అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక | Actress Radhika Sarathkumar Speech at Saraswathi Pre Release Event | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక

Mar 2 2026 1:36 AM | Updated on Mar 2 2026 1:09 PM

Actress Radhika Sarathkumar Speech at Saraswathi Pre Release Event

, ప్రియమణి, సిమ్రాన్, రాధిక, వరలక్ష్మి

‘‘సరస్వతి’లాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ కథను వరలక్ష్మి చెప్పడం నాకు గర్వంగా ఉంది. మౌనంగా ఉన్న చాలామంది అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా ఇది. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నాం. అప్పుడే తనకి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టమని చెప్పాను. నేను నా బెస్ట్‌ సినిమాలన్నీ తెలుగులోనే చేశాను’’ అని రాధికా శరత్‌కుమార్‌ అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సరస్వతి’. వరలక్ష్మీ సోదరి పూజా శరత్‌కుమార్‌ ఈ సినిమాకు మరో నిర్మాత.

ఈ థ్రిల్లర్‌ చిత్రం ఈ నెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శరత్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘నటిగా వరలక్ష్మి విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎలా నడుచుకోవాలనే విషయాలను మాత్రం తనకు చిన్నప్పటుంచి చెప్తుండేవాడిని. స్త్రీలను గౌరవించడం మనందరి కర్తవ్యం. ‘సరస్వతి’ మంచి సబ్జెక్ట్‌. పూజకి ప్రోడక్షన్‌లో మంచి స్కిల్స్‌ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ప్రోడక్షన్‌ పరంగా ఈ సినిమాను పూజ చాలా కంట్రోల్‌ చేసింది. మా నాన్నగారిని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను.

నా భర్త సపోర్ట్‌తోనే ఈ జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ఫస్ట్‌ టైమ్‌ మా సినిమాను చూసిన వారు, ఇందులోని ట్విస్ట్‌ను రివీల్‌ చేయొద్దని కోరుతున్నా’’ అన్నారు వరలక్ష్మి. ‘‘మనసులో నిలిచిపోయే కథ ఇది’’ అన్నారు ప్రియమణి. ‘‘మా సినిమాను ఆడియన్స్‌ థియేటర్స్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు పూజా శరత్‌కుమార్‌. ‘‘సరస్వతి’ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని తెలిపారు సిమ్రాన్, స్వప్నా దత్‌.

‘‘నటిస్తూ, డైరెక్షన్‌ చేయడమనేది పెద్ద చాలెంజ్‌. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు దర్శకురాలు బి. నందినీ రెడ్డి. ‘‘స్వరస్వతి’లాంటి మంచి సినిమాను వరలక్ష్మి చేయడం ఆనందాన్నిచ్చింది’’ అని చె΄్పారు ఆమె భర్త నికోలాయ్‌ సచ్‌దేవ్‌. నటుడు సప్తగిరి, ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement