breaking news
phone tapping case
-
ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం 'కీలక ఆధారాలు ఆహుతి'?
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్‌డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షల కోసం ఉన్నట్లు తెలిసింది. ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్‌శాంపిల్స్, హార్డ్‌డిస్కులు, సెల్ఫోన్లు, ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ భద్రంగా ఉందా..? లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితోపాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్‌లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 10.20 గంటలకు... అగ్ని ప్రమాదం శనివారం నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్స్‌లో జరిగింది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ప్రయోగశాల మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్ బాయ్ క్రిష్ణ చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిఇచ్చారు. అప్పటికే ఆఫీసులో ఉన్న ముగ్గురు సిబ్బందితో కలిసి దట్టంగా వ్యాపించిన మంటలను ఆరి్పవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పొగధాటికి తట్టుకోలేక క్రిష్ణ అస్వస్థతకు గురికాగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఐదు ఫైరింజన్లు, ఒక రోబో, రెండు వాటర్ ట్యాంకులతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నార్త్ జోన్ డీఐజీ శ్వేతా, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పగటి పూట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సంభవించిన భవనం పక్కనే నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రి ఉంది. మరొకవైపు అపార్ట్మెంట్లు ఉన్నాయి. రాత్రి వేళలో జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ అధికారుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తోనే జరిగిందా..? లేక ఇంకా ఏదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు స్పష్టం చేస్తేనే... ప్రమాదంలో హార్డ్ డిస్కులు, కేసుల ఫైల్స్, కంప్యూటర్లు, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, శాంపిల్స్‌కు సంబంధించిన రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అయితే, కాలిపోయిన వస్తువుల్లో ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఫోన్‌ట్యాపింగ్ కేసులకు సంబంధించి మొత్తం సమాచారం ఎఫ్ఎస్ఎల్లోనే ఉందా? అవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయా..? లేదా ఎఫ్ఎస్ఎల్లో ఉన్నవి కేవలం నమూనా కాపీలా..? అన్నది అధికారులు స్పష్టం చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ఒకరు మాత్రం ఈ ప్రధాన కేసుల ఆధారాలు ఇక్కడ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపే ఏ రకమైన ఆధారాలైనా.. విశ్లేషించి నివేదిక రూపొందించిన తర్వాత వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా ఎక్కడి నుంచి విశ్లేషణ కోసం పంపారో ఆయా యూనిట్లకు పంపుతారని తెలిపారు. కొన్ని కేసుల్లో కోర్టులు సైతం ఎఫ్ఎస్ఎల్కు ఆధారాలు పంపుతాయని, అలాంటి కేసుల్లో విశ్లేషణ తర్వాత సదరు వస్తువులు, ఆధారాలను తిరిగి కోర్టులకే అప్పగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆధారాల విశ్లేషణ తర్వాత రూపొందించే నివేదికలకు సంబంధించిన కాపీలను మాత్రం ఎఫ్ఎస్ఎల్లో రికార్డు కోసం భద్రపరుస్తారని పేర్కొన్నారు. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో బహుశా అలాంటి నివేదికలకు సంబంధించిన ప్రతులు కాలిపోయే అవకాశం ఉండొచ్చని వివరించారు. ఈ ల్యాబ్‌లో ఏం చేస్తారంటే.. రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. షార్ట్సర్క్యూతోనే...: డీసీపీ శిల్పవల్లి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఆధారాలు, సాక్ష్యాలకు కేంద్రంగా ప్రయోగశాల పనిచేస్తుందన్నారు. మంటల్లో కీలకమైన ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని చెప్పారు. ఆ సమయంపైనే అనుమానాలు ప్రభుత్వ కార్యాలయాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. అప్పడే ఒక్కొక్కరు లోనికి వస్తుంటారు. ఉద్యోగులు వచ్చే సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం తలుపులు తెరుచున్న సమయంలోనే ఇతరులు ఎవరైనా లోనికి ప్రవేశించారా? ప్రవేశిస్తే ఆ సమయంలో పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడున్నారు? అదే సమయంలోనే షార్ట్‌సర్క్యూట్ జరిగిందా లేక అంతకు ముందే జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. హార్డ్ డిస్క్‌లు కాలిపోయాయి: అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై మాకు ఉదయం 10.20 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయి. సమీపంలోని మరో రెండు ఫైర్ టెండర్లు రప్పించాం. మొదటి అంతస్తులో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఉంది, హార్డ్ డిసు్కలు, కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. సెకండ్ ఫ్లోర్‌లోని కెమికల్ ల్యాబ్‌కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానిస్తున్నాం. ఎమ్‌సీబీ వద్ద కేబుల్స్ సేకరించి పరీక్షిస్తున్నాం. ఓటుకు నోటు ఆధారాలు మాయం చేసేందుకే..: కేటీఆర్ ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓటుకు నోటు కేసులో వాయిస్ రికార్డింగ్‌లు తొలగించడంతోపాటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల కొరతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంతో ఏ కేసులో ఆధారాలు చెరిపేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు రేవంత్‌రెడ్డి అంటూ బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పైవిధంగా స్పందించారు. కిషన్‌రెడ్డి అనుమానాలు ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కీలకమైన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక ఆధారాలు అగ్నికి ఆహుతయ్యాయా? లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.I am guessing the voice recordings of the famous “Vote for Note” case And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj— KTR (@KTRBRS) February 7, 2026ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారంనేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందిఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదుషార్ట్ సర్క్యూట్… https://t.co/4w0yY1tB17 pic.twitter.com/TrUmEPqY4Z— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
నాంపల్లి: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీ గదిలోని కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ధృవీకరించారు.శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్‌మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ ల్యాబ్‌లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ప్రమాదం జరిగింది. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చాం. ఫైర్ సిబ్బంది శ్రమతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 కంప్యూటర్లు కాలిపోయాయి. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తులో ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది’’ అని తెలిపారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైంది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం సీజ్డ్ గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్ రావుకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ రాష్ట్ర పోలీసు శాఖపై పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావుకు సర్కార్ ఝలక్ ఇచ్చింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు... ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు.. విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ సైతం పూర్తి కావడంతో అభియోగపత్రాల తయారీ ప్రారంభించారు. మరోవైపు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మార్చి 10న మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆలోగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. తుది చార్జ్షిట్లో కొన్ని సెక్షన్లతోపాటు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక అరెస్టులు ఉండవని.. నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. అలా నమోదై... ఇలా మారి... ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆపై 2023 మార్చి 13న ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు.అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్‌ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది. అందరి వేళ్లూ ఆ అధికారుల వైపే... ట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు.మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్ని ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్‌తో పాటు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుల ఎక్స్‌టెన్ వివరాలు ఆరా తీశారు. అవన్నీ పోలీసు విభాగం నిర్ణయాలని పేర్కొన్నారు. ఇలా అన్ని వేళ్లూ అప్పట్లో పని చేసిన ఉన్నతాధికారుల వైపే వెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు వారి విచారణపై సిట్ నిర్ణయం తీసుకోలేదు. వారిని ప్రశ్నించకుంటే కోర్టు విచారణలో కేసుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ సిట్ విచారణ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు?. గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై హరీష్ రావు ఫైర్
-
సజ్జనార్ అలా మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారి వీసీ సజ్జనార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సజ్జనార్ చేసిన ట్వీట్‌పై.. సోమవారం ఎక్స్ ఖాతాలో హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తికాకముందే.. అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్ధం. సజ్జనార్ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. కోర్టులు తేల్చే వరకు అన్నీ ఆరోపణలే కదా. అలాంటప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా అంటారు?. అక్రమమా.. సక్రమమా అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఆయన వ్యాఖ్యలు విచారణపై అనుమానాలకు తావిస్తోంది’’ అని హరీష్ రావు అన్నారు. How a SIT chief @SajjanarVC can officially refer to the issue of phone tapping as “illegal” even before the matter has been examined and decided by a competent court of law.Such a statement is not only legally unsustainable but also deeply disturbing coming from SIT chief.In… https://t.co/YAXaL36keJ— Harish Rao Thanneeru (@BRSHarish) February 2, 2026సిట్ చీఫ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ ముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్‌కు ఎవరిచ్చారు?. కేసీఆర్‌ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సజ్జనార్ గుర్తించడం లేదని హరీష్‌రావు అన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనని.. తీర్పు ఇవ్వడం కాదు అని అన్నారాయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సిట్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ పేరు ఎక్స్‌లో కాసేపు ట్రెండింగ్‌లో కొనసాగడం గమనార్హం. ఇక ఈ కేసులో హరీష్‌రావును సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. -
నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్ అధికారి నారాయణరెడ్డి, నాన్ కేడర్ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్ రావు, ఏసీపీ సీహెచ్ శ్రీధర్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్ చీఫ్‌గా ఉన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు గత వారంలో సిట్ అధికారులు కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్ బృందం కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. అప్పట్లో రాధాకిషన్‌రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లిరావడం, ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కేసీఆర్ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్విగ్నం.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌లోని నందినగర్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత.... ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్‌కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన నందినగర్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలివారు. బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్‌కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నందినగర్‌కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్‌కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. మంత్రుల నివాస సముదాయం ముట్టడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
‘రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదని.. సిట్ అంటే సీఎం ‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ సిట్ విచారణపై హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో..సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం,రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదు.కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం.పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం.చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. సిట్ అంటే సిట్ కాదు. ఇది CIT సిట్..‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారు పోలీసులు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోంది. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావు మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్లు?. మా నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు.గజ్వేల్ నుండి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రెండేళ్లుగా చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదు అందుకే రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నడు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు. ఇది కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ రైతుల కష్టాలు పట్టవు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీల అమలు చేయరు కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వాలే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని,కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని పేర్కొన్నారు. -
కేసీఆర్ ఒక్కరికే అనుమతి! సిట్ విచారణ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందినగర్ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను గంటల తరబడి సిట్ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ.. అప్డేట్స్కాసేపట్లో ఎర్రవెల్లి తన నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ బయల్దేరాక మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్,హరీష్ రావుబీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదంవిచారణ అనంతరం బయటకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసిన కేసీఆర్కేసీఆర్ నందినగర్ వివాసానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులునందినగర్కు బీఆర్ఎస్ నేతలుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నందినగర్‌కు పిలిచిన కేటీఆర్తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌కు బీఆర్ఎస్ నేతలుపార్టీ నేతలతో కేసీఆర్ సమావేశంసిట్ విచారణ పరిణామాలను పార్టీ నేతలతో వివరించనున్న కేసీఆర్ నంది నగర్లో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణనాలుగు గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణఆధారాలను ముందు పెట్టి కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్ బృందంగతంలో విచారణకు హాజరైన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించిన అధికారులుకేసీఆర్ స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసిన సిట్ బృందంకేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంనందినగర్ కేసీఆర్ ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ మూడుగంటలకు పైగా కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ సభ్యులు కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంతెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తతప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వచ్చిన శ్రేణులునందినగర్కు అనుమతి లేదన్న పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ శ్రేణులునందినగర్ కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు యత్నంకేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణంతెలంగాణ భవన్ నుంచి నందినగర్ వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలుఅనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులుపోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటతోపులాటలో క్రింద పడిపోయిన మహిళసీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలునందినగర్ కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తతఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నంబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసనపలువురు బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టునందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ బృందంసిట్ బృందంలో రీతిరాజ్, విజయ్‌కుమార్, అరవింద్‌కుమార్, నారాయణరెడ్డి, కేఎస్ రావు హరీష్‌రావుతో పాటు అందరినీ బయటకు పంపించేసిన అధికారులుకేసీఆర్ న్యాయవాదులకు అనుమతి నిరాకరణనంది నగర్ కేసీఆర్ నివాసం పై డ్రోన్ కలకలంకొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణనందినగర్ నివాసం పై డ్రోన్ కలకలంఅప్రమత్తమైన పోలీసులు నంది నగర్ కేసీఆర్ నివాసంలో ప్రారంభమైన సిట్ విచారణ.రెండో అంతస్తులో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న నలుగురు అధికారుల బృందం.మొత్తం విచారణలో పాల్గొన్న 15 మంది అధికారులు.కేసీఆర్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న సిట్ బృందంసిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావున్యాయ సహాయం కోసం అందుబాటులో రామచంద్రరావుకుటుంబ సభ్యుడిగా ఇంట్లోనే మరో ఫ్లోర్ లో ఉండనున్న కేటీఆర్విచారణ తర్వాత నందినగర్ నివాసంలో పార్టీ ముఖ్యనేతలను కేసీఆర్ కలిసే అవకాశంవిచారణ ముగిశాక నందినగర్ కు తరలివెళ్ళనున్న బీఆర్ఎస్ క్యాడర్బాల్కానీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అబివాదం చేసే అవకాశం?ట్రంక్ పెట్టెలు,డాక్యుమెంట్స్ కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ బృందంసిట్ బృందంలో నారాయణ రెడ్డి, రవీందర్.సిట్ అధికారులతో పాటు మరో ఐదుగురు సీఐ స్థాయి అధికారులు.రెండు ట్రంక్ పెట్టెలు, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన సిట్ బృందంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు కేసీఆర్ ఇంటిలోని రెండో అంతస్తు గదిలో విచారణ విచారణ గదిని పరిశీలించిన అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావువిచారణ దృష్ట్యా కేసీఆర్ నందినగర్ నివాసంలో మూడంచెల భద్రతవిచారణ గదిలోకి లాయర్ల అనుమతి నిరాకరించిన సిట్ బృందం కేసీఆర్ ఒక్కరినే విచారణ చేయనున్న అధికారులు డీఐజీ విజయ్ కుమార్ ఆధ్వరంలో నలుగురు అధికారులు బృందం విజయ్ కుమార్, వేంకటగిరి,కేఎస్ రావు, శ్రీధర్ అధికారుల బృందం మూడు గంటలకు ప్రారంభం కానున్న విచారణ కేసీఆర్ వెంట డాక్యుమెంట్స్..నందినగర్ నివాసం వద్ద కేసీఆర్‌ని రిసీవ్ చేసుకున్న కేటీఆర్.ఫామ్ హౌస్ నుంచి ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన కేసీఆర్.సిట్ అడిగే ప్రశ్నలను నోట్ చేసుకోనున్న కేసీఆర్.నంది నగర్ ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.కేసీఆర్ నివాసానికి చేరుకున్న విచారణ యంత్ర సామాగ్రి.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్.మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ విచారణ ప్రారంభం.కేసీఆర్‌ను ప్రశ్నించే సిట్ టీం ఇదేఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్మధ్యాహ్నాం 3గం. ప్రారంభం కానున్న విచారణనందినగర్లోని నివాసం వద్ద భారీ బందోబస్తునాలుగు అంచెల పోలీస్ వ్యవస్థ.. వందల మంది పోలీసుల కాపలాఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ఇంతకు ముందు విచారణలో క్రియాశీలకంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి.. ఇవాళ్టి విచారణకు మాత్రం దూరం!కేసీఆర్‌ను విచారించే టీంలో.. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్‌కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావులువిచారణ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ కేఎస్ రావుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతల విచారణబీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యల విచారణకల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. బీఆర్ఎస్ కీలక నేతలు.. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుల విచారణఇప్పుడు కేసీఆర్ విచారణనందినగర్ చేరుకున్న కేసీఆర్..కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు.మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను విచారించనున్న సిట్. విచారణను వీడియో తీయనున్న పోలీసులు. కేసీఆర్ ఇంటికి సిట్.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ బృందం, పోలీసులు. నందినగర్ కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో విచారించనున్న సిట్.కేసీఆర్ ఇంట్లో విచారణ గదిని పరిశీలిస్తున్న పోలీసులు.కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం.నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరణ.కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్, సంతోష్‌కు మాత్రమే అనుమతి.విచారణను వీడియో రికార్డు చేయనున్న అధికారులు.ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ బృందం.పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు. భారీగా ట్రాఫిక్ జామ్.. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.గజ్వేల్ నుండి వంటి మామిడి వరకు భారీ ట్రాఫిక్.వంటి మామిడి దగ్గర కేసీఆర్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి.మిగతా వాహనాలను నిలిపివేసిన పోలీసులు.తుర్కపల్లి దాటిన కేసీఆర్ కాన్వాయ్.కాసేపట్లో నందినగర్ చేరుకోనున్న కేసీఆర్పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు.కేసీఆర్ నివాసానికి వెళ్లే వీధులన్నీ మూసివేసిన పోలీసులు.నందినగర్ వద్ద నాలుగు అంచెల పోలీసు భద్రత. నందినగర్ నివాసంలో ఉన్న హరీష్ రావు. రోడ్లన్నీ గులాబీమయం..ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌కు బయలు దేరిన కేసీఆర్.కేసీఆర్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ అభిమానులు. రోడ్డు మార్గంలో అభిమానులకు అభివాదం చేసిన కేసీఆర్.వందలాది వాహనాల్లో కేసీఆర్ వెంట నందినగర్‌కు వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..ఖమ్మం జిల్లా..మాజీ సీఎం కేసీఆర్‌కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై నిరసనలు.ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..అజయ్ కుమార్ కామెంట్స్...ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధండైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేసీఆర్‌కు నోటీసులు..ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కి ఏం సంబంధం?గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారు?.ఇది మరొక ఫేక్ కేసు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్. కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పుకాస్త ఆలస్యంగా నందినగర్ నివాసానికి కేసీఆర్మరికాసేపట్లో బయల్దేరనున్న బీఆర్ఎస్ అధినేత12.30కి నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశంబీఆర్ఎస్ నేతల భేటీ వాయిదా పడే చాన్స్?నేరుగా సిట్ విచారణకే హాజరు కానున్న గులాబీ బీస్??తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కేసీఆర్ సిట్ విచారణ వేళ.. తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్‌లు పంపిన ఇంటెలిజెన్స్బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాలుముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారుల ఆదేశాలువిచారణ పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలని సూచనఎక్కడికక్కడే అప్రమత్తమైన పోలీసులురాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడికక్కడే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుఇప్పటికే విచారణ జరిగే నందినగర్ నివాస ప్రాంతంలో 1,000 మంది దాకా పోలీసుల మోహరింపుతెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ నేతలను ఎక్కడిక్కడే హౌజ్ అరెస్ట్ చేసే అవకాశంఎర్రవల్లి గ్రామస్తుల వెరైటీ నిరసనఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద వినూత్న నిరసనసీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలుకేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహంకేసీఆర్ ఫొటోకు దిష్టి తీసిన ఎర్రవల్లి గ్రామస్తులుఫాంహౌజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులురాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుతెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలుకేసీఆర్కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనలుబైక్ ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేస్తున్న కేడర్ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులుకేసీఆర్ సిట్ విచారణ టైంలో.. తెలంగాణ భవన్‌లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతాతెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ వేళ.. నగరంలో ఉద్రిక్త వాతావరణంతెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులుతెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ ఆంక్షలుభవన్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలునందినగర్లో.. 800 మంది పోలీసులునందినగర్ ఏరియాలో భారీగా పోలీసుల ఆంక్షలుకేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపునందినగర్ బస్టాప్, బసవతారకం, స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ మార్గాల్లో డైవర్షన్లు.. భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల కంట్రోల్‌కు బారికేడ్లు సైతం ఏర్పాటుమరికాసేపట్లో నందినగర్ నివాసానికి రానున్న కేసీఆర్నందినగర్ నివాస పరిసరాల్లో.. ఐదు అంచల భద్రతసుమారు 800 మంది పోలీసుల మోహరింపుమధ్యాహ్నాం విచారణకు రానున్న సిట్ అధికారులుHeavy police deployment was seen near KCR’s residence in Nandi Nagar as the former chief minister prepares to appear before the SIT. The state police have been placed on high alert as a precautionary measure.#KCR #NandiNagar #Telangana #TelanganaPolitics #SITInquiry… pic.twitter.com/3lQzn6fr1g— Hyderabad Mail (@Hyderabad_Mail) February 1, 2026మరికాసేపట్లో నందినగర్ నివాసానికి కేసీఆర్ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్‌కు నివాసానికి పాముల పర్తి, గౌరారం, ములుగు, వంటి మామిడి, షామీర్ పేట, జేబీఎస్ మీదుగా చేరుకోనున్న బీఆర్ఎస్ అధినేత ఫామ్‌హౌజ్‌లో విచారించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిట్నగర పరిధిలోనే విచారణ సాధ్యమని పేర్కొంటూ.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ఆధారంగా నందినగర్ నివాసానికి నోటీసులునందినగర్ నివాసంలో కీలక భేటీ నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీసిట్ విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యతమరికాసేపట్లో నివాసానికి చేరుకోనున్న కేసీఆర్రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్న హరీష్ రావుకేటీఆర్తో పాటు మరికొందరు కీలక నేలలతో కాసేపు చర్చించనున్న కేసీఆర్ఇటు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు నగర శివారు ముఖ్య నేతలకు గులాబీ బాస్ ఆదేశంకేసీఆర్ విచారణకు నిరసనగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన ర్యాలీలు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ నేపథ్యంలో నిర్ణయంఎక్కడిక్కకడ శాంతియుత నిరసనలు చేయాలని కీలక నేతల పిలుపు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలుఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామంఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణఇప్పటిదాకా పోలీస్ అధికారులు, కేసీఆర్ పేషీ అధికారులు, బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించిన సిట్వాళ్ల నుంచి వాంగ్మూలాల సేకరణఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామన్న పోలీస్ ఉన్నతాధికారులువాళ్ల వాంగ్మూలాలను ముందుంచి కేసీఆర్‌ను విచారించే అవకాశంట్యాపింగ్ కేసులో సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కేసీఆర్‌కు నోటీసులుసాక్షిగానే కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నాం 3గం.ల నుంచి కేసీఆర్‌ను విచారించనున్న సిట్ అధికారులుకేసీఆర్ను ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పీఎస్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం -
నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్‌కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్‌పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. ‘సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్ నందినగర్‌లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు ‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నందినగర్‌కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో క్రైమ్ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్‌కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ ఆదివారం ఉదయం నందినగర్‌కు చేరుకోనున్నారు. -
రేపు సిట్ విచారణకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ రానున్నారు.సిట్‌కు కేసీఆర్.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్.. తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదు...హరీష్‌రావు ఆఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్‌గా నందినగర్ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు..!
-
‘రేవంత్ కక్ష సాధింపు.. తెలంగాణ తేవడమే కేసీఆర్ నేరమా?’
సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్ఎస్పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. -
కేసీఆర్‌పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. రేపు(ఫిబ్రవరి 1న) మధ్యాహ్నాం 3గం. టైంలో నందినగర్ నివాసంలో విచారణకు తమకు అందుబాటులో ఉండాలని ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో విచారణ జరపాలన్న ఆయన విజ్ఞప్తిని టెక్నికల్ రీజన్ చూపిస్తూ తిరస్కరించింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని.. అందుకే ఆ ఇంటికి నోటీసులు అంటించామని సిట్ చెబుతోంది. అయితే గోడకు అంటించే నిబంధన ఏదీ లేదని.. పైగా ఇలా అంటించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లీగల్ టీం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు.. హరీష్‌రావు అఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉందని.. అయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌కే సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేసు విచారణకు సంబంధించి నోటీసులు పంపడం కోసం రిజిస్టర్డ్ పోస్టు, కోర్టు తదితర ప్రక్రియల ద్వారా సర్వ్ చేయడం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. గోడకు అతికించడం సరైన నోటీసు సర్వ్ చేసినట్లుగా పరిగణించబడదని.. ఈ లెక్కన కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అంటోంది. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల మాట మరోలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. (రాజేంద్ర కుమార్ వర్సెస్ యూపీ అవాస్ ఎవమ్ వికాస్ పరిషత్ సివిల్ అప్పీల్ నెం. 14604 of 2024 ప్రకారం).. ఇంటి గోడలపై నోటీసులు, ప్రకటనలు అతికించడం వంటి చర్యలు చట్టబద్ధం కాదు. ఇది ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కిందకే వస్తుంది. దీనికిగానూ జరిమానా, శిక్షలు విధించవచ్చు. కానీ, కేసీఆర్‌కు సిట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం జారీ చేసింది. దర్యాప్తు జరుగుతున్న కేసులో సాక్షిగా లేదంటే విచారణ కోసం ఓ వ్యక్తిని పిలిచే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది సాధారణంగా అఫిక్స్డ్ నోటీసు (Affixed Notice) అనే ప్రక్రియలో భాగమేనని అంటున్నారు. ఒక వ్యక్తి నోటీసు స్వీకరించనప్పుడు లేదంటే ఆ నోటీసుల స్వీకరణకు గనుక అందుబాటులో లేకపోతే కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థలు ఇలా ఇంటి గోడలకు నోటీసులు అతికించడం ద్వారా సర్వ్ చేసినట్లుగా పరిగణిస్తాయి. కాబట్టి.. ఈ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం తప్ప బీఆర్ఎస్కు మరొ మార్గం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపే విచారిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్‌లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. సీఆర్పిసీ సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం ఇచి్చన నోటీసులకు స్పందించిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్‌కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజా నోటీసులు ఇచ్చారు. ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు. సుదీర్ఘంగా చర్చించి.. కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో..గురువారం ఇచి్చన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. లేదంటే హైదరాబాద్‌లో మీరు చెప్పిన చోటుకే మేము వస్తామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఎంచుకోవాలని కేసీఆర్ కోరారు. విచారణ కోసం ఎర్రవల్లికి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ శుక్రవారం న్యాయ నిపుణులతో భేటీ అయింది.సుదీర్ఘ మంతనాల తర్వాత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల అఫిడవిట్లు, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల్లో ఉన్న నివాస చిరునామా ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ‘మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, అలాగే సీఆర్పీసీ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం, అధికారిక రికార్డుల్లో ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ నిర్వహించేందుకు దర్యాప్తు అధికారి నిర్ణయించారు..’అని వెల్లడించారు మీరు కోరినట్లుగా ఎర్రవల్లిలో విచారించడం కుదరదని చెప్తూ.. అధికారిక రికార్డుల్లో ఉన్న నివాసాన్నే (నందినగర్‌లోని ఇల్లు) విచారణ స్థలంగా నిర్ణయించిన విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.అదే సమయంలో..‘విచారణ సందర్భంగా అనేక సున్నిత ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డుల పరిశీలన అవసరం. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా హైదరాబాద్ నివాసం (నందినగర్)లో విచారణకు అందుబాటులో ఉండగలరు..’అని సిట్ స్పష్టం చేసింది. కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ సీఆర్పిసీలోని సెక్షన్ 160 ప్రకారం జరిగే ఈ విచారణకు సంబంధించి చట్టంలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడి పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలకు చెందిన వాళ్లు ఫలానా ప్రాంతానికి వచ్చి తమ వాంగ్మూలం నమోదు చేసుకోవాలని కోరే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో నోటీసుపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. -
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్
-
కేసీఆర్‌కు సిట్ సెకండ్ నోటీసు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని సిట్ పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళే రెండో నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్‌కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చింది. వయసురిత్యా(65 ఏళ్లు పైబడడంతో) పీఎస్కే రావాల్సిన అవసరం లేదని.. నగర పరిధిలోనే ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నోటీసులను నందినగర్‌లోని నివాసానికి వెళ్లి కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులు అందజేశారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడి నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్‌కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. కానీ ఫాంహౌజ్‌లోనే తనను విచారణ జరపాలని సిట్‌ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తోంది. వీలైతే ఇవాళ సెకండ్ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ జరపొచ్చని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సాక్షిగా పరిగణిస్తూ సీఆరీ్పసీలోని సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలిసిన సమాచారం ఇవ్వాలని ఆయన్ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటివరకు కొందరు ప్రభుత్వ అత్యున్నత అధికారులు మినహా అందర్నీ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో సిట్ అధికారులు చట్ట ప్రకారం ఆయనకు ఓ వెసులుబాటు ఇచ్చారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. అలా కాకుంటే మీరు కోరిన చోటుకే తాము వస్తామంటూ పేర్కొన్నారు. నందినగర్ నివాసానికి వెళ్లి.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తొలుత ఇందులో కేవలం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉన్నారు. దీని దర్యాప్తు కోసం తొలుత అనధికారిక సిట్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడిస్తూ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారింది. సిట్ బృందం ప్రణీత్‌రావుతో పాటు మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేసింది.మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత ఏడాది వరకు సిట్ అధికారులు కేవలం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, బాధితులతో పాటు ఇతరుల్నీ విచారించారు. కాగా గత నెలలో ఈ కేసు దర్యాప్తు కోసం డీజీపీ బి.శివధర్‌రెడ్డి అధికారిక సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్‌ను దీనికి చీఫ్‌గా నియమించారు.ఆ తర్వాత దూకుడు పెంచిన సిట్ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకు నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ నెల 19న మాజీ మంత్రి హరీశ్‌రావు, 22న మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 27న మాజీ ఎంపీ సంతో‹Ùరావులకు నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయంలో విచారించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించడంతో పాటు వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎర్రవల్లి నివాసంలో కుదరదు..! విచారణ జరిగే ప్రాంతానికి కేసు దర్యాప్తు అధికారితో పాటు మరికొందరు కూడా రావాల్సి ఉంటుందని కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ వివరించింది. ఎర్రవల్లి నివాసంలో విచారణ కుదరదని పరోక్షంగా స్పష్టం చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతాన్ని చెప్పాలని కోరింది. ఎక్కడకు వచ్చి విచారించాలనే సమాచారాన్ని కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి తెలపాలని సూచించింది. బందోబస్తుపై పోలీసుల దృష్టి.. కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచి్చనా.. అధికారుల బృందం నందినగర్‌లోని ఇంటికి వెళ్లాల్సి వచి్చనా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆయా మార్గాలతో పాటు పరిసరాలనూ గమనించారు. ఎక్కడెక్కడ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి? ఎక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లింపులు విధించాలి? అనే అంశాలను పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహంబంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజ రుకావాలంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలతో పా టు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. -
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.ఇవాళ.. కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్
-
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్‌కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
-
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు(శుక్రవారం, జనవరి 30న) కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నాం 3గం. విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్నవాళ్లు.. దర్యాప్తు కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. వయసురిత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పీఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి దశలో బీఆర్ఎస్ హయాంలో పని చేసిన పోలీస్ అధికారులను, కేసీఆర్ పేషీలో పని చేసిన ఉన్నతాధికారులను సిట్ ప్రశ్నించింది. వీళ్లిచ్చిన స్టేట్మెంట్లతో రెండో దఫా విచారణలో.. వరుసగా రాజకీయ నేతలను సిట్ విచారణ జరుపుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.అయితే ఇదొక లొట్ట పీసు కేసు అని, పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నోటీసుల అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఎక్స్టెన్షన్, పోస్టింగులు.. ఫోన్ల ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన రాత్రి 10.50 గంటలకు తిరిగి వెళ్లారు. ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు సుదీర్ఘ కాలం ఆయా విభాగాల్లో పని చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ద్వారా విధులు నిర్వర్తించారు. కాగా ఈ ఇద్దరు అధికారుల ఎక్స్‌టెన్షన్‌తో పాటు ఎస్ఐబీ, టాస్‌్కఫోర్స్‌ల్లో పని చేసిన మరికొందరి పోస్టింగుల వెనుక సంతోష్‌కుమార్ పాత్ర ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ కోణంలోనే కొన్ని కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయా అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎవరు తయారు చేయించారు? పోలీసు విభాగంతో పాటు హోం సెక్రటరీ ఆమోదం పొందేలా ఎవరు చేశారు? వీటిలో మీ పాత్ర ఏమిటంటూ ఆరా తీసినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయా అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ కుమార్ చెప్పినట్లు సమాచారం. ఫోన్లు ట్యాప్ చేయించారనే కోణంలో.. మరోపక్క 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సమయంలో కొన్ని ఫోన్ నంబర్లను ఎంపిక చేసిన సంతోష్ కుమార్ వాటిని ట్యాప్ చేయించడంతో పాటు నిఘా ఉంచినట్లుగా సిట్ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర వాంగ్మూలం నమోదు చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సంతోష్‌కుమార్‌కు స్పష్టం చేసింది. ఇలావుండగా త్వరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కూడా సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. తనతో పాటు తన భర్త, కీలక అనుచరుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను విచారించాలని సిట్ భావిస్తోంది. మొక్కల పంపిణీకి యత్నం బంజారాహిల్స్: సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో.. పోలీసు అధికారులకు, పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చిన వారికి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండేషన్ తరఫున మొక్కలు పంపిణీ చేయాలని సంతోష్ కుమార్ భావించారు. దీంతో కార్యకర్తలు ఆటో నిండా పూల మొక్కలు తీసుకుని పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు కొద్ది దూరంలో మొక్కలు పంచేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. -
సజ్జనార్ Vs RS ప్రవీణ్ కుమార్ ముదురుతున్న వివాదం
-
ఈరోజు సిట్ ముందుకు BRS మాజీ ఎంపీ సంతోష్ రావు
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆటలాడుతున్నాయి: రామచందర్ రావు
-
MLA Adi: ఫోన్ ట్యాపింగ్ పై.. మీ చెల్లి ఆరోపణలకు సమాధానం చెప్పు
-
ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: రామచందర్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.బీజేపీ కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరిగాయి. కర్పూరి ఠాకూర్ జీవితం కార్యకర్తలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయి. రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ ఉండాలి. అరెస్టులు చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఛార్జ్షీట్లు, తెలంగాణలో ఎందుకు కాదు?. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ ఆరోపణలకు విలువ లేదు. అధికారులపై మాత్రమే చర్యలు ఉన్నాయి. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు?. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
భయపడేదే లేదు
సాక్షి, హైదరాబాద్: ‘సిట్ అధికారులు నన్ను ఏ కారణంతో పిలిచారో తెలియదు. అడిగిన ప్రశ్నలనే మళ్లీమళ్లీ అడిగారు. సిట్ విచారణకు భయపడేదే లేదు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సుమారు ఏడు గంటలపాటు సాగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘సిట్ అధికారులు ఒక టీవీ సీరియల్ తరహాలో సాగదీత ధోరణిలో ప్రశ్నలు వేసి 300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు. విచారణ పేరిట గంటలకొద్దీ టైంపాస్ చేయడం మినహా వేరే విషయమంటూ లేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే..‘గత రెండేళ్లుగా ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలు, అవినీతిని బీఆర్ఎస్ నాయకత్వం నిత్యం ఎండగడుతుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం రేవంత్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నాడు. ఏదో ఒక కథను సృష్టించి ప్రజలను భ్రమింప చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎవరినో పక్కనపెట్టి నన్ను విచారణ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. సిట్ విచారణలో కేటీ రామారావు తప్ప ఇంక ఏ రావూ లేడు. మంత్రులతోపాటు మా ఫోన్లు కూడా ప్రస్తుతం ట్యాప్ అవుతున్నాయని ఈరోజు జరిగిన విచారణలో బయటపడింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లీకుల పేరిట కథనాలకు బాధ్యులెవరు? ‘రెండేళ్లుగా లీకులిస్తూ మీడియాలో వచ్చే కథనాలతో మా పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరని సిట్ అధికారులను ప్రశ్నిస్తే.. మీడియా రాస్తే మాకేం సంబంధం అంటూ సిట్ చేతులు దులుపుకుంది. విచారణ పేరిట లీకులివ్వడం మంచి పద్ధతి కాదని చెప్పా. యూట్యూబ్ చానళ్లు, మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమైతే సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని అడిగా. లీకుల పేరిట నడిపిన కథనాలు, మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభ, మా వ్యక్తిత్వ హననం దృష్ట్యా లీకులను నిరోధించాలని కోరా. ప్రభుత్వం ఇచ్చే లీకుల ఆధారంగా వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.మా ఎమ్మెల్యేలు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో లేదో చెప్పాలని సిట్ అధికారులను అడిగితే సంబంధం లేదని నీళ్లు నములుతున్నారు. ఓ మంత్రి కూడా ఆయన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ చేసిన వ్యాఖ్యలపైనా సిట్ అధికారులు తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంతోపాటు కాంగ్రెస్ మంత్రులు, నేతలపై వస్తున్న ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. -
RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
-
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
-
ట్యాపింగ్ నేరమేం కాదు.. ఆ మాట రేవంతే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్ డైవర్షన్చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్, హరీష్ పోరాడుతున్నారు. ఈ-కార్ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. అదొక చెల్లని సిట్ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్‌తో మరొక సిట్ వేశారు. ఈ సిట్‌కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్‌కు చీఫ్‌గా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్‌పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్‌పై విచారణ జరగాలి. నిజంగా సిట్ వేయాలనుకుంటే.. చెక్ డ్యామ్‌లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్ స్కామ్‌పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్ వేశారు. దేశ రక్షణపై రేవంత్‌రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్. -
కేటీఆర్ కు సిట్ సూటి ప్రశ్నలు ఇవే..!
-
చిరు నవ్వుతో.. సిట్ విచారణకు కేటీఆర్
-
ఇది అంతులేని కథలా.. సిట్ విచారణ వేళ కేటీఆర్ (చిత్రాలు)
-
కాంగ్రెస్‌లో దండుపాళ్యం ముఠా.. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అంతులేని కథలా సాగుతోందని.. నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ కేసులో సిట్ విచారణ బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారాయన. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎన్నికేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అని కేటీఆర్ అన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా.. అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఉంది. ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులు? రేవంతా? అధికారులా?. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదేళ్లపాటు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేశా. ప్రభుత్వం పోలీసులు కలిసి గత రేండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఎంక్వైరీలకు భయపడేది లేదు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. అయినా పిలిస్తే 10సార్లు విచారణకు వెళ్తా.. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు చెప్పారు. ఆ కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు. అలా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రొగ్రాం అని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వాళ్ల దోపిడీ బయటపెడతామనే నోటీసులు, విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని కేటీఆర్ అన్నారు. -
సిట్ ముందుకు కేటీఆర్
-
కేటీఆర్ విచారణపై సిట్ ప్రకటన
కేటీఆర్ సిట్ విచారణ.. లైవ్ అప్డేట్స్కేటీఆర్ విచారణపై సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా సజ్జనార్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెం. 243/2024 కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు అనుగుణంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు 23 జనవరి 2026న ఒక నోటీసు జారీ చేయబడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:00 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించబడింది.నోటీసుకు అనుగుణంగా కేటీఆర్.. సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయనను వివరంగా విచారించడం జరిగింది. కేసులోని సంబంధిత అంశాలను రాబట్టడం జరిగింది. వాటిని రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నారు. ఆయన ఏ సాక్షులను సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆదేశించబడింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం.రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, ప్రముఖులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది పౌరులపై విస్తృతంగా అనధికారిక, చట్టవిరుద్ధమైన ఫోన్ నిఘా, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన క్రైమ్ నెం. 243/2024 కేసు విషయంలో మాత్రమే కేటీఆర్‌ను ఈరోజు విచారించడం జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని పేర్కొంటూ, కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు తప్పుదోవ పట్టించే నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు గమనించబడింది. దర్యాప్తు సంస్థ ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం కలిగి లేదు. దర్యాప్తు చట్టానికి అనుగుణంగా, నిష్పక్షపాతంగా వృత్తిపరంగా నిర్వహించబడుతోంది.In continuation of the further investigation in Crime No. 243 of 2024 of Panjagutta Police Station, and pursuant to the constitution of a Special Investigation Team (SIT), a notice was issued to Sri K. T. Rama Rao, former Minister and MLA, Sircilla, on 23 January 2026, directing… pic.twitter.com/R5QPjfxrDZ— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 23, 2026 కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్మీట్తెలంగాణ భవన్‌కు బయల్దేరిన కేటీఆర్ముగిసిన విచారణకాసేపట్లో బయటకు రానున్న కేటీఆర్. కేటీఆర్‌ను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించిన సిట్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు కేటీఆర్ విచారణసీరియల్లా సిట్ విచారణ : బండి సంజయ్సిట్ విచారణ సీరియల్లా ఉందిప్రభుత్వ పెద్దల డైరైక్షన్లోనే సిట్ విచారణసిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదుకేటీఆర్ను ఎందుకు విచారణకు పిలిచారు కొనసాగుతున్న సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు కేటీఆర్‌తో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావులను కలిపి ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదుదేశ భద్రత కోసం అత్యంత గొప్యంగా జరపాల్సిన ట్యాపింగ్ విషయాన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారుకు ఇడ్చారుహరీష్ రావు, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ సంపద కాపాడందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది తెలంగాణ సంపద నైనీ కోల్ బ్లాక్‌ను దోచుకునే ప్రయత్నం చేస్తే కేటీఆర్,హరీష్ రావు అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్, పార్మలా ఈ రేసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై టైమ్ పాస్ చేస్తోంది సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌ను సిట్ పేరుతో వేదించడం ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదుస్వాతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేస్తారు.దేశ అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తోంది.ఆనాడు దివంగత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు.టెలిఫోన్ ట్యాపింగ్ తప్పుకాదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ కేవలం పోలీసులు మాత్రమే చేస్తారు.ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు.దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా సీఎం రేవంత్ వ్యవహార శైలి ఉంది.మంత్రులు, సీఎం ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు!ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదుప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్యాపింగ్‌ను వాడుతున్నారురేవంత్ రెడ్డికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు.సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.పంజాగుట్ట కేసులో వేసిన ఎస్ఐటీ చట్ట వ్యతిరేకంఆ సిట్ సభ్యులు 350 మందిని విచారించారు.ఆ విచారణలో ఏ ఒక్కరూ కేటీఆర్, హరీష్ రావు పేరు చెప్పలేదు ఆ సిట్‌తో నాయకుల పేర్లు రాలేదు కాబట్టి... సజ్జనార్‌తో మరో సిట్ వేశారు.సజ్జనార్‌తో వేసిన సిట్ రెండోది.. నాయకులను వేధించే సిట్.. ఈ సిట్‌కు భాద్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు.ఆనాడు ఇంటలిజెన్స్‌లో సజ్జనార్,శివధర్ రెడ్డి ఉన్నారు.ఆనాడు రేవంత్ రెడ్డి 50లక్షలు ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డిని ఎలా పట్టుకున్నారు అనేది సజ్జనార్, శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలి.సిట్ నన్ను విచారణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేశాను కేటీఆర్ సిట్ విచారణసజ్జనార్ సిట్ ముందుకు కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ సిట్ ఏర్పాటుసజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిట్ సభ్యులుఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన ఏపీసీ పీ.వెంకటగిరి,ఎస్పీ ఎం.రవీందర్ రెడ్డి కేటీఆర్‌ను విచారించనున్న సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సభ్యులు సిట్ కార్యాలయం లోపలికి వెళ్లిన కేటీఆర్కేటీఆర్ ఒక్కడినే లోపలికి అనుమతించిన పోలీసులుహరీష్రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బయటేజూబ్లీహిల్స్ పీఎస్ బయట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీస్ బందోబస్తుసిట్ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణసిట్ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ వెంట హరీష్రావులోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులుతెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతసిట్ కార్యాలయానికి బయల్దేరిన కేటీఆర్ఆ సమయంలో కార్యకర్తల అత్యుత్సాహంఅడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులుతెలంగాణ భవన్ గేట్ వద్ద తోసుకున్న పోలీసులు, కార్యకర్తలుకాసేపు ఉద్రిక్తతగాయపడ్డ మహిళా కార్యకర్తలుసిట్ విచారణకు బయల్దేరిన కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కేటీఆర్ వెంట కీలక నేతలు పార్టీ శ్రేణులులోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులుసిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం.. భారీ బందోబస్తు ఏర్పాటుతెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్రెండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ప్రభుత్వం, పోలీసుల కుట్రనోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్ గేమ్బీఆర్ఎస్ ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మాదిరాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. పదేళ్లు రాష్ట్రం కోసమే పని చేశాంఅక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నాపై దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారుఈ వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు? సీఎం రేవంతా? అధికారులా?ఎమ్మెల్యేగా, మంత్రిగా చిత్తశుద్ధితో పని చేశా. ఎంక్వైరీలకు భయపడేది లేదు. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు అన్నందుకే నోటీసులు ఇచ్చారు సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రోగ్రాం మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వారి దోపిడీ బయటపెడతామనే మాకు నోటీసులు ఇస్తున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలను కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాఈ కేసుతో నాకు సంబంధం లేదుప్రజల దృష్టి మళ్లించేందుకే కుతంత్రాలుసీఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారుఅయినా పిలిస్తే పదిసార్లైనా విచారణకు వెళ్తాఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుమరికాసేపట్లో సిట్ విచారణతెలంగాణ భవన్లో కీలక నేతలతో కేటీఆర్ సమాలోచనలుతన న్యాయవాదులతో మాట్లాడుతున్న కేటీఆర్కేటీఆర్ వెంట సిట్ కార్యాలయానికి వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులుపోలీసులు అడ్డుకునే చాన్స్తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావుతెలంగాణ భవన్ వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుకోకాపేట టెంపుల్ ట్రీ నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుతొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ రానున్న కేటీఆర్కేటీఆర్తో పాటే హరీష్ రావుతెలంగాణ భవన్ చేరుకున్న కార్యకర్తలు, అభిమానులుపార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేటీఆర్10 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్10:30 కు బయలుదేరి జూబ్లీహిల్స్ పీఎస్‌కి వెళ్ళనున్న కేటీఆర్రాత్రి బీఆర్ఎస్ లీగల్ టీంతో సమావేశమైన కేటీఆర్,హరీష్ రావుఇప్పటివరకు ఈ కేసులో విచారించిన వ్యక్తులను ఏం ప్రశ్నించారు?కేటీఆర్‌ను ఏం ప్రశ్నించబోతున్నారు అనే విషయాలను బ్రీఫ్ చేసిన లీగల్ టీంబీఆర్ఎస్ నేతలు,ఓయూ విద్యార్థుల అరెస్ట్కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు సిట్ విచారణకు కేటీఆర్.. ఓయూ విద్యార్థుల అరెస్ట్అర్దరాత్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులుబీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపుజూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోన్ ట్యాపింగ్ కేసులో నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకేటీఆర్ను విచారించనున్న జాయింట్ సీపీ విజయ్ కుమార్,ఏసీపీ వెంకట గిరికేటీఆర్ విచారణ కోసం ప్రత్యేక ప్రశ్నలు సిద్దం చేసిన సిట్జూబ్లీహిల్స్ పీఎస్,తెలంగాణ భవన్ వద్ద భారీ భద్రతజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోలీస్ స్టేషన్‌కి రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు రంగంలోకి లోకల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్మరికాసేపట్లో కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు కేటీఆర్కేటీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా!కేటీఆర్‌కు వీరతిలకం దిద్దిన మహిళా నేతలుతెలంగాణ భవన్లో కీలక నేతలతో భేటీఅనంతరం మీడియాతో మాట్లాడే అవకాశంఅక్కడి నుంచే సిట్ విచారణకు కేటీఆర్.. కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సీపీ సజ్జనార్ నేతృత్వంలోని బృందంకేటీఆర్ను విచారించనున్న వెంకటగిరి అండ్ టీంఇంతకు హరీష్‌రావును విచారించిన ఇదే బృందంవిచారణకు రావాలంటూ నోటీసులుకేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులుసీఆర్పీసీ 160 సెక్షన్ కింద విచారణకు రావాలని పిలుపునందినగర్ నివాసంలోని వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేతఇవాళ ఉదయం 11గం. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు -
కేటీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా.. తాజాగా మరో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గురువారం నోటీసులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన పోలీసులు సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం నోటీసులు అందజేశారు. ఇలావుండగా ఈ కేసులో హరీశ్‌రావును మరోసారి విచారించాలని, మాజీ ఎమ్సెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకూ నోటీసులు ఇచ్చి వాంగ్మూలం నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది. కుల ప్రాతిపదికన నియామకాలు? బీఆర్ఎస్ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్ఎస్ పార్టీ పెద్దలే హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచి్చందని సిట్ ఆరోపిస్తోంది. అనుకూలంగా పనిచేసేందుకే..! ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్ఎస్ నేతలు ఇలా చేశారని చెబుతోంది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు తరచుగా కలుస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో కొనసాగడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే వారని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. ప్రభాకర్‌రావు తన నమ్మినబంటు ప్రణీత్‌రావును స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) నిర్వహణ కోసమే ఎస్ఐబీలోకి తీసుకువచ్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంటోంది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేయడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఆ నేతలతో పాటు వారి అనుచరులనూ టార్గెట్ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరేలా చేయడం వంటి లక్ష్యాలతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోఎస్ఓటీ ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నాయకులపైనా కన్ను! బీఆర్ఎస్ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కొందరి పైనా ప్రభాకర్‌రావు, ఆయన బృందం కన్నేశారని చెబుతోంది. కాగా వీరు ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణా పైనే దృష్టి పెట్టి భారీ మొత్తంలో పట్టుకున్నారు. ఈ పరిణామాలతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితుల వాంగ్మూలాలు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ వెనుక పెద్దలు ఉన్నారని సిట్ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు కొంత కీలక సమాచారం సేకరించడానికి కేటీఆర్‌ను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. హరీశ్‌ను ఇంకా ప్రశ్నించాలి.. హరీశ్‌రావును మంగళవారం పూర్తిస్థాయిలో ప్రశ్నించలేదని, మరికొన్ని అంశాలు మిగిలిపోయాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. కాగా కల్వకుంట్ల కవిత ఇప్పటికే అనేకసార్లు మీడియా ముందుకు వచ్చి తన ఫోన్ ట్యాప్ అయిందని, తన కుటుంబీకుల్నీ ప్రభాకర్‌రావు విడిచిపెట్టలేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10న విచారించనుండటంతో సిట్ దూకుడు పెంచింది. -
రేవంత్, సిట్.. టీవీ సీరియల్ వంటి డ్రామా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్ అనే విధంగా సిట్ వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదా? అని ప్రశ్నించారు. అడిగిందే అడిగి.. టైం పాస్ చేయడం తప్ప దీంట్లో మరేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్. పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఫోనట్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ మాదిరిగా నడుస్తోంది. కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది. ఇది మాత్రం అవ్వట్లేదు. టీవీ సీరియల్ డ్రామాలను తలపించేలా డ్రామాలు చేస్తున్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బలి అయ్యేది పోలీసు అధికారులే అని చెప్పుకొచ్చారు. ఇది ట్రాష్ కేసు.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. హరీష్ రావును అడిగిందే అడిగి టైమ్ పాస్ చేశారు. రేపు నాతో కూడా అదే చేస్తారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్‌ను అడుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదు?. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డిని విచారణకు పిలిచారా?. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సిట్ వేయాల్సింది ఎవరి మీదనో తెలుసా.. గూండాలతో భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి కొడుకుపై సిట్ వేయాలి. బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావమరిదిపై సిట్ వేయాలి. కంచె గచ్చిబౌలి భూముల్లో స్కామ్ జరిగింది. సిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు సిట్ వేయలేదన్నారు.హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారు. సాయంత్రం కల్లా సిట్ నోటీసులు అందాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అనేది నేడు జరుగుతోంది ఏం కాదు.. 1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా అదే ట్వీట్ చేస్తాడు. ఆయనకేం తెలుసో, లేదో నాకైతే తెలియదు. సిట్ విచారణకు బరాబర్ వెళ్తాను. అన్ని సమాధానాలు చెబుతాను అని అన్నారు. అలాగే, పరాభవం తప్పదనే భయంతో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రజల సౌలభ్యం కోసమే మేము జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారు. కొత్త జిల్లాల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సులభతరం అవుతుందని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ ఫలితాలు మించి మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సంపాదిస్తుంది. జిల్లాల ఏర్పాటుపైన కమిషన్ వేస్తున్నామంటున్నారు. కొత్త జిల్లాలైన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలను రద్దు చేయాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయమంటూ తుగ్లక్ పనులు చేస్తే ప్రజల చేత తిరస్కరించబడతారు. అధికార వికేంద్రీకరణ కొరకు కేసీఆర్ అడుగేస్తే మీరు చెరిపేయాలనుకుంటే ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. -
కేటీఆర్ కు సిట్ నోటీసులు
-
రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటా
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నోటీసుల్లో పస లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. విచారణ పేరిట సిట్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తూ ‘అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం’అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ముగ్గురు అధికారులు విచారణ జరుపుతూ మధ్యలో తరచూ బయటకు వెళ్లి ఫోన్లు మాట్లాడారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయట పెట్టినందుకే నాకు నోటీసులు ఇచ్చారు. సీఎంకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు నాపై ఇదివరకే అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలి. రేవంత్ కుంభకోణాలు కుండబద్ధలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంటా. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశం తర్వాత హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విచారణలో నేనే పోలీసులకు వంద ప్రశ్నలు వేశా. సమాధానాలు చెప్పలేక వారే ఉక్కిరిబిక్కిరి అయ్యారు.గతంలో నేనేమైనా హోం మంత్రిగా పనిచేశానా? ఫోన్ ట్యాపింగ్ అంశం నాకేం తెలుసు? అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా..’అని హరీశ్ తెలిపారు. కాగా సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా హరీశ్‌రావు..కేటీఆర్‌తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో నష్ట నివారణకే డైవర్షన్ ‘చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరవుతున్నా. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బొగ్గు స్కామ్‌తో పాటు వాటాలు పంచుకోవడంలో మంత్రులు తన్నుకుంటున్న వైనాన్ని బయట పెట్టా. మున్సిపల్ ఎన్నికలకు ముందు తమ అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందనే రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్‌కు, ప్రస్తుతం నాకు నోటీసులు ఇచ్చి ఎన్నికల మీద మేము దృష్టి కేంద్రీకరించకుండా కుట్రలు పన్నుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే విచారణ జరపాలి ఫోన్ ట్యాపింగ్ పేరిట రేవంత్ రెండేళ్లుగా సీరియల్ నడుపుతున్నాడు. ఎంతగా పక్కదారి పట్టించినా బొగ్గు, విద్యుత్, హిల్ట్ కుంభకోణాలను బయట పెట్టడమే కాకుండా, ఆంధ్రాకు అమ్ముడు పోయిన తీరుపై నిలదీస్తాం. కుంభకోణంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నా. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే రేవంత్ తన బావమరిదితో కలిసి చేస్తున్న కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి. నైనీ బ్లాక్‌తో పాటు ఇతర టెండర్లు రద్దు చేసి అవినీతిపరులను అరెస్టు చేయాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్ కేటీఆర్ మంగళవారం ఉదయం కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నేతలు భారీ కాన్వాయ్‌తో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిట్ విచారణ కోసం వెళ్లేందుకు బయలుదేరిన హరీశ్‌రావును అనుసరించేందుకు ప్రయతి్నంచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావుకు ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్న కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. -
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లతో సంబంధం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావును ప్రశ్నించింది. కొన్ని కీలకాంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా చానెల్ అధినేత శ్రవణ్‌రావులతో జరిగిన సంప్రదింపులు, సమాచార మారి్పడి ప్రధాన అంశాలుగా అధికారులు ప్రశ్నలు సంధించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగానూ కొంత వివరణ కోరారు. ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ శ్రవణ్ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్‌రావు అక్కడే ప్రణీత్‌రావును కలిశారు. శ్రవణ్ తనకు ఉన్న పరిచయాలను వినియోగించి రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారని, వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది సిట్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లతో సంబంధం ఏంటి? అని హరీశ్‌రావును ప్రశ్నించింది. వివిధ కోణాల్లో ప్రశ్నలు ఈ ముగ్గురితో 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావుతో హరీశ్‌రావు సంప్రదింపులు జరిపారని, వీరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్‌రావుతో పాటు హరీశ్‌రావు ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో మాజీ మంత్రిని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు లబ్ధి చేర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనూ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడంతో పాటు అధికార పక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రశ్నించారని తెలిసింది. ఏమీ లేదు.. అంతా తూచ్!: హరీశ్‌రావు తన న్యాయవాదితో కలిసి జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అయితే న్యాయవాదిని అనుమతించని పోలీసులు కేవలం హరీశ్‌రావుతోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రమే లోపలకు పంపారు. ఉదయం 10.57 గంటలకు లోనికి వెళ్లిన హరీశ్‌రావు సాయంత్రం 6.25 గంటలకు బయటకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి, సంయుక్త పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్, డీసీపీ రితిరాజ్ తో కూడిన బృందం ఆయన్ను విచారించింది. విచారణ ముగిసి బయటకు వచి్చన హరీశ్‌రావు మీడియాను ఉద్దేశించి ‘ఏమీ లేదు.. అంతా తూచ్..ఉత్తిదే’అంటూ వెళ్లిపోయారు.అరెస్టులు.. అస్వస్థత.. ఉద్రిక్తత మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి తెలంగాణ భవన్‌కు వచి్చ, సిట్ ఎదుట హాజరైన హరీశ్‌రావు.. విచారణ తర్వాత కూడా అక్కడికి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై ఆందోళనకు దిగడంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తల అరెస్టు సందర్భంలోనూ ఠాణా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
హరీష్ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్ విసిరారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్‌కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్‌లో ఎంతటి వారున్న శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై హరీష్ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ ఏమీ తెలియదు. టెలిగ్రాఫిక్ యాక్టు చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కేటీఆర్‌కు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు. నా ఫోన్, షబ్బీర్ అలీ ఫోన్ సహా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలు విన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. మహిళా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూశారు. తప్పు చేశారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ వేధింపులు కానే కాదు, వేధింపులకు పాల్పడాలంటే రెండేళ్ల వరకు ఎందుకు వేచి చూస్తాం. అప్పుడే జైలుకు పంపే వాళ్లం అని వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘గతంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని నన్ను కూడా విచారణకు పిలిచారు. నా కుటుంబ సభ్యులు, మా ఇంటి వాచ్మెన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయంలో నాపైనే అధికంగా కేసులు పెట్టారు. గాంధీభవన్ లోపలికి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్‌తో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
-
SIT Investigation: తెలంగాణ భవన్ కు హరీష్ రావు
-
సిట్ విచారణకు హరీష్ రావు!
-
‘తాటాకు చప్పుళ్లకు భయపడం’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్‌లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పరిణామంపై హరీష్ రావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెట్టా. సాయంత్రం తొమ్మిదిగంటల సమయంలో హైదరాబాద్‌లోని నా నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను నా నియోజకవర్గం సిద్ధిపేటలో పలు కార్యాక్రమాల్లో పాల్గొన్నాను. అయినప్పటికీ.. చట్టం మీద గౌరవంతో హైదరాబాద్‌కు వచ్చా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను. అక్రమాలు, బొగ్గు, భూస్కాం, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ నోటీసులు కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హై కోర్టు, సుప్రీం కోర్టులో కొట్టేశారు. అయినా మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా?’అని ప్రశ్నించారు. -
ముగిసిన హరీష్ విచారణ.. ఏడు గంటలు ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ ముగిసింది. ఈ కేసులో హరీష్ రావును సిట్.. దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. హరీష్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ నుంచి హరీష్.. తెలంగాణ భవన్ బయలుదేరారు. కాగా, కాసేపట్లో తెలంగాణభవన్‌లో హరీష్.. మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హరీష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది చిల్లర రాజకీయం చేస్తున్నారు. అంతా ట్రాష్.. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం. ప్రతీ నిమిషానికి అధికారులకు పై ఫోన్లు, ఆర్డర్స్ వచ్చాయి. మా లీగల్ టీమ్‌ను మాత్రం లోపలికి అనుమతించలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొనసాగుతున్న హరీష్ విచారణసాక్షిగా పిలిచి ఏడు గంటల పాటు స్టేషన్లో ఉంచడంపై న్యాయవాదుల అభ్యంతరం.విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణ.పీఎస్ ఎదుట పలుమార్లు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన.బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.బీఆర్ఎస్ మహిళా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.డీఎసీలం వాహనాల్లో నాయకుల తరలింపు. జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు జూబ్లీహిల్స్ పీఎస్‌లో హరీష్‌రావు.. కొనసాగుతున్న సిట్ విచారణజూబ్లీహిల్స్ పీఎస్‌లో కొనసాగుతున్న హరీష్‌రావు విచారణహరీష్ను ప్రశ్నిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల ఉత్తర్వులను సిట్‌కు అందజేసిన హరీష్రావుఇప్పుడూ ఏం తేలదు: హరీష్‌రావు లాయర్హరీష్రావు వెంట లాయర్ రామచందర్రావును లోపలికి అనుమతించని సిట్కోర్టులే హరీష్‌రావుకు క్లియరెన్స్‌లు ఇచ్చాయిఫోన్ట్యాపింగ్తో హరీష్‌రావుకు ఎలాంటి సంబంధం లేదుఇప్పుడు విచారణలోనూ అదే తెలుస్తుందిసిట్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు హరీష్రావుజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న హరీష్రావులోపలికి ఒంటరిగానే వెళ్లిన హరీష్రావుషేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి సాగనంపిన బీఆర్ఎస్ కీలక నేతలుడీఎస్పీ స్థాయి అధికారి హరీష్‌రావును ప్రశ్నించే అవకాశంరేవంత్ డైరెక్షన్.. సిట్ యాక్షన్.. ఏం జరుగుతుందో చూద్దాం అంటున్న హరీష్రావుసిట్ ముందుకు హరీష్‌రావు.. తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి బయల్దేరిన హరీష్రావుమరికాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుఓ వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కేసులో విచారణ జరపనున్న సిట్2023 ఎన్నికల నాటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్‌రావు వాంగ్మూలం నమోదు చేయనున్న సిట్?ఇప్పటిదాకా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్‌రావును ప్రశ్నించే చాన్స్ రేవంత్.. డ్రామాలు ఆపు: హరీష్ రావుఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతోందిఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డిడైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే నాకు నోటీసులు పంపించిందిహామీలపై ప్రశ్నించినందుకే నాకు ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపారునేను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడాల్సిన అవసరం లేదుఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదు.. ప్రశ్నించడం ఆపేది లేదుమున్సిపల్ ఎన్నికలు వచ్చాయనే ఈ డ్రామాలురేవంత్.. చిల్లర రాజకీయాలు కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుఅన్ని ప్రశ్నలకు మేం సమాధానం చెబుతాంకాంగ్రెస్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాంరేవంత్ రెడ్డి కేబినెట్ వాటాలు, దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటాండైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ తప్పించుకోలేరుమున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం.. ఓడించి గట్టి బుద్ధి చెబుతాంతెలంగాణ భవన్ వద్ద మీడియాతో హరీష్ రావు 👉తెలంగాణ భవన్లో ముగిసిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల భేటీ తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నేతలునేతలతో భేటీ కానున్న హరీష్రావుఅక్కడి నుంచే సిట్ కార్యాలయానికి హరీష్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రిని ప్రశ్నించనున్న సిట్తెలంగాణ భవన్‌కు భారీ చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఇటు తెలంగాణ భవన్.. అటు జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు 👉నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. తెలంగాణ భవన్లో కీలక నేతలతో సమావేశం. అక్కడి నుంచే సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు..చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టే.. హరీష్రావునిన్న రేవంత్ బావమర్ది బాగోతాన్ని ఉదయం బయటపెట్టాసాయంత్రానికి సిట్ నోటీసులు పంపారుడైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ నోటీసులురాత్రి నేను హైదరాబాద్‌లో లేనిది చూసి నోటీసులు అందించారురాత్రే హుటాహుటిన సిద్ధిపేట నుంచి వచ్చాఎలాంటి తప్పు చేయలేదు.. చట్టాన్ని గౌరవిస్తాం.. అందుకే విచారణకు హాజరవుతున్నాతాటాకు చప్పుళ్లకు భయపడేది లేదుఎన్నికల హామీలను అమలు చేయకుండా.. అక్రమాలు చేస్తున్నారుప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారుమాకు నోటీసులు కొత్త కాదు.. పోరాటాలు కొత్త కాదుప్రతీ ఎన్నికల సమయంలో ఈ డ్రామాలు ఆడుతున్నారురేవంత్రెడ్డి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటాంతన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు 👉మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు హరీష్‌రావు, కేటీఆర్.. హరీష్‌రావు నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు👉హరీష్‌రావు నివాసానికి కేటీఆర్.. ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్👉లాయర్లతో భేటీ అయిన హరీష్‌రావు.. సిట్ విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చ👉కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో సుప్రీం కోర్టు హరీష్‌రావుకు ఉపశమనం ఇచ్చిందని.. కానీ, హరీష్‌రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందునే డైవర్షన్ డ్రామా చేస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావులు ఆ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్లో మరికాసేపట్లో భేటీ కానున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే భారీగా చేరుకున్నాయి. అక్కడి నుంచే నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్తారని సమాచారం. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ వేళ.. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులను మోహరింపజేశారు. హరీష్‌రావును మాత్రమే లోపలికి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. 👉హరీష్ రావు తన ఫోన్ ట్యాంపింగ్ చేయించారంటూ ఓ వ్యాపారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేయగా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ సర్కార్‌కు చుక్కెదురైంది. అయినప్పటికీ ఈ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. 👉ఈ కేసు విచారణలో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ముందుంచే అవకాశం లేకపోలేదు. తొలిసారి విచారణకు వస్తుండడంతో.. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపైనా ఆయన వాంగ్మూలం నమోదు చేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు..ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు విచారణతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యుల బృందం హరీష్ రావు ప్రశ్నించనుంది. -
బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటివరకు పలువురు మాజీ, ప్రస్తుత అధికారులు, రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే నోటీసులు జారీ చేసిన సిట్..తాజాగా సోమవారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి టి.హరీశ్‌రావును సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది.సోమవారం రాత్రి కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన అందుబాటులో లేరు. సిద్దిపేటలో ఉండటంతో ఇంట్లో ఉన్న వారికి అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తు, నిందితుల విచారణ, వాంగ్మూలాల నమోదు...ఇలా అనేకచోట్ల హరీశ్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానంలో దాఖలు చేసిన నివేదికల్లోనూ అధికారులు ఆయన పేరు పొందుపరిచారు. ఈయన ఆదేశాల మేరకు కొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో ఉన్న హరీశ్‌రావు నోటీసుల విషయం తెలిసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. త్వరలో మరికొందరికి కూడా..! 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత సిట్‌కు బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసిన సిట్.. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై పంజగుట్ట పోలీసుస్టేషన్లోనే ఓ కేసు నమోదైంది. అందులో చక్రధర్ తన ఫోన్ ట్యాప్ అయిందని, హరీశ్‌రావు ఆదేశాల మేరకే అది జరిగిందని ఆరోపించారు. అయితే ఈ కేసును ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూ డా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. -
బొగ్గు స్కామ్ డైవర్షన్ కోసమే హరీష్‌కు నోటీసులు: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు పాల్పడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానమే ఆ కేసును కొట్టేసి, ఈ పొలిటికల్ డ్రామాకు తెరదించినా.. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అసలు ఈ నోటీసుల వెనుక ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని, ఈ భారీ స్కామ్ నుండి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీష్ రావు గారికి నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు. ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ 'డైవర్షన్ పాలిటిక్స్' అని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, పాతపడిపోయిన కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేస్తూనే.. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం భ్రమ మాత్రమేనని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీష్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. హరీష కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేసు విషయమై రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. అయితే, గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా.. జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు?కేసులో ఇంకా ఏం మిగిలింది?. అంటూ ప్రశ్నించింది.‘‘ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము. మీ పర్పస్ పూర్తయిందా లేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది. -
ఆ రెండు కేసులపై సజ్జనార్ నేతృత్వంలో సిట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన కేసుల్లో సిట్ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్‌లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్‌లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది.సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యులుఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్‌ఇ)జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీసి. శంకర్ రెడ్డి (ఇన్స్పెక్టర్, సీఐ సెల్)పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్) -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. రేవంత్ రెడ్డి తమ్ముడికి సిట్ నోటీసులు
-
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు, వారి సంబం«దీకుల నుంచీ వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11కి సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. మరోపక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావు తదితరులనూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ వేగం పెంచింది. ప్రత్యేకంగా ఆర్ఆర్ మాడ్యూల్ ప్రభాకర్‌రావు 2023 ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సంబంధీకులు, అనుచరులపై నిఘా ఉంచారని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ మాడ్యూల్’పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు (ఎస్వోటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్‌రావు దీన్నీ పర్యవేక్షించారు. ప్రభాకర్‌రావు హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, రియల్టర్లు కూడా ఉన్నారని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ తదితరాలను పర్యవేక్షించడానికి కొందరు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి సహా మరికొందరు నంబర్లు కలిపి ఏర్పాటు చేసిన మాడ్యూల్‌కు ప్రభాకర్‌రావు ‘ఆర్ఆర్ మాడ్యుల్’అనే పేరు పెట్టినట్లు తెలుస్తోది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మాడ్యూళ్లలో ఉన్న వారి ఫోన్లను సర్వకాల సర్వావస్థల్లోనూ పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కొందరు అత్యాధునిక ఉపకరణాలతో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఇళ్ల సమీపంలో తాత్కాలిక వార్రూమ్స్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొండల్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్‌రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్ రావు తన ఫోన్ టాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. దానిని కొట్టేయాలని హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పూ ఇచ్చింది. ఆ వెంటనే.. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం పిటిషన్ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే హరీష్‌రావుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ బీవీ నాగరత్న నిరాకరించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను ఆమె కొట్టేశారు.నవీన్‌రావును కలవనున్న హరీష్!ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఆ పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నవీన్‌రావు వాంగ్మూలం ఆధారంగా కీలక వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ నవీన్‌రావుతో హరీష్‌రావు భేటీ అవుతారని, విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు ఇచ్చింది. ఇవాళ(ఆదివారం జనవరి 4) జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. డివైజ్‌తో ట్యాపింగ్ చేసినట్లు నవీన్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించే అవకాశముంది.కాగా, ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారగా.. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
సిట్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపిన సిట్ నెక్ట్స్ ఏం చేయబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావు విచారణ ద్వారా.. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్‌రావు టీమ్ అప్రమత్తమైందని సిట్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి.. 2022 అక్టోబర్ చివరి వారంలో ప్రభాకర్‌రావు–రాధాకిషన్‌రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్‌రావు సిట్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. .. ఈ నేపథ్యంలోనే సిట్ గురువారం ఆనాడు సీఎస్‌గా పని చేసిన సోమేశ్‌కుమార్‌తోపాటు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందంటూ ప్రభాకర్‌రావును సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ వాంగ్మూలాన్నీ సిట్ సేకరించింది. ‘నన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. కేసీఆర్ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్‌హౌస్ తతంగంపై సిట్ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్‌రావు ఎలా వేధించారని సిట్ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా అని నందకుమార్ విచారణ తర్వాత మీడియాకు తెలిపారు. ఆనాడు అధికారపక్షంలోని నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిపి మరీ ప్రభాకర్‌రావును విచారించారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్‌రావుతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 16వ తేదీ నాటికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈలోపే ఆ పెద్దలను విచారించే అవకాశం కనిపిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ చేతికి కీలక పెన్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో, పెన్ డ్రైవ్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగుతోంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లోని డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక, ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించడంలో ఈ డిజిటల్ ఆధారమే కీలకంగా మారిందని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు బృందం చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ ప్రెన్ డ్రైవ్ దొరకడం కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ కేసును నిరూపించేందుకు పెన్ ప్రధాన ఆధారంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఎందుకు ఇచ్చారు..? ఎవరు ఇమ్మన్నారు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలోని కార్యాలయంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును విచారిస్తోంది. మరోపక్క ఆయనకు పదవీ విరమణ అనంతరం ఎక్స్టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీనికి వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తోంది. ఈ విషయం నిగ్గు తేల్చడానికి అప్పట్లో కీలక బాధ్యతల్లో పని చేసిన అధికారులను ప్రశి్నస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా పని చేసిన వారితో పాటు కొందరు సలహాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ విచారణ చేపట్టాలని సిట్ భావిస్తోంది. వచ్చే నెల 16న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి కొత్తగా మరికొన్ని కీలకాంశాలను గుర్తించాలని, న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావు 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఆయన మాత్రం ఎస్ఐబీ చీఫ్‌గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్‌రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబీని మాత్రం వదల్లేదు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్టెన్ష¯Œన్పై కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఎక్స్టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్‌తో పాటు 2016 సెపె్టంబర్ నుంచి 2020 నవంబర్ వరకు నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ వాంగ్మూలాలూ ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్‌రావు కొనసాగింపు వెనుక పెద్దల ప్రమేయం, ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలోనూ వీరిద్దరినీ విచారించింది. ప్రభాకర్‌రావుకు ఎక్స్‌టెన్సన్ ఎందుకు ఇచ్చారు? అలాంటి ప్రతిపాదనలు రూపొందించమని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది? తదితర అంశాలను ప్రశి్నంచారు. త్వరలోనే మరికొందరినీ ప్రశి్నంచడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. సోమేష్‌కుమార్, నవీన్ చంద్ ఇచి్చన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అడగాల్సిన ప్రశ్నల్ని సిట్ సిద్ధం చేస్తోంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి«నిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలిసింది. -
మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లను విచారించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్లు ట్యాప్ చేయించానని గతంలో పోలీసులకు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ క్రమంలో.. మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను కూడా మరోసారి సిట్ విచారించినట్లు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను మరోసారి సాక్షులుగా విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లను విచారించి.. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రస్తుతం రెండో దఫా కస్టోడియల్ విచారణ జరుపుతోంది సిట్. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో పని చేసిన సివిల్ సర్వెంట్స్ అధికారులను మరోసారి విచారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. ఎస్ఐబీ ఓస్డీగా ప్రభాకర్‌రావును ఎలా నియమించారని సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే నవీన్ చంద్ హయాంలోనే ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు పని చేశారు. దీంతో.. ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనేదానిపై నవీన్ చంద్‌ను విచారించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. డిసెంబర్ 25వ తేదీతో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో సిట్ కస్టోడియల్ ఎంక్వైరీ వేగం పుంజుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఐసీసీసీలోనే సిట్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పడిన అధికారిక సిట్‌కు బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (టీజీ ఐసీసీసీ) కార్యాలయం కేటాయించారు. అందులోని ఏ టవర్‌లో ఉన్న 18వ అంతస్తులో, తన చాంబర్‌కు సమీపంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దీన్ని ఏర్పాటు చేయించారు. సిట్‌లో ఉన్న తొమ్మిది మంది సభ్యులతో ఆయన ఆదివారం తొలిసారిగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావు విచారణ, జనవరి 16న సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన కీలక నివేదికతోపాటు కేసు దర్యాప్తునకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ అంశాలపై ఆయన సిట్‌కు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఠాణాలోనే విచారణ కేసు దర్యాప్తు కీలక దశకు చేరడంతోపాటు తుది చార్జిషీట్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిందితులు, బాధితులను మరోసారి విచారించాలని సిట్ యోచిస్తోంది. అవసరమైతే ట్యాపింగ్ బారినపడిన రాజకీయ నాయకులతోపాటు అధికారులను కూడా విచారించాలని నిర్ణయించారు. ప్రభాకర్‌రావును రెండో దఫా కస్టోడియల్ విచారణ చేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, ఆయన్ను కూడా అక్కడకే తరలించి విచారించాలని తొలుత భావించారు.అయితే ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అక్కడ సిటీ పోలీసులు ఇప్పటివరకు దాఖలు చేసిన పత్రాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పైభాగంలో ఉన్న సిట్ కార్యాలయంలో ప్రభాకర్‌రావును విచారించాలి. ఇందులో ఏ విధమైన మార్పుచేర్పులు చేసినా ఆ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణ జనవరి 16న ఉండటంతో అప్పటివరకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న సిట్ కార్యాలయంలోనే ఉంచి విచారించాలని నిర్ణయించారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకట గిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును విచారిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు పశి్చమ మండల డీసీపీగా పనిచేసి, సిద్దిపేట సీపీగా బదిలీ అయిన ఎస్ఎం విజయ్ కుమార్ ఆది నుంచీ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. తాజాగా ఆయన్ను కూడా సిట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఆయన కేసు పూర్వాపరాలు, ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాలను సమీక్షించి లూప్‌హోల్స్ వెలికితీయడంపై దృష్టి పెట్టారు.సిట్ సభ్యుడిగా ఉన్న రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్, మహేశ్వరం డీసీపీలు రితిరాజ్, కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, ‘ఈగిల్’డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, మెట్రో రైల్ డీఎస్పీ నాగేంద్ర రావుకు కొత్వాల్ సజ్జనార్ ఒక్కో బాధ్యతను అప్పగించారు. ఎప్పటికప్పుడు కేసు మొత్తాన్ని తానే సమీక్షిస్తానని ఆయన అధికారులకు చెప్పారు. -
26న విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు మరో వారం పొడిగించింది. డిసెంబర్ 25 వరకు పోలీసు విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు, 26న ఆయన్ను విడుదల చేసి ఇంటికి పంపాలని ఆదేశించింది. ప్రభాకర్‌రావును జైలుకు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. తదుపరి విచారణ జరిగే 2026 జనవరి 16 వరకు అరెస్టు కూడా చేయరాదని స్పష్టం చేసింది. ’ఆయన మా ఉత్తర్వుల మేరకే సరెండర్ అయ్యారు..అలాంటప్పుడు విచారణ పూర్తయ్యాక మళ్లీ రిమాండ్‌కు ఎందుకు పంపాలి?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనం, మందులు అనుమతించాలని తెలిపింది. ప్రభాకర్‌రావు కూడా దర్యాప్తునకు సహకరించాలని, విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ రిపోర్టును కోర్టుకు సమరి్పంచింది. అనంతరం ఇరుపక్షాలు వాదనలు విన్పించాయి. కాల్చమని చెబితే కాల్చేస్తారా? ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదు. డివైస్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉంది. నిందితుడి నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది. అందువల్ల మరో వారం రోజుల కస్టడీ అవసరం. కస్టడీ గడువు ముగిసిన తర్వాత, తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలివ్వాలి. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?..’అంటూ వాదించారు. అసలు మీరెందుకు భయపడుతున్నారు? అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ నాగరత్న తోసిపుచ్చారు. ’పోలీసు విచారణ కోసమే ప్రభాకర్‌రావు వచ్చారు. అది పూర్తయిన తర్వాత ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాల్సిన అవసరం ఏముంది?..’అని ప్రశ్నించారు. రిమాండ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ’అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య వహారం గురించి మీరెందుకు (ప్రభుత్వం) అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది..’అని ప్రశ్నించారు. అది విచారణ కాదు.. ‘చైనీస్ టార్చర్’ అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్‌కుమార్, దామా శేషాద్రినాయుడు వాదించారు. ‘ప్రభాకర్‌రావు వయసు 69 ఏళ్లు. కేన్సర్ సర్వైవర్. ఆయన్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. రోజుకు 12 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అడిగిన ప్రశ్నలే వందసార్లు అడుగుతూ వేధించడం దర్యాప్తు కాదు. ఇది మనిషిని మానసికంగా కుంగదీసే ‘చైనీస్ టార్చర్ మెథడ్’. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు..’అని చెప్పారు. ‘ఒక సీనియర్ సిటిజన్‌ను, 30 ఏళ్లు ప్రజలకు సేవలందించిన అధికారిని ఇలా రోడ్డున పడేయడం దారుణం. సిట్ బృందాన్ని పెంచింది దర్యాప్తు కోసం కాదు. షిఫ్టుల వారీగా మారుతూ వృద్ధుడైన నిందితుడిని వేధించడానికే..’అని వాదించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు... ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు
-
ప్రభాకర్‌రావుకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఐబీ మాజీ చీఫ్, ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ.. ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఇవాళ కోర్టుకు సమర్పించింది. ‘‘ప్రభాకర్‌రావు కీలక విషయాలు దాటవేస్తున్నారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదు’’ అని తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో.. ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని. కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు.పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. డివైజ్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. మరో వారం రోజుల పోలీస్ కస్టడీ అవసరం. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యత కు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?.. ప్రభాకర్ రావు అనేక సాక్షాధారాలను ధ్వంసం చేశారు.. అని తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణ పేరుతో ప్రభాకరరావును వేధిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఏకకాలంలో విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు 69 ఏళ్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. కనీసం మానవత్వం చూపించడం లేదు. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ఉల్లంఘించడమే. 17 సార్లు పిలిచి దాదాపు 96 గంటలకు పైగా విచారించారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ పోలీసుల తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం .. ఆయన కస్టడీని మరో వారం రోజులు(డిసెంబర్ 25 దాకా) పొడిగించింది. ఆ మరుసటిరోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్‌రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు (అరెస్ట్.. థర్డ్ డిగ్రీలాంటి చర్యలు) తీసుకోవద్దని సిట్‌కు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూనే అరెస్ట్ నుంచి ఇంతకాలం ఊరటగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు డిసెంబర్ 11వ తేదీన ఎత్తేసింది. ఆయన్ని తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారంపాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని.. ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడని.. విచారణ వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని కోర్టు ఆ సమయంలో సిట్‌కు సూచించింది. వారం రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శుక్రవారం ఆ నివేదికను కోర్టుకు అందించింది. అయితే విచారణలో ఆధారాలు ముందుంచి ప్రశ్నించినా కూడా.. ఆయన నోరు మెదపలేదని తెలుస్తోంది. ప్రభాకర్‌రావుకు సంబంధించి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలోని ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్లలోని సమాచారాన్ని సిట్ కీలకంగా భావిస్తోంది. కానీ, అప్పటికే ఆయన ఆ సమాచారం అంతా డిలీట్ చేశారు. దీంతో ఫోరెన్సిక్ నివేదిక మీద సిట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు.. వారం కస్టడీ పొడిగింపుతోనైనా ఆయన్నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. -
ఎక్స్టెన్షన్ ఇస్తే తప్పేముంది?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను ఏసీపీ పి.వెంకటగిరితో పాటు సంయుక్త సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సైతం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అయితే ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి అదనపు సమాచారం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. మరికొన్ని రోజుల పాటు ప్రభాకర్‌రావును కస్టడీలోకి ఇవ్వాలని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం ఎస్ఐబీలోనే విధులు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావు ఆపై 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గా కొనసాగారు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును సిట్ అధికారులు ఆయన ఎక్స్టెన్షన్ అంశంపై ప్రశ్నించారు. పరిపాలనా అవసరాలకే ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ లభించడానికి కారణం ఏమిటని అడిగారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఇది సాధ్యమైందా? అనే కోణంలో ఆరా తీశారు. దీంతో.. ఏ ప్రభుత్వమైనా ఆయా పోస్టులకు ఉన్న ప్రాధాన్యత, అధికారుల సమర్థత, పరిపాలన అవసరాలకు అనుగుణంగానే ఎక్స్టెన్షన్ ఇస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక విభాగాల్లో పని చేసి, పదవీ విరమణ పొందిన అధికారులకు ఎక్స్టెన్షన్ ఇస్తోందని, అంతమాత్రాన వాళ్లంతా అక్రమాలకు పాల్పడుతున్నట్లేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌పై పోలీసు విభాగంలో ఓఎస్డీలుగా పని చేస్తున్న వారిపైనా కేసులు పెడతారా? అని అడిగారు.. పార్టీలకు విరాళాలు వ్యాపారుల ఇష్టం..ప్రభాకర్‌రావు టీమ్ టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారన్నది సిట్ ఆరోపణ. వారి ఫోన్లను ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, మాట వినని వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్ చేసిన ఆడియోలు పంపి లొంగదీసుకున్నారని పేర్కొంది. కొందరు నాయకుల ఆదేశాల మేరకు వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఓ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ ఖరీదు చేయించారని అనుమానించిన సిట్ ఆ కోణంలోనూ సిట్‌ను ప్రశ్నించింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు పార్టీలకు విరాళాలు ఇవ్వడమనేది ఆయా వ్యాపారులకు సంబంధించిన అంశమని ప్రభాకర్‌రావు సమాధానమిచ్చారని తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్ (Special Investigation Team) ఏర్పాటైంది. ఈ సిట్‌కు హైదరాబాద్ కొత్వాల్ (పోలీస్ కమిషనర్) సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. కొత్త సిట్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు సహా మొత్తం 9 మంది అధికారులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జన్నార్ నేతృత్వంలోని కొత్త సిట్ సభ్యులు..రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాసిద్దిపేట సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్మాదాపూర్ డీసీపీ రితిరాజ్మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డిగ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డిరాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్.రావుజూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి (దర్యాప్తు అధికారి)టీజీనాబ్ డీఎస్పీ సీహెచ్.శ్రీధర్హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేందర్ రావుకాగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఐటీఏక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పీఎస్‌లో కేసు (క్రైం నంబర్ 243/2024) నమోదైంది. ఈ కేసుపై కొత్తగా ఏర్పాటైన సిట్ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని సూచించారు. -
అమెరికా ఫోన్లో ఏముంది?.. ప్రభాకర్‌రావుకు సిట్ సూటి ప్రశ్న!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాచీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ విచారణ ఆరో రోజుకు చేరుకుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) SIT కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విచారణలో నోరు మెదపని ప్రభాకర్ రావు ఆరో రోజు కూడా సిట్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటలు దాటవేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో.. సిట్ అధికారులు ప్రభాకర్ రావు కదలికలపై సీసీ కెమెరా నిఘా పెట్టారు. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్‌కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు పెట్టమని ఎవరు చెప్పారు? అని సిట్ ప్రశ్నిస్తోంది. అయితే డేటా డిలీట్ పై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న ఐఫోన్ లో క్లౌడ్ డేటా ఓపెన్ చేసినట్లు,ఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చినట్లు? అంటూ రాజకీయ ప్రముఖుల సీడీఆర్ డేటాతో ప్రభాకర్‌ని సిట్ ప్రశ్నించింది. ఎందుకు ట్రేస్ చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ అమాత్యుల పాత్ర ఉందా? అని ప్రశ్నించగా ఆ మాటలు దాటవేస్తూ.. విచారణకు ప్రభాకర్ రావు ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు 5ఐ క్లౌడ్, 5జిమెయిల్ ఖాతాల్లో ఉన్న డేటాపై సిట్ దర్యాప్తు చేసింది. గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ 2 అకౌంటల పాస్వర్డ్ ఇవ్వడంతో డేటా కనిపించకుండా ఉండటంతో సిట్ వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపింది. దానితో సిట్ ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు. మరోవైపు సింక్ అయిన డేటా యాపిల్, జిమెయిల్ కంపెనీల నుండి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఆ డేటాతో పాటు విచారణలో ప్రభాకర్ నోరు మెదిపితే కీలకమైన ఆధారాలు సిట్‌కు లభించనున్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుండి తొలిగించానని ప్రభాకర్ రావు సిట్‌కు తెలిపారు.ప్రభాకర్ రావు వాగ్మూలంపై వాస్తవం ఎంత అనేది జీమెయిల్,యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంది. -
ప్రభాకర్ రావు నాన్ కోపరేషన్.. సిట్‌కు కొత్త తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్‌రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే. -
ముందుకెళ్తారా? మిన్నకుంటారా?
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా గత ప్ర భుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును సిట్ అధికారులు రెండో రోజైన శనివారమూ విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలే చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారులకు మరో తలనొప్పి వచ్చిపడింది. దీని ఆధారంగా ముందుకు వెళ్తారా? లేక మిన్నకుండిపోతారా? అనేది తేలాల్సి ఉంది. విభాగాధిపతుల పర్యవేక్షణలోనే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పట్లో డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్ర భాకర్‌రావు చెప్తున్నారు. పోలీసులు సేకరించిన ఆ«ధారాల ప్రకారం ఈ అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం మొత్తం ప్ర భాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టు అయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అనుమానిత నంబర్ల ట్యాపింగ్‌కు రూపొందించిన లేఖపై హోంశాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ఇది ఎస్ఐబీ నుంచి నిఘా విభాగాధిపతి, డీజీపీల ద్వారా హోం సెక్రటరీకి చేరుతుంది. ఆయన అందుబాటులో లేనప్పుడు మాత్రమే అత్యవసరమైతే ఎస్ఐబీ చీఫ్ లేఖ పంపిస్తారు. అయితే ఇలా జరిగిన మూడు రోజుల్లో హోం సెక్రటరీ నుంచి అను మతి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ రివ్యూ చేస్తుంది. ఈ విషయాలను ప్రభాకర్‌రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేస్తున్నారని తెలిసింది. గతంలో ఆయన నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లోనూ ఆయా సెక్రటరీలు, డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావించారు. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పనిచేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకిస్తున్నారు. కస్టడీలో చెప్తున్న విషయాలే కాకుండా న్యాయస్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుంది.సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు? ప్రభాకర్‌రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంటే మాజీ డీజీపీలు, నిఘా విభాగం అధిపతుల్నీ విచారించడంతో పాటు అవసరమైతే వారినీ నిందితులుగా చేర్చాలి. ఓ నేరం చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. దానికి సహకరించిన వాళ్లు కూడా నిందితులే అవుతారు. ఈ విషయాన్నే చట్టం కూడా స్పష్టం చేస్తోంది. ప్రభాకర్‌రావు విచారణపై ఈ నెల 19న సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ అంశాలు ప్రస్తావిస్తారా? ఆయా అధికారుల విషయంలో ఎలా ముందుకు వెళ్తారు? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాత్రి వరకూ కొనసాగిన విచారణ అనంతరం, రెండో రోజు కూడా కీలక అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్టు సమాచారం.విచారణ పురోగతిని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలిస్తోంది.గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. FSL నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, సింక్ అయిన డేటా వివరాల కోసం యాపిల్, జిమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియలో సిట్ ఉంది. క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా, లాగిన్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే తన డివైస్ల నుంచి తొలగించింది కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందన్నది యాపిల్, జిమెయిల్ సంస్థల నుంచి వచ్చే డేటాతో తేలనుంది.రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు?, ఆదేశాలు ఎవరిచ్చారు?, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ దర్యాప్తు వేగం పెంచింది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగే అవకాశం ఉంది. -
హార్డ్‌డిస్క్‌ల కోణంలో..
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు శుక్రవారం సిట్ కార్యాలయంలో లొంగి పోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉన్న సిట్ ఆఫీస్‌కు వచ్చారు. ఈయన్ని అధికారులు వారంపాటు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించనున్నారు. తొలి రోజు సిట్ ఏసీపీ పి.వెంకటగిరితోపాటు సంయుక్త పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఎస్ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్న అధికారులు తొలిరోజు ధ్వంసం చేసిన, రీప్లేస్ చేసిన హార్డ్‌డిస్క్‌ల కోణంలో ప్రశ్నించారు. ఆధారాలు మాయం చేయడానికే..: సుదీర్ఘకాలంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రభాకర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే 2023 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్–కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లానని, అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఆఫ్ చేయించానని మరో నిందితుడు, ఎస్ఓటీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రణీత్‌రావు వెల్లడించారు. ఈ వార్ రూమ్‌లో ఉన్న 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 26 హార్డ్ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతోపాటు మరో ఏడింటిని కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌ల్ని మూసీ నదిలో పారేసినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు. ఇదంతా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే చేసినట్లు అతడు వెల్లడించిన నేపథ్యంలో ఆ హార్డ్‌డిస్క్‌ల కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. వీటికి ప్రభాకర్‌రావు స్పందిస్తూ నిర్ణీత కాలం తర్వాత డేటాను ధ్వంసం చేసే నిబంధన ఎస్ఐబీలో ఉందని, తమ వద్ద దేశ భద్రతకు సంబంధించిన, సున్నిత సమాచారం ఉంటుందని, అందుకే అలా చేస్తుంటామని చెప్పారు. అయితే నిబంధనల మేరకు కేవలం డేటాను డిలీట్ చేయాల్సి ఉండగా హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం, రీప్లేస్ అనేది కేవలం ఆధారాలు మాయం చేయడానికే అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.ఈ కారణంగానే ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతోపాటు ఐక్లౌడ్, క్లౌడ్ల పాస్‌వర్డ్స్‌ను మార్చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనికి స్పందించిన ప్రభాకర్‌రావు తాను ఎలాంటి ఆధారాల ధ్వంసానికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా అధికారులు మూసీ నది నుంచి, గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం పరిసరాల నుంచీ కొన్ని ఆధారాలు గతంలో సేకరించారు. ఈ వివరాలను ప్రభాకర్‌రావు ముందు ఉంచి ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.బెదిరింపు వసూళ్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలతోపాటు ఎవరి ఆదేశాల మేరకు ఈ నేరాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలనూ సిద్ధం చేశారు. ప్రతి రెండు గంటలకు కాసేపు విరామం ఇస్తూ విచారించారు. ప్రభాకర్‌రావు కోరినప్పుడల్లా విశ్రాంతి, మందులు ఇస్తున్నామని, రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆయన నిద్ర కోసం కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. -
ACP ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు
-
ప్రభాకర్ రావు అరెస్టు రంగం సిద్ధం..!
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సరెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. దీంతో, ప్రభాకర్ రావును.. సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఇంటి నుంచే భోజనం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు. డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్‌డిస్క్‌లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. -
ప్రభాకర్‌రావు సరెండర్ కావాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది.తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.ఆధారాలు ధ్వంసం చేశారు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు.డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్‌డిస్క్‌లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్‌కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రభాకర్‌రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది. ప్రణీత్‌రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ తన స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు తన ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. రీసెట్ చేసిన తర్వాత డేటా డిలీట్ చేశారని తేలితే కేసు డిస్మిస్ చేస్తామని జస్టిస్ మహదేవన్ హెచ్చరించారు.ఈ కేసుపై జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇవాళ(అక్టోబర్ 14, మంగళవారం) విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని.. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలన్నారు.‘‘కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌ల్లో డేటా ధ్వంసం చేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ మాకు ఇచ్చారు’’ అని కోర్టుకు సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభాకర్‌రావు తరఫున శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపిస్తూ.. డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధమన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల (నవంబర్ 18)కి వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్‌కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్‌లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫోన్ డివైస్‌లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్‌రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు సూచించింది. -
ఫోన్ ట్యాపింగ్.. మరో బాంబ్ పేల్చిన కవిత
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.ఫామ్‌హజ్ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు! -
క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అడ్డ గోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన అనంతరం దిల్కుషా అతిథిగృహం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.దీనిపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని నేను సవాల్ విసురుతున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌కి నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తుందో కనీస అవగాహన లేదు. నిఘా వ్యవస్థల నిర్వహణపై కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు అన్ని హద్దులు దాటాయి. ఇంత దిగజారుడు ఆరోపణలు, చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారింది.ప్రతిసారి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే, వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపిండు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంపై సీబీఐతోవిచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని అన్నారు. సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆపాలని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాస్తే విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధం ఉందన్నారు. సీబీఐ నేరుగా విచారణ చేసే అధికారముంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్లమని అన్నారు.ట్యాపింగ్‌లో భాగంగా కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి కూడా అప్పగించాలన్నారు. కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, అందుకే కేసీఆర్ కుటుంబానికి రేవంత్ క్లీన్చిట్ ఇచ్చారన్నారు. ట్యాపింగ్ కేసులో బాధితుడు, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ కూడా విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అలాంటప్పుడు విచారణ ఎందుకు? ‘గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే..ఆ సొమ్ములో వాటా కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఆ సొమ్మును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాలనుకుంటున్నారేమో..అందుకే కేసీఆర్ తానా అంటే రేవంత్‌రెడ్డి తందానా అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌కు రేవంత్ క్లీన్ చిట్ ఇస్తున్నడు. ఆయనను అరెస్ట్ చేయబోమని చెబుతున్నడు. సీఎం ఎవరు ఆ మాట చెప్పడానికి? అట్లాంటప్పుడు ఈ కమిషన్లు, ఈ విచారణలు ఎందుకు?..’ అని సంజయ్ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లను విచారణకు పిలుస్తారా? ‘అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలవగలదా? కేసీఆర్, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ మినహా ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, అప్పటి మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లు, మావోయిస్ట్‌ల నుంచి ప్రమాదం పేరుతో నా ఫోన్‌తో పాటు అప్పట్లో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. మొత్తం 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. తన కుటుంబసభ్యులు, వ్యక్తిగత సహాయకులు, పనిమనుషుల ఫోన్లు, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు..’ అని కేంద్రమంత్రి ఆరోపించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని ట్యాపింగ్‌కు పాల్పడ్డారు.. ‘ఎస్ఐబీని అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, సినిమావాళ్లు, ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎస్ఐబీ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు క్షణక్షణం బాధపడేలా శిక్షవేయాలి. కానీ రేవంత్ ప్రభుత్వం వీరిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే వెంటనే ఈడీ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.డబ్బులు ఎవరు తిన్నారో తేల్చాలి.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర రూ.7 కోట్లు పట్టుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ వాళ్ల దగ్గర కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఆ పైసలన్నీ ఎటుపోయినయ్? ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నారా? ట్విట్టర్ టిల్లు తిన్నాడా? తేల్చాలి..’ అని సంజయ్ అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. సిట్ విచారణ సందర్భంగా ట్యాపింగ్నకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలు అందజేసినట్లు తెలిపారు. కాగా శుక్రవారం సంజయ్‌తో పాటు ఆయన పీఆర్వో పసునూరి మధు, వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్‌కుమార్, పోగుల తిరుపతి స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాగా సిట్ విచారణకు వెళ్లే ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. -
బండి సంజయ్‌కు లీగల్ నోటీసులిస్తా.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులిస్తా’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ, బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పని చేస్తాయో అర్థం కాలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.అలాగే కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన ఆరోపణలు హద్దు దాటాయి. ఇంత చౌకబారు వ్యాఖ్యలు ఆయనకు కొత్త కాదు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలలో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాల్ విసురుతున్నా.. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు’’ అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, ఇవాళ సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారన్న బండి సంజయ్.. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోంది
-
కేసీఆర్ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్ కాల్స్‌నే ట్యాప్ చేశారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్‌కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్‌లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.ముఖ్యమంత్రి ఫోన్‌ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ అన్నారు. -
Bandi Sanjay: నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్ కు ఇస్తున్నాను
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు సిట్ విచారణపై నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది తానే అని సంజయ్ చెప్పుకొచ్చారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంబయ్ బయలుదేరారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను విచారణకు పిలిచారు.. వెళ్తున్నాను. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెళుతున్నాను. సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు. ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్ ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు. మిగిలిన విషయాలు సిట్ విచారణ అనంతరం మాట్లాడతాను’ అని తెలిపారు.మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, బీజేపీ ఈ వ్యవహారాన్ని.. జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. కేంద్ర నిఘా వర్గాల నుండి కీలక సమాచారాన్ని కూడా బండి సంజయ్ సేకరించినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారని సమాచారం. ఇక, ఈరోజు బండి సంజయ్‌తో పాటుగా.. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ విచారణకు హాజరు కానున్నారు. -
‘డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. సీఎంపై సిట్‌కు ఫిర్యాదు చేశా’
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారని ప్రభాకర్‌రావు పిటిషన్ దాఖలు చేయగా.. మరో వైపు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలంటూ పోలీసులు కోరారు. ప్రభాకర్‌రావు పిటిషన్.. ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.కాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే.వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్‌రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. -
Telangana phone tapping case: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
సాక్షి,కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితో పాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు సిట్ విచారణలో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు పీఆర్వో, పీఏల స్టేట్మెంట్ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం, ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతోంది: రఘునందన్ రావు
-
‘నేను కదా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ములాఖత్ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్‌కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్‌రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. -
సీఎం పోస్టుపై TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బాధితుల్ని సాక్షులుగా పరిగణిస్తూ వారినుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వాళ్లు కచ్చితంగా న్యాయస్థానం వరకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయో చూపిస్తోంది. నేతలతో పాటు వారి కుటుంబీకులు, అనుచరుల సంభాషణల ఆడియోలను వినిపిస్తూ, సంబంధిత పత్రాలను చూపిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్‌రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. రాజకీయ నాయకులతో పాటు వారి సంబంధీకుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ ఆ ఆడియోలను ‘పెద్దలకు’ షేర్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. ప్రస్తుతం సిట్ సాక్షులకు ఈ ఆడియోలను వినిపించడంతో పాటు వివిధ లేఖల్ని చూపిస్తోంది. ఆ తర్వాతే వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వారి వాంగ్మూలం నమోదు చేస్తోంది. కొందరు సాక్షులు, నిందితుల్ని ఎదురెదురుగా పెట్టి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. అప్పటి ప్రభుత్వం దిగజారి వ్యవహరించింది..ప్రణీత్‌రావు బుధవారం మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో పాటు కామారెడ్డికి చెందిన వివిధ పార్టీల నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా ఫహీమ్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఫోన్ ట్యాప్ అయిందని డీసీపీ నుంచి సమాచారం అందింది. నా ఫోన్‌తో పాటు నా భార్య, డ్రైవర్ ఫోన్లనూ ట్యాప్ చేశారు. అధికారం కోసం నీచానికి దిగజారారు. బహుశా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే ఎన్నికల ముందు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు..’ అని చెప్పారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచానికి దిగజారింది. తల్లి, పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది..’ అని చెప్పారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం వరకు దాదాపు 235 మంది వాంగ్మూలాలను సిట్ నమోదు చేసినట్లు తెలిసింది. -
ట్యాపింగ్ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారు: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు ప్రశ్నించి ఈటల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం సాగదీస్తారు?. ఎంత కాలం విచారణ జరుపుతారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకెంత కాలం విచారిస్తారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకమే అక్రమం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. అనేకసార్లు నా ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ నేతలే కాదు.. జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లూ ట్యాప్ చేశారు. గవర్నర్ ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు?. ఎవరి అండతో ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్న చట్టపరంగా శిక్షించాలి.. అని ఈటల డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. బీజేపీ లీగల్ సెల్‌తో కలిసి సిట్ కార్యాలయానికి సాక్షిగా ఇవాళ్టి విచారణకు ఈటల హాజరయ్యారు. బీజేపీ నేత ప్రేమేందర్ స్టేట్మెంట్ను కూడా అధికారులు నమోదు చేశారు. -
కాసేపట్లో సిట్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
-
ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావుకు చెక్ పెట్టే ప్లాన్‌లో సిట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో ప్రభాకర్ రావు తమకు సహాకరించడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు.ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నేడు ఐదోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ అధికారులు.. ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తమ విచారణకు ప్రభాకర్ రావు సహాకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. సిట్ అడిగిన ప్రశ్నలను ప్రభాకర్ రావు దాటవేస్తున్నట్టు చెబుతున్నారు. సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. అలాగే, ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కూడా రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. ఇక, గతంలో ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత డీజీపీ జితేందర్, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ హాజరయ్యారు. -
రేవంత్ కోసం ‘ఆర్ఆర్ మాడ్యూల్’!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ‘ఆర్ఆర్ మాడ్యుల్’పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు (ఎస్ఓటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్‌రావు దీనిని పర్యవేక్షించారని వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్‌రావు హయాంలో అనేకమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వీరి కోసం మాడ్యూల్స్ రూపొందించారు. ఒక్కో మాడ్యుల్లో సదరు వ్యక్తితోపాటు ఆయనకు సంబంధించి ఇంకా ఎవరెవరివి ఫోన్లు ట్యాప్ చేయాలో ఆ నంబర్లు చేర్చేవారు. ఈ మాడ్యూల్‌ను అనునిత్యం పర్యవేక్షిస్తూ వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను పర్యవేక్షించడానికి కొందరు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డికి సంబంధించిన మాడ్యుల్‌కు ప్రభాకర్‌రావు ‘ఆర్ఆర్ మాడ్యూల్’అనే పేరు పెట్టారు. ఈ మాడ్యూల్లో ఉన్న వారి ఫోన్లను పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. దీనివల్ల ఒనగూరుతున్న లాభాలు తెలిసిన తర్వాత ప్రభాకర్‌రావు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. ఎస్ఐబీ అధికారులు చాలా కాలం కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారు. 2018 తర్వాత మారిన ట్యాపింగ్ పంథా2018 ఎన్నికల సందర్భం నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న వార్‌రూమ్‌లో ఏర్పాటు చేసి ‘ఆర్ఆర్ మాడ్యూల్’ను కొన్నాళ్లు పర్యవేక్షించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాలుగోసారి హాజరైన ప్రభాకర్రావుప్రభాకర్రావు గురువారం నాలుగోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ విచారణకు ప్రభాకర్‌రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడానికి ఉన్న అవకాశాలను న్యాయ నిపుణులతో పరిశీలిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్‌రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్‌రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్‌కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్‌రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్‌రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాకక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పేరిట మహేష్ కుమార్ గౌడ్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన పలుమార్లు ఇప్పటికే ఆరోపించారు.తాను కూడా ఫోన్‌ట్యాపింగ్ బాధితుడినేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహేష్‌కుమార్ గౌడ్ సిట్ కార్యాలయానికి చేరుకోగా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బయటకు పంపించారు.2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది: మహేష్ గౌడ్సిట్ ముందు హాజరైన అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకువచ్చాయన్నారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు నేతల కనుసన్నల్లోనే పనిచేశారు. ఫోన్ ట్యాప్‌తో రాజకీయ లబ్ధి పొందారు’’ అని మహష్ గౌడ్ ఆరోపించారు. -
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఎంపీ అరవింద్ వినతి
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ పీటీఐతో మాట్లాడిన సందర్భాన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ కేసీఆర్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. నాపై మానసికంగానే కాదు.. శారీరకంగానూ కేసీఆర్ ప్రభుత్వం దాడి చేయించింది. ఇది రాజకీయ ఎజెండా మాత్రమే కాదు.. ఇది నేరపూరితమైన దాడి. షోన్ ట్యాపింగ్ ద్వారా కేవలం ఫోన్ కాల్స్లోకే కాదు బెడ్ రూమ్‌లోకి, బాత్రూమ్లోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డారు. నాపై వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వ నిఘా వ్యవస్థను ప్రైవేటు నిఘా వ్యవస్థగా వాడుకుంది గత ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు చేపట్టాలి’ అని అరవింద్ కోరారు. -
ట్యాపింగ్ కేసు.. వ్యూహం మార్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.ఎస్ఐడీలోని ఎస్ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్‌రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్‌రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్‌రావు శనివారం మరోసారి సిట్ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్‌ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడం. ఎస్ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.ఎస్ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్‌ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబీకి చెందిన 42 హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.రెండు టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.అప్పట్లో ఎస్ఐడీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్‌రావు ఖండిస్తుండటంతో సిట్ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్‌రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్‌రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
దాటవేత ధోరణిలో సమాధానం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావును సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్‌రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్ ప్రస్తావించింది. ట్యాపింగ్‌తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, వారి నంబర్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు ప్రశ్నించారు.కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్ డిటేల్స్ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్‌రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్‌రావుతో కలిపి ప్రభాకర్‌రావును విచారించిన సిట్ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.హార్డ్‌డిస్క్ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్‌రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్‌కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్ అధికారులు అలాంటప్పుడు ఎస్ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్‌రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్‌డిస్‌్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్‌రావు సిట్ అధికారులకు తెలిపారు. అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులను సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్‌రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్‌రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్‌ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్‌రావు నుంచి వచ్చాయని ప్రణీత్‌రావు చెబుతుండగా... ప్రభాకర్‌రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. -
Phone Tapping: SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్నసిట్
-
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం. -
సిట్ అడిగింది తెస్తారా? ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత విచారణలో అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు బృందం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో వాడిన సెల్ఫోన్లు(రెండు), ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్‌లను తీసుకురావాలని ఆయన్ని అధికారులు ఆదేశించారు. వీటి ద్వారా ఈ కేసులో కీలక సమాచారం రాబట్ట వచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఆయన వాటిని తీసుకొస్తారా? అధికారులకు అందిస్తారా? ఏదైనా కారణం చెబుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారంలోకి వెలుగులోకి వచ్చాక.. ఆయన అమెరికా వెళ్లారు. సుమారు 15 నెలల తర్వాత సుప్రీం కోర్టులో అరెస్ట్ నుంచి ఊరట లభించడం, పైగా విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల 8వ తేదీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆపై ఆ మరుసటిరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి 8గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్.. ఫోన్ ట్యాఇపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ, ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు ఎస్ఐబీకి చెందిన హార్డ్‌డిస్క్‌ల డాటా మాయం చేశాడని విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు. ఎస్ఐబీలో పాత హార్డ్ డిస్క్‌ల స్థానంలో కొత్తవి పెట్టడం.. కొన్ని దశాబ్దాలుగా నిఘా వర్గాలు దాచిన ఉగ్రవాద, తీవ్ర వాద సమాచారం మాయం కావడంపైనా ప్రభాకర్ రావును ఆరా తీశారు. అయితే వీటిలో దేనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు రెండో రౌండ్ విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప డం మాట అటుంచితే.. ఆయనే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్‌రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి ప్రభాకర్‌రావు చేరుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. మధ్యాహ్నం గంటసేపు లంచ్ బ్రేక్ ఇచ్చి, రాత్రి 7.30 గంటల వరకు ఆయన్ను విచారించారు. ప్రభాకర్‌రావు చెప్పిన వివరాలను ఆయన స్టేట్మెంట్గా రికార్డు చేసుకున్నారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు పోలీసులు సూచించారు.వారితో వృత్తిగత బంధమే..డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు తనవద్ద పని చేశారని, విధి నిర్వహణలో భాగమైన మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్‌రావు చెప్పినట్లు తెలిసింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేసినట్లు సమాచారం. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంపైనా అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్ఐబీ చీఫ్ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్‌రావు... ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్ అధికారు లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసి, కొత్తవి పెట్టమన్నది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించగా... ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్ఫోన్లు, ట్యాబ్, మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్ తీసుకువచ్చి అప్పగించాలని ఆదేశించారు.ట్యాపింగ్‌కు నేను అనుమతివ్వలేదుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. అయి తే, ఆయన మాత్రం ఈ కేసుతో తనకు సంబంధమే లేదని వాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం? ఏయే ఫోన్లు ట్యాప్ చేయాలి? ఎంత కాలం చేయాలి? ఎందుకు చేయాలి? అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమి టీలో సభ్యులుగా ఉండే ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారు?’ అని ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా అధికారులను విచారించి, వాంగ్మూ లాలు నమోదు చేశామని పోలీసులు చెప్పగా... ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చింది వారేనని.. తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
‘వారికి తెలియకుండా నేను ఏ పనీ చేయలేదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఎస్ఐబీ(special intelligence bureau) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆయన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు.. ఇవాళ్టి విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. సిట్కే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌కు తాను ఆదేశాలు ఇవ్వలేదని.. అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. తాను ఎఫ్ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని.. తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సిట్ కోరింది. తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు. అయితే ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్‌రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకాలం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావు సుప్రీం కోర్టు ఆదేశాలతో నిన్న (ఆదివారం, జూన్8) హైదరాబాద్ చేరుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్.. సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుండి డేటాను సిట్ అధికారులు తెప్పించుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి
-
హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు.. ఎయిర్‌పోర్టులో బౌన్సర్ల ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్సైబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫాంలో ధరించి.. మరి కొంత మంది సివిల్ డ్రెస్‌లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు. ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Em Ganakaryam chesinav Ani siggupaduthunav Prabhakar Rao! Khaaki Paruvu Theesindi Kaakunda!🗣️ pic.twitter.com/VMpKSj2OWn— Rishi Karan Reddy (@Rishi_Karan_) June 8, 2025ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రభాకార్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులు అరెస్టయి దీర్ఘకాలం రిమాండులో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్‌రావు.. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్‌పోర్టు రద్దు చేయించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రావడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వచ్చింది. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. -
నేడు సిట్ ముందుకు ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఆయనపై ఎల్ఓసీ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్‌పోర్టునూ రద్దు చేయించారు.గత నెల్లో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇవ్వడంతో ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన అమెరికాలోని భారత ఎంబసీకి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుని, గత శుక్రవారం ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందారు. దీని ఆధారంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. నిరీ్ణత గడువులోగా సిట్ ఎదుట వి చారణకు హాజరుకావాల్సి ఉండటంతో సోమ వారం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాల యానికి రానున్నారని సమాచారం. అక్కడే అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారు. అన్ని నివేదికలు క్రోడీకరించి... ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు నలుగురు నిందితులు పి.రాధాకిషన్‌రావు, ఎన్.భుజంగరావు, ఎం.తిరుపతన్న, డి.ప్రణీత్‌రావులను అరెస్టు చేశారు. మరో నిందితుడు శ్రవణ్‌కుమార్‌రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురితోపాటు పదుల సంఖ్యలో సాక్షుల్ని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టెలికం సరీ్వసు ప్రొవైడర్లతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అనేక నివేదికలు పొందారు. వీటన్నింటినీ క్రోడీకరించిన పోలీసులు ప్రభాకర్‌రావును ప్రశ్నించడానికి ప్రశ్నావళి సిద్ధం చేశారు.వీటి ఆధారంగా ఆయన్ను సుదీర్ఘంగా విచారించాల్సి ఉందని, అవసరమైతే ఆయన రెండు మూడుసార్లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మరోసారి విచారించనుంది. ఈలోపు ప్రభాకర్‌రావు విచారణకు సహకరించకుంటే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కస్టోడియల్ విచారణకు అనుమతి కోరతామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు.హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్శంషాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావు హైదరాబాద్ చేరుకున్నారు. పదిహేను నెలల తర్వాత ఆయన ఆదివారం రాత్రి 7.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అనంతరం సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈరోజు(ఆదివారం, జూన్8వ తేదీ) అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాకర్‌రావు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ(special intelligence bureau) చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరు కావడానికి నగరానికి వచ్చారు. రేపు(సోమవారం, జూన్9 వతేదీ ) సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్‌రావు. ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరుగనుంది. ఇక ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయనన్నారు. ప్రధానంగా రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. -
Phone Tapping Case: అమెరికా నుంచి తిరిగిరానున్న ప్రభాకర్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. భారత్‌కు వస్తున్నా అంటూ ప్రభాకర్ రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఈ మేరకు జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టు తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో ఆయన భారత్‌కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకున్నారు. ప్రభాకర్ భారత్‌కు వస్తున్న పనేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ ఉరావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్, ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(SIT) తేల్చి చెప్పింది.ఫోన్ ట్యాపింగ్ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని.. దేశానికి వచ్చిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘నేను 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించాను. నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారు. పాస్‌పోర్టు ఇస్తే నేను దేశానికి వస్తాను. విచారణకు సహకరిస్తా. గతంలో అనేకమందికి ఈ కేసులో బెయిల్ ఇచ్చారు’’ అని కోర్టుకు ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తెలియజేశారు. ప్రభుత్వం తరఫున వాదనలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి పారిపోయాడు. పరారీలో ఉన్న నేరస్తుడు షరతులు పెట్టడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇస్తానంటేనే, దేశానికి వస్తానని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఇదిలాగే కొనసాగితే సాంప్రదాయంగా మారుతుంది. ప్రభాకర్ రావును మేము కచ్చితంగా అరెస్టు చేస్తాం. ఆయన చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాల తీవ్రత తెలిసే , చెన్నై నుంచి అమెరికాకు పారిపోయాడు. కోర్టు అతన్ని ప్రకటిత నేరస్తుడిగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్.. ప్రభాకర్‌రావుకు ఊరట ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: నేనూ తిక్కదాన్ని.. నాతో పెట్టుకోవద్దు -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అమెరికాలో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో బిగ్ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా ప్రభుత్వం తోసి పుచ్చింది. దీంతో, తెలంగాణ పోలీసులు.. అమెరికా నుంచి ప్రభాకర్ రావుని డిపోర్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత సంవత్సరం నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్ రావును అభ్యర్థనను తోసిపుచ్చింది. తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని తేల్చి చెప్పింది. దీంతో, ఆయన అమెరికాను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉండగా.. ఇంటర్‌పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. అయితే, ప్రభాకర్ రావును భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం. ప్రభాకర్‌ను ఎలాగైనా తెలంగాణకు తీసుకురావాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, భారత్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నానని నిందితుడు ప్రభాకర్‌రావు (ఏ–1) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ముందు మంగళ వారం వాదోపవాదాలు జరిగాయి. తనను అన్యా యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్ల సీనియర్ సిటి జన్నని, తన వైద్య, ఆరోగ్య పరిస్థితులు, వైద్యం చేయించుకునే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్‌రావు వారంలో భారత్ రావడానికి సిద్ధంగా ఉన్నారని, పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకునే అవకాశం ఉన్నందున అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఏ–6 శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చిందని, అదే ఉత్తర్వులను ప్రభాకర్‌రావుకూ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రతిని అందజేశారు. నిరంజన్‌రెడ్డి వాదనలను.. ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా తోసిపుచ్చారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిందని, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ఆయన తనంతట తానుగా వారంలో భారత్‌కు వస్తున్నారని చెప్పడం అసత్యమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ప్రభుత్వం తరపున లూద్రాతో పాటు పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. -
Phone Tapping Case: ‘ముందస్తు బెయిలిస్తే విచారణకు వస్తా’..
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. విచారణలో భాగంగా తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్‌రావు కోరారు.ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకొస్తామని చెప్పారు. ప్రభాకర్ రావు తరుఫున ఆయన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దైతే ఇండియాకు ఎలా తిరిగొస్తారని ప్రభుత్వ లాయర్ సిథార్థ లూథ్రా ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్నకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది -
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ఈయనపై ఇటీవల ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా పాస్‌పోర్టు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి (ఆర్పీఓ) లేఖ రాశారు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మార్చిలో పరారీ... టి.ప్రభాకర్‌రావు 2023 డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్‌ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన గత ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. తనపై అరెస్టు వారెంట్ జారీ చేయొద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ప్రభాకర్‌రావు తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం 2024 జూన్ 26న తిరిగి వస్తానంటూ వివరణ ఇచ్చారు. ఆపై జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారి రాసిన లేఖలో తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పుడు ఇంపౌండ్...ఇప్పుడు క్యాన్సిల్ రాష్ట్ర పోలీసులు తొలుత ఆర్పీఓ ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై పాస్‌పోర్టు పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ఈ ఫైల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగానే, ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఓ వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు కావడం, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం, బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితేనే పాస్‌పోర్టు రద్దుకు ఆస్కారముంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ ఉండటంతోపాటు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆర్పీఓకు మరో లేఖ రాయడం ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు చేయించారు.రద్దు అయినా.. రప్పించడం ప్రహసనమే ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిన సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగితే.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఆపై ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుంటే ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే...ఎల్ఓసీ మాదిరిగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. దీంతో పోలీసులు ప్రభాకర్‌రావును అమెరికా డిపోర్టేషన్‌కు (బలవంతంగా తిప్పిపంపడం) సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ద్వారా ఆ దేశ ఏజెన్సీలను సంప్రదించి రెడ్‌కార్నర్ నోటీసుతోపాటు ఇతర వివరాలు అందిస్తున్నారు. -
శ్రవణ్ ఫోన్లపైనే సిట్ ఫోకస్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ!
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్‌ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. -
ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్ ఇవ్వొద్దు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున కౌంటర్ దాఖలు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.కౌంటర్ కాపీలో ఏముందంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావే కీలకం. ఎస్ఐబీలో ఎస్వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఎస్వోటీ పనిచేసింది. ఫోన్ట్యాపింగ్కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు.... ఓఎస్డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్‌కు రాలేదు’’ అని ఉంది. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్ లభించింది. -
రెండోసారి గంట సేపు విచారణ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు బుధవారం రెండోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు వచ్చిన ఆయనను అధికారులు దాదాపు గంటపాటు ప్రశ్నించారు. శనివారం మొదటిసారి సిట్ ముందు హాజరైనప్పుడు అధికారులు, శ్రవణ్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం సైతం సుదీర్ఘంగానే విచారించాలని భావించారు. అయితే హెచ్‌సీయూ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో కేవలం గంట మాత్రమే ప్రశ్నించి పంపిస్తూ.. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. శ్రవణ్‌రావు గతంలో ఓ టీవీ చానల్‌ను నిర్వహించారు. ఆ చానల్‌ను ఎందుకు తీసుకున్నారు? దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోపక్క దుబాయ్‌లో సొంత ఫ్లాట్ ఉన్న శ్రవణ్, ఇటీవల రెండు నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఫ్లాట్ ఎప్పుడు? ఎలా? ఖరీదు చేశారనే అంశంతో పాటు ఆ ఐదుగురు ఎవరని పోలీసులు అడిగారు. కాగా, పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా శ్రవణ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదని తెలు స్తోంది. శనివారం విచారణ సందర్భంగా శ్రవణ్‌రావు తాను 2023 ఎన్నికల సమయంలో ఓ సర్వే చేశానని. దాని వివరాలను ప్రభాకర్‌రావుతో పంచుకున్నానని చెప్పారు. ఆయనతో పాటు ఆయన ద్వారా పరిచయమైన ప్రణీత్‌తో తప్ప మరే ఇతర అధికారి, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేదంటూ శ్రవణ్‌రావు వాదిస్తున్నారు. అయితే ఆ సర్వే ఎవరి సూచనల మేరకు చేశారు? అందుకు సంబంధించిన నగదు ఎవరు చెల్లించారు? అనే అంశంపై పోలీసులు ప్రశ్నించినా.. శ్రవణ్ నుంచి సామాధానం రాలేదని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ 2 ఫోన్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని తీసుకువచ్చి అప్పగించాలని శనివారమే స్పష్టం చేశారు. అయితే బుధవారం ఆయన ఓ పాత సెల్‌ఫోన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది చూసి షాక్‌కు గురైన పోలీసులు గతంలో వాడినవి కావాలని స్పష్టం చేశారు. ఆ రెండు సెల్ఫోన్లను ఎనిమిదో తేదీన విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్లను మార్చే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఆయన నుంచి సరైన సహకారం లభించడం లేదని పోలీసులు చెపుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్‌రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 శ్రవణ్ రావుకు పోలీసుల నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్‌రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరద్దర్నీ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఇక, తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో రైట్.. రైట్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం అందింది. దీంతో ఈ ఇద్దరు నిందితులను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమమైంది.తెలంగాణలో కిందటి ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు(Prabhakar Rao)తోపాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావుల(టీవీ చానెల్ మాజీ ఓనర్)పై సిట్ దృష్టిసారించింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా.. ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరమేర్పడిందని దర్యాప్తు బృందం చెబుతోంది. ప్రణీత్ రావు(Praneeth Ra0) అరెస్ట్ తర్వాత కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోం శాఖ.. కేంద్ర హోం శాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈలోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది.మరోవైపు.. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల నాంపల్లి న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. అయితే.. వీలైనంత త్వరగా వీరిద్దరినీ తీసుకొచ్చేందుకు పోలీసులు మమ్మర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నిందితులపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను పోలీసులు రద్దు చేయించిన సంగతి తెలిసిందే. ఇక, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్కు(United States Department of Homeland Security) సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంది. అయితే.. రెడ్ కార్నర్ అంటే అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ ఏం కాదు. అది కేవలం రిక్వెస్ట్ మాత్రమే. ఇంకోవైపు.. భారత్‌కు వచ్చేందుకు ప్రభాకర్ సిద్ధంగా లేని పరిస్థితులు చూస్తున్నాం. దీంతో అక్కడి న్యాయస్థానాలను గనుక ఆయన ఆశ్రయిస్తే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురు కావొచ్చు.


