ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు | RS Praveen Kumar Key Comments On Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు

Apr 30 2026 3:01 PM | Updated on Apr 30 2026 6:13 PM

RS Praveen Kumar Key Comments On Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచే వారని బీఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని రెండో సిట్ వేశారు’’ అంటూ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్‌రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్‌రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు

..కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. ఇస్రో సైంటిస్ట్‌ నంబి నారాయణన్‌పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిశాంక్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు.

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్‌ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను దైర్యంగా ఎదుర్కొంటాము. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్‌ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను’’ అని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement