కుక్క అడ్డు రావడంతో బైక్‌ సడెన్‌ బ్రేక్‌.. | - | Sakshi
Sakshi News home page

కుక్క అడ్డు రావడంతో బైక్‌ సడెన్‌ బ్రేక్‌..

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

కుక్క అడ్డు రావడంతో బైక్‌ సడెన్‌ బ్రేక్‌..

కుక్క అడ్డు రావడంతో బైక్‌ సడెన్‌ బ్రేక్‌..

పాలకుర్తి టౌన్‌: కుక్క అడ్డం రావడంతో సడెన్‌ బ్రేక్‌ వేయగా బైక్‌ అ దుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గురువారం పాలకుర్తి మండలం తొర్రూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వెంపాల పూలమ్మ (50), బాల్‌రెడ్డి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డూరు మండల కేంద్రంలో పూల మ్మ చెల్ల్లి ఇంటిలో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వె ళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి పాలకుర్తి మీదుగా బయలుదేరారు. మండలంలోని తొర్రూరు చేరుకోగా కుక్క.. బైక్‌కు అడ్డు వచ్చింది. దీంతో సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో పూలమ్మ కిందపడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లెదుటే భార్య మృతి చెందడంతో బాల్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కాగా, కుక్కల నియంత్రణ చేపట్టకపోవడంతో ద్విచక్రవాహనాలకు అడ్డొచ్చి పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయని గ్రామస్తులు తెలిపారు.

కిందపడిన మహిళ.. అక్కడికక్కడే మృతి

తొర్రూరులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement