జపాన్‌ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? | Anand Mahindra Tweet About India Crosses Japan to Become 4th Largest Economy | Sakshi
Sakshi News home page

జపాన్‌ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

May 26 2025 8:08 PM | Updated on May 26 2025 8:38 PM

Anand Mahindra Tweet About India Crosses Japan to Become 4th Largest Economy

జపాన్‌ను అధిగమించి.. భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మనం ఇప్పుడే సంతృప్తి చెందకూడదని అన్నారు.

నేను బిజినెస్ స్కూల్‌లో ఉన్నప్పుడు.. భారతదేశం జపాన్‌ను జీడీపీలో అధిగమించాలనే ఆలోచన కూడా.. చాలా కష్టతరమైందని అనిపించింది. కానీ నేడు ఆ మైలురాయిని దాటేశాము. మనం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాము. ఇది చిన్న విజయం కాదని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

జపాన్ చాలా కాలంగా ఆర్థికంగా చాలా ముందుంది. ఉత్పాదకతలోనూ.. స్థితిస్థాపకతలోనూ దూసుకెళ్తోంది. అలంటి దేశాన్ని వెనక్కి నెట్టాము అంటే.. అది అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. లక్షలాది మంది భారతీయుల ఆశయమది అని అన్నారు.

ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి

మనం ఇప్పుడు అసంతృప్తిగా ఉండాలి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు జర్మనీని అధిగమించాల్సి ఉంది. మనం అభివృద్ధి చెందుతూ ఉండాలంటే.. భారతదేశానికి స్థిరమైన ఆర్థిక సంస్కరణలు అవసరం. పాలన, మౌలిక సదుపాయాలు, తయారీ, విద్య వంటివన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందాలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement