కనుల పండువగా తెప్పోత్సవం
● కాళేశ్వరం త్రివేణి సంగమంలో శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులకు పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 7.20 గంటలకు హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ది శరత్‌చంద్రశర్మలతో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు అవతలి తీరం వైపు ఏర్పాటు చేసిన బాణాసంచా ఆకాశంలో పదిహేను నిమిషాలపాటు వెలుగులు విరజిమ్మింది. సుమారు అరగంటకు పైగా తెప్పను ఉత్సవమూర్తులతో జలవిహారం చేయించారు. ఆ తర్వాత తీరానికి తీసుకొచ్చారు. అంతకు ముందు వీఐపీ ఘాట్ వద్ద గోదావరి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మహేశ్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్, ఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఇతర అధికారులు తీరం బయటి నుంచి వీక్షించారు.
కనుల పండువగా తెప్పోత్సవం


