
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 73 మంది మరణించారు. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్ వలసదారులతో నిండిన బస్సు మంగళవారం కాబూల్‌కు బయలుదేరింది. సరిహద్దు దాటిన తరువాత హెరాత్ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. ఇతర వాహనాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. బస్సు డ్రైవర్ మితిమీరిన వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని హెరాత్ పోలీçÜులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
దశాబ్దాల సంఘర్షణ కారణంగా రోడ్లు దెబ్బతిన్న అఫ్గానిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ఇక 1970ల నుంచి లక్షలాది మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్తాన్‌లకు పారిపోయారు. 1979లో సోవియట్ దండయాత్ర సమయంలో, 2021లో తాలిబన్లు దేశాన్ని తమ వశం చేసకున్న తరువాత ఈ వలసలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఇరాన్‌లో క్రమక్రమంగా అఫ్గాన్ వ్యతిరేక భావన పెరిగింది. శరణార్థులు చాలాకాలంగా వ్యవస్థాగత వివక్షను ఎదుర్కొంటున్నారు. పత్రాలు లేని అఫ్గాన్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ మార్చిలోనే హెచ్చరించిన ఇరాన్ జూలై వరకు ఇచ్చిన గడువు కూడా పూర్తయ్యింది. జనవరి నుంచి 15 లక్షల మందికి పైగా అఫ్గాన్లు ఇరాన్‌ను వదిలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.
వీరిలో చాలా మంది తరతరాలుగా ఇరాన్‌లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం. జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన స్వల్పకాలిక యుద్ధం తర్వాత జాతీయ భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది అఫ్గాన్లను ఇరాన్ అధికారులు బలవంతంగా తిప్పి పంపించారు. భద్రతా వైఫల్యాలతో జరిగిన ఇజ్రాయెల్ దాడులకు అఫ్గాన్లను బలిపశువులు చేస్తున్నారనేది విమర్శకుల వాదన. ఎలాంటి పత్రాలు లేని అఫ్గాన్లను పాకిస్తాన్ కూడా వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి తిరిగి అఫ్గానిస్తాన్‌కు వచి్చన శరణార్థుల సంఖ్య లక్షల్లో ఉంది.