భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్ | Rashmika And Vijay Devarakonda Cute Video Latest | Sakshi
Sakshi News home page

ViRosh: సొంతూరి కొత్త జంట.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఓ వీడియో

Mar 2 2026 4:20 PM | Updated on Mar 2 2026 4:27 PM

Rashmika And Vijay Devarakonda Cute Video Latest

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ‍్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.

విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement