టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.
తాజాగా లిస్ట్‌లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)
అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది.
It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.
The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025


