‘ఇరాన్‌పై యుద్ధం నీవల్లే.. పీట్‌పై ట్రంప్‌ చిందులు! | Trump shifts Iran war blame to Pete Hegseth | Sakshi
Sakshi News home page

‘ఇరాన్‌పై యుద్ధం నీవల్లే.. పీట్‌పై ట్రంప్‌ చిందులు!

Mar 24 2026 10:41 AM | Updated on Mar 24 2026 11:14 AM

Trump shifts Iran war blame to Pete Hegseth

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పినందుకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న ట్రంప్‌.. ఇరాన్‌పై యుద్ధం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా..ఇరాన్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన తనది కాదని, అది అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్‌ సెక్రటరీ)గా పీట్‌ హెగ్సెత్‌ అంటూ ఆయనపై చిందులు తొక్కాడు. దీంతో ఇరాన్‌పై యుద్ధంలో ట్రంప్‌ అల్లుతున్న మరో కట్టుకథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చర్చల పేరుతో ఇరాన్‌పై యుద్ధానికి దిగిన ట్రంప్‌పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధం అపవాదు నుంచి భయటపడేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. తాజాగా, అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ట్రంప్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌కు ఇరాన్‌పై యుద్ధం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

 అందుకు ట్రంప్‌ తనదైన స్టైల్లో.. ఇరాన్‌పై యుద్ధం చేయాలన్న ఆలోచన మా డిఫెన్స్‌ సెకట్రరీ పీట్‌ది. ఇరాన్‌ చేస్తున్న అణు కార్యక్రమాన్ని ఆపాలని  పిలుపునిచ్చింది ఆయనేనంటూ పక్కనే కూర్చున్న పీట్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నేను పీట్‌కు ఫోన్ చేశాను. నేను జనరల్ కేన్‌కు ఫోన్ చేశాను. గొప్పగొప్ప వ్యక్తులకు ఫోన్‌ చేశాను. మనకు పశ్చిమాయాలో  ఓ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే పశ్చిమాసియాలో ప్రయాణం చేసి ఆ పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా దాడి ఎందుకు చేస్తోంది?. యుద్ధం వెనుకున్నది ఎవరు? ఇలా అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతున్న.. ట్రంప్ అల్లిన మరోకట్టు కథ అల్లినట్లైంది. 

ఇరాన్‌తో మనం యుద్ధం ఎందుకు చేస్తున్నాం? అని ట్రంప్‌ యంత్రాంగంలో ఓ ఇద్దరిని అడిగినా సమాధానం ఉండదు. ఎందుకంటే యుద్ధం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.  ఇప్పటికీ ఇరాన్‌తో యుద్ధం చేయాడానికి గల కారణాలు అమెరికా వద్ద అనేకం ఉన్నాయి. వాటిల్లో ఇజ్రాయెల్ ఎలాగూ దాడి చేయబోతోందని, అందువల్ల అమెరికా జోక్యం అనివార్యమైందని ట్రంప్ ప్రభుత్వంలోని ప్రముఖులు అంటుంటే.. మరికొందరు తమ దేశంపై ఇరాన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుందని ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో ఇప్పుడు పీట్‌ హెగ్సెత్‌ను ట్రంప్‌ బలి పశువును చేయడంపై అమెరికన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement