Mahabubabad
-
పదవీ విరమణ డబ్బుల పంపకాల్లో కుమారులతో ఘర్షణ
● మనస్తాపానికి గురై రిటైర్డ్ ఉద్యోగి బలవన్మరణం మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో కుమారులతో జరిగిన ఘర్షణతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం కాలనీలో నివాసం ఉండే ఏర్పుల వీరయ్య (63) పంచాయతీరాజ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఐదేళ్లక్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉద్యోగ విరమణ డబ్బులురాగా ఇటీవల కుమారులకు, ఆయనకు మధ్య పంపకాల విషయంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. వీరయ్య ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనకు తానుగా బాధపడుతూ వారం రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వెంకటరమణ లాడ్జిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు వీరయ్య మృతిచెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. టౌన్ ఎస్సై కే.శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ సంఘటన స్థలానికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
ప్రభల తరలింపులో ఉద్రిక్తత..
● భారీగా తరలిరావడంతో గిర్నిబావిలో ట్రాఫిక్ జామ్ ● నిలువరించే ప్రయత్నంలో పోలీసుల లాఠీచార్జ్ ● పరుగులు తీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ● ఐదుగురికి గాయాలు, బీఆర్ఎస్ ఆందోళన ● డీసీపీ అంకిత్ రాకతో పరిస్థితి అదుపులోకి.. సాక్షి, వరంగల్/దుగ్గొండి: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభలు (బండ్లు) తరలుతుండగా దుగ్గొండి మండలం గిర్ని బావిలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా తరలిరావడంతో నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభల ఎదుట పేలుస్తున్న షార్ట్ బాణాసంచా బోర్లా పడడంతో రోడ్డు పక్కల వారికి తగిలి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాంబుల పేలుడు శబ్ధం వినిపించడంతో ఫైరింగ్ జరుగుతుందని భ్రమపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఒకానొక దశలో ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ కేనన్ ప్రయోగించబో యారు. చివరకు డీసీపీ అంకిత్ కుమార్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జాతరకు స్వయంగా వాహనాలు, ప్రభలను పంపించారు. ఉద్రిక్తతకు ఎందుకు దారి తీసిందంటే.. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి జాతర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల ప్రభలు శనివారం ఉదయమే గిర్నిబావికి భారీగా చేరుకున్నాయి. కాంగ్రెస్ ప్రభలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించగా, బీఆర్ఎస్ ప్రభలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. అయితే ఈ జాతరకు ప్రభలను ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తరలించాయి. ఏటా గిర్నిబావిలో బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారడంతో పోలీసులు మొదట కాంగ్రెస్ ప్రభలకు ఉదయం 4 నుంచి 11 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభలు భారీగా తరలిరావడంతో కొమ్మాల ఆర్చ్ నుంచి గిర్నిబావి వరకు బారులుదీరాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభలను దుగ్గొండి, చాపలబండ , నర్సంపేట రోడ్లలో పోలీసులు నిలిపారు. ఇక తమకు కేటాయించిన సమయం దాటి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుకు చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకోవడం, వాటర్ బాటిళ్లు విసురుకోవడం, పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే వేలాది మంది ఒక్కసారిగా బారికేడ్లు, చెక్‌పోస్టులు విరగగొట్టి రోడ్డుపైకి రావడంతో ఇరువర్గాలను నిలువరించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొగర్రాయికి చెందిన యార శ్రీనివాస్‌పై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడంతో గాయాలపాలయ్యాడు. కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, సద్ది నర్సిరెడ్డి, మోడెం విద్యాసాగర్, తుమ్మలపెల్లి మహేందర్‌కు అధికంగా లాఠీ దెబ్బలు తగిలాయి. అయితే తమవారిపై ఎందుకు లాఠీచార్జ్ చేశారంటూ మహిళలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఇంకా చేజారుపోతుండడంతో వాటర్ కేనన్ ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్ తన ఏకే 47 గన్ లోడ్ చేసి ఫైర్ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. సీఐ సాయిరమణ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డీసీపీ అంకిత్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నాలుగు గంటలుట్రాఫిక్కు అంతరాయం.. ప్రధాన రహదారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్ర భలు నిలిచిపోవడంతోపాటు జాతరకు వెళ్లి తిరుగుప్రయాణంలో వచ్చే ప్రభలు రెండు వైపులా ఉండడంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సులను మచ్చాపురం నుంచి దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఇబ్బంది తప్పింది.గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సాక్షి, వరంగల్: కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలివెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అంతేకాని ఈ ఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు ప్రజలను ఆందోళన కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే రీతిలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అప్లోడ్ చేసినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.ప్రమాదశాత్తు బావిలో పడి యువకుడి మృతి కొమ్మాల జాతరలో ఘటన గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు ప్రమాదశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. సంగెం మండలం పల్లార్లగూడ శివారు వీఆర్ఎన్ తండాకు చెందిన వాసరి అరుణ్‌కుమార్(31) తన స్నేహితుడు గుగులోత్ రాజుతో కలిసి కొమ్మాల జాతరకు వెళ్లాడు. జాతరలో భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఇద్దరూ కలుసుకోలేక పోగా చీకట్లో దారి తెలియక అరుణ్‌కుమార్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడగా ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ మహేందర్ శనివారం తెలిపారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలు నిర్లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్ : బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేస్తే, స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్తేజం తీసుకొచ్చామన్నారు. క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం తామెప్పుడు ముందుంటామన్నారు. టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పీఎన్. వెంకటేశ్ మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్రం నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి. అజీజ్‌ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సాట్ కోచ్ సద్గురు, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ అంబేడ్కర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్, గోకారపు శ్యాంకుమార్, కోశాధికారి జాహుర్, టెక్నికల్ అఫిషియల్స్ వై. సురేందర్, సలహాదారులు కె. జితేందర్‌నాథ్, జి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి -
ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలి
● ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి మామునూరు: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో సుగంధ ద్రవ్యాల సాగుపై మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పసుపు, మిరప, కూరగాయల విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఉద్యాన పంటల సాగును పంట మార్పిడిగా ఉపయోగించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్నారు. అంతకు ముందు సుగంధ ద్రవ్యాల పంట సాగు విధానాలపై శిక్షణ పొందిన రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సౌమ్య, రాజు, నాగరాజు, వేణుగోపాల్, హర్షరెడ్డి, సాయిచంద్, సుశ్రాత్, తదితరులు పాల్గొన్నారు. -
‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, సీపీ, కలెక్టర్ స్టేషన్‌ఘన్‌పూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో పలు అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన ఆదివారం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభా స్థలిని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లకు అనుగుణంగా నియోజవకర్గ అభివృద్ధే ఽధ్యేయంగా కాంగ్రెస్‌లో చేరానని, కేవలం పది నెలల్లోనే సీఎం రేవంత్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేసిన వెంటనే పనులను ప్రారంభించి 18 నెలల్లోనే పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతగా నేడు 50వేల మందితో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం రేవంత్ : ఎంపీ కావ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రధానంగా వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఏడాదిలోనే రూ.800 కోట్లు మంజూరు చేశారన్నారు. సభావేదికను పరిశీలించిన సీపీ.. సీఎం సభాస్థలి, సభావేదికను వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర అంశాలపై డీసీపీతో మాట్లాడారు. సీఎం సభ కోసం 800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు భీమ్‌శర్మ, అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు వినయ్‌కుమార్, శ్రావణ్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, జూలుకుంట్ల శిరీశ్‌రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బూర్ల శంకర్, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, అంబటి కిషన్‌రాజ్, నీల శ్రీధర్, నీల వెంకటేశ్వర్లు, రాములు, పోశాల క్రిష్ణమూర్తి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాలి
వెంకటాపురం(ఎం): రాష్ట్రంలోనే అరుదైన వృక్ష సంపద మండలంలోని పాలంపేట పరిధిలో ఉందని, కేన్ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా శనివారం వృక్షశాస్త్ర పరిశోధకుడు, కేన్మ్యాన్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ సుతారి సతీశ్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అధ్యాపకురాలు అనంతలక్ష్మితో కలిసి కేన్ ప్రాంతాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఏకై క కేన్ ప్రాంతం పాలంపేటలోనే ఉందన్నారు. కేన్ ప్రాంతంలో 125 జాతుల ఆయుర్వేద మందు మొక్కలు ఉన్నాయని, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 51 ఎకరాల్లో ఉన్న కేన్ ప్రాంతాన్ని కాపాడుకుని ఆరోగ్య భారత్‌ను నిర్మించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ 51 ఎకరాల చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ జోన్‌గా ప్రకటించి, కెనోపి వాక్ పేరుతో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో పరిశోధన బృందం సభ్యులు డాక్టర్లు నిఖిత, కృష్ణసాయి, ఆకాశ్, సుమ తదితరులు ఉన్నారు. వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్ -
టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్●
● ఈనెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ ● 28న ఓటింగ్.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి. మనోహర్ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజేషన్ –1, ఆర్గనైజేషన్ –2 (ఉమెన్), రిక్రియేషన్ పదవులకు ఒక్కో పదవికి నోటిఫికేషన్ ఇచ్చారు. మూడేళ్ల పదవి కాలానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం స్క్రూటీని చేసి ఈనెల 21న నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 22న మధ్యాహ్నం 3గంటల వరకు ఉంటుంది. తుదిగా అభ్యర్థుల జాబితా 22న సాయంత్రం 4. 30 గంటలకు వెల్లడిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు 24న గుర్తులు కేటాయిస్తారు. ఓటింగ్ ప్రక్రియ 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు క్యాంపస్‌లోని యూని వర్సిటీ కాలేజీలో ఉంటుంది. 29న సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఈ ఎన్నికల నోటిఫికేషన్‌తో కేయూ టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయీస్లో ఎన్నికల సందడి మొదలైంది. యూట్యూబ్ విలేకరిపై కేసు ఖిలా వరంగల్: నిజ నిర్ధారణ లేకుండా ఫొటోలతో సహా సామాజిక మధ్యమాల్లో ఓ కథనం పోస్టు చేసిన ఓ యూట్యూబ్ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. ఓ యువతి విషయంలో పూర్తి సమాచారం లేకుండా.. కనీసం నిబంధనలు పాటించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్లిప్పింగ్స్ ఆధారంగా సదరు విలేకరిపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. శనివారం అతడిని పోలీసులు స్టేషన్లో విచారించినట్లు సమాచారం. సీకేఎంలో ఫెర్టిలిటీ ఓపీ సేవలు షురూఎంజీఎం: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శనివారం ఫెర్టిలిటీ ఓపీ సేవలను సూపరింటెండెంట్ షర్మిల ప్రారంభించారు. ప్రస్తుతం అందిస్తున్న గర్భిణులకు సేవలతో పాటు సంతాన భాగ్యం లేని దంపతులకు మరింత మెరుగైన ఓపీ వైద్యసేవలందించేందుకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక ఓపీ ప్రారంభించి ఔషధాలు సైతం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈసేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంతాన లేమితో ఇబ్బందులు పడుతున్న దంపతులు.. ఈ విభాగంలో నమోదు చేసుకుని ఉచిత వైద్యసేవలు పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు మురళి, సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డి సభను అడ్డుకుంటాం
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు పలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ హామీలను అమలు చేయకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నారని, నేడు ఘన్‌పూర్‌లో నిర్వహించనున్న సీఎం ‘కృతజ్ఞత సభ’ అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, రైతుల సమస్యలపై ప్రశ్నించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం కడియం శ్రీహరి నిర్వహించే సభకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి దొడ్డిదారిన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారని ఎద్దేవా చేశారు. కడియంకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారపాక రవి, ఆకుల కుమార్, మాచర్ల గణేశ్, తాటికొండ సురేశ్, కుంభం కుమార్, బంగ్లా శ్రీను, మునిగెల రాజు, మారెపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, గుర్రం శంకర్, శ్రీను, గాదె రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్
నయీంనగర్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు కచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు దక్కేలా తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ నాలుగైదుసార్లు సమావేశమై కొత్త నిబంధనలు రూపొందించిందని, ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ల జారీలో జాప్యమైందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాడుతోందన్నారు. ఇటీవల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులకు విన్నవించామని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానూకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఎ.రాంచందర్, తోట సుధాకర్, దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కంకణాల సంతోశ్, పి.వేణుమాధవ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ -
వైభవంగా శ్రీవారి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: అనంతాద్రి శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంతాద్రి గుట్టపై వెలసిన స్వయంభూ జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో అష్టోత్తర శతనామపూజ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి యజ్ఞోపవీతధారణ చేసి, స్వామివారు, అమ్మవార్లకు జిలకర బెల్లంధారణ చేసి మధుపర్కం సమర్పణ అనంతరం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. మానుకోటతోపాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మాలె కాళీనాథ్, వసంతలక్ష్మి దంపతులు వెండి కిరీటాలు, దీక్షా వస్త్రాలు, బవిరిశెట్టి వంశీకృష్ణ, మాధవి పట్టువస్త్రాలు, బొల్లం యాకయ్యలింగం, భారతలక్ష్మి, నాగేశ్వరరావు, సరస్వతి, చందా కిరణ్ కుమార్, రవిశంకర్ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యు డు నాయిని ప్రభాకర్‌రెడ్డి, వేమిశెట్టి యకాంబ్రం, పుల్లఖండం వేణుగోపాల్, మల్యాల రంగారావు, అ ర్చకులు అనిరుద్ ఆచార్యులు, విశ్వం, మట్టపల్లి వి జయ్, గౌతమ్, చరణ్, భక్తులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మహబూబాబాద్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో శనివారం వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధి కారులతో సాగు నీరు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగు నీటి సరఫరా విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, అలాంటివి జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డీఏఓ విజయ నిర్మల, ఇరిగేషన్ శాఖ ఈఈ నర్సింహరావు, అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ నర్సింహులపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. -
ఒంటిపూట బడులు షురూ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, గిరిజన ఆశ్ర మ పాఠశాలలో శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:45 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొ గా ప్రార్థన ఉద యం 8 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బడులను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అయితే జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సుమారు 15 కిలోల అన్నం మిగలడంతో వంట నిర్వాహకులు మిగిలిన అన్నాన్ని బస్తాలో నింపారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబాబాద్: టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 8,194 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాస్ కాపీంగ్‌కు తావు లేకుండా తగు ఏ ర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. వీర బ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఏఐ కోర్సు ప్రారంభం కురవి: సీరోలు మండల కేంద్రంతోపాటు చింతపల్లి, కొత్తూరు(సీ) గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటర్ కోర్సులను అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మూడు పాఠశాలల్లో కంప్యూటర్లను ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన పెంచడంతోపాటు, కృత్రిమ మేథను వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, జీ సీడీఓ విజయకుమారి డీఎస్ఓ బి.అప్పారావు, ఎంఈఓ లచ్చిరాం, హెచ్ఎంలు బి.శంకర్‌నాయక్, అ రుణ, బంగారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం గూడూరు: మండలంలోని మచ్చర్ల జెడ్పీహెచ్ఎస్లో శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యాబోధనను డీఈఓ రవీందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
● మున్సిపల్ మాజీ వైస్ చెర్మన్ వెంకన్న మహబూబాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నెహ్రూసెంటర్‌లో ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని రంజిత్, తేళ్ల శ్రీనివాస్, జెరిపోతుల వెంకన్న, మార్నెని రఘు, అశోక్, నీలేష్‌రాయ్, రావిష్, లక్ష్మణ్, రాము, రాజేష్, అమీర్, తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగు ఆరోగ్యానికి మేలు● కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి కొత్తగూడ: రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల లాభాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు నేడు గ్రామీణ ప్రాంతాల వరకు చేరుకోవడానికి కారణం విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించడమేనన్నారు. రసాయనాల వినియోగంతో భూసారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడిని పెంచవచ్చన్నారు. దొరవారివేంపల్లి, ఈశ్వరగూడెం గ్రామాల నుంచి సేంద్రియ సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు దేశవాలి ఆవులు, మేకలను ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఉదయ్, పశు వైద్యాధికారి శ్రీకాంత్, ఏఈఓ రాజు పాల్గొన్నారు. అంతర్ జిల్లా దొంగ అరెస్ట్● 108 గ్రాముల బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్: అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి 108గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. శనివారం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. కురవి మండల ప్రాంతంలో సీసీఎస్ హతిరాం, ఎస్సైలు తాహెర్‌బాబా, గోపి సతీష్, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా కురవి బస్టాండ్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పగటి పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి, కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన పున్నెం రాజు గతేడాది జూలై నుంచి మార్చి వరకు సుమారు వివిధ జిల్లాల్లో 11 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్ జిల్లా దొంగని పట్టుకున్న సీసీఎస్ హతిరాం, ఎస్సైలు తాహెర్ బాబా, గోపి, కురవి ఎస్సై సతీష్, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు. డీఎస్పీ తిరుపతిరావు వారికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కునేడు ఘన్‌పూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్‌గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46కోట్ల వ్యయంతో ఘన్‌పూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపాన 100 పడల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్‌హెల్ఫ్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్‌గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచారు. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. – 8లోu రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్‌లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు 1 గంటకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్‌కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు 1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్‌రెడ్డి సభను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
సంగెం: విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ సురేష్(27)కు భార్య రేణుక, ఇద్దరు కవలు మనోహర్, మణిదీప్, కూతురు మనీషా ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చేసుకుంటున్నాడు. తన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మొక్కజొన్నకు నీరు పారించేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్‌చేస్తే పని చేయకపోవడంతో ఫ్యూజులు సరిగా ఉన్నాయా.. లే దోనని ఫ్యూజులు, స్టాటర్ ఉన్న బాక్స్‌లో చేయి పెట్టి తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై కేకలు వేసి పడిపోయాడు. పక్క చేనులో ఉన్న అదే తండాకు చెందిన గుగులోత్ రాజు వచ్చి సురేష్‌ను లేపబోయేసరికి అతనికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు పడి కొట్టుకుంటుండగా మరో చేనులో ఉన్న రాజు వచ్చి దగ్గరలోని విద్యుత్ స్తంభంపై తీగలను తొలగించా డు. సురేష్‌ను ద్విచక్రవాహనంపై ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ముందుగా సురేష్‌ను కాపాడబోయిన రాజు తృటిలో ప్రా ణాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు. విద్యుత్ మోటారు ఫ్యూజులు సరిచేస్తుండగా ఘటన -
రోడ్డుపై యువకుల న్యూసెన్స్
హసన్‌పర్తి: హోలీ రంగుల్లో మునిగితేలిన యువకులు చిత్తుగా మద్యం సేవించారు. ఎదురుగా వస్తున్న కారును ఆపారు.. కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి.. అద్దాలు పగులగొట్టారు. 56వ డివిజన్ వివేకానంద కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద కాలనీకి చెందిన ఓ కారు హనుమకొండ వైపునకు బయల్దేరింది. అప్పటికే చిత్తుగా మద్యం సేవించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు వలస కూలీలు ఆ కారు అడ్డగించారు. తమకు కారు తాళం చెవి ఇవ్వమని డిమాండ్ చేశారు. అందుకు కారు డ్రైవర్ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మరో యువకుడు బండరాయిని కారు అద్దాలపైకి విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా యువకులు మరింత రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటన సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు కారు యజమాని(మహిళ) ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తులసీ రెస్టారెంట్ అండ్ బార్‌ను తొలగించాని, నిత్యం మద్యంప్రియులు గొడవలు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కారు ఆపి అద్దాలు పగులగొట్టి హల్చల్ -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
ఖానాపురం: మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత తొంబై రోజులుగా గోటితో ఒలిచిన తలంబ్రాలకు పూజారి పర్వతపు శివప్రసాద్శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవానికి తరలించారు. అక్కడ ఆలయంలో తలంబ్రాలతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరికొన్ని తలంబ్రాలను తీసుకొచ్చి కల్యాణ వేడుకలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు తెలిపారు. గూడూరు: సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగించే గోటి తలంబ్రాలను భక్తులు శుక్రవారం గూడూరు నుంచి భద్రాచలం చేర్చారు. శ్రీరామ నవమికి ముందు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాల కోసం తరలిస్తారు. ఈ క్రమంలో గూడూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి భక్తులు ధాన్యాన్ని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. హిందూ జాగరణ సమితి, సేవికా సమితి మహిళలు అందరూ కలిసి గోటి తలంబ్రాలను భద్రాచల రాములవారి దేవాలయానికి చేర్చారు. హోలీ పండుగ సందర్భంగా అక్కడ రంగులు చల్లుకొని సంబురాన్ని పంచుకున్నట్లు మహిళలు తెలిపారు. -
పట్టపగలే యువకుడి దారుణ హత్య
జఫర్‌గఢ్: తన వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న యువకుడిని మరో గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కత్తితో పొడిచి చంపిన ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని తీగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తీగారం గ్రామానికి చెందిన గోనె యాదగిరి– ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు గోనె ప్రవీణ్ (28) ఇంటి వద్దనే ఉంటూ తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసిన అనంతరం ప్రవీణ్ నీళ్లు పెట్టేందుకు గ్రామ శివారులో ఉన్న తమ వరిపొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇదే మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామానికి ఆరుగురు యువకులు మూడు ద్విచక్రవాహనాలపై తీగారం గ్రామానికి చేరుకొని ప్రవీణ్‌ను అనుసరించారు. పొలం వద్ద ఒంటరిగా ఉన్న ప్రవీణ్‌పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో కడుపులో 5 పొట్లు పొడిచి అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. కత్తిపొట్లకు గురైన ప్రవీణ్ పెద్ద పెట్టున అరవడంతో కొద్దిదూరంలో ఉన్న సమీప బంధువులు రక్తపు మడుగులో ప్రవీణ్‌ను స్థానికులు, కుటుంబ సభ్యుల సాయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, యువకుడి హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. హోలీ పండుగ పూట గ్రామంలో యువకుడి హత్యతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునన్నట్లు ఎస్సై రామ్‌చరణ్ వెల్లడించారు. తీగారంలో హోలీ రోజున ఘటన భయాందోళనకు గురైన గ్రామస్తులు -
బతుకుదెరువుకోసం వచ్చి..
సంగెం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ భవననిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జిగురుమల్లి మండలం పాలేటిపాడు గ్రామానికి చెందిన కోయ బంగారు బాబు(34) తన భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి పొట్టకూటి కోసం సంగెం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా ఉంటూ.. భవన నిర్మాణ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనిపై తిమ్మాపూర్ గ్రామానికి తోటి మేసీ్త్ర ఉలవపాడుకు చెందిన పులగర శివమణి అలియాస్ మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి సంగెంకు వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి నెక్కొండ వైపునకు అరటిగెలలు తీసుకొచ్చేందుకు ట్రేలతో వెళ్లుతున్న బోలేరో అతివేగంగా అజాగ్రత్తగా సబ్‌స్టేషన్ సమీపంలో.. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బంగారు బాబుకు కుడి చేయి, కాలుకు, శివమణికి కుడి చేయి, కుడికాలుకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బంగారుబాబు మృతి చెందగా.. శివమణి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎంజీఎంలో పోస్టుమార్టమ్ అనంతరం బంగారుబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బోలేరో వాహనం తప్పించుకుని వెళ్లగా సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మేసీ్త్ర మృతుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా పాలేటిపాడు -
18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ హాస్పిటిల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్(హెచ్‌హెచ్‌సీఎం) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం(ఎల్ఎస్ఎస్బీ) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీఐసెట్‌లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న వారు అంబేడ్కర్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఆయా తేదీల్లో నిర్వహించే అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు అర్హత పరీక్ష, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్లు ఒకసెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పెర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అంబేడ్కర్ వర్సిటీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి మహిళ మృతి పర్వతగిరి: ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని హట్యతండా శివారు ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన బాదావత్ నేజి(78) గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి ఎస్సారెస్పీ కాల్వలోకి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నెక్కొండ మండలం బొల్లికొండ తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలి కన్పించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూపాలపల్లి అటవీ గ్రామాల్లో మరో పులి ? భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలూ పూర్, రాంపూర్ గ్రామాల మధ్య ఫార్టెస్టు అధి కారులు శుక్రవారం పులి పాదముద్రలు గుర్తించారు. కాటారం, మండలం జాదారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతంలో చెరువుకట్టపై ఈ నెల 12న ఆవుదూడను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించాయి. పాదముద్రలు వేరేనా..? శుక్రవారం కాటారం మండలం మేడిపలి, కొత్తపల్లి గ్రామాల మీదుగా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, కమలాపూర్ అటవీ గ్రామాల మధ్య పులి అడుగుజాడలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాటారం పులి పాదముద్రలు, ఈ పులి పాదముద్రలు సరిపోకపోవడంతో మరో ఆడ పులిగా అనుమానిస్తున్నారు. కాటారం మండలంలో మగ పులి, భూపాలపల్లి మండలలో ఆడ పులి తిరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లి అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామస్తులకు పులి కనపడిన, అటవీలో ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి పులులకు ప్రమాదాన్ని కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం సభకు సంబంఽధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభకు సంబంధించిన సభాస్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్–1, గ్రూ
చిరు వ్యాపారి బిడ్డకు మూడు ఉద్యోగాలు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిన్నహోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న డోలి వెంకటేశ్వర్లు –పద్మ దంపతులు. వారి కుమారై డోలి సంధ్య గ్రూప్–3లో 450 మార్కులకు 269.9 మార్కులతో 1,125 ర్యాంక్ సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ(ఏ) మహిళల విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. అయితే ఇప్పటీకే గ్రూప్–4లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మానుకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధుల్లో కొనసాగిస్తోంది. అదేవిధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సంధ్య 600 మార్కులకు 382.4 మార్కులతో 205 ర్యాంక్ సాధించింది. రాష్ట్రస్థాయిలో మహిళల విభాగంలో 16 స్థానం, బీసీ(ఏ)లో మహిళల విభాగంలో మొదటి ర్యాంక్ సాధించారు. గ్రూప్–2లో మంచి పోస్ట్ వస్తే ఆ ఉద్యోగంలో చేరుతానని చెబుతున్న సంధ్యను తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. గ్రూప్–3లో సత్తా చాటిన ప్రణీత్ కొడకండ్ల: గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభను చాటుకున్న కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెన్న ప్రణీత్ గ్రూప్–3 ఫలితాల్లో 285 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 395 ర్యాంక్‌ను సాధించి సత్తా చాటాడు. 2019లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రణిత్ సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఉండగా గ్రూప్స్ నోటిఫికేషన్లు రావడంతో వాటిపై దృష్టి సాఽరించాడు. గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణీత్ గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 138వ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభను చాటుకున్నాడు. నిరుపేద పద్మశాలీ కుటుంబానికి చెందిన ప్రణీత్ ఉత్తమ ర్యాంక్ పొందడంపై తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండుకు మించి ఉద్యోగాలుగ్రూప్స్లో మెరిసిన యువత -
కౌలురైతు ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ మృతిచిట్యాల: అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు సూర కుమారస్వామి (40) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన సూర కుమారస్వామి నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుపల్లి గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తెకు పెండ్లి చేశాడు. మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట వేశాడు. కుమార్తె పెండ్లికి తెచ్చిన అప్పుతోపాటు మూడు ఎకరాలలో వేసిన పంట సక్రమంగా పండకపోవడంతో రూ.12లక్షల వరకు అప్పులు అయ్యా యి. దీంతో గత నెల 19న పురుగుల మందు తాగా డు. కుటుంబసభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఈశ్వరయ్య పేర్కొన్నారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వెంకటేశ్వర్లపల్లిలో..
రేగొండ: పంట చేనుకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఇట్టబోయిన రవి (49) గురువారం అర్ధరాత్రి తన వ్యవసాయ బోరు వద్ద కరెంటు మోటార్‌ను ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. -
కోచింగ్ లేకుండానే..
జనగామ రూరల్: జనగామ మండలం సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి కేదారేశ్వర్‌రెడ్డి ఎలాంటి కోచింగ్లేకుండానే ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 112వ ర్యాంక్, గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కేదారేశ్వర్‌రెడ్డి సివిల్ సప్లయీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఈ సందర్భంగా కేదారేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేదారేశ్వర్‌రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో ముదిరా జ్, మత్స్యకారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజికవర్గాల బలోపేతం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా కోట్లాది రూ పాయల విలువైన మత్స్యసంపదను కోల్పోయి నష్టపోయిన ముదిరాజ్ మత్స్యకారులను ఆదుకునేందు కు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గల ముదిరాజ్ పెద్దలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా సీ ఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. గత ప్రభు త్వ విధానాల వల్ల కోకాపేటలో ముదిరాజ్‌లకు ఇచ్చిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవన నిర్మా ణం స్థల వివాదం కారణంగా నిలిచిపోయిందన్నా రు. మహిళా మత్స్యకార్మికులకు ఆర్థిక భరోసా క ల్పించేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్, తెలంగాణ మహజన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి దుండి వెంకటేశ్వర్లు, పిడుగు వెంకన్న, పెద్ది సైదులు, సందీప్, బాలాజీ, ఉప్పలయ్య, గోపాల్, వెంకన్న పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ -
ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తా..
● గ్రూప్–3 26వ ర్యాంకర్ అజయ్‌కుమార్ చిట్యాల: ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తానని గ్రూప్–2 స్టేట్ 43వ ర్యాంక్ సాధించిన నల్ల అజయ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల కోంరయ్య–నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన అజయ్ కుమార్ ఒకటి నుంచి పదో తరగతి వరకు మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో చదివాడు. ఇంటర్ హనుమకొండలోని శివానీ కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లో చదివాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్, కాళేశ్వరం జోన్లో 7వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2 ద్వారా వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెబుతున్నాడు.. అజయ్‌కుమార్. -
గ్రూప్–3లో స్టేట్ 57వ ర్యాంక్
బచ్చన్నపేట : మండల కేంద్రానికి చిమ్ముల అరుణ–మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండగా.. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 57వ ర్యాంక్ సాధించారు. గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్స్‌లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అప్రమత్తత తప్పనిసరి
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025 – 8లోu● వస్తు సేవల్లో మోసాలపై జాగ్రత్త అవసరం ● కొనుగోలు చేసే సమయంలో పరిశీలన ముఖ్యం నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం తొర్రూరు: నాణ్యమైన వస్తువులు, సేవలనూ పొందడం వినియోగదారుల హక్కు. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. చివరికి మనం తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండాపోతోంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాగా వినియోగదారులు మోసపోకుండా అండగా వినియోగదారుల రక్షణ చట్టం ఉంది. 1986 నుంచి ఇది అమలులో ఉండగా 2019లో మెరుగులుదిద్దారు. మార్పులతో ఏర్పడిన ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. చట్టం గురించి.. ● 34 ఏళ్ల నుంచి ఉన్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఏర్పాటైన రక్షణ చట్టం–2019 జూలై 20, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. ● వినియోగదారుల ఫిర్యాదులు వేగంగా పరిష్కరించుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. ● నూతన చట్టం ప్రకారం సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్థాపించారు. దీని ద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తున్నారు. ● వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌గా మార్చారు. ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే.. ● వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కటే ఉంది. ● నేరుగా ఫోన్లో ఫిర్యాదు చేసే వీలు ప్రస్తుతం లేదు. ● హనుమకొండ సుబేదారిలో కమిషన్ కార్యాలయం ఉంది. ● కమిషన్ కార్యాలయంలో వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సంబంధిత రశీదు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది. ● దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 180042500333 కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. కొనుగోలు విషయంలో సూచనలు.. కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చితంగా గమనించాలి. మందులు, ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. అవగాహన అవసరం కొనుగోళ్ల సందర్భంలో వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి. ఏ వస్తువు, సరుకులు కొనుగోలు చేసినా విధిగా రశీదు తీసుకోవాలి. అన్యాయం జరిగితే నష్టం పరిహారం, న్యాయం పొందడానికి ఈ రశీదు ఉపయోగపడుతుంది. బాధితులు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే వినియోగదారుల సమాచారం కేంద్రం ద్వారా న్యాయం లభిస్తుంది. –వింజమూరి సుధాకర్, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా కన్వీనర్ ప్రశ్నించారు.. గెలిచారు జిల్లాలోని చిన్నగూడూరుకు చెందిన రైతు రావుల రాంరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఓ కంపెనీకి చెందిన ఆడమగ వరి విత్తనాలు వేశాడు. అవి నాసిరకం కావడంతో పంట పూర్తిగా పోయింది. కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడంతో వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. బాధిత రైతుకు ఆ కంపెనీ రూ.5.60 లక్షల నష్ట పరిహారం చెల్లించింది. నర్సింహులపేటకు చెందిన రైతు నరసింహారెడ్డి, దాట్ల గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి కూడా ఇలాంటి కంపెనీల నుంచి రూ.7 లక్షల నష్టపరిహారం పొందారు. తొర్రూరు పట్టణానికి చెందిన పందెబోయిన సురేశ్ ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీలో చిట్ వేశాడు. కాలపరిమితి పూర్తయినా డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. సదరు సంస్థకు నోటీసులు అందించి చిట్టి డబ్బులు రూ.5లక్షలు ఇప్పించి బాధితులకు న్యాయం చేశారు. ఫిర్యాదు ఎలా చేయాలంటే... ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు. ఫిర్యాదుదారుడైనా, అతడి ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. పరిహారాన్ని బట్టి ఫోరం.. రూ.20 లక్షల వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్‌లో... రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి. కొనుగోలు చేసినా లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం తెలిపితే ఆపై సంవత్సరం కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
పల్లెరోడ్లకు మహర్దశ
మహబూబాబాద్ అర్బన్: వర్షంపడితే చిత్తడిగా మారుతున్న పల్లె రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లెందు, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల్లో 641 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.33.75కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా.. ఈనెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉంది. నెలాఖరులోగా.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను ఈనెలాఖరు వరకు వినియోగించుకొని పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. ఒక్కో సీసీ రోడ్డుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయించారు. రూ.5లక్షల లోపు నిధులు టెండర్ లేకుండా.. ఆపై నిధులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కాగా పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి.. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. జిల్లాలో మంజూరైన పనులు, నిధులు.. రూ.33 కోట్ల నిధులు మంజూరు నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిందే..మండలం పనులు మంజూరైన నిధులు మహబూబాబాద్ 49 రూ. 2.45కోట్లు నెల్లికుదురు 49 రూ. 2.45కోట్లు గూడూరు 45 రూ.2.30కోట్లు కేసముద్రం 47 రూ.2.20కోట్లు మరిపెడ 54 రూ.2.80 కోట్లు చిన్నగూడూరు 21 రూ.1.10కోట్లు నర్సింహులపేట 32 రూ.1.60కోట్లు దంతాలపల్లి 32 రూ. 1.60కోట్లు డోర్నకల్ 36 రూ.2.05కోట్లు కురవి 51 రూ.2.75కోట్లు తొర్రూరు 52 రూ.2.28కోట్లు పెద్దవంగర 37 రూ.1.75కోట్లు గార్ల 40 రూ.2కోట్లు బయ్యారం 43 రూ.2.15కోట్లు కొత్తగూడ 32 రూ.1.62కోట్లు గంగారం 21 రూ.1.05కోట్లు మొత్తం 641 రూ.33.75 కోట్లు -
అంబరాన్నంటిన హోలీ సంబురాలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతీ యువకులు పెద్దలు, వృద్ధులు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. కులమతాలకు అతీతంగా పాల్గొని నృత్యాలు చేస్తూ రంగులు పూసుకుని హోలీ ప్రత్యేకతను చాటారు. ఆడిపాడి హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. హోలీ పండుగ సందర్భంగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి డీజే పాటలకు నృత్యాలు చేసి సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల డీఎస్పీలు మోహన్, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, చంద్రమౌళి, సత్యనారాయణ, దేవేందర్, సర్వయ్య, రవికుమార్, రాజేష్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్, గణేష్, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు -
సభా వేదిక దేవన్నపేట!
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, బట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలపరిశీలన చేశారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజర య్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భా వించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులతో కలిసి హరీశ్‌రావు స్థల పరిశీలన చేశారు. ఎన్‌హెచ్ పక్కన ఉండటంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధి నేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరకు దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పా రు. స్థలపరిశీలన అనంతరం హరీశ్‌రావు సుమా రు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ తదితరులు సభ సక్సెస్‌కు త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ? -
రైల్వేస్టేషన్‌కు విద్యుత్కాంతులు
మహబూబాబాద్ రూరల్: అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నారు. పనులు పూర్తికానున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్ ఒకటో నంబరు ప్లాట్ ఫాం వైపున ప్రధాన ద్వారం పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా కొత్త శోభను సంతరించుకుంది. 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు కేయూ క్యాంపస్: కేయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్–మైల్ స్టోన్స్ ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ టి.రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవానికి హైకోర్టు పూర్వపు జడ్జి, ప్రస్తుత మహాదాయి వాటర్ ట్రిబ్యూనల్ జడ్జి పీఎస్ నారాయణ, తెలంగాణ హ్యూమన్ రైట్స్ పూర్వపు చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం హాజరవుతారని పేర్కొన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి.. హన్మకొండ: వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు, సీసీఐ సీనియర్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా.. ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిదారుడు ఇచ్చే గ్యారెంటీ, వారంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. వస్తువుల్లో నాణ్యతా లోపం ఉన్నప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు. నేడు, రేపు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నీకాయిట్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్, గోకారపు శ్యాంకుమార్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు 300 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభంకానున్న పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, విశిష్ట అతిథిగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కాంగ్రె్స్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు హాజరవుతారని వారు వివరించారు. -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
కాజీపేట మీదుగా ‘భారత్ గౌరవ్’ స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ‘భారత్ గౌరవ్’ సప్త జ్యోతిర్లింగ దర్శన స్పెషల్ ట్రైన్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ గురువారం తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విజయవాడలో రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ఉజ్జయినికి చేరుతుందన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శన చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ యాత్రలో భోజనం, హోటల్ గదులు, సెక్యూరిటీతో కూడిన ప్రయాణం ఉంటుందన్నారు. టికెట్ల ధర నాన్ ఏసీ రూ.20,980, థర్డ్ ఏసీ రూ.33,735, సెకండ్ ఏసి రూ.44,375 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఐఆర్సీటీసీటీఓయూఆర్ఐఎస్ఎం.కం లేదా 928030712, 9281030749 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. పేద విద్యార్థి కష్టానికి దక్కిన ఫలితం కురవి: నాన్న చిన్న తనంలోనే చనిపోయాడు.. అమ్మ కూలీ పనులు చేసి కొడుకును చదివించింది. అమ్మ పడిన కష్టాన్ని చిన్న తనం నుంచే చూసిన కొడుకు క్రమశిక్షణతో చదువుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఉద్యోగాలను ఒకే సారి దక్కించుకుని తల్లి కలను నెరవేర్చడంతోపాటు తాను పడిన కష్టానికి తగిన ఫలితం పొందాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి శివారు బీబీనాయక్‌తండా జీపీ పరిధి భూక్య తండాకు చెందిన భూక్య పవన్. భూక్య పార్వతి, (వెంకన్న, లేట్) కుమారుడు పవన్ గురువారం విడుదలైన ఎస్సెస్సీ, సీజీఎల్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించాడు. ఎస్సెస్సీలో ఎంటీఎస్(మల్టీ టాస్కింగ్ స్టాప్), సీజీఎల్‌లో టాక్స్ అసిస్టెంట్(సీబీఐసీ సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ టాక్స్స్ అండ్ కస్టమ్స్) ఉద్యోగాలు వచ్చాయి. పవన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బీబీనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10 తరగతి వరకు చింతపల్లి జెడ్పీ హైస్కూల్, ఇంటర్మీడియట్ మహబూబాబాద్ ప్రభుత్వ కాలేజీ, డిగ్రీ మానుకోట నలంద కాలేజీలో చదువుకున్నాడు. 18 కిలోల ఎండు గంజాయి స్వాధీనం ● ఇద్దరు మహారాష్ట్ర వ్యక్తుల అరెస్ట్ వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మహారాష్ట్రకు చెందిన షేక్ సాధిక్, షేక్ మక్సుద్ వద్ద నుంచి రూ.9లక్షల విలువైన 18కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకుర్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద రెండు బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పటుకుని తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. విచారించగా వరంగల్ రైల్వే స్టేషన్లో అమ్మడానికి వచ్చినట్లు తెలిపారని, దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి
కాజీపేట రూరల్ : ప్రపంచ శాంతి స్థాపనకు ప్రార్థించాలని ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల అన్నారు. ఫాతిమామాత ఉత్సవాల ముగింపులో భాగంగా హనుమకొండ జిల్లా కాజీపేట కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో గురువారం బిషప్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచయుద్ధాన్ని నిలిపివేసింది ఫాతిమామాతేనని, ఆమెను ప్రార్థించి శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఆఽధ్యాత్మికతో చేసే ప్రార్థన ఎన్నో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఫాదర్ ఆశీర్వాదం దివ్యబలిపూజతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్శంగా నిర్వహించిన బైబిల్ క్విజ్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేథిడ్రల్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు బొక్క దయాసాగర్, టామి, అల్లం ప్రకాశ్‌రెడ్డి, ఫాదర్లు కాసుమర్రెడ్డి, జి.అనుకిరణ్, కె.జోసెఫ్, విజయపాల్, తాటికొండ జోసెఫ్, జి.నవీన్, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొడుకుపెళ్లి కావడం లేదని మనస్తాపంతో.. ఓరుగల్లు పీఠకాపరి బిషప్ ఉడుముల బాల ముగిసిన ఫాతిమామాత ఉత్సవాలు -
ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు..
● వ్యక్తి దుర్మరణం.. భట్టుపల్లిలో ఘటన మడికొండ : కారు.. ఆగి ఉన్న ఆటోను ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట మండలం భట్టుపల్లి శివారులో జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు శ్రీనివాస్ (46)తన భార్య రమాదేవితో కలిసి వరంగల్‌కు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. భట్టుపల్లి మూడుచింతల వద్ద ఆటోను ఆపి కూల్‌డ్రింక్ తాగుతుండగా వరంగల్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఆపకుండా వెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇన్స్పెక్టర్ కిషన్ సిబ్బందిని కడిపికొండ, తరాలపల్లి గ్రామాలకు పంపించి వెతికించారు. తరాలపల్లి వద్ద కారు ముందు భాగం ధ్వంసమై ఉండడం గమనించి అందులో ఉన్న దామెర మండలం పులుకుర్తికి చెందిన గుర్రాల దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ జారీ
కేయూ విద్యా కళాశాలలో అవకతవకలు ● రూ. 8 లక్షలకు పైగా మాజీ ప్రిన్సిపాల్ చేతివాటం ● గుట్టు రట్టు కావడంతో మళ్లీ అకౌంట్లో జమ ● షోకాజ్ నోటీస్ జారీ చేసిన రిజిస్ట్రార్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఆ కళాశాలలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందగా ఉన్న ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయలత కొంత కాలం క్రితమే హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియామకమైంది. దీంతో రెండున్నరేళ్ల క్రితం అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా రెండు బాధ్యతలు అప్పగించారు. దీంతో అందొచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకున్న సదరు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అవకతవకలకు పాల్ప డుతున్నారని కొన్నినెలల క్రితమే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించగా ఆయన మళ్లీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలోని బీఓ ఎస్ అకౌంట్లోని రూ. 8 లక్షలకుపైగా డబ్బును ప్రిన్సిపాల్, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ హాంఫట్ చేశారనే అంశం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది. ఆ విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బీఓఎస్ అకౌంట్ కేయూ పరిధిలోని ఏ కాలేజీల్లో లేని విధంగా క్యాంపస్‌లోని విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్( బీఓఎస్) పేర బ్యాంకులో అకౌంట్ తీసి వినియోగిస్తున్నారనే విషయం ఇప్పుడు వెల్లడియింది. ఏ నిధులు జమచేయిస్తున్నారనే విషయంపై స్పష్టత లేకున్నా మొత్తానికి అందులో రూ. 8లక్షలకు పైగా ఉండగా ఆ డబ్బును ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వినియోగించుకున్నారని తాజాగా వెలుగు చూసింది. మాజీ ప్రిన్సిపాల్ గుట్టు ఇలా రట్టు.. కేయూలో విద్యా కళాశాలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తొలగించాక ప్రొఫెసర్ వి. రామచంద్రంను ఆ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా, ఇఫ్లూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయలతను విద్యా కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. దీంతో ఆమె ఫిబ్రవరి 1న బీఓఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీఓఎస్ అకౌంట్ గురించి ఆమె.. సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వివరాలు అడగగా తెలియజేసేందుకు జాప్యం చేశారు. దీంతో ఆమె.. వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇటీవలే కేయూ సోషల్ సైన్స్‌డీన్ మనోహర్‌ను విద్యాకళాశాలకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించాక ఆ కళాశాలలోని పలు అవకతవకలపై ఆరాతీసినట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్లోని డబ్బులు కూడా అప్పటి బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ వినియోగించుకున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో తనపై చర్యలు తీసుకుంటారని భావించిన అవతకవకలకు పాల్పడిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ కొద్దిరోజుల క్రితమే తాను బీఓఎస్ అకౌంట్ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి మళ్లీ కేయూ రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్లోకి జమచేశారు. ఈ విషయాన్ని ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్ నిధులు వినియోగించుకోవాలంటే వీసీ అప్రూవల్ మేరకు వ్యయం చేయాల్సింటుంది. సొంతానికి వినియోగించుకోకూడదు. ఇప్పుడు వర్సిటీలో ఇది హాట్‌టాపిక్‌గామారింది. కేయూ విద్యాకళాశాల మాజీ ప్రిన్సిపాల్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీస్ జారీచేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవహారంపై అధికారులు విచారణ కమిటీ వేస్తారా లేదా అతడిపై చర్యలు తీసుకుంటారా అనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రంను గురువారం ‘సాక్షి’ వివరణ కోరగా ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బీఓఎస్ అకౌంట్ రూ. 8.50లక్షలు నుంచి తీసుకున్నారనే విషయం వెలుగు చూసిందన్నారు. రూ. 8.75లక్షలు రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్లోకి జమచేశారని తన దృష్టికి వచ్చిందన్నారు. రూ. 25 వేలు వడ్డీ చెల్లించానని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ చెబుతున్నారన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీచేశాం.. అతడు ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయన్నారు. -
టెక్నాలజీతో మార్పులు అనివార్యం
● కేయూ మాజీ వీసీ వెంకటరత్నం కేయూ క్యాంపస్: టెక్నాలజీతో మార్పులు అనివార్యమని, టెక్నాలజీని స్వాగతించినప్పుడే వ్యాపార సంస్థల మనుగడ సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ బి. వెంకటరత్నం అన్నారు. కేయూలోని కామర్స్అండ్బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ‘న్యూహరిజన్స్ ఇన్కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ 21ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వెంకటరత్నం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫైనాన్షియల్ సెక్టార్లో మార్పులు చాలా ప్రభావం చూపాయన్నారు. మార్పుతోపాటే వచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొవాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభమైనప్పటికీ విలువలతోకూడిన ఆ వ్యాపార ప్రపంచం అవసరమన్నారు. విద్యార్థులు నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. గౌరవ అతిథి కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ విస్తృత అవకాశాలు అందించిందన్నారు. ఇ–కామర్స్ లావాదేవీలు పెరిగాయన్నారు. ఉత్పాదకత, ఉద్యోగిత పెరిగిందన్నారు. వినియోగదారుడు కేంద్రంగా వ్యాపార వ్యవస్థ ఉందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి. అమరవేణి, ఆచార్యులు నర్సింహాచారి, పి. వరలక్ష్మి, రాజేందర్, నిరంజన్, శ్రీనివాస్, ఎం. గిరిప్రసాద్ మాట్లాడారు. మోడరేటర్లుగా ఇ. రాజు, సాయిశరణ్, ఎం. కనకయ్య వ్యవహరించారు. -
హోలీ.. ఆనందాల కేళి
మహబూబాబాద్ రూరల్: హోలీ పండుగ అంటేనే సప్తవర్ణ శోభితం.. ప్రకృతిలో లభించే వివిధ రకాల చెట్ల పూలనుంచి తయారు చేసిన రంగులను చల్లుకుంటూ వసంత రుతువు ప్రారంభంలో చేసుకునే పండుగ. ఈ పండుగలో వివిధ కృత్రిమ రసాయనిక ఎరువులు వాడడం వల్ల దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందుకే రసాయన రంగులు పులుముకోకుండా సహజసిద్ధ కలర్లే చల్లుకుని పండగును ఆనందంగా జరుపుకోవాలని అధికారులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ● కృత్రిమ రంగు.. నలుపులో లెడ్ ఆకై ్సడ్ మూత్ర పిండాల వైఫల్యాలకు దారితీస్తుంది. ● కృత్రిమ ఆకుపచ్చ రంగు.. కాపర్ సల్ఫేట్ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది. ● వెండి రంగు.. అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ కారకం. ● నీలి రంగు.. పుసియన్బ్లూ చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్ (ఎరుపు) క్యాన్సర్‌కు కారణమవుతాయి. ● పౌడర్లు, గులాల్.. లెడ్, బ్రోమియం, నికెల్, మెర్క్యురీ, కాపర్, జింక్, వినిడికి లోపం, ఎలర్జీ, ఆయసం మొదలగు దుష్పలితాలకు దారితీస్తాయి. ముఖ్యంగా యువత ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునే తీరుతో ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రంగులు చల్లుకుని చెరువులు, కుంటలు, సెలయేర్లలో స్నానాలు చేయడం వల్ల ఈ విషపూరిత రసాయనాలు అందులో కలిసి అనేక జీవజాతులు నాశనం అవుతున్నాయి. రంగులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలి. ● సహజ రంగుల తయారీ ఇలా.. ● ఎరుపు రంగు కోసం ప్రకృతిలో లభించే బీట్రూట్, మొదుగు పూలు, గులాబీ, మందారం వాడాలి. ● పసుపు రంగు కోసం పసుపు, ఆకుపచ్చ రంగు కోసం ఆకుకూరల మిశ్రమం ఇలా సహజ రంగులను వాడడం మనకే కాదు పర్యావరణానికి కూ డా మంచిది. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవ చ్చు. సహజ రంగుల్లో లభించే యాంటీ యాక్సిడెంట్లు చర్మవ్యాధులను నియంత్రించి, చర్మం మృదువుగా, తేజోవంతంగా తయారవుతుంది.రసాయన రంగులు వద్దు.. సహజసిద్ధ కలర్లే ముద్దు నేడు హోలీ పండుగ సహజ సిద్ధ రంగులు వాడాలి సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులనే వాడాలి. ప్రజలు రసాయన రంగులు చల్లడం మానుకుని అనారోగ్యంగా ఉండాలి. హోలీ పండుగను పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నెహ్రూ సెంటరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – లింగంపల్లి దయానంద్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతిలో లభించే పూ లు, ఆకులు, ఇతరత్రా వా టితో తయారయ్యే రంగులను వినియోగించి ఆరో గ్యాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కూడా కా పాడిన వారమవుతాం. హోలీ వేడుకల్లో సహజరంగులనే వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది. – వూరె గురునాథరావు, దిశ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు -
అతిగా మద్యం సేవించి యువకుడి మృతి
గార్ల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం గార్ల సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఎస్సై ఎస్కె.. రియాజ్‌పాషా కథనం ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ జిల్లాకు చెందిన మాకి శ్రీనివాస్(35) గార్ల మండలం బుద్దారం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద కూలీ పనులకు వచ్చాడు. నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా.. భోజనం చేయకుండా నిత్యం మద్యం సేవిస్తున్నాడు. దీంతో నీరసంతో కుప్పకూలాడు. తోటి కూలీలు శ్రీనివాస్‌ను హుటాహుటిన 108లో గార్ల సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు నాగభూషణం ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
బస్సులో వెళ్లినా బతికేవారేమో!
ఖానాపురం: అమ్మా, పెద్దమ్మా.. బస్సులో వెళ్లినా బతికేవారేమో.. లోపలికి వెళ్తాం.. దేవాలయం వద్ద కారు ఆపమన్నప్పుడు ఆపినా బతికేవారేమో అంటూ మృతదేహాల మీద పడి కుమారులు, కుమార్తె రోదించిన తీరు పలువురిని కంటతడికి గురి చేసింది. టైర్ పగిలి కారు పల్టీకొట్టి డివైడర్‌ను ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథ నం ప్రకారం.. ఖిలావరంగల్‌కు చెందిన ఏసిరెడ్డి యశోద(80), బోలుగొడ్డు మాణిక్యమ్మ(78) అక్కాచెల్లెలు. కుటుంబ సభ్యులతో కలిసి మహబూ బాబాద్ జిల్లా కురవిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కాచెల్లెలు బస్సులో వెళ్దామని అనుకున్నారు. ఇదే కార్యానికి వచ్చిన యశోద కుమారుడు రమేశ్ కారులో వెళ్దామని చెప్పాడు. దీంతో యశోద, మాణిక్యమ్మ కుమార్తె అనిత, కుమారుడు హరీశ్‌బాబు, మాణిక్యమ్మ కారులో బయలుదేరారు. కురవిలో దేవాలయం వద్ద ఆగుదామనుకున్నారు. కానీ ఆలస్యమవుతుందనే కారణంతో ఆగకుండా ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఖానా పురం మండలం ఐనపల్లి శివారులోని పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే కారు వెనుక టైర్ పగిలింది. దీంతో అదుపుత ప్పి దూసుకెళ్లే క్రమంలో మరో టైర్ పగిలి పల్టీకొడుతూ జాతీయరహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అక్కాచెల్లెలతో పాటు కారు నడుపుతున్న రమేశ్, అనిత, హరీశ్‌బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యశోద, మాణిక్యమ్మ మృతిచెందారు. మృతదేహాలను నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, నర్సంపేట రూరల్ సీఐ సా యిరమణ, ఎస్సై రఘుపతి సందర్శించి వివరాలు సేకరించి పోస్టుమార్టం తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. అక్కాచెల్లెలు మృతి చెందడంతో ఖిలావరంగల్‌లో తీవ్ర విషాదం నెలకొంది.మాణిక్యమ్మ(ఫైల్) టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొన్న కారు అక్కాచెల్లెలు దుర్మరణం.. ముగ్గురికి స్వల్ప గాయాలు ఖానాపురంలో ఘటన -
కిడ్నీ పదిలమేనా..?
నెహ్రూసెంటర్: మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. వాటిని రక్షించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఈమేరకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా బీపీ, షుగర్, అధికంగా పెయిన్‌కిల్లర్ టాబ్లెట్స్ విని యోగం, పాయిజన్ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, వ్యాయామం చేయడం, సరిపడా నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గించుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బాధితులు.. జిల్లాలో 590పైగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉంటారని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలున్న వారికి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా కిడ్నీలపై అవగాహన పెంచడంతో పాటు, వాటి ప్రాముఖ్యతను చెప్పేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న రోగులు... మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు, టాబ్లెట్ల వినియోగం, అధికంగా మద్యం సేవించడం వంటివి కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో బీపీ, షుగర్ బాధితులతో పాటు కిడ్నీ బాధితులు కూడా పెరుగుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఏడాదికోసారి ఆరోగ్య పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీజీహెచ్‌లో డయాలసిస్ సేవలు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 80 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలను అందజేస్తున్నారు. ఇటీవల మరో అదనపు 5 బెడ్లను ప్రారంభించడంతో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే బాధితులకు కొంత ఉపశమనం దక్కింది. పెరుగుతున్న రోగుల దృష్ట్యా మరికొన్ని అదనపు బెడ్స్ అందించి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి. ప్రతీ రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్‌ను అదుపు చేసుకోవాలి. చనిపోయేందుకు పాయిజన్ తీసుకున్న వారిలో అధికంగా కిడ్నీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. – డాక్టర్ హరిప్రసాద్, మూత్ర పిండాల వైద్య నిపుణులు రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
బైక్‌ను తప్పించబోయి.. ట్రాలీ ఆటో బోల్తా
నడికూడ/కమలాపూర్ : కూలీలను తరలిస్తున్న ఓ ట్రాలీ ఆటో..ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్రంగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పరకాల ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన 38 మంది పరకాల మండలం మల్లక్కపేటలో కూలీకి వెళ్లారు. పనులు ముగించుకుని మధ్యాహ్నం ట్రాలీ ఆటోలో తిరిగి స్వగ్రామం బయలుదేదారు. ఈ క్ర మంలో నడికూడ మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఇదే మండలం చర్లపల్లికి చెందిన రావుల కొమురుమల్లు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ట్రాలీ ఆటోకు అడ్డు రావడంతో డ్రైవర్ అతడిని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులందరినీ 108లో కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన ఐదుగురితో పాటు స్వల్ప గాయాలైన 10 మందిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. 22 మందికి గాయాలు నడికూడ మండల కేంద్రంలో ఘటన -
మానవ మేధస్సుతోనే అద్భుతాలు
కేయూ క్యాంపస్: మానవమేధస్సుతోనే అద్భుతా లు సృష్టించగలమని, కృత్రిమ మేధాను ఒక టూల్‌గా వినియోగించుకోవాలని కాకతీయ యూనివర్సి టీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్ మెంట్ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సహకారంతో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రా రంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ‘న్యూ హారిజన్స్ ఇన్కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ 21 ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై వీసీ ప్ర తాప్‌రెడ్డి మాట్లాడుతూ మార్పు సహజమని, అయి తే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వినియోగదారుడికి లాభకారిగా ఉండాలేగాని మోసగించేలా ఉండొద్దన్నారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘన్శ్యాంసోలంకి మాట్లాడుతూ వినియోగదారుడు టె క్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏపీలోని గుంటూరులోని నాగార్జున యూ నివర్సిటీ కామర్స్ విభాగం డీన్ కె. శివరామ్ మా ట్లాడుతూ కృత్రిమ మేధా నేపథ్యంలో వ్యాపార వ్యవహారాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఓయూ రిజిస్ట్రార్ జి. నరేశ్‌రెడ్డి, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు వి. అప్పారావు, వరంగల్ జెన్పాక్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్, ఇండియన్ అకౌంటింగ్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ బయ్యని, సెమినార్ డైరెక్టర్ అమరవేణి మాట్లాడారు. ఈ సదస్సులో కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, ఎస్. నర్సింహాచారి, సదస్సు కన్వీనర్ ఫణీంద్ర, కోకన్వీనర్ బి. ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 70 పరిశోధన పత్రాల సమర్పించబోతున్నారు. నేటి సాయంత్రం ఈ సదస్సు ముగియనుంది. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
మావోయిస్టు కొరియర్లు, మిలీషియా సభ్యుల అరెస్ట్
ఏటూరునాగారం : సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లు, ఇద్దరు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో వారి అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. వాజేడు పోలీసులు వాజేడు మండలం మురుమురు గ్రామం వద్ద ఈనెల 11వ తేదీన సాయంత్రం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా పేలుడు సామగ్రి, కార్డెక్స్ వైర్, డిటోనేటర్స్, టిఫిన్‌బాక్స్, బ్యాటరీలు, కొంత మెడిసిన్‌తోపాటు కొన్ని వస్తువులు లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన ఈరెల్లి నాగరాజు సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా, ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు గ్రామం బర్లగూడెం పంచాయతీకి చెందిన మడివి పాండు, మడవి బీమా మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు. వీరు మావో యిస్టులకు నిత్యావసర వస్తువులు, ఐఈడీల తయారీలో ఉపయోగించే పేలుడు సామగ్రిని అందించేవారు. ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలను పార్టీ కి చేరవేసే వారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, వాజేడు, వెంకటాపురం ఎస్సైలు రాజ్‌కుమార్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
భద్రకాళీనగర్‌లో చోరీ
హసన్‌పర్తి: 56వ డివిజన్ గోపాలపురం భద్రకాళీ నగర్లో చోరీ జరిగింది. దుండగులు రెండిళ్లలో సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదుతో పాటు తొమ్మిది లక్షల విలువైన బాండ్లు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు ఒకే కాలనీలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. భద్రకాళీనగర్కాలనీకి చెందిన పాతి ధర్మయ్య, స్రవంతి దంపతులు ప్రభుత్వ అధ్యాపకులు. ధర్మయ్య ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, స్రవంతి ఐనవోలులోని కస్తూర్బాలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ధర్మయ్య ఖమ్మం, స్రవంతి ఐనవోలు వెళ్లారు. అరోజు రాత్రి ఖమ్మంలో జరిగిన బంధువుల పెళ్లికి ధర్మయ్య హాజరయ్యాడు. ఇంటర్ పరీక్ష ఉండడంతో స్రవంతి ఐనవోలులోనే ఉంది. బుధవారం ఉదయం ఇద్దరూ ఇంటికి వచ్చారు. తలుపు తాళాలు ధ్వంసమై కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారం, రూ.లక్ష నగదుతోపాటు తొమ్మిది లక్షల రూపాయల విలువైన బాండ్ల మాయమయ్యాయి. అలాగే, అదే కాలనీకి చెందిన ఆకుల వెంకటేశ్వర్ల ఇంటిలో కూడా చోరీ జరిగింది. ఆరుతులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం వెంకటేశ్వర్లు దంపతులు అమెరికాకు వెళ్లారు. విషయం తెలియగానే హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్వర్ల కూతురు హుటాహుటిన గోపాలపురానికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ఇన్‌స్పెక్టర్ సుంకరి రవికుమార్ తెలిపారు. 26 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు మాయం -
ఎరుపెక్కుతున్న ఏనుమాముల..
వరంగల్ మార్కెట్‌కు పెద్దఎత్తున తరలొస్తున్న మిర్చివరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్రబంగారం పెద్ద ఎత్తున తరలివస్తోంది. తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న మిర్చి పంటతో మార్కెట్ ఎరుపెక్కుతోంది. మిర్చి సీజన్ డిసెంబర్లో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ఊపు అందుకుంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన (మంగళవారం) సుమారు 85వేల బస్తాల వరకు వచ్చినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. మార్చి 10వ తేదీ నాటికి 12,64, 243 బస్తాల్లో 5,05,005 క్వింటాళ్లు వచ్చింది. తేజ, వండర్‌హాట్, యూఎస్ 341, డీడీ, దీపిక, దేశీ, సింగిల్ పట్టీ, 1048, తాలు, ఎల్లో మిర్చితో పాటు సుమారు 20 రకాల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు వరంగల్ మార్కెట్ పరిధిలో ఉన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రైతులు వరంగల్ మార్కెట్‌కు తమ పంటను తీసుకొస్తారు. వరంగల్ మార్కెట్ పరిధిలో 25 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా ఈఏడాది మరో రెండు అందుబాటులోకి వచ్చాయి. ఈకోల్డ్స్టోరేజీల్లో సుమారు 26 లక్షల బస్తాలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో మార్కెట్ తీసుకొచ్చిన మిర్చిని ఈ కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో రైతులు వరంగల్ మార్కెట్‌కు అన్నిరకాల మిర్చి పంటను తరలిస్తారు. కాగా, సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు 12 లక్షల క్వింటాళ్లు మిర్చి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు మరింత సరుకు రైతులు మిర్చి సా గు చేసినా తెగుళ్లు, ఇతర కారణాలతో పలు ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గాయి. ఈ కారణంతోనే మార్కెట్‌కు గతేడాది కంటే కొంత వరకు తక్కువ వచ్చింది. సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు గతేడాది వచ్చినంత సరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. –గుగులోత్ రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, వరంగల్ సోమవారం నాటికి 12,64,243 బస్తాల్లో 5,05,005 క్వింటాళ్ల రాక ఖమ్మం మార్కెట్‌కు తరలిన ‘తేజ’ రకం? ఈ సీజన్ చివరి నాటికి 12 లక్షల క్వింటాళ్ల మిర్చి వస్తుందని అధికారుల అంచనా 2022–23 2023–24 2024–25 బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు డిసెంబర్ 19,265 7,704 55,882 22,422 1,23,463 48,671 జనవరి 1,32,564 53,025 3,07,439 1,24,163 2,28,293 91,341 ఫిబ్రవరి 6,23,169 2,49,267 6,71,920 2,68,769 5,79,553 2,31,819 -
మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం
కేయూ క్యాంపస్ : మానవుడి మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ ముగింపు సభలో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకాలజీ, ఇమ్యూనాలజీ కలిసి పనిచేస్తేనే మానసికంగా ధైర్యంగా ఉండే వ్యక్తుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారన్నారు. బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేస్తున్న కొత్త ఔషధాలు, థెరఫీలు,డిప్రెషన్ యాంగైజటీ, న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల (పార్కిన్సన్,అల్జీమర్స్) చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయన్నారు. జున్యు ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య డేటా అందుబాటులోకి రావడం ప్రైవసీ ఎథికల్ (నైతిక ) సమస్యలకు దారితీస్తుందన్నారు. ఇది వ్యక్తుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశంపై సమగ్రపరిశోధనలను సమాజ అభివృద్ధికి, మానవ ఆరోగ్యపెంపునకు ఉపయోగపడేలా అన్వయించాలన్నారు. నూతన ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య, హైదరాబాద్ ఎన్ఐఎన్ ప్రొఫెసర్ రాజేందర్, యూనివర్సిటీ కాలేఈ ప్రిన్సిపాల్ టి. మనోహర్, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, దూరవిద్య కేందం డైరెక్టర్ బి. సురేశ్‌లాల్, జువాలజీ విభాగం అఽధిపతి జి. షమిత, ప్రొఫెసర్లు ఈసం నారాయణ, మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. వందకుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
‘సుగంధ శ్రీ’ ని వినియోగించుకోవాలి
మామునూరు: రైతులు ‘సుగంధ శ్రీ’ పథకాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట సూచించారు. ఖిలావరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే కోఆర్డి నేటర్ రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 1.67 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం, అలాగే నాణ్యత ప్రమాణాలను పెంచాలన్నారు. మిరప, పసుపు, అల్లం వంటి పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సుగంధద్రవ్యాల సంస్థ రూపొందించిన బుక్ లెట్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు రాజు, వేణుగోపాల్, ఉద్యాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సుగంధ ద్రవ్యాల సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట -
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuజిల్లాలో విద్యుత్ ప్రసరించే తీగలతో చేపలను వేటాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదమని తెలిసినా విద్యుత్‌తో చెలగాటమాడుతూ మృతి చెందుతున్నారు. కాగా విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం, విద్యుత్ తీగలతో చేపలు పడుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, మహబూబాబాద్చేపల వేటకు విద్యుత్ తీగల వినియోగం ● కరెంట్ షాక్‌తో పలువురి మృతి ● అడవి జంతువుల వేటలో మరికొందరు.. ● విద్యుత్ ప్రమాదాలపై కొరవడిన అవగాహన విద్యుత్ వైర్లతో చేపలు పడుతూ చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 12న నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన దండి ఉప్పలయ్య(45) చేపలు పట్టేందుకు వెళ్లి తెల్లవారేసరికి విద్యుత్ షాక్‌తో విగత జీవిగా మారాడు. దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మార్చి 4న మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం స్టేజీ వద్ద నివాసం ఉండే జర్పుల కోట–అరుణ దంపతుల కుమారుడు శశి(20) చేపల వేటకు వెళ్లి తాను పట్టుకున్న విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మార్చి 8న నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్(21), భూక్య రాములు(45) విద్యుత్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలకోసం పెట్టే విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరిని కాపాడబోయి మరొకరు ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలు బయటకు తెలిసినవి మాత్రమే.. గుట్టుచప్పుడు కాకుండా శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయని ప్రచారం. ఆయా మండలాల్లో.. జిల్లాలో నర్సింహులపేట, చిన్నగూడూరు, గూడూరు, నెల్లికుదురు, మరిపెడ, కురవి, సీరోలు మండలాల్లో తరచూ విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాతపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు గూడూరు, బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల్లో పంట చేలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ వైర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ వైర్లు అమర్చుతారు. కాగా గత ఏడాది ఆవిద్యుత్ వైర్లకు తగిలి ఎనిమిది మంది మృతి చెందినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. అవగాహన లేకనే .. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఆశాఖ వ్యవసాయ సీజన్ ప్రారంభం జూన్ మొదటివారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు, విద్యుత్ వినియోగదారుల సమావేశాలు, ప్రమాదాల నివారణకోసం అవగాహన కార్యక్రమాలు, పొలం వద్దకే వెళ్లి రైతులతో మమేకమై విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే జిల్లాలో కొన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మరికొన్ని చోట్ల మొక్కుబడిగా చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు జనాలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండడం లేదు. ఈ క్రమంలో విచ్చలవిడిగా విద్యుత్ వైర్లు అమర్చి చేపలు, అడవి పందులను పట్టే సమయంలో జనాలు మృత్యువాత పడుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న దేవేందర్ న్యూస్రీల్రెండేళ్లలో విద్యుత్ షాక్‌తో మరణించిన మనుషులు, జంతువులు సంవత్సరం మనుషులు జంతువులు మొత్తం 2023-24 37 74 1112024-25 29 81 110అవగాహన కార్యక్రమాలు పెంచుతాం.. చేపలు, అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లను వినియోగించి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలకు కారణాలు తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులతో చర్చించి తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. – నరేశ్, ఎస్ఈ, మహబూబాబాద్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన బొల్లెబోయిన సంపత్ (26) జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన సంపత్.. సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా సాలార్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సంపత్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సంపత్ తండా వద్ద రోడ్డుపై పశువు అడ్డంరాగా దానిని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడని కొందరు పేర్కొనగా.. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఘటనా స్థలిని టౌన్ సీఐ దేవేందర్, టౌన్ ఎస్సైలు విజయకుమార్, అలీమ్ హుస్సేన్ సందర్శించారు. మృతుడికి భార్య అఖిల, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాలార్ తండా వద్ద ఘటన -
తేనెటీగలను పరిరక్షించుకోవాలి
గూడూరు: ప్రస్తుతం తేనె వినియోగం పెరిగిందని, తేనెటీగలు అంతరించిపోకుండా పరిరక్షించుకోవాలని డాక్టర్ సునీత అన్నా రు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నేషనల్ బి బోర్డు ఆర్థిక సహకారంతో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై రైతులకు జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు నువ్వులు, ఆవాలు, కుసుమ, కంది పొలాల్లో తేనెటీగల పెట్టెలను అమర్చి లాభాలను పొందవచ్చన్నారు. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన, స్వచ్ఛమైన తేనె దొరుకుతుందన్నారు. అంతటా తేనె వినియోగం పెరిగిందని, ఉత్పత్తి జరగడంలేదన్నారు. అందుకే ప్రభుత్వం కూడా తేనెటీగల పెంపకం, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త పి.రజనీకాంత్, గూడూరు డివిజన్ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, డీఏఓ విజయనిర్మల, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ అబ్దుల్మాలిక్, ఏఈఓ వినయ్, శ్రీనేచురల్ హానీ ఫౌండర్ సంజన, రైతులు పాల్గొన్నారు. -
కనుల పండువగా
ఫాతిమామాత ఊరేగింపు..కాజీపేట రూరల్ : ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవంలో రెండో రోజు బుధవారం ఫాతిమామాత స్వరూపంతో మహా రథప్రదక్షిణ ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ఫాతిమాకేథిడ్రల్ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల ఫాతిమామాత స్వరూపం 24 ఫీట్ల రథయాత్రకు ప్రత్యేక ప్రార్థన , దూపం వేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం చర్చి ప్రాంగణం నుంచి ఫాతిమా మెయిన్ రోడ్, దర్గా వీధుల గుండా ఊరేగింపు కొనసాగిస్తూ తిరిగి చర్చి ప్రాంగణం వరకు సాగింది. ఇక్కడ బిషప్ ఉడుములబాల దివ్య ప్రసాద ఆశీర్వాదంతో ఊరేగింపు ముగిసింది. చర్చి ప్రాంగణంలో భక్తుల కొవ్వొత్తుల ప్రదర్శనతో ఫాతిమామాతను వేడుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ ఉడుముల బాల సందేశమిస్తూ ప్రజలందరిపై ఫాతిమామాత దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెఇపారు. కర్నూల్ పీఠం ఫాదర్ జెరువా జోజిరెడ్డి దివ్యబలిపూజను సమర్పించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఫాదర్ కాసు మర్రెడ్డి, కె.జెసెఫ్, టి.జోసెఫ్, జి.అనుకిరణ్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాతకు భక్తుల ప్రార్థనలు.. ఫాతిమామాత గుహ వద్ద తిరునాళ్ల మహాత్సవానికి తరలి వచ్చిన భక్తులు ప్రార్థనలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించి, కానుకలు వేసి తమ కోర్కెలు కోరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఫాతిమానగర్ ప్రాంతం ఎటు చూసిన సందడిగా మారింది. కేథిడ్రల్ చర్చి నుంచి సాగిన మహా రథప్రదక్షిణ ప్రదక్షిణలో సందేశమిచ్చిన బిషప్ ఉడుముల బాల -
విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు
● సైయంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీ.మోహన్‌రెడ్డి కాజీపేట అర్బన్ : విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసిన తరుణంలోనే నూతన ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని సైయంట్ కంపెనీ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీ.మోహన్‌రెడ్డి తెలిపారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ–అకాడమీ ఇన్నోవేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కంప్యూటర్ జ్ఞానం, కమ్యూనికేషన్, సెన్సార్లు, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా 47 సంస్థలకు చెందిన 80 వివిధ పరిశ్రమల నిపుణులు ఆవిష్కరించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ప్రొఫెసర్లు శిరీష్ సోనావానే, సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. గ్రూప్–2లో మహిళా విభాగంలో సాయిచందనకు 9వ ర్యాంకుకమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన మిల్కూరి రవీందర్, అరుణ దంపతుల కూతురు సాయిచందన ఇటీవల విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో మహిళా విభాగంలో 9వ ర్యాంకు సాధించింది. 386.11 మార్కులు సాధించిన సాయిచందన జనరల్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు సాధించింది. ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న సాయిచందన కుటుంబం ప్రస్తుతం కాజీపేటలో నివాసం ఉంటోంది. కాగా, సాయిచందన గ్రూప్–1లో కూడా 453 మార్కులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్వే రెమ్యునరేషన్ చెల్లించాలి వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునేషన్ చెల్లించాలని టీపీటీఎఫ్, జీటీఏ జిల్లా అధ్యక్షులు యూ.అశోక్, టి.ప్రకాశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలు గడిచినా రెమ్యునరేషన్ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ కాశిబుగ్గలోని కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శనలో బాలవద్దిరాజు, కే.ఉమేశ్, హరిప్రసాద్, కృష్ణమూర్తి, అశోక్, సునీల్‌కుమార్, సిద్దేశ్వర్, జోసెఫ్, శ్రీధర్, శ్రీవాణి, జ్యోతి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో ఉండాలి
మహబూబాబాద్ రూరల్: వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి క్లస్టర్ పరిధిలోని సండ్రలగూడెం రైతు వేదికను డీఏఓ విజయనిర్మల బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ యాసంగిలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వ్యవసాయ సాంకేతిక అధికారి రాజు, ఏఈఓ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. పరిష్కారం చూపాలి గూడూరు: రైతు వేదికలో రైతులకు పంటల సాగు, చీడపీడల నిర్మూలనకు అవసరమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అధికారులకు సూచించారు. మండలంలోని బొద్దుగొండ రైతు వేదికను బుధవారం ఆమెతో పాటు మహబూబాబాద్ ఏడీఓ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాల రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్మాలిక్, బొద్దుగొండ ఏఈఓ మనోజ్‌కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కేయూ క్యాంపస్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్‌పాండె అన్నారు. బుధవారం హనుమకొండలోని సుబేదారి యూ నివర్సిటీ ‘లా’ కళాశాలలో సెమినార్‌హాల్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు.. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు అవకాశాలు వస్తే పురుషులకు తీసిపోకుండా సమానంగా ఎ దుగుతారన్నారు. మహిళలు న్యాయం రంగంలో నూ ప్రతిభ చాటాలన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ మాట్లాడారు. న్యాయకళాశాల అధ్యాపకులు ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. క్షమాదేశ్పాండెను సన్మానించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్‌పాండె -
రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంకు
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతు రు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మా ర్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించారు. గ తంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యారు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంకుసాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాక ర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రిజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునీత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
కిక్కిరిసిన రైల్వేస్టేషన్
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 2వేల మందికి పైగా మహారాష్ట్రకు చెందిన కూలీలు తరలిరావడంతో రైల్వేస్టేషన్ జనసంద్రమైంది. మూడు నెలల క్రితం మిరప తోటల్లో కాయకోత పనులకు మహా రాష్ట్ర నుంచి వేలాదిగా కూలీలు తరలివచ్చారు. రైళ్ల ద్వారా డోర్నకల్ స్టేషన్‌కు చేరుకుని ఇక్కడి నుంచి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, కృష్ణా జిల్లాలకు తరలివెళ్లారు. కాయకోత పనులు పూర్తి కావడంతో కొద్ది రోజుల నుంచి కూలీలు డోర్నకల్ మీదుగా మహా రాష్ట్రకు తిరిగి వెళ్తున్నారు. పది రోజులుగా సింగరేణి రైలులో ప్రతీరోజు 500 నుంచి 1000మందికి పైగా తరలివెళ్తున్నారు. మంగళవారం 2వేల మందికి పై గా కూలీలు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా సింగరేణి రైలులో కొత్తగూడెం, కారెపల్లి స్టేషన్లలో అధిక సంఖ్యలో కూలీలు ఎక్కడంతో డోర్నకల్‌కు చేరుకునే సమయనికే రైలు కాలు పెట్టలేనంత రద్దీగా మారింది. డోర్నకల్‌లో కూలీలు రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఘర్షణ పడి కొట్టుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును కొద్దిసేపు నిలిపి కూలీలను ఎక్కించే ప్రయత్నం చేశారు. సగం మందికి పైగా రైలు ఎక్కలేకపోవడంతో తర్వాత వచ్చిన శాతవాహన, గోల్కొండ రైళ్లలో పంపించారు. మహారాష్ట్రకు కూలీల తిరుగుప్రయాణం -
గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ
కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు.– సాక్షి నెట్వర్క్ప్రణీత్ ప్రతిభ..కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా గ్రూప్–1 పరీక్షలోనూ 380 మార్కులు సాధించారు.ముల్కలపల్లి యువకుడు ఉపేందర్..డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు.మెరిసిన సంధ్య..మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.ఉద్యోగం చేస్తూ..భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్‌ఎస్‌ను ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం మొదటిసారి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పీఆర్టీయూ ఉపాధ్యాయులకు కంకరబోడ్ పాఠశాల పవిత్రమైందని, చామల యాదగిరి ఇదే పాఠశాలలో పీఆర్టీయూ సంఘాన్ని స్థాపించారన్నారు. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిల విడుదల, కేజీవీబీ, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపు, మ్యూచువల్ బదిలీలు, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీశ్‌రెడ్డి, పాఠశాల హెచ్ఎం కోట్యానాయక్ తదితరులు ఉన్నారు. -
అనంతాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవిశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షా బంధనం, మృత్సంగ్రహణం, ఋత్విక్ కరణం, అంకురారోహణం, వైనతేయ ఆదివాస హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించారు. నాయిని ప్రభాకర్ రెడ్డి, కాళీనాథ్, శ్రీనివాస్ అచార్యులు, అనిరుద్ధ ఆచార్యులు, విశ్వం తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వక్సేన యజ్ఞం... బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని నిర్వాహకులు తెలిపారు. సేవా కాలం, వేద విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి అనంతరం ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మూర్తి కుంభారాధన, మూలమంత్ర హవనం పూజలు జరుగుతాయన్నారు. శ్రీవిశ్వక్సేన యజ్ఞం నిర్వహించి ధ్వజారోహణం ద్వారా గరుడ ప్రసాదం భక్తులకు అందజేస్తారని, సంతానార్థులు ఆలయానికి వచ్చి గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, నిత్యాహవనం, నిత్య పూర్ణాహుతి, దేవతాహ్వానం, నివేదన, బలిహరణ, వేద విన్నపం, తీర్థప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు. -
బైక్‌ను ఢీకొన్న కారు..
నల్లబెల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం నల్లబెల్లి మండలం బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని నారక్కపేటకు చెందిన మాడుగుల రజిత, శ్రీను దంపతుల కుమారుడు అజయ్(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. నర్సంపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు ఆసరా అవుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు జన్ను అజయ్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై నారక్కపేట, లచ్చిరెడ్డి కుంట మీదుగా నల్లబెల్లికి వెళ్లే క్రమంలో బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ సుబేదారికి చెందిన కాసోజు శ్రీనివాస్ కారులో నర్సంపేట నుంచి నల్ల బెల్లి వైపునకు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. జన్ను అజయ్‌కి తీవ్రంగా, కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ సిబ్బంది కలిసితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. అజయ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అజయ్ మృతితో నారక్కపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. కాగా, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, తదితరులు పాల్గొన్నారు. పాఠశాల బస్సును ఢీకొని ఏటూరునాగారంలో మరొకరు.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సినిమా థియేటర్ ప్రదేశంలోని యూ టర్న్ వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఎస్వీవీ పాఠశాలకు చెందిన ఏపీ 36 టీఏ 7266 గల పాఠశాల బస్సు డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శెట్టి నరేశ్(38) బస్సు వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. బైక్ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య అమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. యువకుడి దుర్మరణం, మరొకరికి గాయాలు బజ్జుతండా బస్ స్టేజీ వద్ద ఘటన -
జీనోమ్ ప్రాజెక్టుతో వ్యాధుల గుర్తింపు
కేయూ క్యాంపస్ : జీనోమ్ ప్రాజెక్టు మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించొచ్చని 2010లోనే వెల్లడైందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యూనాలజీ ఫర్ డిసిస్ ప్రివెన్షన్స్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై మంగళవారం ఆ విభాగం సెమినార్‌హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి పరిశోధకులు, అకడమిషియన్లు పాల్గొని జంతు శాస్త్రాల పరిశోధన పురోగమనంపై చర్చించడాన్ని కొనియాడారు. అనంతరం బయో ఫార్మా డైరెక్టర్ గీతా శర్మ ‘డ్రగ్ డిస్కవరీ’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక మాలిక్యుల్ డ్రగ్‌గా మార్కెట్లోకి రావడానికి తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు పడుతుందన్నారు.అంతేకాకుండా 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. కానీ బయో ఇన్ఫర్మాటిక్స్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఖర్చు, సమయం రెండూ కలిసి రావడం పరిశోధన రంగంలో జరిగిన పురోగతిగా భావించొచ్చని తెలిపారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య మాట్లాడుతూ ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో వందకు పైగా రీసెర్చ్ స్కాలర్స్, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తమ పరిశోధన పత్రాలు సమర్పించబోతున్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా జూవాలజీ విభాగ అధిపతి జి. షమిత, విశిష్ట అతిథిలుగా సైన్స్ డీన్ జి. హన్మంతు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఈసం ఈసం నారాయణ, ప్రొఫెసర్ ఇస్తారి పాల్గొన్నారు. వీసీ, ఇతర అతిథులు జాతీయ సెమినార్‌కు వచ్చిన పరిశోధన పత్రాల సావనీర్‌ను ఆవిష్కరించారు. సదస్సు ఈనెల 12న ముగియనున్నది. కేయూలో జాతీయ సదస్సులో వీసీ ప్రతాప్ రెడ్డి -
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ డీన్‌కు ఇంకా 84 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల విద్యార్థుల ఫలితాలు వెల్లడించడం లేదు. ఫలితంగా ఆయా విద్యార్థులు తాము ఉత్తీర్ణ సాధించామా?లేదా? ఏమైనా సబ్జెక్టుల్లో తప్పామనే అంశం తెలియక లబోదిబోమంటున్నారు. 53,728 మంది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బి ఓకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఈనెల 4న విడుదల చేసిన విషయం విధితమే. అయితే యూనివర్సిటీలోని డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడతో తొలుత 121 కళాశాలల ఫలితాలు నిలిపివేశారు. వారంలో కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించాయి. దీంతో వాటి ఫలితాలు విడుదల చేశారు. కేయూ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల కళాశాలలు ఉండగా) అందులో మంగళవారం వరకు 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాల విద్యార్థుల ఫలితాల నిలిపివేత కొనసాగుతోంది. రీవాల్యుయేషన్ గడువు కూడా.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఇచ్చాక 10 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన కాలేజీల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదల కాని విద్యార్థులు రీవాల్యుయేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారంలో ఈ గడువు కూడా ముగియబోతుంది. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది. డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్.. డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇటీవలే పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫీజులు కూడా ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు చెల్లించాల్సింటుంది. అయితే 1,3,5 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కూడా ఆయా సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించాల్సింటుంది. ఇంకా చెల్లించని 84 కళాశాలలు 53,728మంది విద్యార్థుల నిరీక్షణ ముగుస్తున్న రీవాల్యుయేషన్ గడువు మరోవైపు డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల ఫీజు కూడా.. -
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
● రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ మామునూరు: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మేకలు, పవర్ వీడర్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత నిమిత్తం పాతర గడ్డి తయారీ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి కిషన్ కుమార్, అటారీ ప్రతినిధి ఎఆర్. రెడ్డి, ఉమారెడ్డి, దిలీప్‌కుమార్, బాలాజీ, బ్యాంకు మేనేజర్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, డాక్టర్ అమ్రేశ్వరి, శాస్త్రవేత్తలు అరుణ్, సౌమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులకు అండగా ఉంటాం●● మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్ మహబూబాబాద్ రూరల్ : మిర్చి క్రయవిక్రయాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వారికి అండగా ఉండి కొనుగోళ్లు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటా మని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వరంగల్ సంయుక్త సంచాలకుడు ఉప్పల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను తనిఖీ చేశారు. రెండు, మూడు రోజుల నుంచి మిర్చి అధికంగా రావడం, మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై వారితో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ సకాలంలో కొనుగోళ్లు జరిపించి రైతులు ఇబ్బందులుపడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మిర్చి కొనుగోళ్ల అంశాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కార్యదర్శి షంషీర్, సూపర్వైజర్ రమేశ్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానం
శాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్–1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి ● లీడ్ బిడ్ మేనేజ్మెంట్ జీఎం శివభాస్కర్ హసన్‌పర్తి : ప్రతీ విద్యార్థి నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని లీడ్ బిడ్ మేనేజ్మెంట్, ఆర్పీఎల్ జీఎం, ఇండియా సర్వీసెస్ జీఎం శివ భాస్కర్ నేతి అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘వ్యూహ–2025’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి శివభాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త మార్గాలు తెరుస్తోందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచడానికి ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీ మేనేజ్మెంట్ వైపు దృష్టి సారించాలన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుకనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. తొలుత ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ సుమన్, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 61 మహిళా శక్తి అద్దె బస్సులుహన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు 61 మహిళా శక్తి అద్దె బస్సులు కేటాయించారని ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ బస్సులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళ శక్తి మిషన్–25ను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు అందిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 14వ తేదీ వరకు సీఎం పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సభకు వచ్చే రూట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్‌బాషా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఏంహెచ్ఓ మల్లికార్జున్‌రావు, డీపీఓ స్వరూప, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లిలో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలాన్ని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టరేట్లో సమీక్ష -
అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు
కాటారం: భూమి విషయంలో అన్నను చంపిన తమ్ముడికి జీవితఖైదు శిక్షతో పాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై మ్యాక అభినవ్ కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మృతుడు మారుపాక నాగరాజు, నిందితుడు మారుపాక అశోక్ అన్నదమ్ములు. స్వగ్రామంలో ఇంటి స్థలం ఉండగా నాగరాజు, అశోక్, వారి తల్లి శంకరమ్మ సమానంగా పంచుకున్నారు. నాగరాజు తనకు వాటాగా వచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోగా అశోక్ మద్యానికి బానిసై తన వాటా భూమిని అమ్ముకున్నాడు. అన్న ఇంట్లో సైతం తనకు వాటా వస్తుందని పలుమార్లు నాగరాజు కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయడంతో వారు గ్రామం వదిలి వేరే చోట నివసిస్తున్నారు. ఈ క్రమంలో 2019, మే 10న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నాగరాజు గ్రామానికి రాగా అశోక్ అతడితో గొడవపడి బీరు సీసాతో గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సరిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అశోక్‌పై హత్య కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శివప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత వచ్చిన సీఐ హథీరామ్ కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మంగళవారం కేసు తుది విచారణ జరిగింది. కోర్ట్లైజన్ ఆఫీసర్, ఏఎస్సై గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు రమేశ్, వినోద్.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ప్రధాన న్యాయమూర్తి.. నిందితుడు అశోక్‌కు జీవితఖైదు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌తో పాటు అప్పటి దర్యాప్తు అధికారులను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు. తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు -
వరంగల్ డీసీసీబీని నంబర్ వన్‌గా నిలపాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అన్ని డీసీసీబీల్లోకెల్ల నంబర్ వన్‌గా నిలపాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. అధికారులు శ్రద్ధగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ నాబార్డు సమీక్షలో వరంగల్ డీసీసీబీ ‘ఏ’ ర్యాంకు అవార్డు సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రుణమాఫీ లబ్ధి పొందిన రైతులకు త్వరిగతిన కొత్త పంట రుణాలు అందించాలన్నారు. ఐఆర్ఏసీ నామ్స్ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు మొండి బకాయిలు రాబట్టి నిరర్థక ఆస్తులు 2 శాతానికి తగ్గించాలని ఆదేశించారు. టర్నోవర్ రూ.2500 కోట్లకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉషా, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి పాల్గొన్నారు. -
రూ. 10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
బయ్యారం: మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం పోలీసులు రూ. 10 లక్షల విలు వైన 20 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బస్టాండ్ సెంటర్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ స మయంలో అటువైపు సూట్ కేసుతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న సూట్‌కేసు తెరచి చూడగా అందులో రూ. 10 లక్షల విలువైన 20 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించి ఒడిశాలోని పత్రాపూర్కు చెందిన సంతోశ్‌నాయక్, అర్జున్దాస్గా గుర్తించారు. ఎస్సై తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
అశ్విని(నాగరాణి) వెడ్స్ రాకేశ్..
అశ్విని బీఎస్సీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందడంతో ట్రస్ట్‌లో ఆశ్రయం పొందింది. ప్రస్తుతం అశ్వినితో రాకేశ్‌కు వివాహం చేస్తున్నారు. కాగా, ఇద్దరు యువతుల పెళ్లిళ్లలకు దాతలు రాంశేషు, చంద్ర, బొమ్మనేని రమాదేవి, ఎన్.మహేశ్‌రావు–లక్ష్మి, దుగ్యాల పాపారావు, ఎం.చంద్రశేఖర్–రాజ్యలక్ష్మి, వి.గీత–సుధాకర్‌రావు, మురార్అలీ–నషీమ్బర్వాని, సైఫా సురేశ్, సిటిజన్ క్లబ్, మిత్రుల సహకారంతో వివాహాలు చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వినోదమోహన్రావు తెలిపారు.● -
అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈమేరకు మొదటగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం పటిస్తారు. అనంతరం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12న ఉదయం 9.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వాన పూజలు, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. 13న ఉదయం 9.30 గంటలకు 25 కలశాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం, 14న ఉదయం 9.30 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, అదేరోజు సాయంత్రం ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 15న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుండగా.. అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 9.30 మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, పవళింపు సేవ, మహాదాశీర్వచనం పూజలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 16వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
● ‘ఈ ఫొటోలోని వృద్ధుడు బయ్యారం మండలం కొత్తపేట తండాకు చెందిన గుగులోతు బాల్య. తనకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారిని పెద్ద చదువులు చదివించాడు. దీంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కూతురుకు వివాహం జరిపించి అత్తారింటికి పంపించాడు. తనకున్న 12 ఎకరాల భూమిలో తలా మూడు ఎకరాల చొప్పున ముగ్గురు కుమారులకు పంచాడు. బాల్య, తన భార్య హచ్చీ పేరున ఉన్న మూడు ఎకరాలను కూడా రాయించుకున్నారు. ఇప్పుడు కుమారులు, కోడళ్లు మాట్లాడడం లేదు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోవడం లేదు. బాల్య ఈవిషయంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే కలెక్టర్‌కు రాశారు. కాగా సారూ నా కుమారులను పిలిపించి మాకు అండగా ఉండేలా చూడాలని బాల్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరాడు.’ -
తల్లిని హత్యచేసిన తనయుడి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్ ఎల్కతుర్తి: కన్నతల్లిని గొడ్డలితో నరికి హత్య చేసిన తనయుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. దీనికి సంబంధించి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం అజయ్ తనకు రావాల్సిన భూమి వాటాను తల్లి చదిరం రేవతి(45) పంచివ్వ డం లేదన్న కోపంతో ఈనెల 7న గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో మృతురాలి చిన్న కుమారుడు చదిరం విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని కోతులనడుమ గ్రామ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తారసపడిన అజయ్‌ని అరెస్టు చేసి, విచారింగా.. నేరం అంగీకరిండంతో రిమాండ్‌కు తరలించిన ట్లు సీఐ వెల్లడించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్, మల్లే శం, గణేశ్, భాస్కర్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు. -
సాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండండి
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలు చేతికందే వరకు సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి పంటలు ఎండుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను వివరించారు. అనంతరం సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారని, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని, సాగు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. పంట చేతికందే వరకు చివరి ఆయకట్టుకు నీరందాలి కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో ఎమ్మెల్యేల భేటి -
జోరుగా మిర్చి కొనుగోళ్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం 3,044 క్వింటాళ్ల (7,597 బస్తాలు) మిర్చి కొనుగోళ్లు జరిగినట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. 6,958 బస్తాల తేజ రకం మిర్చి, 639 బస్తాల తాలు రకం మిర్చి అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. తేజ రకం క్వింటా గరిష్ట ధర రూ. 13,850, కనిష్ట ధర రూ.10,200 పలుకగా.. తాలు రకం మిర్చి క్వింటా గరిష్ట ధర రూ.6,350, కనిష్ట ధర రూ.4,820 పలికిందని పేర్కొన్నారు. మార్కెట్లో మిగిలిన మిర్చిని మంగళ, బుధవారాల్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. కాగా బుధ, గురువారం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మిర్చిని తీసుకురావొద్దని కోరారు. 14, 15, 16 తేదీల్లో మార్కెట్ బంద్... ఈనెల 14న హోలీ పండుగ, 15న శనివారం, 16న ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందని తెలిపారు. కాగా బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు మిర్చిని మార్కెట్ యార్డులోకి అనుమతించరని, రైతులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. బుధ, గురువారా ల్లో మిర్చి కాకుండా మిగతా సరుకులను మార్కెట్ యార్డులోకి అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. 11వేల బస్తాల రాక..కేసముద్రం: జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఈ సీజన్లో ఎన్నడూలేనంతగా 11వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. వ్యాపారులు ఆలస్యంగా టెండర్లు వేయగా, మధ్యాహ్నం 2 గంటలకు విన్నర్ జాబితా విడుదలైంది. సాయంత్రం వరకు 7వేల మిర్చి బస్తాలు కాంటాలు పెట్టారు. మిగిలిన 4వేల మిర్చి బస్తాల వద్ద రైతులు రాత్రంతా పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావుతో కలిసి మిర్చి యార్డును సందర్శించారు. కాగా తేజరకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.13,599, కనిష్ట ధర రూ.10,010 పలుకగా, తాలురకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ. 6,511, కనిష్ట ధర రూ.4,009 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. -
సమీపిస్తున్న గడువు..
మహబూబాబాబాద్: పన్నుల వసూళ్లలో జిల్లాలోని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి. వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అంతంత మాత్రంగానే వసూళ్లు చేశారు. నేటి వరకు 65శాతం కూడా ఇంటి పన్నులు వసూళ్లు కాలేదు. సరిపడా సిబ్బంది ఉన్నా.. అలసత్వం వహిస్తున్నారని ఉన్నాతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా పన్నుల వసూళ్లకు మరో 20 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. జిల్లాలో మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరిపె డ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. మానుకోట మున్సిపాలిటీలో 36వార్డులు ఉండగా68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000 పైగా గృహాలు ఉన్నాయి. అలాగే తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు, 19,100మంది జనాభా ఉండగా.. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు, 17, 875 మంది జనాభా, డోర్నకల్‌లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉంది. కాగా మానుకోట మున్సిపాలిటీలో 11మంది బి ల్ కలెక్టర్లు, 22 మంది వార్డు ఆ ఫీసర్లు,ముగ్గురు ఎన్ఎంఆర్ (నామినల్ మస్టర్ రూల్)తో ఇంటి పన్నులు, నల్లా పన్నులు ,ట్రేడ్ లైసెన్స్ ఫీజులు,ఇతర ప న్నులు వసూళ్లు చేస్తున్నారు. మి గిలిన మున్సిపాలిటీల్లో కూ డా బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు వసూలు చేస్తున్నారు. 65శాతం దాటని వసూళ్లు.. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మానుకోట, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల వసూళ్లు 65 శాతం కూడా దాటలేదు. వసూళ్లను వేగవంతం చేసి వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్ సీడీఎంఏ శ్రీదేవి పలు మార్లు కమిషనర్లతో వీసీ నిర్వహించి ఆదేశించినా పురోగతి అంతంత మాత్రమే ఉంది. మరీ దారుణం.. మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్, ఇతర పన్నుల విషయంలో వెనకబడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. దీనికి తోడు పన్నులు కూడా అంతంతమాత్రంగానే వసూళ్లు అవుతున్నాయి. ఈ పన్నుల ద్వారా వచ్చిన జనరల్ ఫండ్‌ను సిబ్బంది వేతనాలు, డీజిల్, రిపేర్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియో గిస్తున్నారు. గడువులోగా పూర్తి చేస్తాం.. మానుకోట మున్సిపాలిటీలో 65శాతం ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి అయ్యింది. గడువులోగా వందశాతం వసూళ్లు చేస్తాం. సిబ్బంది ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పన్నుల వసూలు చేస్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. – నోముల రవీందర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో జాప్యం 65శాతం దాటని ఇంటి పన్ను వసూళ్లు మిగిలింది 20 రోజులు మాత్రమే.. వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం నాలుగు మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్ల వివరాలు మున్సిపాలిటీ డిమాండ్ వసూలైంది శాతం మానుకోట రూ.5.28 కోట్లు రూ. 3.40 కోట్లు 65 తొర్రూరు రూ.3.22 కోట్లు రూ. 2 కోట్లు 62 డోర్నకల్ రూ.1.26 కోట్లు రూ. 71.86 కోట్లు 59 మరిపెడ రూ.1.60 కోట్లు రూ. 95 లక్షలు 58 -
అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈమేరకు మొదటగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం పటిస్తారు. అనంతరం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12న ఉదయం 9.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వాన పూజలు, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. 13న ఉదయం 9.30 గంటలకు 25 కలశాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం, 14న ఉదయం 9.30 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, అదేరోజు సాయంత్రం ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 15న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుండగా.. అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 9.30 మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, పవళింపు సేవ, మహాదాశీర్వచనం పూజలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 16వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..
ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు బోర్ వెల్ ద్వారా నీరునింపే పని కార్మికులు చేస్తుంటారు. వారు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఇంద్రతేజ సమస్యను పరిష్కరించాలి.. కార్మికలకు వేతనాలు చెల్లించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐదు హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లలో ఉండలేం. – విహారిక, మెడికో● -
కలెక్టర్ సారూ.. కనికరించండి
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్: ‘మాకు నిలువ నీడలేదు.. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. మీరైనా కరుణించి ఇళ్లు మంజూరు చేయండి. మా తాతలకాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి ధరణిలో తప్పు జరిగి వేరే వారి పేరున పడింది. ఆ పేరు మార్పిడి చేసి మా భూమి మాకు కేటాయించండి. మా ముగ్గురు కుమారులు ప్రయోజకులే.. కానీ నాకు, ముసలమ్మకు అన్నం పెట్టేవారు లేరు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకపోయింది. మీరు సమయం ఇచ్చి నా బిడ్డలను పిలిపించి వృద్ధాప్యంలో ఉన్న మాకు అన్నం పెట్టించండి’ అని ఇలా ఎవరి సమస్యలను వారు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు చెప్పుకున్నారు. దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినతులు వెంటనే పరిష్కరించాలని, లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వినతులపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన... తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి, నర్సింహారెడ్డి, సావిత్రమ్మ మాట్లాడుతూ.. తమకు వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముత్తిలింగయ్య, కృష్ణమూర్తి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సమాచారం లేక తక్కువగా దరఖాస్తులు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశారు. అయితే సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి ఉందని తెలియక దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. కేవలం 84మాత్రమే వచ్చాయి. ప్రజావాణి ఉందని సమాచారం ఉంటే దరఖాస్తుల సంఖ్య పెరిగేది.రైతుభరోసా మంజూరు చేయాలి మూడు సంవత్సరాలుగా రైతుభరోసా(రైతుబంధు) రావడం లేదు. తహసీల్దార్, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. కలెక్టర్ స్పందించి పత్రాలను పరిశీలించి రైతుభరోసా మంజూరు చేయాలి. – ఎన్ సోమేశ్వర్, తొర్రూరు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలి నాకు మూడు ఎకరాల భూమి ఉంది. నేటికీ పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. పట్టా భూమి అయినా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే పాస్‌పుస్తకం అందజేయాలి. – బి.కిషన్, తానంచర్ల గ్రామ శివారు రెడ్యాతండా, మరిపెడ మూడు వారాల తర్వాత ప్రజావాణి నిర్వహణ జిల్లా నలుమూలల నుంచి వచ్చి వినతుల అందజేత నెలల తరబడి తిరుగుతున్నా సమస్యలకు దొరకని పరిష్కారం పరిష్కరించాలని అర్జీదారుల వేడుకోలు -
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమామాత ప్రజల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. చరిత్రకలిగిన ఫాతిమామాత దేవా లయం కేథడ్రల్ చర్చి ప్రాంగణం ఓరుగల్లు మేత్రాసనంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహించే ఫాతిమామాత మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి విశ్వాసులు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఏడాది ఓరుగల్లు పీఠంలో 2025 సాధారణ జూబిలీ సంవత్సరంలో బిషప్ డాక్టర్ ఉడుములబాల ఆశీర్వాద వేళలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిషప్ సెక్రటరీ ఫాదర్ గంగారపు అనుకిరణ్ సోమవారం తెలి పారు. కాజీపేట మెయిన్రోడ్లో చర్చి ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన మహాతోరణం ఆశీర్వాద ద్వారం, ప్రాంగణంలో జపమాల బృందావనం (రోజరి గార్డెన్)ను బిషప్ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని కేథడ్రల్ చర్చి, ఫాతిమామాత గుహను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాలకు 12 జిల్లాల నుంచి 10 వేల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలు.. కేథడ్రల్ చర్చిలో ఈ నెల 11వ తేదీన మంగళవారం మహాపూజ్య డాక్టర్ ఉడుములబాల దివ్యబలిపూజ సమర్పణ, దంపతులకు సన్మానం, 12వ తేదీ బుధవారం ఫాదర్ తాటికొండ జోసెఫ్, డి.జోసెఫ్ ఆధ్వర్యంలో స్వస్థత ప్రార్థనలు, దివ్యబలిపూజ, కర్కూల్ పీఠం పూజ్య ఏరువ జోజిరెడ్డిచే పూజ ప్రార్థనలు. సాయంత్రం ఫాతిమామాత స్వరూపంతో ఊరేగింపు, ఫాతిమా మాత ప్రధాన ద్వారం, రోజరి గార్డెన్ ప్రారంభం, కొవ్వత్తులతో దివ్వప్రసాద ప్రదక్షిణ ది వ్యప్రసాద ఆశీర్వాదం. 13వ తేదీన గురువారం బెంగళూర్ అగ్రపీఠం మెన్సిగ్నోర్ సి.ప్రాన్సీస్ ఆంగ్లంలో దివ్యబలిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఓరుగల్లు పీఠకాపరి అండ్ విశాఖ అగ్రపీఠకాపరి ఉడుములబాల సమష్టి కృతజ్ఞత సమర్పణ. సాయంత్రం 5:30 గంటలకు మూడో పూజ, గురుశ్రీ ఆశీ ర్వాదం, ఎస్.జె దివ్యపూజ పతాక అవరోహణతో పాతిమామాత ఉత్సవాల ముగింపు. పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట: మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఫాతిమామాత ఉత్సవాలను విజ యవంతం చేయాలని బిషప్ ఉడుముల బాల కోరారు. ఈమేరకు కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో స్థానిక కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. అనుకిరణ్, బొక్క దయాసాగర్, తాటికొండ జోసఫ్, సురేష్, నవీన్ ఫాదర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఓరుగల్లు పీఠకాపరి ఉడుములబాల నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం -
కంపు కంపు!
విధులు బహిష్కరించిన కేఎంసీ హాస్టళ్ల కార్మికులుఎంజీఎం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన కేఎంసీ అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యవిద్యపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. 80 మందికి పైగా కార్మికులు ఆందోళన బాట పట్టడంతో హాస్టళ్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా మారిది. ఇబ్బందులు పడుతున్న 1,250 మంది విద్యార్థులు -
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కొండపర్తికి నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ● ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ ● అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనం ● గిరిజన గ్రామాల్లో అభివృద్ధిపై సమీక్షించనున్న జిష్ణుదేవ్ సాక్షిప్రతినిధి, వరంగల్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి బయల్దేరనున్న గవర్నర్.. దత్త త గ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరుతారు. కాగా గవర్నర్ పర్యటన సందర్భంగా సోమవారం ము లుగు కలెక్టరేట్లో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీష్, అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దివాకర.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ● ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దత్తత గ్రామమైన కొండపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు ● ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు ● 11 నుంచి 12.30 గంటల వరకు గవర్నర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, స్థానిక ఆదివాసీలతో గవర్నర్ మాటామంతి. ● మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపర్తి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ● 12.45 నుంచి 1 గంట వరకు అమ్మవార్ల దర్శనాలు, మొక్కులు చెల్లించనున్నారు. ● 1 నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం. ● 2 గంటలకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ నుంచి తిరిగి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం. ● సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకోనున్న గవర్నర్ఎస్ఎస్తాడ్వాయి: తన దత్తత గ్రామమైన మండలంలోని కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నేడు (మంగళవారం) రానున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండపర్తిలో ట్రైబల్వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనానికి మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా నిర్మించిన బహుళ ఉపయోగ భవనంలో కారంపొడి మిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను సిద్ధం చేశారు. గవర్నర్ అభివృద్ధి పనులను ప్రారంభించి బిర్సాముండా, కొమురంభీం విగ్రహాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించనున్నారు. కొండపర్తిలో అధికారులు గవర్నర్ రాక నేపథ్యంలో జిల్లా అధికారులు కొండపర్తి బాట పట్టారు. ఆయా శాఖల వారీగా ఏర్పాట్లు చేశారు. గర్నవర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడేందుకు వేదిక సిద్ధం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు శుభ్రం చేసి సైడ్ బర్మ్‌కు మట్టి పోశారు. కొండపర్తిలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటుకు డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ట్రైబల్ వెల్పేర్ ఈఈ వీరభద్రం దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. స్థానిక ఎంపీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్‌రావు పరిశుభ్రత ఏర్పాట్లను సిబ్బందితో చేయించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కలెక్టర్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. పీహెచ్సీలో అత్యవసర గది ఏర్పాటు గవర్నర్ కొండపర్తికి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తాడ్వాయి పీహెచ్సీలో అత్యవసర గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో రెండు పడుక మంచాలు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, వైద్యాధికారి అడెపు చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.రోడ్డు నిర్మించాలి కొండపర్తి స్టేజీ నుంచి గ్రామం వరకు రోడ్డును బాగు చేయాలి. గతంలో బీటీ రోడ్డు పనులను మొ దలు పెట్టగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – చింత కౌసల్య, కొండపర్తిఆర్థికాభివృద్ధికి భరోసానివ్వాలి.. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది. మహిళ కోసం కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు నెలకొల్పారు. మహిళలకు డైరీ ఫాంలు, ఫౌల్ట్రీఫాంలు నెలకొల్పితే కుటుంబాలకు ఆర్థికభరోసా ఉంటుంది. – రజిత, కొండపర్తిగవర్నర్ టూర్ షెడ్యూల్ ఇలా..గవర్నర్ దత్తత శుభపరిణామం అటవీ ప్రాంతంలో ఉన్న కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకోవడం సుభపరిణామం. సాగునీటి కోసం బోర్లు నిర్మిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసుకునే ఆలోచనలో ఉన్నాం. – అరెం లచ్చుపటేల్, మేడారం జాతర చైర్మన్ -
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గార్ల: గిరిజన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్–1లో 900 మార్కులకు 454 మార్కులు సాధించాడు గిరిజన ఆణిముత్యం గంగావత్ పవన్‌కల్యాణ్. మానుకోట జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ లక్ష్మణ్, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగావత్ పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా ఇంటర్లో ఎంఈసీ గ్రూప్‌లో పబ్లిక్ స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో డిగ్రీలో సీటు సాధించి బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 పరీక్ష రాసిన పవన్‌కల్యాన్ ఉత్తమ ఫలితం సాధించాడు. ఎస్టీ విభాగంలో కాకుండా ఓపెన్ కోటాలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్‌కల్యాణ్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. జశ్వంత్రాజ్ప్రతిభ మహబూబాబాద్ అర్బన్: సోమవారం విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మానుకోట జిల్లా కేంద్రంలోని సంఘాల రవికుమార్ ప్రసన్న దంపతుల కుమారుడు సంఘాల జశ్వంత్‌రాజ్ 900 మార్కులకు 465 మార్కులు సాధించాడు. గ్రూప్ వన్‌లో అత్యధికంగా మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ స్పాట్ విధుల రెమ్యునరేషన్ చెల్లించండి ● డీఈఓకు టీఆర్టీఎఫ్ వినతి విద్యారణ్యపురి: గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకణంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బాసిరి రాజిబాపురావు, జనరల్ సెక్రటరీ గుగులోతు శ్రీనివాస్‌నాయక్‌లు సోమవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్‌తోపాటు టీఏ, డీఏలు చెల్లించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో కూడా టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఉంటుందని కానీ, గత ఏడాదికి సంబంధించిన రెమ్యునరేషనే ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని లేదంటే ఈఏడాది నిర్వహించబోయే స్పాట్ వాల్యూయేషన్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్రీడల్లోనూ పిల్లలను ప్రోత్సహించాలి వరంగల్ స్పోర్ట్స్: పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే, విశిష్ట అతిథిగా కన్వెన్షన్‌హాల్ డైరెక్టర్ వేణు హాజరై విజేతలకు బహుమతులను అందజేసి, మా ట్లాడారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ టు ఆల్ విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్ నిలవగా వరుస స్థానాల్లో రిత్విక్ గండు, షేక్ రియాజ్, స్వాతి దేవరపల్లి, ఎం.దీక్షిత్ నిలిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష మందితో రజతోత్సవ సభ
సాక్షిప్రతినిధి, వరంగల్ : పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా వరంగల్‌లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఓరుగల్లుకు.. బీఆర్ఎస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని, వరంగల్ వేదికగా గతంలో 15 లక్షల మందితో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం సోమవారం సాయంత్రం వరంగల్ నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లి ప్రాంతాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి హరీశ్‌రావు సభాస్థల పరిశీలన చేశారు. అనంతరం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే సభకు రెండుచోట్లా స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనకు నిదర్శనంగా రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజిక, చారిత్రక అవసరాలకోసం ఉద్యమం సామాజిక, చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక తెలంగాణ సాధించినట్లు హరీశ్‌రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రారంభించిన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, రైతుబంధు పథకం పీఎం కిసాన్‌గా, మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ ఘర్కి జల్ అని అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను చూడాలని, తన మాట వినాలని కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజలకు పనిచేసేది ఎవరో, చెయ్యని వారు ఎవరో, పాలు ఏందో, నీళ్లు ఏందో, గట్టోడు ఎవరో, వట్టోడు ఎవరో తెలిసిందని, వారు గమనిస్తూ ఉన్నారని అన్నారు. మిలియన్ మార్చ్ రోజు వరంగల్‌లో ఉండటం అదృష్టం.. ‘మిలియన్ మార్చ్‌కు సోమవారంతో 14 ఏళ్లు పూర్తి.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్ జరిగిన రోజున పోరాటాల ఖిల్లా వరంగల్‌లో ఉండటం.. మీతో గడపడం అదృష్టం’ అంటూ హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, శంకర్ నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కన్నూరు సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. ఉనికిచర్ల.. భట్టుపల్లిలో చూశాం.. మరోసారి స్థల పరిశీలన ఓరుగల్లుతో బీఆర్ఎస్కు విడదీయరాని బంధం.. పోరాటాలకు పురుడుపోసిన గడ్డమీదే ఏప్రిల్ 27న ఆవిర్భావ వేడుకలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడి -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
బెయిల్‌పై వచ్చి.. శవమై తేలి
● బావిలో పడి వృద్ధుడి మృతి డోర్నకల్ : ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు హత్యాయత్నం కేసులో ఇటీవల బెయిల్ వచ్చి.. బావిలో శవమై తేలాడు. ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన కై కొండ సత్యం (69) టైలర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అతను ఆదివారం కాలనీ సమీపంలో బావిలో శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, డోర్నకల్ పోలీస్ స్టేషన్లో సత్యంపై హత్యాయత్నం కేసు నమోదు కాగా రెండు నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై కొద్దిరోజుల క్రితం విడుదలయ్యాడు. -
అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ..
ఐటీఐ వంటి సాంకేతిక విద్యతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతున్నారు. ఐటీఐలోని ఆయా విభాగాలకు అనుగుణంగా విద్యార్థులు పూర్తి చేసే అప్రెంటిస్‌తో ఉద్యోగ అన్వేషణకు తమ మార్గాన్ని మరింత సులభం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఏటా ఐటీఐ పూర్తి చేసిన వారంతా వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ శిక్షణ పొందుతూ తమ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాజీపేట: ఐటీఐ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ చేస్తే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం తేలిగ్గా సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 32 ట్రేడుల్లో శిక్షణ పూర్తి చేసుకున్నవారు అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం www.apprenticeship.gov.in వెబ్సైట్లో అభ్యర్థి పేరును నమోదు చేసుకుంటే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అప్రెంటిస్ ఇచ్చే కంపెనీల పేర్ల జాబితా మెయిల్‌కు వస్తుంది. పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఐటీఐ ట్రేడ్ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ పత్రాలను స్కానింగ్ చే యాల్సి ఉంటుంది. అభ్యర్థి ట్రేడ్‌ను బట్టి అతడు ఏ కంపెనీకి అర్హుడో తేలికగా తెలిసిపోతుంది. కంపె నీలు కూడా అప్రెంటిస్ ఇచ్చేందుకు అదే వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకుంటాయి. కంపెనీ పేరు, జీఎస్టీ నంబర్, ఈపీఎఫ్ నంబర్, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ వంటివి వెబ్సైట్లో పేర్కొనడం ద్వారా ఆయా కంపెనీలు అప్రెంటిస్ ఇచ్చేందుకు అర్హత పొందుతాయి. ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి ఏడాదిపాటు.. ఏడాది ట్రేడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులైతే రెండేళ్ల అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. 3వేల మందికిపైగా పేర్ల నమోదు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో చదివి ఉత్తీర్ణులైన సుమారు 3వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్ కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అర్హులకు వివిధ కంపెనీలు తమ అవసరాల మేరకు కాల్ లెటర్లు పంపుతున్నాయి. అప్రెంటిస్ అవ్వగానే చాలా కంపెనీలు ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నాయి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీం 2016 నేవ్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీం) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని అప్రెంటిస్ చేసే అభ్యర్థులకు రీయింబర్స్మెంట్ కింద కంపెనీలకు అందజేస్తాయి. అభ్యర్థికి నెలకు రూ.8,500 స్టయిఫండ్‌గా లభిస్తుంది. దేశంలో అప్రెంటిస్ శిక్షణ నిమిత్తం అన్ని రాష్ట్రాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించింది. 50 లక్షల మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోనుంది. ఇదంతా 2026 నాటికి పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏయే కంపెనీలు.. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బెల్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఆర్టీసీ, జెన్కో, సింగరేణితోపాటు అనేక సంస్థలు అప్రెంటిస్ శిక్షణ ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు జిల్లాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా అప్రెంటిస్ శిక్షణ ఇస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అయితే వరంగల్, కరీంనగర్ రీజియన్లలో ఉన్న ఆర్టీసీ డిపోలతోపాటు రైల్వే పలు జోన్లలో ఏడాదికి 25వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్ నిమిత్తం శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు అదనపు అర్హత అప్రెంటిస్‌తో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు అవకాశాలు మెరుగుపడ్డాయిఉపాధికి ఐటీఐలు ఎంతగానో దోహదపడతాయి. గతంతో పోల్చితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అప్రెంటిస్ అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతీ మూడు నెలలకోసారి ఐటీఐ కేంద్రాల్లో అప్రెంటిస్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. – వెంకటేశ్వర్ రావు, ప్రిన్సిపాల్, కాజీపేట ఐటీఐ -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గోవిందరావుపేట: నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మో డల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ములు గు జిల్లాలో మొదటిసారి గోవిందరావుపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నిరుపేదలు మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ధర, నాణ్యతతో తమ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించుకున్నామన్నారు. ప్రతీ దశలో ఇంటి నిర్మాణ పురోగతి వి వరాలు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు కొండపర్తికి గవర్నర్ రాక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తికి రేపు(మంగళవారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండపర్తి గిరిజన గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు గవర్నర్ కొండపర్తి రానున్నట్లు వెల్లడించారు. వరంగల్ మీదుగా హోలీకి ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్ : హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ నెల 14వ తేదీన తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరే తిరువనంతపురం నార్త్–నిజాముద్దీన్ (06073) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు మరుసటి రోజు చేరుతుంది. ఈ నెల 17వ తేదీన నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ రైళ్లకు కొల్లం, కాయంకులం, చెంగనూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువ, త్రిసూర్, పాలఘడ్, పండనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలర్పెట్టయ్, పట్పడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, బల్హార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపథ్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మతుహుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి కోసం రైతుల ఘర్షణ ● ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు అడ్డుగా రాళ్లు చిన్నగూడూరు: పంటల సాగుకు ఎస్సారెస్పీ జలాల కోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు మండలాల రైతులు శనివారం రాత్రి ఘర్షణ పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ నుంచి చిన్నగూడూరు మండలం విస్సంపల్లి పంట పొలాలకు నీరు రాకుండా మరిపెడ మండలం బాల్యతండా, లక్ష్మాతండా రైతులు రాళ్లు అడ్డుపెట్టారు. దీంతో విస్సంపల్లి రైతులు శనివారం రాత్రి కెనాల్ వద్దకు చేరుకుని తమ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రాళ్లు తీసే ప్రయత్నం చేయగా రెండు ప్రాంతాల రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెయిన్ కెనాల్‌ను తాము సుమారు రూ.30 వేలు వెచ్చించి బాగు చేయిస్తే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని విస్సంపల్లి, తుమ్మల చెరువుతండాల రైతులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. -
అట్టహాసంగా కొడవటంచ జాతర
రేగొండ: భక్తుల కొంగుబంగారం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు కావడంతో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలు ఈ నెల 9నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఈఓ మహేశ్, ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోసం సకల సౌకర్యాలు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. తరలివచ్చిన భక్తులు -
బోరుమన్న మేచరాజుపల్లి..
కళ్లెదుటే భర్త, ఇద్దరు పిల్లల అంత్యక్రియలు జరుగుతుంటే తల్లడిల్లిన తల్లి నెల్లికుదురు: తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది. తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు. తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్ అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది. ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపల్లికి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్, హైదరాబాద్ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్ ప్రసాద్ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల ఝవేసి నివాళులర్పించారు. కడసారి చూపుకోసం కదిలొచ్చిన గ్రామస్తులు ముగ్గురికి తలకొరివి పెట్టిన మృతుడి తండ్రి సారంగపాణి -
ప్రాణం తీసిన పల్లిగింజ
గూడూరు : పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు. గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి -
మామిడి కాయలకు కవర్లు..
చెన్నారావుపేట: మామిడి రైతులు సరైన యాజ మాన్య చర్యలు చేపట్టినా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, పురుగులు, తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చీడపీడల నివారణకు పూత ప్రారంభమైనప్పటి నుంచి కాయకోత వరకు దాదాపు 12 నుంచి 16 సార్లు పురుగు మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువ సార్లు అధిక గాఢత కలిగిన పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల పురుగు మందుల అవశేషాలు పండ్లలో ఉండి వాటిని తిన్న వారికి కేన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పురుగు మందుల వాడకం తగ్గించి.. నాణ్యమైన పంట చేతికి రావడానికి, అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. కవర్లు తొడగడం వల్ల లాభాలు.. ● కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల నుంచి రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా పండు.. ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా, మచ్చ తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి శిలీంద్రనాశినులు కొట్టకుండా సమర్థవంతంగా అరికట్టొచ్చు. ● కవర్లు తొడిగిన మామిడి కాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. రైతుకు ఖర్చు తగ్గుతుంది. పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగు మందుల అవశేషాలు పండులో ఉండవు. దీంతో పండు తిన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ● కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించొచ్చు. కాయపెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టొచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై సొనతో ఏర్పడే మచ్చలను నివారించొచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అధిక బరువు పెరగడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. కాయలో ఉండే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. కవర్లు ఎప్పుడు తొడగాలి? ఎలా తొడగాలి? కవర్లు ఏ దశలో తొడగాలనే అంశం చాలా ముఖ్యం. మరీ లేత దశ అంటే పిందె దశ లేదా గోళీ కాయ సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండడం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరుతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రాములు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల తర్వాత తొడగాలి. కవర్లు తొడిగిన 65–75 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పుడు కవర్లును తొలగించి కాయలను కోసుకోవాలి. ● మామిడి కాయలు అన్ని ఒకే దశలో ఉండవు. కవర్లపై మనం తొడిగిన తేదీలను రాసుకోవడం లేదా నంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగామో, తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవాలి. పేపర్‌తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు, బయట గాలి లోపలికి వెళ్లే అవకాశం ఉండి కాయ నాణ్యంగా ఉంటుంది. ● కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తొడగాలి. ● కవర్లు తొడిగేటప్పుడు పురుగులు, తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్ తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి. ఖాళీ ఉంటే పురుగులు, శిలీంద్రాలు ఈ ఖాళీ ద్వారా ప్రవేశిస్తాయి. ఒకవేళ వర్షం పడితే నీరు కూడా కాడ ద్వారా లోపలికి ప్రవేశించి కాయ పాడైపోతుంది.ఈగ నుంచి పండుకు రక్షణ.. నాణ్యత పెంపు చీడలు, తెగుళ్లు, అధిక గాలుల నుంచి రక్షణ ఎగుమతులకు అనువైన నాణ్యత.. పురుగు మందుల అవశేషాలు తక్కువ సబ్సిడీపై కవర్ల పంపిణీకవర్లకు సబ్సిడీ మొదట వరంగల్ జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మామిడిలో ప్రస్తుతం కవర్లు తొడిగి , నాణ్యమైన కాయలు అందించడానికి ఉద్యానశాఖ కవర్లకు 50 శాతం రాయితీ ఇస్తోంది. హెక్టార్‌కు(2.5 ఎకరాలు) 10, 000 కవర్లు 50 శాతం రాయితీ సదుపాయం ఉంది. ఒక రైతుకు 2 హెక్టార్లు( 5 ఎకరాలు) వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆసక్తి, ఇష్టం ఉన్న నర్సంపేట పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం రైతులు.. ఉద్యాన శాఖ అధికారులు ఎ. జ్యోతి(8977714061), వరంగల్ పరిధిలోని గీసుగొండ, సంగెం, వరంగల్ రైతులు.. ఎన్. తిరుపతి (8977714060), వర్ధన్నపేట పరిధిలోని రాయపర్తి, వర్ధన్నపేట రైతులు..ఎన్ అరుణ(8977714062), నెక్కొండ పరిధిలోని పర్వతగిరి, చెన్నారావుపేట, నెక్కొండ రైతులు.. బి. తరుణ్ (8977714053)ను సంప్రదించి వివరాలు అందించి కవర్లు తీసుకోవాలి. సంగీత లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలు జిల్లా రైతులు ఎకరాలు వరంగల్ 2,053 6,727 హనుమకొండ 2,434 6,075 జనగామ 2,883 8,886 మహబూబాబాద్ 2,245 14,052 జయశంకర్ భూపాలపల్లి 906 1,566 ములుగు 153 454 మొత్తం 10,674 37,760 ఆదాయ వివరాలు / ఎకరాకు.. ఎకరానికి కవర్లు వాడకుండా 4.0 టన్నుల దిగుబడి వస్తుంది. ధర టన్నుకు రూ. 25,000 ఉంటుంది. ఇలా రూ. లక్ష ఆదాయం వస్తుంది. కవర్లు తొడిగితే.. ఎకరానికి 4.25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్నుకు ధర రూ. 50 వేలు ఉంటుంది. ఇలా రూ. 2,12, 500 ఆదాయం వస్తుంది. -
కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
కాటారం : మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన పొల్ల వేణు.. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. రెండ్రోజుల క్రితం సదరు బాలికను పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి వేణుతో పాటు మరో యువకుడు పొన్న దిశాంత్ అలియాస్ నాగరాజు కారులో కాటారం వచ్చి ఆమెను ఎక్కించుకుని వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించి హైవేపై గల పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. తొర్రూరు పోలీసుల సాయంతో కిడ్నాప్‌నకు గురైన బాలికతో పాటు నిందితులను గుర్తించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కాటారం పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కారు, సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు వివరించారు. కేసును చేధించిన సీఐ, ఎస్సైతో పాటు ఐటీకోర్ కానిస్టేబుల్ వేణు, స్వామిగౌడ్, జంపన్న, లక్ష్మీరాజ్, లవన్, తిరుపతి, రజనీని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అభినందించారు. -
ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్
●డ్రైవర్ దుర్మరణం..ఎల్కుర్తిలో ఘటన ధర్మసాగర్: ఓ టిప్పర్.. వెంచర్ ఆర్చ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కుర్తి శివారు ఓ వెంచర్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చేపూరి అనిల్ (36) టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్కుర్తి శివారులో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి వెంచర్ చేస్తున్నాడు. వెంచర్ ముందుభాగంలో ఆర్చ్ నిర్మాణం చేశాడు. వెంచర్లో టిప్పర్లతో మొరం పోస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనిల్ టిప్పర్‌లో మొరం లోడ్ చేసుకుని వెంచర్లో అన్లోడ్ చేశాడు. అనంతరం డబ్బా దించకుండానే వస్తున్న క్రమంలో ఆర్చ్ పిల్లర్‌ను ఢీకొంది. దీంతో ఆర్చ్ కూలి టిప్పర్ ముందు భాగంలో పడడంతో అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీపాషా తెలిపారు. -
మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మూడు రోజుల బంద్ అనంతరం సోమవారం నుంచి కొనుగోళ్లు జరగనుండగా.. మానుకోట వ్యవసాయ మార్కెట్ మిర్చి బస్తాలతో ఆదివారం కళకళలాడుతూ కనిపించింది. రైతులు తెల్లవారుజామున 3గంటల నుంచే మార్కెట్‌కు వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురావడం మొదలుపెట్టారు. రైతులు తాము తీసుకువచ్చిన మిర్చి బస్తాలను మార్కెట్ ఆవరణలోని ఎనిమిది షెడ్లలో దిగుమతి చేసుకున్నారు. అయితే షెడ్లలో స్థలం సరిపోకపోవడంతో ఆరుబయట సీసీపై కూడా మిర్చి బస్తాలను దించారు. భారీగా మిర్చి రావడంతో మార్కెట్ సిబ్బంది టోకెన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. టోకెన్లకు డబ్బులు ఇవ్వొద్దు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో టోకెన్లు ఇచ్చే సమయంలో రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద, మార్కెట్ యార్డు ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో దానధర్మాల పేరిట ఎవరికీ గింజలు ఇవ్వకూడదని రైతులకు సూచించారు. -
అర్ధశతాబ్దపు ఆనందహేళ
బయ్యారం: అర్ధశతాబ్దం తర్వాత కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెరమువేసుకున్నారు. చిన్న పిల్లల్లా ఎగిరి గంతేశారు. బయార్యరం బాలుర ఉన్నత పాఠశాలలో 1971–72వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. వారందరికీ ఆరుపదుల వయసు దాటినప్పటికీ.. చిన్న పిల్లల్లా మారి ఎగిరి గంతేశారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు వెంకట్‌రెడ్డి, నారాయణరావు, మోహనాచారితో పాటు పాఠశాల ప్రస్తుత హెచ్ఎం దేవేంద్రాచారిని సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాంబశివరావు, ఆర్.వి.ప్రసాదరావు, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సుధారాణి, సరోజిని, అమృత, రాంబాబు, రామారావు, సర్వోత్తమరెడ్డి, బాబురావు, వెంకటేశ్వర్లు, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ జలాలు పారుతాయని..
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యవసాయబావి మహబూబాబాద్ మండలంలోని రేగడితండాకు చెందిన బాదావత్ చంద్రు నాయక్ది. తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. తన వ్యవసాయ బావిలో నీరు ఉండాలంటే ఎస్సారెస్పీ కాల్వలు పారాలి. కానీ ఈ ఏడాది కాల్వ ల్లో ఆశించిన స్థాయిలోనీరు రాలేదు. దీంతో బావి అడుగంటింది. నీరు లేక మొక్కజొన్న కూడా ఎండిపోతుంది. ఈ పరిస్థితిలో బావిని లోతు తవ్విస్తే లాభం ఉంటుందేమో అని ఆశగా బావి తవ్వించాడు. పంటల పెట్టుబడికి రూ. 2లక్షలు కాగా బావి పూడికకు రూ. 50వేలు దాటినా.. నీళ్లు రాలేదు. రూ. 30వేలు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు రాలేదు. దీంతో చేతికొచ్చే పంటను పశువులతో మేపాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘గ్రావెల్’ మాఫియా
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా అధిక మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్‌కు రూ.30చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ● ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. ● వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. ● జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ● వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
వ్యవసాయ బావిలో నీళ్లు లేక..
పక్క ఫొటోలో ఎండిన వరి పంటను చూపుతున్న రైతు సీరోలు మండల కేంద్రానికి చెందిన వంగాల వెంకన్న. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు వస్తుందని ఆశ పడిన రైతుకు నిరాశ ఎదురైంది. వ్యవసాయ బావిలో నీళ్లు సరిగా లేక, ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో రెండు ఎకరాల పంట ఎండిపోయింది. సుమారు రూ.50వేలు నష్టం వాటిల్లింది. ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయని ఆశతో నాలుగు ఎకరాల్లో నాటు వేశామని.. ప్రస్తుతం పంటను పశువులను మేపడం మినహా చేసేదేమీ లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
వట్టివాగు పారుతుందని..
ఈ ఫొటోలో మీరు చూస్తున్న రైతు కేసముద్రం మండలం వెంకటగిరి శివారు తండాకు చెందిన భూక్య శ్రీను. పక్కనే ఉన్న వట్టివాగుపై ఆధారపడి పంటలను సాగు చేస్తుంటాడు. గత ఏడాది మాదిరిగా, ఈ యాసంగిలో తనకున్న ఐదెకరాల్లో వరి, ఎకరంలో బొబ్బెర, పచ్చజొన్న పంటలను సాగు చేశాడు. ఈ క్రమంలో వట్టి వాగులో చుక్క నీరు లేక పోవడంతో, గత ఏడాది మాదిరిగానే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేస్తారని ఆశపడ్డాడు. కానీ పంట సాగు చేసి రెండు నెలలు కావొచ్చినా నీళ్లు విడుదల కాలేదు. దీంతో కళ్లెదుటే వరి, బొబ్బెర, పచ్చజొన్న ఎండిపోయి నేల బీటలు వారింది. మొత్తంగా సాగుకు పెట్టిన పెట్టుబడులతో పాటు, కష్టం వృథా కావడంతో ఆ రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. -
రూ.1.60లక్షల పెట్టుబడితో పాటు శ్రమ వృథా..
పైన ఫొటోలో వరి పంటలో పశువులను మేపుతున్న రైతు పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాలేరు వీరభద్రస్వామి. తనకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. ఎకరాకు రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాలకు రూ.లక్ష ఖర్చు పెట్టాడు. ఎకరా మొక్కజొన్నకు సైతం రూ. 20 వేల చొప్పున రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాడు.. సాగు చేస్తున్న సమయంలో పుష్కలంగా నీళ్లు ఉండటంతో పంటలు వేశాడు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో బోరు ఎండిపోయి నీటి లభ్యత తగ్గింది. దీంతో ఎండిపోయిన వరిని పశువులతో మేపుతున్నాడు. పంటచేతికి వస్తే అప్పులు తీర్చుతామని ఆశపడితే.. పంటపోగా పెట్టుబడి రూ.1.60లక్షలు అదనంగా అప్పు అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఎండిన వాగులు, చెరువులు
సాక్షి, మహబూబాబాద్: ప్రకృతి సహకరిస్తేనే రైతు పండించిన పంటలు చేతికొస్తాయి. కాగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా.. అతివృష్టితో జిల్లాలోని చెక్ డ్యామ్‌లు, చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో మండు వేసవిలో నిండు కుండల్లా ఉండాల్సిన వాగులు, ఏర్లు ఎడారిని తలపిస్తున్నాయి. దీని మూలంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోరు మోటార్లు ఆగిఆగి పోస్తున్నాయి. దీంతో యాసంగి పంటలకు సాగునీరు దినదినగండంగా మారుతోంది. వరుస తడులు పెట్టినా మడి పారక నెర్రెలు బారాయి. దీంతో రైతులు పంటలను పశువులను మేపుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.యాసంగి సాగు ఇలా..ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది యాసంగిలో మొత్తం 2,09,898 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో వరి 1,37,485 ఎకరాలు, మొక్కజొన్న 45,714ఎకరాలు, పెసర 1,995, జొన్న 680 ఎకరాలతో పాటు బొబ్బెర్లు, శనిగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటలు 24,022 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో ప్రధానంగా వరిపంట పొట్టదశకు రాగా మొక్కజొన్న గింజపోసే దశకు వచ్చింది. ఈ రెండు పంటలకు ఇప్పుడు సమృద్ధిగా నీరు కావాల్సి ఉండగా.. పలుచోట్ల నీరులేక ఎండిపోవడం, మరి కొన్నిచోట్ల వారానికోమారు నీటితడి పెట్టే పరిస్థితి వచ్చింది. -
మహిళా బిల్లుతో బీసీలకు ప్రయోజనం లేదు
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుందని, ఈ బిల్లుతో మెజార్టీగా ఉన్న బీసీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివా రం హనుమకొండ కనకదుర్గ కాలనీలో బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సీ్త్ర లేనిదే సృష్టి లేదని.. అన్ని రంగాల్లో సీ్త్రలు ముందు వరుసలో ఉన్నారన్నారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో 95 మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే ఇందులో 54 మంది అగ్రకుల మహిళలని, 16 మంది ఎస్సీలు, 13 మంది ఎస్టీలు, నలుగురు మైనార్టీ మహిళలు ఉన్నారని, అయితే నేటి వరకు రాష్ట్రంలో 8 మంది మాత్రమే బీసీ మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారని వివరించారు. 5 శాతం కూడా లేని అగ్రవర్ణ మహిళలు 54 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై తే అరవై శాతం ఉన్న బీసీలు ఎనిమిది మంది మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళ సబ్ కోట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి మాట్లాడుతూ.. మహిళలంతా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు మాదం పద్మజాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమా, కార్పొరేటర్ గుజ్జుల వసంత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తమ్మల శోభారాణి, మాడిశెట్టి అరుంధతి, సమత, సంధ్య, తార, పూజిత, మానస, ప్రమోద, కాసగాని అశోక్, అరేగంటి నాగరాజు, చిర్ర సుమన్, పంజాల జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. సబ్ కోటాతోనే న్యాయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ -
కార్మిక శాఖలో కలకలం..
ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో .. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు అందాల్సిన క్లైయిమ్స్‌లో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ప్రధాన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కార్మిక శాఖలో అవినీతి అధికారుల తీరుపై ఆధారాలతో సహా ఏడాది క్రితం పలు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యూనియన్ అందించిన ఆధారాలతో సహా మరికొన్నింటిని సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని కొంతకాలం వేచిఉన్న సర్కారు.. సుమారు రెండు నెలల క్రితం ప్రత్యేక అధికారులతో కూడిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం.హన్మకొండ చౌరస్తా : కార్మిక శాఖలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కలకలం రేపుతోంది. రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు నిర్విరామంగా విచారణ కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సుధీర్ఘ విచారణ బయటకు తెలియకుండా అత్యంత రహస్యంగా, పకడ్బందీగా చేపట్టడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గల లబ్ధిదారులను అధికారులు నేరుగా కలిసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, కార్మిక శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజిలెన్స్ దాడులు, విచారణ చేపట్టడం ఇదే మొదటిసారని ఆయా శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. 5వేల మంది లబ్ధిదారుల విచారణ.. 2020 (కరోనా సమయం) నుంచి 2024 వరకు వివిధ కేటగిరీల్లో ప్రాథమికంగా దాదాపు 5వేల మంది లబ్ధిదారులు అందుకున్న క్లైయిమ్స్పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ.. గుర్తింపు కార్డు కలిగిన నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తుంది. అందులో సాధారణంగా మృతి చెందితే రూ.1,30,000, పని ప్రదేశంలో మృతి చెందితే రూ.6లక్షలు, అంగవైకల్యం పొందితే పర్సంటేజీని బట్టి రూ.20 వేల నుంచి పైచిలుకు, కార్మికుల పిల్లల వివాహ కానుక రూ.30వేలు, ప్రసవానికి రూ.30వేలు, కార్మికుడి దహన సంస్కారాలకు రూ.15 వేలు అందిస్తుంది. కాగా, లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రధాన ఫిర్యాదులు ఉన్నాయి. క్లైయిమ్స్ జమ చేయడంలో ఎవరి వాటా ఎంత? ఎలా పంచుకున్నారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.5 వేల మంది కై ్లమ్స్ లబ్ధిదారుల జాబితాపై విజిలెన్స్ విచారణ రిటైర్డ్, బదిలీ అధికారులను ఎంకై ్వరీ చేసిన అధికారులు ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో రంగంలోకి.. -
సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఎల్ఆర్ఎస్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎల్ఆర్ఎస్పై కమిషనర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయం వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి, సబ్ రి జిస్టార్ రవీంద్రబాబు, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నో ముల రవీందర్, శాంతికుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
పరిష్కారం
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ఆమోదరీతిలో వివాదాలు హన్మకొండ అర్బన్ : ‘ప్రస్తుతం ప్రారంభిస్తున్న ‘సామాజిక మధ్యవర్తిత్వ’ కేంద్రంలో ఉండే కులపెద్దలు న్యాయపరమైన శిక్షణ పొందిన వారై ఉంటారు.. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు పరస్పర ఆమోద రీతిలో వివాదాలు పరిష్కరించే అవకాశం ఉంటుంది’ అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు, పెద్దలుగా ఉండేందుకు ఆసక్తి గల వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో సేవలు అందించేవారు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలన్నారు. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. సామాజిక మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలు ఉత్తమ సేవలు అందిస్తే రానున్న రోజుల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతోపాటు కొత్త కేసులు నమోదు లేని వ్యవస్థను చూస్తామన్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మొదట నిజామాబాద్, కామారెడ్డిలో ప్రారంభించామన్నారు. అక్కడ సత్ఫలితాలు వస్తుండడంతో ప్రతి జిల్లాకు విస్తరించేలా ఈ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామమన్నారు. సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసులు వేగంగా పరిష్కారం కావడంతోపాటు కొత్త కేసులు నమోదు కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవ్యహారాల న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీభట్టాచార్య వర్చువల్‌గా మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా రానున్న రోజుల్లో పెండింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి మాట్లాడుతూ వలంటీర్లకు ముందు శిక్షణ ఇవ్వడం వల్ల వారు చట్టంపై అవగాహన ఉండి ఆ మేరకు సమస్య పరిష్కారాని కృషి చేస్తారన్నారు. కేసుల పరిష్కారం విషయంలో ఇరు పక్షాల వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. కేసు వివరాల నమోదులో ఎక్కడా ఎవరి వల్ల కేసు పరిష్కారమైంది.. ఎవరి వల్ల పరిష్కారం కాకుండా ఆగిందనే అంశం నమోదు చేయొద్దని సూచించారు. తుది ఫలితం మాత్రమే నమోదు చేయాలన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమ సభ్యులు బూర విద్యాసాగర్, శంతన్‌రామరాజు, యాదగిరి గౌడ్, భిక్షపతి యాదవ్ సందేహాలను న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నివృతి చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాల మనుగడకోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. వివిధ జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే సివిల్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఇతర కేసులపై పోలీసులు దృష్టిసారించొచ్చన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్. రమేశ్‌బాబు, సభ్య కార్యదర్శులు సీహెచ్. పంచాక్షరి, హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, డాక్టర్ దివాకర, రిజ్వాన్‌బాషా, అద్వైత్‌కుమార్, రాహుల్‌శర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా, కమిషనర్ అశ్వినితానాజీ వాఖడే, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి ఒకటి చేశారు. అదే విధంగా రోడ్డు ప్రమాద కేసును పరిష్కరించి బాధితురాలికి రూ.18 లక్షలు చెక్కు అందజేశారు. పెండింగ్ కేసులు లేని వ్యవస్థను చూడగలం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం -
పగలు, ప్రతీకారాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్: పగలు, ప్రతీకారాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేశ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఆవేశంలో తప్పులు చేసినా రాజీపడేందుకు లోక్ అదాలత్ ఒక సదవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర పద్మాకర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, డేగల సత్యనారాయణ, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. 1,183 కేసులు పరిష్కారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా 1,183 కేసులు పరిష్కారం జరిగాయి. 13 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించగా బాధితులకు రూ.58.95 లక్షలు పరిహారం, ఒక సివిల్ కేసును పరిష్కరించగా రూ.1.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. 107 సీసీఐపీసీ కేసులు పరిష్కరించి రూ.51,100 జరిమానా విధించగా 15 బీఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించి రూ.14,300 బాధితుల నుంచి రికవరీ చేశారు. 24 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి సురేశ్ జాతీయ లోక్ అదాలత్‌లో 1,183 కేసులు పరిష్కారం -
పనికి వెళ్తూ ప్రమాదంలోకి..
ఏటూరునాగారం: మిర్చి ఏరడానికి వెళ్లి వస్తున్న కూలీల వాహనం బోల్తా పడి 9 మందికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఛత్తీస్‌గఢ్ కు చెందిన 16మంది వలస కూలీలు మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో శనివారం ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన ఒక రైతు చేనులో మిర్చి ఏరేందుకు వెళ్లారు. సాయంత్రం పనిముగిసిన అనంతరం పంట యజమాని స్వయంగా టాటా ఏస్ వాహనంలో కూలీలను ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఈ రాంనగర్– కమలాపురం మధ్యలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన కూలీలను హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. గాయపడిన, పేగులు బయటకు వెళ్లిన క్షతగాత్రులకు వైద్యులు, సిబ్బంది చికిత్స చేశారు. గాయపడిన వారిలో మైనర్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్ జిల్లాకు చెందిన వారు మిర్చితోట కూలీ పనులకు వచ్చిన వారిలో మైనర్లు కూడా ఉండడం గమనార్హం. మైనర్లు కూడా ఈ ఘటనలో గాయపడడం బాధాకరం. అలాగే, తీవ్ర గాయాలైన వారిలో పోడియం మున్న, మూచకి గగ్గు, మూచకి లక్కు, కోవ్వాసి శాంతి, పాయం లక్ష్మి ఉన్నారు. అనేకమార్లు హెచ్చరించినా.. ప్రమాదవిషయాన్ని తెలుసుకున్న ఎస్సై తాజొద్దీన్ సామాజిక ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కూలీలను గూడ్స్ వాహనాల్లో తీసుకెళ్లొద్దని రైతులు, కూలీలకు, కూలీల ముఠా మేసీ్త్రలను హెచ్చరించినా.. మారడంలేదన్నారు. మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో నలుగురు మరణించారు. మైనర్లను కూలీలుగా పెట్టుకోవద్దన్నారు.కూలీల వాహనం బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు నలుగురి పరిస్థితి విషమం -
ప్రపంచదేశాలతో పోటీపడేందుకు సిద్ధం కావాలి
● నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మహబూబాబాద్ అర్బన్: సృజనాత్మక ఆవిష్కరణలో విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ ప డేందుకు సిద్ధం కావాలని వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి సమయపాలన పాటించి చదివితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు, మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పా ల్ బి.లక్ష్మణ్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీని వాసులు, అధ్యాపకులు అహ్మద్, వినోద్, హాతి రామ్, అన్నపూర్ణ, ప్రభావతి, ఉపేందర్, నాగరాజు, ఉదయ్, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేయాలని ధర్నా గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏటికి శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని కోరుతూ శనివారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పాకాల ఏటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. వేసవికాలం ప్రారంభంలోనే పాకాల ఏరు నీళ్లులేక ఎండిపోతుందని, ఈ ప్రాంతంలో వరిపంట సాగు చేసిన పంటలకు నీళ్లులేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మరో వారం రోజుల్లో పాకాల ఏటికి నీళ్లు రాకపోతే ఈ ఏటి పరీవాహక ప్రాంతంలో సాగుచేసిన సుమారు 200 ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, పోతుల నర్సింహరావు, జి.వీరన్న, జి.శంకర్, రమేష్, సురేష్, వెంకన్న, జితేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రగతి● జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ డోర్నకల్: మహిళల భాగస్వామ్యంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అన్ని పాత్రల్లో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు. వైద్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంతోమంది మహిళలు రోగులకు సేవ చేస్తూ మథర్ థెరిసాను గుర్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందడుగేస్తూ అభివృద్ధిపథంలో పయనించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేయగా డాక్టర్ మురళీధర్ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాధ్విజ, సీఐ బి.రాజేష్, ఎస్సైలు గడ్డం ఉమ, బి.మౌనిక వైద్యురాలు డాక్టర్ సాధ్విజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా ఇన్నోవేషన్ సమిట్–25 ప్రారంభం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని ఇన్నోవేషన్ గ్యారేజీలో శనివారం రెండు రోజుల స్టూడెంట్ ఇన్నోవేషన్ సమిట్–25ను నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, పరిశ్రమల నిపుణులు, సాంకేతిక అభిరుచిగల వారిని ఒకే వేదికపై చేర్చి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు ఇన్నోవేషన్ సమ్మిట్–25ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు
మహబూబాబాద్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రేగ్యులేషన్ స్కీం) రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కా రణంగా రిజిస్ట్రేషన్లు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 సాఫ్ట్వేర్, ఇతర ప్రక్రియ పూర్తి కాగా ఫీజు చెల్లింపు అంతా మున్సిపాలిటీలో ఇచ్చిన విధివిధానాలే ఉన్నాయి. జిల్లాలో 26,001 దరఖాస్తులు 2020 ఆగస్టు 26లోపు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇందులో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు రావడంతో దరఖాస్తుదారులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మానుకోట, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం కూడా మున్సిపాలిటీ అయింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 26,001 దరఖాస్తులు రాగా 8,264 ఆమోదించగా 84 తిరస్కరణకు గురి కాగా మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 8,264 దరఖాస్తుదారుల్లో కూడా 389 మంది మొత్తం ఫీజు చెల్లించి అనుమతి తీసుకోగా 7,875 మంది ఫీజు పెండింగ్‌లో ఉన్నాయి. 25 శాతం రాయితీతో.. ప్రభుత్వం త్వరగా ఎల్ఆర్ఎస్ తీసుకోవాలని దరఖాస్తుదారుల కోసం ఈనెల 31వ తేదీలోపు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ ప్రకారం ఉన్న విలువలో 14శాతం ఫీజు చెల్లించాల్సి ఉంది.మున్సిపాలిటీల్లో కేవలం దరఖాస్తు చే సుకున్న వారికిమాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఫీజు చెల్లించకపోయినా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు మాత్రం మున్సిపాలిటీ వెబ్సైట్లోనే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గతంలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.1000 చెల్లించినా.. చెల్లించకపోయినా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వే నంబర్, ఇతర అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. మానుకోట జిల్లా కేంద్రం కేంద్రంలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో ఈనెల 10 (సోమవారం) నుంచి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లపై సమాచారాన్ని పూర్తి వివరాలు తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించారు. ము న్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. రేపటి నుంచి అందుబాటులోకి సేవలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఈ నెల 31 వరకు 25శాతం రాయితీతో అవకాశం -
ప్రాణం తీసిన చేపలవేట
నెల్లికుదురు: నీటి కుంట మృత్యు కుహరంగా మారింది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఒకే తండాకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. కుటుంబ పెద్దను కోల్పోయి ఒక కుటుంబం.. చేతికి అందివచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో మరో కుటుంబం దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్ (21) హనుమకొండలోని ఓప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని ఇంటికొచ్చాడు. తండాలో పక్కపక్కనే ఇళ్లు ఉండడంతో భూక్య రాములు(45)తో కలిసి మేచరాజుపల్లి శివారులోని కుమ్మరికుంటలో చేపలు పట్టేందుకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వెతకగా.. కుమ్మరి కుంట వద్ద వారి చెప్పులు, బట్టలు కనిపించాయి. తండావాసులకు సమాచారం ఇచ్చి వెతకగా.. నీటి కుంటలో విగతజీవులై కనిపించారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడినట్లు, ఈత రానందున చనిపోయినట్లు తండావాసులు చెబుతున్నారు. శేఖర్, రాములు మృతితో తండాలో విషాదం అలుముకుంది. తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ రాములు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటికి పెద్ద చనిపోవడంతో రాములు కుటుంబం రోడ్డున పడింది. ఆసరాగా నిలుస్తాడనుకున్న శేఖర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు, యువకుడి మృతి ఇటీవల అదుపు తప్పి కారుబోల్తా.. ఆరుగురికి గాయాలుప్రమాద కుంట! రోడ్డుకు ఆనుకుని కుమ్మరి కుంట ఉంది. ఇందులో 15 రోజుల క్రితం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కుంట ప్రమాదకరంగా మారిందని, తగు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్‌కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవా అధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ● హనుమకొండలో జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం ● అక్కడికక్కడే పలు కేసుల పరిష్కారం– హన్మకొండ అర్బన్– వివరాలు 8లోu -
అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం..
కేయూ క్యాంపస్: సామాజిక అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం అని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం అన్నారు. ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా కాశీం మాట్లాడారు. మహేందర్ కవిత్వం మనిషి కేంద్రమై సాగుతూ కులమతాల నిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రశ్నించిందన్నారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మనిషిని సంస్కరించే దిశగా మహేందర్ కవిత్వం కొనసాగిందన్నారు. కవి, విమర్శకుడు పుప్పాల శ్రీరామ్ మాట్లాడుతూ.. సంపుటిలోని కవితలు పాఠకుల్ని తప్పకుండా కదిలిస్తాయన్నారు. ఈసభలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు, కవి పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరశంకరం, ఆచార్యులు బన్న అయిలయ్య, కవి రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని గురిజాల శశికళ తిరుపతిరెడ్డికి కవి మహేందర్ అంకితం ఇచ్చారు. గ ట్టు రాధిక, కార్తీకరాజు, ఫణిమాధ వి, తగుళ్ల గోపా ల్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి ఒకరి గల్లంతు ఎల్కతుర్తి: ఓ యువకుడు బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో శనివారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి, గ్రామస్తులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మ హ్మద్ చొటేమియాకు నలుగురు సంతానం. కాగా, మూడో కుమారుడు మహ్మద్ సలీంపాషా(24) బ హిర్భూమికని గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వ కట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతయ్యాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి చొటేమియా ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లి చూడగా తన కుమారుడి చెప్పులు, నెక్కర్(లాగు) ఉండడాన్ని గమనించారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి, యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. -
బాధిత మహిళలకు భరోసా ‘సఖి’ కేంద్రాలు..
మహబూబాబాద్ సఖి సెంటర్ ద్వారా ఏడాదిలో అందించిన సేవల వివరాలు సఖి కేంద్రంలో నమోదైన కేసుల సంఖ్య : 284 పరిష్కరించిన కేసులు : 197 పెండింగ్ కేసులు : 87 సఖి కేంద్రంలో అందించిన సేవలు : సైకో సోషల్ కౌన్సిలింగ్ : 630 లీగల్ కౌన్సెలింగ్ : 425 డీఐఆర్ ఫైలింగ్: 11 అవగాహన కార్యక్రమాలు : 93 పాల్గొన్న సభ్యుల సంఖ్య : 19,659 181 మహిళా హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన 82 కాల్స్‌కు 25 కేసులు నమోదు చేశారు. 284 కేసుల్లో 123 మందికి (పిల్లలతో) షెల్టర్ ఇచ్చారు.వరంగల్ సఖి సెంటర్ ద్వారా అందించిన సేవల వివరాలు కౌన్సెలింగ్ నిర్వహించిన కేసులు : 1292 ఫ్రీ లీగల్ ఎయిడ్/ లీగల్ కౌన్సెలింగ్ అందించిన కేసులు: 527 పోలీసు సాయం అందించిన కేసులు : 426 వైద్య సాయం అందించిన కేసులు: 566 వసతి కల్పించిన కేసులు : 402 అత్యవసర సమయాల్లో రెస్క్యూ చేసిన కేసులు : 75 సర్వైవర్ కిట్స్ ఇచ్చిన కేసులు : 60 ఇప్పటి వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు: 856 పాల్గొన్న సభ్యులు: 51,365 సాక్షి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్ : సఖి కేంద్రాలు బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. వేధింపులు, గృహ హింస నుంచి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడానికి ఈ కేంద్రాలు సాయపడుతున్నాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం, న్యాయ, ఆర్థిక సాయం అందిస్తున్నాయి. కాగా, 181 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించడం ద్వారా బాధిత మహిళలకు సాయం అందనుంది. కాగా, వరంగల్ సఖి సెంటర్ 2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1295 కేసులు వస్తే 945 పరిష్కరించారు. 200 కేసులు మూసివేశారు. 21కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 109 కేసులు కోర్టులో నమోదయ్యాయి. అలాగే, మహిళా హెల్ప్ లైన్ ద్వారా 725 కేసులు నమోదయ్యాయి. -
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..
● వ్యక్తి అరెస్ట్ ● వివరాలు వెల్ల డించిన ఏసీపీ దేవేందర్రెడ్డివరంగల్ క్రైం: ప్రభుత్వ ఉద్యోగాలు, నిట్ లాంటి కళాశాలలో సీ టు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ. లక్షల్లో డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు దండుకున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.5.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.68 లక్షల నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, ఐడీఎఫ్సీ డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ పీఎస్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వె ల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, వీరపునాయుడిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లికి చెందిన కొమ్మ వివేకానంద రెడ్డి అలియాస్ కిశోర్‌రెడ్డి కొంత కాలం ప్రైవేట్ టీచర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో సహ ఉద్యోగుల వద్ద అవసరానికి డ బ్బులు, బంగారం తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఘటనలో రెండు నెలలు జైలు జీవితం గడిపాడు. అనంతరం తన మకాం హనుమకొండకు మార్చాడు. ఇక్కడ మరోపేరుతో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూనే తనకు వరంగల్ నిట్‌లో పరిచయస్తులు ఉన్నారని, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళా టీచర్‌ను నమ్మించి ఆమెవద్ద రూ.8 లక్షలతో పాటు ఆమె కొడుకుకు నిట్‌లో సీటు ఇప్పిస్తానని 60గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అలాగే, మరో ముగ్గురు బాధితుల నుంచి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తాను ఉంటున్న కిరాయి ఇంటి నుంచి సామగ్రి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రించగా నేరం అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!
మహబూబాబాద్ అర్బన్: మేం ఇద్దరం. మాకు ఒక్క ఆడపిల్ల చాలు.. అంటున్నారు మానుకోట జిల్లా కేంద్రంలోని పాత బజార్‌కు చెందిన షేక్ మహబూబ్‌పాషా–షేక్ రిజ్వానా దంపతులు. 2014లో వారికి సమీర జన్మించింది. ఆ చిన్నారిని ధైర్యవంతురాలిగా పెంచాలని నిర్ణయించుకున్నారు. కరాటే, కబడ్డీ, రన్నింగ్, స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. ఆ పాపలోనే తన తల్లిని చూసుకుంటున్నట్లు రిజ్వానా చెబుతున్నారు. మాకు అబ్బాయి పుట్టలేదని బాధపడకుండా పాపను మగపిల్లలతో సమానంగా పెంచుతామంటున్నారు షేక్ మహబూబ్‌పాషా– షేక్ రిజ్వానా దంపతులు. -
మహిళల ‘సౌర’ సాగు..
హన్మకొండ : మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ దిశగా వివిధ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తోంది. ఈ క్రమంలో మహిళలతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాల్లో ప్రభుత్వ భూములు గుర్తించింది. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గ్రామాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ స్థల లభ్యతను బట్టి హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు గ్రామాల చొప్పున మహబూబాబాద్ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఒకే ప్రాంతంలో 8 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఒకే గ్రామాన్ని ఎంపిక చేసింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం అవసరం. ప్రతీ గ్రామంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎంపిక చేసిన రెండు గ్రామైఖ్య సంఘాలకు 0.5 మెగావాట్ల చొప్పున సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. రెండు గ్రామైఖ్య సంఘాలకు ఒక మెగావాట్ చొప్పున ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు.. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రైతులతో పాటు మహిళా స్వయం, రైతు ఉత్పత్తి, సహకార, నీటి వినియోగదారుల సంఘాలు, పంచాయతీలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా పథకం రూపొందించాయి. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించుకోగా ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేదో అని అధికారులు పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 95 స్థలాల్లో 964 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించారు. ఇందులో 53 స్థలాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు అనువుగా ఉన్నట్లు తేల్చారు. హనుమకొండ జిల్లాలో 38 స్థలాల్లో 15 స్థలాలు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. వరంగల్ జిల్లాలో 13 స్థలాల్లో 6, ములుగు జిల్లాలో 12 స్థలాల్లో 11, మహబూబాబాద్ జిల్లాలో 4 స్థలాల్లో 4, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 13 స్థలాల్లో 8, జనగామ జిల్లాలో 15 స్థలాల్లో 9 స్థలాలు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం.. ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం కానుంది. ఇందులో స్వయం సహాయక సంఘాలు 10 శాతం కింద రూ.30 లక్షలు భరిస్తే, బ్యాంకు 90 శాతం రుణం కింద రూ.2.70 కోట్లు అందిస్తుంది. ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.66 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రోజుకు దాదాపు 4,500 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. యూనిట్‌కు డిస్కంలు రూ.3.13 చొప్పున చెల్లిస్తాయి. నెలకు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బట్టి ప్రతీ నెల డిస్కం చెల్లింపులు చేస్తుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 25 సంవత్సరాల పాటు ఆదాయం పొందొచ్చు. నేడు ముఖ్యమంత్రితో ప్రారంభం.. ప్రభుత్వం మహిళా సంఘాలతో ముందుగా జిల్లాకు రెండు గ్రామాల్లో 2 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాలను ఎంపిక చేశా రు. జనగామ జిల్లాలో అశ్వరావుపల్లి, వావిలాల, హనుమకొండ జిల్లాలో సూరారం, ఆత్మకూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భజనపల్లి, మహాముత్తారం, ములుగు జిల్లాలో పత్తిపల్లి, జగ్గన్నపేట, వరంగల్ జిల్లాలో వంచనగిరి, మురిపిరాల, మహబూబాబాద్ జిల్లాలో అబ్బాయిపాలెం గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహిళలతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా హనుమకొండ జిల్లాకు 2 మెగావాట్ల ఉత్పత్తి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల ఉత్పత్తి ఆరు జిల్లాల్లో 11 గ్రామాల ఎంపిక ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు నేడు (మహిళా దినోత్సవం రోజు) సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన -
మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తున్న పోలీసులు
వరంగల్ క్రైం: కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న అలజడులు.. పనిచోట వేధింపులు.. కళాశాలలు, పాఠశాలల దగ్గర పోకిరీల ర్యాగింగ్.. ఇలా ఏ ఘటన జరిగినా బాధిత మహిళలు, బాలికలకు పోలీసులు భద్రత, భరోసా కల్పిస్తున్నారు. ఆపద సమయంలో మేం అండగా ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. మహిళ, బాలికల రక్షణకు పోలీస్ స్టేషన్లతో పాటు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు, ‘షీ’టీమ్స్ విభాగం, భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు అండగా నిలుస్తున్న పలు విభాగాల సేవలు అతివలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు, బాలికల రక్షణకు పోలీసులు, ‘షీ’ టీమ్స్ తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మఫ్టీలో ‘షీ’ టీమ్స్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ‘షీ’ టీమ్స్ విభాగం అధికారులు పోకిరీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్దేశించిన హాట్స్పాట్ల వద్ద ‘షీ’ టీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిల ఆట కట్టిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, కళాశాలలు, పాఠశాలల వద్ద మఫ్టీలో ఉంటూ ఎవరైనా ఆకాయిలు.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే వారిని పట్టుకుంటున్నారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి శృతి మించితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. బాధితులకు సాయం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా బాలికలు, మహిళలు లైంగికదాడికి గురైతే వారిని వెంటనే భరోసా కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ కేంద్రంలో ఏఎన్ఎం సేవలతో పాటు లీగల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగే వరకూ భరోసా కేంద్రం అధికారులు అండగా నిలుస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ వాతావరణం కనిపించకుండా, బాధితులు భయపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నారు. మహిళలపై ఆగని దాడులు.. పోలీసులు మహిళా రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్న వారిపై దాడులు మాత్రం అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. గతేడాది వరకట్న మరణాలు 10 జరగగా 39 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలపై వే ధింపులకు పాల్పడిన నేపథ్యంలో గత సంవత్సరం 626, ఈ ఏడాది 91 కేసులు నమోదయ్యాయి. గతేడాది లైంగికదాడి కేసులు 146 కాగా , ఈ ఏడాది ఇప్పటి వరకు 22 జరిగాయి. మహిళా పీఎస్‌లో కేసు తీవ్రతను బట్టి కౌన్సెలింగ్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండ జిల్లాకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ (అర్బన్) రంగంపేటలో ఉండగా, వరంగల్, జనగామ జిల్లాలకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సుబేదారిలో ఉంది. దంపతులు, కుటుంబాల కలహాలు, వివాహేతర సంబంధాలు, వరకట్న కేసులు, దాడులు.. ఇలా అనేక అంశాలలో ఫిర్యాదులు స్వీకరించి వాటి తీవ్రతను బట్టి మొదటి కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తరువాత కేసులు నమోదు చేస్తున్నారు. బాధిత మహిళలకు కావాల్సిన అనేక రకాల విషయాలపై కౌన్సెలింగ్ నిర్వహించి అండగా నిలుస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు.. పట్టేస్తాం మహిళలు, బాలికలు తమను పోకిరీలు ఇబ్బందులకు గురిచేసినా, ఫోన్లకు అసభ్యకర ఫొటోలు పంపినా, బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడినా ఫోన్ చేస్తే చాలు.. పోకిరీలను పట్టుకుని వారి ఆట కట్టిస్తాం. మహిళలు, బాలికలు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు. కుటుంబీకులతో చెప్పుకోలేని విషయలను కూడా మా దగ్గర చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా అండగా ఉండి రక్షిస్తాం. ఇబ్బందులు తలెత్తుతే నేరుగా 8712 685142 నంబర్‌కు ఫోన్ చేయండి. –కొడురి సుజాత, ఇన్స్పెక్టర్ ‘షీ’ టీమ్స్ పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’ టీమ్‌లు బాధిత మహిళలకు ‘భరోసా’ కేంద్రం.. అతివలకు మహిళా పోలీసు స్టేషన్లు కొండంత అండ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహబూబాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ మహిళలు విద్యా, ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాలంబన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, డీడబ్ల్యూఓ దనమ్మ, డీఎంహెచ్ఓ మురళీధర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి పాల్గొన్నారు. రాయితీపై విస్తృత ప్రచారం చేయాలి మహబూబాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఫీజు 25 శాతం రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ బుద్ద ప్రకాష్ జ్యోతి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నోముల రవీందర్, శాంతి కుమార్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను73BA1702) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను C7837623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో2001104) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
రాజీ మార్గమే రాజమార్గం
ఇరుపక్షాలు గెలిచినట్టే.. లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలిచినట్లే. లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక మంచి ఆలోచనకు వచ్చి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి. – డి.రవీంద్రశర్మ, ఇన్చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిమహబూబాబాద్ రూరల్: సత్వర న్యాయం, సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వేదికగా కక్షిదారులు రాజీకి వచ్చి కేసులను తొలగించుకుని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుతుంది. కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఇన్చార్జ్ జిల్లా జడ్జి రవీంద్రశర్మ, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఆధ్వర్యంలో జడ్జీలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్, సివిల్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించిన సమయంలో రాజీ పడదగిన సివిల్, మోటారువా హన ప్రమాదాలు, క్రిమినల్, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచిస్తున్నారు. 9,439 కేసుల పరిష్కారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 2024 సంవత్సరంలో 4 పర్యాయాలు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 9,439 కేసులు పరిష్కారం అయ్యాయి. మార్చి 16న 3,323 కేసులు. జూన్ 8న 1,088 కేసులు, సెప్టెంబర్ 28న 1,777 కేసులు డిసెంబర్ 14న 3,251 కేసులు పరిష్కారం జరిగాయి. నేడు జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టు భవనాల సముదాయ ప్రాంగణంలో నేడు (శనివారం) ఉదయం పది గంటలకు జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ఇన్చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి.సురేష్ పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియజేసి రాజీ కుదుర్చుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ -
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ బస్టాండ్ సమీపం సెంట్రల్ కాంప్లెక్స్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన వారికి నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రాలు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు నమోదు , ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోస్టర్ ఆవిష్కరణ
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ పోలీస్ కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సంబంధించిన పోస్టర్‌ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్సైట్ ద్వారా సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లలో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారన్నారు. సైనిక్ స్కూల్ తరహాలో దేశానికి ఒక రోల్ మోడల్లా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ స్కూల్ ఉంటుందన్నారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించడం, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం స్కూల్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఆర్ఐలు సోములు, భాస్కర్, ఐటీ సెల్ ఎస్సై అరుణ్ కుమార్, శ్రీధర్, రవి పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ తెలంగాణ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద వంగర పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్ ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం సేవించారనే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సదరు ఘటనపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై రిపోర్ట్ పంపగా వారిని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. మెరుగైన ఫలితాలు సాధించాలి●కురవి/నెల్లికుదురు: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కురవి, నెల్లికుదురు మండలాల్లోని పలు పాఠశాలల్లో జరుగుతున్న టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలో ఆన్సర్ బుక్లెట్ గురించి వివరించారు. ఓఎంఆర్ షీట్ డిస్ప్లే వినియోగం తీరును వివరించారు. లోటుపాట్లను సరిదిద్దుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇష్టపడి చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాలలో లోకాస్ట్, నోకాస్ట్ యూరినల్ యూనిట్లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, హెచ్ఎం ఎ.రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ గుండాల మురళీ ధర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రై వేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్యాధికారులు తనిఖీ చేశారు. అనుమతులు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో ఫీజుల వివరాలు, వై ద్యుల పేర్లు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులనే డ్యూటీ డాక్టర్లను నియమించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు రాష్ట్ర వి ద్యా మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వై ద్యం చేయడానికి అనుమతించాలన్నారు. -
కూతుళ్లే మహారాణులు
జఫర్‌గఢ్: కూనూర్ గ్రామానికి చెందిన ఈగ కృష్ణమూర్తి–శోభ దంపతులకు రమ్యకృష్ణ, సౌమ్యకృష్ణ ఇద్దరు కుమార్తెలు. కృష్ణమూర్తి ఇంటి ముందు చిన్న టీ కొట్టుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెల ప్రాథమిక విద్య స్టేషన్‌ఘన్‌పూర్‌లో, ఇంటర్ హనుమకొండలోని ప్రైవేట్ కళాశాలలో చదివించాడు. పెద్దకూతురు రమ్యకృష్ణ హైదరాబాద్ వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు సౌమ్యకృష్ణ కూడా హైదరాబాద్ ఎంజీఐటీ కళాశాలలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఈమె నాలుగు నెలల క్రితం నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చిన్న తనం నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన అక్కాచెల్లెల్లు పట్టుదలతో చదివి కన్నవారి కష్టాలు దూరం చేశారు. పిల్ల లు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులయ్యారని, ఆడపిల్లలైనా మగ పిల్లలు లేని లోటు తీర్చారంటూ ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కూతుళ్లతో తల్లిదండ్రులు తిరుపతి,సరితటేకుమట్ల: కూతుళ్లయితే ఏంటి వారిని ఝాన్సీరాణి మాదిరి తీర్చిదిద్దడమే మా బాధ్యత అంటున్నారు టేకుమట్ల మండలంలోని పెద్దంపల్లికి చెందిన శాస్త్రాల తిరుపతి–సరిత దంపతులు. వారి ఇద్దరు కుమార్తెలు వర్థినిసేన తొమ్మిదో తరగతి చదువుతుండగా.. ధైర్యసేన రెండో తరగతి చదువుతోంది. వర్థినిసేనకు కరాటే, కర్రసాము, క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ అండర్–14 కరాటే విభాగంలో తెలంగాణ నుంచి వర్థినిసేన పాల్గొంది. చిన్న కూతురు ధైర్యసేనకు సైతం పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. కూతురంటేనే ఇష్టం ఖానాపురం: తమకు కూతురంటేనే ఇష్టం అంటున్నారు ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పేరాల హరీశ్‌రావు–కల్పన దంపతులు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరికి కుమార్తె అంజనారావు పుట్టగానే ఆమైపె ఇష్టంతో ఇక పిల్లలు వద్దనుకున్నారు. ఆమెను ఐపీఎస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని చదివిస్తున్నారు, ఐదేళ్ల ప్రాయం నుంచే కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా కుమార్తెను ఐపీఎస్‌గా చూడాలన్నదే తమ కోరిక అని వారు చెబుతున్నారు. కొందరు ఒక్కరితోనే సరి.. మరికొందరికి ఇద్దరు కూతుళ్లు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న పేరెంట్స్ మగపిల్లలు లేని లోటు తీరుస్తున్నారంటున్న తల్లిదండ్రులు -
మహిళా దినోత్సవానికి 12 ఆర్టీసీ బస్సులు
హన్మకొండ: హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి మహిళలను తరలించేందుకు వరంగల్ రీజియన్‌లో 12 బస్సులు కే టాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు రెండేసి బస్సుల్లో మహిళలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అద్దె బస్సులను మహిళలకు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఎన్ని బస్సులు కేటాయిస్తారనే దానిపై స్పష్టత కరువైంది. దీనిపై ఆర్టీసీ అధికా రులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని తెలిపారు. వరంగల్ రీజియన్‌కు మహిళా సంఘాలకు 40 నుంచి 50 బ స్సులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. మహిళా దినోత్సవం రోజున జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 150 బస్సులు మహిళా సంఘాలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వరంగల్ రీజియన్‌కు ఎన్ని ఇస్తారనేది నేడు(శనివారం) స్పష్టం కానుంది. వాజ్‌పేయి జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి జీవిత చరిత్ర, ఆయనతో ప లువురు వ్యక్తులకు సన్నిహిత సంబంధాల జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ రూ పొందించనున్నట్లు అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘అటల్ జీ యాది (స్మృతి)లో నేను’ అనే ఈ కార్యక్రమాన్ని బీజేపీ జా తీయ నాయకత్వం తీసుకుందన్నారు. వాజ్‌పేయితో సన్నిహితంగా ఉన్న వారు ఉమ్మడి వరంగల్‌లో ఎందరో ఉన్నారని, వారంత తమ వద్ద ఉన్న జ్ఞాపకాలను తన వాట్సాప్ నంబర్లు 9849235055, 9550735675కు గాని ఎఎస్ఆర్నాయక్9 ఎట్దీ రేట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రావు, ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పద్మ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
● ఒక్కటైన కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు కేసముద్రం : కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
ఆర్టీఏపై విజిలెన్స్ నిఘా
ఖిలా వరంగల్ : వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అందించే సేవలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అధికారుల పనితీరు, వాహనదారులకు అందించే సేవలపై రహస్యంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీరో కౌంటర్ల వద్ద అందజేస్తున్న సేవలు, వాహన ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ విధానం, ఆన్లైన్ డ్రైవింగ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. అనంతరం జీరో కౌంటర్లలో సోదాలు చేసిన అధికారులు ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్ బాబును కలిసి సేవలకు సంబంధించిన కొన్ని పత్రాలను అడిగి తీసుకున్నారు. దళారుల కార్యాలయాల్లో ఏమైనా వాహనదారులకు చెందిన ఫైల్స్ ఉన్నాయా.. అనే దానిపై ఆరా తీశారు. అధికారుల పనితీరు, రవాణాశాఖ అందజేస్తున్న సేవలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.● తరచూగా ఆకస్మిక పరిశీలన, తనిఖీలు -
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
చెన్నారావుపేట : డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాలీ వాహనం బోల్తాపడిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం శివారులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జీడిగడ్డ తండాకు చెందిన 37 మంది వ్యవసాయ కూలీలను ఇటుకాలపల్లి శివారు ఇప్పల్ తండాకు చెందిన ధరావత్ మైబూ మిర్చి ఏరేందుకు కూలీలను తీసుకు రమ్మని జీడిగడ్డ తండాకు చెందిన భూక్య సమ్మికి చెప్పాడు. బానోత్ సుక్యతో పాటు 37 మందిని కూలీలను తీసుకోని గూడ్స్ వాహనంలో గురువారం ఉదయం ఇప్పల్ తండాకు బయలుదేరారు. గార్లగడ్డ తండాకు చెందిన ట్రాలీ డ్రైవర్ అజ్మీరా సంతోష్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో పాటు ఎక్కువ మంది ఉండడం వల్ల కోనాపురం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 37 మంది కూలీలు కింద పడ్డారు. అందులో కొందరికి తీవ్రగాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోతరాజు రాజు, పున్నం నర్సయ్య వెంటనే 108తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌రెడ్డిలు చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బానోత్ సుక్య (55) మృతిచెందాడు. బానోత్ ఈర్య, ఆంగోత్ జమ్లి, నూనావత్ అంబాలి, బానోత్ బుజ్జి, సంపుతోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎంజీఎంకు తరలించారు. మృతుడి కుమారుడి మోహన్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు. తప్పిన పెను ప్రమాదం.. వాహనం బోల్తా పడిన ప్రదేశంలో పెద్ద బండరాయి ఉంది. ఒకవేళ వాహనం బండరాయి పై పడి ఉంటే మరికొందరు మృత్యువాత పడేవారని స్థానికులు చెబుతున్నారు. వాహనంలో 37మంది కూలీలు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం కోనాపురం శివారులో ఘటనబతికి బయట పడ్డా..నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన రైతు పంపిన వాహనంలోనే మిర్చి ఏరడానికి వెళ్లాను. వాహనం స్పీడ్‌గా వెళ్తుంది. ఒక్కసారి కోనాపురం శివారులో బోల్తా పడింది. కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలే. చాలా మందికి దెబ్బలు తగిలాయి. నాకు స్వల్పంగా గాయాలయ్యాయి.ఆ ప్రమాదం చూస్తే చనిపోయాననుకున్నా. దేవుడు మరో జన్మనిచ్చాడు. – బానోత్ అరుణ, ట్రాలీలో ఉన్న కూలీ కళ్ల ముందే బోల్తా పడింది..కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడిన సమీపంలోనే నా వ్యవసాయ భూమి ఉంది. పంటకు నీళ్లు పెట్టి బయటికి వచ్చాను. చూస్తుండగానే అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. వెంటనే అక్కడికి వెళ్లి వాహనంలో ఉన్న వారి సాయంతో అందరిని బయటికి తీశాం. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. – పున్నం నర్సయ్య, ప్రత్యక్ష సాక్షి -
పెళ్లి వద్దని ఆత్మహత్యాయత్నం
● మానుకోట ఎస్సై సమాచారంతో కాపాడిన కాజీపేట జీఆర్పీ అధికారులు ● తండ్రికి విద్యార్థిని అప్పగింత కాజీపేట రూరల్ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానా మడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
శరవేగంగా భూ సర్వే
ఖిలా వరంగల్ : మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూ సర్వేకు రైతుల సైతం సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధుల విడుదల చేసింది. కలెక్టర్ ఆదేశాలతో గురువారం తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నక్కలపల్లి, గాడిపల్లి గ్రామ శివారులో శరవేగంగా భూ సేకరణకు సర్వే చేపట్టారు. రైతుల సహకారంతో తొలిరోజు 170 ఎకరాల భూ సర్వే చేసి హద్దులు గుర్తించారు. అనంతరం భూ నిర్వాసితుల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల సహకారంతో తొలిరోజు నక్కలపల్లి–47, గాడిపల్లి శివారు పరిధిలో 123, మొత్తం 170 ఎకరాలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన 8 3 ఎకరాల భూమి మరో మూడ్రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు త హసీల్దార్ తెలిపారు. అనంతరం సర్వేకు సహకరించిన రైతులకు తహసీల్దార్ నాగేశ్వర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వేలో ఆర్ఐ ఆనంద్‌కుమార్, సర్వేయర్ రజిత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ● సర్వేకు రైతుల సుముఖత ● ఎయిర్ పోర్ట్ రన్‌వేకు 253 ఎకరాల భూమి సేకరణ -
గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 10 కిలోల 102 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ పి.సర్వయ్య తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సర్వయ్య కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా బడఖరిడకు చెందిన బరున బరడ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాలోని ఒకరివద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేశాడు. సూరత్‌లో అధిక ధరకు విక్రయించేందుకు విజయవాడ మీదుగా వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలుసుకుని మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. తొర్రూరు మీదుగా వరంగల్ వెళ్లేందుకు ఆటో ఎక్కి వెళ్తుండగా శనిగపురం వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆటోదిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని పట్టుకుని, 10 కిలోల 102 గ్రాముల (రూ.5.05 లక్షల విలువగల) ఎండు గంజాయి, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై దీపిక, ట్రెయినీ ఎస్సై నరేష్, ఏఎస్సై జాకీర్, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ అభినందించారు. రూ.1,42లక్షల విలువైన గంజాయి.. నడికూడ : మండలంలోని చర్లపల్లి వద్ద నిషేధిత గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బస్టాండ్ వద్ద స్కూటీపై ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 2.840 కేజీల గంజాయి రవాణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులో తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ నాగులూర్కు చెందిన పప్పల్ బాలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ముదిగొండ ప్రశాంత్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1,42 లక్షల వరకు ఉంటుందని, నిందితులను అదుపులోకి తీసుకొని, పరకాల పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
కుమారుడిని ఎస్సై అకారణంగా తిట్టాడని..
రాయపర్తి: న్యాయం చేయాలని స్టేషన్‌కు వస్తే ఎస్సై.. తమ కుమారుడిని అకారణంగా తిట్టాడంటూ ఓ తండ్రి వ్యవసాయపొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రవణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆ రైతు కుటుంబ సభ్యులు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఎర్రకుంటతండా గ్రామానికి చెందిన భూక్య మల్లునాయక్ తనకున్న మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. తన పక్కనే ఉన్న మరో రైతు సపావత్ ద్వాల్యానాయక్ గతంలో తన భూమిలో బోరు వేయించుకున్నప్పుడు భవిష్యత్‌లో మల్లు బోరు వేసుకున్నా అభ్యంతరం చెప్పనని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. యాసంగి వరిసాగు చేస్తున్న క్రమంలో భూక్యా మల్లునాయక్కు చెందిన వరిపంట ఎండిపోతుండడంతో బోరు వేయించేందుకు బోరుబండిని తీసుకు వచ్చాడు. వేరేచోట వేయించుకోవాలంటూ ద్వాల్యా నాయక్ కుటుంబం బోరుబండిని పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన భూక్య మల్లునాయక్, కుటుంబ సభ్యులతో కలిసి ద్వాల్యా నాయక్‌కు చెందిన బోరు స్టార్టర్‌ను తీసుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మల్లునాయక్తో వచ్చిన తన కుమారుడిని ఎస్సై ‘ఏం చదువుకున్నవు’ అంటూ ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ ‘నువ్వు చస్తే చావు నాకేం సంబంధం’ అనడంతో ఆవేశానికి లోనైన మల్లునాయక్ తన వ్యవసాయ పొలానికి చేరుకొని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మల్లు నాయక్ కుటుంబ సభ్యులు రాయపర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదుట వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఎస్సై శ్రవణ్‌కుమార్ తనను అకారణంగా బూతులు తిట్టాడని తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఎస్సైని సస్పెండ్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, జఫర్గడ్ ఎస్సైలు చందర్, రామ్‌చరణ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి వినలేదు. ఎస్సైని సస్పెండ్ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబట్టారు. చీకటిపడే వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని నేడు (శుక్రవారం) కూడా ఆందోళన చేస్తామని అక్కడినుంచి వెళ్లిపోయారు. పొలంవద్ద పురుగుల మందుతాగిన తండ్రి వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల ధర్నా ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ -
భళా.. ఇత్తడి హస్తకళ
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా రంగశాయిపేట ఇత్తడి హస్తకళకు దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. కాకతీయుల కాలం నాటి వెండి నగిషీలు తయారుచేసే పెంబర్తి హస్తకళకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటే.. వాటి సరసన రంగశాయిపేట ఇత్తడి హస్తకళ పోటీపడుతోంది. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నుంచి జరుగుతున్న దక్షిణ భారత ఎగ్జిబిషన్లో రంగశాయిపేట ఇత్తడి హస్తకళ స్టాల్‌కు చోటు లభించింది. ఓ వైపు సాంస్కృతిక ప్రతిరూపాలను తెలిపే డిజైన్లు, మరోవైపు నేటి కాలానికి తగ్గట్టుగా మోడ్రన్ డిజైన్ విత్ ఎంబోజింగ్ వర్క్ ద్వారా విభిన్న హస్తకళ డిజైన్లు చేస్తుండడంతో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది. నాబార్డు, డీసీహెచ్ మద్దతుతో వందలాది కుటుంబాలకు ఈ హస్తకళ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బంధం ముందుకెళ్తోంది. ‘రాగి లేదా ఇత్తడి లోహన్ని సన్నని షీట్లుగా కొట్టి, చక్కటి తీగగా కట్ చేస్తాం. చెక్క ఉపరితలంపై గుర్తించబడిన డిజైన్‌ను సుత్తి, ఉలి సాయంతో కోస్తాం. ఇత్తడి లేదా రాగి తీగను డిజైన్‌తో చెక్కబడిన భాగంలోకి సుత్తితో గుచ్చుతాం. ఆ తర్వాత రంపంతో కత్తిరించి డిజైన్‌లో కావల్సిన ప్రదేశాలలో జిగురుతో బిగిస్తాం. అత్యాధునిక పద్ధతులతో వివిధ డిజైన్లతో వస్తువులను తయారు చేస్తున్నాం. ఇంటిరియర్ వర్క్‌లో ఫ్లవర్ వాజెస్, వాల్ ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ చేస్తున్నాం.అలాగే దేవాలయం, దేవుళ్ల ఫొటోలతో కూడా ఎంబోజింగ్ వర్క్‌తో అది కూడా చేతి ద్వారా చేయడంతో ఆయా బొమ్మల ఆకారం స్పష్టంగా కనబడుతుంద’ని రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బృంద సభ్యుడు ప్రణయ్ గురువారం ‘సాక్షి’కి వివరించారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. రంగశాయిపేట ఇత్తడి హస్తకళలకు రాష్ట్రపతి నిలయంలో జరిగిన అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో చోటు దక్కడం జిల్లాకు దక్కిన గుర్తింపు. మరోసారి చేతికళలకు నిలయమని దేశమంతటా తెలిసింది. ఈ హస్త కళాకారులు భవిష్యత్‌లో ఇత్తడితో విభిన్న డిజైన్లు చేసి ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. ● రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక గుర్తింపు ● వరంగల్‌కు దక్కిన గౌరవంపై ప్రశంసలు ● ప్రత్యేక ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టాల్ -
అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
● కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్ ● కేడీసీలో అంతర్జాతీయ సదస్సు విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన అస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రాములోరికి ‘గోటి తలంబ్రాలు’
హన్మకొండ కల్చరల్ : రాములోరి కల్యాణం.. కమనీయం.. రమణీయం..చూసిన కనులదే భాగ్యం.. భద్రాద్రిలో జరిగే వేడుకను తిలకించి..తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో ఓరుగల్లు మహిళలు పరిణయ వేడుకకు తలంబ్రాలను సిద్ధం చేయడానికి వరిగింజలను గోటితో ఒలిచి తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. గోటి తలంబ్రాలు.. శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. వడ్ల గింజలను రోలులో దంచడంగాని లేక మిల్లులో మరపట్టించినవి కావు.. మహిళలు చేతిగోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. వీటినే గోటి తలంబ్రాలు అంటారు. ఎంతో పవిత్రంగా.. శ్రీరామనామ స్మరణతో ఎంతో పవిత్రంగా గోటితో తలంబ్రాలు ఒలుస్తారు. ఈ తలంబ్రాల కోసం విత్తనాల వడ్లను ప్రత్యేకంగా సాగు చేస్తారు. శ్రీరాముడి కల్యాణ తంతు జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు సాగుచేయడానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల వద్ద పెడతారు. ఆ వడ్లనే తిరిగి సాగుచేయడానికి వాడుతారు. వీటిని కొందరు భక్తిభావంతో తమ పొలంలో కొంత భూమిని కేటాయించి సాగు చేస్తుంటారు. ప్రత్యేక ముడుపులుగా చేసి మందులు, ఎరుపులు వేయకుండా, కాళ్లతో తొక్కకుండా, పవిత్రంగా పండిస్తున్నారు. పంటపొలాల్లో కంకులను కూడా కత్తులతో కాకుండా శ్రీరామనామం జపిస్తూ చేతిలో వలుస్తారు. కొరియర్ ద్వారా.. వరి ధాన్యాన్ని తలంబ్రాలుగా ఒలిచేందుకు భద్రాచలం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధులు కొరియర్ ద్వారా పంపగా వరంగల్ బ్యాంక్‌కాలనీలోని ఏలిషాల సుజాత అందుకున్నారు. ఈ ధాన్యాన్ని కాలనీ మహిళలు నిత్యం నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ, శ్రీరామ స్మరణ చేస్తూ గోటితో ఒలిచి.. తలంబ్రాలుగా తయారు చేస్తున్నారు. ఈ నెల 8న శనివారం ఒలిచిన తలంబ్రాలను కొరియర్ ద్వారా భద్రాచలం రాములవారికి పంపిస్తారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. చేతిగోళ్లతో ఒక్కో వరి గింజను ఒలిచి.. నవమి నాటికి అక్షింతల బియ్యం సిద్ధంమా ఇంట్లోనే తలంబ్రాలు చేస్తాం..ఫిబ్రవరి 15న భద్రాచలం నుంచి 2 కిలోల వడ్లను అందుకుని వలిచే కార్యక్రమాన్ని మా ఇంట్లో ప్రారంభించాము. ఈ నెల 8న శనివారం ఒలిచిన బియ్యాన్ని భద్రాచలానికి పంపిస్తాం. శ్రీసీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని నియమ నిష్టలతో కాలనీ మహిళలతో కలిసి ఒలిచే కార్యక్రమం మా ఇంట్లో తలంబ్రాలుగా తయారు చేయడం సంతోషంగా ఉంది. – ఏలిషాల సుజాత, బ్యాంక్‌కాలనీ, వరంగల్ ఆనందంగా ఉందిశ్రీరామ నామాన్ని స్మరిస్తూ భక్తిభావంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. భగవంతుని సేవ చేయడం వల్ల మాకు మంచి జరుగుతుందనే భావన. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తోటి మహిళలతో స్నేహబంధాలు పెరుగుతాయి. – లావణ్య, బ్యాంక్‌కాలనీ, వరంగల్ధన్యులమయ్యాం..రాముల వారి కల్యాణంలో ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు.. ఈ అక్షింతలను కోటి తలంబ్రాలుగా చెబుతారు. గోటీ తలంబ్రాల కార్యక్రమంలో భాగస్తులైనందుకు ధన్యులమయ్యాం. -
ఎల్ఆర్ఎస్ ఉంటేనే నిర్మాణ అనుమతి
మహబూబాబాద్: ఎల్ఆర్ఎస్ ఉంటేనే గృహ ని ర్మాణ అనుమతి ఇస్తామని మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో పాటు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా ఆర్పీలతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ 2020 కంటే ముందు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసి రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అనుమతి ప్రభుత్వం కల్పించిందన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 12,201 దరఖా స్తులు రాగా దానిలో 1,670 ఆమోదించినట్లు తెలి పారు. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయి తీ ఉందని మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలన్నారు. దరఖాస్తుదారుడి సెల్ నంబర్ రిజిస్ట్రేషన్ దానిపై ఉన్న నంబర్ నమోదు చేయగానే ఓటీపీ రాగానే ఫీ జు చెల్లించాల్సి వస్తుందన్నారు. సిబ్బంది కూడా ఎల్ఆర్ఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించా లన్నారు. ఈ సమావేశంలో టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ -
విద్యతోనే మహిళా సాధికారత
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అ న్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా ది నోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలో నూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బి.రమ, టి.స్వప్న, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మార్కెట్ నిండా ఎర్రబంగారమే
మహబూబాబాద్ రూరల్: మానుకోట వ్యవసాయ మార్కెట్‌కు రోజురోజుకూ మిర్చి గణనీయంగా పెరుగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతులు వాహనాల్లో మిర్చి బస్తాలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. మిర్చి రావడం పెరిగిన క్రమంలో కొనుగోళ్లు ఆలస్యం కావడం, కొంత మొత్తాన్ని ఒకరోజు మరికొంత మొత్తాన్ని మరొకరోజు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోవడంతో ఉన్నంతవరకు గురువారం కొనుగోలు జరిపి మిగిలినవి మరుసటి రోజున కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధికారులు శుక్రవారం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు బంద్ ఉంటాయని శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో మళ్లీ ఈనెల 10వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. గురువారం సుమారు 20 వేలకుపైగా మిర్చి బస్తాలురాగా అందులో 17,135 బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేశారు. మిర్చి బస్తాలను తీసుకువచ్చిన వాహనాలు మార్కెట్ ఆవరణలోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో వాటిని కోల్డ్ స్టోరేజీల ఎదుట నిలిపి ఉంచారు. మిర్చి బస్తాల వాహనాలు కోల్డ్ స్టోరేజీల ఎదుట బారులు దీరగా రైతులు అక్కడే అమ్ముకుని వెళ్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రైతుల రాస్తారోకో వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ఆపవద్దంటూ గురువారం రాత్రి రైతులు రాస్తారోకో చేశారు. మిర్చి వాహనాలను మార్కెట్లోనికి అనుమతించి క్రయవిక్రయాలు జరపాలని రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్, టౌన్ సీఐ దేవేందర్, ఎస్సై విజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వాహనాలను అనుమతించి మిర్చి కొనుగోళ్లు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసముద్రం మార్కెట్లో..కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు గోస పడుతున్నారు. గురువారం అత్యధికంగా 10వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకురావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. రైతులు మిర్చి ఘాటుతో ఇబ్బందులు పడుతూ రాత్రంతా గడపాల్సివచ్చింది. మార్కెట్ అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఖరీదులు ఆలస్యమవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి రావడంతో శుక్రవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవు ఉండటంతో సోమవారం తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు సాగుతాయన్నారు. 17,135 బస్తాల మిర్చి కొనుగోలు నేటి నుంచి మిర్చి మార్కెట్ బంద్ కోల్డ్ స్టోరేజీల ఎదుట బారులుదీరిన వాహనాలు -
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీయడిట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జనరల్ స్టూడెంట్లు 3,230 మంది విద్యార్థులకు 3,149 మంది హాజరుకాగా 81 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1,068 మంది విద్యార్థులకు 1,015 మంది విద్యార్థులు హాజరుకాగా 53 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తానికి 4,298 మందికి గాను 4,164 మంది విద్యార్థులు హాజరుకాగా 134 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌లు జరగలేదని, ప్రశాంతంగా తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలిక కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు వెనుతిరిగాడు. అనంతారం మోడల్ కళాశాలలో డీఐఈఓ మదార్‌గౌడ్, ఫ్లయింగ్ స్వ్కాడ్లు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మొదటి రోజు 134 మంది గైర్హాజరు -
పార్కులో వసతులు కల్పించాలి
డోర్నకల్: బతుకమ్మ పార్కుకు వచ్చే వారి కోసం వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సవ్ టొప్పో ఆదేశించారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ పార్కును గురువారం అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. పార్కులోని మొక్కలను పరిశీలించి ఎండాకాలం వచ్చినందున మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్కులోకి వాకింగ్, జిమ్ కోసం వచ్చే వారికి మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం బంకట్సింగ్తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేయగా ఆ సమయంలో పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఉండటంతో ఆశ్యర్యం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారని ప్రశ్నించగా ఇక్కడి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
నాణ్యమైన భోజనం అందించాలి
గార్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి దేశీరామ్నాయక్ ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను ఆదేశించారు. గురువారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతిగృహంలోని బెడ్రూమ్లు, టాయిలెట్స్, బాత్రూమ్లను సందర్శించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఎం సీహెచ్ జోగయ్య, వార్డెన్ రాధిక, బుచ్చానాయక్, ఉపాధ్యాయులు ఎల్లయ్య, గంగావత్ శ్రీనివాస్, రుక్కి, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్గార్ల: గార్ల రైల్వేస్టేషన్లో నేటి నుంచి మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గార్లలో మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు కృషి చేసిన ఎంపీలు పొరిక బలరాంనాయక్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కోరం కనకయ్యలకు గార్ల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు షురూమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బా లికల పాఠశాలను విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్‌రెడ్డి గురువారం సందర్శించి విద్యార్థుల పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షలను బట్టి విద్యార్ధుల సామర్థ్యాలు తెలిసిపోతా య ని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక నిఘాతో సబ్జెక్ట్‌ల వారీగావిద్యను బోధించాలన్నారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షల్లో జిల్లాను ఆగ్రగామి గా నిలిపేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి అప్పారావు, ఏఎంఓ చంద్రశేఖర్ఆజాద్,ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పంటమార్పిడితో అధిక దిగుబడిమహబూబాబాద్ రూరల్: పంట మార్పిడితో అధిక దిగుబడి వస్తుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్ పామ్, మల్చింగ్ విధానం, తీగజాతి పద్ధతిలో కూరగాయలు సాగు చేసిన రైతులతో మరి యన్న మాట్లాడారు. ఆయిల్ పామ్ గెలల ధరలు పెరిగాయని, గెలలు ఒక టన్నుకు రూ.20,871 పలుకుతుందన్నారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మా ర్పిడితో అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోట లు జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫ లం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, తదితర పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు శాంతి ప్రియదర్శిని, శాంతిప్రియ, మానస,రైతులు మాలోతు రాందాస్, గుగులోతు సుగుణమ్మ, తేజ్య, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, బిందు సేద్య అధికారులు అగస్టిన్, తదితరులు పాల్గొన్నారు. -
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి
నర్సింహులపేట: వరిలో నేరుగా వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ ఽఅధికారి విజయనిర్మల అన్నారు. గురువారం మండలంలోని పెద్దనాగారంలో నేరుగా వెదజల్లే వరి, మొక్కజొన్న, బీరసాగు, వేరుశనగ పంటలను ఆమె సందర్శించి పరిశీలించారు. వెదజల్లే పద్ధతితో కూలీల సమస్యను అధికమించ వచ్చన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా ఫాస్పరస్ సొల్యూబుల్లైజింగ్ బ్యాక్టీరియా, సుడోమోనస్ బ్యాక్టిరీయా పోడిని రాయితీపై రైతులకు పంపిణీ చేశారు. వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయానికి జిప్సమ్ వాడటం వలన అధిక దిగుబడులు వస్తాయని డీఏఓ అన్నారు. పంటలపై చీడపీడల నివారణకు తీసుకునే చర్యలను వివరించారు. రైతులకు ఏ సమస్య ఉన్న స్థానిక రైతువేదికలో అగ్రికల్చర్ సిబ్బందిని కలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, ఏఈఓ బాబు, రైతులు పాల్గొన్నారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు పెద్దవంగర: రైతులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పర్టిలైజర్ షాపులను స్థానిక వ్యవసాయాధికారి స్వామి నాయక్‌తో కలిసి సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడారు. లైసెన్స్‌లు ఉన్న షాపుల్లోనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర, ఏఈఓ గడల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
దేహదారుఢ్యానికి క్రీడలు అవసరం
మహబూబాబాద్: క్రీడలు మానసికోల్లాసానికి, దే హదారుఢ్యానికి దోహదపడతాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధి కారం సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం క్రీడల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, టీజీఓ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌రఫి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం
కురవి: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భక్తి శ్రద్ధలతో పుష్పోత్సవం (పవళింపు సేవ) కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను అదీష్టింప చేసి గణపతి పూజ, గౌరీపూజ, పుణ్యహవచనము నిర్వహించి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలోని పూలతో అలంకరించిన ఊయల వద్దకు మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను తోడ్కోని వెళ్లి పవళింపు సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య దంపతులు, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్, బాలగాని శ్రీనివాస్, అర్చకులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్‌కుమార్, దూసకంటి విజయ్, పుణ్యమూర్తి, విజయ్, అభిలాష్, తేజ, బాలకృష్ణ, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.