘికాలకు ఊతంఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం సిట్‌లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది. అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనతసిట్లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం. -
AP: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్
సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌పై విచారణను మాత్రం సిట్‌కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.స్టెల్లా, కెన్ స్టార్ షిప్‌లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్‌కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్‌కి అప్పగించింది. 13 ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు సిట్‌కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
సుప్రీం కోర్టు నిర్ణయాలతో వణికిపోతోన్న చంద్రబాబు నాయుడు అండ్ కో
-
బాబు సిట్' క్లోజ్


