సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన కేసుల్లో సిట్ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్‌లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్‌లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది.
సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యులు
ఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)
యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)
కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)
వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)
బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్‌ఇ)
జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీ
సి. శంకర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్)


