తొలి 9 నెలల్లో ఎఫ్‌డీఐలు జూమ్‌ | India FDI rises 18percent, US investments nearly double | Sakshi
Sakshi News home page

తొలి 9 నెలల్లో ఎఫ్‌డీఐలు జూమ్‌

Mar 1 2026 5:02 AM | Updated on Mar 1 2026 5:02 AM

India FDI rises 18percent, US investments nearly double

ఏప్రిల్‌–డిసెంబర్‌లో 47.87 బిలియన్‌ డాలర్లు 

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 9 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 18 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్‌–డిసెంబర్‌లో 47.87 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వీటిలో యూఎస్‌ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్‌ డాలర్లను తాకాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఇదే కాలంలో ఇవి 40.67 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో ఎఫ్‌డీఐలు 17 శాతం పుంజుకుని12.69 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

కాగా.. తొలి 9 నెలల్లో ఈక్విటీ పెట్టుబడులు, ఇతర మూలధనం, రిటర్నులను తిరిగి ఇన్వెస్ట్‌చేయడం తదితరాలు 17 శాతంపైగా బలపడి 73.31 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 62.48 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో యూఎస్‌ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది 9 నెలల్లో ఇవి 3.73 బిలియన్‌ డాలర్లు మాత్రమే. సింగపూర్‌ 17.65 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి ర్యాంకులలో యూఎస్‌(4.83 బి.డా), మారిషస్‌(4.83 బి.డా), జపాన్‌(3.2 బి.డా), యూఏఈ(2.45 బి.డా), నెదర్లాండ్స్‌(2.29 బి.డా), కేమన్‌ ఐలాండ్స్‌(1.97 బి.డా), సైప్రస్‌(1.4 బి.డా) నిలిచాయి.  

Advertisement
 
Advertisement
Advertisement