ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా? | Analysts Estimate The Projected Cost Of Trump War In Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?

Mar 4 2026 8:19 AM | Updated on Mar 4 2026 9:26 AM

Analysts Estimate The Projected Cost Of Trump War In Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు పతాక స్థాయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అంటూ యుద్ధ రూపాన్ని మారుస్తూ మరింత ముందుకు కొనసాగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికా రోజుకు ఎంత ఖర్చు చేస్తుందనే అంశంపై తెరపైకి వచ్చింది. 

అమెరికా తొలిరోజు ఇరాన్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్‌ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.6,900కోట్లు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  ఈ లెక్క ప్రకారం ట్రంప్‌ ప్రకటించినట్లుగా ఇరాన్‌పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ  అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది.  

దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు  630 మిలియన్‌ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. 

యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో భాగమైన పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ ఒక భాగం. దీని  డైరెక్టర్‌, అమెరికా ప్రముఖ ఆర్థిక విశ్లేషకులలో ఒకరైన  కెన్‌ స్మార్టర్‌ అంచనా ప్రకారం అమెరికా ఇరాన్‌పై దాడికి అక్షరాల రూ.18.87లక్షల కోట్లపైగా  అయ్యే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.

ఆ మొత్తం ఈ ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై  అమెరికా దాడి కోసం చేసే ఖర్చు మాత్రమే కాదు..  2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకున్నప్పటి నుండి, అమెరికా ఇజ్రాయెల్‌కు 21.7 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది.  ఇతర కార్యకలాపాల కోసం కోసం 9.65 బిలియన్ నుండి  12.07 బిలియన్ల వరకు ఖర్చు చేసింది. ఇలా మొత్తంగా కలిపితే..18లక్షల కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలు హైలెట్‌ చేస్తుండగా.. ఇరాన్‌పై దాడికి అమెరికా ఎంత ఖర్చు చేస్తుందనే అధికారిక లెక్కలు విడుదల కావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement