పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.
(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్‌లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.
'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్‌తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.
(ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)





