
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్‌సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్‌లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
84 రోజుల ప్లాన్
జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో దేశం అంతటా ఏ నెట్వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.
365 రోజుల ప్లాన్
జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.