ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఇవాళ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
JAN 8th - Premieres
Pre Release Event in Hyderabad #TheRajaSaab— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025


