ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు | Mojtaba Hosseini Khamenei Elected Iran Supreme Leader | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు

Mar 4 2026 9:13 AM | Updated on Mar 4 2026 9:40 AM

Mojtaba Hosseini Khamenei Elected Iran Supreme Leader

టెహ్రాన్‌: ఇరాన్‌  కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.

ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్‌పర్ట్‌ కమిటీ మోజ్తాబాను ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎక్స్‌పర్ట్‌ కమిటీ అంటే భారత్‌లో లోక్‌సభ,రాజ్యసభ సభ్యులని అర్ధం. మోజ్తాబా ఎన్నికలు ఐఆర్‌జీసీ ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు మోజ్తాబాను నియమించినట్లు తెలుస్తోంది. ఖమేనీ రెండో కుమారుడు ఇరాన్‌ ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి అత్యున్నత పదవి చేపట్టలేదు. కానీ ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధ సమయంలో ఇరాన్‌ సైన్యంలో సేవలందించారు.

ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలు ఉన్ మోజ్తబా, ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ చైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇటీవల అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్‌పై దాడి చేసినప్పుడు మోజ్తబా భార్య జహ్రా హద్దాద్-అదెల్ మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement