టీజర్‌ బాగుంది: మంచు మనోజ్‌ | Manchu Manoj Launches The Teaser Of Rukmini Movie | Sakshi
Sakshi News home page

టీజర్‌ బాగుంది: మంచు మనోజ్‌

Mar 2 2026 1:43 AM | Updated on Mar 2 2026 1:43 AM

Manchu Manoj Launches The Teaser Of Rukmini Movie

గ్రీష్మ, మంచు మనోజ్, నిరంజన్‌

‘‘రుక్మిణి’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న నిరంజన్‌కి ఈ సినిమా మంచి సక్సెస్‌ ఇవ్వాలి. ఈ మూవీ టీజర్‌ బాగుంది. డైరెక్షన్, కెమెరా వర్క్, మ్యూజిక్‌... అన్నీ బాగున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో మంచు మనోజ్‌ తెలిపారు. నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తీ శ్రీరంగం ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకత్వం వహించారు.

నేలబల్లి కుమారి సమర్పణలో నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ని మంచు మనోజ్‌ విడుదల చేశారు. గంగాధర్‌ రావు మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారి సినిమాలకు అప్రెంటిస్‌గా వర్క్‌ చేయడంతో నా కెరీర్‌ మొదలైంది. మంచి కథతో సింహాచలం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు. సింహాచలం మాట్లాడుతూ– ‘‘హారర్‌ కామెడీ కథతో రూపొందించిన చిత్రం ‘రుక్మిణి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌.

Advertisement
 
Advertisement
Advertisement