ఓటీటీ ప్రపంచంలో కిరణ్‌ అబ్బవరం.. గ్లింప్స్‌ చూశారా? | Kiran Abbavaram Debut Web Series Glimpse Out Now | Sakshi
Sakshi News home page

కిరణ్‌ అబ్బవరం ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌.. రివేంజ్‌ డ్రామా!

Mar 19 2026 7:56 PM | Updated on Mar 19 2026 8:01 PM

Kiran Abbavaram Debut Web Series Glimpse Out Now

క, కె- ర్యాంప్‌ సినిమాలు కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే వీటి మధ్యలో వచ్చిన దిల్‌రూబా మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడీ హీరో. ఓపక్క వెండితెరపై సినిమాలు చేసుకుంటూనే ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

వెబ్‌ సిరీస్‌
ఈసారి సినిమాతో కాకుండా వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్లాన్‌ చేశాడు. తాజాగా ఆ వెబ్‌ సిరీస్‌ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ కూడా వదిలారు. డియర్‌ కామ్రేడ్‌ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వం వమిస్తున్న ఈ సిరీస్‌కు గువ్వల చెరువు ఘాట్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ పొలిటికల్‌ డ్రామాతో ఈ సిరీస్‌ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

సిరీస్‌
ఇందులో తిరువీర్‌, సంయుక్త మీనన్‌, తేజస్వి రావు, సిద్ధిఖి, ఆడుకాలం నరేన్‌ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ చూస్తుంటే ఇంట్రస్టింగ్‌గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. రిలీజ్‌ డేట్‌ ఇంకా ప్రకటించలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement