ఓటీటీలో హిట్‌ సినిమా.. విత్‌ లవ్‌ రిలీజ్‌ ఎప్పుడంటే? | Abishan Jeevinth With Love Movie OTT Release Date Announced, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విత్‌ లవ్‌ మూవీ.. ఎప్పుడంటే?

Mar 1 2026 12:05 PM | Updated on Mar 1 2026 12:32 PM

Abishan Jeevinth With Love Movie OTT Release Date Ott

దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్‌ అయ్యాడు అభిషన్‌ జీవింత్‌. ఇతడు టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్‌ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్‌ డైరెక్టర్‌ హీరోగా మారాడు. విత్‌ లవ్‌ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.

ఓటీటీలో విత్‌ లవ్‌
అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్‌ జంటగా నటించిన ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్‌ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్‌ లవ్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్‌ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.

కథేంటంటే?
సత్య (అభిషన్‌ జీవింత్‌) ఆర్కిటెక్ట్‌.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్‌). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివామని, ఇద్దరూ సీనియర్‌- జూనియర్‌ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!

 

 

చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్‌ నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement