ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు | Fiscal Deficit Reaches Rs 9 8 Lakh Crore by January End | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:51 AM

Fiscal Deficit Reaches Rs 9 8 Lakh Crore by January End

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్‌ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం.  

2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్‌ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది.

Advertisement
 
Advertisement
Advertisement