– అనస్వరా రాజన్
‘‘చాంపియన్’ కథ విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది. సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్ ప్రదీప్‌గారి సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్‌గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్‌లు పంపారు.
తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్,ప్రొడ్యూసర్స్ సపోర్టివ్‌గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు.


