నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌ | Vijay-Sangeetha Divorce, Throwback Video Of Actress Trisha Commenting On Her Wedding Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. విజయ్‌ విడాకుల రచ్చ వేళ త్రిష వ్యాఖ్యలు వైరల్‌

Mar 1 2026 12:37 PM | Updated on Mar 1 2026 2:02 PM

Vijay Divorce: Trisha Wedding Comments Goes Viral

కోలీవుడ్‌ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌- సంగీత విడాకులు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్‌ త్రిష పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, అందుకే విడాకులు ఇప్పించాలంటూ సంగీత కోర్టుని ఆశ్రయించింది. 

దీంతో సంగీత ఆరోపిస్తున్న నటి త్రిషనే అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా త్రిష, విజయ్‌ కలిసి  కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, తిరుప్పాచ్చి, గిల్లి వంటి సినిమాల ప్రమోషన్ సమయంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ వైరల్‌ చేస్తున్నారు. దీంతో పాటు పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోలో ఏముంది?
త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఇలా మాట్లాడింది.  ‘మీ పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. ఎందుకంటే.. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసే నిర్ణయం కాదు. జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటే మళ్లీ విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను.  

నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని, అఇష్టంగా జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ, నేను అలాంటిది జీవితాన్ని కోరుకోవడం లేదు. సరైన వ్యక్తి కోసం వేచి ఉంటాను. అలాగే.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. నేను ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి. అలాంటి వ్యక్తి కావాలి’ అని త్రిష అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement