పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు! | Year End Special, List Of Celebrities Who Became Parents In 2025 | Sakshi
Sakshi News home page

2025 రౌండప్‌: ఈ ఏడాది పేరెంట్స్‌ అయిన సెలబ్రిటీలు..

Dec 17 2025 12:43 PM | Updated on Dec 17 2025 2:28 PM

Year End Special, List Of Celebrities Who Became Parents In 2025

ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్‌లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్‌ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్‌లో సెటిల్‌ అవగానే పేరెంట్‌హుడ్‌ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....

వరుణ్‌ తేజ్‌ -లావణ్య త్రిపాఠి
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు.  ఈ ఏడాది సెప్టెంబరు 10న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు..

వశిష్ట సింహ- హరిప్రియ
వశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ​ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!

విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌
హీరో విక్కీ కౌశల్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్‌ 7న బాబు పుట్టాడు.

సిద్దార్థ్‌ మల్హోత్రా- కియారా అద్వానీ
సిద్‌- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘనంగా పెళ్లి  చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.

పరిణీతి చోప్రా- రాఘవ్‌ చద్దా
హీరోయిన్‌ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్‌ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్‌ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్‌ అని పేరు పెట్టారు.

అర్బాజ్‌ ఖాన్‌- షురా ఖాన్‌
బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్‌5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్‌ అని నామకరణం చేశారు.

రాజ్‌కుమార్‌ రావు- పాత్రలేఖ
సినిమాలతో బిజీ ఉండే రాజ్‌కుమార్‌- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్‌ ముందుకు వేశారు. నవంబర్‌ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.

కేఎల్‌ రాహుల్‌- అతియా శెట్టి
క్రికెట్‌ క్రీడాకారుడు కేఎల్‌ రాహుల్‌, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.

వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్‌- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు సుదీప్‌, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్‌హుడ్‌కు స్వాగతం పలికారు. బాలీవుడ్‌లో జైద్‌ దర్బార్‌- గౌహర్‌ ఖాన్‌, మాళవిక రాజ్‌- ప్రణవ్‌ బగ్గ, షీనా బజాజ్‌ - రోహిత్‌ పురోహిత్‌,  షీనా బజాజ్‌ రోహిత్‌ పురోహిత్‌, జహీర్‌ ఖాన్‌- సాగరిక, నవరాజ్‌ హన్స్‌- అజిత్‌ కౌర్‌.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement