breaking news
Anaswara Rajan
-
అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు. -
'చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది'.. అనస్వర రాజన్ కొత్త సినిమా టీజర్
అభిషన్ జీవింత్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తోన్న లవ్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. ఈ ప్రేమకథ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని విత్ లవ్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హరీష్ కుమార్, కావ్య అనిల్, సచ్చిన్ నాచియప్పన్, తేని మురుగన్, శరవణన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతమందించారు. It’s here! The Title Teaser and First look of #WithLoveCheck it out 💥🔗 https://t.co/UvJynh5a20Starring @Abishanjeevinth & @AnaswaraRajan_ ♥️A @RSeanRoldan musical 🎶Written & Directed by @madhann_n♥️Produced by @soundaryaarajni &♥️ @mageshraj@MRP_ENTERTAIN… pic.twitter.com/faeMQcT7zN— Suresh Productions (@SureshProdns) January 21, 2026 -
అవి చూస్తే వణుకు పుడుతుంది
అనుకోకుండా మొదలైన అనశ్వర రాజన్ ప్రయాణం,నేడు ఎన్నో లక్ష్యాలు, ఎన్నో కలలతో నిండిపోయింది. మనసులో ఎన్నో గాయాలను దాచుకుని ముందుకు నడుస్తున్న ఆమె ప్రపంచం గురించిన విషయాలు ఆమె మాటల్లోనే...⇒ నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. కరివెల్లూరులో చదువుతున్న రోజుల్లో, నా తొలి ఆడిషన్ కు ఒక ఫ్రెండ్ నన్ను లాక్కెళ్లింది.⇒ సినిమాల్లోకి వచ్చాక నా స్కూల్ జీవితం ఒంటరిగా మారిపోయింది. కొంతమంది టీచర్లు, పేరెంట్స్ నన్ను వేరుగా చూసేవారు. ‘‘నీకు సినిమాలు ఉన్నాయిగా, చదువు ఎందుకు?’’ అనే మాటలు ఇప్పటికీ బాధిస్తాయి. స్కూల్ మానేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి.⇒ ఐదో తరగతిలో ఉన్నప్పుడు బస్సులో ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పటికీ వెంటాడుతుంది. ఆ సంఘటన నా బాల్యాన్ని పెద్దదిగా చేసింది. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే కొంత ఆందోళనగానే ఉంటుంది.⇒ ఇప్పుడు అంతకంటే భయం కలిగించేది డిజిటల్ ప్రపంచం. ఏఐతో మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే నిజంగా వణుకు పుడుతుంది. వాటిని ఆపలేకపోవడం చాలా బాధగా ఉంటుంది.⇒ గత ఏడాది ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన వివాదం నాకు చాలా నేర్పింది. ఆ సమయంలో నేను బాధితురాలిలా మౌనంగా ఉండలేదు. నా పేరు, నా గౌరవం కోసం నిలబడ్డాను. అదే నా నిజమైన బ్రేక్‌త్రూ.⇒ ‘‘పెళ్లి గురించి కాదు, నీ కెరీర్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించు’’ అని చెప్పే ప్రోగ్రెసివ్ తండ్రి నాకు దొరికారు. ఆయనే నా అతిపెద్ద బలం. ఇప్పుడు నా దుస్తులు, నా ఎంపికల గురించి ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోవడం మానేశాను. నాకు ఎవరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేర్చుకున్నాను.⇒ షూటింగ్ లేనప్పుడు నా బ్యాగ్‌లో తప్పకుండా ఒక పుస్తకం ఉంటుంది. నేను పూర్తిగా రొమాంటిక్ నవలల ఫ్యాన్ ని. చదవకపోయినా, కొనకుండా ఉండలేను.⇒ స్కిన్ కేర్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. మేకప్ తప్పకుండా తీసేస్తాను. ముందుగా ఆయిల్‌తో క్లీనింగ్, తర్వాత మేకప్ రిమూవర్, ఆపై ఫేస్ వాష్ డబుల్ క్లీన్సింగ్ లేకపోతే నిద్రపోను. షూటింగ్ లేనప్పుడు ‘క్లీన్ గర్ల్ లుక్’ ఇష్టం. సింపుల్ స్కిన్, కాస్త డార్క్ కాజల్ అంతే.⇒ మలయాళం వరకు మాత్రమే కాదు, ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాను. ‘చాంపియన్’ నా తొలి తెలుగు సినిమా. మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. -
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నిర్మాలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని పీరియాడికల్ ఫిల్మ్ ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్‌పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ‘ఛాంపియన్’ స్పెషల్. అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్‌గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్‌పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్‌కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం.. ఫుట్‌బాల్ టోర్నమెంట్, కోవై సరళ, వెన్నెల కిశోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో పరిచయం.. నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతాయి. బైరాన్పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలనే హైలెట్ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఇరగదీవాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్గా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్‌లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్‌కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ) -
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. -
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చంద్రకళ మనసుల్లో నిలిచిపోతుంది
‘‘చాంపియన్’ కథ విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది. సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్ ప్రదీప్‌గారి సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్‌లు పంపారు. తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్,ప్రొడ్యూసర్స్ సపోర్టివ్‌గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. -
నాగార్జున వాయిస్ ఓవర్.. 'ఇట్లు అర్జున' టీజర్ రిలీజ్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతో అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందించారు. నాగార్జున చేతుల మీదుగా రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.Loved doing the voice over for this love story!!To everyone who loved, But never said "I love you" ♥️Introducing #Aniesh as #NewGuyInTown in @WhatNextEnts’ Production No.1 - #ItlluArjuna ✨God bless🙏Discover the #SoulOfArjuna 💕🔗 https://t.co/E1KSWtAZOy@NewGuyInTown06…— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 14, 2025 -
శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా.. మెలోడీ సాంగ్ రిలీజ్
నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
ఒక ప్రాణం పోయాక నువ్వు పుట్టావ్.. హీరోయిన్ తల్లి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాళ్లు మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లరు. ఒకవేళ తనువు చాలించి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రూపంలో మనముందుకు వస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఇంట అదే నిజమైంది. సూపర్ శరణ్య, నెరు, రేఖా చిత్రం వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది అనస్వర.నా పాపాయికి హ్యాపీ బర్త్డేనేడు (సెప్టెంబర్ 8) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా హీరోయిన్ తల్లి ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆరోజు నేనెంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను.. అదే రోజు నువ్వు జన్మించావు. 23 ఏళ్ల ఈ పాపాయి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ నీకోసం వేవేల బర్త్‌డే విషెస్ తెలియజేస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు అనస్వర ఫోటోను జత చేసింది. దీంతో అభిమానులు హీరోయిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా ఉషా- రాజన్ దంపతులకు 2002 సెప్టెంబర్ 8న అనస్వర జన్మించింది. ఈమె పుట్టడానికి ముందు ఉషా తల్లి మరణించింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిన ఉషాకు కూతురే ప్రపంచంగా మారింది. అనస్వరలోనే తల్లిని చూసుకుని సంతోషపడిపోయింది. అనస్వర రాజన్ సినిమాల విషయానికి వస్తే.. 7/G రెయిన్బో కాలనీ 2 సినిమా చేస్తోంది. ఇది తెలుగులో7/G బృందావన కాలనీ 2గా విడుదల కానుంది. దీనితో పాటు మరో రెండు మూవీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Usha Rajan (@usharajan_) చదవండి: 15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే.. -
నాగార్జునతో మలయాళ యంగ్ బ్యూటీస్.. ఫొటో వైరల్
నాగార్జున.. రీసెంట్‌గానే 'కూలీ' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇన్నాళ్లు హీరోగా చేసిన నాగ్.. ఈ సినిమాలో విలన్‌గా కనిపించాడు. రైటింగ్ పరంగా ఈ పాత్రపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ నాగ్ లుక్స్ మాత్రం తెలుగు-తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. తమిళ యూత్ అయితే నాగ్ హెయిర్ స్టైల్ అనుకరిస్తూ తెగ రీల్స్ చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే నాగ్ క్రేజ్ ఇప్పటితరం హీరోయిన్లలోనూ గట్టిగానే ఉందండోయ్.సందర్భం ఏంటో తెలీదు గానీ మలయాళ యంగ్ హీరోయిన్లు అయిన మమిత బైజు, అనస్వర రాజన్, ప్రియ వారియర్, దీప్తి సతితో నాగ్ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్లామర్ విషయంలో ఈ బ్యూటీస్‌తో నాగ్ కలిసిపోయి యంగ్‌గా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. ఒకప్పటి తరం హీరోయిన్లతో చేసిన నాగ్.. 2010ల్లో అప్పటి క్రేజ్ హీరోయిన్లతోనూ సినిమాలు చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో చూస్తుంటే వీళ్లతోనూ మూవీస్ చేస్తాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సింగర్‌తో తిరుమలకు హీరో జయం రవి)నాగ్ జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తదితరుల సినిమాల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీపై అప్పుడప్పుడు ట్రోల్స్ లాంటివి కనిపిస్తుంటాయి కానీ నాగ్ విషయంలో మాత్రం అలాంటి కంప్లైంట్స్ పెద్దగా వినిపించవనే చెప్పొచ్చు. అదన్నమాట విషయం. త్వరలో తన 100వ సినిమా గురించి నాగ్ నుంచి ప్రకటన రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదలయ్యే బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం నాగార్జున సిద్ధమైపోతున్నాడు. 3వ సీజన్ నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. ఈసారి కూడా హోస్ట్‌గా కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసేందుకు గేమ్ నడుస్తోంది. ఇది అయిపోయిన వెంటనే.. అసలు షో షురూ కానుంది. ఈసారి ఇమ్మాన్యుయేల్‌తో పాటు పలువురు టీవీ యాక్టర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన) -
మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో
ఓటీటీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సినిమా 'రేఖాచిత్రం'. పేరుకే మలయాళ సినిమా గానీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో దానిలోనూ కేవలం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.మలయాళ దర్శకులు థ్రిల్లర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టులు. అలా ఈ ఏడాది జనవరి తొలి వారంలో 'రేఖాచిత్రం' మూవీని విడుదల చేశారు. రూ.10 కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు రెండు నెలల తర్వాత గత శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))మన దగ్గర సోనీ లివ్ ఓటీటీలో చూసేవాళ్లు తక్కువని చెప్పొచ్చు. బహుశా ఇది గమనించారో ఏమో గానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి 'రేఖాచిత్రం' తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.'రేఖాచిత్రం' విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం తాము ఓ అమ్మాయిని హత్య చేశామని చెప్పి ఓ పెద్దాయన ఆత్మహత్య చేసుకుంటాడు. అదేరోజు ఆ ఊరిలో ఎస్ఐగా జాయిన్ అయిన వివేక్ దర్యాప్తు మొదలుపెడతాడు. ఒక్కో ఆధారం వెతుకుతూ వెళ్లేకొద్ది దొంగ దొరుకుతాడు. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి థ్రిల్లర్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో థ్రిల్లర్ మూవీస్ తీస్తూనే ఉంటారు. అలా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినంది 'రేఖాచిత్రం'. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)కథేంటి?రాజేంద్రన్ (సిద్ధిఖ్) అనే ఓ పెద్దాయన.. మలకపార ప్రాంతంలోని అడవిలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియో రికార్డ్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని హత్య చేశామని, మరో ముగ్గురితో కలిసి ఇప్పుడు కూర్చున్న చోటే ఆమెని పాతిపెట్టాం అని సదరు వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. అదేరోజు ఆ ఊరి ఎస్ఐగా వివేక్ (అసిఫ్ అలీ) జాయిన్ అవుతాడు. రాజేంద్రన్ చెప్పినట్లు అక్కడ తవ్వితే నిజంగానే ఓ అమ్మాయి ఎముకలు దొరుకుతాయి. అలా ఈ కేసు దర్యాప్తు మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య చేసిన వాళ్లు పట్టుబడ్డారా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం మలయాళీ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అలా అని 'రేఖాచిత్రం' ఏదో డిఫరెంట్ అని కాదు. ఎప్పటిలానే ఇదో మర్డర్ మిస్టరీ. కాకపోతే దీన్ని డీల్ చేసిన విధానం. సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.వివేక్ ఓ పోలీస్. కానీ డ్యూటీ టైంలో బెట్టింగ్స్ ఆడుతున్నాడని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్లకు ఓ మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సరిగ్గా జాయిన్ అయిన రోజే ఓ అమ్మాయి మర్డర్ కేసు. అది కూడా 40 ఏళ్ల క్రితం ఈమెని చంపి పాతిపెట్టి ఉంటారు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ విషయాల్ని బయటపెట్టి చనిపోతాడు. దీంతో అసలు రాజేంద్రన్ ఎవరు? చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెకు 1985లో రిలీజైన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 'కాతోడు కాతరం' సినిమాకు సంబంధం ఏంటనేది వివేక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే పలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి.సినిమా మొదలైన ఐదు నిమిషాలకే మర్డర్ గురించి తెలుస్తుంది. అలా మనల్ని దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లిపోతాడు. స్టోరీ ఎక్కడా పరుగెట్టదు కానీ అనవసర సీన్ ఒక్కటీ ఉండదు. యువతి కాలిపట్టితో మొదలుపెట్టి.. ఒక్కో పాత్ర ఒక్కో లింక్ ని పట్టుకుని స్టోరీ తెలిసేకొద్ది యమ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.(ఇదీ చదవండి: Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ)చనిపోయిన రాజేంద్రన్.. తనతో పాటు విన్సెంట్ కూడా హత్యలో భాగమని చెబుతాడు. నిజంగానే విన్సెంట్ హత్య చేశాడా? దీన్ని వివేక్ ఎలా నిరూపించడనేది చివరివరకు మనల్ని ఎంగేజ్ చేసే విషయం. చూస్తున్నంతసేపు ఎక్కడా మనం ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. మన చుట్టుపక్కలా జరుగుతున్నట్లే చాలా నేచురల్ గా ఉంటుంది. చివరకొచ్చేసరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది.ఓ యువతి హత్యకు మమ్ముట్టి సినిమా, షూటింగ్ తో లింక్ చేసి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ఉపయోగించి యువకుడిలా చూపించడం కూడా బాగుంది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు, ముగించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారు?ఓటీటీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలిసిన అసిఫ్ అలీ, అనస్వర రాజన్.. వివేక్, రేఖ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోయింది. మిగతా టెక్నీషియన్స్ తమకిచ్చిన పనికి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసే థ్రిల్లర్ మూవీ ఈ 'రేఖాచిత్రం'.-చందు డొంకాన(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన) -
దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్
ఇప్పుడంతా ఓటీటీల (OTT Movies) జమానా. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan). ఈమె నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఈమెపై ఆరోపణలు చేశాడు. తానేం తప్పు చేయలేదని ఇచ్చిపడేసిన అనస్వర రాజన్.. దర్శకుడికి అదే రేంజులో ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)అసలేం జరిగింది?ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' మూవీ లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కొన్నిరోజుల క్రితం పలు మీడియా ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు కరుణాకరన్(Deepu Karunakaran).. హీరోయిన్ అనస్వర రాజన్ అస్సలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పాడు. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు.తాజాగా దర్శకుడి కామెంట్స్ పై స్పందించిన అనస్వర రాజన్.. ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకేఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రిలీజ్ డేట్ మార్పు గురించి తనకు అస్సలు సమాచారం ఇవ్వలేదని వాపోయింది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఇలానే తనపై ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు దర్శకుడిపై అనస్వర ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.అనస్వర నటించిన చిత్రాల విషయానికొస్తే.. సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, గురువాయూర్ అంబలనడయిల్, నెరు తదితర చిత్రాలు ఉన్నాయి. ఈమె నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రేఖాచిత్రం' ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan)


