
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా బిట్‌కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేస్తుందో వివరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిట్‌కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేసిందో నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా సులభం. అయితే ప్రతి ఒక్కరూ ఎందుకు బిట్‌కాయిన్ కొనుగోలుచేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరో రెండేళ్లలో 0.01 బిట్‌కాయిన్ కూడా చాలా అమూల్యమైందిగా మారుతుందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
బిట్‌కాయిన్ విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులుగా మారడానికి, ఆర్థికంగా స్వేచ్ఛను పొందటానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోండి.. అని కియోసాకి అన్నారు. బిట్‌కాయిన్ విలువ మాదిరిగానే.. బంగారం విలువ కూడా భారీగా పెరుగుతుందని చాలా రోజుల నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు.
ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
బిట్‌కాయిన్
ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 0.57 శాతం పెరిగి రూ.93.38 లక్షలకు చేరింది. పెరుగుతోంది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని విలువ మరింత పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు.
I cannot believe how easy Bitcoin has made getting rich…so easy.
Why everyone is not buying and holding Bitcoin is beyond me.
Even .01 of a Bitcoin is going to be priceless in two years…. and maybe make you very rich.
Sure Bitcoin goes up and down….but so does real life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 26, 2025