బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.
సైయారాను దాటేసిన దురంధర్..
డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.
కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..
ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.
అందుకే బజ్..
పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.
ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్‌ల రికార్డులను తుడిచిపెట్టేసింది.
ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది.


