ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి! | Japan Career Counseling Bar For Changers | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి!

Feb 15 2026 12:24 PM | Updated on Feb 15 2026 12:24 PM

Japan Career Counseling Bar For Changers

కొందరు మనసు బాగా లేకుంటే బారుకెళతారు. ఇంకొందరు సంతోషాన్ని పట్టలేక బారుకెళతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకోవడానికి సురశాలలు సురక్షితమైన వేదికలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల బార్లు ఉన్నాయి. ఏ బారుకు ఎవరు వెళ్లినా, అక్కడ చేసేదొక్కటే! కాస్త మందు పుచ్చుకుని, మనసును సేదదీర్చుకోవడమే! జపాన్‌లోని యోకోహామాలో ఉన్న ‘తెన్షొకు సొడాన్‌’ బారు మాత్రం ఇంకొంచెం ప్రయోజనాత్మకమైన బారు. ఉన్న ఉద్యోగాల్లో విసిగిపోయిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారు ఇది. చాలాకాలంగా ఉద్యోగం చేస్తున్నా, ఎదుగూ బొదుగూ లేనివారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే, అలాంటి ఉద్యోగులకు ఈ బారు సరైన వేదిక. 

ఉన్న ఉద్యోగం వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అలాంటి వారికి ఈ బారులో కెరీర్‌ కౌన్సెలర్లతో ప్రత్యేకమైన గదుల్లో ప్రైవేటు సిటింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. గంట నుంచి గంటన్నర సేపు కొనసాగే ఈ సిటింగ్‌లలో కెరీర్‌ కౌన్సెలర్లతో కలసి మందేస్తూ, మారబోయే ఉద్యోగాల గురించి మనసు విప్పి చర్చించుకోవచ్చు. అర్హతలు, అదృష్టం బాగుంటే మంచి ఆఫర్‌ అక్కడికక్కడే పొందవచ్చు కూడా! ఈ విలక్షణమైన బారు ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement