మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా రాయ్‌గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.


