రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు.
చిత్ర దర్శకులు సుమన్ బాబు మాట్లాడుతూ "కొన్ని సినిమాల్లోని సోల్ మనకు అనుభూతి చెందాలంటే, ఖచ్చితంగా వాటిని థియేటర్‌లోనే చూడాలి. మా 'ఎర్ర చీర' సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఉన్న సౌండింగ్ మరియు విజువలైజేషన్ అనుభూతి మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి అన్నారు.


