Rajasthan: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! | Churu Car-Truck Accident, Six Killed | Sakshi
Sakshi News home page

Rajasthan: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!

Oct 24 2026 12:36 PM | Updated on Oct 24 2026 12:46 PM

Churu Car-Truck Accident, Six Killed

చురు: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తారాగర్ ప్రాంతంలోని సోమ్సీసర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం కారులో గోగామేడిలోని దేవాలయ దర్శనానికి బయలుదేరింది. చురు జిల్లాలోని సాదుల్‌పూర్ ప్రాంతంలో దద్రేవా వద్దకు రాగానే, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. ఈ  ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడు నెలల చిన్నారిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదీ చదవండి: కేరళ గవర్నర్ శాకాహార కిచెన్ ఆదేశాలపై దుమారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement