ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.
'ఏఐ నాన్సెన్స్‌ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.
— Sreeleela (@sreeleela14) December 17, 2025


