దుబాయ్‌లో మెగా డాటర్‌ శ్రీజ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌ | Sreeja Konidela Stay In Dubai and Share Social Media post | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో మెగా డాటర్‌ శ్రీజ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌

Mar 2 2026 4:52 PM | Updated on Mar 2 2026 4:57 PM

Sreeja Konidela Stay In Dubai and Share Social Media post

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌   దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్‌ చేశారు.

దుబాయ్‌లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్‌ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్‌లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు.  దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్‌ చేశారు.  శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో  స్థిరపడినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement