Isreal War
-
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
పవిత్ర జెరూసలేంపై క్షిపణి దాడులు: వారి మౌనంపై తీవ్ర చర్చ
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో పవిత్ర వారంలో (Holy Week) పాస్ ఓవర్ (Passover) వేడుకల సమయంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నగరంపై దాడులు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఈ దాడులను ధృవీకరించింది.జెరూసలేం ఆకాశంలో క్షిపణి దాడులుమంగళవారం ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగంపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. జెరూసలేం అంతటా సైరన్లు మోగాయి. వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. దీంతో జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ (Temple Mount) అల్-అక్సా మసీదు (Al-Aqsa Mosque) వంటి పవిత్ర ప్రదేశాలపై క్షిపణి దాడి దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అయితే పైన 'ఐరన్ డోమ్' , 'ఆరో' (Arrow) రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకున్నాయి. ఒకవేళ ఇవి నేరుగా తగిలి ఉంటే కోలుకోలేని నష్టం వాటిల్లేది. మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాతలు టకర్ కార్ల్సన్ (Tucker Carlson) ,క్యాండేస్ ఓవెన్స్ (Candace Owens) ఈ విషయంలో ఇరాన్‌ను గట్టిగా ఖండించకపోవడమే కాకుండా, విభిన్నమైన, వివాదాస్పదమైన వాదనలు వినిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జెరూసలేం క్రైస్తవులకు, యూదులకు అత్యంత పవిత్రమైనది. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యాతలు ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇరాన్ దాడులను వారు ఖండించకపోవడం వారి మద్దతుదారుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది."అమెరికా ఫస్ట్" (అంటే అమెరికా ఇతర దేశాల యుద్ధాల్లో పక్షం వహించకూడదు) అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నవాళ్లలో వీరు ముఖ్యులు. ఈ క్రమంలో ఇరాన్ దురాక్రమణను నేరుగా ఖండించడం కంటే, అమెరికా ఈ గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రస్తుతం అమెరికాలోని రైట్ వింగ్‌లో ఒక పెద్ద చీలిక కనిపిస్తోంది. ఒక వర్గం ఇజ్రాయెల్‌ను పవిత్ర భూమిగా భావించి బేషరతుగా మద్దతు ఇస్తుంటే,కార్ల్సన్ , ఓవెన్స్ వంటి వారు ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చే ఆర్థిక, సైనిక మద్దతును ప్రశ్నిస్తున్నారు. అయితే జెరూసలేం వంటి పవిత్ర నగరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వీరు ఇరాన్‌ను ఖండించకపోవడం వెనుక వారి "ఐసోలేషనిజం" (Isolationism - అంటే ఇతర దేశాల గొడవల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదనే సిద్ధాంతం). ఇటీవల వారు అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాడులు, ప్రతిదాడులతో యావత్ ప్రపంచం దద్దరిల్లుతోంది. పవిత్ర భూమిపై భీకర దాడులు, యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అంతర్జాతీయ వేదికలపై దీనిపై జరుగుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్
ఇరాన్ యుద్ధంలోకి హౌతీల రాకతో అమెరికా, ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నాయి. -
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు
పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. -
తమ షరతులు అంగీకరిస్తే కాల్పుల విరమణ: ఇరాన్
-
‘ఇరాన్‌పై యుద్ధం నీవల్లే.. పీట్పై ట్రంప్ చిందులు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని పట్టుబడుతున్న ట్రంప్.. ఇరాన్‌పై యుద్ధం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా..ఇరాన్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన తనది కాదని, అది అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ అంటూ ఆయనపై చిందులు తొక్కాడు. దీంతో ఇరాన్‌పై యుద్ధంలో ట్రంప్ అల్లుతున్న మరో కట్టుకథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల పేరుతో ఇరాన్‌పై యుద్ధానికి దిగిన ట్రంప్‌పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధం అపవాదు నుంచి భయటపడేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా, అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ట్రంప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌కు ఇరాన్‌పై యుద్ధం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ట్రంప్ తనదైన స్టైల్లో.. ఇరాన్‌పై యుద్ధం చేయాలన్న ఆలోచన మా డిఫెన్స్ సెకట్రరీ పీట్ది. ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాన్ని ఆపాలని పిలుపునిచ్చింది ఆయనేనంటూ పక్కనే కూర్చున్న పీట్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నేను పీట్‌కు ఫోన్ చేశాను. నేను జనరల్ కేన్‌కు ఫోన్ చేశాను. గొప్పగొప్ప వ్యక్తులకు ఫోన్ చేశాను. మనకు పశ్చిమాయాలో ఓ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే పశ్చిమాసియాలో ప్రయాణం చేసి ఆ పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా దాడి ఎందుకు చేస్తోంది?. యుద్ధం వెనుకున్నది ఎవరు? ఇలా అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతున్న.. ట్రంప్ అల్లిన మరోకట్టు కథ అల్లినట్లైంది. ఇరాన్‌తో మనం యుద్ధం ఎందుకు చేస్తున్నాం? అని ట్రంప్ యంత్రాంగంలో ఓ ఇద్దరిని అడిగినా సమాధానం ఉండదు. ఎందుకంటే యుద్ధం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ ఇరాన్‌తో యుద్ధం చేయాడానికి గల కారణాలు అమెరికా వద్ద అనేకం ఉన్నాయి. వాటిల్లో ఇజ్రాయెల్ ఎలాగూ దాడి చేయబోతోందని, అందువల్ల అమెరికా జోక్యం అనివార్యమైందని ట్రంప్ ప్రభుత్వంలోని ప్రముఖులు అంటుంటే.. మరికొందరు తమ దేశంపై ఇరాన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుందని ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో ఇప్పుడు పీట్ హెగ్సెత్ను ట్రంప్ బలి పశువును చేయడంపై అమెరికన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్‌కు భారీ షాక్ : రెండు రోజుల్లో ముగ్గురు
గత 19 రోజులుగా భీకరంగా సాగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇరాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. తాజా దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రిఇ స్మాయిల్ ఖతీబ్ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.అదనపు అనుమతులు తీసుకోకుండా, ఏఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా చంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కాట్జ్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఇరాన్ ముగ్గురు కీలక వ్యక్తులను కోల్పోయింది. మంగళవారం ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్వచ్ఛంద బసిజ్ దళాధిపతి ఘోలమ్రెజా సోలేమానీని హత మార్చింది. ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుకాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన స్థానంలో, ఆయన కుమారుడు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ అత్యున్నత లీడర్‌గా ఎంపికయ్యారు. మరోవైపు ఈ దాడిలో మోజ్తబా కూడా తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. (బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!) -
టార్గెట్ తప్పలేదు.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం
మరింత భీకరంగా పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు బుధవారం నాటికి 19వ రోజుకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకు తాజా పరిణామాలు ఈ ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితులు పశ్చిమాసియా దేశాల భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి -
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం 14వ రోజుకు చేరింది. పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ, రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. -
దుబాయ్‌లో భారతీయులకు భారీ ఊరట
అబుదాబి:అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలతో కలిసి స్వదేశానికి చేరలేక, బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో దుబాయ్‌లోని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త యోగేష్ దోషి ముందుకు వచ్చారు. ఆయన తన 64 అపార్ట్మెంట్ల భవనాన్ని భారతీయులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. భారతీయులకు వసతి, భోజనం, కనీస అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేశారు. హోటళ్లలో ధరలు అమాంతం పెరిగిన ఈ సమయంలో, దోషి కల్పిస్తున్న సౌకర్యాలు భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లైంది. దుబాయ్‌లో చిక్కుకున్న 125 మంది భారతీయులకు ఇప్పటికే ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయంతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు తమకు సమాచారం అందించాలని రాయబార కార్యాలయం కోరింది.దుబాయ్‌కు సమీపంలోని అజ్మాన్‌లో కూడా భారతీయులకు ఆశ్రయం లభిస్తోంది. యుఎఇ వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక వసతిగా మార్చి, ఉచిత నివాసం, భోజనం అందిస్తున్నారు. హోటళ్లలో స్థలం లేక, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను ఆయన తన కార్లతో భారతీయుల్ని తరలిస్తున్నారు. అందులో ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో తీసుకువచ్చి ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం కల్పించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు జరిపి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తల మానవతా చర్యలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. -
బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..
-
కువైట్ తీరంలో పేలిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్.. అమెరికా పనేనా
కువైట్ సిటీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధంలో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. కువైట్ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఓ పెద్ద ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో సముద్రంలో భారీగా చమురు లీక్ అవుతూ, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిందని యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) ఈ సంఘటనను ధృవీకరించింది. ఆ ట్యాంకర్‌ను పేల్చింది అమెరికానేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కువైట్ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్ ఇరాన్‌కు చెందినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తర్వాత మంటలు చెలరేగి, సముద్రంలో చమురు వ్యాపించడంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. కువైట్, యుఎఇ, శ్రీలంక తీరప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం, ఇరాన్ మిలిటరీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుడు ఆ యుద్ధానికి సంబంధించి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూఏఈ, కువైట్ అధికారులు అత్యవసర చర్యలు ప్రారంభించారు. సముద్రంలో చమురు వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ఈ లీక్ వల్ల సముద్ర జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇరాన్ మిలిటరీ ఈ పేలుడులో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. అయితే, యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. UKMTO WARNING INCIDENT 014-026 Click here to view the full warning ⤵️ https://t.co/ygKSBOCLZi#MaritimeSecurity #MarSec pic.twitter.com/RPZXtz6RU7— UKMTO Operations Centre (@UK_MTO) March 5, 2026 -
హిజ్బుల్లాకు భారీ షాక్ : ఇంటిలిజెన్స్ చీఫ్ ఖతం
లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడిలో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ (Intelligence)చీఫ్ హుస్సేన్ మక్లెడ్ మరణించాడు. హిజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా జరిపిన రాత్రంతా తాము జరిపిన భీకర దాడుల్లో హుస్సేన్ మక్లెడ్ (Hussein Makled) మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) అధికారికంగా ధృవీకరించింది.ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య, ఉత్తర భాగంలో తీవ్రమవుతున్న పోరాటం నేపథ్యంలో రక్షణ దళాలు హిజ్బుల్లా సీనియర్ కమాండ్‌ను మట్టుబెట్టం కీలంగా మారింది. ప్రకటించాయి. బీరూట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. హిజ్బుల్లాతో సంబంధం ఉన్న సైనిక మౌలిక సదుపాయాలపై రాబోయే దాడులకు ముందు టైర్, మష్ఘరా, డీర్ కానౌన్ అల్-నహర్లోని నివాసితులను లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల నుండి కనీసం 300 మీటర్ల దూరం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరించాయి.ఇదీ చదవండి: భీకర దాడుల వేళ, దుబాయ్ సంచలన నిర్ణయంరాత్రిపూట ఇజ్రాయెల్‌పై దాడి చేసినందుకు హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని DF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగానే బీరుట్లో సహా లెబనాన్‌లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా లక్ష్యాలను IDF ధ్వంసం చేసింది. గత కొంతకాలంగా ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్ మరణం హిజ్బుల్లాకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. హుస్సేన్ మక్లెడ్ హిజ్బుల్లా నిఘా విభాగానికి కీలక బాధ్యత వహిస్తూ, ఆ సంస్థ గూఢచారి వ్యవస్థను నడిపించేవాడు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్ -
న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్
US-Iran War పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ మరియానో గ్రాస్సీ (Rafael Mariano Grossi) కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు జరిగితే, ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉందని, ఆ అవకాశాన్ని తాము తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ సరిహద్దు దేశాలలో సాధారణ నేపథ్య స్థాయిలకంటే రేడియేషన్ స్థాయిలు పెరగనప్పటికి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ప్రధాన నగరాల కంటే పెద్దవిగా లేదా పెద్దవిగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరంతో సహా తీవ్రమైన పరిణామాలతో కూడిన రేడియోలాజికల్ విడుదల ప్రమాదం ఉందన్నారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండాలంటే గరిష్ట సంయమనం పాటించాలి. తిరిగి దౌత్య చర్చలు జరగాలని కోరారు. (భీకర దాడుల వేళ, దుబాయ్ సంచలన నిర్ణయం)అణు ప్రమాదం లేకపోలేదు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై ప్రభావం పడిందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి అణుశక్తి విభాగం చీఫ్ రాఫెల్ గ్రోసీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం, ఇరాన్‌లోని ఏ అణు కేంద్రం కూడా దెబ్బతినలేదు" అని పునరుద్ఘాటించారు. ఒకవేళ అణు వికిరణం (Radiation) సంభవిస్తే, అది అత్యంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని గ్రోసీ హెచ్చరించారు. దీనివల్ల పెద్ద నగరాలు, పెద్ద ప్రాంతాల నుండి ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ అణు నియంత్రణ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ వారి నుండి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని గ్రోసీ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ అనివార్య మైన కమ్యూనికేషన్ ఛానెల్‌ను పునరుద్ధరించగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ముఖ్యంగా బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ లేదా ఇతర అణు ఇంధన చక్ర సౌకర్యాలు దెబ్బతిన్నట్లు తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేడియోధార్మిక విడుదల జరిగే అవకాశాన్నికొట్టిపారేయలేం, తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా గ్రోసీ హెచ్చరించారు.ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది! -
టెహ్రాన్‌పై భారీ దాడులు : ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి మృతి?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు రాజేశాయి. ఈ దాడుల్లో భాగంగా టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో అమీర్ హతామి మరణించారని ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామి మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియ నివేదించింది, అయితే టెహ్రాన్‌లోని అధికారులు మరణాన్ని ధృవీకరించ లేదు.ఇరాన్ రాజధానిలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా ఫిబ్రవరి 28న దాడులు చేసింది. దీంతో టెహ్రాన్ అంతటా పేలుళ్లతో అట్టుడికింది దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయి. మరోవైపు ఈ దాడులపై బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులతో ఇరాన్ ఎదురు దాడికి దిగింది. ఈ దాడుల పరిమాణం చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చిరించింది. ఇందులో భాగంగానే అమెరికా నేవీ స్థావరాలను టార్గెట్ చేసింది. గల్ఫ్‌లోని బహ్రెయిన్ తదితర అమెరికా స్థావరాలను లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. దీంతో పాటు యుఎఇలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌లలో పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇరాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ అమీర్ హతామి చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. మేజర్ జనరల్ హోదాలో ఉన్న హతామి, మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి పదోన్నతి పొందిన తర్వాత గత ఏడాది జూన్ 14 నుండి ఈ పదవిలో పనిచేస్తున్నారు. జూన్ 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో మొహమ్మద్ బాఘేరి హత్య తర్వాత కమాండర్-ఇన్-చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం


