మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్‌ | Malayalam Crime Investigation Thriller Trailer Out Now | Sakshi
Sakshi News home page

Justice For Jeni Movie: మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్‌ రిలీజ్

Dec 17 2025 4:53 PM | Updated on Dec 17 2025 5:16 PM

Malayalam Crime Investigation Thriller Trailer Out Now

ఈ రోజుల్లో మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం కంటెంట్‌తోనే ఈ సినిమాలు హిట్టవుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ అలరించేందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం మలయాళంలోనే రిలీజైంది.

ఆషికా అశోకన్, సంద్ర అనిల్ కీలక పాత్రల్లో వస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ జస్టిస్‌ ఫర్ జెని. ఈ మూవీకి సంతోష్ ర్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. 

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఓ యువతిపై ‍అత్యాచారం, మర్డర్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీని అస్నా క్రియేషన్ ప్రెజెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో సినాన్, ఐశ్వర్య, బిట్టు థామస్ మప్పిళ్లస్సేరి, రేఖ, హరీష్ పేరడి, నిజల్గల్ రవి కీలక పాత్రలు పోషించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement