మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా | Mahashivratri 2026: Satvik Recipes for Mahashivratri No Onion No Garlic | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా

Feb 15 2026 2:02 PM | Updated on Feb 15 2026 2:02 PM

Mahashivratri 2026: Satvik Recipes for Mahashivratri No Onion No Garlic

మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. 

అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..

మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్‌ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. 

ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..

సబుదాన ఖిచ్డి 
కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..

కావలసినవి..
సబుదాన – 1 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియం
వేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పు
జీలకర్ర – ½ స్పూన్
పచ్చిమిర్చి (తరిగినవి) – 1
సెంధా నమక్ – రుచికి సరిపడా
నెయ్యి – 1 టేబుల్ స్పూన్

తయారీ..
ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.

సామా కే చావల్ ఖిచ్డి
సామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.

కావలసినవి 
సమా కే చావల్ – 1 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవి
జీలకర్ర – ½ స్పూన్
అల్లం (తురిమినది) – 1 స్పూన్
ఉప్పు: తగినంత
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నీళ్ళు – 2 కప్పులు

తయారీ: ముందుగా మిల్లెట్‌లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్‌ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.

కుట్టు అట్ట చీలా
కుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..

కావల్సినవి..
కుట్టు అట్ట – 1 కప్పు
ఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవి
పచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్
ఉప్పు: తగినంత
నీరు – ¾ కప్పు
నెయ్యి – 1 స్పూన్

తయారీ విధానం..
కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్‌లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్‌.

వ్రత్ వాలే ఆలూ
సంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్‌గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.

కావలసినవి :
ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియం
జీలకర్ర – ½ స్పూన్
పచ్చిమిర్చి – 1
ఉప్పు: తగినంత
నల్ల మిరియాలు – ¼ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.

లౌకి ఖీర్
లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..
ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.

కావలసినవి:
తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పు
పాలు - 2 కప్పులు
బెల్లం - 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - ¼ స్పూన్
తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్

తయారీ..
తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్‌ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్‌ డెజర్జ్‌.

(చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement