కుటుంబానికి దూరంగా.. నాన్న పేరుపై అర్చన: మనోజ్‌ | Actor Manchu Manoj Wishes Ugadi and Birthday Wish to Mohan Babu | Sakshi
Sakshi News home page

Manchu Manoj: చిన్నప్పటినుంచి ఈరోజు నాకెంతో స్పెషల్‌.. ఎందుకంటే నాన్న..

Mar 19 2026 9:36 PM | Updated on Mar 20 2026 9:42 AM

Actor Manchu Manoj Wishes Ugadi and Birthday Wish to Mohan Babu

ప్రతి ఉగాదికి ఫ్యామిలీతో కలిసి ఉండేవాడిని, కానీ ఈసారి దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నాడు హీరో మనోజ్‌ మంచు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. నేను ఎప్పటినుంచో ఒకటి బలంగా నమ్ముతాను.. సనాతన సాంప్రదాయం, మనకు చిన్నప్పుడు నేర్పించిన విలువలు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లవు.

ఉగాది అంటే..
మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విలువలు మనలో, మనతోనే ఉంటాయి. ఈరోజు కూడా నా రాబోయే సినిమా డేవిడ్‌ రెడ్డి షూటింగ్‌ కోసం దూరంగా ఉండాల్సి వచ్చింది. బాధ్యతలతో బిజీగా ఉన్నా.. ఆ అనుబంధం మాత్రం అలాగే ఉంది. నాకైతే ఉగాది అంటే నూతన సంవత్సరానికి నాంది మాత్రమే కాదు, అది మనలో జరిగే నిశ్శబ్ధ పునరుజ్జీవనం, ఋతువుల మార్పు, ధర్మం మళ్లీ మేల్కొనడం, కాలపురుషుడి ఆవిర్భావం.

నాన్న పేరుపై అర్చన
ఈ చైత్ర శుక్ల ప్రతిపద రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని నెలకొల్పి, యుగాల చక్రాన్ని ప్రారంభించాడని నమ్ముతారు. అదే మనం ఉగాదిగా జరుపుకుంటాం. నేను ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గుడిలో ఉన్న నా కుటుంబాన్ని వీడియో కాల్‌ ద్వారా చూశాను. ఆ ఆధ్యాత్మికతను నేనూ ఫీల్‌ అవుతున్నాను. మౌనిక, ధైరవ్‌, చిట్టి దేవసేన.. నాన్న (మోహన్‌బాబు) పేరుమీద అర్చన చేయించారు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన మనవళ్లకెప్పుడూ ఆయన ఆశీస్సులుంటాయి.

ఇలా తొలిసారి
ఓపక్క పనిలో బిజీగా ఉంటూనే నా మూలాలను మర్చిపోకుండా ఉండగలగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మార్చి 19 అంటేనే నాకు పండుగ.. ఇది నాకు చిన్నప్పటినుంచి సెలవురోజు, ఎందుకంటే ఈరోజు నా తండ్రి పుట్టినరోజు. ఆయనతో కలిసి గడిపే ప్రత్యేకమైన రోజు. కానీ, తొలిసారి ఆ సెలవురోజు పనిదినంగా మారింది. నాకు కుటుంబం తర్వాత అత్యంత ఇష్టమైనది పని! నేను ఏం చేసినా, అందరితో ప్రశంసలు అందుకునేలా పని చేస్తున్నా.. అదంతా మీకోసమే నాన్న.. హ్యాపీ బర్త్‌డే అని రాసుకొచ్చాడు.

 

 

చదవండి: రొమాంటిక్‌ సాంగ్‌.. డైరెక్టర్‌కు కాజోల్‌ వార్నింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement