డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. వైట్‌హౌస్ క్లారిటీ | white house doctor Clarity donald trump neck mark explained | Sakshi
Sakshi News home page

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. వైట్‌హౌస్ క్లారిటీ

Mar 4 2026 5:14 AM | Updated on Mar 4 2026 12:22 PM

white house doctor Clarity donald trump neck mark explained

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఉన్న ఎర్రటి మచ్చ కనిపించడంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్‌కు ఏమైనా జరిగిందా అని.. ఆయన ఆరోగ్యంపై యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ క్లారిటీ ఇచ్చింది.   ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు వైట్ హౌస్ వైద్యుడు వివరించాడు.

ఇది సాధారణ చర్మ వ్యాధి చికిత్స వల్లే ఏర్పడిందని అని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పష్టం చేశాడు. అందువల్లే ఎర్రటిమచ్చ ఏర్పడిందని తెలిపాడు. ఈ మచ్చ తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని.. సాధారణ చర్మ చికిత్స క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని వెల్లడించారు. కాగా.. సోమవారం మెడల్ ఆఫ్ ఆనర్ వేడుక సందర్భంగా ట్రంప్‌ చొక్కా కాలర్ పైన ఉన్న ఎర్రటి మచ్చ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బార్బరా బెల్లా క్లారిటీ ఇచ్చారు.

గతేడాది ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ బార్బరా బెల్లా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉందని .. ఎలాంటి ఆందోళన ‍అవసరం లేదని వైట్ హౌస్ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement