అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూఎస్‌ఏలోని మిసిసిప్పిలోని ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురి మృత్యువాత పడ్డారు.
కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఒక చోట కాకుండా వేరు వేరు చోట్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అమెరికా వార్తా సంస్థలు డబ్యూటీవీఏ, ఎన్‌బీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
#BreakingNews: Indiscriminate shooting in the US once again: 6 people, including a child, killed in Mississippi; suspect arrested.
#USAShooting #Mississippi #GunViolence #MassShooting pic.twitter.com/0BxUhFqICn— UPDATE ADDA (@UpdateAdda24x7) January 11, 2026
కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్రంగా పెరిగాయి. 2026 ప్రారంభం నుంచే మిసిసిప్పి, టెక్సాస్, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి, పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.
జనవరి 1, 2026 మిసిసిప్పి నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు.
జనవరి 1, 2026 – డల్లాస్, టెక్సాస్‌ల్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

జనవరి 1, 2026 – హ్యూస్టన్, టెక్సాస్‌ల్లో కొత్త సంవత్సరం మొదటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో గన్ వైలెన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది.
దాంతో అమెరికాలో గన్ నియంత్రణపై చట్టసభల్లో మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. 2025లో అమెరికాలో హత్యలు, పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు కొంత తగ్గినా, గన్ వైలెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2026 మొదటి 10 రోజుల్లోనే 4 ప్రధాన కాల్పుల ఘటనలు నమోదు కావడం గమనార్హం.


