టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు .
తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది.
తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.


