breaking news
death
-
మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్
హోటల్ లేదా రెస్టారెంట్ అంటే సాధారణంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా భావిస్తాం. కానీ వారణాసిలోని ముక్తి భవన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. జీవిత చరమాంకంలో ఉన్నామని భావించే కొందరు వృద్ధులు ఇక్కడికి వచ్చి, తమ చివరి రోజులను గడపాలని కోరుకుంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకమే ఈ ప్రత్యేక ప్రదేశం ఏర్పాటుకు ప్రధాన కారణం. అయితే ఇక్కడికి వచ్చిన వారికి ఒక కీలక నిబంధన ఉంది.. 15 రోజులకు మించి ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు.కాశీ నడిబొడ్డున.. ముక్తి భవన్ముక్తి భవన్‌ను కాశీ లాభ్ ముక్తి భవన్ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గోదౌలియా ప్రాంతంలోని గిర్జా ఘర్ చౌరాహా సమీపంలోని మిశిర్ పోఖ్రా ప్రాంతంలో ఇది ఉంది. గీతా మందిర్ రోడ్డుపై, పాత నగర ప్రాంతానికి, ప్రసిద్ధ ఘాట్లకు సమీపంలో ఈ భవనం ఉంది. కాశీలోని ఆలయాలు, పురాతన వీధులు, గంగానదికి దగ్గరగా ఉండటం వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందువులు వారణాసిని భారతదేశంలోని అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటిగా భావిస్తారు.‘కాశ్యాం మరణం ముక్తి’.. అదే నమ్మకంకాశీకి సంబంధించిన పురాతన నమ్మకాల్లో ‘కాశ్యాం మరణం ముక్తి’ అనే భావన ఒకటి. అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం కర్మ ప్రభావంతో జీవి జనన, మరణ చక్రం కొనసాగుతుంటుంది. కాశీలో మరణం ఆ చక్రం నుంచి విముక్తికి మార్గం చూపుతుందని విశ్వసిస్తారు. కాశీలో మరణించే వారికి స్వయంగా శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తాడనే మరో నమ్మకం కూడా ఉంది. అందుకే కొందరు వృద్ధులు తమ జీవితపు చరమాంకంలో వారణాసికి రావడాన్ని మరణం వైపు ప్రయాణంగా కాకుండా, ఆధ్యాత్మిక ముక్తి కోసం చేసే ప్రయాణంగా భావిస్తారు.1958లో ప్రారంభం.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిందిముక్తి భవన్‌ను 1958లో డాల్మియా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. మరణం సమీపించిందని భావించే వారు కాశీలో తమ చివరి రోజులను గడిపేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో దీని ప్రత్యేక ఉద్దేశం వారణాసిని దాటి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు ఇక్కడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 2016లో విడుదలైన హిందీ చిత్రం ‘హోటల్ సాల్వేషన్ (ముక్తి భవన్)’ ద్వారా ఈ ప్రదేశం మరింత విస్తృతంగా అందరికీ పరిచయమైంది. మరణం కోసం కుమారుడితో కలిసి వారణాసికి వచ్చే ఓ వృద్ధుడి కథాంశం ఆధారంగా ఆ సినిమా రూపొందింది.15 రోజులే ఎందుకు?.. ఇదే అసలు నిబంధనముక్తి భవన్లో ఉన్న ప్రత్యేక నిబంధన ఏమిటంటే.. ఇక్కడ పరిమిత కాలం మాత్రమే బస చేసేందుకు అవకాశం ఉండటం. సాధారణంగా ఇక్కడికి వచ్చే వారికి 15 రోజుల వరకు ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలో మరణం సంభవించకపోతే, కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. బయటివారికి ఈ నిబంధన ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, సంస్థ ఉద్దేశానికి అనుగుణంగానే దీనిని అమలు చేస్తారు. ముక్తి భవన్ వృద్ధులకు దీర్ఘకాలిక వసతి కల్పించే కేంద్రం కాదు. జీవిత చివరి దశలో ఉన్నామని భావించే వారికి చివరి రోజులను గడిపే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం.ప్రార్థనలు, భజనల మధ్య సహజ మరణంముక్తి భవన్ సాధారణ అతిథి గృహంలా ఉండదు. ఇక్కడి వాతావరణం ప్రార్థనలు, భక్తి గీతాలు, మతపరమైన పారాయణలు, ఆచారాలతో కూడి ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ ఆప్తులతో కలిసి ఉంటారు. అయితే ఇక్కడ మరణాన్ని వేగవంతం చేసే ఎలాంటి ప్రయత్నాలు జరగవు. సహజంగానే మరణించే వరకు వేచి ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడినా లేదా 15 రోజుల గడువు దాటినా అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ముక్తి భవన్‌కు వచ్చే వారికి ఈ ప్రయాణం మరణం నుంచి తప్పించుకోవడం కోసం కాదు.. తమ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం జీవిత చరమాంకాన్ని స్వీకరించేందుకు చేసే ప్రయాణంగా భావిస్తారు. వృద్ధాప్యం, మరణాన్ని వీలైనంత ఆలస్యం చేసేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న సమయంలో, వారణాసి వీధుల్లోని ఈ చిన్న భవనం జీవితం, మరణం, మోక్షం గురించి మరో భిన్నమైన దృక్కోణాన్ని చూపిస్తుంది.ఇది కూడా చదవండి: నీమ్ కరోలి బాబా ఎవరు.. స్టీవ్ జాబ్స్‌ను ఎలా ప్రభావితం చేశారు? -
శిథిలాల నుంచి ఆస్పత్రి వరకు.. మేనమామ రోదన!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలిన పేయింగ్ గెస్ట్ (పీజీ) భవన శిథిలాల వద్ద నుంచి ఎయిమ్స్, ఆర్కే పురం పోలీస్‌స్టేషన్ వరకు ఓ వ్యక్తి పరుగులు తీశాడు. తన మేనల్లుడు సజీవంగా ఉన్నాడేమోనన్న ఆశతో అతడి కోసం ఆరా తీశారు. ఫోన్లోనూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిషేక్ మేనమామకు భవనం కూలిన విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నారు. తన మేనల్లుడు నివసించే ప్రాంతమే కావడంతో అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. తొలుత అదే పీజీనా కాదా అనే విషయంలో స్పష్టత లేకపోయినా.. ఫోన్లో అభిషేక్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే అక్కడికి వెళ్లినట్లు చెప్పారు.అయితే రాత్రి గడిచేకొద్దీ ఆయన ఆశలు సన్నగిల్లాయి. సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం 9 గంటలకు ఘటనాస్థలిలో ఎవరి ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. సత్య నికేతన్ నుంచి అందరినీ తరలించారని, సమాచారం కోసం ఎయిమ్స్ లేదా ఆర్కే పురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. అభిషేక్ ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో మూడో సంవత్సరం విద్యార్థి. అభిషేక్ తెలివైనవాడని మేనమామ తెలిపారు. అభిషేక్ కుటుంబ సభ్యులే కాకుండా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు కూడా తమ పిల్లల సమాచారం కోసం ఎయిమ్స్, సమీపంలోని పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. సెప్టెంబర్ 6న సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ భవనంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన 24 గంటల తర్వాత భవనం యజమాని హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఉర్మిలా గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారి కుమారుడు మహేశ్ గుప్తాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఇది కూడా చదవండి: Climate Risk Alert: డేంజర్ జోన్లో హైదరాబాద్! -
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్‌లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.భౌరంపేట్‌లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్‌కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
నేపాల్: జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు
కాఠ్మాండు: నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలకు సోమవారానికి 13 రోజులు పూర్తయ్యాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ భీకర వరదల్లో ఇప్పటివరకు 1,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరావడం లేదు. శిథిలాలు, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోమవారం నేపాల్ వ్యాప్తంగా జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేశారు. వరదల కారణంగా వేలాది కుటుంబాల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.విపత్తు జరిగిన ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం నేపాల్ సైనిక సిబ్బంది సహా వివిధ బృందాలు శోధిస్తున్నాయి. తమ ఆత్మీయుల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.ఆగస్టు 26న వచ్చిన ఆకస్మిక వరదలు భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,340కిపైగా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు సుమారు 5,000 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం శోధన కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ వివిధ వర్గాల ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి -
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
మెక్సికో: మతపరమైన వేడుకల్లో బాణసంచా సామగ్రికి నిప్పంటుకుని పేలుడు సంభవించిన ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 64 మంది గాయపడ్డారు. మెక్సికోలోని తేమాస్కాల్సింగో పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.శనివారం రాత్రి తేమాస్కాల్సింగోలోని ‘నుయెస్ట్రా సెనోరా డె లా లూజ్’ చర్చి సమీపంలో ఈ పేలుడు జరిగింది. మతపరమైన వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శనను వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చిన వీడియోల్లో శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్నవారి కోసం స్థానికులు గాలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.తేమాస్కాల్సింగో పట్టణ జనాభా సుమారు 66,000. ఇది మెక్సికో సిటీకి వాయవ్య దిశలో సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. మెక్సికోలో మతపరమైన వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో బాణసంచా వినియోగం సాధారణం. ఇలాంటి వేడుకల సమయంలో పేలుడు ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం హిడాల్గో రాష్ట్రంలోని హ్యూహుట్లా మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామంలో బాణసంచా కారణంగా సంభవించిన భారీ పేలుడులో 17 మంది గాయపడ్డారు.ఇది కూడా చడవండి: కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి -
ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. కొండచరియల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 172కు పైగా రహదారులు మూతపడ్డాయి. ఇందులో పితోరాగఢ్, నైనితాల్, బాగేశ్వర్లను కలిపే జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. బాగేశ్వర్‌లో ఎన్‌హెచ్-109 సహా 16 మార్గాలు స్తంభించడంతో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గౌలా, కోసి, క్షిప్రా, బిన్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.హల్ద్వానీ సమీపంలోని గౌలా నది నుంచి సుమారు 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పౌడీ జిల్లా కోట్ద్వార్ సమీపంలో కొల్హు నదిని దాటుతూ తల్లి, ఏడాదిన్నర చిన్నారి కొట్టుకుపోయి మరణించారు. అల్మోరా జిల్లా ఉదయ్ఉడా గ్రామంలో ఇళ్లపైకి శిథిలాలు విరుచుకుపడటంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందగా, ధార్ ప్రాంతంలో మరో ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల తీవ్రత దృష్ట్యా నైనితాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, పితోరాగఢ్ జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా సోన్‌ప్రయాగ్ వద్ద కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా, మందాకిని నదుల ఉధృతితో వరద ముప్పు తీవ్రమైంది. సీతాపూర్‌లో గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, ఘాజీపూర్‌లో ఇద్దరు బాలికలు గంగలో కొట్టుకుపోయారు. బలియాలో గంగానది ప్రమాద స్థాయికి 1.60 మీటర్ల ఎగువన ప్రవహిస్తుండటంతో 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారణాసిలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు మునిగిపోవడంతో అంత్యక్రియలను సమీప భవనాల డాబాలు, వీధుల్లో నిర్వహిస్తున్నారు. చిత్రకూట్‌లో మందాకిని నది ప్రమాద స్థాయిని దాటి 4 మీటర్ల మేర ప్రవహిస్తోంది. అటు ఝార్ఖండ్‌లోని గర్హ్వా, పలాము, సిమ్డేగా సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్) హెచ్చరికలు జారీ చేసింది.ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి? -
మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి
ఎటపాక/చింతూరు: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతిచెందగా, మరో 41 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మరో 16 మంది గ్రామస్తులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గౌరిదేవిపేట పీహెచ్సీ వైద్య సిబ్బంది మంగళవారం గొల్లగుప్ప గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి, గ్రామస్తులకు రక్తపరీక్షలు చేయగా కొంతమందికి మలేరియా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలోని జీపీఎస్ పాఠశాలకు చెందిన 27 మంది, అంగన్వాడీ పాఠశాలకు చెందిన 14 మంది చిన్నారులతో పాటు గ్రామస్తులకు క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చారు. ఆ మాత్రలు వేసుకున్న వారిలో జీపీఎస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు, కడుపు మంటతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అంబులెన్సులో తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించారు. గ్రామంలో మరికొంతమంది చిన్నారులకు కూడా కడుపు నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో కొందరిని ద్విచక్ర వాహనాలపై అటవీ మార్గం గుండా జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి అక్కడి నుంచి రెండు అంబులెన్సుల్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కూడా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు, చిన్నారులు కలిపి భద్రాచలంలో మొత్తం 34 మందికి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మీపురం పీహెచ్సీలో 24 మందికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. విషయం తెలిసిన వెంటనే చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఏఎస్పీ బొడ్డు హేమంత్ భద్రాచలం ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదివాసీ సంఘాల ఆగ్రహంవైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని గ్రామస్తులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా గిరిజన చిన్నారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆదివాసీల ప్రాణాలకు లెక్కలేకుండా పోతోందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం కూడా ఇదే గ్రామానికి చెందిన 11 ఏళ్ల పద్దం రోజా అనే బాలిక కడుపునొప్పితో మృతిచెందినట్టు తెలిసింది. -
నేపాల్: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన
ఖాట్మండు: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 939కి పెరిగింది. త్రిశూలి నది పరివాహక ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 900 మందికి పైగా కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో బాధితులు బతికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కొండ ప్రాంతాన్ని పేలుడు పదార్థాలతో పేల్చి, త్రిశూలి-3A సైట్‌లోని సొరంగాల్లోకి గాలిని పంపింగ్ చేస్తున్నాయి. నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం లెక్కల ప్రకారం, 592 మంది విదేశీయులతో సహా మొత్తం 3,925 మంది గల్లంతయ్యారు. చైనా, నేపాల్ సైనిక దళాలతో పాటు భారత్, కొరియా, ఆస్ట్రేలియా నిపుణులు ఈ సంయుక్త సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.సుమారు 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పర్ త్రిశూలి ప్రాజెక్టు నుంచి గత వారాంతంలో 250 మందిని రక్షించగా, మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు చిత్వాన్‌లో గుర్తుతెలియని మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు సరిపోక తాత్కాలిక ఖననాలు చేపట్టారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు పూర్తయిన తర్వాతే అవశేషాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఇటు టిబెట్ పరిధిలో 16 మంది మరణించగా, 546 మంది గల్లంతైనట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్ -
‘నేను లూజర్’.. విద్యార్థి బలవన్మరణం
అలీగఢ్: యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి చెందిన విద్యార్థి కృష్ణ తాను ఉంటున్న పీజీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్లో ‘నేను లూజర్‌ని, ఏమీ చేయలేకపోతున్నాను, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. 19 ఏళ్ల కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మూడు నెలల క్రితమే ఆ యువకుడు ఎన్డీఏ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.కృష్ణ తండ్రి విక్రాంత్ శర్మ జమ్ములోని పీర్ మీఠా ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆయన బీజేపీ తూర్పు మండలానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కృష్ణ నాలుగు రోజుల క్రితమే స్వస్థలం నుంచి అలీగఢ్‌కు తిరిగి వచ్చాడు. ఘటన జరగడానికి మూడు గంటల ముందే కృష్ణతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తండ్రి తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత కృష్ణ ఏఎంయూ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగంలో బీఏ రెండో సంవత్సరం ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుతున్నాడు.కృష్ణ ఏఎంయూ వెలుపల ఉన్న దోద్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో పీజీలో ఉండేవాడు. ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అతనికి తదుపరి ఇంటర్వ్యూ జరగాల్సి ఉంది. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే తండ్రి జమ్ము నుంచి అలీగఢ్ చేరుకున్నారు. కృష్ణ గదిలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో ‘బాబు’ అనే పదం కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు అతని స్నేహితులను విచారిస్తున్నారు. అతను ఫోన్లో ఎవరితోనో ఎక్కువ సమయం మాట్లాడేవాడని సహచర విద్యార్థులు తెలిపారు.పోలీసులు అతని మొబైల్ లాక్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్ డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. కృష్ణ గత ఆగస్టు 15న జమ్మూ నుంచి అలీగఢ్‌కు వచ్చినట్లు తండ్రి పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ రోజున వీడియో కాల్ ద్వారా సోదరితో రాఖీ కట్టించుకుంటానని మాట ఇచ్చాడు. అయితే ఆ పండుగకు ముందే ఈ విషాద వార్త చేరింది. కృష్ణ మరణంతో తల్లి, సోదరి తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: 18 నెలల పసికందు ఎదురుచూపులు.. -
ఈ సీజన్లో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సీజన్లో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల మహిళ బలరాంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్షణాలను పరిశీలించిన వైద్యులు స్వైన్ ఫ్లూ పరీక్ష చేయించాలని సూచించారు. ఆగస్టు 24న ఒక ప్రైవేట్ ల్యాబ్ ఆమెకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించింది. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు ఆగస్టు 25న ఆమెను బలరాంపూర్ ఆసుపత్రిలో చేర్పించారు.పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ అందించినప్పటికీ, గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు మృతి చెందారు. అయితే, ఆమె మరణించిన తర్వాతే కుటుంబ సభ్యులు స్వైన్ ఫ్లూ పాజిటివ్ రిపోర్టును వైద్యులకు చూపించారు. ఈ సమాచారంతో ఆసుపత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా, ఆమెకు చికిత్స అందించిన 17 మంది వైద్యులు, సిబ్బందితో పాటు సమీపంలోని రోగుల నమూనాలను సేకరించి కేజీఎంయూ కి పంపారు. సంబంధిత వైద్య సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.మహిళకు నిర్వహించిన పరీక్ష వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారని, స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఎలిసా పరీక్ష రిపోర్టు అవసరమని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.బి. సింగ్ తెలిపారు. బాధిత మహిళ ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని సేకరిస్తూ కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులకు మందులు అందించి, ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘ఈ బంధం అబద్ధమా..’.. ఇకపై క్లింటన్‌కు ‘రాఖీ’ లేదు! -
వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి
యర్రగొండపాలెం: వీడియో కాల్ ద్వారా డాక్టర్ల సలహాతో కాంపౌండర్, నర్సులే ఓ గర్భిణికి అబార్షన్ చేయగా, అది వికటించడంతో ఆమె మృతి చెందింది. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఈ దారుణం జరిగింది. యర్రగొండపాలెం మండలం మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) 5 నెలల గర్భాన్ని తీయించుకునేందుకు యర్రగొండపాలెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడ అన్నీ తామై ఆపరేషన్లు చేస్తున్న కాంపౌండర్, నర్సులు కలిసి ఆమెకు అబార్షన్ చేసేందుకు పూనుకున్నారు.వీడియో కాల్లో డాక్టర్లను సంప్రదించి ఆపరేషన్ చేయగా బ్లీడింగ్ ఎక్కువైంది. దీంతో సమీపంలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అక్కడికి మాబున్నీని తీసుకెళ్లగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందింది. అవగాహన లేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాబున్నీ మృతి చెందిందని బంధువులు ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.మెడికల్ షాపు యజమానే హాస్పిటల్ యజమాని!మాబున్నీకి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తిరిగి గర్భందాల్చిన ఆమె లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆడపిల్ల అని తేలడంతో ఆమె అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె అబార్షన్ చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్ వైద్యం చేస్తుండేవారు. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత ఒక మెడికల్ షాపు యజమాని ఆ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అక్కడకు ఎక్కువగా అబార్షన్ కేసులే వస్తుంటాయని సమాచారం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు యర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ తెలిపారు. -
కాన్పూర్‌లో కూలిన శిక్షణ విమానం: పైలట్, కో పైలట్ మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గంగా బ్యారేజ్ సమీపంలో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నత్థూపుర్వా గ్రామం వద్ద శిక్షణ కోసం ఉపయోగిస్తున్న ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన ఈ విమానం ఒక ప్రైవేట్ సంస్థకు చెందినదిగా అధికారులు గుర్తించారు. దీనిని పైలట్ శిక్షణ కోసం వినియోగిస్తున్నారు. గంగా బ్యారేజ్ పరిసరాల్లోని నత్థూపుర్వా వద్ద ఈ శిక్షణ విమానం అకస్మాత్తుగా నేలకూలింది. విమానం కుప్పకూలిన వెంటనే భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ఈ శిక్షణ విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు, పరిపాలనా యంత్రాంగంతో పాటు సంబంధిత విమానయాన దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. అధికారులు ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు, విమాన శకలాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.ఇది కూడా చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
పాక్‌లో ఘోరం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డలు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మిలాద్ ఉన్ నబీ పూట నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇస్లామాబాద్ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది శిశువులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.కారణం ఏంటంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిల్లల వార్డులోని ఎయిర్ కండిషనర్(AC) కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అధికారులు మాత్రం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. తొలుత మృతుల సంఖ్యపైనా స్పష్టత రాలేదు. కాసేపటికే 15 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు స్థానిక జియో టీవీ కథనం ఇచ్చింది.తెల్లవారుజామునే విషాదంసమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. నాలుగు ఫైరింజన్లు, ఆరు ఆంబులన్స్లు రెస్క్యూలో పాల్గొన్నాయి. అయితే బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొంతసేపటి పాటు ‘కూలింగ్ ఆపరేషన్స్’ కొనసాగినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కన్నవాళ్ల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.🚨 TRAGIC: Fire at PIMS Hospital in Islamabad Kills 15 NewbornsAC compressor explosion in the gynecology ward sparks deadly blaze.#PIMS #Islamabad #Pakistan #BreakingNews@MarioNawfal pic.twitter.com/Z2exHnPX3J— DR ADNAN ALI (@DrMalko) August 26, 2026 ఇదీ చదవండి: భారత్‌లో ఆ మరణాలు.. షాకిచ్చిన నివేదిక -
ఫిట్నెస్ ఈవెంట్లో కుప్పకూలిన ప్రముఖ కోచ్
బ్యాంకాక్: తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్‌లో ‘ఐఏవోటీ క్రాస్‌ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు.పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం.సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత? -
ఆఫ్రికాలో కూలిన బంగారు గని.. 30 మంది దుర్మరణం
బాంగీ: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. నానా-మంబేరే ప్రావిన్స్‌లోని అబ్బా ప్రాంతంలో ఉన్న ఒక బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గనిలో పనిచేస్తున్న 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, సహాయక సిబ్బంది శ్రమించి శిథిలాల నుంచి 30 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా పలువురు కార్మికులు మట్టి దిబ్బల కిందే చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఫ్లోరియన్ గాగుయెండే అనే కార్మికుడు మాట్లాడుతూ.. ఇది ఎటువంటి ఆధునిక సాంకేతికత లేని సాంప్రదాయ గని అని తెలిపారు. లోపల చిక్కుకున్న తోటి కార్మికులు సజీవంగా బయటపడతారనే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డిప్యూటీ మేయర్ సులేమాన్ బి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సంస్థలు తక్షణమే స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతినిధి ఇవారిస్తే నగామానా బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, అన్ని విధాలా ఆదుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. సరైన భద్రతా పరికరాలు, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గనుల విభాగంలో తక్షణ భద్రతా సంస్కరణలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతి గృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ (11) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విద్యార్థి చనిపోయిన ముందు రోజు నుంచి హాస్టల్లో కనిపించడం లేదు, విద్యార్థి బంధువు ఒకరు వచ్చి చెప్పేంత వరకు హాస్టల్ వార్డెన్కూ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ముందు రోజు వసతి గృహంలో అదృశ్యమైన విద్యార్థి మరుసటి రోజు వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో మృతదేహంగా కనిపించడం గమనార్హం. కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం గ్రామానికి చెందిన ముద్దాడ జయరాం, ఆమె భార్య భవానీ హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.వీరి పెద్ద కుమారుడే దుర్గాప్రసాద్. ఆదివారం సాయంత్రం దుర్గాప్రసాద్ వసతి గృహం నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం సరియాపల్లి గ్రామానికి చెందిన కూరాకుల దశరథ అనే వ్యక్తి హాస్టల్‌కు వచ్చి తమ గ్రామానికి చెందిన విద్యార్థులతో మాట్లాడాడు. మాటల సందర్భంలో దుర్గా ప్రసాద్ గురించి అడగ్గా.. అతడు ఇంటికి వెళ్లాడని తోటి విద్యార్థులు చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.కానీ విద్యార్థి కమలనాభపురం, సరియాపల్లిలోని తాతయ్య ఇంటికి కూడా వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి తాతయ్య సింహాచలం, అమ్మమ్మ అప్పలమ్మ తదితరులు హాస్టల్‌కు వచ్చి తమ మనవడి కోసం సిబ్బందిని అడిగారు. దీంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులకు విషయం తెలియడంతో వెతుకులాడారు. హాస్టల్ సమీపంలో ఉన్న చెరువులో విద్యార్థి చెప్పులు కనిపించడంతో గాలించగా మృతదేహం దొరికింది. ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
ఈ చావుకు బాధ్యులెవరు?
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు: పండుగైనా, పుట్టిన రోజైనా, రాజకీయ నేతల పర్యటనలైనా ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. అభిమానం ముసుగులో మృత్యువుతో చెలగాటం ఆడుతున్నామన్న ఆలోచనను యువకులు విస్మరిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో కనీస భద్రతా ప్రమాణాలను పాట్టించడం లేదు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ తీగలు తగిలి గోకుల్, విఘ్నేష్ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకొన్న తాజా దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి?.. ఆర్భాటాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలా?.. నిబంధనలు అమలు చేయని అధికారులా?.. అభిమానం పేరిట హద్దులు దాటుతున్న యువకులా?.. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులా? ఎవరు.. ఎవరు అన్న ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.పుత్తూరు పట్టణంలో గత శుక్రవారం చోటు చేసుకొన్న గోకుల్, విఘ్నేష్ అనే విద్యార్థుల అకాల మరణంపై పెద్ద చర్చే జరుగుతోంది. అది ఒక ప్రమాదం కాదని, ఈ దుర్ఘటనను ఇద్దరు విద్యార్థులు విద్యుత్ తీగలు తగిలి మృతి అంటూ ఒక వార్తగా చదవరాదని పలువురు వాదనలు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో యువకుల తొందరపాటు, తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం కూడా ఉందంటూ వివరిస్తున్నారు.ఫ్లెక్సీలు కట్టడం చిన్న పని కాదు పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలు, రాజకీయ నాయకుల పర్యటనలు అంటూ ప్రతి కార్యక్రమానికీ రోడ్డు పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు సాధారణ విషయంగా మారిపోయింది. అయితే వీటిని ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఫోల్స్, రహదారి పక్కన ఉండే గోతులు, వాహనాల ఎత్తు వంటి పలు విధాలుగా మృత్యువు పొంచి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి యువకులు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు నడుం బిగించాల్సి ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది.రాజకీయ నేతలు చేయాల్సింది ఏమిటీ?నాయకులు, ప్రజాప్రతినిదులు సైతం తమ అభిమానులు ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. పరిమిత పరిమాణం, పరిమిత సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలన్న సూచనలు చేయాలి. తమ స్వాగతం కోసం మరొకరి ప్రాణం పోకూడదన్న బాధ్యతగా రాజకీయ నేతలు వ్యవహరించాలి.అధికారుల బాధ్యత ఏదీ? పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫ్లెక్సీల నియంత్రణలో అధికారుల పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారుల బాద్యత ఎంతో కీలకం. అయితే వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రమాదాలకు పరోక్షంగా అవకాశం కల్పిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.అధికారులు పరిశీలించాల్సిన అంశాలుఫ్లెక్సీ ఎక్కడ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు?విద్యుత్ పోల్స్, తీగలు ఎంత దూరంలో ఉన్నాయి?రహదారిలో వాహనాలకు అడ్డు తగిలే అవకాశం ఉందా?ఫ్లెక్సీ పరిణామం, నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా?గాలి, వానకు ఫ్లెక్సీ కూలితే పాదచారులకు, ప్రయాణికులకు ప్రయాదం జరిగే అవకాశం ఉందా?ఫ్లెక్సీ ఏర్పాటు సమయం, కాల పరిమితి ఎంత? ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఫ్లెక్సీ ఏర్పాటుకు తగిన రుసుం వసూలు చేసి అనుమతివ్వాలి. -
యాసిడ్ తాగి వివాహిత మృతి.. మృతదేహాన్ని వెలికితీసి..
ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నీలోఫర్ అనే వివాహిత ఉదంతం సంచలనం సృష్టిస్తున్నది. మోహన్ టాకీస్ ప్రాంతానికి చెందిన నీలోఫర్ శనివారం మధ్యాహ్నం యాసిడ్ తాగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఇండోర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించకుండానే అత్తమామలు మృతదేహాన్ని ఖననం చేశారని పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్డీఎం, తహశీల్దార్ ఆదేశాలతో ఘటన జరిగిన మరుసటి రోజే అధికారులు రంగంలోకి దిగారు. సమాధి నుంచి నీలోఫర్ మృతదేహాన్ని వెలికితీసి, తహశీల్దార్ సమక్షంలో పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కోత్వాల సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సిర్సాఠ్ మాట్లాడుతూ, అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి వైద్య పరీక్షల కోసం పంపామని తెలిపారు. మరణానికి గల కారణాలు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఇది కూడా చదవండి: పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు! -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
సఖినేటిపల్లి/ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నరసాపురం కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో వెళ్తున్న కారు లాకుల వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోవడంతో నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.ఒక యువకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. వివరాలివీ.. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకూరి రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను (18), నాగిరెడ్ది దుస్వంత్ (18) నర్సాపురంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరంగ్ కళాశాలలో చదువుతున్నారు. వీరితోపాటు నర్సాపురానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్య (19), మట్టా సంతోష్ (19), పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) కూడా అదే కళాశాలలో వారితో కలిసి చదువుతున్నారు.ఈ ఆరుగురు కలిసి శనివారం రాత్రి కారులో ఒక స్నేహితుడి బంధువు ఇంట జరిగిన వివాహానికి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన ఈ వివాహానికి హాజరైన వీరు తిరుగు ప్రయాణంలో ఉండగా, ఐతంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నుంచి సంతోష్ బయటపడగా, మిగిలిన ఐదుగురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సంతోష్ వెంటనే స్థానికులకు ప్రమాద సమాచారం తెలియజేశాడు.పోలీసులు వచ్చి ఎన్డీఆర్ఎఫ్, అగి్నమాపక సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టగా.. ప్రమాదస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీభాను, దుస్వంత్, సాయిసూర్య, సాయికిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజారామ్ కోసం గాలిస్తున్నారు. కారును వెలికితీశారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెట్టుకొమ్మలను పట్టుకుని.. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే తనకు దొరికిన చెట్టుకొమ్మలను పట్టుకుని కారు పైకి ఎక్కానని చెప్పాడు. తనకు ఈత రావడంతో వెంటనే అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపాడు. తన స్నేహితులను కాపాడుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యాడు. -
ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి
7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ లాంటి హిందీ సినిమాలతో పాటు 'తగ్గేదే లే' అనే తెలుగు మూవీలోనూ నటించిన అనన్య రాజ్(27) చనిపోయింది. గత నెల 15న ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఈమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనన్య ఇన్ స్టాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?)అనన్య రాజ్ గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడినట్లు రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నందున తమ వ్యక్తిగత గోప్యతని గౌరవించాలని అభిమానులు, మీడియాని కోరారు.'ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది' అని అనన్య ఇన్ స్టాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ananya ✨ (@ananyaraj.official) -
ముంబై: నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి!
ముంబై: ముంబైలోని నేవీ నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన ఒక నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు తమ నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నావికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే ఇంట్లో రెండు నెలలు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలు కూడా లభించాయి. ప్రాథమిక పరిశోధనలో పిల్లలు విషప్రయోగం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వస్తేనే నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు, ఇతర సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు లియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ నేవీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొలాబాలోని నేవీ నగర్లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో నావికుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తునకు నావికాదళం పూర్తిగా సహకరిస్తున్నదని పేర్కొంది.ఇది కూడా చదవండి: కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో! -
సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!
సైక్లింగ్‌లో విషాదం నెలకొంది. బ్రిటన్ సైక్లిస్ట్ 19 ఏళ్ల ఫిన్లే టార్లింగ్ పోర్చుగల్‌లో నిర్వహిస్తున్న సైక్లింగ్ టూర్లో పాల్గొన్నాడు. వోల్టా పోర్చుగల్ టూర్లో భాగంగా ఎనిమిదో దశలో సంభవించిన ఘోర ప్రమాదంలో గాయపడిన ఫిన్లే శుక్రవారం ప్రాణాలు విడిచాడు. మెల్గాకో నుండి ఫాఫే వరకు ఉన్న 166.8 కిలోమీటర్ల మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో కింద పడిన టార్లింగ్కు తీవ్ర గాయాలయ్యాయి.Photo Credit: Twitterకాగా ఫిన్లే టార్లింగ్ ప్రస్తుతం ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్ తరఫున పోటీ పడుతున్నాడు. టైమ్ ట్రయల్స్‌లో నిపుణుడైన టార్లింగ్ గతేడాదే ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్‌లో చేరాడు. రోడ్ అండ్ ట్రాక్ సైక్లింగ్‌లోనూ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా ఫిన్లే మరణవార్తను ఎన్ఎస్ఎన్ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. "ఈరోజు వోల్టా ఎ పోర్చుగల్‌లో ఫిన్లే టార్లింగ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం మమ్నల్ని చాలా బాధించింది. మా కుటుంబంలో ఒకడైన ఫిన్లే కుటుంబానికి ఇదే మా ప్రగాడ సానుభూతి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా." అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రమాదం తర్వాత రేసును నిలిపిపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా 19 ఏళ్ల ఫిన్లే మృతిపై బ్రిటీష్, పోర్చుగీస్ సైక్లింగ్ సమాఖ్య నివాళి అర్పించింది.🇵🇹 | Acabam de ser reveladas imagens que demonstram a brutalidade do embate fatal que vitimou Finlay Tarling.O jovem de 19 anos não terá resistido aos ferimento e faleceu no local. pic.twitter.com/YuXcZY8koR— Questiona-te (@questiona_te) August 14, 2026Read: లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా! -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి
శ్రీలంక క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెటర్ల మధ్య జరిగిన దాడిలో 62 ఏళ్ల లంక క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో కన్నుమూశారు. కొలంబోలో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇది చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఫెర్నాండో గురువారం రాత్రి చికిత్స పొందుతూ మరణించారు.కాగా సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు పాఠశాల స్థాయిలో కోచ్‌గా వ్యవహరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఒక క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా, అక్కడ నీటి వసతి అందుబాటులో లేదు. ఈ విషయంపై ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ముదరడంతో సుమిత్ ఫెర్నాండో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరు యువ క్రికెటర్లు కోచ్ ఫెర్నాండోపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమిత్ ఫెర్నాండోను కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన చికిత్స పొందుతూ మరణించడంతో లంక క్రికెట్ విషాదంలో మునిగిపోయింది.మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్‌గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో ఒకరైన మెండిస్.. ఆ తర్వాత శ్రీలంక వన్డే కెప్టెన్‌గా ఎదిగారు. అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒక ప్రముఖ క్లబ్ అయిన బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్లో గ్రౌండ్స్ క్యూరేటర్‌గా పనిచేశారు.అయితే సుమిత్ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన ఇద్దరు ఆటగాళ్లలో ఒక 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు, ఆ గొడవ జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత, కొలంబో పోలీసులు ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కోచ్ ఫెర్నాండోపై దాడి చేశాడనే అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నందున, అతను ఆగస్టు 17 వరకు కస్టడీలో ఉండే అవకాశం ఉంది. అతని ప్రాథమిక కస్టడీని కోర్టు పొడిగించినట్లు సమాచారం.చదవండి: సెంచరీ దిశగా తంజిద్.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న బంగ్లా! -
రైలు ఢీకొని ఏనుగు, దాని పిల్ల మృతి
వాళా: కేరళ-తమిళనాడు సరిహద్దులోని వాళా సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళూరు-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఒక అడవి ఏనుగు, దాని కూన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటల సమయంలో కావడిపార వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏనుగులు రైలు ఇంజిన్ కింద ఇరుక్కుపోవడంతో, వాటిని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.తమిళనాడు సరిహద్దు పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా రైలు సర్వీసులు కొన్ని గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే వాళా పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏనుగుల కారిడార్‌గా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ వాళా సమీపంలోని వట్టప్పార వద్ద యశ్వంత్‌పూర్-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఒక చిన్న ఏనుగు మృతి చెందింది.ఆ ప్రాంతంలో ఉన్న అధిక మలుపుల కారణంగా లోకో పైలట్లకు 100 మీటర్ల కంటే తక్కువ విజిబులిటీ ఉండటమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే ఈ మార్గంలో రాత్రి వేళల్లో గూడ్స్ రైళ్లకు 25 నుంచి 35 కి.మీ, ప్రయాణికుల రైళ్లకు 45 కి.మీ వేగ పరిమితి నిబంధనలు అమల్లో ఉంది. అయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతాల్లో రైలు మార్గాల వెంబడి వన్యప్రాణుల రక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్ -
3,000 మంది జాడ గల్లంతు
బొగాటా: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది మంది జాడ గల్లంతైంది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల్లో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 224కు పెరిగింది. పశ్చిమ కొలంబియాను చివురుటాకులా వణికించిన పెనుభూకంపం ఘటనలో 3,000 మందికిపైగా జనం జాడ తెలీకుండాపోయిందని రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అంచనావేస్తున్నాయి. భూకంప ప్రభావిత కాలీ, పెరీరా, ఛోకో, మనిజేల్స్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు ముమ్మరంగా అన్వేషణ, సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయా ప్రాంతాల మేయర్లు, గవర్నర్లు మంగళవారం ప్రకటించారు. అవిశ్రాంతంగా పనిచేస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ కోసం వెతుకుతున్నారు. -
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు
తెలంగాణ: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం: ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న అనంతరం బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. వైద్యంలో భాగంగా అధిక మోతాదులో మందులు, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించసాగారు.కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ (13) కొణిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అనంతరం బాలికకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా, విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని అప్పటికే మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు.అయితే, ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే, బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. -
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్‌పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్‌లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్‌పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్‌గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్‌పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
USAలో హైకింగ్‌కు వెళ్లిన భారతీయ సంతతి విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతికి చెందిన పీహెచ్డీ విద్యార్థి విక్రమ్ ముబాయి దురదృష్టవశాత్తు మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని ఇన్యో నేషనల్ ఫారెస్ట్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నాడు.వివారాల్లోకి వెళితే... విక్రమ్ ముబాయి ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్ లేక్స్ ప్రాంతంలో ఒంటరిగా హైకింగ్‌కు వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు తన కుటుంబ సభ్యులకు చివరిసారిగా సంప్రదించి, తాను ఉన్న ప్రదేశానికి సంబంధించిన GPS కోఆర్డినేట్స్ పంపించాడు.ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో, నిర్ణయించిన సమయానికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందంతో పాటు కాలిఫోర్నియా హైవే పట్రోల్ సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. చివరకు అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.అయితే విక్రమ్ ముబాయి ఎలా మరణించాడనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం వరకు హత్య లేదా ఇతర అనుమానాస్పద అంశాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాలర్ మృత్యువాత!
దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాలర్ సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపడిన భయానక దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.పిడుగుపాటుకు మైదానంలోనే కుప్పకూలిన సోఫ్వాన్‌కు సహచర ఆటగాళ్లు, అత్యవసర మెడికల్ బృందం సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన 'యాలా ఎఫ్‌సీ'కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. ఇక దక్షిణ థాయ్‌లాండ్ సరిహద్దులో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో అతిపెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో థాయ్‌లాండ్ సహా మలేషియా ఆటగాళ్లు కూడా తలపడుతుంటారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహించామని, ఇలా హఠాత్తుగా పిడుగు మైదానంలో పడుతుందని ఊహించలేకపోయామని, ఎంతో భవిష్యత్తు ఉన్న సోఫ్వాన్‌ను కోల్పోవడం బాధాకరమని గోలోక్ క్లబ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.🇹🇭 Horrifying moment from Thailand when a freak lightning strike kills a football player and injures 12 others during a match pic.twitter.com/lAwYJxhtUo— Visegrád 24 (@visegrad24) August 5, 2026పిడుగు ప్రమాదాలు కొత్తేమీ కాదుఇక థాయ్‌లాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. Safwan Awae, a player of a Thai League 3 club, has tragically 𝐏𝐀𝐒𝐒𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 after being struck by lightning while playing a game in the Kolok FA Cup in Thailand. 💔Our thoughts and prayers go out to his family & friends. 🙏 pic.twitter.com/Rkc11bLflp— CentreGoals. (@centregoals) August 5, 2026Read: టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు -
కాలకృత్యాలకు వెళ్లి.. మొసలి నోటికి చిక్కి..?
కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే! -
పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా చివరి ఫొటో..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కారకోరం శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్‌పై సంభవించిన భారీ హిమపాతానికి కొద్ది క్షణాల ముందు ప్రముఖ బ్రిటీష్-నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జా, ఆయన బృందానికి సంబంధించిన చివరి ఫోటో ఆన్లైన్లో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ‘కరకోరం విజన్’ అనే టూర్ ఆపరేటర్ సంస్థ ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, 8,051 మీటర్ల ఎత్తైన బ్రాడ్ పీక్‌పై జూలై 30న ఈ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు ఇది కెమెరాలో నిక్షిప్తమైందని వెల్లడించింది.ఈ ఫోటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసిన ఆ సంస్థ.. బేస్ క్యాంప్ నుంచి గమనిస్తున్న సమయంలో 10 మంది అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం శిఖరం వైపు ముందుకు సాగుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ‘మా బృందం జూలై 30న ఈ దృశ్యాలను రికార్డు చేసింది. బేస్ క్యాంప్ నుంచి చూస్తున్న మాకు ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జాతో సహా 10 మంది పర్వతారోహకులు పర్వతాన్ని అధిరోహిస్తున్న తీరు కనిపించింది’ అని కరకోరం విజన్ తెలిపింది. అయితే ఆ వెంటనే పర్వతంపై భారీ హిమపాతం విరుచుకుపడిందని వెల్లడించింది. ‘మంచు తొలగిపోయిన తర్వాత మేం ఎగువ వాలులను భయంతో పరిశీలించాం. అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్రాడ్ పీక్‌పై ఇదొక పెద్ద విషాదం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Karakoram Vision Pakistan (@karakoramvision) సుమారు 5,700 మీటర్ల ఎత్తులో సంభవించిన ఈ హిమపాతం కారణంగా 43 ఏళ్ల పుర్జాతో పాటు ఆయన అంతర్జాతీయ యాత్ర బృందంలోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సంభవించిన వెంటనే ఆ బృందంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆదివారం కఠినమైన వాతావర పరిస్థితుల నడుమ రెస్క్యూ సిబ్బంది పుర్జా మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే మరో ఇద్దరు నేపాల్ పర్వతారోహకులు, ఒక చైనా జాతీయునితో సహా నలుగురి మృతదేహాలను కిందకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మరో ఎత్తయిన ప్రాంతంలో మరో మృతదేహం కూడా గుర్తించామని, అయితే అత్యంత ప్రమాదకరమైన భూభాగ పరిస్థితులరీత్యా ప్రస్తుతానికి అక్కడ నుంచి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం కష్టమని తెలిపారు.ఇది కూడా చదవండి: రోడ్డు పక్కన.. ప్లాస్టిక్ కవర్లో నవజాత శిశువు -
వేడి కూరలో పడి చిన్నారి దుర్మరణం
ఛత్రపతి శంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్ తాలూకా పరిధిలోని ముద్దేశ్వడ్గావ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తూ వేడి కూర పాత్రలో పడి మృతి చెందింది. మృతురాలిని రుతుజా శ్రవణ్ రాజ్‌పుత్‌గా పోలీసులు గుర్తించారు. జూలై 19న రుతుజ తన ఇంట్లో ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చిన్నారి ఆడుకునే క్రమంలో అనుకోకుండా మరుగుతున్న వేడి కూర ఉన్న పాత్రలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలైంది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై, చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచన మేరకు ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి రెండు వారాల పాటు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యులు చికిత్స అందించారు. తీవ్ర గాయాలపాలైన రుతుజ పరిస్థితి క్రమంగా క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తతతో ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. -
ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది?
ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ యాత్రికుడు, ‘14 పీక్స్’ ఫేమ్ నిర్మల్ 'నిమ్స్డై' పుర్జా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన ఘోర హిమపాతంలో దుర్మరణం చెందడం యావత్ సాహస ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన బ్రాడ్ పీక్‌పై శుక్రవారం పడిన భారీ హిమపాతంలో నిర్మల్ పుర్జా సహా మరో తొమ్మిది మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరకం. 2019లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 8,000 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న ప్రపంచంలోని 14 అత్యున్నత శిఖరాలను అధిరోహించి అసాధారణ రికార్డు సృష్టించిన ఈ సాహస వీరుడు.. చివరికి అదే మంచు కొండల మధ్య తనువు చాలించడం పర్వతారోహణ వర్గాలను శోకసంద్రంలో ముంచెత్తింది. సరిగ్గా ఇదే తరహాలో ఎన్నో ఏళ్లుగా మానవాళికి అసాధ్యం అనుకున్న ఎవరెస్ట్ శిఖరం సైతం ఎంతో మంది సాహసికుల ప్రాణాలను బలిగొంటూ, చరిత్రలో లెక్కలేనన్ని విషాద గాథలను మిగిల్చింది. ప్రతికూల వాతావరణం, ఆకస్మిక హిమపాతాలు, ప్రాణాలను పణంగా పెట్టే నిలువుటంచుల ప్రయాణాలు మంచు పర్వతాలపై ఏ క్షణంలోనైనా పెను ముప్పును తెచ్చిపెడతాయనే సత్యానికి ఈ ఘటనే మరో నిదర్శనంగా నిలిచింది. ఎవరెస్ట్ మరణాల భయానక నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కేవలం సాహస ప్రియులకే కాదు, ప్రకృతి సృష్టించే భీభత్సానికి ప్రతీకగానూ నిలుస్తోంది. సముద్ర మట్టానికి 8,000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అని పిలుస్తారు. ఇక్కడ మనిషి తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటాడు. దీంతో ప్రతి క్షణం మృత్యువుతో పోరాడాల్సి వస్తుంది. ఎవరెస్ట్ ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది, అక్కడ ప్రాణాలు కోల్పోవడానికి గల అసలు కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.ఎవరెస్ట్ మరణాల గణాంకాలుఎవరెస్ట్ పర్వతంపై మరణాల రేటు సుమారు 2%గా ఉంది. కే-2 లేదా కంచన్‌జంగా వంటి పర్వతాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా అనిపించినప్పటికీ, ఎవరెస్ట్‌పై పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటివరకు 7,000 కంటే ఎక్కువ మంది శిఖరాన్ని అధిరోహించగా, మూడు వందలకు పైగా మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మృతదేహాలు ఇప్పటికీ మంచులోనే అలాగే ఉండిపోయాయి.ఎప్పటికీ మరువలేని జార్జ్ మిల్లొరీ విషాదం1953లో ఎవరెస్ట్‌ను మొదటిసారి విజయవంతంగా అధిరోహించడానికి ముందే, 1920లలో బ్రిటిష్ బృందాలు ఇందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. వీటిలో ప్రముఖ పర్వతారోహకుడు జార్జ్ మిల్లొరీ నాయకత్వంలో జరిగిన యాత్ర విషాదాంతమైంది. 75 సంవత్సరాల తర్వాత 8,155 మీటర్ల ఎత్తులో మిల్లొరీ మృతదేహం లభించింది. ఆయన తన భార్య ఫోటోను, బ్రిటిష్ జెండాను శిఖరంపై ఉంచుతానని మాటిచ్చినప్పటికీ, ఆ వస్తువులు ఆయన వద్ద లభించకపోవడం గమనార్హం.1996 నాటి ఘోర విషాదం1996, మే 10-11 తేదీల్లో ఎవరెస్ట్‌పై జరిగిన ఘోర ప్రమాదం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచింది. అనుభవజ్ఞులైన గైడ్లు రాబ్ హాల్, స్కాట్ ఫిషర్ సహా ఎనిమిది మంది పర్వతారోహకులు మంచు తుఫానులో ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలో మారుతున్న వాతావరణం, విపరీతమైన చలి, నిర్ణీత సమయానికి వెనక్కి వెళ్లలేకపోవడం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.గ్రీన్ బూట్స్ విషాద గాథఎవరెస్ట్ మార్గంలో ప్రాణాలు కోల్పోయిన కొందరి మృతదేహాలు దశాబ్దాలుగా మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. 1996లో మరణించిన భారతీయ పర్వతారోహకుడు త్సేవాంగ్ పాల్జోర్ ధరించిన ప్రత్యేకమైన ఆకుపచ్చ బూట్ల కారణంగా ఆయన మృతదేహానికి ‘గ్రీన్ బూట్స్’ అనే పేరు స్థిరపడింది. అలాగే ఆక్సిజన్ లేకుండా శిఖరాన్ని అధిరోహించాలనుకుని ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పర్వతారోహకురాలు ఫ్రాన్సిస్ ఆర్సెంటివ్ మృతదేహం తొమ్మిదేళ్ల పాటు పర్వతంపైనే ఉండిపోయింది.అత్యంత ప్రమాదకరమైన ‘ఖుంబు ఐస్‌ఫాల్’దక్షిణ మార్గంలో ప్రయాణించే పర్వతారోహకులకు ‘ఖుంబు ఐస్‌ఫాల్’ అత్యంత భయానక ప్రాంతం. కదులుతున్న మంచు గడ్డలు, అకస్మాత్తుగా ఏర్పడే లోతైన పగుళ్లు ఇక్కడ ప్రాణాంతకంగా మారుతాయి. 2014లో సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడిన కారణంగా 16 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సగటు ఆదాయం కంటే ఎంతో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో వీరు ఈ ప్రాణాలను సైతం లెక్కచేయని సాహసానికి పూనుకుంటున్నారు.ఆక్సిజన్ కొరత.. ఫ్రాస్ట్ బైట్ సమస్యలుసముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ కొరత కారణంగా పర్వతారోహకులకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. అంతేకాకుండా విపరీతమైన చలి కారణంగా రక్త ప్రసరణ మందగించి చేతివేళ్లు, కాళ్లు, ముఖం మంచుకు ప్రభావితమయ్యే ఫ్రాస్ట్ బైట్ బారిన పడతారు. ఈ ప్రమాదాల కారణంగా పర్వతారోహకులు తమ అవయవాలను కూడా కోల్పోతుంటారు.రికార్డు స్థాయి మరణాలు2023వ సంవత్సరంలో నేపాల్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 463 పర్వతారోహణ అనుమతులు జారీ చేసింది. ఆ ఏడాది 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ మార్పులు, మంచు వేగంగా కరగడం, సరైన అనుభవం లేని పర్వతారోహకులు భారీ సంఖ్యలో తరలిరావడం వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు -
అస్సాంలో వరద విలయం.. 82 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో వరద తీవ్రతఅధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్‌లో 63,492 మంది, జోర్హాట్లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.వరద బాధితులకు ప్రభుత్వ ఊరట వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్మెంట్ను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. -
ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ కన్నుమూత
ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ ఫ్రాంకో బరెసి (66) కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో బెస్ట్ డిఫెండర్స్లో ఒకడిగా పేరు పొందిన ఫ్రాంకో బరెసి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1982లో ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇటలీ జట్టులో ఫ్రాంకో సభ్యుడిగా ఉన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఇటలీ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై ఫ్రాంకో బరెసి చరిత్ర సృష్టించాడు.ఇటలీలోని ట్రావగ్లియాటో అనే చిన్న పట్టణంలో 1960 మే 8న జన్మించిన బరేసి, చిన్నతనంలోనే తల్లిందడ్రులను కోల్పోయారు. అనాథగా ఎన్నో కష్టాలను దాటుకొని అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. ఇక ఫ్రాంకో ఏడుసార్లు బాలన్ డి'ఓర్‌కు నామినేట్ అయ్యి, 1989లో రెండో స్థానంలో నిలిచారు. 2013లో ఇటాలియన్ ఫుట్‌బాల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.మూడు ఫిఫా ప్రపంచకప్లుఫ్రాంకో బరేసీ తన మొత్తం ప్రొఫెషనల్ కెరీర్లో ఏసీ మిలాన్, ఇటలీ రెండు జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఇటలీ తరపున 81 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1982, 1990, 1994 మూడు ఫిఫా ప్రపంచ కప్‌లలో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 1994 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఇటలీ పోరాడి ఓడిపోయింది. ఫైనల్లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో ఇటలీపై నెగ్గి టైటిల్‌ను ముద్దాడింది.ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యంఫ్రాంకో బరేసి తన జీవితంలో ఇటలీ జాతీయ జట్టుతో పాటు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడడం విశేషం. వరుసగా 20 సీజన్ల పాటు ఏసీ మిలాన్ క్లబ్‌కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో ఆరు సెరీ ఏ (స్కూడెట్టోలు), మూడు యూరోపియన్ కప్‌లు, రెండు ఇంటర్కాంటినెంటల్ కప్‌లు, రెండు యూఈఎఫ్ఏ సూపర్ కప్‌లు, నాలుగు ఇటాలియన్ సూపర్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 1997లో ఆయన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన గౌరవార్థం ఏసీ మిలాన్ ఆయన ప్రసిద్ధ నంబర్ 6 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేసింది. ఆయన 2020 నుంచి క్లబ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా ఫ్రాంకో మరణవార్త ఫుట్‌బాల్ అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఇక గతంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇటలీ గతంలో 4 సార్లు (1934, 1938, 1982, 2006) ఫిఫా ప్రపంచకప్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. One of the greatest defenders of all time.Here's Franco Baresi in the 1994 World Cup final at 34-years-old, putting in an incredible performance 24 days after suffering a severe meniscus tear that required surgery. RIPpic.twitter.com/s8sPRil1Rs— 90s Football (@90sfootball) July 31, 2026United in remembrance ❤️In Perth, Rúben Amorim, his staff and the entire team observed a minute of silence in memory of Franco Baresi ❤️ pic.twitter.com/Btbhv017tM— AC Milan (@acmilan) July 31, 2026La Storia del Milan è in lacrime per la scomparsa di Franco Baresi. Il suo esempio e la sua profondità saranno, per sempre come la sua maglia numero 6, parte integrante e fondamentale del DNA e del cammino di tutto il Club. Le condoglianze che AC Milan porge alla famiglia tutta… pic.twitter.com/a8wNOCUc2o— AC Milan (@acmilan) July 31, 2026Read: శతక్కొట్టిన లంక బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్ -
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
టైగర్ రిజర్వులో తీవ్రగాయాలతో పులి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ ,షాజహాన్‌పూర్ జిల్లాలపిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వివరాలని టైగర్ రిజర్వ్‌లోని అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) మనీష్ సింగ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి పులి మృతి చెందిందని తెలిసింది. దానిని పోస్ట్ మార్టం నివేదిక కోసం మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపాం. మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే నిర్ధారించబడుతుంది" అని అన్నారు.ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం మరో పులితో జరిగిన భూభాగ వివాదం బెబ్బులి గాయపడి ఉండవచ్చని తెలిపారు. గత శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అటవీశాఖ అధికారులు రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పులి గాయపడినట్లు గుర్తించారు. ఈ జంతువుకు చికిత్స చేయడానికి దక్ష గంగ్వార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ పులిప్రాణాలు దక్కలేదని తెలిపారు. -
మనిషి చనిపోయాక వాళ్ల డిజిటల్ డేటా ఏమవుతుంది?
ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆయన పేరిట ఉండే ఆస్తిపాస్తులు, బంగారం మొదలైన వాటిని వారసులు వీలునామా ప్రకారమో లేదా వాటాల ప్రకారమో పంచుకుంటారు. మరి అదే మనిషికి చెందిన సోషల్ మీడియా జ్ఞాపకాలు, వ్యక్తిగత ఈ–మెయిల్స్, ఫొటోలు, వీడియోలు మొదలైన డిజిటల్ డేటా, క్రిప్టో కరెన్సీ, యూపీఐ వాలెట్లలోని నగదు వంటి డిజిటల్ కరెన్సీ సంగతేంటి? పాస్వర్డ్ లేదా కీ తెలియకపోయినా వాటిని వారసులు పొందగలరా? చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచినవి.. కంప్యూటర్, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎల్రక్టానిక్ పద్ధతిలో భద్రపరిచిన లేదా యాజమాన్య హక్కులు కలిగిన విలువైన సమాచారం లేదా డేటా, డబ్బు లేదా క్రిప్టోకరెన్సీలను డిజిటల్ ఆస్తిగా పరిగణిస్తున్నారు. అంటే ఒకరి పేరిట ఆన్లైన్లో ఉండే సామాజిక మాధ్యమ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీటీ సబ్స్రి్కప్షన్లు... ఫొటోలు, వీడియోలు, ఈ–మెయిల్స్ వంటి ఫైళ్లు.. యూపీఐ వాలెట్లు, మ్యూచువల్ ఫండ్లు, క్రిప్టో వాలెట్ల వంటివి ఈ కోవలోకి వస్తాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి? 2024 నాటికి దేశంలో 90 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఒక సగటు వ్యక్తికి కనీసం 6 యాప్‌లలో ఖాతాలు, 2 బ్యాంక్ ఖాతాలు, 1 యూపీఐ ఐడీ ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ నివేదిక ప్రకారం 68% మంది తమ పాస్‌వర్డ్‌లను కుటుంబంతో పంచుకోవడంలేదు. ఫలితంగా ఏటా సంభవించే మరణాల్లో ఇలాంటి వారికి చెందిన విలువైన డిజిటల్ ఆస్తులు స్తంభించిపోతున్నాయి. బెంగళూరులో 2022లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించే సమయానికి ఆయన వద్ద రూ. 2 కోట్ల విలువైన బిట్‌కాయిన్ వాలెట్ ఉండేది. కానీ అందుకు సంబంధించి ‘కీ’తెలియకపోవడం వల్ల ఆయన కుటుంబం కోర్టుకెళ్లినా ‘కీ’లేకుండా వాలెట్ తెరవడం సాధ్యం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ముంబైలో 2023లో ఓ మహిళ మరణించగా ఆమె పేరిట ఉన్న యూపీఐ, 3 మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు నామినీ లేకపోవడంతో వారసత్వం రుజువు చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు 8 నెలలపాటు బ్యాంకుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది.విదేశాలు ఏం చేస్తున్నాయి? అమెరికాలో 48 రాష్ట్రాలు రివైజ్డ్ యూనిఫామ్ ఫిడ్యూషియరీ యాక్సెస్ టు డిజిటల్ అసెట్స్ యాక్ట్ (ఆర్యుఎప్ఏడీఏఏ) పేరిట ఒక చట్టం తెచ్చాయి. దీని ప్రకారం చనిపోయిన లేదా జీవచ్ఛవంలా మారిన ఒక వ్యక్తి గతంలో రాసిన వీలునామాలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు కంపెనీలు డిజిటల్ డేటా అప్పగించాలి. యూరప్‌లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) కింద డిజిటల్ లెగసీ ఆప్షన్ ఉంది. భారత్‌లో ఇంకా ప్రత్యేక చట్టం లేనప్పటికీ 2023 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు ఈ తరహా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. ప్రస్తుతం మెటా, గూగుల్ లెగసీ కాంటాక్ట్, ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ఫీచర్లు అందిస్తున్నాయి.డిజిటల్ డేటాకు భద్రతనిచ్చే 3 అడుగులుడిజిటల్ వీలునామాఒక వ్యక్తికి ఆన్లైన్లో ఉండే రకరకాల ఖాతాల వివరాలను పేర్కొనడంతోపాటు తన తదనంతరం వాటి యాక్సెస్‌ను ఎవరికి ఇవ్వాలనేది లాయర్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవడమే డిజిటల్ వీలునామా.లెగసీ సెట్టింగ్స్ ఆన్ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వారసత్వ సంప్రదింపు ఫీచర్, గూగుల్‌లో ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ సెట్టింగ్‌ను ఆన్‌లో పెట్టడం ద్వారా ఒక వ్యక్తి డిజిటల్ డేటాను తన తదనంతరం కుటుంబ సభ్యులు పొందేందుకు వీలు కల్పిస్తుంది. పాస్వర్డ్ మేనేజర్వన్ పాస్వర్డ్, బిట్ వార్డెన్ లాంటి డిజిటల్ వాల్ట్‌లలో అన్ని పాస్వర్డ్లు పెట్టి, మాస్టర్ పాస్‌వర్డ్‌ను నమ్మకమైన వ్యక్తికి తెలియజేయడం ద్వారా డిజిటల్ డేటాను తమ తదనంతరం కుటుంబ సభ్యులు పొందే అవకాశం కల్పించొచ్చు. -
'చదవడం' నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు.రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్‌కు వచ్చిన చంద్రేగౌడ్.. రాత్రి వేళ హాస్టల్లోని వాష్‌రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు.గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
10వ అంతస్తునుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్, మణికొండ: అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్‌కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం, దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు కానిస్టేబుల్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో భాగంగా మోహరించిన పోలీసుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగింది. బుధవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో అనంతనాగ్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల ఘటనలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. -
రంగు తక్కువ వ్యాఖ్యలు.. విద్యార్థి ఆత్మహత్య
ధోల్పూర్: రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని తక్రౌలీ గ్రామానికి చెందిన రాహుల్ అనే విద్యార్థి, చదువు నిమిత్తం ధోల్పూర్లోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. గురువారం పాఠశాలలో ఒక తోటి విద్యార్థినితో రాహుల్‌కు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని రాహుల్ చర్మపు రంగును ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్న రాహుల్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మరుసటి రోజు కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీ లోంచి చూడగా, రాహుల్ ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం! -
అతనొక బ్రాండ్.. ముద్రగడ మరణంపై మధుసూదన్ రెడ్డి ఎమోషనల్ రియాక్షన్
-
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఒమన్ తీరంలో గల్లంతైన భారతీయుడి మృతి
మస్కట్: ఒమన్ తీరంలో జరిగిన వాణిజ్య నౌకపై దాడిలో పుణెకు చెందిన భారతీయ మెరైన్ ఇంజనీర్ హేరంబ్ కర్మార్కర్ (30) మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. హార్ముజ్ జలసంధి సమీపంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే నౌకపై జరిగిన దాడిలో ఆయన గల్లంతయ్యారని తొలుత వార్తలు రాగా, తాజాగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నౌకలోని ఇతర సిబ్బందిని రక్షించినప్పటికీ, కర్మార్కర్ ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై కర్మార్కర్ మామ వివేక్ టాండన్ మాట్లాడుతూ కర్మార్కర్ మృతదేహాన్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు సంయుక్తంగా నౌక యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేసినట్లు సమాచారం. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అక్కడ పనిచేసే భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ దాడికి గల కారణాలు, జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త -
టొరంటోలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
టొరంటో: కెనడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అక్కడ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు హెచ్చరించిన పోలీసులు, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు. సెయింట్ క్లేర్ ఎవెన్యూ వెస్ట్, అర్లింగ్టన్ ఎవెన్యూ సమీపంలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవం జరుగుతుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, మొత్తం ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని టొరంటో పోలీసులు వెల్లడించారు.పరారీలో నిందితులుకాల్పులు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ, కాల్పులకు తెగబడిన నిందితుడు లేదా నిందితులు ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. లాటినో సంస్కృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ 'సాల్సా' ఉత్సవ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. Toronto, Canada | An incident of mass shooting reported at a street festival on St Clair Ave W & Arlington Ave, resulting in two deaths and injuring 6 others. The suspect is still at large. Heavy police force deployed at the scene. Public has been asked to avoid the area: Toronto… pic.twitter.com/37cPvePepe— ANI (@ANI) July 12, 2026ప్రత్యక్ష సాక్షుల కథనంఈ ఉత్సవంలో స్టాల్ నడుపుతున్న ప్యాట్సీ గుటిరెజ్ అనే మహిళ మాట్లాడుతూ.. తాను కస్టమర్లకు వస్తువులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీయడం చూశానని తెలిపారు. దీంతో తాము వ్యాపారాన్ని నిలిపివేశామని, ఇలాంటి ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రత్యక్ష సాక్షి వాలెరీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి తాను ఒక రెస్టారెంట్ సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు జనం కేకలు వేస్తూ పరుగులు తీశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో అందరం నేలపై పడుకున్నామని ఆమె వివరించారు.ఈ హింసాత్మక ఘటనపై అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్ ఫెస్టివల్లో జరిగిన ఈ దారుణ హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఘనంగా ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్’అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. లాటినో సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో లైవ్ లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ఈ ఉత్సవం 22వ సారి జరుగుతోంది. టొరంటో నగర నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతంలో జరిగే ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా టొరంటోకు పేరుంది. కెనడాలోనే అతిపెద్ద నగరమైన ఇక్కడ, ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరగడం చాలా అరుదు. -
జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆస్పత్రిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా జానకి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో "జానకమ్మ"గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి గాత్రం ఎన్నటికీ చెరిగిపోదని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో వేలాది పాటలకు ప్రాణం పోసి, తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర అనేక భారతీయ భాషల్లో తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత కళాకారిణిగా ఆమెను కొనియాడారు.తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో నివసించడం, వారి కుటుంబ మూలాలు సిరిసిల్ల ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతానికి, భారతీయ గాన ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.జానకమ్మ వంటి మహా గాయనులకు మరణం ఉండదని, వారి గానమాధుర్యం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
పార్కింగ్ భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 18లో శనివారం రాత్రి ఒక మహిళ బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని సీతూ తల్వార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించగా, ఆమె గత కొంతకాలంగా తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. గతంలో కూడా ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్, వాణిజ్య కేంద్రమైన సెక్టార్ 18లో ఈ ఉదంతం చోటుచేసుకోవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నోయిడా పరిధిలో ఇలాంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. గతంలో సెక్టార్ 100లోని ఒక నివాస సముదాయంలో పారుల్ అగర్వాల్ (46) అనే మహిళ, అలాగే జనవరి 2026లో సెక్టార్ 104లో అనిల్ గార్గ్ అనే వ్యక్తి కూడా తీవ్ర మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు.ఇది కూడా చదవండి: షోపియాన్: నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం సైన్యం వేట.. -
కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా గురువారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఇది ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. 24 బాలిస్టిక్ రకంసహా మొత్తంగా 74 క్షిపణులు, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది.ఏకధాటిగా 11 గంటలపాటు రష్యా డ్రోన్లు, క్షిపణి దాడుల కారణంగా కీవ్ నగరంలో పేలుళ్ల మోత మోగింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గినట్టు కీవ్ నగర మేయర్ విటాలి క్లిషెకో వెల్లడించారు. నగరంలో సుమారు 30 చోట్ల భారీ నష్టం జరిగింది. 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలాయి.16 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాడుల అనంతరం సహాయక బృందాలు, భవనాల శిథిలాల్లో బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉక్రెయిన్ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. -
కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య.. పరారైన భార్య!
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో 27 ఏళ్ల యువకుడు తన భార్య, అత్తమామల నుండి ఎదురవుతున్న మానసిక వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని అనికేత్ బాలసాహెబ్ జగ్తాప్గా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంలో మృతుడి భార్య, ఆమె తల్లిదండ్రులు, పినతల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసినప్పటికీ, మృతుడి తండ్రి బాలసాహెబ్ జగ్తాప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్యాంప్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.అనికేత్‌ను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసి, అతను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలపై అతని భార్య శ్రుతి జగ్తాప్, అత్త వందన సుభాష్ ధివ్రే, మామ సుభాష్ సుఖ్‌దేవ్ ధివ్రే, పినతల్లి ఉజ్వల సతీష్ పవార్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా పంచశీల్ నగర్లో ఉంటున్నారు. ఈ కేసులో శ్రుతి తల్లిదండ్రులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, శ్రుతి, ఆమె పినతల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయకపోతే తాము ఆత్మహుతికి పాల్పడతామని అనికేత్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. పంచశీల్ నగర్‌కు చెందిన శ్రుతి ధివ్రేతో అనికేత్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుండి ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని అనికేత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రుతి, అనికేత్‌తో కలిసి జీవించడానికి నిరాకరించడమే కాకుండా, అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని వారు పేర్కొన్నారు. దీంతో అనికేత్ గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నిరంతర వేధింపులను తట్టుకోలేక, అనికేత్ తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై హరిద్వార్ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సు.. ముందు వెళ్తున్న ఓ భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్ట్ ఏరియా సమీపంలో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి ఇండోర్‌కు సుమారు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు లోయలోకి పడిపోగా, వెనుక భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించాయి.ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఢీకొట్టడంతో అప్పర్ బెర్త్‌లపై ఉన్న ప్రయాణికులు కిందపడిపోయారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు మరింత వ్యాపించేలోపే కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న ఏడుగురు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కును ఢీకొట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ నిద్రమత్తు లేదా మరో సాంకేతిక లోపం కారణమా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. Dausa, Rajasthan: A road accident took place in Dausa after a tourist bus carrying around 37 pilgrims from Haridwar to Indore collided with a truck on the Delhi–Mumbai Expressway in the early hours today. Following the collision, both vehicles caught fire. The passengers managed… pic.twitter.com/wp5zGGi96W— IANS (@ians_india) July 1, 2026 -
యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసిన అత్త.. కోడలి మృతి
అన్నానగర్ (చెన్నై): యూట్యూబ్ చూసి ఇంట్లో కోడలికి అత్త ప్రసవం చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై కోడలు మృతి చెందింది. తిరుప్పూర్ జిల్లాలోని ఊత్తుకుళి సమీపంలో ఉన్న పుంజై తలవైపాలైయానికి చెందిన సామి, భార్య శశికళ (32) ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శశికళ మళ్లీ గర్భవతి అయ్యింది. బిడ్డ గర్భం దాల్చిన రోజు నుంచే ఆమె అత్త పళనియత్తాల్ (56) ఆమె కుటుంబం, ఏ వైద్యుడిని సంప్రదించలేదు, టీకాలు కూడా వేయించలేదు. యూట్యూబ్‌లోని ఓ వీడియో చూసి సహజంగా ప్రసవించాలని కోరుకున్నారు. 40 వారాల గర్భవతిగా ఉన్న శశికళకు ఈనెల 24న ఉదయం 5.40 గంటలకు ప్రసవ వేదన మొదలైంది. అయితే, శశికళను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, ఆమె అత్త ఇంట్లోనే యూట్యూబ్ చూసి ప్రసవం చేసింది. ఆడబిడ్డ పుట్టింది. పాప ఆరోగ్యంగా ఉండగా, శశికళకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆమెను ఈరోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అధిక రక్తస్రావం కారణంగా వైద్యులు శశికళ గర్భాశయాన్ని తొలగించారు. 65 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, 25వ తేదీ సాయంత్రం శశికళను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందించినా, కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందింది. -
ఢిల్లీలో దారుణం: పిల్లలు పుట్టలేదనే నెపంతో..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కట్నం కోసం వేధించడంతో పాటు, సంతానం కలగలేదనే నెపంతో అత్తవారింట్లో ఎదురైన వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు.కిటికీ గ్రిల్‌కు మృతదేహం.. అనుమానాస్పద మృతిపశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల మహిళ తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మెడపై ఉరి వేసుకున్నట్లుగా గుర్తులు ఉండటంతో పాటు, కిటికీ గ్రిల్‌కు ఒక దుపట్టా కట్టి ఉంది. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఆర్డీఓ విచారణమృతి చెందిన మహిళకు వివాహమై కేవలం మూడేళ్లే కావడం, అలాగే దంపతులకు పిల్లలు లేకపోవడంతో చట్టప్రకారం ఈ కేసును సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. వివాహమైన ఏడేళ్ల లోపు మహిళ అనుమానాస్పదంగా మరణిస్తే ఆర్డీఓ విచారణ జరపడం నిబంధన. దీంతో మృతురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను ఎస్డిఎమ్ రికార్డు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం, సంతానం కలుగలేదంటూ నిందించడం వల్లే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని వారు వాంగ్మూలం ఇచ్చారు.నిందితులు అరెస్ట్.. పోలీసుల దర్యాప్తుబాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80 (కట్నపు చావు), సెక్షన్ 85 (మహిళపై క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారు. పాత బట్టలు తీసుకుని గిన్నెలు అమ్మే వీధి వ్యాపారులుగా పనిచేసే నిందితులు (భర్త, మామ) పరారయ్యారు. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గురువారం దిల్లీలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.ఇది కూడా చదవండి: ‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు -
ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి..
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెందిన బుద్ధ వెంకటప్రతాప్ రెడ్డి–ప్రశాంతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. తల్లి ప్రశాంతితో కలిసి కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20) ఇటీవల మయూరీ నగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి గోడకు ఆనుకొని ఉండగా అదుపు తప్పి కిందపడింది. వాచ్మెన్ సమాచారం ఇవ్వడంతో తల్లి ప్రశాంతి కూతురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాణమ్య డిగ్రీ ఆన్లైన్లో చదువుతోంది. మృతురాలి తల్లి ప్రశాంతికి స్థానికంగా ఓ ఫ్లాట్ ఉందని.. రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
బరితెగించిన బీటెక్ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం
వైఎస్సార్,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్21) నాడు చక్రాయిపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అక్రమ దందాలో కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. -
జ్వరం, పచ్చ కామెర్లతో అక్క, తమ్ముడి మృతి
పెదబయలు: అల్లూరి జిల్లా కుంతుర్ల పంచాయతీ బొర్రనేరోడి(బొడ్డాపుట్టు) గ్రామంలో జ్వరం, పచ్చకామెర్లతో అక్క,తమ్ముడు మృత్యువాత పడ్డారు. బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన అనుగూరు మేరీ (9) జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందగా ఆదివారం ఉదయం ఆమె తమ్ముడు అనుగూరు జీవన్‌రాజ్ (7) మృతి చెందాడు. గోమంగి మినీ గురుకుల పాఠశాలలో మేరీ 3వ తరగతి, సంపంగిపుట్టు ప్రాథమిక పాఠశాలలో జీవన్ రాజ్ 2వ తరగతి చదువుతున్నారు. వీరు 3 రోజుల నుంచి జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు.పసరు మందుతో పాటుగా ఆర్ఎంపీ దగ్గర వైద్యం తీసుకోవడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందక 12 గంటల వ్యవధిలో వీరు మృతి చెందారు. వీరి సోదరి అనుగూరు నందిని(22), సోదరుడు అనుగూరు మోషే(5), తండ్రి అనుగూరు కోటిబాబు కూడా జ్వరంతో బాధపడుతుండడంతో వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే, గ్రామంలో మరికొంత మంది కూడా జ్వరాలతో బాధపడుతుండటంతో పెదబయలు పీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. ప్రీ ప్లాన్డ్ మర్డర్..
-
తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను: రాధా గాయత్రి భర్త
సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్ అన్నారు. ‘‘మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే, విబేధాలు ఉన్నట్టయితే ముస్సోరి ఎలా వెళ్తాం. హోటల్ ప్యాకేజ్‌లో భాగంగానే మద్యం సప్లయ్ చేశారు’’ అని శ్రీచరణ్ పేర్కొన్నారు.‘‘ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు ఆడుతున్నారు. ఇప్పటికీ గాయత్రీ నా భార్య. గాయత్రీ తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మూడు గ్రామాల సమస్య. నాకు బాధ్యత లేకపోతే సంప్రదాయాలు ఎందుకు పాటిస్తాను. నేను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాను’’ అంటూ శ్రీచరణ్ పేర్కొన్నారు.ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అమెరికా దాడిపై నావికుడి భార్య కన్నీటి ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్‌లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్‌పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు. -
చిన్న వయసులోనే కన్నుమూసిన ప్రముఖ బాలనటి
హాలీవుడ్ ప్రముఖ నటి డేవీ ఛేజ్ చనిపోయింది. 35 ఏళ్ల వయసుకే ఈమె నూరేళ్లు నిండిపోయాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవీ మృతి చెందినట్లు ఈమె మేనేజర్ జాన్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. మెనింజైటిస్ కారణంగా వచ్చిన సెప్సిస్‌తో ఈమె చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణానికి ముందు పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరినట్లు ఈయన పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)డేవీ ఛేజ్.. నాలుగేళ్లకే యాక్టర్‌గా మారింది. ఏడేళ్ల వయసులోనే హాలీవుడ్లో తొలి అవకాశం దక్కించుకుంది. అమెరికన్ సిట్కామ్ 'సబ్రినా ది టీనేజ్ విచ్' షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం డోనీ డార్కో, ఎస్ డార్కో చిత్రాల్లో నటించింది. అయితే 2002లో రిలీజైన హారర్ మూవీ 'ద రింగ్' మూవీలో సమారా మోర్గాన్ అనే పాత్రతో భయపెట్టింది. టీవీ నుంచి బయటకొస్తూ భయపెట్టే ఆ పాత్ర చాలామంది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.2002లో రిలీజైన యానిమేషన్ మూవీ 'లిలో & స్టిచ్'లో లిలో పాత్రకు డబ్బింగ్ చెప్పి డేవీ గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా ఈమెని వరించాయి. తర్వాత కాలంలో చార్మ్డ్, ఈఆర్, టచ్డ్ బై యాన్ ఏంజెల్ తదితర వెబ్ సిరీస్‌ల్లో అతిథి పాత్రలు చేసింది. బిగ్ లవ్ సిరీస్‌లో రొండా వోల్మర్ పాత్రలో 32 ఎపిసోడ్ల పాటు కనిపించింది. 2015 తర్వాత నటనకు పూర్తిగా దూరమైన డేవీ ఛేజ్.. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్) -
టూర్ కోసం డెహ్రాడూన్‌కు.. అనుమానాస్పాద రీతిలో టెకీ మృతి
డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లో ఒక మహిళ టెకీ అనుమానాస్పాద రీతిలో మృతిచెందింది. గురుగ్రామ్‌కు చెందిన గాయత్రి అనే మహిళ ముస్సోరి హోమ్ స్టేలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు.పోలీసులు వివరాల ప్రకారంగురుగ్రామ్లో నివాసముంటున్న శ్రీచరణ్, గాయత్రి దంపతులిద్దరూ టెకీ ఉద్యోగులు. వారి విహారయాత్రలో భాగంగా ఈ నెల జూన్ 13 న ముస్సోరీ-ధనౌల్తీ రోడ్డులోని 'కియానా హోమ్‌స్టే టిప్రిధర్'కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో హోమ్‌స్టేలోని చెక్-ఇన్ అయ్యారు. అయితే ఆ మరుసటి రోజు జూన్ 15 హోమ్‌స్టేలో ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం ముస్సోరీ పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి అంబులెన్స్‌ను పంపించగా, అందులోని ఫార్మాసిస్ట్ ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో.. తామిద్దరం ఆదివారం రాత్రి మద్యం సేవించి, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయామని తెలిపాడు. ఉదయం లేచి చూసేసరికి తన భార్య ముక్కు నుంచి రక్తం కారుతూ నేలపై స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొన్నాడని తెలిపారు.అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు "మృతురాలి మృతదేహం గదిలోని నేలపై దుస్తులు లేకుండా పడి ఉంది. బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు.ఈ దంపతులకు 2025 నవంబర్ 8న వివాహం జరిగిందని, వీరిద్దరూ అసలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. -
కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది
గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్వాడీకి చెందిన షేక్ మసూద్ అలియాస్ చాందిని మసూద్ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మూడేళ్లుగా షేక్ మసూద్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్ మసూద్ తన బస్తీ కుమ్మర్వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్ మసూద్‌ను సూటిపోటి మాటలతో వేధించేవారు.దీంతో మసూద్ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్ బావమరుదులు మసూద్‌ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్ సోహెల్‌తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్‌తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్ మసూద్ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి
హైదరాబాద్: ఆరు నెలల చిన్నారితో కలిసి ఓ సాఫ్ట్వేర్ మహిళ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఆరవ అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ప్రహరీ గోడపై ఉన్న ఇనుప కంచెకు డ్రెస్ చిక్కుకొని గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన భూపేంద్ర సాహు, మధ్యప్రదేశ్‌లోని భూత్గావ్కు చెందిన ఈషా సాహు (37)లకు 2015లో వివాహం జరిగింది.గత ఎనిమిదేళ్లుగా వీరు మియాపూర్ మయూరీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఎనిమిదేళ్లు, మరో చిన్నారికి ఆరు నెలలు. ప్రస్తుతం ఈషా సాహు ప్రసూతి సెలవులో ఉంది. కొన్ని నెలలుగా ఈషా సాహు తల్లిదండ్రుల ఊళ్లోనే ఉంది. నెల రోజుల క్రితం నాగపూర్‌లోని అత్తారింటికి వెళ్లింది. పెద్ద కూతురుకు స్కూళ్లు ప్రారంభం కావడంతో గత నెల 30న ఆమె తన భర్త, పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది.సరుకులు తీసుకురమ్మని.. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఈషా సాహు తన భర్త భూపేంద్ర సాహు, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని చెప్పి డీమార్ట్‌కు పంపించింది. సాయంత్రం సమయంలో ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆమె ఓ బకెట్ తీసుకొని ఆరవ ఫ్లోర్‌కు వెళ్లింది. బకెట్ పైకి ఎక్కి గోడ మీద నుంచి చిన్నారితో కలిసి ఆమె కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఈషా సాహు అక్కడికక్కడే మృతి చెందగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై ఉన్న ఇనుప కంచెకు చిన్నారి డ్రెస్ చిక్కుకొని స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భర్త భూపేంద్ర సాహు, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఈషా సాహు మృతి చెందగా, పక్కనే ఉన్న ప్రహరీగోడ ఇనుప కంచెకు గౌను చిక్కుకొని చిన్నారి వేలాడుతూ కనిపించింది. పోలీసులు చిన్నారిని కంచె నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ‘ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా.. మీరందరూ సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి’అంటూ ఈషా సాహు ఓ నోట్లో రాసిందని పోలీసులు తెలిపారు. కాగా ఆరు నెలలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాన్సెర్ట్‌లో ఘోరం: డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
ముంబై: మహానగరం ముంబై వర్లీలోని ప్రసిద్ధ ‘ఎన్ఎస్సీఐ డోమ్’లో జరిగిన ఓ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ ఊహించని విషాదంతో ముగిసింది. వేలాది మంది సంగీతాభిమానుల కోలాహలం మధ్య, ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ముంబైలోని మాహిమ్ ప్రాంతానికి చెందిన వృషభ్ మహేంద్ర గాంగుర్డే (28)గా పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి ఈ కాన్సెర్ట్‌కు హాజరైన వృషభ్, వేలాది మంది గుమిగూడిన వేదిక వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం విపరీతమైన రద్దీ కారణంగా వృషభ్తో పాటు అతనితో ఉన్న ఒక యువతి కూడా తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. స్పృహతప్పిన వృషభ్ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తార్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వృషభ్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ముందు అతను మద్యం సేవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, ఏదైనా ఇతర పదార్థాల ప్రభావం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.పోస్ట్‌మార్టం నివేదిక, ఇతర వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే యువకుని మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటన ముంబైలో భారీ స్థాయిలో జరిగే కాన్సెర్ట్‌ల భద్రతా ఏర్పాట్లపై చర్చకు తెరలేపింది. ఎన్ఎస్సీఐ క్లబ్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. అంత భారీ సంఖ్యలో జనం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, అక్కడి వాతావరణం అంతా గందరగోళంగా మారిందని ఆరోపించారు. -
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్‌పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్‌పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
ఈదురుగాలులకు కూలిన బ్రిడ్జి.. ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. At least 6 people were killed after an under construction bridge collapsed in Hamirpur district of Uttar Pradesh. pic.twitter.com/2UfarN3Nm9— Piyush Rai (@PiyushRaiUP65) May 29, 2026సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్‌లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది. -
మంచుకొండల మధ్యే మహాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన ఆనందం.. చివరకు అదే మంచు పర్వతాల్లో శాశ్వత నిద్రగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. “ఆయన ఇప్పుడు సాక్షాత్తూ పరమశివుడి చెంతనే ఉన్నారు” అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అరుణ్ కుమార్.. తిరుగు ప్రయాణంలో ‘హిల్లరీ స్టెప్’ సమీపంలో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఆ సమయంలో ఆయనతో పాటు నలుగురు షెర్పాలు ఉన్నట్లు నేపాల్‌కు చెందిన యాత్ర నిర్వాహక సంస్థ ‘పయనీర్ అడ్వెంచర్స్’ తెలిపింది. అయితే 8 వేల మీటర్ల ఎత్తుకు పైబడిన ‘డెత్ జోన్’లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం దాదాపు అసాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే అరుణ్ కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. “ఎవరెస్ట్ అంటే పరమశివుడి నివాసమైన కైలాసమే. ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని భావించాం. అంత ఎత్తు నుంచి మృతదేహాన్ని తీసుకురావడం కూడా చాలా ప్రమాదకరం. తీసుకొచ్చేసరికి దేహం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది” అని అరుణ్ బావ సుధీర్ ఉపాధ్యాయ మీడియాకు తెలిపారు.అరుణ్ కుమార్ తివారీ కేవలం ఐటీ ప్రొఫెషనల్ మాత్రమే కాదు.. అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు కూడా. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకోన్కాగ్వా వంటి పర్వతాలను అధిరోహించారు. 2025లో ఒకసారి ఎవరెస్ట్ యాత్రకు వెళ్లినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా 7,200 మీటర్ల వద్ద నుంచి వెనుదిరిగారు. అయితే ఈసారి తన కలను నెరవేర్చుకుని శిఖరాన్ని జయించారు. కానీ తిరుగు ప్రయాణమే ఆయనకు చివరి మజిలీగా మారింది.అరుణ్ కుటుంబంలో భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయినా.. ఆయనకు ఇష్టమైన హిమాలయాల్లోనే శాశ్వత విశ్రాంతి కలగాలని నిర్ణయించడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.ఇదే ఎవరెస్ట్ యాత్రలో మరో తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన ఐటీ ప్రొఫెషనల్ సందీప్ అరే(46) మే 20న ఎవరెస్ట్ అధిరోహించి, మరుసటి రోజే తీవ్ర అలసట, స్నో బ్లైండ్‌నెస్‌తో మరణించారు. ఆయన మృతదేహాన్ని షెర్పాలు కిందకు తీసుకురాగా.. బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు.👉ఎవరెస్ట్‌లోని ‘డెత్ జోన్’లో మృతదేహాలను తరలించడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తారు. ఆక్సిజన్ కొరత, గడ్డకట్టే చలి, మంచు తుఫానులు, హిమపాతాల ముప్పు మధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక్క మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు మంది అనుభవజ్ఞులైన షెర్పాలు, ప్రత్యేక పరికరాలు, అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియకు రోజుల సమయం పట్టడంతో పాటు కోట్ల రూపాయల వ్యయం కూడా అవుతుంది.అందుకే చాలా కుటుంబాలు.. మరిన్ని ప్రాణాలకు ప్రమాదం కలిగించకుండా తమవారిని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని నిర్ణయిస్తుంటాయి. ఇప్పుడు అరుణ్ కుమార్ తివారీ కుటుంబం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అలా మంచు పర్వతాల్లో మొదలైన ఆయన సాహస యాత్ర.. చివరకు శివయ్య చెంతనే శాశ్వత విశ్రాంతిగా ముగిసింది. -
ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో హైదరాబాదీ.. బాడీ వదిలేసిన ఫ్యామిలీ!
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు.హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుండి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు.‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు -
ఇజ్రాయెల్ దాడుల్లో 12 మంది మృతి
బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం లెబనాన్‌లోని దక్షిణ, బెకా లోయ తూర్పు ప్రాంతాల్లో భీకర దాడులకు దిగింది. హెజ్బొల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు, అబ్జర్వేషన్ పాయింట్లే లక్ష్యంగా 100కు పైగా ప్రాంతాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. మషఘారా గ్రామంపై జరిగిన ఒక దాడిలో కుటుంబంలోని ఏడుగురు సహా 12 మంది చనిపోయారని అధికార వార్తా సంస్థ పేర్కొంది.నబాటియే ప్రావిన్స్, నగరాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం అక్కడి ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా, వ్యూహాత్మకంగా కీలకమైన లిటానీ నదిని దాటి ముందుకు వచ్చేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు ఇరాన్ దన్ను కలిగిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ తెలిపింది. -
గుజరాత్లో ఐదు సింహాలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో విషాదం చోటు చేసుకుంది. పలు కారణాలతో ఐదు సింహాలు మృత్యువాతపడ్డాయి. ఈ వివరాలను ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ప్రకటించారు. మృతిచెందిన సింహాల్లో మూడు పెద్ద సింహాలు కాగా మరో రెండు సింహాం కూనలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పేర్కొన్నారు. మృతిచెందిన సింహాల్లో రెండు సహజ కారణాలతో ఒకటి మాత్రం కొట్లాటలో గాయాల పాలై చనిపోయిందని తెలిపారు. అయితే చనిపోయిన సింహాం పిల్లలు మాత్రం బబెసియా వైరస్ సోకి సింహం పిల్లలు చనిపోయినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జైపాల్ సింగ్ పేర్కొన్నారు. ఈ బబెసియా వైరస్ మిగతా జంతువులకు సోకే అవకాశాలు లేవన్నారు. కీటకాల కారణంగా బబేసియా సోకుతుందని, దీని వ్యాప్తిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. దీనిపై సాధారణంగా వన్యప్రాణుల పిల్లలు బతికుండే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉంటాయన్నారు. జంతువుల్లో వ్యాధి నిరోధకత సహజంగా తక్కువగా ఉంటుందని, తాజా ఘటనలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. గిర్‌లో 2018లో కెనైన్ డిస్టెంపర్ వైరస్, ప్రొటోజోవల్ ఇన్ఫెక్షన్లకు గురై నెల వ్యవధిలోనే 11 సింహాలు మృత్యువాతపడ్డాయి. 2025 గణాంకాల ప్రకారం గుజరాత్లో 891 ఆసియాటిక్ సింహాలున్నాయి. -
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్‌కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్‌ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్‌కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్‌కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్‌గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
Odisha: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ.. ఆరుగురు మృతి
కలహండి: ఒడిశాలోని కలహండి జిల్లాలో మంగళవారం జరిగిన ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మదన్‌పూర్-రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరియాఖుంట గ్రామంలో చోటుచేసుకుంది.మృత్యువుకు చిరునామాగా..నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు, నిర్మాణ సంబంధిత పనుల కోసం మంగళవారం ఆరుగురు వ్యక్తులు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల కారణంగా వారందరికీ ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబాకు మళ్లీ పెరోల్.. 16వ సారి బయటకు.. -
‘కుర్చీతాత’ కాలా బాషా కన్నుమూత
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైరలైన.. హీరో మహేష్‌బాబు సినిమా ‘గుంటూరు కారం’లోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’పాటకు పరోక్షంగా కారణమైన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) బుధవారం మృతి చెందాడు. దీంతో సోషల్ మీడియా పలువురు నివాళులర్పిస్తున్నారు.ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ కుర్చీని మడత పెట్టి అనే పదం వాడాడు కాలా బాషా. అది అలా సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్లింది. అనంతరం ‘గుంటూరు కారం’సినిమాలో ఆ పదంతో పాట వచ్చి సంచలనం సృష్టించింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసేవరకు వెళ్లింది. బోరబండ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటూ.. రోజూ యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్‌పార్క్ పరిసరాల్లో తిరుగుతుండేవాడు. బస్సులు ఎక్కి ఇంగ్లీష్‌లో డబ్బులు అడుక్కునేవాడు. అలా ఓ ఇంటర్వ్యూలో కుర్చీని మడతబెట్టి ... డైలాగ్‌తో కాలా బాషా కుర్చీతాతగా ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో మీమ్‌గా వైరల్ కావడంతో పలువురు ఇంటర్వ్యూలు చేసేవారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయాడు. బాషాకు మద్యం అలవాటు ఉంది. పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకు ముందు కూడా కాలా బాషా చనిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే వైజాగ్ సత్యలాంటి వాళ్లు అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్టకాంత్ పార్క్ వద్ద స్పృ హ తప్పి పడిపోయాడు. అక్కడివారు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేయగా ఇంటికి తీసుకెళ్లాక మృతి చెందాడు. -
ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బులు డిమాండ్.. వైద్యం అందక మహిళ మృతి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు రెచ్చిపోతున్నాయి. తాజాగా విశాఖలోని ఓమ్ని ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్షం కారణంగానే మహిళ చనిపోయిందని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ అదనంగా డబ్బు తేవాలని డిమాండ్ చేశారని డబ్బు తేవడం ఆలస్యమవడంతో ఆపరేషన్‌కు ఆలస్యం చేశారని తెలిపారు.దీంతో మహిళకు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అదనంగా రూ. 60 వేలు ఆసుపత్రి వర్గాలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. -
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మైక్‌స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1958లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 50 మ్యాచ్‌ల్లో 2,278 పరుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 637 మ్యాచ్‌లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. అంతేకాదు 1991 నుంచి 2003 మధ్య వార్విక్షైర్ కౌంటీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన పదవిలో ఉన్న సమయంలోనే వార్విక్షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. క్రికెటర్‌గానే గాక రగ్బీ ప్లేయర్‌గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 1956లో వేల్స్‌తో జరిగిన రగ్బీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మరణంపై వార్విక్షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్విక్షైర్ మైక్ స్మిత్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం! -
కువైట్‌లో విషాదం: భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి
కువైట్: కువైట్‌లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. అబ్బాసియా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతురాలిని కేరళలోని ఎర్నాకులం జిల్లా, పెరుంబావూర్ సమీపంలోని చిరక్కర ముట్టం ప్రాంతానికి చెందిన ఫేబా బిజు మణి (14)గా గుర్తించారు. ఆమె అబ్బాసియాలోని 'యునైటెడ్ ఇండియన్ స్కూల్'లో 9వ తరగతి చదువుతోంది. అబ్బాసియా హైవే మార్కెట్ సమీపంలో ఉన్న ఒక నివాస భవనం పైనుంచి ఆమె కింద పడిపోయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు మృతదేహాన్ని తదుపరి న్యాయ, వైద్య ప్రక్రియల నిమిత్తం ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విద్యార్థిని మృతితో స్థానిక భారతీయ సమాజంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్‌ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్ సాధించిన అన్‌సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్‌ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్‌లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
పుచ్చకాయ చావులు: ముంబై ఘటన మరవకముందే..
జాంజ్‌గిర్-చంపా: వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని పుచ్చకాయ తింటే, అది కాస్తా ప్రాణాలు తీసే యమపాశంలా మారుతోంది. గత నెలలో ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిని మృత్యువాత పడిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌లో ఇదే తరహాలో మరో విషాదం చోటుచేసుకుంది. వేసవిలో అమృతంలా భావించే ఈ పండు, ఇప్పుడు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.సరదాగా తిన్నారు.. శవమై తేలాడుఛత్తీస్గఢ్లోని జాంజ్‌గిర్-చంపా జిల్లా ఘుర్కోట్ గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మేనమామ ఇంటికి వచ్చిన పిల్లలు ఆదివారం సాయంత్రం పుచ్చకాయ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే 15 ఏళ్ల అఖిలేష్ ధివర్‌కు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అఖిలేష్‌తో పాటు పండు తిన్న శ్రీ(4), పింటూ(12), హితేష్(13) అనే ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బలితీసుకుంటున్న ‘జింక్ ఫాస్ఫైడ్’గత ఏప్రిల్ 25న ముంబైలోని పైధోనీ ప్రాంతంలోనూ అబ్దుల్లా దొకాడియా కుటుంబంలోని నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మృత్యువాత పడ్డారు. అయితే వీరి ఫోరెన్సిక్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి శరీర నమూనాల్లో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఎలుకల నివారణకు వాడే ఈ రసాయనం పండ్ల ద్వారా మనిషి శరీరంలోకి చేరి ప్రమాదకరంగా పరిణమిస్తోందిఅజాగ్రత్తే ప్రాణసంకటమా?ఛత్తీస్‌గఢ్ ఘటనలో ప్రాథమికంగా ‘ఫుడ్ పాయిజనింగ్’ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఉదయం కోసిన పుచ్చకాయను చాలా గంటల పాటు గాలికి వదిలేసి, సాయంత్రం తినడమే విషంగా మారి ఉండొచ్చని డాక్టర్ ఎస్.కుజుర్ తెలిపారు. పండ్లపై రసాయనాల వాడకం లేదా నిల్వ ఉంచడంలో చేసే చిన్న అజాగ్రత్తే నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అందుకే పండ్లు కొనేటప్పుడు, తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..!
ముంబై: మహానగరం ముంబైలో సంచలనం సృష్టించిన ‘పుచ్చకాయ మరణాల’ కేసులో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో సహా సహా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన 16 ఏళ్ల ఆయేషా డొకాడియా, తాజాగా విడుదలైన మహారాష్ట్ర ఎస్ఎస్సీ ఫలితాల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.మరణం తర్వాత వచ్చిన విజయంముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన ఆయేషా డొకాడియా ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్‌పై కలులుగనేది. అయితే విధి ఆ కలను కల్లలు చేసింది. మే 8న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 70 శాతం మార్కులు సాధించింది. అయితే ఈ వార్త వినడానికి ఆయేషా మాత్రం మన మధ్య లేదు. ఏప్రిల్ 26న తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఆమె మృతి చెందింది. పరీక్షల ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఈ ఘోరం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పుచ్చకాయలో విషపు ఛాయలుఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు వారు తిన్న పుచ్చకాయ నమూనాలలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే విష రసాయనాన్ని ల్యాబ్ నిపుణులు గుర్తించారు. సాధారణంగా ఎలుకల మందులో వాడే ఈ రసాయనం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి పుచ్చకాయ తిన్న వెంటనే కుటుంబం మొత్తానికి వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజే ఆ నలుగురు జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు.మిస్టరీగా మారిన మరణాలుఇది ఆత్మహత్యా లేక ఎవరైనా పథకం ప్రకారం విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలను సర్ జేజే ఆసుపత్రి వైద్య బృందం క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను, బాధితుల శరీరంలో విషం ఏ విధంగా ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్‌షిప్‌లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్
తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన అందమైన నెమళ్లు, ‘సైలెంట్ కిల్లర్’ దాటికి విగతజీవులుగా మారుతున్నాయి. 44 నెమళ్లు మృత్యువాత పడటానికి ‘H5N1 బర్డ్ ఫ్లూ’ మహమ్మారే కారణమని ల్యాబ్ రిపోర్టుల్లో నిర్ధారణ కావడం స్థానికులను, అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది.పక్షుల మరణాల వెనుక..ఏప్రిల్ 16న తొలిసారిగా వెలుగుచూసిన ఈ విషాదం, వారం రోజుల్లోనే తీవ్ర స్థాయికి చేరుకుంది. తుమకూరు తాలూకా పరిధిలోని కేసరమడు, హిరేహళ్లి, గులూరు గ్రామ పంచాయతీల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పక్షులు మృతిచెంది కనిపించాయి. అటవీ శాఖ అధికారుల గాలింపు చర్యల్లో ఈ దారుణం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, వాటి నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ (ICAR-NIHSAD) ల్యాబ్‌కు పంపగా.. అత్యంత ప్రమాదకరమైన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే ఈ నెమళ్లు చనిపోయినట్లు వెల్లడయ్యింది.ల్యాబ్ రిపోర్టుల నిర్ధారణతో అటవీ, ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలు యుద్ధప్రాతిపదికన సమన్వయంతో చర్యలు చేపట్టాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, నెమళ్లు మరణించిన ప్రాంతాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని ‘కంటైన్మెంట్ జోన్’గా ప్రకటించారు. ఈ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల నిర్వాహకులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 23 తర్వాత కొత్తగా ఎలాంటి నెమళ్ల మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.ఆరోగ్య శాఖ అప్రమత్తంబర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో తుమకూరు జిల్లా అంతటా వైద్యారోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఫ్లూ వంటి లక్షణాలతో వచ్చే రోగుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆసుపత్రులను ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పీపీఈ కిట్లు, త్రిబుల్ లేయర్ మాస్క్‌లు, ఓసెల్టామివిర్ మందుల నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: Jammu: కూలిన వంతెన.. ముగ్గురు దుర్మరణం! -
'నేను సడన్‌గా చనిపోతే..' ఏం చేయాలో ముందే చెబుతా..!
బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన విమాన ప్రయాణానికి ముందు ఓ సీక్రెట్ నోట్ పంపుతానని తెలిపారు. ఒకవేళ ఏదైనా జరిగిన నేను చనిపోతే రన్నింగ్‌లో ఉన్న సినిమాను ఆపొద్దని దర్శకుడు మన్సూర్ ఖాన్‌కు పంపుతానని వెల్లడించారు. నేను చనిపోయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని చెప్తానని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఏదైనా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి చివరి దశలో ఉన్నప్పుడు నేను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే మన్సూర్‌కు ఓ సీక్రెట్ నోట్ పంపుతా. ఒకవేళ తాను ప్రయాణించే ఫ్లైట్ కూలిపోయి చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వే చూసుకో అని రాసి పంపిస్తా. అంతేకాకుండా దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతా. నాకు ఏ ఆపద వచ్చినా సినిమాను ఆపొద్దని.. మన్సూర్‌తో కలిసి మూవీని విడుదల చేయాలని కోరతా' అని అన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆపద వస్తుందనే భయం నాలో ఉందన్నారు. కాగా.. దర్శకుడు మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇద్దరు బంధువులు కావడం విశేషం. వీరిద్దరి కాంబోలో ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. -
మరణానికి ముందు కనిపించే కలలు వాటి సీక్రెట్స్
-
మాలి రక్షణ మంత్రి దారుణ హత్య
బమాకో: పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాలి రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల కూటమి దేశవ్యాప్తంగా సృష్టించిన భీకర దాడులతో మాలి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా మద్దతుతో నడుస్తున్న సైన్యం వెనక్కి తగ్గడంతో, దేశ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.మంత్రి నివాసంపై కారు బాంబు దాడిమాలి రాజధాని బమాకోలో జరిగిన కారు బాంబు, సాయుధ దాడిలో రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జనరల్ కమరా వీరోచితంగా పోరాడి కొందరు దుండగులను మట్టుబెట్టినప్పటికీ, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ దాడుల్లో 16 మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రాజధానిలో మూడు రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.అల్ ఖైదాతో చేతులు కలిపి..మాలి ఉత్తర భాగంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న అజావాద్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్ఎల్ఏ) సాయుధులు, అల్ ఖైదాతో సంబంధం ఉన్న జెఎన్ఐఎం (జెఎన్ఐఎం) ఉగ్రవాదులతో జట్టుకట్టారు. ఈ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించి, మాలి సైన్యంపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల ధాటికి సైన్యం వెనక్కి తగ్గడంతో, కీలకమైన ఉత్తర నగరమైన కిడాల్ పూర్తిగా తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. శాంతియుత ఒప్పందం ద్వారా ప్రభుత్వ బలగాలు కిడాల్ను ఖాళీ చేసి, వంద కిలోమీటర్ల దూరంలోని అనెఫిస్ కు చేరుకున్నాయని సైన్యాధికారులు తెలిపారు.రష్యా సైనిక వ్యూహాలకు భారీ ఎదురుదెబ్బఈ పరిణామాలు పశ్చిమాఫ్రికాలో రష్యా ఆధిపత్యానికి అతిపెద్ద సవాలుగా మారాయి. మాలి సైనిక ప్రభుత్వం పాశ్చాత్య దేశాలను కాదని, రష్యా బలగాల (ఆఫ్రికా కార్ప్స్) మద్దతు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ హింస తీవ్రరూపం దాల్చింది. భిన్న సిద్ధాంతాలున్న రెండు సాయుధ వర్గాలు ఒకటై ఇంతటి భారీ కుట్రను అమలు చేశాయి. దీనిని పసిగట్టలేకపోవడం రష్యా సైనికుల వైఫల్యమేనని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ ముప్పు ఉందా? -
భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రను తన కెమెరా లెన్స్‌తో ఒడిసిపట్టిన ఆ మహా మనిషి మనకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు అనేక చారిత్రక ఘట్టాలను, విషాదాలను, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘భారత ఫోటో జర్నలిజం పితామహుడు’ రఘు రాయ్ (83) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.కన్నీళ్లు పెట్టించిన భోపాల్ విషాదంరఘు రాయ్ కెమెరా క్లిక్ మంటే అది చరిత్రే. ముఖ్యంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆయన తీసిన ఛాయాచిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. సగం పూడ్చిపెట్టిన ఒక చిన్నారి కళ్లలోని విషాదాన్ని ఆయన బంధించిన తీరు, ఆ దుర్ఘటన యొక్క తీవ్రతను కళ్లకు కట్టింది. ఈ గుండెలు పిండేసే ఘటనపై ఆయన ‘ఎక్స్పోజర్: ఏ కార్పొరేట్ క్రైమ్’ అనే పుస్తకాన్ని, డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.మదర్ థెరిసా నుండి ఇందిరా గాంధీ వరకూ..ఇందిరా గాంధీ కాలం నాటి దేశ అగ్రశ్రేణి నాయకుల అరుదైన ఫోటోలు ఆయన సేకరణలో ఉన్నాయి. మదర్ థెరిసాకు పోప్ సెయింట్ హోదా ఇవ్వడానికి చాలా కాలం ముందే, రఘు రాయ్ ఆమె జీవితంపై ‘సెయింట్ మదర్’ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె సేవా కార్యక్రమాలను అత్యంత సుదీర్ఘంగా రికార్డ్ చేసిన ఏకైక ఫోటోగ్రాఫర్ ఆయనే. ఆయన దేశ నలుమూలలా పర్యటించి భారతీయ ఆత్మను తన చిత్రాల్లో అద్భుతంగా బంధించారు.ప్రపంచవ్యాప్తంగా అలుపెరగని ప్రయాణం1962లో ‘ది స్టేట్స్‌మన్’ పత్రికతో వృత్తిని ప్రారంభించిన ఆయన, ప్రపంచ ప్రఖ్యాత ‘మాగ్నమ్ ఫోటోస్’లో సభ్యునిగా ఎదిగారు. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ బ్రెస్సన్ స్వయంగా ఈయనను నామినేట్ చేయడం విశేషం. టైమ్, లైఫ్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికల్లో ఆయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. తన జీవితకాలంలో 18కి పైగా పుస్తకాలు రచించిన ఆయన, వరల్డ్ ప్రెస్ ఫోటో పోటీలకు మూడుసార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇది కూడా చదవండి: ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్ -
తిరుపతి జిల్లాలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మరణం
-
రేసింగ్‌లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
ఫార్ములావన్ రేసింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్‌లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జుహా మియెట్టియెన్ బీఎండబ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవర్‌గా ఉన్నాడు. ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంటలపాటు జరగాల్సిన ఈవెంట్లో రేస్ ప్రారంభమైన 25 నిమిషాలకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్‌లోని క్లోస్టర్టాల్ వద్ద ఎత్తులో ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రేసును నిలిపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది జుహా మియెట్టియెన్ను కారులో నుంచి బయటికి తీసినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో వెర్స్టాపెన్ కూడా ఉన్నాడు. కాగా మియెట్టియెన్ మరణంపై ఎన్ఎస్ఎల్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్రణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్యక్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఆదివారం రేస్ జరుగుతుందని ఎన్ఎస్ఎల్ తెలిపింది. అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్స్టాపెన్తో పాటు మెర్సిడెస్ రేసర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొననున్నాడు. కాగా జుహా మియెట్టియెన్ మరణంపై మాక్స్ వెర్స్టాపెన్ స్పందించాడు. ‘మియెట్టియెన్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు. View this post on Instagram A post shared by 24hNürburgring (@24hnbr) -
ముళ్లపొదల్లో చిక్కుకొని చిరుత మృతి?
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో చిరుత పులి మృతి కలకలం రేపుతుంది. ముళ్లపొదల్లో ఇరుక్కొని చిరుతపులి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దాని కాలికి గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ముళ్లపొదల్లేనే ఇరుక్కొని చిరుత మృతిచెందిందా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. -
చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు!
పంజగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్రోమాల్‌లో ఓ వ్యక్తి అనుమా నాస్పద స్థితిలో మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ మెట్రోమాల్ లోని థియేటర్లో హౌస్‌కీపింగ్ సూపర్వైజర్గా పనిచే స్తున్న పురానాపూల్వాసి సత్యనారాయణ (45) బుధ వారం రాత్రి నైట్‌డ్యూటీ చేస్తూ గురువారం తెల్లవారు జామున 3:40 ప్రాంతంలో వాంతులు చేసుకొని కింద పడిపోయాడు.గమనించిన తోటి సిబ్బంది సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతన్ని ఉస్మానియాకు తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి మెట్రోమాల్ లోపలకు మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. తన భర్త కిందపడిపోగానే నిమ్స్‌కు తరలించకుండా సిబ్బంది రోడ్డుపై పడుకోబెట్టారని.. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన భర్త మరణించాడని మృతురాలి భార్య ఆరోపించారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు భారీగా తరలివచ్చి మెట్రోమాల్ థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాన్ని సముదాయించి గురువారం సాయంత్రం మృతదేహాన్ని గాంధీకి తరలించారు. -
న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
న్యూజెర్సీ: అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. న్యూజెర్సీలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ‘చికెన్-ఫిల్-ఏ’లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి 8:40 గంటల సమయంలో ఈ రెస్టారెంట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఈ రెస్టారెంట్ లో ఘటన జరిగిన సమయంలో పలువురు వినియోగదారులు ఉన్నారు. కాల్పులు జరిగిన వెంటనే భయాందోళనలు చెలరేగాయి. కొందరు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కాల్పుల్లో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు మరణించగా, మిగిలిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ చేపట్టింది. కాల్పులు జరిపిన నిందితుడి వివరాలను, ఈ దారుణానికి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటన అమెరికాలో మరోసారి తుపాకీల చట్టాలపై చర్చకు దారితీసింది. -
స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి..
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో పడి 23 ఏళ్ల హర్షిత్ భట్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు మరో మలుపు తిరిగింది. తన కొడుకును స్నేహితులే పథకం ప్రకారం చంపేశారని తల్లి ఆరోపణలు చేయడంతో, ఆ ముగ్గురు స్నేహితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హర్షిత్ ఇందిరాపురంలో ఉంటూ సెక్టార్ 125లోని అమిటీ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. బుధవారం (ఏప్రిల్ 8న) తన ఆరవ సెమిస్టర్ చివరి పరీక్ష రాసిన అనంతరం.. స్నేహితులు వ్యాస్, క్రిష్, హిమాన్షులతో కలిసి సెక్టార్ 94లోని సూపర్ నోవా భవనం వెనుక వైపు ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆగిపోయిన ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ స్థలంలో బేస్మెంట్ కోసం తవ్విన భారీ గుంతలో నీరు నిలిచి ఉంది. ప్రహరీ గోడ గుండా వారు లోపలికి ప్రవేశించారు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వీరంతా ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరీక్షకు ముందు, ఆ తర్వాత కూడా వీరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గుంత దగ్గర బీర్ క్యాన్లు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వీరు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆ నీటి గుంతలోకి దిగారు.మొదట హర్షిత్ నీటిలోకి దిగాడని, ఈదుకుంటూ బురద ఎక్కువగా ఉన్న మధ్య భాగంలోకి వెళ్లి ఇరుక్కుపోయాడని స్నేహితులు చెబుతున్నారు. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి 10 మీటర్ల లోతు నుంచి హర్షిత్ ను బయటకు తీసుకువచ్చి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతన్ని ఆ ముగ్గురే ఉద్దేశపూర్వకంగా చంపేశారని తల్లి దీప్ మాల సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని -
మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో యమునా నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన అని స్థానిక పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి హేమమాలిని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఆనందంగా భజనలు చేసుకుంటూ వెళ్తున్న పడవ బోల్తా పడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. ‘మరణించిన వారి ఆత్మలకు శాశ్వత శాంతి చేకూరాలని, ఈ తీరని శోకాన్ని భరించే శక్తిని ఆ బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె ట్వీట్ చేశారు.శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ మహా విషాదం చోటుచేసుకుంది. మథుర డీఐజీ శైలేష్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం సుమారు 30 మంది భక్తులతో వెళ్తున్న ఒక మోటారు బోటు అదుపుతప్పి పాంటూన్ వంతెనను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన 22 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయిఈ ప్రమాదానికి కనీస అనుమతులు లేని పడవ ప్రయాణమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మథుర, బృందావన్, గోకులం మధ్య బోటు ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి దీన్ని నడిపినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు పడవలో భక్తులు భక్తిపారవశ్యంతో భజనలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా? -
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్‌సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో హజ్బొల్లా కీలక నేత హతం
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. హజ్బొల్లా చీఫ్ పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షీను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. రాత్రి బీరుట్‌పై జరిపిన దాడ్లుల్లో అలీ యూసఫ్ చనిపోయారని.. హెజ్బొల్లా ఆయుధ రవాణా మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. సౌత్ లెబనాన్‌లో 10 ఆయుధ డిపోలు నాశనం నాశనమైనట్లు పేర్కొంది. హర్షీ.. ఖాసిమ్‌కు అత్యంత నమ్మకస్థుడైన సలహాదారు మాత్రమే కాకుండా.. అతని కార్యాలయ నిర్వహణ, భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేవారని తెలిపింది.అంతకుముందు, అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హజ్బొల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని హజ్బొల్లా పేర్కొంది. శత్రువు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిగా.. సరిహద్దు సమీపంలోని మనారా అనే ఇజ్రాయెల్ కిబ్బట్జ్‌పై గురువారం తెల్లవారుజామున రాకెట్లతో దాడి చేశాం" అని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.లెబనాన్‌పై కేవలం ఒక్క రోజులోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మంది మరణించగా.. 1,165 మందికి పైగా గాయపడ్డారు. దీంతో లెబనాన్ ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మేము అటువంటి వాగ్దానం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు. -
ప్రాణాలపై పిడుగు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులు పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. 8 మందికి గాయాలయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యువాతపడగా, ఐదుగురు గాయపడ్డారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బిహార్‌కు చెందిన కన్నయ్య(18) మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న బిహార్ వాసులు ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే మండలం యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలీ బొందలపాటి నాగయ్య(60) ప్రాణాలు విడిచాడు. అలాగే, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా, ఆయనపై పిడుగుపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అలాగే, ముండ్లమూరు మండలం వేములబండ పొలాల్లో పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కనిగిరి సమీపంలో పిడుగు పడి బిహార్‌కు చెందిన కార్మికుడు దుర్గేష్‌కుమార్ (24)మరణించాడు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని పొలాల్లో పిడుగులు పడి కూలీలు వి.పార్వతి(40), డి.సింహాచలం (38) ప్రాణాలు విడిచారు. గాయపడిన ముగ్గురుని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చావడమో.. చంపడమూ
మార్చి 31వరంగల్ జిల్లాకు చెందిన స్రవంతి తన భర్త వేధింపులు తాళ లేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ తాగిన మైకంలో గొడవకు దిగి భార్య, కొడుకు, కూతురుపై రోకలి, చాకుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు మృతి చెందారు. ఏప్రిల్ 3కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం కవల ఆడపిల్లలు పుట్టారని తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు తాగించి బావిలో పడేశాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 4పటాన్‌చెరుకు చెందిన పరమేశ్వరరావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి చంపాడు. సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కుటుంబ ఆత్మహత్యలు, హత్య–ఆత్మహత్యల సంఘటనలు ఒక తీవ్రమైన ప్రజారోగ్య, సామాజిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒంటరితనం, కుంగుబాటు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, చదువు, ఒత్తిడి వంటి కారణాలతో మరణం తప్ప మరోమార్గం లేదని... హింసాత్మక ప్రవృత్తితో ఇతరులను చంపడమో, తాము ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలి పోకడలను గమనిస్తే ఇవి కేవలం విడివిడి సంఘటనలే కాకుండా... తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక క్షోభకు దారితీసే లక్షణాలుగా కనిపిస్తున్నాయి.కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడమో లేదా పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకోవడమో, భార్యాపిల్లలను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 2022–2026 మధ్యకాలంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అప్పులు, పేదరికం, నిరుద్యోగం, వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, ఆ తర్వాత గృహిణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉండడం వారి ఆర్థిక దుర్బలత్వాన్ని సూచిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (తెలంగాణతో సహా) అప్పులు లేదా గృహ సమస్యల కారణంగా పిల్లలతో సహా మొత్తం కుటుంబం విషం తాగడం లేదా ఉరి వేసుకోవడం వంటి సంఘటనలు, సామూహిక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కుటుంబ కలహాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా మానసిక అనారోగ్యం వంటి కారణాల వల్ల, ఒక కుటుంబ సభ్యుడు ఇతరులను (భార్య/భర్త పిల్లలను) చంపి ఆత్మహత్య చేసుకునే కేసులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బాధితుల్లో గణనీయమైన సంఖ్యలో ‘గృహిణులు’ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలు తరచుగా వ్యక్తిగత సమస్యలు, గృహ హింస లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, గృహ ఒత్తిడితో ముడిపడి ఉన్నట్టుగా వెల్లడైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2023లో ఆత్మహత్య బాధితులలో 66% మంది అత్యల్ప ఆదాయ వర్గానికి (సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ సంపాదించేవారు) చెందినవారు ఉన్నారు. చావులు పరిష్కారం కాదనే అవగాహన, మ్యారేజీ కౌన్సెలింగ్ పెంచాలి నేటి సమాజంలో యువత, దంపతులకు తాహతుకు మించి ఆశలు పెరుగుతున్నాయి. తమ జీవితం, ఆర్థిక పరిస్థితులు, సమాజం తదితరాల పట్ల స్పష్టమైన అవగాహన లేక ప్రతిష్టకు పోయి సమస్యల్లో కూరుకుపోతున్నారు. నేటితరం ఆడంబరంగా పెళ్లిళ్లు, ఆ తర్వాత ఖర్చుతో కూడుకున్న ట్రిప్‌లు, పెద్దపెద్ద ఇళ్లు, ఖరీదైన ఫోన్లు, వాహనాలు...ఇలా లెక్కకుమిక్కిలి ఖర్చులతో ఆర్థికపరంగా చిక్కుల్లో కూరుకుపోతున్నారు. దీంతో అక్రమ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంపై దృష్టితో తాగుడు, డ్రగ్స్, చెడు వ్యసనాలు, బెట్టింగ్‌లకు బానిసలై హింసా ప్రవృత్తితో హత్యలకు, కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పరంగా హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కాదనే అవగాహనతోపాటు మ్యారేజీ కౌన్సెలింగ్ విస్తృతం చేయాలి. కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లు పెరుగుదల వంటి వాటిని ముందుగానే గుర్తించి కౌన్సెలర్లను సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్‌తో ఎవరితోనైనా ఎక్కడి నుంచైనా సులభంగా కనెక్ట్ అవుతున్నారు. ‘పోర్న్’కూడా యువత, ఇతర వర్గాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. - సి.వీరేందర్, సైకాలజిస్ట్ కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఏది ? ఇప్పుడు కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ కనుమరుగవుతోంది. సమస్యలు, కుంగుబాటు వంటివి తలెత్తితే ఇంట్లోని పెద్దవారు సరిదిద్దేవారు. కుటు ంబ సంబంధాలు, ఆర్థిక సమస్యలు, ఇతర రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చాలామందికి తెలియడం లేదు. చదువు పూర్తి కాగానే ఏడ ంకెల జీతాలు, విలాసాలతో కూడుకున్న జీవనం, సౌకర్యాలు కోరుకుంటున్నారు.దానికి తగ్గట్టుగా విద్యార్హతలు, తాహతు లేకపోతే కుంగుబాటుకు గురికావడం, వ్యక్తిగత సంబంధాల్లో భేదాభిప్రాయాలు, భాగస్వాముల మధ్య స్పర్థలు, కోపా లు, ఆవేశాలు పెరిగిపోయి హత్యలు, ఆత్మహత్యలే శరణ్యమనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులను కనెక్ట్ చేయడానికి బదులు ఏకాకులను చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. రోజులో ఎక్కువ సమయం సెల్ఫోన్లు, టీవీల్లో మునిగి మనుషుల్లో ఏకాకితనం పెరుగుతోంది. - డా. నిశాంత్ సైకియాట్రిస్ట్ -
ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు
టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ఇరాన్: మరణాల హోరుయుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదులెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్‌లో ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలుఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. -
‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి
బహావల్పూర్: భారత గడ్డపై నెత్తురు ఏరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో మృతి చెందాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అనుమానాస్పద స్థితిలో మృతిచాలా కాలంగా జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ తన అధికారిక ఛానల్ ద్వారా ఈ మృతిని ధృవీకరించింది. బహావల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే అతను అనారోగ్యంతో చనిపోయాడా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా అనే విషయంలో సంస్థ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.భారత్‌కు పక్కలో బల్లెంలా జైషే..భారత పార్లమెంటుపై దాడి (2001), పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ స్ట్రైక్ (2016), యూరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి (2019) తదితర దారుణాల వెనుక మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ సంస్థలో తాహిర్ అన్వర్ ఏళ్ల తరబడి కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.‘ఆపరేషన్ సింధూర్’తో కోలుకోలేని దెబ్బగత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టాయి. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ దాడుల్లో అజహర్ సోదరి, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు గత సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా? -
China: ముగ్గురు సజీవ దహనం.. మరో 23 మంది..
బీజింగ్: చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తైయువాన్ నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. షాంగ్జీ రాజధాని తైయువాన్‌లోని షియావోడియన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే భవనం మొత్తానికి అవి విస్తరించాయి. దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఆకాశాన్నంటడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన 23 మందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని జిల్లా పబ్లిసిటీ విభాగం వెల్లడించింది.3月28日晚,山西太原,亲贤北街茂业怡和巷一饭店大楼发生大火,官方通报24死伤!#太原 #火灾 pic.twitter.com/uZsvMm3utw— 中国悲剧档案 (@newszg_official) March 28, 2026భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి పూట మంటలు భవనాన్ని చుట్టుముట్టడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. -
రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు
భారత పారిశ్రామిక రంగానికి చెందిన ఒక ధ్రువతార నేలకొరిగింది. దేశీయ వస్త్ర ప్రపంచంలో ‘రేమండ్’ అనే బ్రాండ్‌ను ప్రతి ఇంటికి చేర్చిన, సంస్థ మాజీ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచిన వార్త వినగానే యావత్ పారిశ్రామిక లోకం దిగ్భ్రాంతికి లోనైంది. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, అసాధారణ సాహసిగా, దాతగా ఆయన చెరగని ముద్ర వేశారు.ఒక బ్రాండ్ వెనుక ..సాధారణ మధ్యతరగతి భారతీయుడికి సూట్ ధరించడం అనే కలను పరిచయం చేసిన వ్యక్తి విజయ్‌పత్ సింఘానియా. 1980లలో ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రేమండ్ ఒక చిన్న సంస్థ. అయితే తన వ్యూహాలతో దానిని పురుషుల ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని గమ్యస్థానంగా మార్చారు. ‘ది కంప్లీట్ మ్యాన్’ అనే ట్యాగ్‌లైన్‌కు నిలువెత్తు రూపంగా ఆయన నిలిచారు.RIP. Om Shanti 🙏 pic.twitter.com/nGtOGAEtHt— Gautam Singhania (@SinghaniaGautam) March 28, 2026వ్యాపారవేత్త మాత్రమే కాదువిజయ్పత్ సింఘానియా జీవితం కేవలం బోర్డ్‌రూమ్ మీటింగ్లకే పరిమితం కాలేదు. 2005లో, తన 67వ ఏట, హాట్ ఎయిర్ బెలూన్‌లో సుమారు 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుండి అహ్మదాబాద్ వరకు ఒంటరిగా విమానాన్ని నడుపుతూ వచ్చిన ఆయన సాహసం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.పద్మభూషణ్ నుండి షెరీఫ్ వరకు..వస్త్ర పరిశ్రమ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతేకాకుండా, ఆయన ముంబై నగరానికి గౌరవ ‘షెరీఫ్’గా కూడా పనిచేశారు. తన జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన విజయ్‌పత్ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. ఒంటరి పోరాటంకోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన జీవితంలో పలు వ్యక్తిగత సంఘర్షణలను ఎదుర్కొన్నారు. తన ఆస్తులను కుమారుడు గౌతమ్ సింఘానియాకు బదిలీ చేసిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అద్దె ఇంట్లో గడపడం నుండి కోర్టు మెట్లు ఎక్కడం వరకు, ఒక దిగ్గజం ఎదుర్కొన్న ఈ ఒడిదుడుకులు ఎందరినో కలచివేసాయి.మళ్లీ కలిసిన బంధంసంవత్సరాల తరబడి సాగిన మనస్పర్థల తర్వాత, 2024లో తండ్రీకొడుకులు మళ్లీ ఒక్కటవడం అభిమానులను, వ్యాపార వర్గాలను సంతోషపరిచింది. ‘అపార్థాలు తొలగిపోయాయి, నా తండ్రి దీవెనలు నాకు ముఖ్యం’ అని గౌతమ్ ప్రకటించడం ఆ కుటుంబ ప్రస్థానంలో ఒక కీలక మలుపు.ముగిసిన అద్భుత శకంవిజయ్పత్ సింఘానియా మరణం భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు. శూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించడం, ఆకాశంలో రికార్డులు సృష్టించడం, జీవితపు ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవడం మొదలైనవి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ‘కంప్లీట్ మ్యాన్’ ప్రయాణం ముగిసినా, ఆయన సృష్టించిన బ్రాండ్ ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన.. -
మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి
లడఖ్: లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విరిగిపడిన భారీ మంచు పెళ్లలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కింద 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.నిముషాల్లోనే మారిన దృశ్యంద్రాస్ పరిధిలోని ‘క్యాప్టెన్-టర్న్’ వద్ద మధ్యాహ్నం సమయంలో భారీ హిమపాతం కురిసింది. రహదారిపై వాహనాలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగిపడటంతో, ప్రయాణికులు అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మంచు కింద మరికొన్ని వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Heard the unfortunate news of an avalanche at Zoji La. I have directed the DC & SSP of Kargil to visit the spot immediately and mobilise relief and rescue operations. All government agencies including disaster relief forces and BRO have been put on high alert. I am personally…— LG Ladakh (@lg_ladakh) March 27, 2026యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలుప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ఆర్డీఎఫ్)బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)బృందాలు రంగంలోకి దిగాయి. మేఘా టన్నెల్ సిబ్బంది సహకారంతో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సోనామార్గ్- ద్రాస్.. ఇలా రెండు వైపుల నుండి మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీర్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం.ఇది కూడా చదవండి: Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు! -
బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.బిలాస్‌పూర్‌లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.రెడ్ జోన్‌గా ఒక కిలోమీటర్ పరిధివైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్‌లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.మనుషులకు ముప్పు పొంచి ఉందా?పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్‌కు మద్దతుగా.. -
‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!
చాంగ్‌చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో కొందరు దొంగలు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026చాంగ్‌చువాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్! -
ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు
కాసరగోడ్: త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో విషాదం చోటుచేసుకుంది. కాసరగోడ్‌లో ఎన్నికల విధుల ఒత్తిడిని తట్టుకోలేక ఒక ఉపాధ్యాయుడు నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగింది?మొగ్రాల్ పుత్తూరుకు చెందిన బి. మహమ్మద్ సవాద్ (32) చెర్కల సెంట్రల్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అరబిక్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన కుడ్లు విలేజ్ పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం మొగ్రాల్ వంతెన వద్ద సవాద్ స్కూటర్ కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు నదిలో గాలించారు. రెండు పడవల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న సవాద్ను గుర్తించి వెంటనే వారు కాసరగోడ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే కన్నుమూశారు.పని ఒత్తిడే కారణమా?సవాద్ మృతికి మితిమీరిన పని ఒత్తిడే కారణమని ఆయన సహోద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ పనులను మార్చి 21లోపు పూర్తి చేయాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని వారు చెబుతున్నారు. ‘ఈద్ పండుగ దృష్ట్యా గడువు పెంచాలని ఆయన అధికారులను కోరారు, కానీ అందుకు నిరాకరించారు’ అని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆస్పత్రి వద్ద పలువురు ఆందోళనకు దిగారు.పోలీసుల వాదన వేరేలా ఉంది..మరోవైపు సవాద్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని వారు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో బిను జోసెఫ్, ఏఎస్పీ అచ్యుత్ అశోక్ రంగంలోకి దిగి, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మహమ్మద్ సవాద్కు తండ్రి షఫీ, తల్లి ఫౌసియా, నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎన్నికల వేళ ఒక అధికారి ఇలా మరణించడం జిల్లాలో విషాద ఛాయలు నింపింది.ఇది కూడా చదవండి: ‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్! -
సమాధి తవ్వి మృతదేహం బయటకు.. చివరికి పోలీసుల ఎంట్రీ!
పావగడ( కర్ణాటక): మహిళ మృతదేహానికి అంత్యక్రియల విషయంలో తాలూకాలోని భూపూరు తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాలూకాలోని భూపూరు తండా గ్రామానికి చెందిన రాజునాయక సరోజబాయి దంపతుల కుమార్తె శృతి (20)కి ఏడాది క్రితం తన సమీప బంధువు పవన్ కళ్యాణ్‌తో వివాహం జరిగింది. పవన్ కళ్యాణ్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుండటంతో యలహంకలో కాపురం పెట్టారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని గత శనివారం మధ్యాహ్నం శృతి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త కారణమని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈక్రమంలో మంగళవారం శృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆమె మృతదేహాన్ని భర్త నూతనంగా నిర్మించిన ఇంటి ఎదుట ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తిరుమణి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి మరో చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను తిరుమణి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. -
Delhi: భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేటి (బుధవారం) ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నంబర్ 2లోని ఒక నాలుగు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాస్మెటిక్స్ షాపులో మంటలు మొదలై, నిమిషాల వ్యవధిలోనే పైఅంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ రంగంలోకి దిగింది. సుమారు 30 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. VIDEO | Delhi: Rescue operations are underway at a residential building in the Palam area, where a fire broke out. Around 30 fire tenders were rushed to the spot to douse the flames and rescue people who may be trapped inside. More details are awaited.(Full video available on… pic.twitter.com/52r3irzfUZ— Press Trust of India (@PTI_News) March 18, 2026భవనం పైనుంచి దూకి..ప్రమాద సమయంలో భవనంలో సుమారు 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో కొందరు పైఅంతస్తుల నుండి కిందకు దూకగా, మరికొందరు దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లోపల ఇంకా ఎనిమిది మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. Deeply distressed by the fire incident in a residential building near Palam Metro.My thoughts are with those affected by this tragic loss. Rescue and firefighting operations are being closely monitored, with all necessary support being extended.— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 18, 2026స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: మృత్యుపాశమైన ఈవీ ఛార్జింగ్.. ఆరుగురు సజీవ దహనం! -
తెల్లారుతూనే ఘోరం.. ముగ్గురు మెడికోలు దుర్మరణం
కోజికోడ్: కేరళలో ఈరోజు (బుధవారం) తెల్లారుతూనే ఘోరం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కాబోయే డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమో లేదా అదుపు తప్పడమో తెలియదు కానీ, వారు ప్రయాణిస్తున్న ఈ స్కూటర్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.అసలేం జరిగింది?బుధవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల ప్రాంతంలో కొయిలాండి సమీపంలోని కురువంగడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకే ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. కురువంగడ్ వద్దకు రాగానే స్కూటర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని కరుణాగపల్లికి చెందిన నంద కిషోర్ (22), కాయంకుళం వాసి అభియాన్ రెహమాన్ (19), అలనెల్లూరుకు చెందిన అభినవ్ సురేష్ (19)గా పోలీసులు గుర్తించారు. వీరంతా మలబార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.ఆస్పత్రికి తరలించే లోపే..ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకునే లోపే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను మెడికల్ కాలేజీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు కొయిలాండి పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేస్తోంది.ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్‌జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం
కెర్జర్స్: స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ స్విట్జర్లాండ్‌లోని కెర్జర్స్ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక ప్రయాణీకుల బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలని చేసిన దుశ్చర్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్విస్ రాజధాని బెర్న్కు 20 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ ప్రధాన వీధిలో మంగళవారం సాయంత్రం 6:25 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న 'పోస్ట్బస్' (PostBus) ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేస్తూ, బయటకు రావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది.ఈ ఘటనపై ఫ్రిబోర్గ్ కాంటోనల్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి దీనిని బహుశా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నాం’ అని అన్నారు. బస్సు లోపలే ఏదో జరిగి మంటలు చెలరేగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్రిమినల్ విచారణను ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పెద్ద అగ్నిప్రమాదం. ఈ ఏడాది జనవరి 1వ తేదీన క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్‌లోని ఒక బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు బస్సులో ఆరుగురు చనిపోవడం స్విస్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్విట్జర్లాండ్‌లో మరోసారి ఇంతటి భయంకర అగ్నిప్రమాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ❗️⚠️🇨🇭 - BREAKING: Tragic Incident in Kerzers, SwitzerlandA public PostBus caught fire Tuesday evening in the center of Kerzers, in Switzerland’s Fribourg canton, killing several people and injuring multiple others. The vehicle was completely destroyed in the blaze.Witnesses… pic.twitter.com/bURWbOgqcC— 🔥🗞The Informant (@theinformant_x) March 10, 2026 -
ఖమేనీ కుమారులు క్షేమం?.. తాజా ఫొటోలు వైరల్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ -
మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
కోజికోడ్: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ (89) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1980, 90వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఉన్నికృష్ణన్.. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచారని చెబుతుంటారు.జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.నాడు గల్ఫ్ యుద్ధ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.ఉన్నికృష్ణన్ ఆదర్శాలకు కట్టుబడి నడుచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వి.కె. కృష్ణమీనన్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఒకానొక సమయంలో ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.1936 సెప్టెంబర్ 20న జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యాభ్యాసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. చెన్నైలోనే న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు. 1960వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, 1962 నాటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుడిగా ఎదిగారు. ఒక జర్నలిస్టుగా, న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా -
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
-
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మిం కుల దుర్మరణం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్‌ను పక్కకు జరిపేందుకు యత్నించారు.ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్‌కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ శకం ముగిసింది
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు మూడున్నర దశాబ్దాలకుపైగా ఖమేనీ మాటే శాసనం. పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్‌ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దాలుగా ఇరాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహరి్నశలు శ్రమిస్తున్న అమెరికాను ఎన్నోసార్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా సాగిన ప్రస్థానం ఖమేనీది... పహ్లావీ శకం ముగిశాక... ఖమేనీ నగరం నుంచి వచ్చి మష్హాద్ సిటీలో స్థిరపడిన అజర్బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జని్మంచారు. ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. నాలుగో షియా ఇమామ్ అలీ అల్ సజ్జాద్కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యకాలంలోనే ఆయన ఖురాన్‌ను లోతుగా చదివారు. యుక్తవయసులోనే పర్షియన్లో కవితలు రాసేవారు. కచి్చతమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేననే పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకు పరుగెత్తారట! మొహమ్మద్ రెజా పహ్లావీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. ఆరుసార్లు అరెస్టయ్యారు. మూడేళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారంప్రార్థనల ఇమామ్‌గా ఎంపికయ్యారు. 1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిదీన్–ఇ–ఖల్ప్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బ తిని కుడిచేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లోఘనవిజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లాæ ఖొమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ ‘గ్రాండ్ అయతొల్లా’ హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్‌గా అవతరించారు. ఇరాక్‌తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టుసాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, అది సూచించేవారే పార్లమెంట్ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోన్ని అన్ని వ్యవస్థలపైనా పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకునే అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవçస్థగా ఎదిగింది. పరోక్ష దళాల సృష్టికర్త పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రసంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్‌కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.తిరుగుబాట్లతో తలనొప్పులు దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనకు పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచి మానహక్కులను కాలరాశారన్న అపవాదును ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతటా చర్చనీయంగా మారాయి. అణ్వ్రస్తాలను సామూహిక మానవహననాలుగా ఛీత్కరించే ఖమేనీ, లోలోపల మాత్రం అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్‌లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాలా సాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్‌లో ఇజ్రాయెల్ ‘12 రోజుల యుద్ధం’ సందర్భంగా ఇరాన్ అణు స్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునియలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయెల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖేమేనీతో పాటు పలువురు సైనిక, పౌర అగ్ర నేతలను అంతం చేశాయి.ఖమేనీ మూలాలు భారత్‌లో! ఖమేనీ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్తుడు సయ్యద్ అహ్మద్ మూసావీ 18వ శతాబ్ధాంలో ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ షియా మత బోధకుడిగా పేరుపొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ అహ్మద్ మూసావీ హిందీ అనే పేర్కొంటారు. 1830లో ఆయన ఇరాన్‌లోని నజబ్ నగరానికి వెళ్లిపోయారు. తరవాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాతముత్తాతల బంధువుల ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్లో ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లినట్టు చెబుతారు. నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికీ వందలాదిగా ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు
-
ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్
-
ఖమేనీ మృతితో కరాచీలో హై టెన్షన్.. US కాన్సులేట్ పై దాడి
-
ఖమేనీ మృతికి సంతాపం.. నల్లజెండా ఎగరవేసిన ఇరాన్
-
ఖమేనీ మరణంపై ఇరాన్ కేబినెట్ కీలక ప్రకటన
-
విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..1939లో మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.ఉక్కుపాదంతో అంతర్గత అణచివేతబాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటంఅమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యంఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్‌ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ? -
ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ?
బెర్లిన్: ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖమేనీ మరణించారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో యుద్ధ భయంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశాన్ని వీడి వెళ్లారనే సమాచారం అందుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల అనంతరం ఖమేనీ మృతిచెందినట్లు ఆధారాలు ఉన్నాయని ప్రధాని నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఖమేనీ మరణించినట్లు ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్‌ను వీడి విదేశాలకు వెళ్లారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెతన్యాహు అధికారిక విమానం ‘వింగ్ ఆఫ్ జియాన్’ (4X-ISR) ఇజ్రాయెల్ తీరంలో సుమారు నాలుగు గంటల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టిన అనంతరం గ్రీస్ మీదుగా జర్మనీకి వెళ్లినట్లు ఫ్లైట్ రాడార్ డేటా ద్వారా వెల్లడైంది. శనివారం నెవాటిమ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన ఈ బోయింగ్ 767-338ER విమానం, రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ల్యాండ్ అయినట్లు సమాచారం. అయితే బెర్లిన్‌లో ప్రధాని నెతన్యాహుకు సంబంధించి ఎటువంటి అధికారిక పర్యటన ఖరారు కాకపోవడంతో ఆయన నిజంగానే ఆ విమానంలో ఉన్నారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది.అయితే నెతన్యాహు ఇజ్రాయెల్ నుండి పారిపోయి గ్రీస్ వెళ్లారని వస్తున్న ప్రచారాన్ని ‘గ్రోక్’ వంటి ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు కొట్టిపారేశాయి. ఇరాన్‌పై జరిగిన దాడుల గురించి వివరిస్తూ, నెతన్యాహు ఇజ్రాయెల్ నుండే వీడియో సందేశాన్ని విడుదల చేశారని, ఆయన ఇక్కడే ఉన్నారని రాయిటర్స్, ఏపీ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాని ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోనే ఉన్నారా లేక భద్రతా కారణాల దృష్ట్యా జర్మనీకి తరలివెళ్లారా అనే అంశంపై ప్రభుత్వం నుండి అధికారిక వివరణ రావాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్ -
గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి
గోటన్: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గోటన్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. తలన్పూర్కు చెందిన రాజేంద్ర బాపేడియా కుమార్తె దివ్య స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉదయం 7:48 గంటల సమయంలో పాఠశాల ప్రార్థన సమయానికి ఇంకా వ్యవధి ఉండటంతో, దివ్య మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది.ఈ క్రమంలోనే ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దివ్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దివ్య కుటుంబంలో ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గత సెప్టెంబర్ 9వ తేదీన దివ్య అన్నయ్య అభిషేక్ కూడా సరిగ్గా ఇదే రీతిలో మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అభిషేక్ ఇంట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. తమ ఇద్దరు బిడ్డలను ఒకే తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. -
మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
కోల్‌కతా: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ మీడియాకు తెలిపారు.గడచిన రెండు, మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర షిప్పింగ్, రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ వెన్నంటి ఉండి టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 నుండి 2021 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఆయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ గూటికి చేరారు. ఈ ఫిరాయింపు అంశంపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ముకుల్ రాయ్ మృతిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని, బీజేపీలో ఉన్న సమయంలో ఆయనకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. -
Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
ఖాట్మండు: నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. Nepal | At least 18 people lost their lives after a passenger bus plunged into a river in Dhading, Nepal. Recue operations are underway: Police— ANI (@ANI) February 23, 2026ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనతో ధాడింగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 18 Killed After Passenger Bus Plunges Into River in Nepal’s Dhading. pic.twitter.com/ykhZ2bRFNF— Sandeep Panwar (@tweet_sandeep) February 23, 2026 -
వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి
సాక్షి హైదరాబాద్: బండ్లగూడలో విషాదం జరిగింది. వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. దీంతో పాప తరపు బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో డాక్టర్ ఇంజెక్షన్ వేశారు. అయితే అది వికటించి ఆ పాప మృతి చెందింది.దీంతో డాక్టర్ల నిర్లక్షంతోనే పాప మృతి చెందిందని తీవ్ర ఆగ్రహానికి గురైన పాప తరపు బంధువులు అక్కడి వైద్యులపై దాడి చేశారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం!
భివాడీ: రాజస్థాన్‌లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఖుష్ఖేరా, భివాడీ రీకో ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
కారు మీద కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా, అంటు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. సుమారు 1000 కిలోల బరువున్న హై మాస్ట్ లైటింగ్ స్తంభం ఒకటి కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ దుర్ఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంప్ వద్ద కార్మికులు హై మాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Disturbing video.Lal Bahadur Yadav was driving his car when a pole installed at a petrol pump suddenly collapsed onto his vehicle. He died on the spot.Just yesterday in , a portion of a metro pillar fell onto a busy road, crushing one person to death.How are such fatal… pic.twitter.com/tfv16OD7Ng— Satyendra Kumar Behera (@imskbehera) February 15, 2026ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ (47) తన కారులో నగరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషాద వార్త తెలియగానే పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లైటింగ్ స్తంభం ఏర్పాటు చేస్తున్న సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్‌గఢ్ ఎస్పీ దీపక్ భూకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇది కూడా చదవండి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ -
ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎనస్థీషియా పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి డాక్టర్ దీపిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆ రోజు రాత్రి వి«ధుల్లో ఉండకుండా ఇంటికెళ్లిన ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మకు విభాగాధిపతి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల నాలుగో తేదీ రాత్రి డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందడానికి ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్‌లో ఉంది. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మ ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలోనే ఇంటికెళ్లిపోయినట్లు విచారణలో నిర్ధారించారు.దీంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆమె ఇచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు డాక్టర్ సుష్మ ఇంటికెళ్లకుండా ఉండి ఉంటే, పీజీలు ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. డాక్టర్ సుష్మ ఇంటికి వెళ్లడంతో సీనియర్ పీజీ అయిన డాక్టర్ దీపిక ఒక రూమ్‌లో ఉండగా, మొదటి సంవత్సరం పీజీ ఇంకో రూమ్‌లో ఉన్నారు. అర్ధరాత్రి 12.45 గంటలకు తనకు వాంతులు వచ్చేలా ఉన్నాయని దీపిక పక్క రూమ్‌లో ఉన్న జూనియర్ పీజీకి ఫోన్ చేయగా, ఆమె వచ్చి క్యాన్లా పెట్టి ఇంజక్షన్ చేసి.. కేసు తీసుకొచ్చేందుకు క్యాజువాలిటీకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీపిక ఆపరేషన్ టేబుల్‌పై పడి ఉంది. అంతర్గత కమిటీ విచారణలో ఏం తేలింది? డాక్టర్ దీపిక మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి కోదండరామిరెడ్డి రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా స్థాయి అధికారులను సైతం కలిశారు. ఆస్పత్రిలో ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ విచారణ జరిపింది. వీరు ఏం తేల్చారో ఇంకా వెల్లడవ్వలేదు. తాజాగా పోలీసులు పీజీ విద్యార్థులను పిలిచి అసలు ఆ రోజు ఏమి జరిగిందనే విషయంపై కూపీ లాగుతున్నారు.ఆ రోజు రాత్రి థియేటర్‌కు ఎవరైనా వచ్చారా..? వస్తే ఎందుకు వచ్చారు..? దీపికను ఎవరైనా వేధించారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే, అందుకు కారణాలేమిటనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలిస్తే (స్నాప్ షాట్, ఇన్‌స్టా కాల్స్ సహా) క్లూ దొరికే అవకాశం ఉంటుందని కొందరు వైద్యులు, విద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజు ఆమెతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది స్టాఫ్ నర్సు, థియేటర్ అసిస్టెంట్లను కూడా విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందితే కొంత వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్‌తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్‌పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్‌లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు -
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రేమికుల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో యువతీ యువకుల జంట విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపల నుండి లాక్ చేసి ఉన్న కారులో బుల్లెట్ గాయాలతో ఉన్న ఇద్దరిని గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరించారు.ఈ ఘటనలో మృతిచెందిన వారిని నోయిడా సెక్టార్ 58కి చెందిన రేఖ (26), ఢిల్లీ త్రిలోక్‌పురికి చెందిన సుమిత్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వీరి సంబంధం గురించి ఇరు కుటుంబాలకు ముందే తెలుసని సమాచారం. అయితే, ఈ ఘటనకు ముందు రోజు నుండే వీరు ఎవరికీ కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ చేతిలో ఒక పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సుమిత్ తన ప్రియురాలు రేఖను కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా సుమిత్ పంపిన ఒక వాట్సాప్ సందేశం లభించింది. ‘నేను, సుమిత్.. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి రేఖే కారణం. ఆమె 15 ఏళ్లుగా నాతో ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతోంది. ఆమె నన్ను మోసం చేసినందునే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, సుమిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం తమను అవమానించిందని, తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వారు పోలీసులకు తెలిపారు. కారు దొరికిన ప్రాంతం రేఖ ఉండే గ్రామానికి అతి సమీపంలో ఉండటంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్ష కారణంగానే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్
భారత మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ ఖాసీం గుజ్జర్/ సల్మాన్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బైక్‌పై వెళుతున్న గుజ్జర్‌ను వెనుకనుంచి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశారు. అయితే మరణించిన వ్యక్తి ఆయన కాదా అని స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.2024లో భారత ఉగ్రవాద నియంత్రణ చట్టం (UAPA) కింద మహ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈయనకు నిషేదిత ఉగ్రసంస్థ LETతో సంబంధాలున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పీవోకేలో ఆయన టెర్రరస్టు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.భారత్ ప్రస్తుతం టెర్రరిస్టులను ఊక్కుపాదంతో అణిచివేస్తోంది. పాక్‌తో సరిహాద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ఆధునాతన కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పహల్గామ్ అటాక్ అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.BREAKING: India-wanted terrorist Mohammad Qasim Gujjar alias Salman/Suleman has reportedly been shot dead by unknown gunman in Peshawar, Pakistan. The Reasi (J&K) native was linked to LeT and based in PoK. After Op Sindoor ,he was tasked to set up a terror camp in KPK. (Sources) pic.twitter.com/IcfwhlXS25— Baba Banaras™ (@RealBababanaras) February 14, 2026 -
కెనడా పాఠశాలలో కాల్పుల మోత
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వినబడగానే వణికిపోయాం.. ‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్‌రూమ్‌ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్స్పీకర్లలో అనౌన్స్మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు. ‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు. పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్‌కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్‌కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది. -
ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ గేమ్ ఆడుతూ హైబీపీకి లోనై మృతిచెందాడు. ఖైర్‌నగర్ గూలర్ వాలి ప్రాంతానికి చెందిన కైఫ్ తన చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని గేమ్‌లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా గేమ్ ఆడుతున్న ఆ సమయంలో ఖైఫ్ రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా 300 దాటిపోవడంతో పరిస్థితి విషమించింది.వైద్య పరిభాషలో దీనిని ‘మైండ్ అటాక్’ లేదా తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ అని వైద్యులు చెబుతుంటారు. గేమ్ ఆడుతున్నప్పుడు కలిగిన తీవ్ర ఉద్వేగం లేదా ఒత్తిడి కారణంగా కైఫ్‌కు రక్తపోటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో మెదడులోని ఒక రక్తనాళం చిట్లిపోవడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్ చివరకు ప్రాణాలు విడిచాడు.మృతుడు కైఫ్ రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్ గేమ్‌లు ఆడేవాడని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. అతిగా గేమింగ్ ఆడటం వల్ల కలిగే మానసిక, శారీరక ఒత్తిడి ఖైఫ్ మరణానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై మీరట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మరణానికి దారితీసిన పరిస్థితులు, అతను ఆడుతున్న గేమ్, ఇతర సాంకేతిక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ గేమ్‌ల విషయంలో యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్‌పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్‌పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే.. -
ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు బాలికల తండ్రి చేతన్ కుమార్‌కు చెందిన పాత నేర చరిత్ర తెలియవచ్చింది. 2015లో చేతన్ కుమార్‌తో సహజీవనం చేసిన ఒక మహిళ, భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అది ఆత్మహత్యగా తేలడంతో ఆ కేసును మూసివేశారు.ప్రస్తుత ఘటన నేపథ్యంలో పాత కేసు వివరాలను పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్‌కు సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉండగా, వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లే కావడం గమనార్హం. మరణించిన బాలికలలో నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖీ (12) హీనా కుమార్తెలు. ఈ అసాధారణ కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితులు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.బాలికలు రాసిన ఆత్మహత్య లేఖలో కేవలం తండ్రి ప్రస్తావన మాత్రమే ఉందని, తల్లుల గురించి ఏమీ రాయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. బాలికల ఆత్మహత్యకు తండ్రి వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తొమ్మిది పేజీల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్, ఫోరెన్సిక్ బృందాలు.. ఆ చిన్నారులు వినియోగించిన ఫోన్లోని డిజిటల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధిత కుటుంబాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైందని పేర్కొంటూ, జిల్లా యంత్రాంగం, పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరారు. ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి
నీముచ్: మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్పూర్ గ్రామంలో ఒక అంగన్వాడీ వంట మనిషి చూపిన సాహసం చర్చనీయాంశంగా మారింది. మడవద పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సుమారు 20 మంది చిన్నారులు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా తేనెటీగల దండు వారిపై దాడి చేసింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ వెంటనే అప్రమత్తమై, తన ప్రాణాలను లెక్క చేయకుండా చిన్నారులను కాపాడేందుకు సాహసించింది. అక్కడున్న టార్పాలిన్ షీట్లు, చాపలను తీసుకుని, ప్రతి చిన్నారిపై కప్పి, వారిని గదిలోనికి తరలించింది.ఇంతలో కంచన్ బాయిపై వందలాది తేనెటీగలు దాడి చేశాయి. ఒళ్లంతా తేనెటీగలు కుడుతున్నా, పిల్లలందరినీ సురక్షితంగా గదిలోనికి తరలించే వరకూ ఆమె అక్కడి నుంచి కదలలేదు. తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన ఆమెను గ్రామస్తులు, పోలీసులు వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంపై ఉన్న లెక్కలేనన్ని తేనెటీగల కాట్లు ఆమె ప్రాణత్యాగానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.కంచన్ బాయి తన కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉండేవారు. ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జై మాతాదీ స్వయం సహాయక సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటూ, సామాజిక సేవలలోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అంగన్వాడీ కేంద్రం సమీపంలోని చెట్టుపై భారీ తేనెతుట్టె వేలాడుతున్నదని, వెంటనే దానిని తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి, చిన్నారులను కాపాడిన కంచన్ బాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ఈ నయాగరాకు ఏమైంది? -
దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి
బెతుల్: మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్ష్.. ‘కోల్డ్రిఫ్’ (Coldrif) దగ్గు మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ సిరప్ తాగిన తర్వాత హర్ష్ కోమాలోకి వెళ్లగా, అప్పటి నుండి నాగ్‌పూర్ ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు వైద్యలు తెలిపారు. సోమవారం నాగ్‌పూర్‌లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు బెతుల్ జిల్లా వైద్యాధికారి మనోజ్ హుర్మాడే వెల్లడించారు.చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ కోల్డ్రిఫ్ సిరప్‌పై జరిగిన విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ప్రభుత్వ ఔషధ పరీక్షల ప్రయోగశాలలో నిర్వహించిన విశ్లేషణలో ఈ మందులో ‘డైథైలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, కాంచీపురానికి చెందిన ‘స్రేసన్ ఫార్మాస్యూటికల్స్’ తయారు చేసిన ఈ సిరప్‌లో ఏకంగా 48.8 శాతం మేర ఈ కల్తీ రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన పదార్థం.మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, బెతుల్ జిల్లాల్లో ఈ కల్తీ దగ్గు మందు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సిరప్ తాగిన చిన్నారుల్లో వాంతులు, జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. హర్ష్ మరణంతో కలిపి ఈ తరహా ఘటనల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 24కు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు చిన్నారులు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సమగ్ర విచారణ చేపట్టింది. ఈ ప్రాణాంతక సిరప్‌ను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ వైద్యునితో పాటు, తయారీ సంస్థ యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ సంస్థలపై ప్రభుత్వం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు -
లాయర్ కుటుంబం: ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా, అందులో యువ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని మిహిర్గా పోలీసులు గుర్తించారు. కోల్‌కతాలో సీఏ పూర్తి చేసిన మిహిర్, ఇటీవలే రాంచీలోని తమ ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసుల కథనం ప్రకారం మిహిర్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొరుగువారితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు మృతి చెందాడు. మిహిర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే, అతని తల్లి స్నేహ అఖౌరీ, 14 ఏళ్ల చెల్లెలు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. స్నేహ అఖౌరీ జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారిద్దరినీ రాంచీలోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే ఇంట్లో కుమారుడు ఉరివేసుకోవడం, వెనువెంటనే తల్లి, కుమార్తె విషం సేవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు మిహిర్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని సమాచారం. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. వీరి కుటుంబంపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లు బయటకు కనిపించకపోవడంతో, ఈ ఆత్మహత్యాయత్నాల వెనుక ఉన్న కారణాలు అంతుచిక్కడం లేదు. పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించాయి. ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె స్పృహలోకి వస్తేనే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం -
8 రోజులు మృత్యువుతో పోరాడి..
లక్డీకాపూల్ (హైదరాబాద్)/నిజామాబాద్ అర్బన్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్ను మూశారు. నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ ముఠాను అడ్డుకునే క్రమంలో దుండగులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23)ను జనవరి 25న నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 9.41 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కాలేయం దెబ్బతినడం, మెదడులో వాపు కారణంగా ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితంలేకపోయింది. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకునే ప్రయత్నంలో.. జనవరి 23న గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఠా సభ్యులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. బాసటగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి ఆమెకు చికిత్స చేయించారు. ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెను పరామర్శించారు. సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన సౌమ్యది సామాన్య కుటుంబం. 2024 సంవత్సరంలో సౌమ్య ఉద్యోగంలో చేరింది. అంతలోనే ఆమె మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. -
సాధ్వి ప్రేమ్ బైసా మృతి వెనుక మిస్టరీ ఏంటి?
జైపూర్: పశ్చిమ రాజస్థాన్‌కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మరణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆర్ఎల్పీ (RLP) నేత హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. బుధవారం(జనవరి 28) సాయంత్రం జోధ్‌పూర్‌లోని బోరనాడ ఆశ్రమం నుంచి సాధ్వి ప్రేమ్ బైసాను ఆమె తండ్రి వీరమ్ నాథ్, మరొక సహాయకుడు కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.వైద్యుడు ప్రవీణ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్విని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమె శరీరంలో ఎటువంటి చలనం లేదని.. సాధ్వికి జ్వరం రావడంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్‌ను పిలిపించామని, ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె తండ్రి తనకు చెప్పినట్లు డాక్టర్ వెల్లడించారు. అయితే, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తాను అంబులెన్స్ ఇస్తానన్నా, నాథ్ నిరాకరించి తన సొంత కారులోనే ఆమెను తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు.ఆమె చాలా కాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతోందని వీరమ్ నాథ్ మీడియాతో చెప్పారు. అందుకే కాంపౌండర్‌ను పిలిపించాం. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆమె స్పృహ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకుని, అతని వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంచలన రేపుతోంది. సాధ్వి మరణించిన నాలుగు గంటల తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి ఒక పోస్ట్ రావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ‘‘నేను ప్రతి క్షణం సనాతన ధర్మ ప్రచారం కోసం జీవించాను. నా జీవితాంతం జగద్గురు శంకరాచార్యులు, యోగా గురువులు, సాధు సంతుల ఆశీస్సులు అందుకున్నాను. అగ్ని పరీక్ష కోరుతూ నేను వారికి లేఖలు కూడా రాశాను. కానీ ప్రకృతి ఏం తలపెట్టిందో? నేను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్తున్నాను. నా జీవిత కాలంలో కాకపోయినా, నా మరణం తర్వాతైనా నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ అంటూ తన అనుచరులను ఉద్దేశించి అందులో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sadhvi prem baisa (@sadhvi_prembaisa)ఈ పోస్ట్ ఆమె మొబైల్ నుండే షేర్ అయినట్లు ఆమె తండ్రి ధృవీకరించారు. ఒక తోటి గురువు ఆ సందేశాన్ని పంపారని ఆయన చెబుతూ, తన కుమార్తె మరణంపై దర్యాప్తు జరగాలని కోరారు. గత ఏడాది ప్రేమ్ బైసా, ఆమె తండ్రి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక గదిలో ఆమె తన తండ్రిని హత్తుకుని ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఒక మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. అయితే, అది తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనురాగానికి నిదర్శనమని, ఆ బంధాన్ని కించపరచడానికే ఎవరో ఆ వీడియోను వైరల్ చేశారని సాధ్వి అప్పట్లో మండిపడ్డారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు కూడా.. -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్‌తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్‌పై డంబెల్‌తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్‌కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్‌ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్‌కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు! శరద్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్‌కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్‌తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.చివరి ట్వీట్ చెబుతోందిగా..అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది. आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026 -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లారీ ఫింక్తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.సమాజానికి ముప్పుఅయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మదావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
అరుదైన హృద్రోగంతో చిన్నారి మృతి.. ‘కవాసాకి’ లక్షణాలివే..
బ్రిస్టల్: బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హడ్సన్ మార్టిన్ అనే రెండేళ్ల బాలుడు ‘కవాసాకి’ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో ఇటీవల మృతి చెందాడు. సాధారణ ఫ్లూ తరహా లక్షణాలతో ప్రారంభమయ్యే ఈ వ్యాధి చిన్నారుల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.పుట్టినరోజుకు ముందే..హడ్సన్‌కు ఏడు నెలల వయసులోనే ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బాధిత చిన్నారి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్పిరిన్ లాంటి మందులు వాడుతున్నప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న, మధ్య తరహా రక్త నాళాల గోడలలో ఆటంకం ఏర్పడి, గుండెకు రక్త సరఫరాలో లోపం ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. హడ్సన్ తన మూడవ పుట్టినరోజు జరుపుకునేందుకు కొద్ది రోజుల ముందే మృతి చెందాడు.సీపీఆర్ చేసినా..హడ్సన్ చాలా చురుకైన పిల్లవాడని, సంగీతం, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేవాడని అతడి తండ్రి డేమియన్ మార్టిన్ తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, పారామెడిక్స్ బృందం దాదాపు గంటసేపు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ నా బిడ్డ గుండె మళ్లీ కొట్టుకోలేదు’ అని తండ్రి రోదిస్తూ తెలిపారు.కవాసాకి వ్యాధి.. లక్షణాలు కవాసాకి వ్యాధి (ముకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్) ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను దెబ్బతీసి, ఎన్యురిజం (రక్తనాళాల ఉబ్బడం) వంటి సమస్యలకు దారితీస్తుంది. సుమారు 102.2 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరం ఐదు రోజుల పాటు ఉండటం, శరీరంలో దద్దుర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, చేతులు, కాళ్ల వాపు, పెదవులు ఎర్రగా మారడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.నివారణ ఎలా?స్కార్లెట్ ఫీవర్ లేదా మీజిల్స్ వంటి ఇతర వ్యాధుల లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో, వైద్య పరీక్షల ద్వారానే దీనిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇదిఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదు. కవాసాకి వ్యాధికి పూర్తి స్థాయిలో నివారణ మందు లేనప్పటికీ, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐబీఐజీ), ఆస్పిరిన్ మిశ్రమంతో చికిత్స అందించి, దీనిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారినపడిన చిన్నారులకు జీవితాంతం కార్డియాలజిస్ట్ పర్యవేక్షణ అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: హైకోర్టు తీర్పు.. ఉదయనిధికి భారీ షాక్ -
గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు షాక్.. రెండు రోజులే పెరోల్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వరుస పేలుళ్ల కేసు(1993)లో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను అంతర్జాతీయ నేరస్థునిగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. తన సోదరుడి మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అబూ సలేం 14 రోజుల పెరోల్ కోరగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అతను అత్యంత ప్రమాదకర వ్యక్తి అని, కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే మంజూరు చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. అది కూడా పోలీసు బందోబస్తు మధ్యే సాధ్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువర్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టుకు తెలిపారు.జైలు నిబంధనల ప్రకారం సలేంకు పోలీసు ఎస్కార్ట్‌తో కూడిన రెండు రోజుల పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు సుముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చును అబూ సలేం స్వయంగా భరించాలని షరతు విధించింది. దీనిపై సలేం తరపు న్యాయవాది ఫర్హానా షా స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు వెళ్లి రావడానికి రెండు రోజులు సరిపోవని వాదించారు. అతను గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అతను భారతీయ పౌరుడేనని పేర్కొంటూ, పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఫర్హానా షా కోర్టును కోరారు.ఈ వివాదంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అబూ సలేంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు, భద్రతాపరమైన ఆందోళనలను వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గతంలో తల్లి మరణించిన సమయంలో కూడా సలేంకు కొద్దిరోజుల పెరోల్ లభించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.అబూ సలేం సోదరుడు అబూ హకీం అన్సారీ 2025, నవంబర్‌లో మరణించారు. నాడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సలేం 14 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 20న జైలు అధికారులు దానిని తిరస్కరించారు. కోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో తన పిటిషన్ ఆలస్యమైందని సలేం డిసెంబర్ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. 2005లో అరెస్ట్ అయినప్పటి నుండి జైలులోనే ఉన్న తనకు, తన కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు హాజరయ్యే హక్కు ఉందని సలేం తన పిటిషన్లో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే.. -
అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూఎస్ఏలోని మిసిసిప్పిలోని ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురి మృత్యువాత పడ్డారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఒక చోట కాకుండా వేరు వేరు చోట్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అమెరికా వార్తా సంస్థలు డబ్యూటీవీఏ, ఎన్బీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #BreakingNews: Indiscriminate shooting in the US once again: 6 people, including a child, killed in Mississippi; suspect arrested.#USAShooting #Mississippi #GunViolence #MassShooting pic.twitter.com/0BxUhFqICn— UPDATE ADDA (@UpdateAdda24x7) January 11, 2026 కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్రంగా పెరిగాయి. 2026 ప్రారంభం నుంచే మిసిసిప్పి, టెక్సాస్, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి, పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.జనవరి 1, 2026 మిసిసిప్పి నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు.జనవరి 1, 2026 – డల్లాస్, టెక్సాస్ల్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు.జనవరి 1, 2026 – హ్యూస్టన్, టెక్సాస్ల్లో కొత్త సంవత్సరం మొదటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో గన్ వైలెన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. దాంతో అమెరికాలో గన్ నియంత్రణపై చట్టసభల్లో మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. 2025లో అమెరికాలో హత్యలు, పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు కొంత తగ్గినా, గన్ వైలెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2026 మొదటి 10 రోజుల్లోనే 4 ప్రధాన కాల్పుల ఘటనలు నమోదు కావడం గమనార్హం. -
Indonesia: వరద బీభత్సం.. 14 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో గల సియావు ద్వీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదలు భీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, ఒక్కసారిగా తాకిన వరద ఉధృతికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానిక సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షం సియావు ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తులో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరద తాకిడికి రోడ్లు, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల నిర్వహణ ప్రతినిధి నూరియాదిన్ గుమెలెంగ్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 16 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. కాగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన బురద, శిథిలాల కారణంగా రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఎక్స్కవేటర్లను ఉపయోగించి, ఈ అడ్డంకులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. Flash floods kill 9 in Sitaro Islands, North Sulawesi, Indonesia https://t.co/9Si0okkL5y— The Watchers (@TheWatchers_) January 5, 2026విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ అందించిన సమాచారం ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 444 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే కొన్ని నెలల పాటు ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలగనుంది. అలాగే మరిన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అక్కడి ప్రజలకు అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ ఉత్త బడుద్దాయి’.. నిగ్గు తేల్చిన గణిత శాస్త్రవేత్త -
గుండె ధైర్యం ఉంటేనే ఈ రోడ్డెక్కండి!
నిన్న గుండెలు జారిపోయే జర్నీ గురించి చూశాం కదా? ఇది అంతకుమించింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆ గుండె చాలా గట్టిదై ఉండాలి. ఎందుకంటే దీనిపై వెళ్తుంటే మండు వేసవిలోనూ వణుకు పుట్టడం ఖాయం. ఫొటోలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది కదూ? ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో చాలామంది మృత్యువాతపడ్డారు. అందుకే దీనిని డెత్ రోడ్డు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్ నుంచి నార్త్ యుంగాస్ వరకు 64 కిలోమీటర్ల మేర ఉంటుంది. 1930లలో చాకో యుద్ధ సమయంలో పరాగ్వే యుద్ధ ఖైదీలు దీనిని నిర్మించారు. రోడ్డులో చాలా భాగం కొండ అంచునే సాగుతుంది. పచ్చని చెట్లు.. దగ్గరగా పలకరించే మేఘాలు.. అందమైన జలపాతాలతో జర్నీ ఎంత బాగుంటుందో.. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు అంతే ఆందోళనకరంగా అనిపిస్తాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా.. కొన్నిచోట్ల 3 మీటర్ల వెడల్పు లోపే ఉంటుంది. ఓ పక్కన ఏకంగా 600 మీటర్ల లోతైన లోయలు శీతాకాలంలో కూడా అరికాళ్లలో చెమటలు పట్టిస్తాయి. లోయలోకి పడిపోకుండా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. 1990వ దశకం మధ్యకాలం వరకు ఈ రోడ్డులో ఏటా వంద మంది వరకు మరణించేవారు. అనంతరం ఆ సంఖ్య 200 నుంచి 300కి పెరిగింది. 1983 జూలైలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత దాదాపు 30 మంది సైక్లిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధన సవరించారు. బొలీవియాలో వాహనాలు రోడ్డుకు కుడివైపున నడుస్తాయి. కానీ ఈ రోడ్డులో వెళ్లేటప్పుడు డ్రైవర్లు లోయ అంచును స్పష్టంగా చూడటం కోసం ఎడమ వైపున ప్రయాణించాలని నిబంధన విధించారు. 2006లో సేఫ్టీ గ్రిల్స్, డ్రైనేజ్ సిస్టమ్‌తో కూడిన రెండు లైన్ల కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మృత్యురహదారి సాహస పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్‌కు ప్రసిద్ధ గమ్యస్థానమైంది. -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు.


