విజయవాడ : వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారిన నగరం ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా చల్లపడింది.
అప్పటి వరకూ బయటకు రావడానికి సాహసించని నగర ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు.
ఆదివారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలకు ఊరట కలిగింది. అయితే ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. కస్తూరిభాయిపేటలో విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.


