ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu March First Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 13 మూవీస్.. మరి థియేటర్లలో?

Mar 2 2026 2:40 PM | Updated on Mar 7 2026 4:02 PM

Upcoming OTT Movies Telugu March First Week 2026

2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)

ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

  • హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06

  • వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06

అమెజాన్ ప్రైమ్

  • తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03

  • యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04

  • సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05

హాట్‌స్టార్

  • విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06

ఆహా

  • ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04

సోనీ లివ్

  • లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06

సన్ నెక్స్ట్

  • డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06

  • గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06

జీ5

  • గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

  • జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06

(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement