breaking news
Japan
-
అణ్వాయుధాలపై జపాన్‌లో సంచలనం.. రక్షణ మంత్రి కీలక పిలుపు
టోక్యో: చైనా, రష్యా, ఉత్తర కొరియాతో భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాలను సమకూర్చుకునే అంశంపై జపాన్‌లో బహిరంగ చర్చ జరగాలని ఆ దేశ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి పిలుపునిచ్చారు. భద్రతకు సంబంధించిన ఏ అవకాశాన్నీ ముందుగానే తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.“ఈ అంశంపై చర్చించడానికి కూడా అనుమతి లేదనే ఆలోచన.. నా భావనకు కొంత విరుద్ధంగా ఉంది” అని సోమవారం టీవీ ఇంటర్వ్యూలో కొయిజుమి వ్యాఖ్యానించారు. అణు విధానంపై ఎలాంటి నిషేధాలు లేకుండా ఉండాలన్న విషయంపై చర్చించాలని ఆయన అన్నారు. ఇందులో జపాన్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న అణురహిత విధానాలను పునఃపరిశీలించడం, అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చుకునే అవకాశాన్ని పరిశీలించడం కూడా ఉన్నాయని తెలిపారు.జపాన్ 3 సూత్రాలు ఏవి? జపాన్ 1967లో ఆమోదించిన మూడు అణురహిత సూత్రాల ప్రకారం.. అణ్వాయుధాలను కలిగి ఉండటం, తయారు చేయడం, దేశ భూభాగంలోకి వాటిని అనుమతించడం నిషేధం. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని కొయిజుమి స్పష్టం చేశారు. అయితే అన్ని అవకాశాలపై చర్చ పూర్తయ్యే వరకు వాటిని పక్కన పెట్టకూడదన్నారు. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడికి గురైన ఏకైక దేశమని గుర్తుచేస్తూ, మారుతున్న భద్రతా పరిస్థితిని ప్రజలకు జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు.“జపాన్ చుట్టూ ఉన్న భద్రతా పరిస్థితిపై ఆశావహంగా ఉండేందుకు అసలు ఎలాంటి కారణాలు లేవని చెప్పడం సురక్షితమే” అని కొయిజుమి పేర్కొన్నారు. చైనా, రష్యా అణు సామర్థ్యాలు, ఉత్తర కొరియా పెంచుకుంటున్న అణ్వాయుధ నిల్వలను ప్రస్తావించారు. ఫ్రాన్స్ అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు, ఫిన్లాండ్ తన భూభాగంలో అణ్వాయుధాల మోహరింపునకు చట్టపరమైన మార్పులు చేయడాన్ని కూడా ఆయన ఉదాహరణగా చూపారు.ఈ ఏడాది చివరినాటికి జపాన్ ప్రభుత్వం 3 కీలక జాతీయ భద్రతా పత్రాలను సవరించనుంది. ఈ ప్రక్రియలో అణురహిత సూత్రాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అణ్వాయుధాలను దేశంలోకి అనుమతించకూడదనే 3వ సూత్రంపై చర్చ పెరిగింది. ప్రధాని సనాయే తకాయిచి మాత్రం జపాన్ ఆ సూత్రాలను కొనసాగిస్తోందని, అణ్వాయుధాలు లేని ప్రపంచానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే కొత్త భద్రతా పత్రాల్లో ఈ సూత్రాలను స్పష్టంగా చేర్చుతారా అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు.ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచం కోల్డ్ వార్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన అణు పరిస్థితిని ఎదుర్కొంటోందని హెచ్చరించారు. అణ్వాయుధ నిల్వలు పెరుగుతూ, ఆధునికీకరణకు గురవుతున్నాయని చెప్పారు. జపాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి కజుయుకి యమజాకి మాత్రం సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి దేశం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక జపాన్ అణు విధానంపై ప్రభుత్వం చేపట్టే భద్రతా పత్రాల సమీక్ష కీలకంగా మారనుంది.At the High-level Meeting to Commemorate & Promote the International Day for the Total Elimination of Nuclear Weapons, #Japan lists 3 areas of action its commitment is reflected in: 1️⃣We must maintain & strengthen the framework for dialogue & cooperation. #NPT https://t.co/uBEC6Fiw0b— Japanese Mission UN (@JapanMissionUN) September 29, 2026 -
భూకంపం వచ్చినా ఇల్లు సేఫ్.. జపాన్ కొత్త టెక్నాలజీ!
జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. అందుకే.. అక్కడి ప్రజలు భూకంపాలను చూసి భయపడటం కంటే, వాటి వల్ల జరిగే నష్టాన్ని ఎలా తగ్గించాలనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతారు. గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భూకంపాలను ఒక పెద్ద ప్రకృతి విపత్తుగా మాత్రమే కాకుండా, ఒక ఇంజినీరింగ్ సమస్యగా భావించి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. భూకంపం వచ్చినప్పుడు ఇంటిని కొంత ఎత్తుకు పైకి లేపే విధానం పరిచయం చేశారు. ఈ విషయాన్ని హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.సెన్సార్లు గుర్తిస్తాయిసాధారణంగా భూకంపం వచ్చినప్పుడు నేల కదిలినట్టే ఇల్లు కూడా కదులుతుంది. దాంతో ఇంటి గోడలు, స్తంభాలు, పునాదులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ.. ఈ కొత్త విధానంలో భూకంపం వచ్చినట్లు సెన్సార్లు గుర్తించిన వెంటనే ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేసి ఇంటిని నేల నుంచి కొంత పైకి లేపుతుంది.ఇలా చేయడం.. వల్ల భూమి కదలిక నేరుగా ఇంటికి చేరకుండా కొంతవరకు నిరోధించవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. అంటే.. భూకంపం సమయంలో ఇల్లు నేలతోపాటు కదలకుండా, నేల కదలిక నుంచి వేరుగా ఉంటుందన్నమాట. దీని అర్థం ఇల్లు గాలిలో ఎగురుతుందని కాదు. ఇంటిని ఒక పరిమితిలో పైకి ఎత్తడం మాత్రమే. భూకంపం ముగిసిన తర్వాత ఇంటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.ఇప్పటికే ఉన్న టెక్నాలజీలుజపాన్లో ఇప్పటికే భవనాలను భూకంపాల నుంచి రక్షించడానికి.. బేస్ ఐసోలేషన్, షాక్ అబ్జార్బర్లు, ప్రత్యేక పునాది నిర్మాణాలు వంటి అనేక సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇంటినే కొంత పైకి లేపే ఆలోచన.. వీటన్నింటికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?భూకంపాలను మనం ఆపలేం. కానీ ఇళ్లు, భవనాలు, ప్రజల జీవితాలకు కలిగే నష్టాన్ని మాత్రం తగ్గించగలం. ఈ ఆలోచనతోనే జపాన్ ఎన్నో సంవత్సరాలుగా కొత్త కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందితే, భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రజలకు మరింత సురక్షితమైన ఇళ్లు నిర్మించడం సాధ్యమవుతుంది.Japan has spent decades turning earthquakes from a disaster into an engineering challenge. They are now developing a special technology that allows homes to rise above ground enough to protect the home in case of earthquakes. pic.twitter.com/t65sU4eYJf— Harsh Goenka (@hvgoenka) September 30, 2026 -
నిధులిస్తూనే... కళ్ళేలూ వేయాలి!
పునర్వినియోగానికి వీలైన అంతరిక్ష వాహక నౌకను (ఆర్ఎల్వీ) లేదా రాకెట్‌ను తయారు చేయడం అత్యంత క్లిష్టమైన, అదే సమయంలో అత్యంత వాంఛనీయమైన విషయం. అటువంటి పనికి అగ్ని కుల్ కాస్మోస్ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ శ్రీకారం చుట్టింది. దానికయ్యే వ్యయంలో రూ. 200 కోట్లను పంచుకునేందుకు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ (డీఎస్టీ) ఇటీవల ఆ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. పరిశోధన–అభివృద్ధికి చెందిన నవీకరణ (ఆర్డీఐ) నిధి నుంచి డీఎస్టీ ఆ ద్రవ్యాన్ని అందించనుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తయారీ, ప్రయోగ వ్యయాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. అంతరిక్షంలో శకలాల బెడదను కూడా పనిలో పనిగా తగ్గించుకున్నట్లవుతుంది. పుష్పక్–అగ్నిబాణ్ఈ విషయంలో చైనా, జపాన్ ముందడుగు వేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో, భారత్ కూడా ఆ దిశగా నడుం బిగించింది. పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీని చైనా ఈ ఏడాది జూలైలో ప్రదర్శించింది. లాంగ్ మార్చ్ 10బి రాకెట్ ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత, ఆ రాకెట్‌కు చెందిన మొదటి దశను చైనా రికవర్ చేయగలిగింది. నియమిత వేగంతో సముద్రంలోని ఒక వేదికపై దిగేటట్లుగా ఆ రాకెట్‌కు రూపకల్పన చేశారు. దాంతో ఆర్బి టల్–క్లాస్ రాకెట్‌ను నిలువుగా దిగేటట్లు చేసిన ఘనతను, అమెరికా తర్వాత సాధించిన రెండవ దేశంగా చైనా అవతరించింది. ఎలాన్ మస్క్ నెలకొల్పిన స్పేస్ ఎక్స్ అటువంటి ల్యాండింగ్లను డజన్లకొద్దీ ప్రదర్శించి, అంతరిక్ష రవాణా ఖర్చును తగ్గించుకుంది. చైనా జెండా ఎగరేసిన కొద్ది రోజుల తర్వాత, తన ఆర్ఎల్వీ నమూనాను జపాన్ పరీక్షించింది. ఫ్రాన్స్, జర్మనీ అంతరిక్ష సంస్థ లతో కలసి జపాన్ అంతరిక్ష సంస్థ మిత్సుబిషి సంయుక్తగా ఆ ప్రోటోటైప్‌ను తయారు చేసి ప్రయోగించి చూసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆర్ఎల్వీ ప్రాజెక్టునకు 2012లో ఆమోదం లభించింది. అప్పటి నుంచి అటాన మస్ ల్యాండింగ్, సూపర్ సోనిక్ ఫ్లైట్, పవర్డ్ క్రూజ్ ఫ్లైట్ వంటి వివిధ టెక్నాలజీలను ఇస్రో అభివృద్ధి చేసి, ప్రయోగాల ద్వారా వాటిని మదింపు చేసింది. ఈ ఆర్ఎల్వీకి 2024లో పుష్పక్ అని పేరు పెట్టారు. అగ్నికుల్ సంస్థ రాకెట్‌ను అగ్నిబాణ్గా పిలుస్తున్నారు. ప్రైవేటుకు మద్దతు ఇస్తారు సరే...ఇపుడు అగ్నికుల్‌కు రూ. 200 కోట్ల ఆర్థిక మద్దతు అందించేందుకు ముందుకు రావడం వల్ల, ప్రభుత్వానికి చెందిన ఒక పరిశోధన–అభివృద్ధి సంస్థతో ప్రత్యక్షంగా పోటీపడుతున్న ఒక ప్రైవేటు కంపెనీకి, బహుశా మొదటిసారిగా, ప్రభుత్వం చేదోడుగా నిలుస్తోందనే అభిప్రాయం కలుగవచ్చు. కానీ, ఇక్కడో సంగతి గుర్తుంచు కోవాలి. ఒక ప్రైవేటు సంస్థకు నిధులిస్తున్నంత మాత్రాన ఇస్రో ఆర్ఎల్వీ ప్రాజెక్టును ఆకలితో అలమటింటేటట్లు చేయడం కాదు. ఒక్కొక్క మైలురాయిని చేరుకుంటున్న కొద్దీ దానికి నిధులు అందు తూనే ఉంటాయి. పైగా, ఈ రెండు ఆర్ఎల్వీ ప్రాజెక్టులను సరి పోల్చడం సమంజసం కాదు. అవి రెండూ భిన్నమైన టెక్నాలజీ రూపాలను అనుసరిస్తున్నాయి. తుది వినియోగంలో కూడా తేడాలుండవచ్చు. అయినా, ఇస్రోకు చెందిన ఆర్ఎల్వీ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని తగ్గించే అభిమతం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం మంచిది. ప్రైవేటుకు ద్వారాలు తెరవడంపై సైంటిస్టుల యూనియన్ల నుంచి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఇది మరింత అవసరం. జాతీయ ప్రాధాన్యం కలిగిన డీప్ టెక్నాలజీ విభాగంలో రెండు సమాంతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సమతూకంతోనే వ్యవహరిస్తూ ఉండవచ్చు. పెట్టుబడులను అమలు పరచే తీరు కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ నిధులను అంత పెద్ద యెత్తున అందుకుంటున్న ప్రైవేటు ప్రాజెక్టు అగ్నికుల్ ఒక్కటే కాదు. గణనీయంగా నిధులు అందించే మరో రెండు ఒప్పందాలపై కూడా ఇటీవల సంతకాలు జరిగాయి. బెంగళూరుకు చెందిన గెలాక్స్ ఐ స్పేస్ సొల్యూషన్స్‌కు రూ. 63.84 కోట్లు అందనున్నాయి. అది హై–రిజొల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం కలిగిన మల్టీ–సెన్సర్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనుంది. ఎయిర్ ట్యాక్సీగా ఉపయోగించదగిన చిన్న ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసేందుకు (అయ్యే మొత్తం రూ. 570 కోట్ల వ్యయంలో) యుబిఫ్లై టెక్నాలజీస్‌కు రూ. 285 కోట్లు ఇవ్వనున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలావాటికి ప్రభుత్వమిచ్చే నిధుల వాటా, వాటి మొత్తం వ్యయంలో దాదాపు 50 శాతం మేరకు లేదా అంతకుమించి ఉంటోంది. ఈక్విటీ రూపంలో ఈ నిధులు అందిస్తే కనుక, ఆ అంకుర సంస్థలలో ప్రభుత్వం మెజారిటీ వాటాదారు అవుతుంది. వాటి పాలనలోనూ దాని మాటకు విలువ ఉంటుంది. కానీ, ప్రభుత్వం వాటికిస్తున్న నిధులు ఐచ్ఛిక పరివర్తనీయ రుణ పత్రాల రూపంలో ఉంటున్నాయి. అంటే, ప్రభుత్వం ఆ ద్రవ్యాన్ని అప్పుగా ఇస్తోందన్నమాట. మున్ముందు దాన్ని ఈక్విటీగా మార్చు కుంటే మార్చుకోవచ్చు. వ్యాక్సీన్ కంపెనీల గుణపాఠంరుణ రూపంలో ఆది మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చి నప్పటికీ, ప్రైవేటు కంపెనీలు సాదారణంగా వాటి ఇన్వెస్టర్లకు, వాటాదారులకు జవాబుదారీగా ఉంటాయి. ప్రభుత్వం మాట విని తీరాలన్న రూలేమీ లేదు. లాభాలు గడించేందుకు విలీనాలు, టెక్నా లజీ బదలాయింపులు వంటివాటికెళ్ళడం ప్రైవేటురంగంలో సాధారణం. ఇక్కడే చిక్కుంది. డీఎస్టీ సమకూర్చే ప్రజా నిధులతో ఒక వ్యూహాత్మక టెక్నాలజీని అభివృద్ధి చేసిన కంపెనీని రేపు ఏ బహుళజాతి కంపెనీయో లేదా అంతకన్నా పెద్ద ప్రత్యర్థి సంస్థో స్వాధీనం చేసుకుంటే, ప్రభుత్వ నిధులతో వ్యూహా త్మక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలోని ప్రయోజనమే దెబ్బ తినవచ్చు. వ్యాక్సీన్ల తయారీలో 1990ల చివరలో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైంది. ఇపుడు అగ్నికుల్, యుబిఫ్లైలకు డీఎస్టీకి చెందిన ఏ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అయితే నిధులు ఇస్తోందో అదే బోర్డు, బహుళజాతి టీకా సరఫరాదారుల గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు, బయోటెక్ అంకుర సంస్థలకు నిధులు ఇచ్చింది. పరిశోధన–అభివృద్ధికి డీఎస్టీ ఉదారంగా ఇచ్చిన గ్రాంట్లతో రెండు భారతీయ కంపెనీలు హెపటైటిస్ వ్యాక్సీన్ ధరలను అంతర్జాతీయంగా విజయవంతంగా తగ్గించగలిగాయి. అయితే, ఆ తర్వాత, ఆ రెండు కంపెనీల్లో ఒకదానిని ఒక పోటీదాయక బహుళజాతి సంస్థ స్వాధీనం చేసుకుంది. డీఎస్టీకానీ, ప్రభుత్వంకానీ దాన్ని ఆపలేకపోయాయి. ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చే సామర్థ్యాన్ని నిర్మించడంలో ప్రభుత్వ తోడ్పాటును అందుకున్న సంస్థ చివరకు ఒక బహుళజాతి వ్యాక్సీన్ కంపెనీ పరమైంది. డీప్ టెక్ రంగంలో మనం తిరిగి అలాంటి స్థితిలో చిక్కుకోకూడదు. ఏ ప్రైవేటు ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నా ప్రభుత్వం తప్పనిసరిగా కొన్ని నియంత్రణలు చేతిలో పెట్టుకుని సమతుల్యతలను పాటించాలి. ఎందుకంటే, నిధుల స్థాయులు, ఇమిడివున్న టెక్నాలజీల వ్యూహాత్మక ప్రాధాన్యం రెండింటిలోనూ పెడుతున్న పణం ఎక్కువగా ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జపాన్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆరు రోజుల పర్యటన కోసం జపాన్‌కు బయలుదేరింది. మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది.ఈ ప్రతినిధి బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ, ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు.జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలను వీక్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణ విధానాలను బృందం పరిశీలించనుంది. ముఖ్యంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా వేదికల నిర్వహణ, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, పోటీల నిర్వహణలో అనుసరిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.జపాన్‌లో అమలు చేస్తున్న క్రీడా అభివృద్ధి విధానాలను పరిశీలించి, వాటిలో తెలంగాణకు అనువైన అంశాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలించనుంది. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
చరిత్ర తిరగరాసిన గుల్వీర్.. భారత బాక్సర్ల అరుదైన ఫీట్
ఆసియా గేమ్స్‌లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ పతకాలు సాధించాడు. ఇప్పటికే పదివేల మీటర్లు, 1500 మీటర్ల రేసులో రజతాలు సాధించిన గుల్వీర్.. తాజాగా మంగళవారం 5వేల మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకున్నాడు. గుల్వీర్ 13:32.75 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం ఒడిసిపట్టగా, బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాలే (13:30.79 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, జపాన్ అథ్లెట్ యమాగుచి టొమొనొరి (13:31.43 సెకన్లు) రజతం అందుకున్నాడు.ఇక ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు దూకుడు కనబరుస్తున్నారు. సూపర్ పంచ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పసిడి వేటకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్లో అదిరే విజయంతో ప్రవీణ్ హుడా(65 కిలోలు), అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. తద్వారా కనీసం రజతం ఖాయం చేశారిద్దరు. పురుషుల 90 ప్లస్ క్వార్టర్స్‌లో విఫలమైన నరేందర్ బెర్వాల్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.సెమీఫైనల్ చేరి కనీసం కాంస్యం ఖరారు చేసిన ఆరుగురు భారత బాక్సర్లలో ఇద్దరు ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో ప్రవీణ్ హుడా(65 కిలోలు), పురుషుల విభాగంలో అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు ఫైనల్ చేరుకున్నారు. మంగళవారం ఏకపక్ష పోరులో చైనా బాక్సర్ లీ షుపై 5-0తో గెలుపొందిన హుడా స్వర్ణంపై గురి పెట్టింది.పురుషుల క్వార్టర్స్‌లో దుమ్మురేపిన అంకుశ్ సెమీస్‌లోనూ పంజా విసిరాడు. అతడి ధాటికి వరల్డ్ ఛాంపియన్ ఫజ్లిద్దిన్ ఎర్కిన్బొయెవ్(ఉబ్జెకిస్థాన్) చేతులెత్తేశాడు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో ఫైనల్ చేరిన భారత బాక్సర్‌గా అంకుశ్ రికార్డు నెలకొల్పాడు. మరో బౌట్లో.. నరేందర్ బెర్వాల్ కంగుతిన్నాడు. పురుషుల 90 ప్లస్ విభాగంలో ఆశలు రేపిన అతడు వరల్డ్ ఛాంపియన్ ఐబెక్ ఒరల్బే చేతిలో ఊహించని ఓటమితో కాంస్యం అందుకున్నాడు.WATCH HISTORY IN THE MAKING.🇮🇳 GULVEER SINGH IS AN INSPIRATION TO MILLIONS OF ATHLETES.THREE RACES. THREE MEDALS.🥈 10,000m — 28:29.38🥈 1500m — 3:36.72 PB🥉 5000m — 13:32.75From 1500m to 10,000m, Gulveer has finished on the podium in EVERY DISTANCE he raced in Nagoya.…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 29, 2026ఇదీ చదవండి: 'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన! -
Asian Games Cricket: సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్, టైమింగ్స్
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో వర్షం కారణంగా చిన్న జట్లకు క్వార్టర్ ఫైనల్స్‌లో కనీసం మ్యాచ్ ఆడే అవకాశం కూడా దొరకలేదు. జపాన్ వేదికగా క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- హాంకాంగ్,చైనా సోమవారం తలపడాల్సి ఉండగా వాన వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దై పోయింది.పాక్, భారత్ నేరుగా సెమీస్కుఅదే రోజు టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా టాస్ పడకుండానే వర్షార్పణమైంది. ఫలితంగా ప్రత్యర్థుల కంటే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థితిలో ఉన్న పాకిస్తాన్, టీమిండియా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.అదే పరిస్థితి పునరావృతంఅదే విధంగా మంగళవారం మూడు, నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో భాగంగా శ్రీలంక- నేపాల్.. బంగ్లాదేశ్- మలేషియా తలపడాల్సి ఉండగా.. ఇదే పరిస్థితి పునరావృతమైంది. వాన కారణంగా ఈ రెండు మ్యాచ్‌లు టాస్ పడకుండానే రద్దు కాగా.. ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత సాధించాయి.సెమీ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే👉గురువారం (అక్టోబరు 1)👉వేదిక: కరోగి స్పోర్ట్స్ పార్కు, నిశిన్, జపాన్తొలి సెమీ ఫైనల్: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ 👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభంరెండో సెమీ ఫైనల్: టీమిండియా వర్సెస్ శ్రీలంకమ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రారంభంకాంస్య పతక పోరు, ఫైనల్👉శనివారం (అక్టోబరు 3): సెమీస్‌లో ఓడిన జట్ల మధ్య మ్యాచ్ (ఉదయం: ఐదున్నర గంటలకు ఆరంభం)👉అదే రోజు సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ (ఉదయం: పది గంటలకు ఆరంభం).అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం👉సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్)జట్లుభారత్సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్.పాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్(కెప్టెన్), సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, హైదర్ అలీ, అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అరాఫత్ మిన్హాస్, సాద్ మసూద్, మాజ్ సదాకత్, అలీ రెజాశ్రీలంకఅషెన్ బండార, లసిత్ క్రూస్పుల్లే, సినీత్ జయవర్దన, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), నువానీదు ఫెర్నాండో, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుషన్ హేమంత, బినుర ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, నువాన్ తుషార, తరిందు రత్నాయకే, వనుజా సహన్, సోహాన్ డి లివేరా, గరుక సంకేత్బంగ్లాదేశ్లిట్టన్ దాస్(కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్, సైఫ్ హసన్, మెహెదీ హసన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, రిషాద్ హొసేన్.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డు -
మరీ ఏడు నెలల గర్భంతోనా.. రిస్క్ కాదా?
ఏడు నెలల గర్భం.. కడుపులో బిడ్డ.. అయినా పరుగులు, వెయిట్స్, బర్పీస్, స్లెడ్ పుష్.. చివరకు హైరోక్స్ రేస్‌ను పూర్తి చేసింది ఓ భారతీయ మహిళ. దీంతో ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు గర్భంతో ఇంత కఠినమైన వ్యాయామం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? గర్భంతోనే ఈ రేస్‌ను ఎలా పూర్తి చేసింది?ఆమె పేరు జెన్నిఫర్.. ముద్దుగా జెన్నీ. వయసు 37 ఏళ్లు. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం చైనాలోని షాంఘైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఫిట్నెస్ రంగంలో కొనసాగుతున్న జెన్నీ.. షాంఘైలోని HYROXworldలో పనిచేస్తున్నారు. అంతేకాదు Rises Shanghai అనే ఫిట్నెస్ సెంటర్‌కు ఫౌండర్, కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు HYROX రేసుల్లో పాల్గొన్నారు.హైరోక్స్ అంటే.. రన్నింగ్ రేస్ కాదు.. జిమ్ వర్కౌట్ కూడా కాదు. రెండింటినీ కలిపిన ఇండోర్ ఫిట్నెస్ పోటీ. ఇందులో పోటీదారులు 1 కి.మీ. పరుగెత్తి.. వెంటనే ఒక ఫిట్నెస్ వ్యాయామం చేయాలి. ఇలా రన్, వర్కౌట్ చొప్పున మొత్తం 8 రౌండ్లు పూర్తి చేయాలి. అంటే మొత్తం 8 కి.మీ. రన్నింగ్‌తో పాటు 8 రకాల ఫిట్నెస్ ఛాలెంజ్‌లు ఉంటాయి.వాటిలో స్లెడ్‌ను తోసడం, స్లెడ్‌ను లాగడం, రోయింగ్, స్కీ ఎర్గ్, బర్పీ బ్రాడ్ జంప్స్, బరువులు మోసుకుంటూ నడవడం, శాండ్బ్యాగ్తో లంజెస్, వాల్ బాల్స్ వంటి కఠినమైన వ్యాయామాలు ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే: “పరుగెత్తాలి.. వెంటనే బరువులతో వ్యాయామం చేయాలి.. మళ్లీ పరుగెత్తాలి.. మళ్లీ వర్కౌట్ చేయాలి” .గర్భంతో రెండోసారి రేస్..గర్భం దాల్చిన తర్వాత కూడా ఫిట్నెస్ను కొనసాగించాలని జెన్నీ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో గర్భం దాల్చిన ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో తన శిక్షణను కొనసాగించారు. గర్భం ఐదో నెలలో జపాన్‌లో జరిగిన HYROX రేసులో పాల్గొన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ రేసులో ఏడో నెల గర్భంతో బరిలోకి దిగి ఫినిషింగ్ లైన్ చేరుకున్నారు.ఎలా శిక్షణ తీసుకున్నారు?గర్భం తర్వాత తన వ్యాయామ తీవ్రతను తగ్గించినట్లు జెన్నీ తెలిపారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తక్కువ నుంచి మోస్తరు తీవ్రతతో రన్నింగ్ చేసేవారు. మరో మూడు, నాలుగు శిక్షణ సెషన్లలో కనీసం రెండు సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవారు. అయితే గర్భం తర్వాత స్ప్రింట్లు, ఇంటర్వెల్ రన్నింగ్‌ను పూర్తిగా ఆపేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లోనూ తన గరిష్ఠ సామర్థ్యంలో 70 శాతానికి మించకుండా చూసుకున్నారు. బర్పీస్ను కూడా మోకాళ్లు నేలపై ఉంచి చేసేలా మార్చుకున్నారు.డాక్టర్ పర్యవేక్షణలోనే..ఇక్కడ జెన్నీ గైనకాలజిస్ట్ కూడా ఆమె శిక్షణ గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలిపారు. రక్త పరీక్షలు, స్కాన్లు దాదాపు ప్రతి వారం చేయించుకున్నానని, తన ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో వైద్యురాలు వ్యాయామాన్ని ఆపాలని చెప్పలేదని జెన్నీ వెల్లడించారు. అయితే ప్రతి గర్భధారణ ఒకేలా ఉండదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో జెన్నీ రేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.గర్భంతో ఇంత తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల బిడ్డకు ప్రమాదం కలగొచ్చని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తాను తన శరీరాన్ని గమనించుకుంటూ, వైద్యుల సలహాతోనే శిక్షణ కొనసాగించానని జెన్నీ పేర్కొంది. అలాగే తల్లి కాబోయే ముందు తన భాగస్వామితో కలిసి ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలన్నదే లక్ష్యమని అందుకోసమే ఈ సాహాసానికి పూనుకున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) ఇదీ చదవండి: చివరి ట్రైమెస్టర్ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా..) -
రేపు క్వార్టర్ ఫైనల్; జట్టును వీడిన స్టార్ బ్యాటర్.. బంగ్లాకు షాక్!
ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు. జ్వరంతో బాధపడుతున్న నజ్ముల్ రేపు స్వదేశానికి తిరిగి రానున్నట్లు బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (బీవోఏ) వెల్లడించింది. అక్టోబర్ 9 నుంచి అఫ్గానిస్తాన్ జట్టుతో బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్ అయిన నజ్ముల్ అనారోగ్యంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడం రిస్క్ అని భావించి అతడిని వెనక్కి రావాలని ఆదేశించినట్లు బంగ్లా క్రికెట్‌బోర్డు తెలిపింది. ఇక ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ మంగళవారం మలేషియాతో తలపడనుంది. జపాన్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని బౌలింగ్‌కు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కెప్టెన్ లిటన్ దాస్ అభిప్రాయపడ్డాడు. వర్షం అంతరాయంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే భారత్, అఫ్గానిస్తాన్; పాకిస్తాన్, హాంకాంగ్‌ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ రద్దు కావడంతో మెరుగైన ర్యాంక్ ఆధారంగా దాయాది జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఒకవేళ మలేషియాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దయితే సెమీస్‌లో అడుగుపెట్టనున్న బంగ్లాదేశ్ అక్కడ పాకిస్తాన్‌తో ఆడనుంది. నేపాల్, శ్రీలంక మధ్య విజేతతో భారత్ మరో సెమీఫైనల్ ఆడనుంది.ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే! -
జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే!
ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమైనప్పటికీ, ఈ విభాగంలో అథ్లెట్లు మన దేశానికి పతకాలు అందించారు. సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు రజత, కాంస్యాలతో మెరిశారు. శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె మరోసారి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. ఫైనల్లో రుమేశ్ తరంగ ఈటెను చివరి ప్రయత్నంలో 88.55 మీటర్ల దూరం విసిరి పసిడి నెగ్గగా.. యశ్వీర్ సింగ్ తన పర్సనల్ బెస్ట్ (85.72 మీటర్లు) నమోదు చేయడమే గాక రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక తొలి ప్రయత్నంలో ఈటెను 83.56 మీటర్ల దూరం విసిరిన రోహిత్ మూడో ప్రయత్నంలో 84.35 మీటర్లు విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. ఈసారి నీరజ్ చోప్రా ఆసియా క్రీడలకు దూరంగా ఉన్న నేపథ్యంలో యశ్ వీర్, రోహిత్‌లపై అంచనాలు పెరిగాయి. వారిపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ యశ్ వీర్, రోహిత్‌లు పతకాలు సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 45కు పెరిగింది. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలున్నాయి. పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ 80.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.ఇదీ చదవండి: Asian Games: పీటీ ఉష రికార్డు బ్రేక్.. పతకాల మోత మోగించిన భారత్ -
పీటీ ఉష రికార్డు బ్రేక్.. పతకాల మోత మోగించిన భారత్
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం భారత్ ఖాతాలో 13 పతకాలు వచ్చి చేరాయి. స్వర్ణం రాకపోయినప్పటికీ, మన అథ్లెట్లు రజతాలు, కాంస్యాలతో పతకాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇక జావెలిన్ త్రోలో రజతం, కాంస్యం రావడంతో ఇప్పటివరకు భారత్ 45 పతకాలు గెలుచుకోగా.. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలున్నాయి.గుల్వీర్కు మరో రజతంభారత లాండ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ ఆసియా గేమ్స్‌లో రెండో రజతంతో మెరిశాడు. ఇప్పటికే 10వేల మీటర్ల పరుగులో రజతం గెలిచిన గుల్వీర్ సోమవారం జరిగిన 1500 మీటర్ల ఫైనల్లో రెండో స్థానంలో వెండి పతకాన్ని కొల్లగొట్టాడు. 1500 మీటర్ల రేసును గుల్వీర్ 3:36.72 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 𝐆𝐔𝐋𝐕𝐄𝐄𝐑 𝐒𝐈𝐍𝐆𝐇 𝐎𝐍 𝐓𝐇𝐄 𝐏𝐎𝐃𝐈𝐔𝐌! 🥈A strong 1500m run sees him finish second and add another medal to India’s tally! ✨Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/wsYKwYJlWl— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2026చివరి నిమిషం వరకు టాప్‌లో ఉన్న గుల్వీర్కు.. జపాన్ అథ్లెట్ కజుటో ఇజావా ఊహించని షాక్ ఇచ్చాడు. ఫినిష్ లైన్ సమీపిస్తున్న తరుణంలో కజుటో ఇజావా పుంజుకుని కేవలం 0.37 సెకన్ల తేడాతో గుల్వీర్ను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక జపాన్‌కే చెందిన జపాన్‌కు చెందిన నగియా మోరీ 3:37.92 నిమిషాల్లో రేసును పూర్తి చేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు.పీటీ ఊష రికార్డు బ్రేక్..అంతకముందు మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో భారత అథ్లెట్ విథ్యా రామ్రాజ్ దిగ్గజం పీటీ ఉష రికార్డును బ్రేక్ చేయడమే గాక కాంస్య పతకంతో మెరిసింది. 400 మీటర్ల హార్డిల్స్‌ను విథ్యా రామ్రాజ్ 54.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఒడిసిపట్టింది. PC: Twitterకాగా 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల టైమింగ్‌ను 0.67 సెకన్ల వ్యవధిలో బద్దలుకొట్టిన విథ్యా రామ్రాజ్ తన పేరును లిఖించుకుంది. ఇక యూఏఈకి చెందిన మరియమ్ కరీమ్ (54.31 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, కజకిస్తాన్‌కు చెందిన అడెలినా జెమ్స్ (54.58 సెకన్లు) రజతం కైవసం చేసుకుంది.🥉 कांस्य पदक विथ्या रामराजने AsianGames2026 में महिलाओं की 400 मीटर हर्डल्स में कांस्य पदक जीती —उन्होंने पी.टी. उषा के पिछले राष्ट्रीय रिकॉर्ड को तोड़ा!#AsianGames2026 #VithyaRamraj #Athletics pic.twitter.com/IhEvgTaBL9— @p2- चंद्रवंशी 🇮🇳 (@pra1366) September 28, 2026లాంగ్ జంప్‌లో మురళీకి రజతంభారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు. పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళీ 8.07 మీటర్ల దూరం దూకి రజతం సొంతం చేసుకున్నాడు. గత ఆసియా గేమ్స్‌లోనూ రజతమే సాధించిన మురళీ ఈసారి స్వర్ణం కోసం ప్రయత్నించాడు. అయితే చీలమండ గాయంతో చివరి రెండు ప్రయత్నాలు విరమించుకోవడంతో మురళీ శ్రీ శంకర్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే చివరి రెండు ప్రయత్నాల్లో మురళీ పాల్గొననప్పటికీ తన బెస్ట్ (8.07 మీటర్లు)ను ఎవరు అధిగమించకపోవడం విశేషం. కొరియాకు చెందిన లిన్ యూ టోంగ్ (8.05 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా.. అన్వరోవ్ అన్వోర్ (8.06 మీటర్లు) దూకి రజతం గెలుచుకున్నాడు.పారుల్ చౌదరీకి కాంస్యం..భారత స్టార్ స్ప్రింటర్ పారుల్ చౌదరీ ఆసియా గేమ్స్‌లో రెండో పతకం సాధించింది. ఇప్పటికే 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో కాంస్యం సాధించిన పారుల్ చౌదరీ సోమవారం 5వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో కాంస్యం ఒడిసిపట్టింది. ఆమె గమ్యాన్ని 15:14.61 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కంటే 10 సెకన్లు ఆలస్యంగా పరుగెత్తిన పారుల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే గత ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం పట్టేసిన పారుల్ ఈసారి కంచుమోతతోనే సరిపెట్టుకుంది. ఇక బహ్రెయిన్ అథ్లెట్ విన్‌ఫ్రెడ్ యవి 15:10.18 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం నెగ్గగా.. జపాన్ అథ్లెట్ నజోమి టనక (15:11.65 సెకన్లు) రజతం సొంతం చేసుకుంది.Congratulations to Parul Chaudhary on once again, winning the Bronze Medal in the Women’s 5000m at the #AsianGames2026! #Cheer4Bharat pic.twitter.com/E0DrL8leUb— Kiren Rijiju (@KirenRijiju) September 28, 2026ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్ డబుల్ సెంచరీ -
Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచలనం
ఆసియా గేమ్స్‌లో ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ జ్యోతి సురేఖకు ఊహించని షాక్ ఎదురైంది. వ్యక్తిగత విభాగంలో దేశానికి కచ్చితంగా పతకం తెస్తుందని భావించినప్పటికీ, జ్యోతి సురేఖ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టి నిరాశ పరిచింది. అయితే దక్షిణ కొరియాకు చెందిన 14 ఏళ్ల కాంగ్ యోన్సియో చేతిలో సురేఖ ఓటమి పాలవ్వడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ప్రిక్వార్టర్స్‌లో కాంగ్ యోన్సియో చేతిలో 150-146 తేడాతో సురేఖ ఓటమి చవిచూసింది. ఆరు సెట్ల సిరీస్‌గా జరిగిన మహిళల ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో 14 ఏళ్ల కాంగ్ యోన్సియో ఆరు సెట్లు కలిపి 150 స్కోరు సాధించగా.. జ్యోతి సురేఖ 146కే పరిమితమైంది. రెండో సిరీస్‌లో జ్యోతి సురేఖ మూడుసార్లు 10 పాయింట్లు సాధించగా.. కాంగ్ ఆమెను సమం చేసింది. ఇక మూడో సిరీస్‌లోనూ కాంగ్ మూడుసార్లు పది పాయింట్లు స్కోరు చేయగా, సురేఖ తన చివరి సెట్లో 9 పాయింట్లే నమోదు చేసి పోటీలో వెనుకబడిపోయింది. 2011 నవంబర్ 1న జన్మించిన కాంగ్ యోన్సియో దక్షిణ కొరియా జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలైన ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది.కాంగ్ యోన్సియో 701 పాయింట్లు సాధించి ర్యాంకింగ్ రౌండ్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె ప్రదర్శనతో దక్షిణ కొరియా మహిళల టీమ్ పోటీలో 2,096 పాయింట్లు సాధించి, చైనా, భారత్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. కాంగ్ యోన్సియో అదే ఫామ్‌ను వ్యక్తిగత డ్రాలోనూ కొనసాగించింది. రౌండ్ ఆఫ్ 32లో మంగోలియాకు చెందిన ఒట్గోన్బయార్ డాగ్డ్జావ్ను 150-133 తేడాతో సునాయాసంగా ఓడించిన కాంగ్, తాజాగా రౌండ్ ఆఫ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ సురేఖకు షాక్ ఇచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ నిరాశపరిచినప్పటికీ, గ్రూప్ ఈవెంట్లో మాత్రం భారత పురుషుల, మహిళల కాంపౌండ్ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచాయి. జ్యోతి సురేఖ, తానిపర్తి చికిత, ప్రతీకలతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233-230 తేడాతో కజకిస్తాన్‌ను ఓడించింది. ఇక పురుషుల కాంపౌండ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్లతో కూడిన జట్టు 235-232 తో భూటాన్‌ను ఓడించింది.ఇదీ చదవండి: అప్పుడు పతకం అందిస్తే.. ఇప్పుడు ఇంటికి సాగనంపింది! -
బుల్లెట్ ట్రైన్ లో టీమిండియా.. VIRAL VIDEO
-
కోతులకంటే 'మనిషి ఎందుకు భిన్నం?'
ముందుగా, ఈ రోజు పట్టభద్రులవుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. 1900లో క్యోటో యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,31,573 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. మీరు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక మీ కృషి మాత్రమే కాదు– మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహి తులు, మీకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రోత్సాహం ఉన్నాయి. మీ విజయాన్ని చూసి వారంతా ఎంత గర్వపడుతున్నారో నేను ఊహించగలను. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు. ముఖాముఖి సంభాషణ విలువమనమంతా ఇప్పుడు ఒక సమాచార సమాజంలో జీవిస్తున్నాం. మీరు విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు కోవిడ్ మహమ్మారి వచ్చింది. ఆ సమయంలో తరగతులు ఆన్లైన్లో జరిగాయి. స్నేహితులతో ముచ్చట్లు కూడా ఆన్లైన్లోనే. ఆ అనుభవం తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంలోని విలువ మీకు మరింత అర్థమై ఉండవచ్చు. ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు మాటలను మాత్రమే వినం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తాం. ఎదుటివారి ముఖాన్ని చూస్తాం. వారి గొంతులోని మార్పును గమనిస్తాం. వారి కళ్లను, హావభావాలను చూస్తాం. పంచేంద్రియాల ద్వారా ఎన్నో విషయాలను తెలియకుండానే గ్రహిస్తాం. ఆ అనుభూతులన్నీ కలిస్తేనే నిజమైన మానవ సంభా షణ అవుతుంది. చెప్పని భావాలను సైతం గుర్తించడం, ఎదుటి వారిని గౌరవించడం ప్రత్యక్ష సంభాషణ ద్వారానే సాధ్యం. డచ్ చరిత్రకారుడు రట్గర్ బ్రెగ్మన్ తన హ్యూమన్ కైండ్: ఎ హోప్‌ఫుల్ హిస్టరీ పుస్తకంలో ‘మనిషిని మనిషిగా మార్చేది ఏమిటి?’ అనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికరమైన పరిశోధనలను ప్రస్తావించారు. జర్మనీకి చెందిన పరిశోధకులు చిన్న పిల్లలు, ఒరాంగుటాన్లు, చింపాంజీలపై కొన్ని ప్రయోగాలు చేశారు. స్థలాన్ని గుర్తించే సామర్థ్యం, సంఖ్యలను అర్థం చేసుకోవడం వంటి విషయాలను పరీక్షించారు. మూడు గుంపులూ దాదాపు సమానమైన సామర్థ్యాన్ని చూపించాయి. జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి విషయాల్లో మనుషులకు, కోతులకు పెద్దగా తేడా కనిపించలేదు. కానీ ఇతరుల నుంచి నేర్చుకోవడం అనే అంశంపై నిర్వహించిన పరీక్షలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోతులు సున్నా స్థాయి ఫలితాలు సాధించాయి. చిన్న పిల్లల్లో చాలామంది పూర్తి మార్కులు సాధించారు. ఇక్కడ ఇతరుల నుంచి నేర్చుకోవడం అంటే... ఇతరులను గమనించడం, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వారితో సంబంధం ఏర్పరచుకోవడం, వారి అనుభవం నుంచి నేర్చుకోవడం. ఇదే మనిషి ప్రత్యేకతని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. మనిషి గొప్పతనం కేవలం అతని మెదడులోనే లేదు, ఇతర మనుషు లతో కలిసి జీవించే సామర్థ్యంలో కూడా ఉంది.ముఖం ఎందుకు ఎర్రబడుతుంది?మనిషి సిగ్గుపడినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. ఇలా జరిగే జీవి మనిషి మాత్రమే. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్... ముఖం ఎర్రబడటాన్ని చాలా ప్రత్యేకమైన మానవ లక్షణంగా పేర్కొన్నారు. మనం ఎందుకు సిగ్గుపడతాం? ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకుంటాం. ఎదుటివారి అభిప్రాయం మనకు చాలా ముఖ్యం. ముఖం ఎర్రబడటం ఒక రకమైన సామాజిక భావ వ్యక్తీకరణ. మనిషి ఒంటరి జీవి కాదు. మనకు ఇతరులు కావాలి. వారి నమ్మకం, సహకారం అవసరం. వారితో సంబంధాలు ముఖ్యం. మనిషి శరీరంలో మరో ఆసక్తికరమైన లక్షణం కళ్లలోని తెల్లటి భాగం. మన కంటి మధ్యలో కనుపాప ఉంటుంది. ఈ తెల్లటి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. మనం కళ్లను కొద్దిగా కదిపినా, మనం ఎటువైపు చూస్తున్నామో ఎదుటివారికి అర్థమవుతుంది. మీరు ఎవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు... వారు మీ వైపు చూస్తున్నారా లేదా అనేది వెంటనే గుర్తించ గలరు. అందుకే ‘కళ్లు నోటి కంటే ఎక్కువగా మాట్లాడతాయి’ అంటారు. మాటలతో చెప్పలేని భావా లను కూడా కళ్ల ద్వారా పలికించవచ్చు. దాదాపు 200లకు పైగా క్షీరద జాతులుండగా, మనిషికి మాత్రమే ఈ స్పష్టమైన ‘కంటి తెలుపు’ ప్రత్యేకత ఉంది. టొరంటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్న చరిత్ర కారుడు టిమోతీ స్నైడర్ నేటి ఇంటర్నెట్ యువతకు ఒక సలహా ఇస్తున్నారు. ‘కళ్లలోకి చూడండి, తక్కువగా మాట్లాడండి’ అంటు న్నారు. ‘కంప్యూటర్ మన కళ్లలోకి చూసి మన భావాలను అర్థం చేసుకోలేదు. కానీ మనిషి మాత్రం చూపును పట్టించుకోకుండా ఉండలేడు. మీరు ఇప్పుడు విశ్వవిద్యాలయం అనే చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చి పెద్ద సమాజంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్కడ మీ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన అభిప్రా యాలు ఉన్నవారిని కలుస్తారు. మీతో ఏకీభవించని వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారి కళ్లలోకి చూస్తూ, ప్రశాంతంగా మాట్లాడగలగడం ఎంతో ముఖ్యం. కొత్త ఆలోచనలకు తలుపులు తెరవండి!నాలుగు సంవత్సరాల క్రితం, మీరు క్యోటో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టినప్పుడు, ‘మిమ్మల్ని మీరు తెలుసుకునే’ ఒక పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పాను. ఈ నాలు గేళ్లలో మీరు ఎంతోమంది కొత్త వ్యక్తులను కలుసుకున్నారు. కొత్త స్నేహితులను సంపాదించారు. మీ మనసును మార్చిన పుస్తకాలను చదివారు. మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలను అనుభవించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ పరిచయాలన్నీ మీ గురించి మీకు ఏదైనా కొత్త విషయం నేర్పించాయా? అమెరికాలో విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేషన్ కార్యక్రమా లను ‘కమెన్స్మెంట్’ అంటారు. ఆ పదానికి అసలు అర్థం ‘ప్రారంభం’. గ్రాడ్యుయేషన్ డే అంటే చదువు ముగిసిన రోజు మాత్రమే కాదు, అది జీవితంలోని కొత్త ప్రయాణానికి తొలి రోజు కూడా. ఈ రోజు మీరు ఒక దశను పూర్తి చేసుకున్నారు, అదే సమయంలో మరో దశను ప్రారంభించనున్నారు. మీ గురించి మీరు తెలుసుకునే ప్రయాణం కూడా ఇక్కడితో ముగియదు. అది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి కొత్త పరిచయాలకు మీ మనసును ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. కొత్త అనుభవాలను స్వీకరించడానికి వెనుకాడకండి. మనలో దాగి ఉన్న ప్రతిభను మనం గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త ప్రయాణం లేదా ఒక అనుకోని సంఘటన మనలోని ఆ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావచ్చు. అలా మళ్లీ మళ్లీ మనల్ని మనం తెలుసుకుంటాం. మన జీవితానికి మనమే కొత్త అర్థాన్ని ఇస్తాం. అలా అనుకోకుండా వరించిన అదృష్టాన్ని ‘సెరెండిపిటీ’ అంటారు. అయితే అలాంటి అవకాశాలను గుర్తించడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. మనసు తలుపులు మూసేసి ఉంటే, మన ముందున్న మంచి అవకాశాన్ని కూడా మనం గుర్తించలేము. కాబట్టి మీ హృదయాన్ని, మీ మనసును కొత్త అనుభవాలకు ఎప్పుడూ తెరిచి ఉంచండి. మీ జీవిత రహదారిలో వచ్చే ప్రతి మలుపును భయపడకుండా స్వీకరించండి. -
ఆసియా గేమ్స్‌లో ఓటమి.. నిర్వాహకులను ఏకిపారేసిన పీవీ సింధు
ఆసియా గేమ్స్‌లో పతకం సాధిస్తుందనుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా గేమ్స్ నిర్వాహకులపై పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. అడ్డదిడ్డంగా మ్యాచ్‌లను నిర్వహించడంపై నిర్వాహకులను ఏకిపారేసింది."24 గంటల వ్యవధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. మేము మనుషులమే.. రోబోలు కాదు. సుదీర్ఘమైన మ్యాచ్‌లు జరిగినప్పుడు కచ్చితంగా కోలుకోవడం అవసరం. ఆటలో మంచి స్థితిలో ఉన్నప్పుడు సహజంగానే ముందుకు కదలాలనిపిస్తుంది, కానీ అలసటతో కాళ్లు కదలవు.అసలు మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రణాళికను సరిగ్గా నిర్వహించలేదు. దీంతో సరైన విశ్రాంతి లేకుండానే మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందని, దీనివల్ల పూర్తిగా అలసిపోతున్నాం. నా ఓటమికి కారణాలు వెతకను. ఇక్కడ కెమెరాలు లేవు. ఇది నిజంగా దురదృష్టకరం. కొన్ని 2-3 షాట్లు లైన్ పై ఉన్నాయని నాకు అనిపించింది. ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో కెమెరా ఉండాలి" అని సింధు ఆవేదన వ్యక్తం చేసింది.కాగా పీవీ సింధులాగే మరో భారత షట్లర్ ఉన్నతి హుడా కూడా మ్యాచ్‌ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక పీవీ సింధు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఆదివారం మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కనీస విశ్రాంతి లేకుండానే బరిలోకి దిగడం వల్ల సింధు కోర్టులో అలసటగా కనిపించడం గమనార్హం.ఆదివారం ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. స్వ్కాష్‌లో అనాహత్, అభయ్‌లు రజతం నెగ్గగా, మహిళల 200 మీటర్ల రేసులో హరిత కాంస్యం దక్కించుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 33 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలున్నాయి.ఇదీ చదవండి: ఏడాది తర్వాత బరిలోకి.. కుమ్ముతాడనుకుంటే ఇలా బుక్కయ్యాడు! -
11 ఏళ్ల పసివాడికి పసిడి
ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం సృష్టించాడు. ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడైన అతను ఇ స్పోర్ట్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇ స్పోర్ట్స్‌లో భాగంగా ఉన్న ‘పుయో పుయో చాంపియన్స్’ ఈవెంట్లో అతను ఈ పసిడిని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కురిహారా 10–2తో తనరక్ వాంగ్ (థాయిలాండ్)ను ఓడించాడు. పుయో పుయో చాంపియన్స్ ఒక రకమైన పజిల్ వీడియో గేమ్. ప్లే స్టేషన్ 4పై దీనిని ఆడవచ్చు. ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న కురిహారా ఫైనల్లో ఓడించిన ప్రత్యర్థి వయసు 28 ఏళ్లు. దాంతో ఈ గెలుపు తర్వాత అతను కనీసం నవ్వలేదు కూడా! తన విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నానని, దాదాపు మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిపై గెలవడం తనకూ బాగా ఇబ్బందికరంగా ఉందని కురిహారా వ్యాఖ్యానించాడు. అయితే పతకం, దాంతో పాటు జ్ఞాపికగా ఇచ్చిన బొమ్మ చాలా బాగున్నాయని అతను సంతోషం ప్రకటించాడు. ‘పుయో పుయో’లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రొఫెషనల్ లైసెన్స్ అందుకున్న కురిహారా అప్పటినుంచే తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్లయిన ప్రత్యర్థులను వరుసగా ఓడిస్తూ వస్తున్నాడు. చదువును, ఆటలను సమన్వయం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఈ జపాన్ అబ్బాయి చెప్పాడు. -
ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వర్ణం
ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో మెరవగా, తాజాగా డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా పసిడి పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 40-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసి స్వర్ణం ఒడిసిపట్టింది. తొలి హాఫ్‌లో భారత్‌కు ఇరాన్ గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో 18-17తో సమానంగా నిలిచాయి. అయితే రెండో సగంలో భారత రైడర్లు విజృంభించి వరుస టాకిల్ పాయింట్లతో భారత్ ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. ఆట చివరి నిమిషాల్లో కాస్త హైడ్రామా నెలకొంది. చివర్లో ఇరాన్ మరో 5 పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే కానీ భారత్ చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. పురుషుల కబడ్డీలో ఆసియా గేమ్స్‌లో భారత్ చాంపియన్స్‌గా నిలవడం ఇది వరుసగా తొమ్మిదో సారి కావడం విశేషం. 1990 నుంచి వరుసగా 9 సార్లు భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాలు గెలుస్తూ వస్తోంది. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కాగా, ఇప్పటివరకు 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలు కలిపి మొత్తం 28 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. అంతకముందు మహిళల కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 37-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది.INDIA BEATS IRAN TWICE IN KABADDI FINALS AT ASIAN GAMES 2026! 🤩🔥- Indian Men’s Team win the Gold 🥇- Indian Women’s Team win the Gold 🥇BOTH TEAM SUCCESSFULLY DEFENDS TITLE! pic.twitter.com/l2O4aO4rqb— The Khel India (@TheKhelIndia) September 26, 2026 INDIAN MEN KABADDI AT ASIAN GAMES!1990 🥇1994 🥇1998 🥇2002🥇2006🥇2010 🥇2014 🥇2018 🥉2022 🥇2026 🥇INDIA ARE NOW 9 TIMES CHAMPIONS! 🏆 pic.twitter.com/zBFc99cMUl— The Khel India (@TheKhelIndia) September 26, 2026 India are Asian Games Kabaddi champions! 🇮🇳Indian men's Kabaddi team beats Iran 40-34 in a thriller to win record-extending ninth gold medal at Asian Games.2nd Gold of the day after Indian Women team hit the Golden glory 🫡🙌 pic.twitter.com/undO5ttwsJ— Megh Updates 🚨™ (@MeghUpdates) September 26, 2026ఇదీ చదవండి: కబడ్డీ బాటలోనే హాకీ జట్లు.. డబుల్ స్వర్ణాలపై గురి! -
కబడ్డీ బాటలోనే హాకీ జట్లు.. డబుల్ స్వర్ణాలపై గురి!
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పూల్-ఎలో శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2-0తో ఆతిథ్య జపాన్ను మట్టికరిపించింది. తద్వారా పూల్-ఎలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన భారత జట్టు 12 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది. తొలుత ఇండోనేషియాను (13-1తో), శ్రీలంకను (16-1తో), దక్షిణ కొరియాను (8-2తో) చిత్తు చేసిన భారత్ తాజాగా జపాన్ను కూడా ఓడించి స్వర్ణం గెలుచుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది.సెమీస్ చేరిన మహిళల జట్టు మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కూడా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. శుక్రవారం ఆతిథ్య జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. 𝗗𝗘𝗙𝗘𝗡𝗗𝗜𝗡𝗚 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗜𝗡𝗧𝗢 𝗧𝗛𝗘 𝗦𝗘𝗠𝗜𝗦! 🇮🇳🔥The Indian Men’s Team continues its winning run at the Asian Games 2026, beating Japan 2-0 to make it four wins from four and book a place in the Semi-Finals! 🏑💪The hunt for another Asian Games gold heads… pic.twitter.com/7tPrb7WIhv— Hockey India (@TheHockeyIndia) September 26, 2026ఇదీ చదవండి: Asian Games 2026: బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం -
Asian Games 2026: బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గతవారమే జపాన్‌లో అడుగుపెట్టింది. అయితే జపాన్‌తో చారిత్రక మ్యాచ్ అనంతరం రాజధాని టోక్యోలో గడిపిన టీమిండియా బృందం శనివారం ఆసియా గేమ్స్ జరుగుతున్న నగోయాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి నగోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ఎక్స్‌లో పంచుకుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కారణంగా హెడ్‌కోచ్ గంభీర్ భారత్‌లోనే ఉండిపోవడంతో, శ్రేయస్ అయ్యర్ టీంకు మెంటార్ కమ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అనంతరం శ్రేయస్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చింది. PC: BCCI Twitterభారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 2023 ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.PC: BCCI Twitterకాగా ఈసారి క్రీడలకు మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.All set for the #AsianGames 2026 challenge 🇮🇳Drop a 💙 if you are ready to cheer for #TeamIndia 👇@WeAreTeamIndia | @Media_SAI pic.twitter.com/qypPk87QQM— BCCI (@BCCI) September 26, 2026ఇదీ చదవండి: టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి -
భారత్‌ను రెండుగా చీల్చి.. జపాన్ దాకా క్లౌడ్ హైవే!
ఒకవైపు ఆకాశమంతా దట్టమైన మేఘాలు.. మరోవైపు అసలు మేఘాల జాడే కనిపించని ప్రాంతాలు! ఎందుకిలా ఉందని అనుకుంటున్న వేళ.. మరో అసాధారణ దృశ్యం కళ్లముందుకొచ్చింది. అంతరిక్షం నుంచి చూస్తే మన దేశాన్ని రెండుగా చీల్చినట్లుగా భారీ మేఘాలు కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇన్శాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహం తన కెమెరాలో బంధించింది.అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తే వాతావరణం రెండు భాగాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. తూర్పు, ఈశాన్య, దక్షిణ భారత ప్రాంతాలపై దట్టమైన మేఘాలు కమ్ముకోగా.. పశ్చిమ, వాయవ్య భారత్ మాత్రం చాలావరకు మేఘరహితంగా కనిపించింది. సెప్టెంబర్ 25న ఇన్శాట్-3డీఎస్ తీసిన చిత్రంలో బంగాళాఖాతం నుంచి తూర్పు, ఈశాన్య భారత్ మీదుగా విస్తరించిన భారీ మేఘ సమూహం స్పష్టంగా కనిపించింది. దక్షిణ ద్వీపకల్పం, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లోనూ మేఘాల పొరలు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఆకాశం చాలావరకు నిర్మలంగా కనిపించింది.ఉపగ్రహం 10.83 మైక్రోమీటర్ల తరంగదైర్ఘ్యంలోని థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఛానల్ ద్వారా ఈ చిత్రాన్ని తీసింది. ఈ సాంకేతికతతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేఘాల కదలికలు, విస్తరణను వాతావరణ నిపుణులు పరిశీలించగలరు.అసలు కారణం ఏంటంటే..ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలోకి ప్రవేశిస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం, మధ్య భారత ప్రాంతాల్లో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు వర్షాలను ప్రభావితం చేస్తున్నాయి. తూర్పు, ఈశాన్య భారత్‌పై కనిపిస్తున్న దట్టమైన మేఘాలకు తేమతో కూడిన గాలులు, అల్పపీడన వ్యవస్థలు, ఇతర వాతావరణ పరిణామాలు కారణమై ఉండొచ్చని నిపుణుల అంచనా.ఇదే మేఘాలు.. జపాన్ దాకా!ఇదిలా ఉండగా.. మరో తాజా ఉపగ్రహ చిత్రంలో భారత్ నుంచి జపాన్ వరకు విస్తరించిన భారీ మేఘాల పట్టీ కనిపించింది. తూర్పు, ఈశాన్య భారత్ నుంచి ప్రారంభమైన మేఘ సమూహాలు హిమాలయ ప్రాంతం, చైనా మీదుగా కొరియా ద్వీపకల్పం, జపాన్ వైపు విస్తరించినట్లు చిత్రాల్లో కనిపిస్తోంది.బంగాళాఖాతం, తూర్పు భారత్ ప్రాంతాల్లో తేమతో కూడిన గాలులు భారీగా మేఘాలను ఏర్పరుస్తున్నాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు చైనా దిశగా విస్తరించిన మేఘాల పట్టీ.. తూర్పు ఆసియా వరకు కొనసాగుతున్నట్లు కనిపించింది. అందుకే ఈ భారీ మేఘ సమూహాన్ని ‘క్లౌడ్ హైవే’గా అభివర్ణిస్తున్నారు.మరోసారి రుతుపవనాల జోరుప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మధ్య, తూర్పు భారతంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశముంది.దీనికి పశ్చిమ గాలుల వ్యవస్థ (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) తోడైతే హిమాలయాల దిగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులపై అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనప్పటికీ.. వాతావరణ వ్యవస్థల ప్రభావంతో మరోసారి భారీ మేఘాలు, వర్షాలు దేశంలోని పలు ప్రాంతాలను పలకరిస్తున్నాయి. అంతరిక్షం నుంచి తీసిన ఈ చిత్రాలు మాత్రం భారత్‌లోని వాతావరణ వైవిధ్యాన్ని, ఆసియా స్థాయిలో మేఘాల విస్తరణను ఒక్కసారిగా కళ్లముందు ఉంచుతున్నాయి.ఇదీ చదవండి: ఉప ఎన్నికల వేళ.. విజయ్ కామెంట్లకు అర్థమేంటి? -
సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు
కాకామిగహారా: వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆతిథ్య జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (5వ ని.లో), ఇషిక (30వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు షిహో కొబయాకవా (46వ ని.లో) ఏకైక గోల్ అందించింది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. -
10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ రజత పతకం సాధించాడు.శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును గుల్వీర్ 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత హాంగ్జౌ (2022) ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని వెండిని కొల్లగొట్టాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్ (28:27.51 నిమిషాలు) బంగారు పతకాన్ని గెలుచుకోగా.. బహ్రెయిన్‌కే చెందిన ఆల్బర్ట్ కిప్టో (28:34.18 నిమిషాలు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 5వేల మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో నాయబ్ సుబేదార్ అయిన గుల్వీర్ సింగ్ కొంతకాలంగా సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్ 5వేల మీటర్లతో పాటు 10వేల మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 5వేల మీటర్ల రేసును 12:59.77 నిమిషాల్లో పూర్తి చేసిన గుల్వీర్ ఆసియా నుంచి 13 నిమిషాల బారియర్‌ను బ్రేక్ చేసిన మొదటి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.పోల్‌వాల్ట్‌లో తొలిసారి పతకంఆసియా గేమ్స్‌కు పోల్‌వాల్ట్‌లో భారత్‌కు తొలిసారి పతకం లభించింది. భారత అథ్లెట్ బరానికా ఎలన్గోవన్ మహిళల పోల్‌వాల్ట్‌లో కాంస్య పతకం సాధించింది. తన ఐదో ప్రయత్నంలో పోల్వాల్ట్తో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరిన బరానికా తన బెస్ట్ ప్రదర్శనను నమోదు చేసి కాంస్యం ఒడిసిపట్టింది. తొలి ప్రయత్నంలో 3.45 మీటర్లు, రెండో ప్రయత్నంలో 3.65 మీటర్లు, మూడో ప్రయత్నంలో 3.85 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 4 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరింది.షాట్‌పుట్‌లో కాంస్యంమహిళల షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఆమె షాట్‌పుట్‌ను 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్యం ఒడిసిపట్టింది. చైనాకు చెందిన సోంగ్ జియాహున్ (19.40 మీటర్లు), జాంగ్ లిన్రు (18.14 మీటర్లు) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 23వ పతకం కాగా, ఇందులో రెండు స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం -
టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం!
ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో 20వ పతకం వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో మానుష్ షా-దియా చితాలే జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన సన్ ఇంగ్షా-వాంగ్ చుయిన్ చేతిలో 4-0 (8-11, 5-11, 8-11, 2-11) తేడాతో మానుష్-దియా జోడీ ఓటమి చవిచూసింది. సెమీఫైనల్లో ప్రత్యర్థి చేతిలో వరుస గేముల్లో ఓటమిపాలైనప్పటికీ, కాంస్యం దక్కించుకుంది. దీంతో భారత్ ఇప్పటివరకు 20 పతకాలు సొంతం చేసుకోగా, ఇందులో రెండు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో భారత ప్లేయర్లు దాదాపు 9 పతకాలు ఖాయం చేసుకున్నారు. ఉదయం షూటింగ్ విభాగంలో ఒక స్వర్ణం, రజతం వచ్చిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో కమల్జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 🥉 BRONZE FOR INDIA! 🇮🇳🔥Manush Shah & Diya Chitale win BRONZE in the Mixed Doubles event at #AsianGames2026! 🏓Another medal for Team India! 🇮🇳👏#TeamIndia #TableTennis #AsianGames2026 #IndiaSportsHub pic.twitter.com/niG1gMQJ8O— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2026ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా స్పిన్నర్ అరుదైన ఫీట్ -
Asian Games 2026: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్
ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి నిరాశపరిచారు. జపాన్ వేదికగా జరుగుతున్న గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్లయిన సాత్విక్-చిరాగ్ జోడీ తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన పక్కాపోన్ తీరాతరత్సాకుల్-పీరట్చాయ్ సుక్ఫున్ జోడీ 12-21, 21-19, 21-14 తేడాతో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్న సాత్విక్ జంట రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే కీలకమైన మూడో గేమ్‌లో పూర్తిగా ఒత్తిడికి లోనైన భారత ద్వయానికి ఓటమి తప్పలేదు. గత ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. టీమ్ విభాగంలో కాంస్యం గెలిచిన భారత్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ డబుల్స్ విభాగంలో పక్కాగా పతకం తెస్తారని ఆశించగా, ఈ ఓటమి అభిమానులను షాక్‌కు గురి చేసిందని చెప్పొచ్చు. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనిషా-ధ్రువ్ కపిల జంట తొలి రౌండ్లో విజయాన్నిసాధించింది. ఈ జోడీ 21-8, 21-7తో మాల్దీవ్స్‌కు చెందిన నిబల్ అహ్మద్-అబినాథ్ జోడీపై 21 నిమిషాల్లోనే విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో ఉన్నతి 21-9, 21-10తో నార్త్ కొరియాకు చెందిన మి సోంగ్ యును చిత్తు చేసింది.ఇదీ చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ -
IND vs PAK: స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం: పాక్ కెప్టెన్
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026లో పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు గురువారం (సెప్టెంబరు 24) తెరలేచింది. గ్రూప్ దశలో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జపాన్‌పై 48 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను మలేషియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.నేరుగా క్వార్టర్ ఫైనల్కుఇదిలా ఉంటే.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే, క్వార్టర్ ఫైనల్ లేదంటే సెమీస్‌లో ఈ దాయాదుల పోరును చూసే అవకాశం లేదు. టోర్నీ విధానం ప్రకారం భారత్- పాక్ రెండు వేర్వేరు పూల్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఫైనల్ లేదంటే.. కాంస్య పతక పోరు కోసం జరిగే మ్యాచ్‌లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమైనదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సాహిబ్జాదా ఫర్హాన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా దృష్టి కేవలం టీమిండియాతో మ్యాచ్‌పై మాత్రమే లేదు. టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమైనదే. ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము.స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాంకేవలం టీమిండియా మ్యాచ్ కోసం మాత్రమే మేము సన్నద్ధం కావడం లేదు. ముందుగా చెప్పినట్లు ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. ఎవరిని ఓడించాలనుకుంటున్నాం.. ఎవరిపై గెలవాలనుకుంటున్నాం అన్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం. అందుకు అన్ని జట్లను ఓడించాల్సి ఉంటుంది’’ అని సాహిబ్జాదా ఫర్హాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా- పాకిస్తాన్ 17 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ పద్నాలుగుసార్లు గెలుపొందింది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో భారత్ పసిడి పతకం గెలిచింది.చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. చరిత్రకు అడుగుదూరంలో కోహ్లి -
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. ఆతిథ్య జపాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ గెలుపులో యువ లెగ్‌స్పిన్నర్ అరబ్ గుల్ మొమంద్ కీలక పాత్ర పోషించాడు.అంతర్జాతీయ అరంగేట్రంలోనే రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో గుల్ రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 19 డాట్ బాల్స్ సహా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం.జపాన్ జట్టుపై ఏ అంతర్జాతీయ క్రికెటర్‌కు అయినా ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఈ రికార్డు ఇండోనేషియాకు చెందిన కేతుత్ ఆర్టవాన్ (4/12) పేరిట ఉండేది. తాజాగా గుల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆ రికార్డు బద్దలు కొట్టాడు.జపాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు* అరబ్ గుల్ మొమంద్ – 4/8* కేతుత్ ఆర్టవాన్ – 4/12* టియాన్ సేన్ కున్ – 4/12* ఎన్ నిపికో – 4/17* అలీ దావూద్ – 4/19మ్యాచ్ విషయానికొస్తే.. గుల్‌తో పాటు ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్జాయ్ (3-0-13-2) రెచ్చిపోవడంతో జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో జపాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోర్.ఎవరీ గుల్..?21 ఏళ్ల అరబ్ గుల్ మొమంద్ 2024 అండర్-19 ప్రపంచకప్‌లో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు తీసిన గుల్.. ఐర్లాండ్-ఏతో జరిగిన మరో మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రదర్శనల తర్వాత గుల్కు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ అవకాశాలు లభించాయి. ఎంఐ ఎమిరేట్స్, బార్బడోస్ రాయల్స్ వంటి జట్లకు సంబంధించిన స్క్వాడ్లలో అతడు చోటు దక్కించుకున్నాడు.ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..? -
బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్.. జపాన్ మరో పోరాటం
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో పసికూన, ఆతిథ్య జపాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా జపాన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీనికి ముందు టీమిండియాతో జరిగిన చారిత్రక మ్యాచ్‌లోనూ జపాన్ బౌలర్లు సత్తా చాటారు.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేసిన జపాన్ బౌలర్లు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇబ్బందిపెట్టారు. తమకంటే చాలా మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌ను జపాన్ కేవలం 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. జపాన్ బౌలర్లు వికెట్లు పెద్దగా తీయలేకపోయినా పరుగులు నియంత్రించారు. షోమా స్లేటర్, ఇబ్రహాం తలో 2, బెంజమిన్, థామస్ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అక్రమ్ (34), కరీం జనత్ (21), కెప్టెన్ దర్విష్ రసూలీ (29) రెండంకెల స్కోర్లు చేయగా..ఆఖర్లో మొహమ్మద్ ఇషాక్ (25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బ్యాటింగ్‌లో మాత్రం జపాన్ చేతులెత్తేసింది. ముగ్గురు మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. గుల్ మొమంద్ (4-2-8-4), ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్జాయ్ (3-0-13-2) ధాటికి జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..? -
‘వైడ్’పై వివాదం!
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా... భారత్, జపాన్ దేశాల మధ్య ‘ఫ్రెండ్లీ’ సంబంధాల నేపథ్యంలో నిర్వహించిన టి20 మ్యాచ్‌లో అనవసరపు వివాదం భారత్ గెలుపును పలుచన చేసింది. అక్షర్ వేసిన చివరి ఓవర్లో ఒక ‘వైడ్’ అందుకు కారణమైంది. గెలుపు కోసం 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో జపాన్ నిలిచింది. అక్షర్ వేసిన బంతి బ్యాటర్ షిరాయ్ లెగ్‌సైడ్‌కు వెళ్లగా అతను రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అంపైర్ క్రిస్ టర్గెట్ దీనిని వైడ్‌గా ప్రకటించాడు. అక్షర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, కెప్టెన్ శ్రేయస్ కూడా మరో అంపైర్ క్రిస్ బ్రౌన్‌తో వాదించాడు. అంపైర్లిద్దరూ చర్చించిన తర్వాత ఆ వైడ్‌ను వెనక్కి తీసుకుంటూ సరైన బంతిగా ప్రకటించారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారగా, జపాన్ 3 సింగిల్స్ తీసి ఓడింది. నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయంలో తప్పేమీ లేదు. ఐసీసీ నియమావళి ప్రకారం బ్యాటర్ రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ చేయడానికి ప్రయత్నిస్తే అతని లెగ్ సైడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా రెండు వైపులనూ ఆఫ్సైడ్గానే పరిగణిస్తూ ఆఖరి స్టంప్ నుంచి 75 సెంటీమీటర్లు దూరంగా వెళితే వైడ్‌గా ఇవ్వాల్సిందే. పెద్దగా అనుభవం లేని జపాన్ అంపైర్ క్రిస్‌కు మరోవైపు నుంచి ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ బ్రౌన్ ఇది వివరించి ఉంటాడు. దాంతో అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్, రివ్యూలు లేవు కాబట్టి తర్వాతి బంతి వేసే లోపే అంపైర్ తన నిర్ణయం మార్చుకోవచ్చు. అయితే శ్రేయస్ నిరసనతో భారత్ ఏదో ఒత్తిడి తెచ్చినట్లు కనిపించిందే తప్ప వైడ్ ఇవ్వకపోవడం సరైందే! -
రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు
సొంత హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భారతదేశం జపాన్ను అధిగమించి దూసుకు పోనుంది. దేశీయంగా మరింత రైల్వే సాంకేతికతను అభివృద్ధి చేసి, విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతీయ రైల్వే శాఖ సొంతంగా గంటకు 350 కి.మీ వేగంతో వెళ్లే 'B35' బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయనుంది. 2030 నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.2030 నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా నిర్మించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) ప్రాజెక్ట్ కోసం కేంద్ర మంత్రివర్గం అధిక బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. దీని మొత్తం వ్యయం ఇప్పుడు రూ. 2 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది 2015లో వేసిన తొలి అంచనాకు దాదాపు రెట్టింపు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర బడ్జెట్ నుంచి సుమారు రూ. 1 లక్ష కోట్లు రానున్నాయి. డిసెంబర్ 2024లో తన ప్రస్తుత E5 సిరీస్ రైళ్ల తయారీని క్రమంగా నిలిపివేస్తామని, 2030 నాటికి కొత్త 'E10' రైళ్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు జపాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన స్వతంత్ర తయారీపై దృష్టి పెట్టింది.🚨India plans to develop its own 350 kmph bullet train by 2030, with the upcoming B35 train aimed at matching Japan’s next-generation E10 Shinkansen.🇮🇳 The indigenous B28 trains are expected to begin trials in 2027 at speeds of up to 249 kmph. pic.twitter.com/A0WJHBW0ZT— Beats in Brief 🗞️ (@beatsinbrief) September 22, 2026B28 రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థB35 తో పాటు గంటకు 280 కి.మీ వేగంతో నడిచే 'B28' హై-స్పీడ్ రైళ్లను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. అలాగే, రైలు వేగాన్ని నియంత్రించడానికి, రైళ్ల మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించడానికి చైనా CTCS తరహాలోనే స్వదేశీ 'భారత్ రైలు కంట్రోల్ సిస్టమ్' (BTCS) ను రూపొందిస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో విడుదల చేసిన వివరాల ప్రకారం, ముంబై-అహ్మదాబాద్ కారిడార్ MAHSR ప్రాజెక్ట్ 508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 2 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా & నగర్ హవేలీ గుండా వెళ్లే 508 కి.మీ మార్గంలో ముంబై, సూరత్, అహ్మదాబాద్‌లతో సహా మొత్తం 12 స్టేషన్లు నిర్మించనున్నారు.ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)తో కలిసి ఈ కొత్త రైలు సెట్లను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి.ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా? -
ఫైటర్ విత్ ఫైర్
పన్నెండేళ్ల వయసులో ఒక సెలూన్‌కు వెళ్లిన సుచికను చూసి అక్కడ పనిచేసే వ్యక్తి వెకిలిగా నవ్వాడు. అసభ్యకరంగా తాకాడు. ఆ చేదు అనుభవం సుచికను మార్షల్ ఆర్ట్స్ వైపు నడిపించడం ఒక ఎత్తయితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా దూసుకెళ్లడం మరో ఎత్తు.తాజాగా... ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో... మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుధానాలో పుట్టిన సుచికా తరియాల్ హరియాణాలోని రోహ్తక్లో పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చినా ఆ తరువాత ఒప్పుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోకి అడుగు పెట్టడంతో తన సత్తా చాటే అవకాశం సుచికకు వచ్చింది. జూడో, కురాష్, జూజిట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఎనిమిది సార్లు నేషనల్ జూడో ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్థిక కష్టాలుసుచిక తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తన క్రీడా ప్రయాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ‘నాకు ఆర్థికంగా సమస్యలు ఉండేవి. అలాంటి సమయంలో నా భర్త సహాయం చేసేవారు. ధైర్యం చెప్పేవారు. అందుకే ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, భర్తకు అంకితం చేస్తున్నాను’ అంటుంది 36 ఏళ్ల సుచిక.జర్నీ ఉమెన్మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో 2017లో అరంగేట్రం చేసింది సుచిక. ఆ తరువాత జూడో, జూజిట్స్ క్రీడలలో విజయవంతంగా రాణిస్తూనే ‘ఎంఎంఏ’కు కొన్ని సంవత్సరాల పాటు విరామం ఇచ్చింది. 2024లో బహ్రేయిన్లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92 ఈవెంట్ ద్వారా ‘ఎంఎంఏ’లోకి తిరిగి అడుగు పెట్టింది. సుచికను ‘జర్నీ ఉమెన్’ అని కూడా పిలుస్తుంటారు. జూడో నుండి కురాష్, జూ–జిట్స్ మీదుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లోకి మారింది.ఆరాధ్య దేవత‘నాకు చిన్నప్పటి నుంచి అక్కడ మేరీ కోమ్ అక్క అంటే చాలా ఇష్టం. భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిక్షణ శిబిరంలో ఆమెను చూశాను. ఆమె వేసుకున్న దుస్తులు, ప్రవర్తించే తీరు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. ఆమె నా ఆరాధ్యదేవత. నేను ఆమెతో ఎప్పుడూ వ్యక్తిగతం గా మాట్లాడలేదు. ఒకవేళ అవకాశం దొరికితే ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను’ అంటుంది సుచిక.యస్... రాణించగలను...సాధించగలను!ఎంఎంఏలో ప్రత్యేక శిక్షణ, ఆ క్రీడలో మునపటికంటే మెరుగైన నైపుణ్యంతో ఆసియా గేమ్స్ బరిలోకి దిగి కాంస్యాన్ని సాధించింది సుచిక. క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్ చిమెగ్ను ఓడించింది.బరువైన నిర్ణయం!కంబాట్ స్పోర్ట్స్‌లో పోటీకి ముందు ప్రతి అథ్లెట్ బరువు తూచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రిఫరీలు నిర్వహిస్తారు. బరువు తూచడానికి ఒక గంట ముందు వరకు ట్రయల్ వెయిట్–ఇన్ల కోసం అధికారిక తూనిక యంత్రాలను ఉపయోగించుకునే హక్కు అథ్లెట్లకు ఉంటుంది. బరువు ఎక్కువైనా, బరువు తూచడంలో పాల్గొనకపోయినా పోటీ నుండి అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ బరువు తూచడాలు ఆటలో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రా అయిన పోటీలో ఇవి అంతిమంగా విజేతను నిర్ణయిస్తాయి. తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా నిర్ణయిస్తారు.ఎందుకలా?!ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో తలపడింది సుచిక. హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు. రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అంటుంది సుచిక. రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆసియా క్రీడలలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.‘ ఇది నా జీవితం కంటే విలువైనది. జపాన్‌కు వచ్చి నా దేశానికి పతకం తీసుకువెళుతున్నానన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోలేను. ఇక నేను సంతోషంగా చనిపోవచ్చు. ఆసియా గేమ్స్ తరువాత ఎంఎంఏకి స్వప్తి పలకాలని అనుకున్నాను. అయితే ఇప్పటికీ నాలో శక్తి ఉందని అనిపిస్తోంది. ఈరోజు నా పెర్ఫార్మెన్స్ను విశ్లేషించుకున్న తరువాత ఇంకా రాణించగలనని అనిపిస్తోంది’ భావోద్వేగంతో... ఆత్మవిశ్వాసంతో నిండిన గొంతుతో అంటుంది సుచికా తరియాల్.– యాకుబ్ పాషా -
జపాన్ చేరుకున్న టీమిండియా.. శ్రేయస్ వ్యాఖ్యలు వైరల్!
జపాన్‌తో చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా వారి గడ్డపై అడుగుపెట్టింది. జపాన్‌కు చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రత్యేక వీడియోనూ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో శ్రేయస్ అయ్యర్ జపాన్ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించాడు. జపాన్ ప్రభుత్వం నుంచి తమకు అద్భుత స్వాగతం లభించిందని, చూడడానికి చాలా అందంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. జపాన్‌లో క్రికెట్ పరిస్థితులపై శ్రేయస్ మాట్లాడుతూ.. ‘ఇది మాకు చాలా ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన మ్యాచ్ కాబోతోంది. మేము జపాన్‌తో ఆడడం ఇదే తొలిసారి కాబట్టి, ఇక్కడి పిచ్ పరిస్థితి, వికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ జపాన్‌తో ఒక గొప్ప మ్యాచ్ ఆడేందుకు మాత్రం ఎదురుచూస్తున్నాం.’ అని ముగించాడు.ఇటీవలే ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయస్ వరుసగా 8 నాటౌట్, 11, 29 పరుగులు సాధించాడు. ఆసియా గేమ్స్‌లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఫామ్‌లోకి రావాలని శ్రేయస్ ఉవ్విళ్లూ రుతున్నాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ ప్రస్తుతం టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా 13 ఇన్నింగ్స్‌ల్లో 143 స్ట్రైక్‌రేట్‌తో 359 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.సుజుకి కప్‌గా నామకరణంభారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాల పురుష క్రికెట్ జట్ల మధ్య ఈ మేరకు ఏకైక టీ20 మ్యాచ్ నిర్వహణకు సన్నాహకాలు చేశారు. ‘స్పోర్ట్-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాల మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు జట్ల మధ్య జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కు సుజుకి కప్ అని నామకరణం చేశారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు టోచిగి ప్రిఫెక్చర్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.జపాన్ టీ20, ఆసియా క్రీడలకు భారత జట్టు:శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యష్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.🗣️ 𝗜𝘁'𝘀 𝗴𝗼𝗶𝗻𝗴 𝘁𝗼 𝗯𝗲 𝗮 𝘁𝗵𝗿𝗶𝗹𝗹𝗶𝗻𝗴 𝗮𝗻𝗱 𝗲𝘅𝗰𝗶𝘁𝗶𝗻𝗴 𝗺𝗮𝘁𝗰𝗵 𝗳𝗼𝗿 𝘂𝘀🎥 #TeamIndia have arrived in Japan and Captain Shreyas Iyer @ShreyasIyer15 is looking forward to the historic one-off T20I 🇮🇳🤝🇯🇵@CricketJapan pic.twitter.com/PZUo9kiCQ9— BCCI (@BCCI) September 21, 2026ఇదీ చదవండి: జపాన్ను చిత్తుగా ఓడించిన భారత్ -
మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్ బయట ఆ మాజీ ప్రధాని!
పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన తీరే అంత!ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీ నుంచి జపాన్ పార్లమెంట్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.Japan ex-PM Noda hands out flyers pic.twitter.com/CWnEuDoZpK— RT (@RT_com) September 18, 2026ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోదా మారినా.. రొటీన్ మారలేదు1986 అక్టోబర్ 1న జేఆర్ సుడానుమా స్టేషన్ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్, హంగామా అవసరం లేదని నోడా రొటీన్ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్ నేతల్లో ఉంటేనా.. సోషల్ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్ చేసి.. -
తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపిన జపాన్ వాయుసేన చీఫ్
జోధ్‌పూర్: భారతదేశ భూభాగంపై తొలిసారిగా జపాన్ యుద్ధ విమానాలు కార్యకలాపాలు నిర్వహించడం భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారంలో ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో భారత్, జపాన్ యుద్ధ విమానాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9న ప్రారంభయైన ఈ కార్యక్రమం 22న ముగుస్తుంది. స్వదేశీ తేజస్, ఎస్‌యూ–30ఎంకేఐ, రఫేల్ సహా భారత వైమానిక దళానికి చెందిన అగ్రశ్రేణి విమానాలు, అలాగే జపాన్ వైమానిక స్వీయ–రక్షణ దళానికి చెందిన ఎఫ్–2ఈ యుద్ధ విమానాలు సంయుక్తంగా వీర్ గార్డియన్–2026 పేరిట జరిగిన వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. జపాన్ వాయుసేన స్వీయ–రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకేహిరో మోరితా సైతం ఇందులో భాగస్వాములయ్యారు. టకేహిరో మోరితా ఒక పైలట్‌తో కలిసి తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఒంటరిగా మరో తేజస్ జెట్‌ను నడపడం విశేషం. పరస్పర గౌరవం, భాగస్వామ్యానికి చిహ్నంగా ఇద్దరు వైమానిక దళాధిపతులు బ్యాడ్జ్‌లను మార్చుకున్నారు. భారత్‌కు జపాన్ యుద్ధ విమానాలను పంపడం అనేది ఇరుదేశాల మధ్య రక్షణ సహకారానికి ప్రతీక అని టకేహిరో మోరితా చెప్పారు. -
తొలి స్వర్ణం జపాన్‌దే...
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం ఆతిథ్య జపాన్‌కే లభించింది. మూడు క్రీడాంశాల సమాహారమైన పురుషుల ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)లో జపాన్ ట్రయాథ్లెట్ టకుమి హోజో పసిడి పతకం సాధించాడు. టకుమి హోజో (750 మీటర్లు స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్) మూడు ఈవెంట్స్‌ను 52 నిమిషాల 56 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. బంగారు పతకం సాధించిన టకుమి హోజో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా సంపాదించాడు. జిరుయ్ జాంగ్ (చైనా; 53ని:05 సెకన్లు) రజతం, అర్లాన్ (కజకిస్తాన్; 53ని:11 సెకన్లు) కాంస్యం సాధించారు. -
జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో గణేష్ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి,సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి వినాయక చవితిని జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్‌లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి, సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు, జపాన్ స్థానికులు పరస్పరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్‌లో భారతీయ, తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. -
ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా?
జపాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో స్టార్ హీరో కుమారుడు పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని హీరోనే స్వయంగా వెల్లడించారు. బాలీవుడ్ హీరో, నటుడు ఆర్ మాధవన్ తన కుమారుడు స్విమ్మింగ్‌లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఆర్ మాధవన్ కుమారుడైన వేదాంత్.. స్విమ్మింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో పోటీకి రెడీ అయ్యారు. కాగా.. ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో రికార్డులు సాధించారు. పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించారు. మలేషియన్ ఓపెన్‌లో ఐదు స్వర్ణాలు, డానిష్ ఓపెన్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం గెలుపొందారు. లాత్వియన్, థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచి తన టాలెంట్ నిరూపించుకున్నారు. భారత్ తరపున స్విమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న యువ క్రీడాకారుల్లో వేదాంత్ ఉన్నారని ఒలింపిక్స్ అధికారిక వెబ్సైట్ ప్రశంసించింది. -
క్రికెట్ ఎలా ఆడతారంటే..!
నగోయా: ఆసియా క్రీడల్లో వరుసగా రెండో సారి క్రికెట్ భాగమైంది. అయితే చైనాలో జరిగిన గత క్రీడల తరహాలోనే ఈ సారి జపాన్‌లో కూడా ఆటపై పెద్దగా అవగాహన లేదు. జపాన్ జట్టు ఇప్పటికే ఐసీసీ గుర్తింపు పొంది 61 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడినా... సగటు క్రీడాభిమానికి అది ఇంకా చేరువ కాలేదు. ఇలాంటి స్థితిలో జపాన్‌లో ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో వేర్వేరు క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమైన జపాన్ అభిమానులు క్రికెట్ మ్యాచ్‌లకు కూడా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఆటపై మరింత అవగాహన కలి్పంచాలని నిర్వాహకులు భావించారు. ఆటకు సంబంధించి ప్రాధమిక అంశాలను వివరిస్తూ ప్రత్యేకంగా బుక్లెట్లు తయారు చేశారు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న కరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో వీటిని పంచుతున్నారు. జట్టులోని ఆటగాళ్ల సంఖ్య, ఫీల్డింగ్ స్థానాలు, పరుగుల లెక్క, అవుటయ్యే తీరు... ఇలా అంపైర్ల సైగలతో సహా ఈ బుక్‌లెట్‌లో ముద్రించారు. ఇవన్నీ కూడా స్థానిక జపానీ భాషలోనే ఉండటం విశేషం. -
జపాన్ గుండె చప్పుడు
ఆసియా క్రీడల ఆరంభం సంబరం అద్భుతంగా సాగింది... తమ దేశ సంస్కృతి ప్రదర్శన మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలో తమ ఘనతను చూపిస్తూ జపాన్ ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ప్రదర్శించింది. ప్రముఖ దర్శకుడు యుకిహికు సుసుమి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని రకాలుగా అలరించింది. రంగులు, హంగులతో మిరుమిట్లుగొలిపిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. క్రీడల్లో పాల్గొంటున్న వేర్వేరు దేశాల ఆటగాళ్ల మధ్య బంధాన్ని చూపేలా ‘హృదయాన్ని’ నేపథ్యంగా ఎంచుకున్న నిర్వాహకులు కార్యక్రమం ఆసాంతం దాన్ని ప్రతిఫలిస్తూ వినూత్న తరహాలో వేడుకలను ప్రపంచం ముందు ఉంచడం విశేషం. శనివారం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైలైట్స్‌ను చూస్తే...అలా సాగింది... ప్రారంభోత్సవ కార్యక్రమం జపాన్ జాతీయగీతంతో మొదలైంది. ఆ తర్వాత ఆ దేశ రక్షణ దళానికి చెందిన సైనికులు జపాన్ జాతీయ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ఐషీ రాష్ట్రంలో పర్యాటకపరంగా ఎంతో గుర్తింపు ఉన్న ‘నగోయా క్యాజిల్’ నమూనాను స్టేడియం మధ్యలో ప్రదర్శిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వయోలినిస్ట్ టారో హకాసే తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించగా, నాలుగు భిన్నమైన రంగులతో 240 మంది డాన్సర్లు చేసిన ప్రత్యేక సంగీత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. జపాన్ చారితక్ర, సాంస్కృతిక ‘కబూకీ’ ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చంది. ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘ఐఎన్ఐ మ్యూజిక్ గ్రూప్’ కూడా తమ ప్రదర్శనతో అలరించింది. ఈ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్న 43 క్రీడాంశాలకు చెందిన ఆడియో విజువల్ షోను కూడా ప్రదర్శించారు. కుటుంబ సమేతంగా హాజరైన జపాన్ రాజు నరుహిటో అధికారికంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీ తదితరులు పాల్గొన్నారు.తండ్రీ కొడుకులు కలిసి... ఆసియా క్రీడల జ్యోతిని ఇద్దరు జపాన్ స్టార్ ఆటగాళ్లు కలిసి వెలిగించారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్ క్రీడల హ్యామర్ త్రోలో స్వర్ణం సాధించిన మురోఫుషు కోజి, అతని తండ్రి షిగెనొబు కలిసి ఈ లాంఛనం పూర్తి చేశారు. షిగెనొబు కూడా హ్యామర్త్రోలనే ఆసియా క్రీడల్లో ఐదు స్వర్ణాలు గెలుచుకున్నాడు. 46 జట్ల పరేడ్... ప్రారంభోత్సవంలో జరిగిన మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 45 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. వీటితో పాటు నలుగురు సభ్యుల ఆసియా రెఫ్యూజీ టీమ్ కూడా పరేడ్‌లో భాగమైంది. ఆసియా క్రీడల్లో రెఫ్యూజీ జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అక్షర క్రమంలో అఫ్గానిస్తాన్ జట్టు అందరికంటే ముందుగా రాగా, సంప్రదాయాన్ని అనుసరించి ఆతిథ్య జట్టు జపాన్ అన్నింటికంటే ఆఖరిగా వచి్చంది. జపాన్ తరఫున 900 మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటుండటం విశేషం. అంతా హృదయమయం...ఆసియా క్రీడల థీమ్ హార్మోనిక్ ‘హార్ట్’ బీట్... వేదికపై పెద్ద సైజులో ‘హార్ట్’ నమూనా ఏర్పాటు...స్వాగత సంగీతం పేరు అవేకనింగ్ ఆఫ్ ద స్పేస్ అండ్ రెజొనేటింగ్ ‘హార్ట్’ బీట్... మార్చ్‌పాస్ట్‌లో వివిధ దేశాల పేర్ల ప్లకార్డ్‌లు కూడా ‘హార్ట్’ రూపంలోనే...సంగీత కచేరీ చేస్తున్న వయోలినిస్ట్ వేసుకున్న దుస్తులపై కూడా గుండె గుర్తులే... డ్రోన్ షోలో ఏంజెల్స్ రెక్కలూ అదే ఆకారంలో... ఇలా ఆసియా క్రీడల నిర్వాహక బృందం అన్ని చోట్లా హృదయాన్ని నింపేసింది. కబుకీ ప్రదర్శనలోనూ ‘హార్ట్’ బీట్ ఆఫ్ ట్రెడిషన్ అంటూ పరిచయం జరిగింది. ఆటగాళ్ల మధ్య అనుబంధం, ఏకత్వం, స్నేహం పెంపొందించడమే క్రీడల లక్ష్యమంటూ పదే పదే గుర్తు చేసేలా ఈ కార్యక్రమ రూపకల్పన జరగడం విశేషం.సాంకేతిక సత్తా చూపిస్తూ... ప్రఖ్యాత మోటో కార్ప్ కంపెనీ టయోటా ప్రధాన కార్యాలయం ఈ క్రీడలు జరుగుతున్న ఐషీ రాష్ట్రంలోనే ఉంది. అలాంటప్పుడు దాని ప్రాధాన్యతను గురించి చెప్పకపోతే ఎలా! క్రీడల నిర్వాహకులు కూడా అదే తరహాలో ఆలోచించారు. అందుకే ‘హార్మొనీ కనెక్టింగ్ టు ద ఫ్యూచర్’ పేరుతో తమ సాంకేతిక పురోగతిని ప్రదర్శించారు. ఐషీలో ఉన్న ఉత్పాదక కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులువంటి అంశాలను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో, ఎప్పటికిప్పుడు కొత్త ఉత్పాదనలతో భవిష్యత్తు కోసం ఎలా తాము దూసుకు పోతున్నామో ఇందులో వివరించారు.మనూ, పవన్ పతాకధారులుగా...మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి యువ షూటర్ మనూ భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీలం రంగు డిజైనర్ డ్రెస్‌లలో భారత అథ్లెట్లు మెరిశారు. బంద్గలాతో కూడిన ఆకర్షణీయమైన చీరలను మహిళా అథ్లెట్లు ధరించగా, అదే తరహాలో సిద్ధం చేసిన జోధ్‌పురి డ్రెస్‌లో పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. పతాకధారుల విషయంలో చివరి నిమిషంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మనూ భాకర్‌తో పాటు షాట్‌పుటర్ తజీందర్‌పాల్ సింగ్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సి ఉండగా...అతని స్థానంలో పవన్ వచ్చాడు. ఓపెనింగ్ సెరెమనీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్ తజీందర్కు అందకపోవడంతో మార్పు తప్పలేదు. తజీందర్ మాత్రమే కాకుండా భారత అథ్లెటిక్స్ బృందంలో ఎవరికీ ప్రారంభోత్సవ కిట్ అందలేదు. దాంతో 75 మంది భారత ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు! -
‘రాత్రంతా నిద్రపోలేదు.. పొద్దునే ఇలా.. నాకిది గర్వకారణం’
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 ఘనంగా మొదలయ్యాయి. ఈ ఆరంభ వేడుకల్లో ఒలింపిక్ పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో పాటు.. కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. నిజానికి తొలుత మనూ భాకర్‌తో కలిసి షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికయ్యాడు.ఊహించని అవకాశంఅయితే, కిట్ ఆలస్యంగా రావడం వల్ల మనూకు జతగా ఉన్న మరో భారత పతాకధారిని మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్‌కు ఊహించని విధంగా ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చింది. మనూ భాకర్‌తో కలిసి అతడు భారత పతాకధారిగా వ్యవహరించాడు.రాత్రి అసలు నిద్రపోనేలేదుఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్ మాట్లాడుతూ.. ‘‘నాకిది అత్యంత గర్వించదగ్గ క్షణం. నిజానికి మాకు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంది. అందుకు తగినట్లుగానే మేమంతా ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాము. రాత్రి అసలు నిద్రపోనేలేదు.పొద్దునే జిమ్‌కు వెళ్లి నేరుగా స్టేడియానికి వచ్చేశాను. రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను. అయినా సరే జాతీయ పతాకాధారిగా వస్తున్నానని తెలిసి ఎక్కడా లేని ఉత్సాహం, శక్తి వచ్చాయి. నిజంగా నాకు ఇది గర్వకారణం.ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్నిజానికి నాకు ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చిందని ఈరోజు ఉదయమే అందరికీ చెప్పాను. అయితే, మా అన్నయ్య అంకుర్‌కు మాత్రం గత రాత్రే మెసేజ్ చేశాను. ఇక మనూ భాకర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు.ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్. ఇంతకు ముందే ఆమెను ఓసారి కలిశాను. ఒలింపిక్ పతక విజేతతో కలిసి ఫ్లాగ్ బేరర్‌గా ఉండటం గర్వించదగ్గ విషయం. మా జట్టును ఉద్దేశించి మనూ గతంలో స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చారు. ఇప్పుడిలా ఆమెతో కలిసి నేను పతాకధారిగా ఉండటం ఊహించని విషయం’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం పవన్ సెహ్రావత్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.POV : You’re walking out along with our flag bearers at the Opening Cermony. 🥹🥹The incredible moments as our contingent marches during the Opening Ceremony! As the @asiangames_2026 are officially open, here’s wishing our contingent the very best on a successful games ahead.… pic.twitter.com/Kipe4elYGv— Team India (@WeAreTeamIndia) September 19, 2026చదవండి: Asian Games 2026: ఎవరీ క్వి మ్సీ డిసౌజా? -
ఆసియా...ఆటాడుకుందాం రా..!
46 దేశాలు... 43 వేర్వేరు క్రీడలు... 71 క్రీడాంశాలు... 469 మెడల్ ఈవెంట్లు... 17 వేలకు పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు... ఆటగాళ్ల సంఖ్యాపరంగా చూస్తే ఒలింపిక్స్‌కంటే పెద్ద క్రీడా సంబరం... రెండు వారాల పాటు ఉత్కంఠభరిత పోటీలు... నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు నేటితో తెర లేవనుంది. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీల్లో 20వ సారి ఈ ఆటల సంబరాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్... ఆరంభ విఘ్నాలను దాటి అద్భుతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. నగోయా: ఆసియా ఖండపు క్రీడాకారుల సత్తాకు పరీక్షగా నిలిచే క్రీడా పోటీలకు విజిల్ మోగింది. అధికారికంగా నేటి నుంచి 20వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా శనివారమే నిర్వహిస్తారు. అక్టోబర్ 4న పోటీలు ముగుస్తాయి. ఐషీ రాష్ట్ర రాజధాని నగోయా నగరంతో పాటు నగోయా శివార్లలోని ఇతర ప్రాంతాల్లో వేర్వేరు వేదికల్లో పోటీలు జరుగుతాయి. ఆసియా క్రీడల కోసం సుమారు 2.4 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించారు. అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చులో క్రీడలను నిర్వహించే క్రమంలో శాశ్వత కట్టడాలేమీ ఎక్కువగా లేకుండా జపాన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దాంతో ప్రత్యేకంగా ఆటగాళ్ల కోసం ‘గేమ్స్ విలేజ్’ ఏర్పాటు చేయకుండా అందుబాటులో ఉన్న సౌకర్యాలలోనే వసతి, ఇతర ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో ఆటగాళ్ల నుంచి కొంత అసంతృప్తి కనిపిస్తున్నా... నిర్వాహకులు మాత్రం తమ ప్రణాళికలకే కట్టుబడి గేమ్స్‌ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్చరీ, హాకీ, టెన్నిస్, స్క్వాష్ లలో ఆసియా క్రీడల ప్రదర్శన ఆధారంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంది. భారత జెండా ఎగిరింది... ఆసియా క్రీడల సాంప్రదాయాన్ని అనుసరించి శుక్రవారం ప్రధాన వేదిక వద్ద వివిధ దేశాల జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్, క్రీడల నిర్వహణ కమిటీ మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ కార్యక్రమం షెడ్యూల్‌కంటే ఆలస్యంగా జరిగింది. జపాన్ సాంప్రదాయ శైలి సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వేడుకను నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్‌తో పాటు నలుగురు డిప్యూటీ చెఫ్ డి మిషన్లు శరత్ కమల్, తోటన్, అలకనంద, అంజలి భగవత్ హాజరయ్యారు.ఫ్లాగ్ బేరర్లుగా తజీందర్, మనూ... ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. షాట్‌పుట్ డిఫెండింగ్ చాంపియన్ తజీందర్ పాల్ సింగ్ తూర్, షూటర్ మనూ భాకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకుంది. ఆసియాడ్‌లో ఎక్కువ పతకాలు సాధించే క్రీడాంశాలైన షూటింగ్, అథ్లెటిక్స్ ప్రతినిధులుగా వీరిద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.భారత్ నుంచి 501 మంది బరిలో...ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇన్నేళ్లుగా మంచి రికార్డు ఉంది. 1951 నుంచి 2023 వరకు జరిగిన 19 ఏషియాడ్‌లలో పాల్గొన్న భారత్ ఓవరాల్‌గా ఆల్‌టైమ్ పతకాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటి వరకు 183 స్వర్ణాలు, 238 రజతాలు, 357 కాంస్యాలు కలిపి మొత్తం 778 పతకాలు గెలుచుకుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ మన కంటే ముందున్నాయి. చైనాలోని హాంగ్జూలో జరిగిన గత ఆసియా క్రీడల్లో 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన (28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలు) భారత్ ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో సిద్ధమైంది. 2018 క్రీడలతో పోలిస్తే ఏకంగా 36 పతకాలు ఎక్కువ గెలిచి తొలిసారి సెంచరీ దాటిన మన దేశం ఈసారి మరింత పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఎప్పటిలాగే అథ్లెటిక్స్, షూటింగ్లలో భారత్‌కు ఎక్కువ పతకాలు లభించే అవకాశం ఉంది. మొత్తం 501 మంది సభ్యుల బృందంతో భారత్ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. వీరిలో 267 మంది పురుష అథ్లెట్లు, 234 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఆసియా క్రీడల్లో 43 వేర్వేరు క్రీడలు ఉండగా... భారత్ 36 క్రీడల్లో పాల్గొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 21 మంది ఆటగాళ్లు ఏషియాడ్‌లో పోటీ పడుతున్నారు. మన ఆటగాళ్ల శిక్షణ, ఎక్విప్మెంట్, కోచ్‌లు, ఆర్థిక సహకారం తదితర అంశాలు కలిపి ఆసియా క్రీడల సన్నద్ధత కోసం రూ. 703 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఆసక్తికరం.సమస్యలు సహజమే: నిర్వాహకులుపెద్ద క్రీడా ఈవెంట్ల నిర్వహణలో పలు సవాళ్లు ఉంటాయని, కొన్ని సమస్యలు సహజంగానే వస్తాయని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా వసతి, ఇతర సౌకర్యాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ తయ్యబ్ ఇక్రమ్ వివరణ ఇచ్చారు. ‘క్రీడల్లో కలి్పంచే సౌకర్యాల విషయంలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని రాజకీయం చేయవద్దు. కొందరు ప్రతీ విషయంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏ క్రీడల్లో సమస్యలు లేకుండా ఉంటాయి. వాటిని మేం ఎలా పరిష్కరిస్తామనేది ముఖ్యం. గేమ్స్ విలేజ్ ఏర్పాటు చేయాల్సిందనే వాదన వినిపించింది. అయితే మనం వాస్తవిక దృష్టితో ఆలోచించాలి. ఖర్చు తగ్గించుకోవాలి కదా. ఆటల తర్వాత దానిని ఏం చేస్తాం. 2030, 2034 ఆసియా క్రీడల్లో గేమ్స్ విలేజ్‌లు ఉంటాయి’ అని ఆయన వివరించారు. మరోవైపు 2038 ఆసియా క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై 2028లోనే స్పష్టత వస్తుందని ఒలింపిక్ కౌన్సిల్ ఆసియా (ఓసీఏ) పేర్కొంది. ఈ క్రీడల కోసం భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా పోటీ పడుతున్నాయని, ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని ఓసీఏ అధికారులు చెప్పారు. -
మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు!
2026 ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి సంబంధిత సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన ఘటన కలకలం రేపింది. అధికారిక వసతి కోసం క్రూయిజ్ షిప్‌కు చేరుకున్న సమయంలో నిర్వాహకులు వారిద్దరికీ ఒకే గదిని కేటాయించారు. అథ్లెట్, కోచ్ ఒకే గదిలో ఉండేలా ఏర్పాట్లు చేయడంపై ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం కావడానికి గంటల సమయం పట్టింది.భారత ఒలింపిక్ సంఘం (IOA) జోక్యంతో చివరకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రణతి, అశోక్ మిశ్రాకు వేర్వేరు గదులు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ అశోక్ మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. తనకు కేటాయించిన గది తాళాలు తీసుకునేందుకు వెళ్లగా, హోటల్ రిజిస్టర్లో తన బుకింగ్ కనిపించలేదని సిబ్బంది తెలిపారు. రికార్డుల్లో ఆయన పేరులోని ‘I’ అక్షరం తప్పిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు.అధికారిక రికార్డుల్లో జరిగిన పొరపాటును సరిచేసి, అశోక్ మిశ్రా అక్రిడిటేషన్‌ను ధృవీకరించేందుకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో ఆయన తెల్లవారుజామున 2 గంటలు దాటిన తర్వాతే గదికి చేరుకుని విశ్రాంతి తీసుకోగలిగారు. ఈ ఘటనను ప్రణతి నాయక్ కూడా ధృవీకరించారు.ఇదీ చదవండి: వ్యభిచారం చేసినందుకు మహిళకు వంద కొరడా దెబ్బలు! -
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీలో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. నిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు సెమీస్ బెర్తులు ఖరారుకాగా సెప్టెంబరు 17- 22 మధ్య ఆసియా క్రీడల-2026 మహిళల టీ20 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం నాటి తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది.ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాపై 86 పరుగుల తేడాతో గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడనుండగా.. భారత్- జపాన్ మధ్య మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ రెండో సెమీస్ మ్యాచ్‌లో పోటీకి దిగనుంది.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ జపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో. -
గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!
నిద్రపోతూ కూడా బహుమతులు సాధించవచ్చా? ‘యస్’ అంటోంది జపాన్‌లో జరిగే స్లీప్ టోర్నమెంట్. టోక్యోకు చెందిన ఒక మ్యాట్రస్ కంపెనీ స్లీప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలో బాగా నిద్రపోయిన వ్యక్తి మన కరెన్సీలో చెప్పాలంటే 13.76 లక్షలు గెలుచుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీదారులు 90 నిమిషాల వ్యవధిలో గాఢమైన, నాణ్యమైన నిద్రలోకి జారుకున్నామని నిరూపించుకోవాలి. ఈ టోర్నమెంట్లో పోటీదారుల నిద్రను ట్రాక్ చేసే పరికరాన్ని ఉపయోగిస్తారు. స్లీప్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందు పోటీదారులు కొన్ని వ్యాయామాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా మేల్కొవడం లేదా నిద్రమాత్రలు వేసుకుని తీవ్రమైన నిద్రలేమితో టోర్నమెంట్లో పాల్గొనడాన్ని నిషేధించారు. ఈ టోర్నమెంట్ వచ్చే నెల మొదటి వారంలో టోక్యోలోని షేర్ గ్రీన్ మినామీలో జరగనుంది. ఇదీ చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు! -
‘వసతి సమస్యే కాదు’
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని ఏషియన్ గేమ్స్ డిప్యూటీ చెఫ్ డి మిషన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ వెల్లడించాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో... అథ్లెట్ల వసతి కోసం కంటైనర్లను సిద్ధం చేయగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో శరత్ కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంటైనర్ రూమ్‌లు, క్రూయిజ్‌షిప్ వసతులకు భారత అథ్లెట్లు సులువుగా అలవాటు పడతారని... వారి ప్రదర్శనపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్ నుంచి 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు 265 మంది అధికారులు కూడా జపాన్‌కు చేరుకున్నారు. వీరిని షిప్పింగ్ కంటైనర్లు, క్రూయిజ్ షిప్‌లు, హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేశారు. దీనిపై దక్షిణ కొరియాతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని పలు సభ్య దేశాలు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ కమల్ మాట్లాడుతూ... ‘ఇలాంటి వసతి ఏర్పాట్లతో భారత అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ సైతం అందించాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు కేంద్రాల్లో కంటైనర్ రూమ్‌లు ఏర్పాటు చేసి అథ్లెట్లకు అందులో వసతి ఏర్పాటు చేశాం. దీంతో వారు పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. జపాన్‌కు వచి్చంది ఏషియన్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి. అథ్లెట్ల అందరి లక్ష్యం అదే’ అని వివరించాడు. ఐదు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్... నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు గెలిచాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన శరత్... ప్రస్తుతం క్రీడా పరిపాలన అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ‘ఈసారి ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు తప్పక పతకాలు గెలుస్తుంది. పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్–మనుశ్ షా... మిక్సడ్ డబుల్స్‌లో మనుశ్ షా–దియా జోడీలపై భారీ అంచనాలు ఉన్నాయి’ అని శరత్ వివరించాడు. ఏషియన్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరఫున ఐదుగురు మహిళా ప్లేయర్లు, ఐదుగురు పురుష ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు టీటీ పోటీలు జరగనున్నాయి. -
చెత్త వేయొద్దు... సంగీతం వినొద్దు... టాటూలు కనిపించొద్దు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతుండగా... ఇప్పటికే భారత క్రీడాకారులు క్రీడా వేదికకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ‘సాయ్’ మన అథ్లెట్లకు అవగాహన కల్పించింది. జపాన్ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంతో పాటు అక్కడ నడుచుకోవాల్సిన తీరును వీడియో ద్వారా అథ్లెట్లకు వివరించింది. జపాన్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు... అపరిచిత వ్యక్తులను ఆలింగనం చేసుకోకూడదు... రహదారులపై బిగ్గరగా మాట్లాడకూడదు... లిఫ్ట్‌లో స్నేహితులతో కలిసి నవ్వకూడదు... ప్రయాణ సమయంలో తోటివారిని ఇబ్బంది పెట్టేవిధంగా సంగీతం వినకూడదని ‘సాయ్’ అథ్లెట్లకు సూచించింది. ‘మీరు కేవలం ఒక అథ్లెట్‌గా జపాన్‌లో పర్యటించడం లేదు. మీరు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలను పాటిస్తూ... స్థానికులను గౌరవిస్తూ ముందుకు సాగండి’ అని ‘సాయ్’ ప్రత్యేక వీడియోలో పేర్కొంది. ఏషియన్ గేమ్స్‌లో భారత బృందానికి డిప్యూటీ చెఫ్ డి మిషన్‌గా వ్యవహరిస్తున్న టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా... జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు కొన్ని సూచనలు చేశాడు. ‘జపాన్‌లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శరీరంపై పెద్ద పెద్ద టాటూలు కనిపించకూడదు. వస్త్రాధారణ కూడా హుందాగా ఉండాలి. రోడ్లపై ఎక్కువ డస్ట్బిన్లు ఉండవు అయినా... చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. డస్ట్‌బిన్ కనిపించేంత వరకు చెత్తను మీ దగ్గరే పెట్టుకోవాలి. లైంగిక వేధింపుల వంటివైతే ఇక అంతే. అపరిచిత వ్యక్తిని ఏ కారణంతో అయినా తాకకూడదు. ఈ అంశంపై అథ్లెట్లకు తగిన సూచనలు ఇచ్చాం’ అని శరత్ కమల్ వెల్లడించాడు. ఇప్పటికే జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు ఒక అంచనా ఏర్పడిందని... అయినప్పటికీ క్రీడల ఆరంభానికి ముందే అథ్లెట్లకు మరిన్ని సూచనలు చేస్తామని శరత్ కమల్ తెలిపాడు. భారత క్రీడాకారులకు మార్గదర్శకాల జాబితా → జపాన్ ప్రజల జీవనశైలిని గౌరవిస్తూ నడుచుకోవాలి. రోడ్లపై చెత్త వేయడం పూర్తిగా నిషిద్ధం. డస్ట్‌బిన్ కనిపించేంత వరకు చెత్తను తమ వద్దే ఉంచుకోవాలి. అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. → బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరంపై ఉన్న టాటూలు కనిపించకుండా దుస్తులు ధరించాలి. ఏ ప్రదేశంలో అయినా ‘క్యూ’ పద్ధతిని పాటించాలి. ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్ ఆన్ చేయడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకూడదు. → ప్రజా రవాణ వసతులను వినియోగిస్తున్నప్పుడు పెద్ద శబ్దంతో సంగీతం వినకూడదు. ఇయర్ఫోన్లు తప్పక వాడాలి. → రహదారులపై నడుస్తున్నప్పుడు సైతం హుందాగా ప్రవర్తించాలి. అపరిచిత వ్యక్తులను తాకడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదు. → స్థల పరిమితి కారణంగా అథ్లెట్ల కోసం ఓడరేవులోని నౌకలు, ప్రత్యేక కంటైనర్లలో వసతి ఏర్పాటు చేశారు. మన అథ్లెట్లు దీనికి అలవాటు పడేందుకు జపాన్ వెళ్లడానికి ముందే బెంగళూరు, పాటియాలా జాతీయ శిక్షణ శిబిరాల్లో అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే అథ్లెట్లకు బస కల్పించారు. → అన్నీ పోటీలు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుండటంతో అథ్లెట్లు వేర్వేరు హోటళ్లలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్లే వైద్యులు, ఫిజియోలను బృందాలుగా విభజించారు. → మన అథ్లెట్ల సౌకర్యం కోసం శాఖాహార భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఒలింపిక్ కమిటీ కోరింది. అలాగే క్రీడలు జరిగే సమీప ప్రాంతాల్లోని భారతీయ రెస్టారెంట్ల వివరాలను అథ్లెట్లకు అందించారు. -
వృద్ధుల విషయంలో జపాన్ ప్రపంచ రికార్డు
జపాన్‌లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ. శతాధిక వృద్ధుల్లో మహిళలు 94,298 మంది ఉండగా, పురుషులు 13,779 మంది ఉన్నారు.ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శతాధికుల్లో మహిళలదే అగ్రస్థానం. మొత్తం సంఖ్యలో సుమారు 88 శాతం, అంటే 94,298 మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో, అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో రికార్డుల్లో నిలిచారు. జపాన్‌లో శతాధికుల సంఖ్య వృద్ధిని పరిశీలిస్తే.. 1963లో గణాంకాల సేకరణ ప్రారంభమైనప్పుడు వీరి సంఖ్య కేవలం 153 మాత్రమే ఉండేది. ఆ సంఖ్య 1981 నాటికి వెయ్యి దాటింది. 1998లో 10,000 కు, 2012లో 50,000 కు చేరింది. ఇప్పుడు ఏకంగా లక్ష మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గణాంకాలపై జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో హర్షం వ్యక్తంచేశారు.ఇదీ చదవండి: భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ! -
గీత దాటితే వేటే..
న్యూఢిల్లీ: ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడల కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రత్యేక ‘సేఫ్ గార్డింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను తీసుకొచ్చింది. క్రీడాకారులు, అధికారుల భద్రత, క్రమశిక్షణకు సంబంధించిన వివరాలను ఈ నియమావళిలో పొందుపరిచింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రీడల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా... మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ముందే హెచ్చరిస్తోంది. భారత సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షురాలు నీతల్ నారంగ్... ఈ క్రీడల్లో మన అథ్లెట్ల బృందానికి ‘సేఫ్ గార్డింగ్ ఆఫీసర్’గా వ్యవహరించనున్నారు. ఆసియా క్రీడల సందర్భంగా ఎలాంటి ఆధిపత్యం, అధికార దుర్వినియోగానికి తావులేకుండా నియామావళిని రూపొందించారు. హోదాను ఉపయోగించి వేధింపులకు గురిచేయడంపై తీవ్ర ఆంక్షలు విధించారు. క్రీడాకారులు, అధికారులు అవమానకరమైన, అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా నిషేధం విధించారు. కేవలం మైదానంలో అథ్లెట్ల ప్రదర్శననే కాకుండా... వారి సోషల్ మీడియాను సైతం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓ కంట కనిపెడుతూ ఉండనుంది. క్రీడల సందర్భంగా అథ్లెట్లు, సహాయక సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఇతరుల గౌరవాని భంగం కలిగించకుండా బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ప్రతీ అథ్లెట్, అధికారి ఈ నియామావళిపై సంతకం చేయడం తప్పనిసరి కాగా... వీటి గురించి భారత అథ్లెట్లకు ఇదివరకే వర్క్ షాప్ నిర్వహించారు. అక్టోబర్ 4తో ఏషియన్ గేమ్స్ ముగియనుండగా... హాకీ, స్క్వాష్ విభాగాల్లో ఇక్కడ పసిడి పతకాలు సాధించిన వారు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. -
వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు?
వినాయక చవితి వచ్చిందంటే మన దేశంలో ఎక్కడ చూసినా గణనాథుడి సందడే కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు.. ఇంటింటా బొజ్జ గణపయ్య ప్రతిమలు.. ఘనంగా పూజలు.. నైవేద్యాలు.. నిమజ్జనాలు. కానీ మనకు ఎంతో పరిచయమైన ఈ విఘ్నేశ్వరుడు మరో దేశంలో మాత్రం పూర్తిగా భిన్నమైన రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆ గణేశుడి విగ్రహాన్ని అందరికీ చూపించరు. పూజా విధానాలనూ రహస్యంగానే నిర్వహిస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ వింత గణేశుడి కథేంటి?జపాన్‌లో గజరాజు రూపంతో ఉన్న దైవాన్ని పూర్తి భిన్నమైన సంప్రదాయం ఉంది. అక్కడ ఆయన్ని కాంగిటెన్.. షోటెన్ అనే పేర్లతో పూజిస్తారు. అంతేకాదు.. అక్కడి ఓ ప్రత్యేక రూపంలో రెండు ఏనుగు ముఖాలున్న దేవతలు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించరు. పూజా విధానాలను కూడా రహస్యంగానే నిర్వహిస్తారు. జపాన్ బౌద్ధ సంప్రదాయాల్లో వినాయకుడి కథ ఆసక్తికరమైన మలుపులతో కనిపిస్తుంది.తొలుత దుష్ట శక్తిగా..కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల్లో కాంగిటెన్ అనేది అడ్డంకులు సృష్టించే దుష్ట శక్తిగా పేర్కొని ఉంది. అతడిని ‘గజరాజుగా’, మనుషులకు ఇబ్బందులు కలిగించే శక్తిగా భావించేవారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రాలు, ఆచారాలు ఉపయోగించేవారు. అయితే తర్వాతి సంప్రదాయాల్లో కథ పూర్తిగా మారుతుంది.వినాయకుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేయడానికి కన్నోన్.. స్త్రీ వినాయక రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం చెబుతుంది. ఆమెను చూసిన వినాయకుడు ఆకర్షితుడవుతాడు. అయితే ఆమెను తన సహచరిగా అంగీకరించాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని షరతు పెడుతుంది. వినాయకుడు అంగీకరించడంతో ఆమె అతడిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంతో అతడి ఉగ్ర స్వభావం శాంతించి.. దుష్ట శక్తి నుంచి రక్షక దేవతగా మారినట్లు కథనం.అందుకే కౌగిలింత రూపం!ఈ కథతోనే కాంగిటెన్ ప్రత్యేక రూపానికి సంబంధించిన భావనను అనుసంధానిస్తారు. రెండు ఏనుగు ముఖాలున్న రూపాలు ఒకదానినొకటి కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కేవలం ప్రేమకు సంబంధించిన ప్రతీకగా కాకుండా.. భిన్న శక్తుల ఏకత్వం, ఉగ్రతను శాంతింపజేయడం, సామరస్యం, సంపూర్ణతకు సంకేతంగా వివరిస్తారు. అందుకే ఈ రూపం సాధారణ గణేశుడి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.ఎందుకంత రహస్య పూజ?కాంగిటెన్ ఆరాధన జపాన్‌లోని ఎసోటెరిక్ బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దుష్ట శక్తిగా భావించిన వినాయకుడి ఆరాధనలో ప్రత్యేక మంత్రాలు, దీక్షతో చేసే కర్మకాండలు అభివృద్ధి చెందాయి. అందుకే కాంగిటెన్ విగ్రహాలను చాలాచోట్ల తెర వెనుక లేదంటే ప్రత్యేక పెట్టెల్లో ఉంచుతారు. సాధారణ భక్తులకు వాటిని నేరుగా చూపించరు. కొన్ని అత్యంత ముఖ్యమైన పూజలను దీక్ష పొందిన బౌద్ధ సన్యాసులే నిర్వహిస్తారు. ఈ రహస్యత్వమే కాంగిటెన్ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. పూజలు, నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం..కాంగిటెన్కు సమర్పించే నైవేద్యాల్లో డైకాన్ ముల్లంగికు ప్రత్యేక స్థానం ఉంది. ముల్లంగితో పాటు జపాన్ సంప్రదాయ బియ్యం మద్యం సేక్ను కూడా సమర్పిస్తారు. ఇక అత్యంత ఆసక్తికరమైన నైవేద్యం ‘కాంగిదాన్’. ఇది ఎర్రబీన్స్ పూర్ణంతో నింపి నూనెలో వేయించే తీపి పదార్థం. భారతీయ సంప్రదాయంలోని మోదకాన్ని పోలిన ఈ స్వీట్‌ను కాంగిటెన్కు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.డైకాన్ సమర్పణ వెనుక కూడా ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. బౌద్ధ సంప్రదాయంలో మనిషిని వేధించే ప్రతికూల భావాల్లో ఒకటైన ద్వేషాన్ని తొలగించడాన్ని ముల్లంగి సమర్పణ సూచిస్తుందని భావిస్తారు. అందుకే జపాన్‌లోని కాంగిటెన్ ఆలయాల్లో డైకాన్ బొమ్మలు, గుర్తులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలయాల్లో ముల్లంగికి సంబంధించిన ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు.ఇక కాంగిటెన్ పూజల్లో అత్యంత రహస్యమైన ఆచారాల్లో ‘ఆయిల్ బాత్ రిట్యువల్’ (Yokuyu-ku) ఒకటి. విగ్రహంపై పవిత్రమైన నువ్వుల నూనెను నిర్దిష్ట విధానంలో పోస్తూ చేసే ఈ పూజను సాధారణంగా దీక్ష పొందిన సన్యాసులే నిర్వహిస్తారు. వినాయకుడి పాత దుష్ట స్వభావాన్ని శుద్ధి చేసి.. అతడిని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చిన ప్రక్రియకు ఇది ప్రతీకగా భావిస్తారు.అలా మన దగ్గర విఘ్నాలను తొలగించే గణపయ్య.. జపాన్‌లో మాత్రం ఒకప్పుడు విఘ్నాలు సృష్టించే శక్తిగా పేరొందాడు. కాలక్రమంలో కాంగిటెన్ అనే రహస్య దైవంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒకే గణేశుడికి దేశానికో రూపం.. సంప్రదాయానికో కథ.. ఇదే వినాయక ఆరాధనలోని విశేషం!.ఇదీ చదవండి: ఎల్లలు లేవని దేవుడు ఈయన! -
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
విఘ్నాలను తొలగించే దేవుడిగా, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భారతీయులు కొలిచే గణపతి దేవునికి సరిహద్దులు లేవు. ఆసియాలోని పలు దేశాల్లో గణేశుడిని వివిధ పేర్లతో, భిన్నమైన సంప్రదాయాలతో పూజిస్తుంటారు. జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, కంబోడియాల్లో గణేశుని ఆరాధనలు కనిపిస్తాయి.జపాన్‌లో ‘కాంగిటెన్’గా గణపయ్యజపాన్లో గణేశుడిని కాంగిటెన్ (Kangiten)గా పూజిస్తారు. జపాన్ సంస్కృతిలో ఆయనను విఘ్నాలను తొలగించి ఆనందం, విజయం అందించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ గణేశుడి ఆరాధనకు బౌద్ధమతంతో సన్నిహిత సంబంధం ఉంది. భారత్‌లో గణపతికి మోదకాలు నైవేద్యంగా సమర్పించడం సాధారణం కాగా.. జపాన్‌లో ఆయనకు ముల్లంగిని సమర్పించే సంప్రదాయం ఉంది. జపాన్‌లోని మత్సుచియామా షోడెన్, హోజాంజిలలో కాంగిటెన్ ఆలయాలున్నాయి.థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో పలు హిందూ దేవతలను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందులో గణేశుడు కూడా ఒకరు. ఇక్కడ ఆయనను ‘ఫ్రా ఫికానెట్’ గా పిలుస్తారు. అదృష్టం, విజయం ప్రసాదించే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఆనందాన్ని అందించడంతో పాటు కష్టాలను అధిగమించే శక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని స్థానికుల నమ్మకం. దేశవ్యాప్తంగా గణేశుడి విగ్రహాలు, ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వీటిని సందర్శిస్తారు.ఇండోనేషియా.. బాలిలో ప్రత్యేక స్థానంఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో గణేశుడికి విశిష్ట స్థానం ఉంది. అదృష్టం, జ్ఞానం, కొత్త ఆరంభాలకు నెలవైన దేవుడిగా గణేశుడిని పూజిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల నాటికే ఇండోనేషియాలో గణేశుడు ముఖ్యమైన దేవతగా గుర్తింపు పొందాడు. అక్కడి కొన్ని హిందూ సమాజాల్లో విష్ణువు, శివుడు, సరస్వతితో పాటు గణేశుడిని కూడా ఆరాధిస్తారు. ఇండోనేషియా ప్రాచీన సంస్కృతి, కళల్లోనూ గణేశుడి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.నేపాల్‌లో శుభప్రద దేవుడిగా..నేపాల్‌లో గణేశుడిని గణేశ, గణపతి, వినాయక వంటి పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా హిందూ నేవార్ సమాజంలో ఆయనను అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. భారత్‌లో మాదిరిగానే అక్కడ కూడా మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. నేపాల్‌లో పలు గణేశ ఆలయాలు ఉన్నాయి. రాజధాని ఖాట్మండులోని మారూ గణేశ్, భక్తపూర్‌లోని సూర్య వినాయక ఆలయాలు వాటిలో ప్రముఖమైనవిగా చెబుతుంటారుమలేషియాలోనూ వినాయక చవితిమలేషియాలో హిందువులు అధికంగా కనిపిస్తారు. అక్కడ కూడా గణేశుడిని కొత్త ఆరంభాలకు ప్రతీకగా, విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని కూడా నిర్వహిస్తారు. అదృష్టం కోసం పలువురు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటారు. మలేషియాలోని శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.కంబోడియాలో శతాబ్దాల చరిత్రకంబోడియాలో గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 5వ-6వ శతాబ్దాల నుంచే అక్కడ గణేశుడిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. శైవ హిందూ సంప్రదాయం వ్యాప్తి ద్వారా గణేశుడి ఆరాధన అక్కడికి చేరినట్లు చెబుతారు. ఖ్మేర్ సామ్రాజ్య కాలానికి చెందిన కళల్లోనూ గణేశుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాలు, చెక్కడాల్లో ఆయన రూపాలు దర్శనమిస్తాయి. ప్రజలు గణేశుడిని విముక్తిని ప్రసాదించే, విఘ్నాలను తొలగించే దేవునిగా భావిస్తారు. కంబోడియాలోనూ పలు గణపతి ఆలయాలు కనిపిస్తాయి.ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ.. -
గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద
-
ఏషియన్ గేమ్స్.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!
ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.అయితే ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. "విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్ లేవు. ఈవెంట్‌కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం
టోక్యో: సెంట్రల్ జపాన్ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రధాన నది పరిధిలో అత్యవసర వరద హెచ్చరిక జారీ చేశారు. రహదారులు, రైల్వే ట్రాక్‌లు సహా కీలక మౌలిక వసతులన్నీ నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచించారు.జపాన్ వాతావరణ సంస్థ షోనై నదికి అత్యున్నత స్థాయి-5 వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ నది గిఫు, ఐచి ప్రిఫెక్చర్ల మీదుగా ప్రవహిస్తుంది. నగోయాలో గంట వ్యవధిలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చికుసా, మోరియామా, మీటో వార్డుల్లోని ప్రజలు భద్రత కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కోరింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ఘటనల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది. సుమారు 2,700 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడల వేదికల్లోనూ పలు చోట్ల వర్షపు నీరు చేరింది.నగర మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఆర్ చువో లైన్ రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. రద్దీగా ఉండే సకాయే ప్రాంతంలోని రహదారులపై ఒక దశలో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ఐచి ప్రిఫెక్చర్లోనే టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. జేఆర్ సెంట్రల్ ప్రకారం, టోక్యో వైపు వెళ్లే టోకైడో షింకాన్సెన్ రైళ్లు ఒక దశలో ఒకాయామా-టోక్యో స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. టోక్యో-నగోయా మధ్య బయలుదేరే రైళ్లను కూడా నిలిపివేశారు. జేఆర్ వెస్ట్ ప్రకారం వర్షాల కారణంగా సాన్యో షింకాన్సెన్ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. టోకైడో, సాన్యో షింకాన్సెన్ సేవలు సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పునఃప్రారంభమయ్యాయి.ఐచి, గిఫు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఒకే ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించే ‘లీనియర్ రెయిన్బ్యాండ్స్’ ఏర్పడ్డాయని వాతావరణ సంస్థ తెలిపింది. పశ్చిమం నుంచి ఈశాన్య జపాన్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. టోక్యో, సైతామా, చిబా, కనగావాతో పాటు పశ్చిమ జపాన్‌లోని ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు! -
‘భయం’పై నిర్భయంగా దిగితే..!
భూమి కాకుండా మానవుడు సౌరవ్యవస్థలో అత్యధికంగా శోధించిన గ్రహం... పొరుగునున్న అంగారకుడు!. ఇదే కుజ గ్రహం. ఐరన్ ఆక్సైడ్ వల్ల దీని నేల ఎర్రగా కనిపిస్తుంది కనుక అరుణగ్రహం అని కూడా అంటారు. ఈ గ్రహం దాపులకు వెళ్లిన అంతరిక్ష నౌకలు, దాని కక్ష్యలో తిరిగిన మానవ నిర్మిత ఉపగ్రహాలు (ఆర్బిటర్లు), ఉపరితలంపై దిగిన ల్యాండర్లు, రోవర్ల మిషన్లను లెక్కపెడితే.. 1964 నుంచి నేటి వరకు దాదాపు 40 సార్లు అంగారకుడిపై పరిశోధనల దండయాత్రలు చేశాం. ఆ గ్రహపు విశాల లోయలు, తుప్పుపట్టిన రంగులోని ఇసుక తిన్నెల్ని ఆర్బిటర్లు ఫొటోలు తీశాయి.రోవర్లు అక్కడి దుమ్ము తుపాన్లను, గడ్డకట్టించే చలిని తట్టుకుంటూ, రాతిపొరల్లో రంధ్రాలు వేస్తూ పురాతన నదీ గర్భాల కింద జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగించాయి. నాసా రోవర్లు ‘క్యూరియాసిటీ’, ‘పెర్సెవరెన్స్’ ప్రస్తుతం అంగారకుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధిస్తున్నాయి. నాసా ఉపగ్రహాలు ‘మార్స్ ఒడిస్సీ’, ‘మార్స్ రీకానసన్స్ ఆర్బిటర్’, యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘మార్స్ ఎక్స్‌ప్రెస్’ సహా దాదాపు అరడజను ఆర్బిటర్లు ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలో చక్కర్లు కొడుతూ ఆ గ్రహాన్ని జల్లెడ పడుతున్నాయి.కానీ, అంగారకుడి జంట చంద్రుళ్లు ఫోబోస్, డీమోస్ జన్మరహస్యం మాత్రం నేటికీ ఓ మిస్టరీగానే మిగిలింది. సూర్యుడి బాహ్య గ్రహాల చంద్రుళ్లపై ఓ లుక్కేద్దాం! శని చందమామ టైటాన్... మీథేన్ సముద్రాలతో అలరారుతోంది. నిత్యం బద్దలయ్యే 400 అగ్నిపర్వతాలతో గురుడి చంద్రుడు ‘అయో’ సదా అట్టుడుకుతుంటాడు. ఇక గురుడి మరో చంద్రుడు యూరోపా, శని చంద్రుడు ఎన్సెలాడస్... మంచుతో ఘనీభవించిన తమ ఉపరితలాల కింద ద్రవరూప సముద్రాలతో శోభిల్లుతున్నాయి. అంగారకుడి జంట చంద్రుళ్లకు మాత్రం ఇంత ‘గ్లామర్’ లేదు!ఫోబోస్, డీమోస్ వంకరటింకరగా బంగాళాదుంప ఆకారంలో ఉంటాయి. గ్రహాల సహజ చంద్రుళ్లకు సంబంధించిన ఈ సకార, వికార ఆకృతుల ముచ్చట పక్కనపెడితే... రెండు రాతి ముక్కలు ఫోబోస్, డీమోస్ మనకు చెప్పాల్సిన సంగతులు బోలెడు! వీటి గుట్టు విప్పడానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) వచ్చే నెల 20న తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్3 రాకెట్ సాయంతో ‘మార్షియన్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్’ (ఎంఎంఎక్స్) వ్యోమనౌకను ప్రయోగించబోతోంది. అది ఫోబోస్ మీద దిగి పది గ్రాముల దాకా మట్టి, సూక్ష్మ శిలలు, ధూళి నమూనాలు సేకరించి భూమికి పట్టుకొస్తుంది.భయం పుట్టిస్తాడు ఫోబోస్! గ్రీకు పురాణాల ప్రకారం గ్రీకుల యుద్ధ దేవుడు ‘ఏరిస్’. ఇతడి కుమారులే ఫోబోస్, డీమోస్. వీరిద్దరు తండ్రికి రథసారథులై యుద్ధంలో అతడికి సహకరిస్తారు. రణరంగంలో అకస్మాత్తుగా భయోత్పాతం సృష్టించి శత్రు సైనికుల పలాయనానికి కారణమవుతాడు ఫోబోస్. ఇక డీమోస్- యుద్ధభూమిలో బీభత్సానికి ప్రతీక. నేడు వాడుకలో ఉన్న ప్రాచీన గ్రీకు పదం ‘ఫోబియా’ (భయం)కు మూలం ఫోబోస్!అంగారకుడి జంట చంద్రుళ్లను అమెరికన్ ఖగోళవేత్త అసాఫ్ హాల్ 1877లో కనుగొన్నాడు. పరిమాణంలో డీమోస్ కంటే పెద్దదైన ఫోబోస్ అంగారకుడికి బాగా దగ్గరగా ఉంటుంది. అంగారకుడికి ఫోబోస్ కేవలం 6 వేల కిలోమీటర్ల దూరంలో, డీమోస్ 23 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 22 కిలోమీటర్ల వ్యాసం గల ఫోబోస్ ఏడున్నర గంటల్లోనే అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. 12 కిలోమీటర్ల వ్యాసం గల డీమోస్ అంగారకుడి చుట్టూ తిరగడానికి 30 గంటలు పడుతుంది. గ్రహశకలాలా? అంగారకుడి శిథిలాలతో పుట్టాయా?అంగారకుడు-గురుడు గ్రహాల మధ్య గల ఆస్టరాయిడ్ బెల్టులో లక్షలాది గ్రహశకలాలున్నాయి. ఫోబోస్, డీమోస్ కూడా గ్రహశకలాలని, సౌరవ్యవస్థ ఆవిర్భావ దశలో అంగారకుడు గురుత్వశక్తితో వాటిని బంధించి చంద్రుళ్లుగా మార్చుకున్నాడనేది 40 ఏళ్లుగా బహుళ జనాదరణ పొందిన సిద్ధాంతం. ఎందుకంటే అంగారకుడికి తన జంట చంద్రుళ్లతో ఏమాత్రం సంబంధం ఉన్నట్టు అనిపించదు. మంచు, సేంద్రియ పదార్థాలతోపాటు అత్యధిక కార్బన్ గల ‘కార్బొనేషియస్ కాండ్రైట్స్’ తరగతికి చెందిన ఉల్కలతో ఈ రెండు చంద్రుళ్లకు పోలికలున్నాయి. తక్కువ సాంద్రత గల ఫోబోస్, డీమోస్ సూర్యకాంతిని అత్యల్పంగా ప్రతిఫలిస్తూ నల్లటి ఉపరితలాలతో దర్శనమిస్తాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు సౌరకుటుంబంలో లోపలివైపుండే శిలామయ గ్రహాలు.గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ సౌరవ్యవస్థలో బయటివైపుండే వాయు గ్రహాలు. జీవావిర్భావానికి కావాల్సిన మంచు, సేంద్రియ పదార్థాలు తొలుత సౌరకుటుంబ బాహ్య ప్రాంతాల్లో ఏర్పడి అనంతరం అంతర-శిలామయ గ్రహాల వైపు విస్తరించాయా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో శాస్త్రవేత్తల మదిని తొలుస్తోంది. అటు అంతర గ్రహాలు, ఇటు బాహ్య గ్రహాల ప్రాంతాలకు మధ్యలో ఓ ‘గేట్ వే’లా ఉన్న ఫోబోస్, డీమోస్... జీవం ఆవిర్భవించిన తొలినాటి పరిస్థితులపై మనం అవగాహన పెంచుకోవడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.సౌరవ్యవస్థలోని బాహ్య గ్రహాలు బంధించిన గ్రహశకలాలు సాధారణంగా పొడవైన, వంపుతో కూడిన కక్ష్యల్లో తిరుగుతున్నాయి. కానీ ఫోబోస్, డీమోస్ మాత్రం అంగారకుడి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. మరోవైపు- భూమి నుంచి మన చంద్రుడు ఏర్పడినట్టే... ఓ భారీ ఖగోళ వస్తువు ఢీకొట్టినప్పుడు అంగారకుడి నుంచి ఉత్పన్నమైన శిథిలాలతో ఫోబోస్, డీమోస్ ఆవిర్భవించాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అవి రెండూ ఓ భారీ ఖగోళ వస్తువు నుంచి విడివడిన రెండు అవశేషాలు అయివుండొచ్చని మరో నమ్మిక. జాక్సా ‘ఎంఎంఎక్స్’ మిషన్ ఈ వాదనలన్నిటికీ చెక్ పెట్టి ఓ స్పష్టత తీసుకురానుంది.అంగారకుడి చంద్రుడు ఫోబోస్ ఉపరితలంపై సంచరించనున్న 'ఐడెఫిక్స్' రోవర్‘ఫోబోస్’పై తిరుగాడనున్న ‘ఐడెఫిక్స్’ రోవర్!ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ ఉమ్మడిగా రూపొందించిన 23 కిలోల బుల్లి రోవర్ ‘ఐడెఫిక్స్’ను మోసుకెళుతున్న ‘ఎంఎంఎక్స్’ వ్యోమనౌక వచ్చే ఏడాది అంగారకుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. వ్యోమనౌక అంగారకుడి రెండు చంద్రుళ్లకు బాగా దగ్గరికెళ్లి ఏడాది పైగా పరిశోధిస్తుంది. 2028 లేదా 2029లో మిషన్ చివరి అంకం మొదలవుతుంది. ఫోబోస్ గురుత్వశక్తి అత్యల్పం. అది మన భూమి గురుత్వశక్తిలో వెయ్యో వంతు కంటే తక్కువ. 23 కిలోల రోవర్ సైతం ఫోబోస్ ఉపరితలంపై కేవలం 15 గ్రాములే తూగుతుంది! అందుకే ‘ఐడెఫిక్స్’ ల్యాండింగులో భారీ థ్రస్టర్లు, పారాచూట్ల అవసరం ఉండదు.రోవర్ సాఫీగా దిగుతుందా లేదా అని శాస్త్రవేత్తలు టెన్షన్ పడాల్సిన పనీ లేదు. రోవరును ప్రధాన నౌక అయిన ‘ఎంఎంఎక్స్’… ఫోబోస్ ఉపరితలానికి 40 మీటర్ల ఎత్తు నుంచి మృదువుగా కిందికి జారవిడుస్తుంది. రోవర్ వంద రోజులపాటు ఫోబోస్ ఉపరితలంపై సంచరిస్తుంది. అక్కడి రాళ్లను విశ్లేషిస్తూ ఫొటోలు తీస్తుంది. నేల స్వభావం, భౌతిక పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.ఈ పని పూర్తవగానే ‘ఎంఎంఎక్స్’ వ్యోమనౌక ఫోబోస్ మీద దిగి మట్టి, రాళ్ల నమూనాలు సేకరిస్తుంది. అనంతరం డీమోస్ కు వంద కిలోమీటర్ల దూరంలోకి వెళుతుంది. దాని నిర్మాణం కూడా ఫోబోస్ లాగే ఉందో, లేదో పరిశీలిస్తుంది. 2030లో భూమికి తిరుగు పయనమవుతుంది. ఫోబోస్ నమూనాల కేప్సూల్ 2031లో పారాచూట్ల సాయంతో ఆస్ట్రేలియాలో ల్యాండవుతుంది.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: JAXA, Smithsonian Magazine) -
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
భారత్‌లోని జపాన్ రాయబారి (Ambassador) ఓనో కేయిచి (Ono Keiichi) రిషికేష్ పర్యటన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.గంగోత్రి నదీ తీరాన పవిత్ర గంగానదిలో మూడుసార్లు పవిత్ర స్నానం ఆచరించి, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, తన అనుభూతిని, అభిమానాన్ని చాటుకున్న వైనంగా నెట్టింట వైరల్‌గా మారింది. గంగలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో వివరించారుజన్మాష్టమి వారాంతంలో జరిగిన ఈ అనుభవాన్ని ఓనో కేయిచి ఎక్స్ వేదికగా పంచుకుంటూ నిజంగా ఇది మరచిపోలేని క్షణం, అద్భుతం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. రిషికేష్‌లోని గంగానది ఒడ్డున భద్రత కోసం ఉన్న గొలుసును పట్టుకుని ఆయన మూడుసార్లు నీటిలో మునిగారు. ఈ అనుభవం తనకు ఎంత గొప్ప భక్తిని, కృతజ్ఞతా భావాన్నికలిగించిందని, జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. రిషికేశ్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య ఉండటం తనకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగించిందని ఒనో కేయిచి చెప్పారు. “చివరకు రిషికేశ్‌లో గంగానదిలో పూర్తిగా మూడుసార్లు మునిగాను. జన్మాష్టమి వారాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కలిగింది. ‘‘ఇది నిజంగా మరచిపోలేని క్షణం” అని ఆయన రాసుకొచ్చారు. అలాగే గంగా ఆరతి సందర్భంగా సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆచారాల్లో భాగంగా ఆయన నదీ తీరంలో మట్టి దీపాన్ని వెలిగించారు. ఈ ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇదీ చదవండి : రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! Finally, a full dip in the Ganges in Rishikesh—three times! 🙏Over the Janmashtami weekend, surrounded by people carrying on centuries-old faith and traditions, I felt a profound spiritual connection, along with awe, humility, and gratitude.A truly unforgettable moment 🇮🇳 pic.twitter.com/A1SoVaDYuH— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) September 6, 2026ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగాకాగా భారతీయత, ప్రాధాన్యతలపై ఓనో కేయిచి ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదు. 21024 నవంబర్‌లో భారత జపాన్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన ఓనో కేయిచి, మొదటినుంచీ భారతీయ ఆహార పద్ధతులు, సంస్కృతి పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.గతంలో ఢిల్లీలో చేతితో బిర్యానీ తింటూ.. "సుషి" లాగే బిర్యానీని కూడా చేతితో తింటేనే అసలైన రుచి వస్తుందని చెప్పారు. అలాగే బిహార్ పర్యటనలో 'లిట్టి చోఖా' రుచి చూసి భోజ్‌పురి భాషలో "గజబ్ స్వాద్ బా" (అద్భుతమైన రుచి) అని ప్రశంసించారు.ఇదీ చదవండి: రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా -
టోక్యో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు
జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి పండుగను జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్‌లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో కూడా సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి మరియు సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు మరియు జపాన్ స్థానికులు పరస్పరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్‌లో భారతీయ మరియు తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.సంస్కృతి మన మూలం — స్నేహం మన బలం.జై శ్రీకృష్ణ! 🙏రాధే రాధే! 🌸 -
ఒక్క చెట్టు 4,000 పండ్లు.. ఈ చెట్టు కథ విన్నారా?
జపాన్‌లో ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా పియర్ చెట్లే! ఆ ఊరి పేరు టొట్టోరి. అక్కడ ఇంటి ముందు, బడి ముందు, రోడ్ల పక్కన అంతా పియర్ చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? టొట్టోరి కొండ వాలు ఊరు. వర్షం పడితే నీళ్లు నిలవకుండా వెళ్లిపోతాయి.ఇలాంటి చోటు పియర్ చెట్లకు చాలా ఇష్టం. భలే పెరుగుతాయి. అందుకే ఇక్కడ పండ్లు ఎంతో జ్యూసీగా, తియ్యగా పండుతాయి. టొట్టోరి రైతులు పియర్ చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ ఒక పెద్ద పియర్ చెట్ల మ్యూజియం కూడా ఉంది. అందులో 20 మీటర్ల వెడల్పున్న ఒక పెద్ద చెట్టు ఉంది.అది ఒక్కటే ఏడాదికి 4000 పండ్లు ఇస్తుంది! అందుకే టొట్టోరిలో కొత్త సీజన్ వస్తే మొదటి పియర్ బాక్స్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ఆగస్టు 27న ఒసాకా నగరంలో మొదటి పియర్ పండ్ల వేలం జరిగింది. 10 కిలోల ఒక బాక్స్ పండ్లు ఏకంగా 6,00,000 యెన్లు అంటే మన లెక్కలో దాదాపు 3 లక్షల 40 వేల రూపాయలకు అమ్ముడుపోయింది! ఇది రికార్డ్.ఇవీ చదవండి: కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా? -
ఏషియన్ గేమ్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం!?
జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్-2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభం కానుండగా.. మెన్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి షెడ్యూల్ అయ్యాయి. అయితే మ్యాచ్‌లు జరగనున్న ఐచి-నగోయాలోని వసతులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధానంగా క్రికెట్ జట్లకు సరైన 5-స్టార్ హోటల్ వసతి లేకపోవడం, తాత్కాలిక టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా కేటాయించడంపై వివాదం రేగింది. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఈ ఏర్పాట్లపై బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా తమ నిరసనను వ్యక్తం చేశాయి. క్రికెటర్లకు ప్రత్యేక ప్రత్యేక వసతి కల్పించాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాను డిమాండ్ చేశాయి. కానీ ఓసీఎ మాత్రం క్రికెటర్లకు ప్రత్యేక వసతి కల్పించబడదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోయేషిన్ కూడా (ఐఓఏ) ధ్రువీకరించింది.ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ తమ పురుష, మహిళల జట్ల వసతి, ఫుడ్, రవాణా ఏర్పాట్లను స్వయంగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు భారత పురుషుల క్రికెట్ జట్టుకు త్రీ-స్టార్ హోటల్, ఉమెన్స్ టీమ్‌కు ఫోర్-స్టార్ హోటల్‌ను కేటాయించారు.అయితే ఒకే గదిని ఇద్దరు ప్లేయర్ షేర్ చేసుకోవాల్సి ఉండడతో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా భారత క్రికెటర్లకు అంతర్జాతీయ టోర్నీల్లో విడిగా సింగిల్-ఆక్యుపెన్సీ 5-స్టార్ రూమ్‌లు ఇస్తుంటారు. అదేవిధంగా ఆటగాళ్ల భారీ కిట్‌బ్యాగ్‌లు, ఇతర క్రీడా పరికరాలు ఉంచుకోవడానికి ఈ చిన్న గదులు సరిపోవని బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే సౌకర్యాలను పరిశీలించడానికి జపాన్‌కు ఓ బృందాన్ని బీసీసీఐ పంపనుంది. వారి రిపోర్ట్ మేరకు తమ ఆటగాళ్ల వసతుల విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా
ఏషియన్ గేమ్స్-2026 ఆరంభానికి ముందే భారత క్రికెట్ జట్టు ఒక చారిత్రక మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జపాన్‌తో ఏకైక టీ20లో టీమిండియా తలపడనుంది. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం 'ఎక్స్' వేదికగా వెల్లడించింది."ఒలింపిక్స్-20236, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులకోసం ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా ‘స్పోర్ట్స్ 75’తో తొలి అడుగు వేయనుంది. జపాన్‌తో భారత్ ప్రత్యేక మ్యాచ్ ఆడనుంది. జపాన్ ప్రధాని సనాయె తకైచి, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇండియా, జపాన్ మధ్య క్రీడల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలకు బీసీసీఐ పూర్తి స్ధాయి భారత జట్టును పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. ఎవరీ నయా సంచలనం?𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗜𝗻 𝗧𝗵𝗲 𝗠𝗮𝗸𝗶𝗻𝗴!India🇮🇳 🤝 Japan🇯🇵#TeamIndia set to play a historic T20I against Japan to launch the celebrations of the 7️⃣5️⃣th Anniversary of India-Japan Diplomatic Relations. 👏👏@CricketJapan All The Details 🔽https://t.co/vxdhuT1tgp pic.twitter.com/DQmPncvefH— BCCI (@BCCI) September 4, 2026 -
నేపాల్‌కు జపాన్ దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు..
ఖాట్మండు: నేపాల్‌లోని రసువా, నువాకోట్ తదితర ప్రాంతాల్లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం జపాన్ ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చాయి. దాదాపు 9.3 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని ఆ దేశానికి అందజేశాయి. ఈ విపత్తు సహాయక సామగ్రిలో దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు, స్లీపింగ్ ప్యాడ్లు, టెంట్లు, మంచినీటి నిల్వకు ఉపయోగపడే పోర్టబుల్ జెర్రీ క్యాన్లు ఉన్నాయి.ఈ సామగ్రి బుధవారం నేపాల్ చేరుకోగా, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ‘హ్యుమానిటేరియన్ స్టేజింగ్ ఏరియా’లో లాంఛనంగా అప్పగించారు. నేపాల్‌లో జపాన్ రాయబారి మయేదా తోరు.. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ మంత్రి మహాబీర్ పున్కు ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో పాటు జైకా నేపాల్ అధికారులు పాల్గొన్నారు. జైకా నేపాల్ చీఫ్ రిప్రజెంటేటివ్ మత్సుజాకి మిజుకి, మంత్రి మహాబీర్ పున్ సంబంధిత పత్రాలను (లెటర్ ఆఫ్ డెలివరీ అండ్ యాక్సెప్టెన్స్) పరస్పరం మార్చుకున్నారు.విపత్తు వేళ తక్షణ సాయం అందించినందుకు గాను జపాన్, జైకా సంస్థలకు మంత్రి పున్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సామగ్రిని బాధితులకు సకాలంలో, సక్రమంగా పంపిణీ చేసేందుకు సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని జైకా కోరింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జపాన్-నేపాల్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి టెలిఫోన్ చర్చల అనంతరం ఈ సాయం ఖరారైంది. ఆ చర్చల్లో జపాన్ ప్రభుత్వం వరద మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, నేపాల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ అత్యవసర సామగ్రి బాధితుల కష్టాలను తగ్గించి, పునరుద్ధరణ, పునర్నిర్మాణ చర్యలకు దోహదపడుతుందని, ప్రజలు వీలైనంత త్వరగా సాధారణ జీవితం గడపడానికి తోడ్పడుతుందని జపాన్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: ‘సీజేపీ’ మహిళా కార్యకర్తకు ‘బిగ్‌బాస్’లో చాన్స్ -
నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్
-
మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం!
మనుషులు తాము ఎంతకాలం జీవిస్తామనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేయగలరని జపాన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ కాలం జీవిస్తామని భావించే వ్యక్తులు అనుకున్నట్లే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో, తాము ఎక్కువ కాలం బతకలేమని భావించిన వారిలో సుమారు 59 శాతం మంది తమ అంచనా కంటే ఎక్కువ ఏళ్లే జీవించినట్లు తేలింది.సుకూబా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షోహీ ఒకమోటో నేతృత్వంలోని బృందం ‘జపనీస్ ఏజింగ్ అండ్ హెల్త్ డైనమిక్స్ స్టడీ’ డేటాను విశ్లేషించింది. 60 ఏళ్లు, ఆపై వయసున్న 2,447 మంది వృద్ధులను వారు ఎంత వయసు వరకు జీవిస్తారని అడగ్గా, 393 మంది సమాధానం చెప్పలేకపోయారు. మిగిలిన వారు 63 నుంచి 120 ఏళ్ల మధ్య వయసును అంచనాగా పేర్కొన్నారు.28 ఏళ్ల అనంతరం, అంటే 2024 నాటికి ఈ వ్యవధిలో మరణించిన 1,514 మంది అంచనాలను, వారి వాస్తవ ఆయుష్షుతో శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. ఎక్కువ కాలం జీవిస్తామని భావించిన వారు తమ జీవితంలో మరిన్ని ఏళ్లను పొడిగించుకున్నట్లు స్పష్టమైంది. అయితే కేవలం సానుకూల దృక్పథం వల్లే ఇది సాధ్యమైందా అన్న అంశాన్ని శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. ఇది కేవలం పరిశీలనాత్మక డేటా మాత్రమేనని స్పష్టం చేశారు.సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది తమ ఆయుష్షును 80 ఏళ్లుగా పేర్కొన్నారు. 1996 నాటి జపాన్ సగటు ఆయుర్దాయం కూడా దీనికి సమీపంలోనే ఉండటంతో, ప్రజలు ఆ సంఖ్యను ఎంచుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తామని విశ్వసించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, ఉన్నత విద్యావంతులు తమ అంచనాలను మించి జీవించినట్లు తేలింది.ఇది కూడా చదవండి: భార్య గుట్టు రట్టు చేసిన రోబో వాక్యూమ్.. భర్తకు తప్పని జైలు! -
1993లో జపాన్లోకి ఎంట్రీ.. 33 ఏళ్ల తర్వాత జరిగిందిదే..
జపాన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 1993లో 15 రోజుల వీసాతో జపాన్‌లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా వ్యక్తిని 33 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. షిజుఒకా ప్రిఫెక్చర్‌లోని యైజు నగరంలో 'మున్ జోంగ్-గి' అనే వ్యక్తిని జపాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 1993లో తన తమ్ముడి పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి జపాన్ చేరుకున్న మున్.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దక్షిణ కొరియాకు తిరిగి వెళ్లలేదని పోలీసులు తెలిపారు.జపాన్‌లో ఆ వ్యక్తి.. దశాబ్దాల తరబడి దినసరి కూలీగా, ఇతర చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించినట్లు తెలుస్తోంది. జపాన్‌లో ఓ వ్యక్తి అక్రమంగా నివసిస్తున్నాడని సమాచారం అందడంతో విచారణ చేపట్టిన పోలీసులు.. చివరికి మున్ను కనుగొన్నారు. పోలీసు విచారణలో ఆయన తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించారు. అయితే, ఎటువంటి చట్టపరమైన నివాస అనుమతులు లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఆయన జపాన్‌లో ఎలా ఉండగలిగారనే విషయంపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.మున్.. జపాన్‌కు వెళ్లిన 1993 సమయంలో అక్కడ వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 1993లో జపాన్‌లో సుమారు 2,98,646 మంది ఉన్నారు. మున్కు ఇచ్చిన అనుమతి వ్యవధి కేవలం 15 రోజులు మాత్రమే. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా ఆయన జపాన్‌లోనే ఉండిపోయారు. అక్కడ ఉన్న సమయంలో సాధారణ పనులు చేస్తూ తన జీవనాన్ని సాగించారు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నివసించారు? ఎక్కడ పనిచేశారనే పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.మున్.. దాదాపు 33 ఏళ్లు జపాన్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు క్రిమినల్ ఆరోపణల కింద సుమారు 26 ఏళ్ల అక్రమ నివాసాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2000లో జపాన్ తమ ఇమ్మిగ్రేషన్ చట్టానికి సవరణలు చేసి.. అక్రమ నివాసానికి క్రిమినల్ శిక్షను అమలులోకి తెచ్చింది. దీంతో ఆయన అరెస్టుకు సంబంధించిన నేరం 1993 వీసా గడువు ముగిసినప్పటి నుండి కాకుండా 2000 సంవత్సరం నుంచి లెక్కిస్తారు. -
Asian Games: భారత్‌కు భారీ ఎదురుదెబ్బ
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా గాయపడ్డాడు. ఫలితంగా ఆసియా క్రీడలకు అతడు దూరమయ్యాడు.అదే విధంగా.. డైమండ్ లీగ్ ఫైనల్, వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్స్‌లో కూడా నీరజ్ చోప్రా పాల్గొనలేకపోతున్నాడు. కాగా ఇటీవల లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈటెను 88.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థీనంలో నిలిచాడు. అంతకుముందు దోహా డైమండ్ లీగ్‌లోనూ రాణించిన నీరజ్.. ఓవరాల్‌గా 12 పాయింట్లు సాధించిన లీగ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.చీలమండ గాయంఈ క్రమంలో బ్రసెల్స్‌లో సెప్టెంబరు 5న జరిగే డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ పాల్గొనాల్సి ఉండగా.. చీలమండ గాయంతో టైటిల్ పోరుతో పాటు ఆసియా క్రీడలకు కూడా దూరమయ్యాడు. కాగా ఆసియా క్రీడలు సెప్టెంబరు 19న జపాన్ వేదికగా మొదలుకానున్నాయి. ఇక ఇక్కడే జరిగిన టోక్యో ఒలింపిక్స్-2020లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఇక ఇటీవల కామన్వెల్త్ క్రీడలు-2026లో వెండి పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా.. లుసానే డైమండ్ లీగ్ సందర్భంగానే తన గాయం తీవ్రతరమైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.బాధగా ఉందిఈ మేరకు.. ‘‘ఎంతో కఠిన శ్రమ తర్వాత లుసానే డైమండ్ లీగ్‌లో ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. అయితే, దురదృష్టవశాత్తూ ఆ తర్వాత కాసేపిటకే నా చీలమండలో నొప్పి మొదలైంది. శిక్షణ సమయంలో బాగా ఇబ్బంది పడ్డాను.నా వైద్యుడు, మా బృందంతో చర్చించిన తర్వాత ఈ సీజన్లో మిగిలిన టోర్నీలన్నింటి నుంచి విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నిజంగా నేను తీవ్ర నిరాశకు లోనయ్యాను. గాడిన పడుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరం. ఏదేమైనా ఈ ప్రయాణంలో ఎత్తుపళ్లాలు సహజం. కోలుకోవడంపై దృష్టి పెట్టి.. మరింత బలంగా తిరిగివస్తాను. నాపై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని నీరజ్ చోప్రా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ మంచి మనసు.. చిన్న వయసులోనే.. -
హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు. జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె. అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్‌కి సదా ధన్యావాదాలు అని పోస్ట్‌లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mayo Japan (@mayojapan) (చదవండి: గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!) -
జపాన్‌లో విదేశీయులకు బిగ్ షాక్.. ఫీజులు భారీగా పెంపు
జపాన్‌లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులుజపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.కొత్త ఫీజుల వివరాలు ఇవే..మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లుఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లుమూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లుఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లుశాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లుఅంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.ఆన్లైన్ దరఖాస్తులకు కొంత తక్కువకౌంటర్లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్లైన్లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.ఫీజుల పెంపునకు కారణమేంటి?జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.అందరికీ ఒకే భారం కాదుఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్.. -
జపాన్‌లో అద్భుతం: 396 టన్నుల భారీ కోటను కదిలించిన వెయ్యిమంది జనం!
హిరోసాకి: పురాతన సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం ‘హికియా’ పద్ధతిని ఉపయోగించి, ఉత్తర జపాన్‌లోని సుమారు 1,800 మంది వాలంటీర్లు కలిసి 396 టన్నుల బరువున్న చారిత్రక ‘హిరోసాకి’ కోటను విజయవంతంగా కదిలించారు. గతంలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ఈ కోట పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, దానిని తిరిగి అసలు స్థానానికి చేర్చే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కోటను ప్రస్తుతానికి రెండు మీటర్లకు పైగా ముందుకు జరిపారు.ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన 1,800 మంది వాలంటీర్ల కోసం దాదాపు 8,000 దరఖాస్తులు వచ్చాయని హిరోసాకి నగర ఉద్యానవనాలు, పచ్చదనం విభాగం అధిపతి కెన్సుకే హయసాకా తెలిపారు. స్థానిక నగరవాసులతో పాటు జపాన్ నలుమూలల నుంచి, ఆగ్నేయాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా వంటి విదేశాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. భవనాన్ని కూల్చకుండా రోలర్లపై ఉంచి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రాచీన జపాన్ పద్ధతినే ‘హికియా’ అంటారు. #弘前城 #天守曳戻し #イベント 4日目!「そーれ!」の掛け声で参加者が一斉に綱を引っ張り、力を合わせて天守を移動させる曳戻し。この4日間で天守が318cm移動しました!#弘前 #ひろさき #hirosakicastle #hirosakipark #aomori #tohoku #visitjapan #japantrip #japantravle #hirosaki pic.twitter.com/631i4r1ZwA— 弘前市シティプロモーション (@hirosaki_promo) August 25, 2026కోట రాతి పునాదిని సురక్షితంగా పునర్నిర్మించేందుకు వీలుగా 2015లో దీనిని అసలు స్థానం నుంచి దాదాపు 78 మీటర్ల దూరం తరలించారు. 2024 నాటికి 2,185 రాళ్లను పునరుద్ధరించి పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కోటను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు 80 మందితో కూడిన బృందాలు 30 మీటర్ల పొడవైన తాళ్లను లాగుతూ ‘సో-రే, సో-రే’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలించారు. ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 4,100 మంది కలిసి కోటను మొత్తం 5 మీటర్లు తరలిస్తారు. మిగిలిన 73 మీటర్ల తరలింపు ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి యంత్రాల సహాయంతో పూర్తి చేయనున్నారు. 1611లో సుగారు వంశం నిర్మించిన ఈ కోట, 1627లో పిడుగుపాటుకు గురై దెబ్బతినగా 1810లో పునర్నిర్మించారు. జపాన్‌లో మిగిలి ఉన్న 12 పురాతన కోట బురుజులలో ఇది ఒకటి. ఇది ‘చెర్రీ బ్లూసమ్’ సమయంలో ఏడాదికి దాదాపు 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇది కూడా చదవండి: సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం.. నిజం ఒప్పుకున్న ఇన్‌స్టా చీఫ్ -
జపాన్ అణ్వస్త్ర డైలమా
కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.ఇప్పటికే వ్యతిరేకతే1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్‌లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్‌కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్‌లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్‌కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?మారుతున్న అమెరికా వైఖరిమొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్‌వర్క్ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, పసిఫిక్ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్‌పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.ట్రంప్ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్‌పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.తైవాన్‌పై వైఖరిలో దూకుడునిరుడు అక్టోబర్‌లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్‌లో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్ కూడా ఉంది. తైవాన్ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్ కావటంతోపాటు, తైవాన్ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం
టోక్యో: జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జనం ప్రాణభయంతో ఇళ్లు నుంచి బయటకు పరుగులుతీశారు. ప్రాణ, ఆస్టి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. టోక్యో నగరం సహా చుట్టుపక్కన ప్రాంతాల్లో భూమి కంపించింది. దక్షిణ ఇబారకీ ప్రాంతంలో భూఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి సునామీ ప్రమాదం ఏమీలేదని అధికారులు స్పష్టంచేశారు. గత నెలలో 7.1 తీవ్రతతో వచి్చన భూకంపం ధాటికి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500 భవనాలు నేలమట్టమయ్యాయి. -
మూన్ బేస్..స్పేస్ రేస్
దశాబ్దాల కల సాకారానికి రంగం సిద్ధమైందిఆరేళ్లలో జాబిల్లిపై శాశ్వత మానవ ఆవాసం రెడీ గ్రహాంతరాళాల శోధనకు ఇదే నిచ్చెన నాసా, ఇస్రో, జాక్సా, ఈఎస్‌ఏలు కలిసికట్టుగా రెడీ చేస్తున్న మూన్‌బేస్ వింతలు విశేషాలు... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నా సా) జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు ఉద్దేశించిన ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామి కానుంది. ఈ రెండు మాత్రమే కాదు యూరోపియన్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేయి కలపనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే నాసా ఆధ్వర్యంలోని ఆర్టీమిస్–3 ప్రాజెక్టులో భాగంగా 2032 నాటికల్లా మూన్ బేస్ సిద్ధమవుతుందని అంచనా. ఈ స్థావరం ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనాలు, ఏ దేశం ఏ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తికి సాయపడుతుంది? అన్నది ఇక్కడ ఆసక్తికరం. 60, 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలైతే చేస్తున్నారుగానీ భౌతికంగా చందమామను దాటి వెళ్లింది లేదు. కారణాలు అనేకం. అయితే మూన్‌బేస్ ఈ పరిస్థితిని మార్చేస్తుందని అంచనా. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి నివసించేందుకు అవకాశమున్న ఏకైక గ్రహం అంగారకుడిపైకి చేరేందుకు మూన్‌బేస్ ఆధారం కానుంది. జాబిల్లిపై దొరికే వనరులను సద్వినియోగం చేసుకునేందుకు, తద్వారా ఎప్పటికైనా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలన్నది సంకల్పం. ఇందుకు కావాల్సిన టెక్నాలజీలను పరిశీలించేందుకు మూన్‌బేస్ కీలకం కానుంది. ఎండ కన్ను పడని చోట... మూన్బేస్ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు చేయాలని నాసా నిర్ణయించింది. సూర్యుడి వెలుతురు ఏమాత్రం సోకని ఈ ప్రాంతంలో నీటితోపాటు ఆవాసానికి తగిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయని అంచనా. ఇస్రో 2009లో జరిపిన చంద్రయాన్–1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికి నిర్ధారణ కాగా.. 2019 నాటి చంద్రయాన్–2 ద్వారా అక్కడి ఖనిజాలు, నీటి అణువుల గుర్తింపు కొనసాగుతోంది. చంద్రయాన్–2లోని అత్యాధునిక కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు మనకు ఆ ప్రాంతపు అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టెమిస్–3తో షురూ... 2027లో ప్రారంభమయ్యే ఆర్టెమిస్–3 ద్వారా వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్నారు. ల్యాండర్ వ్యవస్థల పరిశీలనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తర్వాత 2028–2030 మధ్య మానవ ఆవాసానికి సంబంధించిన మాడ్యూల్స్, విద్యుత్తు సరఫరాకు కావాల్సిన పవర్ గ్రిడ్‌ను ఒక్కొక్కటిగా చంద్రునిపైకి చేరుస్తారు. అవసరాల మేరకు వ్యోమగాములు, సరుకులు రవాణా అవుతూంటాయి.ఆవాస ప్రాంతాల మాడ్యూల్స్ బెలూన్ల మాదిరిగా విచ్చుకునేవిగా ఉంటాయి. వీటితోపాటు అక్కడి రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం ప్రత్యేక బంకర్లు, ఆహారం పండించుకునేందుకు గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తారు. నాలుగు కిలోమీటర్ల గొయ్యిలో... జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని షాకిల్టన్ క్రేటర్ వద్ద మూన్ బేస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 21 కిలోమీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల లోతు ఉండే భారీ లోయ ఈ షాకిల్టన్ క్రేటర్. అందువల్ల గొయ్యి అంచుల్లో 24 గంటలూ సూర్యరశ్మి సోకుతూ ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి వెలుతురూ ఉండదు. ఈ సహజ నిర్మాణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నాసా క్రేటర్ అంచుల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోబోటిక్ రోవర్లు కలిగిన పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి సౌరశక్తిని వినియోగించుకుంటారు. 2032 నాటికి సిద్ధం? ప్రాథమిక అంచనాల ప్రకారం మూన్‌బేస్ నిర్మాణం 2032 నాటికల్లా పూర్తి కావాలి. 2030 నాటికల్లా వ్యోమగాముల ప్రయాణాలు మొదలవుతాయని అంచనా. స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనశాలలు, ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేస్తారు. జాబిల్లిపై దొరికే నీరు, మట్టి నుంచి అవసరమైన ఇంధన వనరులు (హీలియం, ఆక్సిజన్ వంటివి) వెలికితీసే ఇన్–సిటు రిసోర్స్ యూటిలైజేషన్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లాలంటే భూమి పై నుంచి రాకెట్ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయినట్లు అంచనాలున్న జాబిల్లిని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా భూ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కొన్ని అంశాలు కలిసి రావాలి. మొదటిది అంతర్జాతీయ సహకారం. రెండోది ఆర్థిక వనరులు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిలోగ్రాము బరువును జాబిల్లిపైకి చేర్చేందుకు భారీస్థాయిలో ఖర్చు అవుతుంది. అలాంటిది టన్నులకు టన్నులు అక్కడికి పంపించాలంటే అవసరమైన నిధులు సేకరించడం ఎలా అన్నది ప్రశ్న. –సాక్షి, నేషనల్ డెస్క్ -
జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
విదేశీ ప్రయాణం అనేది చాలా మందికి ఒక కల. అయితే ఖరీదైన హోటళ్లు, రవాణా, వీసా ఏర్పాట్లు వంటి సమస్యలు చాలా మందిని వెనక్కి లాగుతుంటాయి. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఒక అద్భుతమైన, సరికొత్త జపాన్ పర్యటన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా బ్యాగులు సర్దుకుని విదేశీ పర్యటనను ఆస్వాదించాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.జపాన్ పర్యటన అడ్డంకులకు చెక్విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి ఇకపై ప్లానింగ్ టెన్షన్స్ ఉండవు. హోటల్ బుకింగ్‌లు, విమాన ప్రయాణాలు, భోజనం, స్థానిక రవాణా ఏర్పాట్లన్నీ ముందుగానే పక్కాగా సిద్ధం అవుతాయి. ప్రయాణికులు కేవలం తమ లగేజ్‌తో ప్రయాణాన్ని ప్రారంభించడమే తరువాయి.పర్యటన కాలపరిమితి.. తేదీలుఈ ప్రత్యేక ఐఆర్సీటీసీ పర్యటన మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు అద్భుతంగా కొనసాగుతుంది. ఈ ట్రిప్ సెప్టెంబర్ 6, 2026 న ఢిల్లీ నుండి బయలుదేరి, సెప్టెంబర్ 15, 2026తో ముగుస్తుంది. పూర్తి ప్రయాణం విమాన మార్గంలోనే సౌకర్యవంతంగా సాగుతుంది.సందర్శించాల్సిన ప్రముఖ నగరాలుఈ 10 రోజుల సుదీర్ఘ పర్యటనలో జపాన్‌లోని అత్యంత ప్రసిద్ధ నగరాలను చూడవచ్చు. ప్రయాణికులు టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా వంటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించే అరుదైన అవకాశం దక్కనుంది.ప్రపంచ ప్రసిద్ధ మౌంట్ ఫూజీ సందర్శనజపాన్ అనగానే గుర్తొచ్చే అద్భుతమైన ఆకర్షణ మౌంట్ ఫూజీ. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మౌంట్ ఫూజీని అతి దగ్గరగా వీక్షించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఈ అనుభూతి జీవితంలో మరువలేనిదిగా ఉంటుంది.మొదటిసారి వెళ్లేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్జపాన్ను మొదటిసారి సందర్శిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేని ఒక ప్రయాణ అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ టూర్ ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఒక గైడెడ్ గ్రూప్ టూర్ కాబట్టి ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్లు, హోటల్ చెక్-ఇన్ల గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు.ప్యాకేజీ ధరల వివరాలుఐఆర్సీటీసీ ప్రకటించిన వివరాల ప్రకారం ట్విన్ లేదా డబుల్ షేరింగ్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ టీసీఎస్‌తో కలిపి రూ. 3,49,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సింగిల్ ఆక్యుపెన్సీ కోసం రూ. 4,73,999, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ. 3,45,999గా ఛార్జీలను నిర్ణయించారు.పిల్లల కోసం ప్రత్యేక రాయితీలుకుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి కూడా ఈ ప్యాకేజీలో తగిన వెసులుబాట్లు కల్పించారు. 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బెడ్‌తో కూడిన ప్యాకేజీ ధర రూ. 2,92,499 కాగా, బెడ్ అవసరం లేని పిల్లలకు రూ. 2,63,999 చొప్పున ఖర్చవుతుంది.ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ! -
అవా ఒడోరి... డాన్స్ హుషారే!
జపాన్‌లో షికోకు దీవిలోని తోకుషిమా నగరంలో సందడి మొదలైంది. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ‘అవా ఒడోరి’ సంప్రదాయ నృత్యోత్సవ సంరంభానికి సిద్ధమైంది. ఏటా ఆగస్టు 12 నుంచి 15 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించడానికి పదిలక్షల మంది సందర్శకులు తరలి వస్తారని అంచనా. ఈ వేడుకల్లో వేలాదిమంది సంప్రదాయ నర్తకులు పాల్గొంటున్నారు.మామూలు రోజుల్లో ప్రశాంతంగా ఉండే తోకుషిమా నగరం ఈ నాలుగు రోజులు మాత్రం రంగుల ప్రపంచంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులను మూసివేసి డాన్స్ షోల కోసం ప్రత్యేకమైన స్టేజ్‌లు, సందర్శకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నది ఒడ్డున వెలిసే సంప్రదాయ స్ట్రీట్ ఫుడ్ షాపులు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈ ఉత్సవ వైభవం బ్రెజిల్‌లోని రియో కార్నివాల్‌ను తలపిస్తుంది.వందల ఏళ్ల చరిత్ర..ఈ నృత్యోత్సవం ఆవిర్భావం వెనుక మూడు ప్రత్యేకమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది బోన్ ఒడోరి. జపాన్‌లో ఏటా వేసవిలో పితృదేవతల జ్ఞాపకార్థం జరుపుకునే ఒబోన్ పండుగలో చేసే బోన్– ఒడోరి నృత్యం నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని ఒక నమ్మకం. రెండోది ఒక కోట నిర్మాణం. క్రీ.శ. 1587లో హాచిసుకా ఇయెమాసా అనే రాజు తోకుషిమా కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు విందు ఇచ్చాడు. ఆ ఆనందంలో సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ప్రజలంతా మైమరిచి చేసిన బృంద నర్తనమే కాలక్రమేణా ‘అవా ఒడోరి’గా మారిందంటారు. మూడోది జాపనీస్ నోహ్ నాటకాలకు మూలమైన ఫుర్యూ నృత్యం నుంచి ఈ పండుగ వచ్చిందనేది మరో కథనం. అందరూ ఆహ్వానితులే!ఈ అవా ఒడోరి వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో నృత్యకారులు ‘రెన్’, ‘నివాకా రెన్’ అని పిలిచే బృందాలుగా ఏర్పడతారు. సాధారణ ప్రజలు, పర్యాటకుల కోసం నివాకా రెన్ అనే వేదికను ఏర్పాటు చేస్తారు. వీరు ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. డాన్స్ ప్రారంభించే ముందు ప్రసిద్ధ కళాకారుల నుంచి ఉచితంగా స్టెప్పులు నేర్చుకుని వేడుకల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన రహదారులను మూసివేసి డాన్సులు చేస్తుంటారు. అంతేకాదు, ఆగస్టు నెలలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనలేని పర్యాటకుల కోసం నగర కేంద్రంలోని ‘అవా ఒడోరి కైకాన్’ భవనంలో ఏడాది పొడవునా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. పగటిపూట ప్రత్యేక షోలతో పాటు, ప్రతిరోజూ రాత్రి ప్రసిద్ధ డాన్స్ గ్రూపులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తాయి. సందర్శకులకు డాన్స్ నేర్పి, వారితో కలిసి స్టెప్పులు వేయిస్తారు.విభిన్న నృత్య శైలులు ఈ అవా ఒడోరిలో మహిళలు, పురుషుల డాన్స్స్టైల్ వేరువేరుగా ఉంటుంది. మహిళలు ఎంతో సొగసుగా, కాలివేళ్లపై నిల్చుని నాట్యం చేస్తారు. ఇందుకోసం నల్లటి సంప్రదాయ చెక్క చెప్పులను ధరిస్తారు. వీటి నుంచి వచ్చే క్లిక్–క్లాక్ శబ్దాలు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై విసనకర్ర ఆకారంలో ఉండే ‘అమిగాసా’ అనే గడ్డితో చేసిన టోపీలను ధరిస్తారు. ఇక పురుషులు ‘హప్పి’ అనే వదులైన సంప్రదాయ దుస్తులు ధరించి చాలా ఫాస్ట్‌గా కదులుతూ డాన్స్‌లు చేస్తుంటారు. పేపర్ లాంతర్లను గాల్లో వేగంగా తిప్పుతూ వెలుగులతో విన్యాసాలు చేస్తారు. ఈ వేడుకలు జరిగే నాలుగు రోజుల పాటు షామిసేన్ అనే మూడు తీగల వాయిద్యం, యోకోబుయె అనే వెదురు పిల్లన గ్రోవి, కానే (గంట), తైకో (పెద్ద డ్రమ్స్) వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇదే సమయంలో పర్యాటకులు సైతం సంప్రదాయ పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటారు.∙ రమా జంబుల -
అణుదాడిని మరిస్తే శాంతి నెలకొనదు!
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.దుఃఖం నుంచి పోరాటానికి...హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్‌ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్‌గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.ఆయుధం వర్సెస్ ఆహారంయునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్‌ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.ఒప్పందాలతోనే శాంతిభద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.విలియమ్ ల్యాంబర్స్వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘జపాన్ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక!
ప్యోంగ్యాంగ్: జపాన్‌లో సైనిక బలగాల పెంపు, అమెరికాకు చెందిన టామాహాక్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. జపాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అదనపు సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.ఇటీవల జపాన్ విడుదల చేసిన రక్షణ శ్వేతపత్రం (డిఫెన్స్ వైట్ పేపర్)లో చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ప్రధాన భద్రతా ముప్పులుగా పేర్కొనడం ఉద్రిక్తతలకు దారితీసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏజిస్ డిస్ట్రాయర్ 'చోకాయ్' నుంచి జపాన్ ఇటీవల నిర్వహించిన టామాహాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను కిమ్ యో జోంగ్ తీవ్రంగా ఖండించారు. జపాన్ తన రక్షణ వైఖరిని విడనాడి, ముందస్తు దాడులకు పాల్పడేలా, విదేశీ సైనిక చర్యలు చేపట్టేలా తన బలగాలను మలుచుకుంటోందని ఆమె ఆరోపించారు.జపాన్ సైనిక విస్తరణ వెనుక అమెరికా పాత్ర ఉందని, అమెరికా సహకారంతోనే టోక్యో ఈ ప్రమాదకర చర్యలకు పాల్పడుతోందని కేసీఎన్ఏ వార్తా సంస్థ ద్వారా ఆమె వెల్లడించారు. జపాన్ దగ్గరున్న దీర్ఘకాలిక స్ట్రైక్ సామర్థ్యాలు ఉత్తర కొరియా సహా పొరుగు దేశాలను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ భద్రత ప్రమాదంలో పడేలా, ఆ దేశం పశ్చాత్తాపపడేలా తాము తగిన సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ట్రంప్ షాక్: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు -
దోమలు, నల్లులు.. హైదరాబాద్ ఐఐటీలో చేదు అనుభవం!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌లో చేరిన ఓ జపాన్ విద్యార్థిని అనుభవాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.ఐఐటీ హైదరాబాద్‌లో తాను తొలి జపాన్ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్‌లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్‌లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్‌లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.తన హాస్టల్ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.హిరో వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. హాస్టల్ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.ఐఐటీ హైదరాబాద్ స్వాగతానికి ఫిదా అయిన జపాన్ విద్యార్థిని.. హాస్టల్లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. -
భూకంపాల దేశంలో ఆర్థిక భూకంపం.. జపాన్ చేతులెత్తేసిందా?
ఒకప్పుడు ఆర్థికవేత్తలు సరదాగా అనేవారు.. ‘‘ప్రపంచంలో నాలుగు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని. అవేంటంటే: డెవలప్డ్ అంటే.. అభివృద్ధి చెందినది. అన్డెవలప్డ్ అంటే.. అభివృద్ధి చెందనిది. అర్జెంటీనా.. జపాన్!’’ అని చెప్పేవారు. ఇందులో జపాన్ సంగతే చాలా విచిత్రం.. ! గత మూడు దశాబ్దాలుగా ఎకనామిక్ గ్రావిటీ ఏమాత్రం పనిచేయకుండా, లెక్కలేనంత డబ్బును ప్రింట్ చేస్తూ, విపరీతంగా అప్పులు చేస్తూ వచ్చినా.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగలేదు. బాండ్ మార్కెట్ల నుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..! జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో, ఇన్నాళ్లుగా దాగి ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన జపాన్‌లో, రుణాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాదు, జపాన్ కరెన్సీ 'యెన్' (Yen) విలువ ఏకంగా 40 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది..! అసలు జపాన్ ఎకానమీకి ఏమైంది? అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఇవాళ్టి పాడ్‌కాస్ట్‌లో డిటైల్‌గా చర్చిద్దాం..!ఫ్లాష్‌బ్యాక్ ఏంటి?అసలు జపాన్ ఈ పరిస్థితికి ఎలా చేరుకుందో తెలియాలంటే.. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లాల్సిందే..! 1990లలో వరుస ఆర్థిక షాక్‌ల వల్ల జపాన్ కుదేలైంది..! ప్రాపర్టీ ధరలు, స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. దాంతో వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం సున్నాకి పడిపోయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. అంటే.. Stagnation స్థితికి జపాన్ చేరుకుంది. దీని నుంచి బయటపడటానికి జపాన్ సెంట్రల్ బ్యాంక్.. Bank of Japan రంగంలోకి దిగింది. వేల కోట్ల యెన్ విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే.. నోట్లు ప్రింట్ చేసి, ప్రభుత్వానికి ఇచ్చి ఖర్చు చేయమని ఆదేశించింది. సాధారణంగా ఇలా చేస్తే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగాలి; జపాన్ కోరుకున్నది కూడా అదే..! కానీ, అలా జరగలేదు. ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు రెండూ మొండిగా సున్నా దగ్గరే ఉండిపోయాయి. మరోవైపు ప్రభుత్వ రుణం మాత్రం దేశ జీడీపీలో 200 శాతానికి పైగా పెరిగిపోయింది..! కానీ, 2022 ప్రారంభంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ద్రవ్యోల్బణం.. జపాన్ను కూడా అట్టుడికించింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత జపాన్ ఇన్ఫ్లేషన్ రేటు 2 శాతాన్ని దాటింది. దీన్ని సానుకూలంగా మార్చుకోవాలని జపాన్ భావించింది. Wage-Price Spiral ద్వారా పరిస్థితి చక్కబడుతుందని ఆశించింది. అంటే, ధరలు పెరిగితే కార్మికులు ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తారు. జనాల దగ్గర డబ్బు బాగా చేరితే.. దాన్ని ఖర్చు చేస్తారు. తద్వారా ఇన్ఫ్లేషన్ 2 శాతం టార్గెట్‌కి చేరుకుంటుందని అనుకున్నారు. కానీ, ఇక్కడే అసలు దెబ్బ తగిలింది..! ఇన్ఫ్లేషన్ ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగిపోయింది. గత 4 సంవత్సరాలుగా టార్గెట్ 2 శాతానికి మించే ఉంది. దీనికి తోడు కార్మికుల వేతనాలు 5 శాతం దాకా పెరగడం, ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు జపాన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.'యెన్' విలువ పతనం ఇలా.. ఇలా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్లే జపాన్ కరెన్సీ 'యెన్' విలువ పడిపోతూ వచ్చింది. 2022 నుంచి పడుతూ వస్తున్న యెన్ విలువ, గత వారం డాలర్‌తో పోలిస్తే ఏకంగా 163కి పడిపోయి 40 ఏళ్ల కనిష్టాన్ని తాకింది..! దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇన్ఫ్లేషన్ను అణచివేయడానికి వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. కానీ, జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం 2024 మార్చి దాకా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది..! అదే సమయంలో ఐరోపాలో వడ్డీ రేట్లు 4.5 శాతం, అమెరికాలో 5.5 శాతంగా ఉన్నాయి..! ఈ వడ్డీ రేట్ల వ్యత్యాసం వల్ల జపాన్ ప్రజలు యెన్ను దాచుకోవడం కంటే, డాలర్లు లేదా యూరోలలో సేవ్ చేసుకోవడమే బెటర్ అనుకున్నారు. దీంతో యెన్ మీద మరింత భారం పడింది. జపాన్ ప్రభుత్వం తన కరెన్సీని కాపాడుకోవడానికి ఏకంగా 73 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మార్కెట్లో జోక్యం చేసుకున్నా.. ఫలితం లేకపోయింది. ఇన్వెస్టర్లకు జపాన్ సెంట్రల్ బ్యాంకు మీద నమ్మకం సడలిపోయింది.ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది..! 'మరి అందరిలాగా జపాన్ కూడా వడ్డీ రేట్లు పెంచొచ్చు కదా?' అని. సమస్య ఇక్కడే ఉంది..! జపాన్ మీద ఉన్న విపరీతమైన అప్పుల భారమే దీనికి ప్రధాన అడ్డుగోడ. వడ్డీ రేట్లు పెంచితే ప్రభుత్వ బాండ్ Yields కూడా పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం తన అప్పులపై భారీగా వడ్డీ చెల్లించడం అసాధ్యం అయిపోతుంది. మరోవైపు, బాండ్ల మీద వడ్డీని కృత్రిమంగా అణచిపెడదామంటే, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇప్పుడు జపాన్ సెంట్రల్‌బ్యాంక్ ముందు రెండు ప్రమాదకరమైన దారులున్నాయిఒకటి: కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కోవడం.రెండోది: బాండ్ సంక్షోభాన్ని (Bond Crisis) ఎదుర్కోవడం.ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, రెండూ పతనం అంచున ఉన్నాయి. అయితే, జపాన్ ప్రస్తుతానికి పూర్తిగా మునిగిపోదనేందుకు ఒక కారణం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జపాన్ ప్రభుత్వం విదేశాల్లో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ఆస్తులను కూడబెట్టింది. అత్యవసరమైతే వాటిని అమ్మి అప్పులు తీర్చగలదు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతుంది.-హెచ్. కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!
జపాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి హికిరు కురిబయాషి (Hikaru Kuribayashi) అరుదైన ఘనతను సాధించాడు. ఇంజనీరింగ్, విపత్తు సహాయం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉన్న ఒరిగామి-ప్రేరిత సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సైన్స్ పోటీలలో ఒకటైన రిజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ISEF) 2026లో టాప్‌లో నిలిచి వార్తల్లో నిలిచారు. ఒరిగామి (కాగితపు మడతల కళ) ఆధారంగా అతను తయారు చేసిన కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌కు గాను రూ. 96 లక్షలకు పైగా (లక్ష డాలర్ల) నగదు బహుమతి లభించింది.సైన్స్ విభాగంలో ప్రసిద్ధి చెందిన 'జార్జ్ డి. యాంకోపోలస్ ఇన్నోవేటర్ అవార్డు' (George D. Yancopoulos Innovator Award)ను కురిబయాషి గెలుచుకున్నారు. 2025లో కురిబయాషి ఒరిగామి విజ్ఞానశాస్త్రంపై తనకున్న అభిరుచిని మేళవించి, సంక్లిష్టమైన మడతల ఫలితాలను అంచనా వేయగల ఒక సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌ను సృష్టించాడు. పైథాన్‌ను పోలిన జూలియా అనే ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి సుమారు ఆరు నెలలు పట్టింది. ఈ కృషి ఫలించి, అతని ప్రాజెక్ట్ అత్యుత్తమమైందిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,700 మందికి పైగా ఇతర ఉన్నత పాఠశాల విద్యార్థులను ఓడించి మరీ ఈ టాప్ బహుమతిని గెలుచుకుంది.ఈ పోటీలో గెలుపు తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని కురిబయాషి అన్నారు. ఎనిమిదో తరగతిలో ISEF గురించి విన్నప్పటినుంచీ అందులో పాల్గొనాలని కలలు కన్నాను, కానీ అత్యుత్తమ బహుమతి గెలుచుకోవడం, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ సంతోషాన్ని ప్రకటించారు. View this post on Instagram A post shared by Society for Science (@society4science) చిన్నతనంలో తన నాయనమ్మ నేర్పించిన ఒరిగామి కళ, అలాగే హోక్కాయిడో అడవుల్లోని లేడీబగ్స్ (కీటకాలు) రెక్కలు, ఆకులు మడతపడే సహజమైన తీరును పరిశీలించడం ద్వారా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది .ప్రకృతిపై ఒరిగామి ప్రభావం కేవలం కళాత్మక స్ఫూర్తికి మించి ఉంటుందని కురిబయాషి విశ్వాసం. ఇదీ చదవండి: 'మిషన్ మంగళ్’నటికి చేదు అనుభవం : లక్షలు కొట్టేసిన కేటుగాళ్లుసిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలుప్రఖ్యాతి చెందిన 'జూలియా' (Julia) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ 'మార్కోవ్ చైన్ మోంటే కార్లో' అల్గారిథమ్ సహాయంతో సంక్లిష్టమైన మడతల ఫలితాలను ముందే అంచనా వేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. అంతేకాదు కోడింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో తప్పులు దొర్లే అవకాశం ఉండటంతో, సొంతంగానే కోడింగ్ అండ్ డీబగ్గింగ్ పూర్తి చేశారు. టోక్యో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల మార్గ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం.ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఉపయోగపడే రంగాలుఉపగ్రహాలలో (Satellites) ఉపయోగించే సోలార్ ప్యానెళ్లను చిన్న స్థలంలో మడతపెట్టి, అంతరిక్షంలోకి వెళ్లాక విస్తరించేలా డిజైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే జపాన్‌లో భూకంపాలు, సునామీలు ఎక్కువగా వస్తుంటాయి. తక్కువ స్థలంలో సులభంగా రవాణా చేసి, అత్యవసర సమయాల్లో వేగంగా పెద్దవిగా నిర్మించగలిగే షెల్టర్ల (ఆశ్రయాల) తయారీకి ఈ సాంకేతికత ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
వణికించిన భూకంపం.. జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ
-
పదేళ్ల తర్వాత తెరిచారు.. నెలకే నేలమట్టం!
గతాన్ని మరిచి కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పునఃప్రారంభమైన నెల రోజులకే మరోసారి ప్రకృతి దెబ్బకు విలవిలలాడింది. భూకంపం ధాటికి శిథిలాలుగా మారిన జపాన్‌లోని కుమమోటో ఏయాన్ షాపింగ్ మాల్ విషాదం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.దాదాపు పదేళ్ల కిందట భూకంపాన్ని తట్టుకుని తిరిగి నిలబడిన ఈ మాల్.. తాజాగా సంభవించిన భారీ ప్రకంపనలకు మరోసారి తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కుమమోటో ప్రాంతాన్ని వణికించిన 7.1 తీవ్రత గల భూకంపం ధాటికి 13 మంది మృతి చెందారు. అదే ఏరియాలో ఏయాన్ మాల్లోని రెండో అంతస్తు కుప్పకూలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పేలుడు పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా.. ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.తొలి దెబ్బ 2016లో.. మళ్లీ ఇప్పుడుకుమమోటో ప్రాంతానికి భూకంపాలు కొత్తేమీ కాదు. 2016లో వచ్చిన భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ప్రకంపనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఏయాన్ కుమమోటో షాపింగ్ మాల్ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత మాల్‌ను మూసివేసి భారీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో బలోపేతం చేశారు. చివరకు 2026 జూన్ 13న కొత్త రూపంలో తిరిగి ప్రారంభించారు.దాదాపు 200 దుకాణాలు, సినిమా థియేటర్, ఫుడ్ కోర్ట్, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయాలతో ఈ మాల్ కుమమోటో ప్రజలకు ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల తర్వాత తిరిగి తెరుచుకోవడం స్థానికుల్లో కొత్త ఆశలు నింపింది.కొత్త ఆరంభం.. నెలకే విషాదంఅయితే ఆ ఆనందం నెల రోజులు కూడా నిలవలేదు. భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ప్రకంపనలు మొదలైన వెంటనే మాల్లో ఉన్న ప్రజలను బయటకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్దిసేపటికే సంభవించిన పేలుడు మరింత భయాందోళనకు గురిచేసింది. పేలుడుకు గ్యాస్ లీక్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం భాగాలు కూలిపోవడంతో పలువురు లోపల చిక్కుకున్నారు. శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.Footage showing an explosion at Aeon Mall Kumamoto following the magnitude 7.1 earthquake that hit southern Japan. pic.twitter.com/1K0bW6Z1cZ— HadashotIsrael (@HadashotIsrael) July 29, 2026‘సమయంతో పోరాటం’.. కొనసాగుతున్న గాలింపుభూకంపం తర్వాత జపాన్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జపాన్ రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు వేలాది మంది సిబ్బందిని సహాయక చర్యలకు మోహరించారు. జపాన్ ప్రధాని సనే తకైచి మాట్లాడుతూ.. ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారని తెలిపారు. "ఇది సమయంతో పోరాటం. ఒక్కో ప్రాణాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సహాయక శిబిరాలకు తరలిపోయారు. ఎండ తీవ్రత కూడా పెరగడంతో బాధితులకు ఆహారం, నీరు, ఎయిర్ కండిషనింగ్, విద్యుత్ జనరేటర్లను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రవాణా వ్యవస్థపై ప్రభావంభూకంప ప్రభావంతో కుమమోటో సహా పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. క్యుషు ప్రాంతంలో బుల్లెట్ రైళ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి. అయితే జపాన్ అధికారులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు.భారత్ సంఘీభావంజపాన్లో సంభవించిన భారీ భూకంపంపై భారత్ కూడా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జపాన్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల భద్రత, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. "జపాన్‌లో సంభవించిన భూకంప వార్తతో తీవ్ర ఆందోళన చెందాను. జపాన్ ప్రభుత్వం, ప్రజలకు మా సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.మాల్ మాత్రమే కాదు.. ఏయాన్ కుమమోటో మాల్ కేవలం ఓ షాపింగ్ సెంటర్ కాదు. 2016 భూకంపం తర్వాత కుమమోటో ప్రజలు తిరిగి కోలుకుంటున్నారనే సంకేతంగా అది నిలిచింది. పదేళ్ల తర్వాత పునఃప్రారంభం కావడం స్థానికులకు ఓ భావోద్వేగ క్షణంగా మారింది. కానీ అదే మాల్ నెల రోజులకే మరోసారి శిథిలాలుగా మారడం ఇప్పుడు విషాదాన్ని మిగిల్చింది. ఒకసారి ప్రకృతి దెబ్బ నుంచి కోలుకున్న నిర్మాణం.. మరోసారి అదే ప్రకృతి శక్తి ముందు నిలబడలేకపోయింది. -
జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హై అలర్ట్..!
-
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం కారణంగా 1 మీటర్ల (3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. నాగసాకికి 80 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. జపాన్‌లోని దక్షిణ క్యుషు (Kyushu) ద్వీపంలో ఉన్న కుమమోటో, నగాసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియజాకి ప్రిఫెక్చర్లకు హెచ్చరికలను జారీ చేసింది.గత నెల(జూన్)లో కూడా జపాన్‌లో భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈశాన్య జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసింది. -
20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు! కారణం తెలిస్తే కంగుతింటారు
ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకోసం సదరు టెలివిజన్ షోన్ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు. కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది. ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు. జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!) -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్‌కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్‌మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్‌లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్‌తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్‌లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్‌తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
వైభవంగా గియాన్ మత్సూరీ సంబరాలు..
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.దైవదూతగా స్థానిక బాలుడు!క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.ఆకట్టుకునే భారీ రథాలుఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్ పార్టీలు!జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.- రమా జంబుల -
దెయ్యాలతో ‘ఒక్క రాత్రి’ గడిపితే చాలూ!
ఒక ఇల్లు... బయటికి చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆ గడప దాటిన క్షణం నుంచి కథ మారిపోతుంది. ఆ ఇంటి గురించి ఊరంతా ఒకటే మాట. "అక్కడ ఏదో ఉంది... రాత్రిళ్లు వింత శబ్దాలు వినిపిస్తాయి... ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది..." ఇలాంటి మాటలు వింటే చాలామంది ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్లడానికి భయపడతారు. కానీ కొందరు మాత్రం అదే ఇంట్లో ఒంటరిగా రాత్రంతా గడపడానికి సిద్ధమవుతున్నారు. అదీ సరదా కోసం కాదు... ఉద్యోగం కోసం!ఈ పని చేయాలంటే ముందు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాలి. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు అక్కడే ఉండాలి. మధ్యలో బయటకు రావడం ఉండదు. ప్రతి గదిలో తిరగాలి. ప్రతి మూలను గమనించాలి. రాత్రి వేళ వినిపించే శబ్దాలు, తలుపులు కదిలాయా? వస్తువులు స్థానాలు మారాయా? అనుమానాస్పద ఘటనలేమైనా జరిగాయా? అనే ప్రతిదాన్ని నమోదు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలు, ఆడియో రికార్డర్లు, ఇతర పర్యవేక్షణ పరికరాలను కూడా అమర్చుతారు. తెల్లవారేసరికి జరిగిన ప్రతిదానిపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తారు.రాత్రంతా ఎలాంటి అసాధారణ ఘటనలు నమోదు కాకపోతే... ఆ ఇంట్లో అతీంద్రియ కార్యకలాపాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ తర్వాతే ఆ ఇంటిని కొనాలనుకునేవారు, అద్దెకు తీసుకోవాలనుకునేవారిలో ఉన్న మానసిక భయం కొంతవరకు తగ్గుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంటే ఈ ఉద్యోగం కేవలం భూతాల కోసం కాదు... భయాన్ని తొలగించేందుకు చేసే పరీక్ష అన్నమాట!.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... కొన్ని సంస్థలు తమ ధ్రువీకరణపై అంత నమ్మకంతో ఉంటున్నాయి. ఒకసారి తాము "సురక్షితం" అని ప్రకటించిన ఇంట్లో తర్వాత నిజంగానే ఏదైనా అతీంద్రియ ఘటన జరిగినట్లు నిరూపితమైతే పరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాయి. అందుకే ఈ ఉద్యోగంలో ధైర్యంతో పాటు ఓపిక, పరిశీలనా నైపుణ్యం కూడా అవసరమని చెబుతున్నారు.ఇంత సస్పెన్స్ ఉన్న ఈ ఉద్యోగం ఎక్కడ ఉందో తెలుసా? జపాన్‌లో. అక్కడ ఒక రాత్రి ఇలాంటి ఇంట్లో గడిపినందుకు 88 వేల యెన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.52 వేల) వరకు పారితోషికం చెల్లిస్తున్నారు. ఈ వినూత్న ఉద్యోగాన్ని చాలామంది ఇప్పుడు 'ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్', 'హాంటెడ్ హౌస్ సిట్టర్' పేర్లతో పిలుస్తున్నారు.వామ్మో జికో బుక్కెన్!జపాన్‌లో ఇలాంటి ఇళ్లను 'జికో బుక్కెన్' (Jiko Bukken) అని పిలుస్తారు. అంటే గతంలో హత్య, ఆత్మహత్య, అగ్నిప్రమాదం లేదా వృద్ధులు ఒంటరిగా మరణించి చాలా రోజుల తర్వాత గుర్తించిన ఘటనలు జరిగిన ఇళ్లు. అక్కడి చట్టాల ప్రకారం అలాంటి చరిత్రను కొనుగోలుదారులు, అద్దెదారులకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. దీంతో తక్కువ ధరకు దొరికినా చాలామంది ఇలాంటి ఇళ్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా వేలాది ఇళ్లు సంవత్సరాల తరబడి ఖాళీగా మిగిలిపోతున్నాయి.భయాన్ని వ్యాపారంగా మార్చి..ఈ సమస్యకు పరిష్కారంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాయి. ముందుగా ధైర్యవంతులైన వ్యక్తులను పంపించి ఇంట్లో రాత్రంతా ఉండేలా చేస్తారు. ఎలాంటి అసాధారణ ఘటనలు లేవని ధ్రువీకరణ లభించిన తర్వాత ఆ ఇంటిపై కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తారు. దీంతో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇళ్లకు మళ్లీ డిమాండ్ వస్తుందని యజమానులు ఆశిస్తున్నారు.మారుతున్న యువత ఆలోచనఒకప్పుడు ఇలాంటి ఇళ్లు అంటే పూర్తిగా దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో "తక్కువ ధరకు మంచి ఇల్లు దొరికితే గతం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు" అనే భావన యువతలో పెరుగుతోంది. అందుకే గతంలో అపశకునంగా భావించిన ఇళ్లు ఇప్పుడు చౌకైన గృహాలుగా కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.మొత్తానికి... ఇది దెయ్యాల కథ కాదు... భయాన్ని అవకాశంగా మార్చుకున్న ఓ వినూత్న వ్యాపార ఆలోచన. ఒక రాత్రి ధైర్యంగా గడిపితే రూ.52 వేల సంపాదన... అదే సమయంలో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఓ ఇంటికి కొత్త జీవితం. అందుకే ఈ వింత ఉద్యోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. -
జపాన్ రాజవంశ చట్ట సవరణ
టోక్యో: పురుషులు మాత్రమే చక్రవర్తి కాగలరని నిర్దేశిస్తూ, 19వ శతాబ్దపు రాజవంశ చట్టానికి జపాన్ పార్లమెంట్ శుక్రవారం చారిత్రాత్మక సవరణను ఆమోదించింది. భవిష్యత్ వారసుల కోసం దూరపు మగ బంధువులను దత్తత తీసుకోవడం, అలాగే యువరాణులు సామాన్యులను వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ రాజ హోదాను నిలుపుకోవడానికి అనుమతించడం వంటివి ఈ సవరణలలో ఉన్నాయి. ఇది ఇప్పటికే కుంచించుకుపోతున్న రాజకుటుంబాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందనే భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలు మహిళలపై వివక్షను, పితృస్వామ్య వ్యవస్థను సమర్థించడానికేనని పలువురు విమర్శిస్తున్నారు. పురుష వారసత్వంపై ఉన్న వ్యామోహానికి ప్రధాన ప్రతిపాదకురాలిగా మొదటి మహిళా ప్రధానమంత్రి ఉండటం చాలా విడ్డూరమని ప్రముఖ స్త్రీవాద పండితురాలు చిజుకో ఉనో ఇటీవల తకైచిని ఉద్దేశించి రాశారు. పురుష రాజవంశీకులను అశ్వాలుగా, మహిళా రాజవంశీకులు మగ సంతానాన్ని కనే యంత్రాలుగా పరిగణిస్తూ ఒత్తిడికి గురిచేస్తాయని ఉనో అన్నారు. -
అదృశ్య బంగారం.. దొరికితే అదృష్టమే!
జపాన్‌కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.ఎక్కడ లభించింది?ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.రికార్డు స్థాయి సాంద్రతసైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.తవ్వకాలు సాధ్యమేనా?ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్‌కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పర్యావరణంపై ఆందోళనలుహైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. -
ఈ రైలు ఎక్కాలంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
జపాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది బుల్లెట్ రైళ్లు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకాన్సెన్ రైళ్లు అక్కడి రవాణా వ్యవస్థకు ప్రతీకగా నిలిచాయి. అయితే అదే జపాన్‌లో వేగానికి పూర్తిగా భిన్నమైన తత్వంతో నడిచే ఓ విలాసవంతమైన రైలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ (Seven Stars in Kyushu). గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం కాదు.. ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే ఈ రైలు ప్రత్యేకత.2013 అక్టోబర్ 15న జేఆర్ క్యుషు (JR Kyushu) ప్రారంభించిన ఈ లగ్జరీ స్లీపర్ రైలు జపాన్‌లో తొలి క్రూయిజ్-శైలి విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. 2022లో దీన్ని మరింత ఆధునికంగా పునర్నిర్మించి టీ రూమ్, బార్ లౌంజ్, సలోన్ వంటి కొత్త సౌకర్యాలను జోడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.క్యుషు అందాలను ఆస్వాదించే ప్రత్యేక యాత్రఈ రైలు ఫుకువోకాలోని హకాటా స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుతుంది. సీజన్‌ను బట్టి రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.2 రోజులు – 1 రాత్రి: ఉత్తర క్యుషు ప్రాంతంలోని ప్రకృతి, స్థానిక వంటకాలు, గ్రామీణ సంస్కృతిని పరిచయం చేస్తుంది.4 రోజులు – 3 రాత్రులు: ఫుకువోకా, ఓయిటా, మియాజాకి, కగోషిమా, కుమామోటో, నాగసాకి తదితర ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ అగ్నిపర్వతాలు, సముద్రతీరాలు, హాట్ స్ప్రింగ్స్, చారిత్రక పట్టణాలు, కళాకారుల గ్రామాలను చూపిస్తుంది. ప్రతి సీజన్‌కు అనుగుణంగా మార్గంలో స్వల్ప మార్పులు చేస్తారు.రూ.17 లక్షల వరకు టికెట్!ఈ రైలులో ప్రయాణం చాలా ఖరీదైన వ్యవహారమే. సామాన్యులు ఇందులో ప్రయాణించలేరు. 2 రోజుల ప్యాకేజీకి ఒక్కొక్కరికి సుమారు 7 లక్షల నుంచి 16 లక్షల యెన్ల వరకు (దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు) ఖర్చవుతుంది. అదే 4 రోజుల ప్యాకేజీ ఛార్జీ 13.5 లక్షల నుంచి 28.5 లక్షల యెన్ల వరకు (సుమారు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు) ఉంటుంది.ఈ టికెట్లోనే లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, పానీయాలు, స్థానిక విహారయాత్రలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సీజన్, క్యాబిన్ రకం ఆధారంగా ధరలు మారుతుంటాయి.కళ్లు చెదిరే ప్రత్యేకతలుఈ రైలులో ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితం. కొద్దిమందికే అవకాశం ఉండటంతో ప్రతి అతిథికి వ్యక్తిగత సేవలు అందిస్తారు. ప్రముఖ డిజైనర్ ‘ఈజీ మిటూకా’ రూపొందించిన ఇంటీరియర్స్‌లో సంప్రదాయ జపనీస్ చెక్క కళ, చేతితో తయారు చేసిన ఫర్నిచర్, ఆధునిక సౌకర్యాల సమ్మేళనం కనిపిస్తుంది. పెద్ద గాజు కిటికీల ద్వారా పర్వతాలు, సముద్రతీరాలు, అడవులు, గ్రామీణ ప్రాంతాల అందాలను ప్రశాంతంగా వీక్షించేలా రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది.ఫైవ్ స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోని సూట్లుప్రతి సూట్లో విశాలమైన కిటికీలు, ప్రైవేట్ బాత్రూమ్, లాంజ్ స్పేస్, విలాసవంతమైన చెక్క అలంకరణలు ఉంటాయి. డీలక్స్ సూట్లలో మరింత విశాలమైన స్థలం, అద్భుతమైన వీక్షణలు, అధిక గోప్యత, ప్రీమియం ఫర్నిషింగ్స్ అందుబాటులో ఉంటాయి.రుచుల పండుగఈ రైలు ప్రయాణంలో భోజనం కూడా ప్రధాన ఆకర్షణే. క్యుషు ప్రాంతానికి చెందిన సీజనల్ సీఫుడ్, స్థానిక మాంసాహార వంటకాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతీయ ప్రత్యేక వంటకాలు, జపనీస్ సాకేతో కూడిన మెనూను ప్రముఖ చెఫ్‌లు సిద్ధం చేస్తారు. ప్రతి సీజన్‌కు అనుగుణంగా మెనూ మారుతుంది.రైలు బయటా ప్రత్యేక అనుభూతులుప్రయాణంలో భాగంగా ప్రయాణికులను చారిత్రక దేవాలయాలు, సంప్రదాయ కుండల తయారీ గ్రామాలు, హాట్ స్ప్రింగ్ రిసార్టులు, కళాకారుల వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలకు తీసుకెళ్తారు. దీంతో క్యుషు ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.టికెట్ దొరకడం అంత ఈజీ కాదుఈ రైలుకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ప్రతి ట్రిప్‌లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణించగలగడం వల్ల సాధారణ రిజర్వేషన్ కాకుండా అనేక సార్లు లాటరీ విధానంలో ప్రయాణికులను ఎంపిక చేస్తారు. అందుకే ఈ రైలులో ప్రయాణించడం ఎంతో అరుదైన అనుభవంగా భావిస్తారు.మొత్తంగా ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ కేవలం ఒక రైలు కాదు.. జపాన్ ప్రకృతి, సంస్కృతి, ఆతిథ్యం, వంటకాల్ని ఒకే ప్రయాణంలో అనుభూతి చెందే విలాసవంతమైన జీవనశైలి. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా, జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రయాణం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ ట్రావెల్ ప్రేమికులు కలలు కంటుండటానికి ఇదే కారణం. View this post on Instagram A post shared by Kara and Nate (@karaandnate) -
అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన రన్వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' జపాన్ మార్కెట్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీకి, జపాన్ ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. భారీ రిలీజ్, పబ్లిసిటీ చేసినప్పటికీ.. మొదటి రోజు థియేటర్లకు కనీసం వెయ్యి మంది కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.తొలి రోజు కేవలం 900 మంది లోపే..!స్థానిక పంపిణీ సంస్థ ‘ట్విన్’ (Twin) ద్వారా జపాన్ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్లలో జూలై 10న ‘ఆపరేషన్ ధురంధర్’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. అయితే జపనీస్ బాక్సాఫీస్ ట్రాకర్ ‘మిమోరిన్’ గణాంకాల ప్రకారం విడుదలైన రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 57 ప్రదేశాలలో కలిపి కేవలం 449 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సాయంత్రానికి థియేటర్ల సంఖ్య 80కి పెరిగినప్పటికీ ఆదరణలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రోజు మొత్తం మీద 900 మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాను వీక్షించారు.భారీ ప్రచారం చేసినా ఫలితం శూన్యంరిలీజ్కు ముందు జపనీస్ ఆడియన్స్‌ను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. రన్వీర్ సింగ్ స్వయంగా ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ‘ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం’ అంటూ ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమాను కేవలం జపనీస్ సబ్‌టైటిల్స్‌తోనే రిలీజ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లేకపోవడం వల్లే జపాన్ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పెద్దగా మొగ్గు చూపలేదని సోషల్ మీడియా టాక్.కాగా, జపాన్‌లో మొదటి రోజు అత్యధిక అడ్మిషన్లు సాధించిన భారతీయ చిత్రంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేసిన ‘RRR’ (8,230 అడ్మిషన్లతో) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద దురంధర్ చెత్త రికార్డ్..!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ దురంధర్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు కలిపి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ స్పై మూవీస్‌కు ఆడయన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే జపాన్‌లో ఇండియన్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లో గతంలో రిలీజైన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. జపాన్‌లో ఇండియన్ చిత్రాల క్రేజ్ దృష్ట్యా తాజాగా దురంధర్ మూవీని సైతం అక్కడ రిలీజ్ చేశారు. దాదాపు 80 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. కానీ తొలి రోజే దురంధర్ మేకర్స్‌కు నిరాశ ఎదురైంది. ఈ స్పై చిత్రాన్ని తొలి రోజు కేవలం 900 మంది మాత్రమే వీక్షించారు.ఈ చిత్రం జూలై 10న జపాన్ థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో ఆ దేశంలోని టాప్ 25 చిత్రాలలో స్థానం సంపాదించలేకపోయిందని స్థానిక ట్రేడ్ నివేదికల్లో వెల్లడైంది. తొలిరోజు కేవలం 900 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవడంతో టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాలో దురంధర్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' 1300 టికెట్స్‌తో చివరి స్థానంలో ఉండగా.. 'పుష్ప 2' గతంలో ఇదే మైలురాయిని చేరుకోలేకపోయింది. జపాన్‌లో రిలీజైన పుష్ప-2 మూవీకి కేవలం 886 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. తాజాగా దురంధర్‌కు 900 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ లభించాయి. గతంలో జపాన్‌లో విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో 'ఆర్ఆర్ఆర్' అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 'సాహో', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్', 'సలార్', 'జవాన్', 'రంగస్థలం', 'దేవర', 'బాహుబలి 2' 'టైగర్ 3' సినిమాలు ఉన్నాయి.మరోవైపు ధురందర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,813 కోట్లు వసూలు చేసి.. 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2025లో థియేటర్లలోకి వచ్చిన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్ కీలక పాత్రల్లో నటించారు. -
పునర్వినియోగ రాకెట్... జపాన్ తొలి పరీక్ష సక్సెస్
టోక్యో: ఆసియా దేశాలు పునర్వినియోగ రాకెట్లను పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవక ముందే జపాన్ కూడా తొలి పరీక్షలో సక్సెస్ నమోదు చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ఈ రంగంలో స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకూ పునర్వినియోగ రాకెట్లు ఉపయోగపడతాయని జపాన్ అంచనా. ఆర్వీ–ఎక్స్ పేరుతో జపాన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్ శనివారం ఒకే ఒక్క నిమిషం పాటు గాల్లోకి ఎగిరి కొంత పక్కకు జరిగి ల్యాండైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించిన నోషిరో టెస్టింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రయోగాన్ని ఎన్వీఎస్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. జపాన్ అంతరిక్ష ప్రయోగాలకు చాలా కాలంగా ఒకేసారి వాడగలిగే హెచ్–3 శ్రేణి రాకెట్లను వాడుతున్న విషయం తెలిసిందే. అంతకంటే మునుపు వాడిన హెచ్2ఏ శ్రేణి రాకెట్ల కంటే ఇది చౌక అయినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో పోటీకి ఖర్చులు మరింత తగ్గాల్సి ఉంటుంది. జాతీయ భద్రతకు ఇది అత్యవసరమని జపాన్ భావిస్తోంది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా, మిత్సుబుషి హెవీ ఇండస్ట్రీస్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఆర్వీ–ఎక్స్ రాకెట్ సుమారు 23.9 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వ్యాసం కలిగి ఉంది. అత్యాధునిక ఇంజిన్లు, నాలుగు షాక్ అబ్జార్బర్లతో కూడిన ల్యాండింగ్ గేర్ దీని ప్రత్యేకతలు. పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో జాక్సా ఫ్రాన్స్, జర్మనీల సాయం కూడా తీసుకుంటోంది. -
ఇది చైనాకు సవాలా? భారత్‌కు అవకాశమా?
21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలను భూభాగాల కంటే సముద్రాలు, సరఫరా గొలుసులు (సప్లై చెయిన్స్), సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, అరుదైన ఖనిజాలు వంటి వ్యూహాత్మక వనరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రం ప్రపంచ భౌగోళిక–రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం, ఆసియా–యూరప్ వాణిజ్యంలో కీలక సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా సాగుతాయి. అందుకే అమెరికా, చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.భారత్‌కు హిందూ మహాసముద్రంలో సహజమైన వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ద్వారా పాకిస్తా¯Œ లో గ్వాదర్, శ్రీలంకలో హంబ¯Œ టోటా; జిబూతి, మయన్మార్ వంటి ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ తన ప్రభా వాన్ని విస్తరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, హిందూ మహా సముద్రంలోని సెషెల్స్, మారిషస్, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలతో సముద్ర భద్రత, తీరరక్షణ, బ్లూ ఎకానమీ రంగాల్లో సహ కారాన్ని విస్తరిస్తోంది. ఇటీవల సెషెల్స్‌తో కుదిరిన ఒప్పందాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. అదే సమయంలో జపాన్‌తో వ్యూహా త్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.మనవైపు ఎందుకు చూస్తున్నట్లు?మారుతున్న భద్రతా పరిస్థితులు జపాన్నే రక్షణ వ్యయాన్ని పెంచుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ సహజమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా జపాన్‌కు కనిపిస్తోంది. ఇరుదేశాల భాగ స్వామ్య అసలు బలం పెట్టుబడుల్లో కాదు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో ఉంది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, రక్షణ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలలో భారత్–జపాన్‌లు కలిసి పనిచేస్తే ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇదే అంశం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పటివరకు పెద్ద వినియోగ మార్కెట్‌గా చూసిన చైనా, ఇప్పుడు అది ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాన్ని గమని స్తోంది. అందుకే సరిహద్దుల్లో ఒత్తిడిని కొనసాగిస్తూనే, భారత్ పూర్తిగా అమెరికా వ్యూహాత్మక వలయంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా భారత్‌ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. అయితే అమెరికా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన భారత్, నేడు ‘మల్టీ–అలైన్మెంట్’ విధానంతో అమెరికా, జపాన్, యూరప్, రష్యా, గ్లోబల్ సౌత్ దేశాలతో సమతుల్య సంబంధాలను కొన సాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానం బలం. అయితే విదేశాంగ విధానానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నీతి ఆయోగ్ సూచిస్తున్నట్లుగా, భారత్ కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన తయారీ కేంద్రంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో జపాన్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి కావా లని ఆశించడంలో తప్పు లేదు.భారత్–జపాన్‌లను చైనా వ్యతిరేక కూటమిగా మాత్రమే చూడటం సబబు కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలు, నియమాధా రిత అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత నౌకాయానం, సాంకేతిక సహకారం, ఆర్థిక భద్రతపై ఆధారపడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించాలంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నాయకత్వం అవ సరం. ఈ లక్ష్యాలను సాధించడంలో జపాన్‌తో భాగస్వామ్యం భారతదేశానికి ఒక చారిత్రక అవకాశం.భారత్ ముందున్న అసలు సవాలు చైనా లేదా అమెరికా కాదు; తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకొని, ఆర్థిక–సాంకేతిక శక్తిగా ఎదగడం. అదే జరి గితే హిందూ మహాసముద్రంలో భారత్ ఒక ప్రాంతీయ శక్తిగానే కాదు, ప్రపంచస్థాయి ‘సంతులన శక్తి’గా అవతరిస్తుంది. అదే భారత్ – జపాన్ భాగస్వామ్యానికి నిజమైన విజయంగా చరిత్రలో నిలిచి పోతుంది.- సీహెచ్.వి. ప్రభాకర్ రావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్‌లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్‌కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్‌కు ఎండ అవసరం. పవన విద్యుత్‌కు గాలి అవసరం. జలవిద్యుత్‌కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్‌లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్‌ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్‌లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్‌ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్‌లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్‌లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్ ఘటన!
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచానికి కొత్త అవకాశాలను అందిస్తున్న వేళ.. దాని దుర్వినియోగం మరో కొత్త ముప్పుగా మారుతోంది. ఏఐ సాధనాలను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన బలం చేకూర్చింది. చాట్‌జీపీటీ సాయంతో ఓ ప్రోగ్రామ్ రూపొందించి వేలాది వినియోగదారుల ఖాతాలను ప్రభావితం చేశాడన్న ఆరోపణలతో 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ కావడం ఇక్కడ మరో విశేషం. జపాన్‌కు చెందిన ఓ టీనేజర్.. ప్రముఖ యానిమే స్ట్రీమింగ్ సేవ అయిన బందాయ్ ఛానల్‌పై సైబర్ దాడికి పాల్పడ్డాడు. చాట్‌జీపీటీ సాయంతో కోడింగ్‌ను బ్రేక్ చేసి.. ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది.చాట్‌జీపీటీ సాయంతో కోడ్..టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న నిందితుడు.. బందాయ్ ఛానల్ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్‌లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్‌ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్ భాషలో పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.46 వేలకుపైగా ఖాతాల రద్దుపోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్ 4న బందాయ్ ఛానల్ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్ ఛానల్ వెల్లడించింది.ఐపీ మార్చి.. ఏమార్చి.. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్‌ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్‌ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు.సరదాగానే..విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్ ఛానల్‌పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.చిన్న వయసులోనే కోడింగ్ నైపుణ్యంఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.వినియోగదారులకు హెచ్చరికసైబర్ దాడి తర్వాత బందాయ్ ఛానల్ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్, ఫిషింగ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.ముమ్మాటికీ కొత్త ఆందోళనే!కృత్రిమ మేధ అందిస్తున్న అవకాశాలతో పాటు.. దాని దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, దాన్ని తప్పుదోవ పట్టిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని జపాన్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. -
భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు)
-
జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ఇక సుదృఢ ఆర్థిక బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, జపాన్ కీలకమైన కార్యక్రమాలు, ఒప్పందాలను ప్రకటించాయి. ఆర్థిక భాగస్వామ్య చట్రం, సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం సహా చమురు సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇంధన సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో భారత్–జపాన్ సంబంధాలపై సమగ్ర సమీక్ష జరిపారు.ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సహకారం, ఇంధన సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఇండో–పసిఫిక్ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. అక్కడ చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండడంపై చర్చించారు. నౌకా నిర్మాణం, విమానయానం, సరుకు రవాణా(లాజిస్టిక్స్) రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడానికి భారత్, జపాన్ ఒక మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. ఆర్థిక భద్రత, క్లీన్ ఎనర్జీ, కీలక సాంకేతికతలు, పరిశోధన–అభివృద్ధిపై ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. భేటీ అనంతరం మోదీ, తకాయిచీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండో–పసిఫిక్‌లో శాంతి, పురోగతికి మార్గం నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను భారత్, జపాన్ పూర్తిగా అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. దీనిద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సప్లై చైన్లను పటిష్టం చేయబోతున్నామని వివరించారు.స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన, నియమ–ఆధారిత ఇండో–పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా ఈ రోజు అనేక కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించామని వివరించారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేస్తామన్నారు. ఇంధన భద్రత రంగంలో కూడా ఇరుదేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్, జపాన్ సంబంధాల పునాది.. రెండు దేశాల మధ్య గత ఏడాది కాలంలో 100కు పైగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా భారత్‌కు జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ల జపాన్ యేన్ల పెట్టుబడులను ఆకర్శించడం, భారత్‌లో జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తేలి్చచెప్పారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో సహకారం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంపై భారత్, జపాన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని సనే తకాయిచీ వివరించారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, జపాన్ సప్లై చైన్లు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడం తన ధ్యేయమని ప్రకటించారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, పెట్టుబడుల ద్వారా మన దేశాలను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్, జపాన్ సంబంధాలకు 2027లో 75 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. తకాయిచీ నా చిట్టి చెల్లెలు జపాన్ ప్రధాని తకాయిచీని నరేంద్ర మోదీ తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించారు. ఆమె గొప్ప దార్శనిక, ప్రజాదరణ కలిగిన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, తకాయిచీ మీడియాతో మాట్లాడారు. భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు తొలిసారిగా విచ్చేసిన తకాయిచీకి స్వాగతం పలకడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని వివరించారు. ఆమె జపాన్‌లోని నారా ప్రాంతానికి చెందినవారని, ఈ ప్రాంతం భారత్, జపాన్ల ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.మోదీ తనను చెల్లెలుగా భావిస్తూ సంబోధించడం పట్ల తకాయిచీ ఆనందం వ్యక్తంచేశారు. అన్నాచెల్లెళ్లుగా పనిచేస్తూ భారత్, జపాన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నిర్దేశించుకున్న ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. భారత్‌లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోందన్నారు. మోదీకి, భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. -
జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ
జపాన్ ప్రధాని సనాయె తకాయిచీని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్ ప్రధాని.. తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ (గురువారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా.. ఫార్మా, ఢిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న నా చెల్లెలు, జపాన్ ప్రధాని తకాయిచీకి నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. ఆమె జపాన్‌కు మొదటి మహిళా ప్రధాన మంత్రి, అలాగే దూరదృష్టి గల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.జపాన్ ప్రధాని మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో ఇదే ఆమె మొట్టమొదటి అధికారిక పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పర్యటనకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీతో ఆమె సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే 16వ ఇండియా–జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.భారత్‌లో అడుగుపెట్టిన ఫొటోను తకాయిచీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారతదేశంలో తొలి పర్యటన సందర్భంగా తకాయిచీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా గురువారం జరగబోయే సమగ్ర చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మన ఉమ్మడి కృషి ద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. -
‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: జపాన్ను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో చైనా మరోమారు కఠిన చర్యలకు దిగింది. ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. జపాన్‌కు చెందిన మరో 20 ప్రైవేట్ సంస్థలతో పాటు పలు పరిశోధనా కేంద్రాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నిఘా, ఎగుమతి ఆంక్షలను ప్రకటించింది. చైనా తయారీ వస్తువులు, సాంకేతికత జపాన్ సైనిక బలాన్ని పెంచడానికి ఉపయోగపడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది.ఈ తాజా ఆంక్షల జాబితాలో జపాన్ రక్షణ రంగానికి యుద్ధనౌకలను సరఫరా చేసే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు, జపాన్ స్వయంరక్షణ దళాలు, తీరరక్షక దళాలకు సేవలందించే నిక్కో టోక్కి వంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ కొమాట్సు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ వంటి పరిశోధనా కేంద్రాలపైనా చైనా నిషేధం విధించింది. దుర్వినియోగమయ్యే (డ్యూయల్-యూజ్) ముడిసరుకులు, రేర్ ఎర్త్స్, బ్యాటరీలు, చిప్ తయారీ పరికరాలు ఈ సంస్థలకు అందకుండా చైనా అడ్డుకోనుంది. వీటితో పాటు డ్రోన్లు, అణు ఇంధన రంగాలకు చెందిన మరో 20 జపనీస్ సంస్థలను చైనా ప్రత్యేక నిఘా జాబితాలో చేర్చింది.తైవాన్ సంక్షోభంలో జపాన్ కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని జపాన్ ప్రధాని సనాయే తకైచీ చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతీకారంగానే చైనా విమాన సర్వీసులను తగ్గించడమే కాకుండా, రేర్ ఎర్త్స్ ఎగుమతులను నిలిపివేస్తూ జపాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం -
ఆఖరి నిమిషంలో గోల్.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16)లో అడుగుపెట్టింది. సోమవారం రాత్రి రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున కేస్మిరో (56వ నిమిషం), గాబ్రియెల్ మార్టినెల్లి (90+6వ నిమిషం) గోల్స్ కొట్టారు. ఇక జపాన్ తరఫున కైషూ సానో 29వ నిమిషంలో గోల్ సాధించాడు. ఆట తొలి అర్ధభాగంలో జపాన్ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. గాయంతో బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జూనియర్ జపాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. దీంతో ఆరంభం నుంచి బ్రెజిల్ కాస్త తడబడింది. అయితే జపాన్ మాత్రం బ్రెజిల్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ నేపథ్యంలో 29వ నిమిషంలో కైషూ సానో జపాన్‌కు గోల్ అందించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసేసరికి జపాన్ 1-0తో బ్రెజిల్‌పై ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బ్రెజిల్ డిఫెన్స్ మోడ్ నుంచి బయటకు వచ్చి దూకుడును ప్రదర్శించింది. దీంతో ఆట మొదలైన కాసేపటికే 56వ నిమిషంలో కేస్మిరో బ్యాక్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ పలుమార్లు జపాన్ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ సమర్థంగా అడ్డుకుంది. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో స్టాపేజీ టైమ్ (ఇంజ్యూరీ టైమ్) ఇచ్చారు. స్టాపేజీ టైమ్ బ్రెజిల్‌కు కలిసి వచ్చింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గాబ్రియెల్ మార్టినెల్లి గుమెరాస్ నుంచి పాస్ అందుకొని డీప్ నుంచి బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించి బ్రెజిల్‌కు రెండో గోల్ అందించడంతో పాటు విజయాన్ని సాధించి పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 23 ప్రపంచకప్‌లలో ఆడిన బ్రెజిల్ జట్టు 20వసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఇక రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్.. ఐవరీ కోస్ట్, నార్వే మధ్య విజేతతో తలపడనుంది.🚨🌎 GABRIEL MARTINELLI HAS WON IT IN THE 95TH MINUTE FOR BRAZIL! 🤯🤯Brazil 2-1 Japan.pic.twitter.com/JUQ8WZsa2v— Tekkers Foot (@tekkersfoot) June 29, 2026 -
ఉత్తర కొరియా సీక్రెట్.. కిమ్ వంశంలో బిగ్ మిస్టరీ?
ప్రపంచంలో అత్యంత రహస్య రాజకీయ వ్యవస్థగా భావించే ఉత్తర కొరియాలో పాలన మొత్తం ఒకే వంశం చుట్టూ తిరుగుతుంది. ఆ వంశమే కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన “కిమ్ డైనాస్టీ”. ఆయన తరువాత దేశాన్ని నడిపింది ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్, ఇప్పుడు పాలన కొనసాగిస్తున్నది ఆయన మనవడు కిమ్ జోంగ్ ఉన్.ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ వెనుక ఉన్న కుటుంబ కథలో అత్యంత రహస్యంగా మిగిలిన పేరు ఆయన తల్లి కో జోంగ్ హుయి. ఒక దేశాన్ని పాలించే “కిమ్ వంశం”లో భాగమైనా, ఆమె ఎందుకు ప్రపంచానికి దూరంగా ఉండిపోయిందన్నది. ఆమె జీవితం ఎందుకు రాజకీయ మిస్టరీగా మిగిలిపోయింది. ఆమెకు జపాన్‌కు ఏంటి సంబంధం?. ఆమెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా చర్చనీయాంశంగా మారాయి.ఉత్తర కొరియా నేత కిమ్ వ్యక్తిగత జీవితంలో ప్రపంచ రాజకీయ వేదికల్లో ఆయన తండ్రి, తాతల గురించి తరచూ ప్రస్తావన వస్తున్నా, తల్లి పేరు మాత్రం చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంది. అత్యంత తక్కువగా చర్చించబడే వ్యక్తుల్లో ఒకరు ఆయన తల్లి కో జోంగ్ హుయి ఒకరు. దీనికి కారణం వ్యక్తిగతం కంటే ఎక్కువగా “రాజకీయ కథనం” అని విశ్లేషకులు చెబుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలో ఉన్న ఉత్తర కొరియాలో నాయకత్వాన్ని పవిత్ర వంశంగా చూపించే సిద్ధాంతం బలంగా అమలులో ఉంది. ఈ వంశాన్ని ‘పెక్టు పర్వత రక్తవంశం’గా అభివర్ణిస్తూ దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ పేర్ల చుట్టూ అధికారం కొనసాగుతోంది. అక్కడ నాయకత్వం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. అది ఒక పవిత్ర వారసత్వంగా చూపించబడుతుంది.ఈ నేపథ్యంలో కిమ్ తల్లి కో జోంగ్ హుయి పాత్ర మాత్రం చాలా పరిమితంగా చూపించబడింది. కో జోంగ్ హుయి జపాన్‌లో జన్మించిన కొరియన్ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె జపాన్‌కు చెందినవారు కావడం, అలాగే కళారంగంలో నృత్య కళాకారిణిగా పని చేయడం వంటి అంశాలు ఉత్తర కొరియా అధికారిక ప్రచారానికి అనుకూలంగా ఉండవు. అయితే, ఉత్తర కొరియా పాలనలో నాయకుడి కుటుంబం వ్యక్తిగత వ్యక్తులుగా కాకుండా ప్రతీకాత్మక వంశ చిహ్నాలుగా మాత్రమే చూపబడతారు. ఈ కారణంగా, తల్లి నేపథ్యం రాజవంశానికి అంతగా సరిపోకపోవడంతో ఆమెను ప్రజా ప్రచారంలో చాలా తక్కువగా చూపిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర మీడియా మరియు అధికారిక ప్రచార యంత్రాంగం నాయకుడి ఇమేజ్ను బలపరచడానికే దృష్టి పెడుతుంది. అందువల్ల తండ్రి, తాతల పాత్రలు ప్రధానంగా చూపించబడుతూ తల్లి పాత్ర మాత్రం రహస్యంగా ఉంచారని తెలుస్తోంది.ఉత్తర కొరియాలో ప్రతీ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ప్రజలకు చూపించబడుతుంది. కిమ్ జోంగ్ ఉన్ తల్లి గురించి మౌనం పాటించడం ఒక వ్యక్తిగత నిర్ణయం కాకుండా, ఉత్తర కొరియా రాజకీయ వ్యవస్థలోని ప్రచార నిర్మాణం మరియు “పెక్టు వంశం” సిద్ధాంతాన్ని కాపాడే వ్యూహం అని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.కిమ్ వంశం మూడు తరాలు..ప్రపంచంలో అత్యంత కఠిన నియంత్రణ కలిగిన దేశంగా భావించే ఉత్తర కొరియాలో అధికారానికి కేంద్రంగా ఉన్నది “కిమ్ వంశం”. ఇది సాధారణ రాజకీయ పార్టీ నాయకత్వం కాకుండా, మూడు తరాలుగా కొనసాగుతున్న ఒకే కుటుంబ పాలనగా గుర్తింపు పొందింది.మొదటి తరం: స్థాపకుడుఉత్తర కొరియా ఆధునిక రాజకీయ వ్యవస్థను నిర్మించిన వ్యక్తి కిమ్ ఇల్ సంగ్. ఆయన నాయకత్వంలో దేశ స్థాపన జరిగిందికమ్యూనిస్టు పాలన బలపడింది“పెక్టు పర్వత పవిత్ర వంశం” అనే భావన ప్రారంభమైందిఈ భావన తర్వాత మొత్తం వంశ రాజకీయానికి ఆధారంగా మారింది.రెండో తరం: వారసత్వ పాలనఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ దేశాన్ని తరువాత దశాబ్దాల పాటు పాలించాడు.ఆయన కాలంలో నాయకత్వాన్ని మరింత కేంద్రీకరించారుసైనిక ప్రాధాన్యత పెరిగింది (Songun పాలసీ)వంశాన్ని “దైవసమాన నాయకత్వం”గా చూపించే ప్రచారం పెరిగిందిమూడో తరం: ప్రస్తుత పాలనప్రస్తుతం దేశాన్ని నడుపుతున్నది ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్.ఆయన కాలంలో అణ్వస్త్ర కార్యక్రమం వేగం పెరిగిందిఅంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయికుటుంబ వంశం ఇమేజ్ను ఇంకా బలంగా ప్రచారం చేస్తున్నారు.As Mães da Pátria Coreana 🇰🇵-Kang Pan-sok: ativista antijaponesa, mãe de Kim Il-Sung.-Kim Jong-suk: guerrilheira antijaponesa, mãe de Kim Jong-il.-Ko Yong-hui: artista, mãe de Kim Jong-un.-Ri Sol-ju: cantora popular, companheira de Kim Jong-Un, mãe da pequena Kim Ju-ae. pic.twitter.com/zHIyQop5ue— Comunista Opressor 🇧🇷🇨🇳🇰🇵🇨🇺🇻🇪🇵🇸🇻🇳 (@ComunistaOpres4) May 12, 2024 -
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వీధుల్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారతీయ సంప్రదాయ చీరకట్టు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక భారతీయ మహిళ చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా వెస్ట్రన్, మోడ్రన్ దుస్తులకు అలవాటు పడిన జపాన్ ప్రజల మధ్యలోకి, ఒక భారతీయ నారి ఎర్రటి చీర కట్టుకుని అడుగుపెట్టడంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి వారు చూపు తిప్పుకోలేకపోయారు.వైరల్ వీడియో విశేషాలు‘wanderfullyflying’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో కాజల్ అనే భారతీయ మహిళ ఈ వీడియోను పంచుకున్నారు. ఆమె జపాన్ వీధుల్లో ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఎర్రటి చీర ధరించి నడుస్తూ కనిపించారు. మోడ్రన్ ప్రపంచంలో నివసించే జపనీయులకు ఈ సాంప్రదాయ చీరకట్టు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె నడుస్తుంటే దారి పొడుగునా జనం ఆగి మరీ ఆమె వైపు చూడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.స్థానికుల ఆశ్చర్యం.. సెల్ఫీల సందడిఈ వీడియో కేవలం సాధారణ చూపులకే పరిమితం కాలేదు. కాజల్ చీరకట్టును చూసి ముగ్ధులైన స్థానికులు కొందరు ఆమెతో మాట్లాడటానికి ముందుకు వచ్చారు. అంతేకాదు, భారత్‌కు చెందిన ఈ సాంప్రదాయ దుస్తుల అందాన్ని మెచ్చుకుంటూ, ఆమెతో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. విదేశీయులు మన సంస్కృతిని ఇంతగా గౌరవించడం, ఆనందించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సంస్కృతిని అనుసంధానిస్తూ..చీర అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు.. అది మన భారత సంస్కృతికి ప్రతీక అని కాజల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వేర్వేరు దేశాల ప్రజలను, వారి భావాలను ఒకచోట చేర్చడానికి, పరస్పరం అనుసంధానించడానికి సంస్కృతి అనేది ఒక అందమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోతూ, భారతీయ సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెబుతోంది. -
జపాన్‌లో మరోసారి భూ ప్రకంపనలు
టోక్యో: జపాన్‌లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈశాన్య జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5:21 గంటలకు భూమికి 41 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.మరోవైపు, జంట తుపానుల తాకిడితో జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో ఇప్పటికే జపాన్ పశ్చిమ భాగంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతూండగా గోరుచుట్టుపై రోకటి పోటు చందంగా తుపానులు చుట్టుముట్టాయి. మెఖాలా తుపాను జపాన్ దక్షిణ భాగం చివరలోని అమామీ ద్వీపం తీరం దాటి టోక్యో వైపు దూసుకొస్తూండగా.. హిగో తుపాను కూడా ఈ దిశగానే ప్రయాణిస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఫలితంగా టోక్యోకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. క్యోటో, ఒసాకా తదితర పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నారా ప్రాంతంలో ఒక వ్యక్తి జలప్రవాహంలో పడటంతో గాయాలైనట్లు ఎన్‌హెచ్‌కే పబ్లిక్ టీవీ తెలిపింది. నారా, హిరోషిమా ప్రాంతంలో సుమారు 30 ఇళ్లు వరద ముప్పునకు గురయ్యాయని, విపత్తుల నివారణ సంస్థ అధికారులు తెలిపారు. -
ముడి చమురుకు బై బై.. భారత్‌లోకి జపాన్ మిథేన్ పవర్
న్యూఢిల్లీ: క్లీన్ మొబిలిటీ (స్వచ్ఛమైన రవాణా) రంగంలో భారత్, జపాన్ దేశాలు ఒక భారీ విప్లవానికి తెరలేపాయి. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూనే, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా సుమారు 1,000 మిథేన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.1,000 మిథేన్ ప్లాంట్లు – సరికొత్త రవాణా విప్లవంఈ ప్రతిపాదిత భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మిథేన్ ఉత్పత్తి కేంద్రాలను భారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్యను దాదాపు 1,000కి పెంచనున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగాస్ను (మిథేన్) సీఎన్జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.రంగంలోకి సుజుకి – గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్’ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. జపాన్ ప్రభుత్వానికి చెందిన ‘గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ మద్దతుతో సుజుకి ఇప్పటికే భారత్‌లో బయోగాస్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో సీఎన్జీ వాహనాల వాటా 20 శాతానికి పైగా ఉండటంతో, ఈ కొత్త ఇంధన లభ్యత సీఎన్జీ వాహనాల వినియోగాన్ని మరింత పెంచనుంది.మోదీ-తకైచి సదస్సు – వ్యూహాత్మక బంధంగత ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ దౌత్య సంబంధాలలో భాగంగా జరగనున్న ఈ భేటీలో ఆర్థిక భద్రత, స్వచ్ఛమైన ఇంధనం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు తమకు ఎంతో కీలకమని జపాన్ భావిస్తోంది.ఇది కూడా చదవండి: చేతిరాత బాగోలేదని నవ్వితే.. పప్పులో కాలేసినట్లే! -
జపాన్ను వణికిస్తున్న జంట తుఫానులు.. 120కి పైగా విమానాలు రద్దు
-
జపాన్ను వణికిస్తున్న జంట తుఫానులు
టోక్యో: జపాన్ను జంట తుఫానులు వణికిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘మెక్ఖాలా', ‘హిగోస్’ అనే రెండు ఉష్ణమండల తుఫానుల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా శని, ఆదివారాల్లో ప్రయాణించాల్సిన కనీసం 120 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.రద్దయిన సర్వీసులు.. నిలిచిన సైనిక విమాన ప్రయోగాలుజపాన్కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థలు ‘జపాన్ ఎయిర్‌లైన్స్’, ‘ఆల్ నిప్పన్ ఎయిర్వేస్’ ప్రధానంగా ఓకినావా, కాగోషిమా వంటి దక్షిణ ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. గంటకు 108 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాల వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ వాతావరణ ప్రభావం వాణిజ్య విమానాలకే పరిమితం కాలేదు. అమెరికాతో కలిసి నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలలో భాగంగా మియాకో ద్వీపానికి బయలుదేరాల్సిన ‘వీ-22 ఓస్ప్రే’ సైనిక రవాణా విమానం తొలి ప్రయాణాన్ని కూడా రక్షణ శాఖ వాయిదా వేసింది.అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’.. ఊహించని ముప్పువాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ రెండు తుఫానుల వల్ల అత్యంత అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’ ఏర్పడే అవకాశం ఉంది. రెండు తుఫానులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ కలిసి ప్రయాణిస్తాయి. దీనివల్ల తుఫానుల ఖచ్చితమైన దిశను, వేగాన్ని, తీవ్రతను అంచనా వేయడం అత్యంత కష్టతరంగా మారుతుంది. తైవాన్‌లో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని, 88 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసిన ‘మెక్ఖాలా’ తుఫాను బలహీనపడినప్పటికీ, ఈ అరుదైన వాతావరణ ప్రక్రియ వల్ల జపాన్‌లోని ఒసాకా, నాగోయా, టోక్యో వంటి ప్రధాన నగరాలకు భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 10 లక్షల మందికి హెచ్చరికలు.. వరద గుప్పిట్లో నగరాలుతుఫానుల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు ఆదేశించారు. కాగోషిమా ప్రాంతంలో ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒసాకా, క్యోటో నగరాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: కంగారు లేని ప్రయాణం.. మనసుకు నచ్చిన నిశ్శబ్దం! -
జపాన్- స్వీడన్ మ్యాచ్ డ్రా.. నాకౌట్‌కు ఇరుజట్లు
ఫిఫా వరల్డ్‌కప్-2026లో జపాన్, స్వీడన్ సంయుక్తంగా నాకౌట్ దశకు చేరుకున్నాయి. గ్రూప్- ‘F’లో భాగంగా ఇరుజట్ల మధ్య డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. గేమ్ తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాయి.సగం మ్యాచ్ ముగిసేసరికి ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే, 56వ నిమిషంలో డైజెన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోని ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది.తొలుత నెదర్లాండ్స్కాగా ఈ గ్రూప్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా.. రెండు, మూడు స్థానాల కోసం జపాన్- స్వీడన్ బరిలో నిలిచాయి. ఈ గ్రూప్‌లో ఇదే ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా.. ఇరుజట్లు 1-1తో మ్యాచ్‌ను సమం చేసుకుని కలిసే నాకౌట్లో అడుగుపెట్టాయి. మరోవైపు.. ఈ గ్రూపులో చిట్టచివర నాలుగో స్థానంలో నిలిచిన ట్యునీషియా ఎలిమినేట్ అయిపోయింది.గ్రూప్ దశలో నెదర్లాండ్స్ మూడింట రెండు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని ఏడు పాయింట్లు సాధించగా.. జపాన్ మూడింట ఒకటి గెలిచి రెండు డ్రా చేసుకుని ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక స్వీడన్ మూడింట ఒకటి గెలిచి.. ఒకటి డ్రా చేసుకుని.. మరొకటి ఓడిపోయింది. దీంతో నాలుగు పాయింట్లు రాగా మూడో స్థానంలో నిలిచి.. నెదర్లాండ్స్, జపాన్‌లతో కలిసి నాకౌట్‌కు చేరుకుంది. ఇక ట్యునీషియా ఆడిన మూడింటా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్మార్! -
వణికిన వెనెజువెలా
కరాకస్/న్యూఢిల్లీ/టోక్యో/ఫోర్ట్ బ్రాగ్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజువెలా దేశం బుధవారం రెండు శక్తివంతమైన భూకంపాలకు చివురుటాకులా గజగజా వణికిపోయింది. 39 సెకన్ల వ్యవధిలో వచ్చిన భూకంపాల ధాటికి దేశంలో వేలాదిగా కట్టడాలు పేకమేడల్లా కుప్పకూలాయి. చాలా ప్రాంతాలు శిథిలాలతో నిండిపోయి మరుభూమిగా మారాయి. భవనాలు కూలడంతో, శిథిలాలు మీద పడటంతో 188 మంది సజీవ సమాధి అయ్యారు. 1,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది జాడ గల్లంతైంది. శిథిలాల కింద పెద్దసంఖ్యలో జనం చిక్కుకున్నారన్న వార్తల నడుమ మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని సహాయక బృందాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం రాజధాని కరాకస్ నగరానికి పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. 39 సెకన్ల తర్వాత అంతకంటే అధిక తీవ్రత(7.5)తో మరో భూకంపం వచ్చింది. రెండు భూకంపాల దెబ్బకు భవనాలు కుప్పకూలాయి. ఇంత తీవ్రతతో వెంట వెంటనే భారీభూకంపాలు రావడం వెనెజువెలాలో గత వందేళ్లలో ఇదే తొలిసారి. భూప్రకంపనలతో ఇళ్లు, దుకాణాలు, కర్మాగారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశంలోని ప్రధాన సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం దెబ్బతింది. దీంతో విమాన రాకపోకలను నిలిపేశారు. కూలిన భవనాల నుంచి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధప్రాతిపదికన సహాయక, అన్వేషణ చర్యలు చేపడుతున్నామని దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్ తెలిపారు. ఉత్తర కరాకస్‌లోని లా గువైరా నగరం అన్నింటికన్నా ఎక్కువగా నాశనమైంది. నగరంలో ఎటుచూసిన ప్రకృతి ప్రకోప విలయం కన్పిస్తోంది. కుప్పకూలిన భవనాలతో నగరం మరుభూమిని తలపిస్తోంది. రక్తమోడుతున్న స్థానికులను అతి కష్టంమీద శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడే నేలమీదనే పడుకోబెట్టి చికిత్సచేస్తున్న దృశ్యాలు, భూకంపం వేళ జనం భవనాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. దక్షిణ అమెరికా, కరీబియా భూఫలకాల కూడలిలో ఉండే వెనెజువెలాలో భూకంపాలు సర్వసాధారణం. కానీ ఇలాంటి భారీభూకంపాలు తక్కువే. తొలి భూకంప కేంద్రాన్ని కరీబియన్ తీరంలోని పశ్చిమ మోరాన్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోపల గుర్తించామని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. తర్వాత వచ్చిన భూకంపం కేంద్రాన్ని ఈశాన్య మోరాన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే భూకంప వినాశనం దారుణంగా ఉంటుంది. ‘‘మేమున్న భననం కదలడం చూసి భయంతో వణికిపోయాం. కూలి మీదపడుతుందని అనుకున్నా. చలిలో అమ్మ, కూతురుతో ఆరుబయటే ఉండిపోయాం. కంటిమీద కనుకులేదు. భయంతో ఏడుస్తూ ఉండిపోయాం. బతుకుతామని అనుకోలేదు’’అని 41 ఏళ్ల స్థానికురాలు మేరియా క్రిస్టినా డియాజ్ తెలిపారు. పైపులు పేలి మరింత ప్రమాదం సంభవిస్తుందని ముందు జాగ్రత్తగా ఇళ్లకు సహజవాయు పైప్‌లైన్ సరఫరాను అధికారులు నిలిపేశారు. విద్యుత్ సరఫరా ఆగపోవడంతో కరాకస్ నగరంలో అంధకారం అలుముకుంది. మొబైల్ సేవలు నిలిచిపోయాయి. విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సబ్వే సర్వీసులను రద్దుచేశారు. దేశంలో అంతర్గత సమస్యల కారణంగా విధించిన సోషల్‌మీడియాపై ఆంక్షలను ఆపత్కాలంలో ఎత్తేసి భూకంపబాధితులకు, బంధువులకు సాయపడాలని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ కోరింది. 2025 ఆగస్ట్‌లో నాటి అధ్యక్షుడు నికొలస్ మదురో ‘ఎక్స్’వంటి సామాజికమాధ్యమాలపై నిషేధం విధించారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా అధ్యక్షురాలు ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం 20 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వీటికితోడు ప్రపంచదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. సాయం చేస్తాం: ప్రధాని మోదీ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మిత్రదేశానికి తగు సాయం అందజేస్తామని ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు.జపాన్,అమెరికాలోనూ.. జపాన్ ఈశాన్య తీర భూభాగంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం భూప్రకంపనలకు హషికామీ, సెండాయ్, మొరియోకమీ నగరాల్లో జనం భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలనూ జారీచేయలేదని జపాన్ ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. భూమి నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నీయా రాష్ట్రంలోనూ ఫోర్ట్ బ్రాగ్ నగరంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు. -
ఫలకాల కదలికల వల్లే
20000+! ఏడాది కాలంలో భూమ్మీద సంభవించే భూకంపాల సంఖ్య ఇది. అంటే సగటున రోజుకు 55 వరకూ భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. సాధారణంగా వీటిల్లో చాలావరకూ తక్కువ తీవ్రత ఉన్నవే. మనుషులు గుర్తించలేనివి కూడా. కానీ...బుధవారం అటు అమెరికాలోని కాలిఫోర్నీయాలో... దక్షిణ అమెరికాలోని వెనెజువెలా, తూర్పున ఉన్న జపాన్‌లో వచ్చిన భూకంపాలు మాత్రం కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ వ్యాలీలో సుమారు 5.6 తీవ్రతతో భూకంపం రాగా.. ఏడు గంటల తరువాత వెనెజువెలాలో 7.2 తీవ్రతతో ఒకసారి.. 39 సెకన్ల తరువాత 7.5 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. ఈ డబుల్ భూకంపాల తరువాత 25 నిమిషాలకే జపాన్‌లోని కుజి వద్ద సముద్రంలో మరోసారి భూమి సుమారు 6.9 తీవ్రతతో కంపించింది. ఇలా 24 గంటల వ్యవధిలో ఇంత ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు రావడం అరుదైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఘటనలకు కారణం ఆయా ప్రాంతాల్లోని టెక్టానిక్ ఫలకాల కదలికలు కావడం. భూమి పొరల కదలికలు... భూమి ఉపరితలం నుంచి సుమారు 70 కిలోమీటర్ల లోతు వరకూ ఉండే క్రస్ట్.. దాని దిగువన ఉండే మాంటెల్ పై భాగం భారీ ఫలకాలుగా విడిపోయి ఉంటుంది. వీటినే టెక్టానిక్ ఫలకాలంటారు. వీటిల్లో పసిఫిక్, నార్త్ అమెరికన్, యురేసియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో–ఆ్రస్టేలియన్, సౌత్ అమెరికన్ ఫలకాలు ప్రధానమైనవి. కరీబియన్, నాజ్కా, కోకస్, అరేబియన్, ఫిలిప్పీన్ పేర్లతో కొన్ని చిన్న ఫలకాలూ ఉన్నాయి. టెక్టానిక్ ఫలకాలు నిత్యం కదులుతూ ఉంటాయి. ఏడాది కాలంలో సుమారు పది సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అంచనా. సుమారు ఐదు కోట్ల ఏళ్ల క్రితం యురేసియన్ ఫలకాన్ని ఇండియన్ ఫలకం ఢీకొన్న ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడింది. ఇండియన్ ఫలకం ఇప్పటికీ ఏడాదికి ఐదు సెంటీమీటర్ల చొప్పున యురేసియన్ ప్లేట్‌ను ముందుకు తోస్తోంది కూడా. ఢీకొనడం కాకుండా.. ఒకదాని కిందకు ఒకటి చేరిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూకంపాలు చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ టెక్టానిక్ ఫలకాల రాపిడి కాస్తా అగ్నిపర్వతాలు ఏర్పడేందుకు కారణమవుతూంటుంది. టెక్టానిక్ ఫలకాలు దూరం దూరంగా జరగడం వల్ల భారీ లోయలూ పుడతాయి. సెయింట్ ఆండ్రియాస్ ఇందుకు ఒక ఉదాహరణ. ️వెనెజువెలాలో ఏం జరిగింది?: దక్షిణ అమెరికాలోని వెనెజువెలా సౌత్ అమెరికన్, కరీబియన్ ఫలకాల సంగమ స్థలిలో ఉంటుంది. కరీబియన్ ఫలకం తూర్పు వైపునకు కదులుతూ సౌత్ అమెరికన్ ఫలకంపై ఒత్తిడిని పెంచుతూంటుంది. బోకాన్, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలర్, మోర్న్ ప్రాంతాల్లోని ఫాల్ట్ జోన్లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బుధవారం నాటి భూకంపాలు ఈ ఫాల్ట్ జోన్లు ఉన్న చోటే సంభవించడం గమనార్హం. మూడు ఫలకాల రాపిడి: జపాన్‌లో భూకంపాలు నిత్యకృత్యం అంటే అతిశయోక్తి కాదు. పసిఫిక్, ఫిలిప్పీన్, యురేసియన్ ఫలకాలు మూడూ ఇక్కడే కలుసు కుంటూండటం ఇందుకు ఒక కారణం. బుధవారం నాటి భూకంపం ఇవాటే ప్రాంతంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించింది. సాన్ ఆండియాస్ ఫాల్ట్: కాలిఫోర్నీయాలో తరచూ సంభవించే భూకంపాలు సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వల్లనే. ఇక్కడ పసిఫిక్ ఫలకం నార్త్ అమెరికన్ ఫలకం కింది నుంచి వెళుతూంటుంది. బుధవారం సాయంత్రం కాలిఫోర్నీయాలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
భారీ భూకంపాలతో వెనెజువెలా, జపాన్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగాa.. ప్రాణ నష్టం సైతం వాటిల్లినట్లు తెలుస్తోంది. వెవెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన రెండు ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో(రిక్టర్ స్కేలుపై)తో వరుసగా రెండు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో.. మోంటాల్బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారకాస్‌లో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి.A powerful 7.1-magnitude earthquake just struck Altamira, Caracas, Venezuela. pic.twitter.com/wFsX2GwrHs— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే అమెరికా తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని పేర్కొంది.“అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, సముద్ర మట్టం హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇవి తీర ప్రాంతాలు, బీచ్‌లు, నౌకాశ్రయాలు, తీర జలాల్లో ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపింది. ఇక, జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నష్టం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. MORE: Multiple structures have reportedly collapsed after a strong earthquake struck Caracas. https://t.co/r1EaakspGy— Breaking911 (@Breaking911) June 24, 2026WATCH: Terrifying Moment Powerful 7.1-Magnitude Earthquake Rocks Caracas, Venezuela pic.twitter.com/D9A5cXEV6e— Breaking911 (@Breaking911) June 24, 2026 -
జపాన్ వెళ్లాలంటే ఇక మరింత ఖర్చు..
జపాన్‌కు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీసా ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. కొత్త రుసుములు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ వీసాల ఖర్చు ఐదు రెట్లు పెరగనుంది.ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసాకు 3,000 యెన్లు వసూలు చేస్తుండగా, జూలై నుంచి అది 15,000 యెన్లకు పెరగనుంది. అలాగే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫీజు 6,000 యెన్ల నుంచి 30,000 యెన్లకు చేరుకోనుంది. భారత కరెన్సీలో చూస్తే సింగిల్ ఎంట్రీ వీసా ఖర్చు సుమారు రూ.1,750 నుంచి రూ.8,750 వరకు, మల్టిపుల్ ఎంట్రీ వీసా రూ.3,500 నుంచి రూ.17,500 వరకు పెరగనుంది.జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగి మాట్లాడుతూ, 1978లో నిర్ణయించిన వీసా ఫీజులు ఇప్పటి ద్రవ్యోల్బణం, మారకపు విలువల మార్పులను ప్రతిబింబించడం లేదని తెలిపారు. పెరుగుతున్న పరిపాలనా వ్యయాలు, బలహీనపడిన యెన్, విదేశీ సందర్శకుల సంఖ్యలో భారీ వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఈ పెంపు వల్ల పర్యాటకుల రాకపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.కోవిడ్ అనంతరం జపాన్‌లో పర్యాటక రంగం వేగంగా పుంజుకుంది. బలహీనమైన యెన్ కారణంగా విదేశీయులకు జపాన్ ప్రయాణం చౌకగా మారడంతో అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వీసా ఫీజులను ఇతర జీ-7 దేశాల స్థాయికి అనుగుణంగా పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.ఇదిలా ఉండగా, విదేశీయుల నివాస సంబంధిత దరఖాస్తులపై కూడా ప్రభుత్వం అధిక రుసుములు విధించేందుకు చట్టసవరణలు చేపట్టింది. శాశ్వత నివాస అనుమతి దరఖాస్తుల గరిష్ట రుసుము 10,000 యెన్ల నుంచి 300,000 యెన్ల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే నివాస హోదా మార్పు, గడువు పొడిగింపు వంటి సేవలపై గరిష్ట రుసుమును 100,000 యెన్ల వరకు పెంచే ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.అయితే భారతీయుల విషయంలో ఈ కొత్త ఫీజులు పూర్తిగా వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం భారతదేశంలో జపాన్ వీసాల కోసం ప్రత్యేక రుసుము విధానం అమల్లో ఉండటంతో, జపాన్ రాయబార కార్యాలయం లేదా వీసా సేవా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఫిఫాలో 1000వ మ్యాచ్.. జపాన్ గర్జనకు ట్యునీషియా చిత్తు
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్-ఎఫ్‌లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న జపాన్.. ట్యునీషియాతో మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. జపాన్ తరఫున అయాసే ఉడా (ఆట 31,83వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, దయిచీ కమదా (4వ నిమిషం), జున్యా ఇటో (69వ నిమిషం) గోల్స్ సాధించారు. కాగా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో జపాన్, ట్యునీషియాది 1000వ మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్‌లో ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫిఫా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తమ తదుపరి మ్యాచ్ స్వీడన్‌తో ఆడనుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్‌పై గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసి టాప్‌లో కొనసాగుతోంది.Joy for Japan! 🇯🇵#FIFAWorldCup— FIFA World Cup (@FIFAWorldCup) June 21, 2026Read: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాలను అనుసరించిన జపాన్ ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, చైనా సైనిక దూకుడు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో రక్షణ సామర్థ్యాల పెంపు అత్యవసరమని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జపాన్ చేపడుతున్న చర్యలు ఆసియా భద్రతా సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించిన దేశం ఇప్పుడు ఎందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందనే ప్రశ్నకు ఈ వ్యాఖ్యలే సమాధానంగా కనిపిస్తున్నాయి.ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా త్యజించి శాంతివాద దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చైనా సైనిక విస్తరణ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన.. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలి. శాంతిని కాపాడుకోవాలంటే ప్రత్యర్థి దాడి చేయాలనే ఆలోచనకే భయపడేంత శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే జపాన్ తన రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.జపాన్‌లో ఈ మార్పుకు కారణం?ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. ముఖ్యంగా చైనా సైనిక శక్తి పెరుగుదల జపాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత పదేళ్లలో చైనా తన నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేసింది. తైవాన్ చుట్టూ తరచూ నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు, తూర్పు చైనా సముద్రంలో జపాన్ నియంత్రణలో ఉన్న సేన్కాకు దీవుల సమీపంలో చైనా నౌకల సంచారం, దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు టోక్యోలో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.జపాన్‌కు కేవలం చైనా మాత్రమే కాదు. ఉత్తర కొరియా కూడా మరో పెద్ద సవాల్‌గా మారింది. తరచూ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ కార్యక్రమాలు జపాన్ భద్రతకు నేరుగా ముప్పుగా భావిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్ గగనతలంపై నుంచి దూసుకెళ్లడం అక్కడ ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా జపాన్ విధానంలో పెద్ద మార్పునకు కారణమైంది. శాంతి కోసం ఒప్పందాలు సరిపోవు.. అవసరమైతే శక్తి కూడా ఉండాలి అనే భావన జపాన్ విధాన నిర్ణేతల్లో బలపడింది.శాంతివాద దేశం నుంచి సైనిక శక్తి వైపు..1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం యుద్ధాన్ని శాశ్వతంగా త్యజించింది. దాడి చేసే సైన్యాన్ని కాకుండా కేవలం రక్షణ కోసం మాత్రమే ‘సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ను ఏర్పాటు చేసింది. ఇలా దశాబ్దాల పాటు జపాన్ ప్రపంచానికి శాంతివాద దేశంగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ భద్రతా సమీకరణాల్లో వచ్చిన మార్పులు జపాన్ను తన వ్యూహాన్ని పునఃపరిశీలించేలా చేశాయి.ఇటీవల జపాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే నిర్ణయం తీసుకుంది. గతంలో జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే రక్షణకు కేటాయించగా, ఇప్పుడు దాన్ని 2 శాతానికి పెంచుతోంది. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ విస్తరణగా భావిస్తున్నారు.జపాన్ ఏం చేస్తోంది ?జపాన్ ప్రస్తుతం పలు కీలక రక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.అమెరికా నుంచి అత్యాధునిక టోమాహాక్ క్షిపణుల కొనుగోలుదీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం కలిగిన క్షిపణుల అభివృద్ధిసైబర్ యుద్ధ సామర్థ్యాల పెంపుకృత్రిమ మేధ (AI) ఆధారిత రక్షణ వ్యవస్థలుడ్రోన్ టెక్నాలజీ విస్తరణఅంతరిక్ష భద్రతా వ్యవస్థల బలోపేతంబ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరో తరం యుద్ధ విమానాల అభివృద్ధిఇవన్నీ కేవలం రక్షణ కోసమేనని జపాన్ చెబుతున్నప్పటికీ, ఆసియా భద్రతా సమీకరణాల్లో ఇవి కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా స్పందన ఏంటి?జపాన్ చర్యలను చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. జపాన్ మళ్లీ సైనికవాదం వైపు వెళ్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అయితే, కోయిజుమి ఈ విమర్శలను ఖండించారు. అణ్వాయుధాలు లేని, ఇతర దేశాలపై దాడి చేసే విధానం లేని జపాన్ను సైనికవాద దేశంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. నిజానికి ప్రాంతీయ అస్థిరతకు కారణం చైనా సైనిక విస్తరణేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.అమెరికా పాత్ర ఎంత కీలకం?జపాన్ భద్రతలో అమెరికా ప్రధాన భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందం ప్రకారం జపాన్‌పై దాడి జరిగితే అమెరికా రక్షణకు రావాల్సి ఉంటుంది. జపాన్‌లో దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను సమతుల్యం చేయడంలో అమెరికా-జపాన్ భాగస్వామ్యం కీలకంగా మారింది. అందుకే జపాన్ రక్షణ సామర్థ్యాల పెంపు కేవలం టోక్యో నిర్ణయం మాత్రమే కాదు.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.జపాన్ పంపుతున్న సందేశం..జపాన్ తాజా వ్యూహం వెనుక ఒకే సందేశం ఉంది. శాంతి కోసం బలం అవసరం అని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం ఇప్పుడు యుద్ధాన్ని నివారించేందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జపాన్ చెబుతోంది. చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి భద్రతా సవాళ్ల మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆసియా భవిష్యత్తు భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. అయితే, జపాన్ ప్రస్తుతం చేపడుతున్న రక్షణ విస్తరణ కేవలం ఆయుధాల కొనుగోలు కాదు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతివాద విధానానికి అతిపెద్ద మలుపు. రాబోయే దశాబ్దంలో జపాన్ ఆసియాలో మరింత ప్రభావవంతమైన సైనిక, వ్యూహాత్మక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సెమీఫైనల్లో భారత్
ఆక్లాండ్: మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. జపాన్ జట్టుతో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆరు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.భారత్ తరఫున కెప్టెన్ సలీమా టెటె (33వ నిమిషంలో), లాల్రెమ్సియామి (49వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు అయ్ హిరామిత్సు (35వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు మిడ్‌ఫీల్డర్ జ్యోతి తన కెరీర్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. -
సెబాసో... సపోరో
జపాన్ లోని హొకైడో నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే హొకైడో ష్రైన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దానికి పైబడిన చరిత్ర కలిగిన ఈ వేడుకలు నేటి నుంచి జూన్ 16 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలతో సపోరో నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. సపోరా ఫెస్టివల్‌గా కూడా పిలుచుకునే ఈ పండుగ మూడు రోజులూ నకాజిమా పార్క్‌లో పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పార్క్ అంతటా భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, పర్యాటకులు తమ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాతా’ (తేలికపాటి నూలుతో చేసిన కిమోనోలు) ధరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్క్‌లో స్థానిక వంటకాలు, పానీయాలు, మిఠాయిలు విక్రయించే వందలాది స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటితో పాటు చిన్నపిల్లల కోసం జంపింగ్ కాసిల్స్, మ్యాజిక్ హౌస్, సాహసోపేతమైన డెత్ డిఫైయింగ్ మోటార్‌బైక్ (కళ్లకు గంతలు కట్టుకుని గుండ్రటి గోడలపై బైక్ నడిపే విన్యాసం) సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే మరుయామా పార్క్‌లోని పురాతన మందిరం వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమాలను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజైన జూన్ 16న జరుగుతుంది. హొక్కైడో ష్రైన్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో వేలాది మందితో ఒక భారీ ఊరేగింపు ప్రారంభమై, సపోరో నగర కేంద్రం వైపుగా సాగుతుంది.ఈ ఊరేగింపులో పాల్గొనే వేలాది మంది ప్రజలు జపాన్ దేశపు ప్రాచీన హెయాన్ కాలం నాటి (క్రీ.శ. 794– 1185) రంగురంగుల, సంప్రదాయ దుస్తులలో మెరుస్తారు. నగర వీధుల గుండా సాగే ఈ ప్రదర్శనలో తైకో డ్రమ్స్, సంగీత వాయిద్యాల మోతలు మార్మోగుతాయి. స్థానికులు మోసే 4 భారీ ‘మికోషి’ (కర్రతో చేసిన చిన్న దేవాలయం లాంటి నిర్మాణాలు), 8 అద్భుతమైన ఫ్లోట్లు (రథాలు) ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్యాహ్న సమయానికి ఈ ఊరేగింపు సెంట్రల్ సపోరోకు చేరుకుంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి, కెమెరాల్లో బంధించడానికి వేలాది మంది ప్రజలు పోటీపడతారు. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.∙ రమా జంబుల -
ఫ్రమ్ నూడుల్స్ టు పేపర్..!
కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయ్. బియ్యం లేదా గోధుమలనుప్రాసెస్ చేస్తే వచ్చేవే న్యూడిల్స్. మరి ఆ నూడుల్స్‌ని ప్రాసెస్ చేస్తే? అసలు ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తాం నూడుల్స్ కనబడగానే ప్లేటు లాగించేస్తాం అనుకుంటున్నారా? కాని జపాన్‌లోని కగవా యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం లాగించేయడం పక్కన పెట్టి ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించారు.అలా వారి ఆలోచనలో పుట్టిందే బయోడీగ్రేడబుల్ పేపర్ తయారీ. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఒక్క ప్లేటు నూడుల్స్‌తో పది ఏ4 సైజు పేపర్లను తయారు చేయవచ్చు. పేపర్ తయారీకి నీటితో పాటు ఎసిటిక్ బ్యాక్టీరియా, ఇతర కొన్ని ర కాల ఎంజైమ్స్ కలిపి మిశ్రమంగా మార్చడం వల్ల మాములు పేపర్ కంటే దృఢంగా ఉండేలా ఈ బయోడీగ్రేడబుల్ పేపర్ని తయారు చేయవచ్చునని వారు పేర్కొన్నారు. -
భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్
భారత మామిడి రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అధిక స్థాయిలో రసాయన పురుగుమందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది. ఇటీవల జపాన్ ఇండియన్ మామిడి పండ్ల దిగుమతులను నిషేధించగా ఇపుడు నేపాల్ కూడా ఆ బాటలో నడిచింది.అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని బాలెన్ షా ప్రభుత్వం నిషేధించింది.నేపాల్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ విధించిన ఈ ఆంక్షలు ఏప్రిల్-మే నెలల మధ్య అమలు చేసిందని సమాచారం. నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ, ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తనేపాల్ కూడా పరిమితంగానైనా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే, స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు. మే మధ్య నుండి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. మధేష్ ప్రావిన్స్‌లోని సిరహా, సప్తరి , ధనుషా జిల్లాలు దేశంలో ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నేపాల్ అధికారులు అంటున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో సుమారు 32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతి చేస్తుండగా, మిగిలినవి దేశీయ వినియోగానికే. ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
తినే నూడుల్స్‌తో పేపర్.. జపాన్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
జపాన్‌లోని కగావా శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ఆహార వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. హోటళ్లలో మిగిలిపోయి, పారేసే ‘ఉడాన్ నూడుల్స్’ తో పర్యావరణహిత, బయోడిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) కాగితాన్ని తయారు చేసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, వ్యర్థాలను అద్భుతమైన వనరుగా మార్చిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలో సంచలనంగా మారాయి.ప్రత్యేక నూడుల్స్.. పెరిగిపోతున్న వ్యర్థాలుజపాన్లోని కగావా ప్రిఫెక్చర్ ‘సానుకి ఉడాన్’ అనే ప్రాంతీయ నూడుల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అంతే స్థాయిలో ఇక్కడ ఆహార వృథా కూడా జరుగుతోంది. స్థానిక రెస్టారెంట్లలో అమ్ముడుపోని నూడుల్స్, అలాగే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ సమయం ఉంచడం వల్ల రుచి కోల్పోయిన నూడుల్స్‌ను భారీ మొత్తంలో పారేయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆహార వృథా సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో పరిశోధకులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.ప్రొఫెసర్ తనకా వినూత్న ఆలోచనకగావా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ నవోటాకా తనకా నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సూక్ష్మజీవులు, సెల్యులోజ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనల ఆధారంగా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘మా ప్రాంతంలో భారీ మొత్తంలో ఉడాన్ నూడుల్స్ వృథాగా పారేయడం నన్ను ఆలోచింపజేసింది. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించవచ్చని భావించాను’ అని ప్రొఫెసర్ తనకా తెలిపారు. నూడుల్స్‌ను చక్కెరగా మార్చే ప్రక్రియ చాలా సులభం కావడంతో ఆయన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు.నూడుల్స్ నుండి కాగితం తయారీ ఇలా..సాధారణ కాగితం తయారీ పద్ధతులకు భిన్నంగా, ఈ ప్రక్రియలో అధునాతన జీవ సాంకేతికతను ఉపయోగించారు. మొదటగా మిగిలిపోయిన నూడుల్స్‌ను నీటితో కలిపి మిశ్రమంగా మారుస్తారు. ఆ తర్వాత, అందులోని పిండి పదార్ధాన్ని గ్లూకోజ్‌గా మార్చడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లను జోడిస్తారు. ఈ మిశ్రమానికి ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చేర్చిన కొద్ది రోజుల్లోనే, ఆ మిశ్రమం పైభాగంలో బ్యాక్టీరియా ఒక సెల్యులోజ్ పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను జాగ్రత్తగా ట్రేలలో ఉంచి, సహజ గాలిలోనే ఆరబెట్టడం ద్వారా జపాన్ సాంప్రదాయ ‘వాషి’ కాగితం లాంటి పలచని షీట్లు సిద్ధమవుతాయి.అద్భుతమైన మన్నిక.. పర్యావరణానికి మేలుఒక్క ప్లేట్ ఉడాన్ నూడుల్స్ వ్యర్థాల నుండి దాదాపు 5 నుండి 10 వరకు ఏ4 సైజు కాగితాలను తయారు చేయవచ్చు. ప్రొఫెసర్ తనకా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోబియల్ పేపర్ సాధారణ కాగితం కంటే చాలా తేలికగా ఉండటమే కాకుండా, నీటిని తట్టుకునే శక్తిని, మన్నికను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాడేసిన తర్వాత మట్టిలో పడేసినా, సూక్ష్మజీవుల సహాయంతో ఇది చాలా వేగంగా, సహజంగా కలిసిపోతుంది. నిజానికి ఈ సాంకేతికతను ప్రొఫెసర్ సుమారు 16 ఏళ్ల క్రితమే విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడానికి అభివృద్ధి చేయడం గమనార్హం.అడ్డంకులను అధిగమించి స్థిరమైన ఉత్పత్తి2020 సంవత్సరంలో, ఈ సాంకేతికతను స్థానిక సామాజిక సేవా సంస్థకు విశ్వవిద్యాలయం ఉచితంగా అందించింది. దీని ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రారంభంలో బ్యాక్టీరియా కాలుష్యం, బూజు పట్టడం వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఉష్ణోగ్రత నియంత్రణ పెట్టెలను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తిని సాధించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నెలకు సుమారు 100 కాగితపు షీట్లను తయారు చేస్తున్నారు. వీటిని విశ్వవిద్యాలయమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రెస్టారెంట్లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక బలమైన స్థానిక రీసైక్లింగ్ నెట్వర్క్ ఏర్పడింది.భవిష్యత్ ప్రణాళికలు.. పరస్పర సహకారంఈ పర్యావరణహిత కాగితాన్ని ఇప్పటికే ప్రచార సామగ్రి, కళాఖండాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనిని నీటిలో కరిగిపోయే చేపల ఎరగా ఉపయోగించే అంశంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు, నూడుల్స్ వ్యర్థాలను అందించే రెస్టారెంట్లకు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సహాయం చేస్తోంది. వాతావరణ మార్పులు, ఆహార వినియోగ అంచనాలకు సంబంధించిన డేటాను వారికి అందిస్తూ, ముందస్తుగా ఆహార వృథాను అరికట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాల నిర్మూలనకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా మారుతుందని ప్రొఫెసర్ తనకా ఆశాభావం వ్యక్తం చేశారు. -
నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్.. తరువాత ఏం జరిగింది..?
-
చరిత్ర సృష్టించిన వైశాలీ.. తమ్ముడి బాటలోనే అక్క!!
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్‌ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ అలువా నూర్మన్‌తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్‌ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్‌ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! -
అబ్బాయిలకు స్వర్ణం... అమ్మాయిలకు కాంస్యం
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్ను చిత్తుచేసింది. భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (2వ, 28వ, 34వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించగా... కేతన్ ఖుషా్వహా (30వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. జపాన్ తరఫున నుమాడా గాకు (52వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు.సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై నాలుగు గోల్స్‌తో సత్తాచాటిన ఆశిశ్... తుది పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తూ మూడు గోల్స్ కొట్టడంతో ప్రత్యర్థి పై ఒత్తిడి పెరిగింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికే భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా... చివర్లో జపాన్ ఒక గోల్ నమోదు చేసింది. ఇదే వేదికపై జరిగిన మహిళల టోర్నీలో భారత్‌కు కాంస్యం దక్కింది. కాంస్య పతక పోరులో భారత్ 3–0తో కొరియాపై విజయం సాధించింది. మన జట్టు తరఫున సందీప కుమారి (2వ నిమిషంలో), స్వీటీ కుజుర్ (16వ నిమిషంలో), నౌషీన్ నాజ్ (33వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. -
భారత్ వర్సెస్ పాకిస్తాన్
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ‘ఢీ’కొంటుంది. సెమీఫైనల్లో స్థానం కోసం ఈ రెండు జట్లు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాయి. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత జట్టు తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లున్న పూల్ ‘బి’లో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. జపాన్ వేదికగా తొలుత కజకిస్తాన్‌పై 13-0తో ఏక పక్ష విజయం సాధించిన భారత్.. ఆతిథ్య జట్టు చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. అనంతరం కొరియాతో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్న భారత జట్టు.. 4-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత చైనీస్ తైపీపై 13-1 తేడాతో గెలుపొందింది.మరోవైపు.. భారత మహిళా హాకీ యువ జట్టు సైతం సెమీస్‌కు చేరుకుంది. తొలుత మలేషియాపై 2-1తో గెలిచిన భారత్.. కొరియాపై 3-1, సింగపూర్‌పై 25-0తో జయభేరి మోగించింది. సెమీ ఫైనల్లో భాగంగా భారత మహిళల జట్టు శుక్రవారం చైనాతో తలపడనుంది. -
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్‌పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్‌కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026 -
మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!
-
మీ అభిమానం సల్లగుండా.. పెద్ది కోసం రూ.2 లక్షల ఖర్చు..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా పెద్ది మానియా కనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్‌లో పెద్ది దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మూవీపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.ఈ సినిమాకు ఫ్యాన్స్ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ ఉన్నారు. పెద్ది కోసం ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఇద్దరు జపనీస్ మహిళ అభిమానులు భాగ్యనగరానికి చేరుకున్నారు. పెద్దిని చూసేందుకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు చేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెద్ది సినిమాను 3 రోజుల్లో 10 సార్లు చూడాలన్నదే ఆశయమని చెబుతున్నారు. తెలుగు భాష రాకపోయినా కేవలం అభిమానంలో జపాన్ నుంచి ఇండియాకు రావడమంటే మాటలు కాదు. ఇది చూసిన కొందరు ఖరీదైన అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. -
జపాన్‌లో మసీదు.. పాక్ పరువు పాయె!
పరాయి దేశంలో పాకిస్థాన్‌కు పరువు పొగొట్టుకుంది. ఆ దేశ పౌరులు అక్కడ ఓ మసీదును నిర్మించడమే అందుకు కారణం. పైగా దానిని ఆ దేశ రాయబారితోనే అట్టహాసంగా ప్రారంభించింది. అయితే వారం తిరగకుండానే స్థానిక అధికారులు మసీదు నిర్వాహకులకు షాకిచ్చారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌లోని సైతామా ప్రిఫెక్చర్లో ఉన్న కవగోయే నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదాస్పదంగా మారింది. నగర ప్రణాళిక చట్టాల ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాని ప్రాంతంలో ఈ మసీదును నిర్మించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సుమారు 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం పర్వత అటవీ భూమిగా నమోదై ఉంది. ఇది అర్బనైజేషన్ కంట్రోల్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిషేధం.అయితే మసీదు నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని కవగోయే మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ Abdul Hameed ఈ ఏప్రిల్‌లో జరిగిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడమే. దీంతో ఈ నిర్మాణానికి పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే వివాదం ముదరడంతో పాకిస్థాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. మసీదు నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకున్నామని హామీ ఇవ్వడంతోనే రాయబారి కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంది. స్థానిక చట్టాలను ఉల్లంఘించే ఏ ప్రాజెక్టుతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే జపాన్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కమ్యూనిటీకి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ప్రార్థనా మందిరాల నిర్మాణం సహా అన్ని అంశాల్లో స్థానిక చట్టాలను పూర్తిగా పాటించాలని కోరింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హెచ్చరించింది.ఇదే సమయంలో జపాన్‌లో చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాషియో మసీదు ప్రతినిధి షకీల్ షేక్ మహ్మద్ కూడా ఈ నిర్మాణాన్ని తప్పుబట్టారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని మాత్రమే మసీదులు నిర్మించాలని సూచించారు.మొత్తంగా మసీదు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కొద్ది రోజులకే అది అక్రమ నిర్మాణంగా మారడం పాకిస్థాన్‌కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. జపాన్ వంటి చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించే దేశంలో ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
-
కోముసుబి దెబ్బ ఓజెకి చిత్తు
పిల్లలూ... ఇది సుమో పోటీ. అంటే జపాన్ కుస్తీ పోటీ. అక్కడ ‘సమ్మర్ గ్రాండ్ సుమో టోర్నమెంట్’ జరుగుతోంది. ఈ పోటీలో ‘ఓజెకి’ కిరిషిమానును ‘కోముసుబి’ వాకాతకకాగె మట్టికరిపించాడు.ఇది పెద్ద విశేషమే. ‘ఓజెకి’, ‘కోముసుబి’ అనేవి సుమో వీరుల ర్యాంకులు. ఓజెకి అంటే సెకండ్ ర్యాంక్ లాంటివాడు. చాలా పెద్ద ఫైటర్. కోముసుబి అంటే 4వ ర్యాంక్. కొంచెం చిన్న ర్యాంక్. ఇక్కడ 4వ ర్యాంక్ పిల్లాడు 2వ ర్యాంక్ అన్నయ్యని ఓడించేశాడు. క్రికెట్లో బంగ్లాదేశ్ ఇండియాని ఓడిస్తే ఎలా ఉంటుందో అలాంటిది!ఫోటోలో కుడివైపున ఉన్నది పెద్ద వీరుడు (కిరిషిమానును). అతన్ని నెడుతున్నవాడు చిన్న వీరుడు (వాకాతకకాగె). పోటీలో చిన్నవీరుడు గెలిచాడు. కాబట్టి మనం గట్టిగా పట్టుపడితే ఎవరినైనా ఓడించగలం. గుర్తు పెట్టుకోండి. -
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
-
భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?
భారతీయ మామిడిపళ్ల ఎగుమతులపై జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి మామిడి పండ్ల శుద్ధి కేంద్రాలలో, మగ్గబెట్టడం (Fumigation) క్రిమిసంహారక (Disinfection) చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన తరువాత భారత్ నుండి వచ్చే తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మామిడి పండ్ల ఎగుమతులకు అత్యంత కీలకమైన ఏప్రిల్-జూన్ సీజన్లోఈ నిర్ణయం తీసుకోవడంతో మామిడి ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది.'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారంజపాన్ క్వారంటైన్ ఇన్స్పెక్టర్లు తనఖీల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రముఖ భారతీయ మామిడి రకాల ఎగుమతులకు తీవ్ర విఘాతం కలిగింది.ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేస్తూ, మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారతదేశం జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (Inspection certificates) ఉన్న షిప్మెంట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. భారతీయ కేంద్రాలలో నిర్వహణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపుజపాన్ అధికారులు ఎలాంటి లోపాలను గుర్తించారు?మామిడి పండ్ల ఎగుమతి కోసం ఉపయోగించే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) కేంద్రాలను పరిశీలించడానికి జపాన్ క్వారంటైన్ అధికారులు ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్పూర్ను సందర్శించారు.వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) అంటే ఏమిటి?ఇది ఎగుమతి చేయడానికి ముందు మామిడి పండ్లలోని పురుగులను, తెగుళ్లను నివారించడానికి ఎటువంటి రసాయనాలు లేకుండా, కేవలం వేడి మరియు తేమతో కూడిన గాలితో శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జపాన్ ప్రతి సంవత్సరం మామిడి సీజన్‌కు ముందు తన ఇన్స్పెక్టర్లను భారతదేశానికి పంపుతుంది.అయితే, ఈ ఏడాది పరిశీలనలో పొగబెట్టడం (Fumigation) మరియు దానికి సంబంధించిన క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనితో టోక్యో (జపాన్ ప్రభుత్వం) దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. జపాన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న పలు రకాల మామిడి పండ్లపై ఈ నిషేధ ప్రభావం పడింది. వాటిలో ముఖ్యమైనవి ఇవి.అల్ఫోన్సో (Alphonso)కేసర్ (Kesar)లంగ్రా (Langra)బంగినపల్లి (Banganapalli)2025-26 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌కు ఎగుమతి అయిన భారతీయ మామిడి పండ్లలో గుజరాత్‌కు చెందిన 'కేసర్' రకానిదే సింహభాగం. జపాన్‌కు జరిగిన మొత్తం తాజా మరియు ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ $1.54 మిలియన్లు కాగా, అందులో కేసర్ రకం వాటానే సుమారు 0.2 మిలియన్ల డాలర్లుగా ఉంది.ఇది మొదటిసారి కాదు జపాన్ భారత్ నుండి మామిడి దిగుమతులను నిలిపివేయడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎత్తివేసిన ఆంక్షలను జపాన్ మళ్లీ ఇన్నాళ్లకు విధించింది.1986లో తొలిసారి నిషేధంఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వల్ల తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనతో జపాన్ 1986లో తొలిసారి భారత మామిడి పండ్లపై ఆంక్షలు విధించింది. శాస్త్రీయ అధ్యయనాలు, చర్చలు జరిగినప్పటికీ ఆ నిషేధం 2006 వరకు (20 ఏళ్లు) కొనసాగింది.2006లో నిషేధం ఎత్తివేత: అప్పటి వాణిజ్య మంత్రి కమల్ నాథ్ నిరంతర ప్రయత్నాలు, జపాన్ క్వారంటైన్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం.. భారతీయ మామిడి పండ్ల వల్ల ఎలాంటి తెగుళ్లు వచ్చే ప్రమాదం లేదని నిర్ధారించుకుని జపాన్ జూన్ 2006లో నిషేధాన్ని ఎత్తివేసింది. జపాన్ కోరినట్లుగా భారతదేశం వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) విధానాన్ని అమలు చేసింది.2006 తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఆమోదిత ప్రాంతాలలో పండే అల్ఫోన్సో, బంగినపల్లి, కేసర్, లంగ్రా, చౌసా, మల్లిక రకాల మామిడి పండ్ల దిగుమతికి జపాన్ అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ లోపాలు బయటపడటంతో దిగుమతులను నిషేధించింది. భారతదేశానికి అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు: అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్ మరియు సౌదీ అరేబియా. -
క్వాడ్‌లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్‌ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్‌లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్‌లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
చాలా కాస్ట్లీ గురూ.. 2 తర్బూజాలు కేవలం రూ. 30 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రూట్‌గా జపాన్ తర్పూజా రికార్డ్ కొట్టేసింది. దీంతో జపాన్ రైతు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపతున్నారు. మే 22న సపోరో సంతలో ఇతను పండించిన రెండు ‘యుబారి మెలన్లు’ (తర్బూజాలు) 30 లక్షలకు అమ్ముడు పోయాయి. అదీ అతని ఆనందం. అంత రేటా? ఎస్. రేటే. ఎందుకంటే ఈ యుబారి మెలన్లు హొక్కైడోలోని యుబారి అనే చిన్న పట్టణంలో మాత్రమే పండిస్తారు. అక్కడి నేల, వాతావరణం వేరు. అందుకే ఆ రుచి ఇంకెక్కడా రాదు. పండించేటప్పుడు ఒక్కో మొక్కకు ఒక్క పండు మాత్రమే ఉంచుతారు. మిగతావి తీసేస్తారు. ఆ ఒక్క పండుకే మొక్క శక్తి అంతా పోతుంది. రోజూ రైతులు పండుని పొత్తిళ్లలో పాపాయిలా చూసుకుంటారు. టోపీ కూడా పెడతారు ఎండ తగలకుండా. జపాన్‌లో వీటి మొదటి పంట వేలం చాలా ప్రెస్టీజ్. పెద్ద కంపెనీలు ‘మా పేరు పేపర్లో రావాలి‘ అని పోటీపడి కొంటాయి పబ్లిసిటీ కోసం. ఆ పండ్లని తినరు, గిఫ్ట్‌గా ఇస్తారు లేదా డిస్ప్లే పెడతారు. ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువురికార్డు: ఇంతకుముందు 2019లో 50 లక్షల యెన్లు రేటు పలికింది. ఇప్పుడు 2026లో 58 లక్షల ఎన్‌లతో కొత్త రికార్డ్. ప్రతి ఏడాది ధర పెరుగుతూనే ఉంది.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ! -
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. -
జపాన్ వీసా పాలసీ.. భారతీయుడికి తీవ్ర కష్టాలు
జపాన్‌లో నూతనంగా తీసుకవచ్చిన వీసా నిబంధనలు అక్కడే స్థిరపడిన విదేశీయుల పట్ల శాపంగా మారాయి. గత 30 ఏళ్లుగా జపాన్‌లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న ఓ భారతీయునికి అక్కడి అధికారులు వీసా పునరుద్ధరణకు నిరాకరించారు. దీంతో ఆయన ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారత్‌కు చెందిన మనీష్ కుమార్ గత 30 ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి సైతామా ప్రిఫెక్చర్ ప్రాంతంలో గత 18 ఏళ్లుగా ఓ భారతీయ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. అయితే ఆ దేశంలో ఇటీవల వీసా నిబంధనలు తీవ్ర కఠినతరం చేయడంతో అధికారులు తన బిజినెస్ మేనేజర్ వీసా పునరుద్ధరణను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా నడుపుతున్న రెస్టారెంట్ మూసివేయవలసి వచ్చిందని కన్నీటితో కుప్పకూలిపోయారు.టోక్యోలో జరిగిన వీసా నిబంధనల నిరసన ర్యాలీలో మాట్లాడుతూ "రెండు వారాల క్రితం, నా సొంత దేశానికి తిరిగి వెళ్ళమని ఐఎస్ఏ నాకు చెప్పింది. నా పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారు, వారికి జపనీస్ మాత్రమే అర్థమవుతుంది, వారి స్నేహితులు కూడా జపనీయులే. అయినా మమ్మల్ని భారతదేశానికి తిరిగి వెళ్ళమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి?" అని కన్నీటీ పర్యంతమయ్యారు. ఈ నిర్ణయంతో తాను తీవ్రంగా కుంగిపోయానని, జపాన్‌లో తన కుటుంబ భవిష్యత్తు గురించి భయపడుతున్నానని కుమార్ అన్నారు.కాగా గతేడాది జపాన్ తన బిజినెస్ మేనేజర్ వీసా విధానంలో సమూలంగా మార్పులు ప్రవేశపెట్టింది. దీంతో అక్కడే ఉన్న విదేశీ చిన్న తరహా వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా అధికారిక సమాచారం ప్రకారం, అక్టోబర్ 2025లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీసా దరఖాస్తులు 96 శాతం తగ్గాయి. నెలవారీ దరఖాస్తులు గతంలో సూమారు 1,700 వరకూ వస్తుండగా ఇప్పుడు 70కి పడిపోయినట్లు సమాచారం.అయితే అక్కడ నిజమైన వ్యాపారాలు నిర్వహించకుండా, దీర్ఘకాలిక నివాసం కోసం వీసాను సులభ మార్గంగా ఉపయోగించుకునే వారిని అరికట్టడానికే ఈ కఠినమైన నిబంధనలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.【署名提出🤝】日本に30年間暮らし、18年間カレー店を経営してきたクマールさんは、要件厳格化でビザの更新が不許可に……。「子どもたちは日本で生まれて、日本語しか話せない。妻も娘も泣いています」友人の@TsuruVoiceNet が、ビザ厳格化の撤回を訴え、5.3万筆の署名を入管庁に提出しました。 pic.twitter.com/eXHCDhdqKk— Change.org Japan(チェンジ・ドット・オーグ) (@change_jp) May 14, 2026 -
మేకప్ లేకున్నా అదే అందం.. సాయిపల్లవి జపాన్ ట్రిప్ (ఫొటోలు)
-
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన
భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్ ట్రయల్స్‌కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్‌లో సత్తా చాటితేనే టీమ్‌లో చోటు దక్కుతుందని, ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్ వన్’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్‌గన్’ టీమ్‌లను ఎన్ఆర్ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్‌వన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్ షూటర్ జొరావర్ సింగ్ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్, సెలక్షన్ ట్రయల్స్‌లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్‌ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్ కప్‌లో కూడా జొరావర్ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా 122 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్ఆర్ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్‌వన్‌గా, వరల్డ్ నంబర్ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్‌లో అత్యుత్తమ స్కోరింగ్‌లు నమోదు చేశాను’ అని జొరావర్ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్ఆర్ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్‌లోకి ఎంపికైన ఇతర ‘షాట్‌గన్’ షూటర్ల స్కోరింగ్ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్‌కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రిజ్వీ (122), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (119), శపథ్ భరద్వాజ్ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్‌లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్‌గన్’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్: కైనన్ చెనాయ్, అహ్వర్ రిజ్వీ, శపథ్ భరద్వాజ్. మహిళల ట్రాప్: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్. పురుషుల స్కీట్: అనంత్‌జీత్ సింగ్, భవ్‌తేజ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్. మహిళల స్కీట్: పరీనాజ్ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్ ‘మిక్స్డ్’: కైనన్ చెనాయ్, నీరూ. స్కీట్ ‘మిక్స్డ్’: అనంత్‌జీత్ సింగ్, పరీనాజ్ ధలివాల్. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
పానీ పూరీపై మనసు పారేసుకున్న జపాన్ చిన్నది..!
నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. తాజాగా ఓ జపనీస్ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్ అనే జపనీస్ మహిళ ఎక్స్ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్‌ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్‌లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్‌ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్ స్నాక్‌కు జపాన్‌లో కూడా క్రేజ్ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. パニプリにハマりすぎて、気軽に食べ歩きできるパニプリ屋でも起業しようかなって真剣に思うくらいハマってる。エキゾチック料理NGな夫すら、「俺ハマったかもしれん、パニプリのことをすぐ考えてしまう」と言うくらい中毒性ある、、週2くらいで食べてるし、パニプリキットも買った笑 pic.twitter.com/LXqtiklwS6— エルメス (@hermes_ooo) April 20, 2026 (చదవండి: Met Gala 2026: గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..) -
బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
జపాన్‌లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడి సింగిల్ కింగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్ ఆఫర్ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.జపాన్‌లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్‌లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.జపాన్‌లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్‌లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్‌లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు -
వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?
ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి జోడించడం వంటి మల్టీ టాస్కింగ్ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.మెరుగైన మెదడు పనితీరు..: జపాన్ జెరోంటాలాజికల్ ఎవాల్యుయేషన్ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.జీవనశైలి మార్పుల ద్వారా..: వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్ తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురుషుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివారించవచ్చని తేలింది. అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్‌కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.మెదడుకు వ్యాయామం..ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.ప్రయోజనాలు..పోషకాహారం: మంచి డైట్ లభిస్తుంది.శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేషనల్ డెస్క్(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...
-
జపాన్ అనూహ్య నిర్ణయం.. 80 ఏళ్ల నియమానికి స్వస్తి!
జపాన్ ప్రధాని సనాయే తకైచీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్ల రాజ్యాంగ నియమానికి స్వస్తి పలుకుతూ ఇతర దేశాలకు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, తమ సైన్యం విస్తృత ప్రపంచంతో వ్యవహరించే తీరుపై జపాన్ తన దృక్పథాన్ని మార్చుకునేలా చేశాయి. అయితే ఆయుధాల విక్రయంలో జపాన్ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాని తకైచి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదు. అందుకే ఇతర దేశాల సహకారం కూడా అవసరం’ అని తకైచి పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగ నియమం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠిన నిషేధాన్ని విధించింది. అయితే మారుతుఉన్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల దృష్ట్యా జపాన్ ప్రధాని సనాయే తకైచి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో తాము ఏం విక్రయిస్తామనేది అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ, ఫైటర్ జెట్లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత సాధించినట్లు జపాన్ మీడియా స్పష్టం చేసింది. పాత నియమాల ప్రకారం జపాన్ కేవలం నిఘా పరికరాలు, మైన్ స్వీపింగ్ వంటి ప్రాణాంతకం కాని సామగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్ల విక్రయానికి సిద్ధమవ్వడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. -
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్స్‌తో పాటు సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్ కౌల్ అన్నారు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ మార్షల్, సర్ఫింగ్ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్తక్రా, కురాశ్ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్ వెల్లడించారు. -
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం జపాన్ ఈశాన్య తీరానికి సమీపంగా ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. రవాణా సేవలకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని కోరారు.జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇవాటే, ఆఓమోరి, హొక్కైడో ప్రిఫెక్చర్ ప్రాంతాల తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తుకి సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ప్రధాన మంత్రి సనఏ తకైచి అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొనసాగుతున్న నౌకల తరలింపుజపాన్లోని ఉత్తర తోహోకు ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య రేవు ‘హచినోహే పోర్ట్’ నుంచి నౌకలు వెంటనే తరలిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలలు త్వరలో తీరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోక్యో నుంచి ఆఓమోరి వరకు బుల్లెట్ రైలు సేవలను భూకంపం తర్వాత నిలిపివేశారు. Massive 7.4 magnitude Earthquake in Japan . Tsunami warning issued .#JapanEarthquake pic.twitter.com/tpFJJhkU45— Bengal's untold tales (@Gramergolpo) April 20, 2026Massive 7.4 magnitude Earthquake in Japan . Tsunami warning issued .#JapanEarthquake pic.twitter.com/QccDeThlbd— God (@Indic_God) April 20, 2026Breaking News: Powerful 7.5 magnitude earthquake strikes northeastern Japan, triggering tsunami warnings and mass evacuations.#wicnews #JapanEarthquake #TsunamiWarning #BreakingNews pic.twitter.com/V25Zecd6Tu— WIC News (@WIC_News) April 20, 2026 -
టెక్ దేశానికి వీసా ఫీజులు పెరుగుతున్నాయ్..!
జపాన్‌లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్‌కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలుప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వంఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.పెంపునకు కారణం ఏంటి?మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
అక్కడ యుద్ధానికి బ్రేక్.. ఇక్కడ కిమ్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు
సియోల్: ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ గొడవ తగ్గుతుందనుకుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ ప్రాంతం నుంచి కలకలం రేపారు. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేసింది. ఆ వెంటనే జపాన్ హెచ్చరిక జారీ చేసింది. జపాన్ ప్రధాన మంత్రి సనయె తకైచి కార్యాలయం కూడా ఈ విషయంపై ఎక్స్‌లో పోస్టు చేసింది. “ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి” అని తకైచి కార్యాలయం తెలిపింది.ఈ ప్రయోగం తర్వాత జపాన్ అధికారులు పౌరుల భద్రతపై సూచనలు జారీ చేశారు. “ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడంతో ప్రధాన మంత్రి చేసే సూచనలను పాటించాలి. ప్రజలకు అధికారులు సమయానుకూలంగా సరైన సమాచారం అందించాలి. విమానాలు, నౌకలు, ఇతర ఆస్తుల భద్రతపై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటం సహా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని అధికారిక ప్రకటనలో తెలిపారు.కొరియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సూచనలు అన్నీ కిమ్ జోంగ్ ఉన్ చేయించిన ఈ చర్యతో పటాపంచలయ్యాయి. దక్షిణ కొరియా సంయుక్త చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా వోన్సాన్ ప్రాంతం నుంచి తూర్పు తీర సముద్ర దిశగా ఉత్తరకొరియా బుధవారం (ఏప్రిల్ 8న) క్షిపణిని ప్రయోగించింది.ఇదే రోజు ఉదయం కూడా అదే ప్రాంతం సమీపం నుంచి పలు గుర్తించని స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ క్షిపణులు సుమారు 240 కి.మీ (150 మైళ్లు) ప్రయాణించాయి. దక్షిణ కొరియా, అమెరికా అధికారులు దీనిపై విశ్లేషణ చేస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బ్లూ హౌస్ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఉత్తరకొరియా ఇలాంటి పరీక్షలను ఆపాలని దక్షిణ కొరియా కోరింది. జపాన్ తీర రక్షక దళం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం తర్వాత సుమారు 10 నిమిషాల్లో సముద్రంలో పడింది. జపాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి క్షిపణులు తమ భౌగోళిక జలాల్లోకి ప్రవేశించలేదు. [Emergency alert]North Korea has launched a suspected ballistic missile. More updates to follow.— PM's Office of Japan (@JPN_PMO) April 8, 2026 -
రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్మొదలు పెట్టిన యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోసారి అణుదాడి ముప్పు ఉండబోతోందా అన్న ఆందోళన ప్రపంచాన్ని పటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఆయన జీవితం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం.రెండు విధ్వంసాలనుంచి (1916–2010) మృత్యువును జయించిన ధీశాలి సుటోము యమగుచి (Tsutomu Yamaguchi). ఈయన కథ నిజంగా అద్భుతం. జపాన్‌కు చెందిన ఒక ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి (1945) లో జరిగిన రెండు అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు. ఆగస్టు 6న హిరోషిమాలో బాంబు పేలుడుకు గురై గాయపడిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. సుటోము యమగుచి జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరమైనది. మరో విధంగా గొప్ప అదృష్టం. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, అమెరికా జపాన్‌పై ఆగస్టు 6, 1945న అణుబాండుదాడులు చేసింది. ఆగస్టు 6న మిత్సుబిషి కంపెనీ ఇంజనీర్‌గా యమగుచి తన విధినిర్వహణలో భాగంగా హిరోషిమాలో ఉన్నారు. సరిగ్గా ఆయన తిరిగి వెళ్ళే సమయానికి అమెరికా (హిరోషిమా)'లిటిల్ బాయ్' బాంబును ప్రయోగించింది. పేలుడు కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది, వినికిడి శక్తి దెబ్బతింది. వణుకుతూ, ఒక వైమానిక దాడి ఆశ్రయంలో ఆ భయంకర మైన రాత్రి గడిపాడు. అయినా ప్రాణాలతో బయటపడి, మరుసటి రోజే తన స్వస్థలమైన నాగసాకికి చేరుకున్నారు.ఆగస్టు 9న నాగసాకిలో తన కార్యాలయంలో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పైఅధికారికి వివరిస్తున్నారు.అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించాడు. ఒక్క బాంబు నగరాన్ని ఎలా నాశనం చేస్తుంది? అని ఆ అధికారి అడుగు తూండగానే, రెండో బాంబు 'ఫ్యాట్ మ్యాన్' నాగసాకిపై పడింది.రెండోసారి కూడా యమగుచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ రెండు అణుదాడుల్లో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అధికారికంగా గుర్తించబడిన ఏకైక వ్యక్తి ఆయనే. 2009లో జపాన్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా 'ద్విగుణ బాంబు బాధితుడిగా' (Double Hibakusha) గుర్తించింది. యుద్ధం తర్వాత ఆయన, జ్వరాలు, వాంతులు, రేడియేషన్ ప్రభా, అనారోగ్యంతో చాలా కాలం బాధపడ్డారు. కుడి చేయి శాశ్వతంగా దెబ్బతింది. అతను ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. కానీ ఆయన మనోధైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. కానీ బతికినంత కాలంలో రేడియేషన్ ప్రభావంతో బాధపడినప్పటికీ, ఆయన 93 ఏళ్లు జీవించారు. 2010లో, 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.జీవితంలో ఎక్కువ కాలం ఈ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఆయన, తన చివరి దశలో ప్రపంచానికి అణు ఆయుధాల ప్రమాదాన్ని వివరించాలని నిర్ణయించుకున్నారు. అణు ఆయుధాల ప్రభావానికి సజీవ సాక్ష్యం తాను అంటూ ప్రపంచ మానవాళిని హెచ్చరించారు. "నా కథను ప్రపంచానికి చెప్పడానికే నేను బతికున్నాను" అని ఆయన తరచూ అనేవారు. కాగా రెండు అత్యంత విధ్వంసకరమైన బాధల్ని అనుభవించి, దాన్నుంచి అంతే సాహసంగా బయటపడి, భవిష్యత్తుకోసం బలాన్ని కూడగట్టుకున్న ఒక సాధారణ ఇంజనీర్ కథ. యుద్ధం తెచ్చే విధ్వంసం అందులోనూ అణ్వాయుధాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో యమగుచి జీవితం కళ్లముందుంచింది. -
టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
జపాన్‌లోని టోక్యో నగరం నిషిఓజిమ(Nishiojima) వేదికగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తాజ్ - తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజలు, భారతీయ కమ్యూనిటీ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులందరూ అత్యంత భక్తితో ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాద వితరణ, సంప్రదాయబద్ధమైన భోజన ఏర్పాట్లు చేశారు. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ, మన పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ భోజన కార్యక్రమం సాగింది.టోక్యో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఒకచోట చేరి ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాజ్ (TAJ) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సుదూర తీరంలో ఉంటూ శ్రీరామనవమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన తాజ్ ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ) -
45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్
టోక్యో: జపాన్‌లో ఇటీవలి కొత్త ఆవిష్కరణ విశేషంగా నిలుస్తోంది. 1982 తర్వాత జపాన్‌లో గుర్తించిన మొట్ట మొదటి కొత్త పక్షి జాతిగా శాస్త్రవేత్తలు టోకారా లీఫ్ వార్బ్లర్ను గుర్తించారు దాదాపు 45 ఏళ్ల తర్వాత జపాన్‌లో గుర్తించిన మొదటి కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. పక్షుల శాస్త్రీయ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అంటూ కొత్త అతిథి రాకపై హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దామా...శాస్త్రవేత్తలు జపాన్‌లోని టోకారా దీవుల్లో 'టోకారా లీఫ్ వార్బ్లర్' (Phylloscopus tokaraensis) అనే కొత్త పక్షి జాతిని కనుగొన్నారు. డాక్టర్ కెంటా మోరిషిత నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఆధునిక సాంకేతికత (జన్యు పరిశోధన) అందుబాటులోకి రావడంతో ఎప్పుటినుంచో మన కళ్ల ముందే ఉన్నా గుర్తించ లేక పోయిన జీవులను ఇప్పుడు కనిపెట్టడం సాధ్యమవు తోందని నిపుణులు చెబుతున్నారు.టోకారా లీఫ్ వార్బ్లర్ (Tokara Leaf Warbler) విశేషాలుజన్యు అధ్యయనాలు దీనిని ఒక కొత్త జాతిగా నిర్ధారించాయి. ఈ పక్షి కేవలం మారుమూల టోకారా దీవులలో మాత్రమే, అక్కడి దట్టమైన అడవుల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది చూడటానికి 'ఇజిమాస్ లీఫ్ వార్బ్లర్' (Phylloscopus ijimae) అనే పక్షిని పోలి ఉంటుంది. ఇవి చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ పక్షి పొడవు సుమారు 10–12 సెంటీమీటర్లు, బరువు కేవలం 6–9 గ్రాములు మాత్రమే ఉంటుంది.జన్యు పరిశోధన ఒక గేమ్-ఛేంజర్సాధారణంగా, పక్షుల గుర్తింపు వాటి రూపాన్ని బట్టి ఉంటుంది. ఈ పక్షి చూడటానికి పాత జాతిలాగే ఉన్నప్పటికీ, DNA (జన్యు) సీక్వెన్సింగ్ అది పాడే పాట విధానం (Song patterns) ద్వారా ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పక్షుల జనాభా చాలా తక్కువగా ఉంది. అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పుల వల్ల వీటికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.జపాన్‌లోని ద్వీపాలు జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయని, జాగ్రత్తగా చేసే పరిశోధనలతో వాటిని కనుక్కోవచ్చు అనేది మనకు గుర్తు చేస్తుందని ఈ కొత్త పక్షి జాతి ఆవిష్కరణలో ప్రముఖ పరిశోధకులలో ఒకరైన డాక్టర్ కెంటా మోరిషితా అన్నారు. -
ప్రకృతి-మనిషి కలిసి చేసిన అద్భుతం
ఎండాకాలం మొదలవ్వగానే పర్యటనల పట్ల ఆసక్తి గలవారిలో వివిధ రకాల ఆలోచనలు మదిలో మెదలుతుంటాయి. ఈ సీజన్లో కొన్ని ప్రదేశాల ఉష్ణోగ్రతలు పెరిగి హాట్ హాట్‌గా ఉంటే..మరికొన్ని చల్లగా ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. కొండల మధ్య దోబూచులాడే మేఘాలు, సరస్సులపై తేలియాడే ప్రభాత వెలుగులు, వాటిని ఆనుకుని ఉండే పట్టణ వీధుల్లో నడక ప్రయాణం .. ప్రకృతి –మనిషి కలిసి చేసిన అద్భుతం కళ్ల ముందు నిలిచి, వేసవి ప్రయాణాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా మార్చేస్తాయి. అలాంటి వాటిలో ప్రపంచంలోనే పేరొందినవి స్విట్జర్లాండ్‌లో లేక్ టౌన్‌గా పిలిచే లూసెర్న్, ఐస్లాండ్లో రేక్యావిక్, కెనాడలోని బ్యాన్ఫ్, ఇండియాలో లేహ్, జపాన్‌లోని హాంకొనె. ఎందుకు ఇవి మాత్రమే అంతటి ప్రత్యేకతను నింపుకున్నాయో తెలుసుకుందాం. ఈ వేసవి ప్రయాణాన్ని అత్యద్భుతంగా మార్చుకుందాం..హిమాలయాల మధ్య..లేహ్ భారతదేశంలోని లడఖ్‌లో ఉన్న ఒక హిమాలయన్ ప్రాంతం. ఎండాకాలంలో ఇక్కడ లోయలు, కొండల మధ్య ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. హిమాలయాల్లోని మఠాలు, ప్రశాంత గ్రామాలు ఈ ప్రాంత జీవనశైలిని ప్రత్యేకంగా చూపిస్తాయి. ఉదయం సమయంలో పర్వతాలపై పడే వెలుగు వ్యాలీస్ను గోల్డెన్ రంగులో మార్చేస్తుంది. లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ లేక్ అనేది ప్రకృతి అద్భుతం.రాక్ సౌందర్యంబ్యాన్ఫ్ కెనడాలోని ఒక అందమైన హిల్ టౌన్. బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ మధ్యలో ఉన్న ఈ ప్రదేశం బ్లూ లేక్స్, పచ్చని అడవులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎండాకాలంలో కొండలపై పడే వెలుగు, లేక్స్‌లో కనిపించే ప్రతిబింబాలు ప్రయాణికులకు గుర్తుండి΄ోయే అనుభవాన్ని ఇస్తాయి. బాన్ఫ్లోని లేక్ లూసీ నీలి నీటితో ప్రసిద్ధి చెందింది.వెలుగు కథలురేక్యావిక్ ఐస్లాండ్ దేశ రాజధాని. ఎండాకాలంలో ఇక్కడ పగటి సమయం ఎక్కువగా ఉండటంతో నగరం మొత్తం వెలుగుతో నిండి΄ోతుంది. సముద్రం పక్కన ఉన్న ఈ నగరంలో రంగురంగుల ఇళ్లు, చిన్న చిన్న, సన్నని స్ట్రీట్స్, ప్రశాంతమైన కేఫ్స్ కనిపిస్తాయి. ఉదయం వెలుగు సముద్రంపై పడితే నగరం మొత్తం మృదువైన కాంతితో మెరుస్తుంది.ఆల్ఫ్స్ మధ్య లేక్ టౌన్లూసెర్న్ అనే నగరం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక అందమైన లేక్ టౌన్. స్విస్ ఆల్ఫ్స్ కొండల మధ్య విస్తరించిన లూసెర్న్ సమ్మర్లో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు పక్కన నడిచేందుకు సన్నని వీధులు, పాత వుడెన్ బ్రిడ్జ్‌లు ఈ నగరానికి ప్రత్యేక వాతావరణాన్ని ఇస్తాయి. ఉదయ సమయంలో సరస్సు పై పడే సూర్య కిరణాలు నీటిపై బంగారు కాంతిని వెదజల్లుతుంటాయి. కొండల నీడలు, మేఘాల ప్రతిబింబాలు కలిసి ఒక పెయింటింగ్‌లా కనిపిస్తాయి. లూసెర్న్లోని చాపెల్ బ్రిడ్జి నగర చరిత్రను మన ముందు ఆవిష్కరింప జేస్తుంది.సమ్మర్ ట్రావెల్ అనుభవంప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం చూడటం మాత్రమే కాదు. ప్రకృతి రిథమ్‌ను అనుభవించడం కూడా. కొండల మధ్య మేఘాల ప్రయాణం, లేక్స్‌పై పడే వెలుగు, గ్రామాల ప్రశాంత జీవనంం ఇవన్నీ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవంగా మార్చేస్తాయి.ఫుజీ కొండల దృశ్యాలుహాంకొనే జపాన్‌లోని ఒక నేచురల్ డెస్టినేషన్. అడవులు, సరస్సులు, కొండల మధ్య ప్రయాణించే రోడ్లు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. దూరంలో కనిపించే మౌంట్ ఫూజీ దృశ్యం ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. హంకొనేలోని లేక్ ఆషీ పక్కన ఫుజీ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు (చదవండి: ఇండియాలోనే స్విట్జర్లాండ్) -
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
టోక్యో: ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు (Naval Mines) జపాన్‌కు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటిని తొలగించేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుజపాన్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, జపాన్ తన అత్యవసర నిల్వల నుంచి చమురును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యగా మారింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, 2015లో తీసుకువచ్చిన భద్రతా చట్టాల ప్రకారం.. దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే లేదా సన్నిహిత భాగస్వామ్య దేశాల భద్రత దెబ్బతింటే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది. ఫుజి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఒత్తిడి ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జలసంధిని పునరుద్ధరించేందుకు మిత్రదేశాల సహకారం అవసరమని ట్రంప్ కోరారు. మరోవైపు జపాన్ నౌకల రాకపోకల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసి, పరిస్థితులు శాంతించిన తర్వాతే మైన్లను తొలగించే ఆపరేషన్‌పై జపాన్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు! -
వసంత పుష్పవిలాసం
చలికాలం గాఢనిద్ర వీడి, వసంతంలోకి నెమ్మదిగా అడుగుపెడుతున్న వేళ.. జపాన్ వీథులన్నీ గులాబి రంగుతో మెరిసిపోతూ అందాల పందిళ్ళలా కనువిందు చేస్తాయి. ఇప్పటి వరకు మంచు ముసుగులో నిశ్శబ్దంగా ఉన్న కొమ్మలన్నీ చెర్రీ పూల విరబూతతో కళకళలాడుతాయి. నింగి నుంచి గులాబి మబ్బులు నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా ఈ పూలు సందర్శకులను ఒక మాయలోకంలోకి తీసుకువెళతాయి. గాలికి రాలిపడే పూల రేకులు దారి పొడవునా మెత్తని తివాచీలా మారి నడిచే ప్రతి అడుగును మధుర స్వప్నంలా మారుస్తాయి. చెర్రీ బ్లోసమ్ ప్రకృతి పలకరింపు మాత్రమే కాదు. తరతరాల సంప్రదాయాన్ని, నేటి ఆధునిక జీవన వేగాన్ని ఏకం చేసే భావోద్వేగాల వేడుక.ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ చెర్రీ బ్లోసమ్ పండుగ జరుగుతుంది. ఈ కాలంలో గులాబి రంగు చెర్రీపూలను చూస్తూ జపనీయులు ఆనందిస్తారు. దీన్ని ‘హనామి’ అని పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ, జపనీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరుబయట చెర్రీ చెట్ల నీడలో వనభోజనాలు చేస్తారు. ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి పూలు వికసిస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి పూట కనువిందు చేసే లేత గులాబీ వర్ణపు సొగసులు, రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ‘యోజాకురా’ అంటారు.ఈ పూల సందడితో టోక్యోలోని యునో పార్క్, క్యోటోలోని ఫిలాసఫర్స్ పాత్, ఒసాకా కోట పరిసరాలు గులాబీ రంగులో కళకళలాడతాయి. చెర్రీ పూలు వికసించిన వారం పది రోజుల్లోనే రాలిపోతాయి. వికసించిన కొద్దిరోజుల్లోనే రాలిపోయే ఈ పూలు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. జీవితం చిన్నది. ఉన్నంతలో పరిమళించాలి, ప్రతి క్షణాన్నీ ప్రేమగా ఆస్వాదించాలి అనే జీవన సందేశాన్ని అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఈ సీజన్ ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది పర్యాటకులతో జపాన్ లోని ఊరూరా వీథులు కళకళలాడతాయి. ఈ సమయంలో సంప్రదాయ వాయిద్యాలైన కోటో, వెదురు వేణువులతో కళాకారులు సంగీత ప్రదర్శనలిస్తారు. గాలికి ఊగిసలాడే పూల మధ్యలో వేణుగానం పర్యాటకులను పరవశింపజేస్తుంది. స్థానిక కళాకారుల చేతి వృత్తుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పండగ సమయంలో చెర్రీ పూల పరిమళంతో తయారు చేసే మొచి, టీ, స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంహిత నిమ్మన


