టెహ్రాన్‌పై భారీ దాడులు : ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అమీర్ హతామి మృతి? | Unconfirmed Reports Claim Death Of Iranian Army Chief Amir Hatami | Sakshi
Sakshi News home page

టెహ్రాన్‌పై భారీ దాడులు : ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అమీర్ హతామి మృతి?

Feb 28 2026 4:39 PM | Updated on Feb 28 2026 5:02 PM

Unconfirmed Reports Claim Death Of Iranian Army Chief Amir Hatami

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్  భీకర దాడులు  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు  రాజేశాయి.  ఈ దాడుల్లో భాగంగా టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో అమీర్ హతామి మరణించారని ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామి మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియ నివేదించింది, అయితే టెహ్రాన్‌లోని అధికారులు మరణాన్ని ధృవీకరించ లేదు.

ఇరాన్ రాజధానిలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా ఫిబ్రవరి 28న దాడులు చేసింది. దీంతో టెహ్రాన్ అంతటా పేలుళ్లతో అట్టుడికింది దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయి. మరోవైపు ఈ దాడులపై బాలిస్టిక్‌ మిస్సైళ్ల దాడులతో ఇరాన్‌ ఎదురు దాడికి దిగింది.  ఈ దాడుల పరిమాణం చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ హెచ్చిరించింది. ఇందులో భాగంగానే అమెరికా నేవీ స్థావరాలను టార్గెట్‌ చేసింది. గల్ఫ్‌లోని బహ్రెయిన్‌ తదితర అమెరికా స్థావరాలను లక్ష్యంగా  దాడులను ముమ్మరం చేసింది. దీంతో పాటు యుఎఇలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌లలో పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇరాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ అమీర్ హతామి చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. 

మేజర్ జనరల్ హోదాలో ఉన్న హతామి, మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి పదోన్నతి పొందిన తర్వాత గత ఏడాది జూన్ 14 నుండి ఈ పదవిలో పనిచేస్తున్నారు. జూన్ 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో మొహమ్మద్ బాఘేరి హత్య తర్వాత కమాండర్-ఇన్-చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు.  

ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం

Advertisement
 
Advertisement
Advertisement