breaking news
Reality
-
బెంగళూరులో అద్దె ‘మంట’
సహజ వనరులైన గాలి, వెలుతురును కూడా వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్న నగర అద్దె పోకడలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే, దొరికిన ఇంటికి అద్దె కట్టడమే పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో నివాస గృహాల అద్దెలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ ఉద్యోగుల రాకతో ఇప్పటికే డిమాండ్ పెరిగిపోగా తాజాగా ఒక ఇంటి యజమాని పెట్టిన వింత నిబంధన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గదుల్లో మెరుగ్గా సూర్యరశ్మి (సన్‌లైట్) వస్తుందనే కారణంతో ఒక ఫ్లాట్‌కు రూ.80,000 అద్దె అడగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.అసలేం జరిగింది?నగరంలో నివాసం కోసం ఇల్లు వెతుకుతున్న అను అనే మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బెంగళూరు అద్దెలు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని, కానీ ఈసారి ఎదురైన అనుభవం షాకింగ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు.‘ఒక గదిలోకి సహజమైన సూర్యరశ్మి వస్తుందనే కారణంతో దానికి రూ.80,000 అద్దె అడిగారు. కనీస సౌకర్యంగా ఉండాల్సిన సూర్యకాంతి ఇప్పుడు ప్రీమియం ఫీచర్‌గా మారిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.Bangalore Rent would never stop surprising me. What do you mean “ma’am is room me sunlight bhi aati hai to iska rent ₹80,000 hai” 😭— Anu (@Escapeplace__) February 13, 2026సోషల్ మీడియా స్పందనఅను చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు బెంగళూరు అద్దె మార్కెట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నెలకు రూ.80 వేల అద్దె కట్టడం కంటే ఆ డబ్బుతో హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం’ అని ఒక వినియోగదారుడు సలహా ఇచ్చారు. ‘బెంగళూరు అద్దెలు చూస్తుంటే ముంబై రియల్ ఎస్టేట్ ధరలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వస్తుందని మరో రూ.20 వేలు అదనంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకింత ధర?గత రెండేళ్లుగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో అద్దెలు 30% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికిగల కొన్ని కారణాలు.. ఆఫీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో టెక్కీల తాకిడి పెరిగింది. విదేశీ కంపెనీల ప్రతినిధులు, హై-నెట్ వర్త్ వ్యక్తులు అధిక ధరలకు వెనకాడకపోవడంతో యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్‌లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్‌ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్‌కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్‌లెస్ స్టీల్‌తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్‌లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. -
సిటీ శివారులో రియల్ ఎస్టేట్ డిమాండ్!
వీకెండ్ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్‌ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్ హోమ్స్ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్‌లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఎవరు కొంటున్నారంటే.. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.అద్దెకు కూడా.. వీకెండ్ హోమ్స్ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.ఈ ప్రాంతాలలో డిమాండ్.. నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్పల్లి, జహీరాబాద్ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్ హోమ్స్‌ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. -
కోకాపేటలో కొత్త రియల్ఎస్టేట్ ట్రెండ్..
విలాసవంతమైన గృహ విభాగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గృహ కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సంస్థలు ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవసీ, భద్రత, గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచి్చన బిల్డర్లు.. ఇప్పుడు కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. లగ్జరీ ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసుల నుంచి ఈ తరహా ఇళ్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో ఇటువంటి ఫైవ్ స్టార్ హోమ్స్ వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్ వాడటంతో అర్థమే మారిపోయింది. కొందరు మాత్రమే ఈ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండటంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీకి పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదు నక్షత్రాల రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు నివాసం ఉండేవారికి స్టార్ హోటల్ మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి.హోటల్స్, ఫ్యాషన్ డిజైనర్లతో ఒప్పందం ఇంటర్ కాంటినెంటల్, మారియట్, తాజ్, రిడ్జ్, కార్ల్టన్, లీలా వంటి స్టార్ హోటల్ బ్రాండ్స్, అబూజానీ, సందీప్ ఖోస్లా వంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం చేసుకొని గృహ నిర్మాణాలను చేపడుతున్నాయి. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. నివాసితులకు అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని అందించడమే ఈ గృహాల ప్రత్యేకత.హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కరోనా నుంచి నగరంలో హైఎండ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి నేటి యువ గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు, ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఇళ్ల కొనుగోలుదారులు సెకండ్ లేదా థర్డ్ హోమ్ బయ్యర్లు ఉంటారు. ఇందులో నివాసం ఉండటం స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. హైటెక్ సిటీ, గచి్చ»ౌలి, రాయదుర్గం, నియోపొలిస్, నానక్‌రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్, మదీనాగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. వీటి విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభవుతుంది. ధర రూ.6 కోట్ల నుంచి ఉంటుంది.వీటి ప్రత్యేకతలివే.. స్టార్ హోమ్స్ అంటే హోటల్ ఆధారిత ప్రాజెక్ట్‌లు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే నిర్వహిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేకంగా యాప్ ఉంటుంది. ఇందులో నుంచి ఫుడ్, స్పా, సెలూన్ వంటివి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. అలాగే వీటిల్లో సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, బ్యూటీఫుల్ వ్యూ, స్కై లాంజ్, స్పా, మినీ థియేటర్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.ప్రైవసీ, భద్రత..ప్రైవసీ, భద్రత ఈ ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత. వెంటిలేషన్, ఓపెన్ స్పేస్, వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఈ డిజైనర్ హోమ్స్‌లో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. -
ఇల్లు.. పిల్లలకు నచ్చేలా..
కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతూహలం వంటి లక్షణాలన్నీ చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఇనుమడిస్తాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. చిల్డ్రన్ స్పెషల్ రూమ్‌లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్ బాగుండటంతో ఇంటీరియర్ డెకరేటర్స్ సలహాలు తీసుకుంటున్నారు. సరైన ప్రణాళికను అనుసరిస్తే భేషుగ్గా మీరే మీ పిల్లల గదిని తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచి, వయస్సు.. పిల్లల రూమ్ ఇలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. వారి ఆసక్తి, అభిరుచి, వయస్సు, జెండర్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో అందరు పిల్లలకు ఉండే ఉత్సాహానికి ఊతమిచ్చేలా కొంచెం సృజనాత్మకత, ఆడంబరాన్ని జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే..రంగులే కీలకం.. పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్ కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ఒక్కో రంగు ఒక్కో విధమైన ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు వేస్తే చీకట్లోనూ హాయిగా నిద్రపోతారు.కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురు అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకొనే విధంగా రూపొందించాలి. -
విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఢీలా
విశాఖపట్టణం సహా దేశవ్యాప్తంగా టాప్–15 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు ఢీలాపడ్డాయి. 2024తో పోలిస్తే 10 శాతం తగ్గి 1.56 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అమ్మకాల విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం ఇళ్లకు మాత్రం ఆదరణ కొనసాగుతోంది. రూ.కోటికి మించి ధరల శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు గతేడాది 9 శాతం పెరిగాయి. మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటా 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. విశాఖపట్టణంలో 2025లో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 2,406గా ఉన్నాయి. 2024లో విక్రయాలు 3,858 యూనిట్లతో పోలి్చతే 38 శాతం తగ్గాయి. కోయింబత్తూర్‌లో 4 శాతం తక్కువగా 3,702 యూనిట్లు విక్రమయ్యాయి.కోచిలో 17 శాతం తగ్గి 2,214 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. నాగ్‌పూర్‌లోనూ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. 6,260 యూనిట్లు అమ్ముడయ్యాయి. భువనేశ్వర్‌లో 4,885 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 25 శాతం తగ్గాయి.వదోదరలో 19 శాతం తగ్గి 13,798 యూనిట్లు, సూరత్‌లో 15 శాతం తక్కువగా 19,835 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి. గాం«దీనగర్‌లో విక్రయాలు 13,884 యూనిట్ల నుంచి 13,710 యూనిట్లకు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్‌లో 51,148 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2024లో విక్రయాలు 55,315 యూనిట్ల కంటే 8 శాతం తగ్గాయి.భోపాల్‌లో 5 శాతం తక్కువగా 3,599 యూనిట్లు, జైపూర్‌లోనూ ఇంతే మేర తగ్గి 9,758 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి.మెహాలీలో మాత్రం 34 శాతం అధికంగా 6,118 యూనిట్లు, లక్నోలో 6 శాతం అధికంగా 4,053 యూనిట్లు చొప్పున అమ్ముడయ్యాయి.ఎన్నో కారణాలు..గతేడాది ద్వితీయ శ్రేణి పట్టణాల్లో (టైర్–2) అమ్మకాలు ప్రథమ శ్రేణి పట్టణాల్లో మాదిరే ఉన్నట్టు ప్రాప్‌ఈక్విటీ సీఈవో సమీర్ జసూజ తెలిపారు. రూ.కోటిలోపున్న ఇళ్ల సరఫరా తగ్గడమే విక్రయాలు బలహీనపడేందుకు కారణమని పేర్కొన్నారు. టైర్–2 పట్టణాల్లో రూ.కోటిలోపు ఇళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు, కొనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా వచ్చే ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు అధికంగా ఉంటుండడం డిమాండ్, సరఫరాపై ప్రభావం చూపించినట్టు వివరించారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.ఏమిటీ వివాదం?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్‌పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలువిచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.కోర్టు ఆదేశాలురెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్ హోమ్ సింపుల్ స్టైల్, స్మార్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...రెండు ప్లాట్లు ఒకే ఇల్లు30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్ హోమ్‌ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.ఇంటి లోపలి అందండబుల్-హైట్ సీలింగ్‌తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.పిల్లల ప్రతి బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shiva Rai (@_mr.swashbuckler_) -
ఇళ్లు..పెళ్లిళ్లూ ఒకేసారి! సొంతింటికి కొత్త దారి!!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేది సామెత. అక్షర సత్యం కూడా. ఈరోజుల్లో ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా మాటలు కాదు.. రూ.లక్షలు.. కోట్లు కావాలి. సగటు వేతన జీవి, మధ్య తరగతి వ్యక్తికి సొంతిల్లు జీవితకాల కల. అయితే ఈ జంట కొత్త జీవితంలోకి.. కొత్త ఇంట్లోకి ఒకేసారి అడుగు పెట్టే కొత్త మార్గాన్ని చూపించారు.ఆడంబరం కంటే ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతఇంటర్నేషనల్ డెస్టినేషన్లు, డిజైనర్ దుస్తులు, రోజుల తరబడి జరిగే వేడుకలతో ‘బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్’ ట్రెండ్ ఊపందుకుంటున్న వేళ ఈ జంట మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ఎంచుకుంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.ఖరీదైన వివాహ వేడుకకు బదులుగా, పెళ్లి కోసం పొదుపు చేసిన మొత్తాన్ని తమ మొదటి ఇంటి కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలిపింది. అంతేకాదు, ఆ కొత్త ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా వివాహం చేసుకుని జీవితానికి అర్థవంతమైన ఆరంభం ఇచ్చిందా జంట. పెరుగుతున్న పెళ్లి ఖర్చులు స్థిరంగా లేవని భావించిన ఈ జంట, తాత్కాలిక వేడుకకన్నా దీర్ఘకాలిక ఆస్తినే ప్రాధాన్యంగా చూసింది.సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. “భవిష్యత్తుకు సరైన ఉదాహరణ”, “తెలివైన జంట”, “జీవితానికి అద్భుతమైన ఆరంభం” అంటూ నెటిజన్లు అభినందనలు తెలిపారు. “మా కుటుంబాలు కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది” అన్న వ్యాఖ్యలు కూడా కనిపించాయి. అయితే కొందరు సంప్రదాయవాదులు మాత్రం “పెళ్లి జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం” అంటూ ఘనంగా జరపాల్సిందేనని అభిప్రాయపడ్డారు.హోమ్ లోన్ ప్లానింగ్‌తో సాధ్యమైన సొంతిల్లుసాధారణంగా ఇంటి కొనుగోలులో బ్యాంకులు 75–80 శాతం వరకు హోమ్ లోన్ ఇస్తాయి. మిగతా 20–25 శాతం డౌన్ పేమెంట్‌ను కొనుగోలుదారులు చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్‌నే చాలా మంది యువ జంటలకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ జంట మాత్రం పెళ్లి కోసం దాచుకున్న లక్షల రూపాయలను డౌన్ పేమెంట్‌గా ఉపయోగించి, హోమ్ లోన్ భారం తగ్గించుకున్నారు.అద్దెకు బదులు ఈఎంఐపెళ్లి అనంతరం అద్దె ఇంట్లో ఉండటం బదులు, నేరుగా సొంతింట్లోకి మారడం ద్వారా ఈ జంట నెలవారీ అద్దెను ఈఎంఐ (EMI)గా మార్చుకుంది. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. మెట్రో నగరాలు, టయర్-2 పట్టణాల్లో అద్దె, ఈఎంఐ మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అద్దెకు వెళ్లే డబ్బు ఆస్తి సృష్టికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తుంది.ఇది చదివారా? శంషాబాద్‌కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!పెళ్లి వర్సెస్ ప్రాపర్టీ.. కొత్త ట్రెండ్!ఖరీదైన వివాహాలు కొన్ని రోజుల్లో ముగిసిపోయే ఖర్చులు మాత్రమే. కానీ అదే డబ్బుతో కొన్న ఇల్లు జీవితాంతం ఉపయోగపడే ఆస్తిగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు భద్రత, ఆర్థిక స్థిరత్వానికి పునాదిగా ఉంటుందనే కోణంలో యువత ఆలోచిస్తోంది. ఈ జంట నిర్ణయం అదే ఆలోచనకు ఉదాహరణగా మారింది. జెన్ జెడ్, మిలీనియల్స్‌లో తిరిగిరాని పెళ్లి ఖర్చులపై చర్చ పెరుగుతోంది.పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, హోమ్ లోన్ వడ్డీలు, జీవన వ్యయం నేపథ్యంలో మైక్రో వెడ్డింగ్స్, కోర్టు మ్యారేజ్లు, పెళ్లి + ఇల్లు ప్లానింగ్ వంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా పెళ్లి ఖర్చులను డౌన్ పేమెంట్‌గా మార్చుకోవడం యువ జంటలకు సరైన ఫైనాన్షియల్ స్ట్రాటజీగా అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Shreeom Kumar (@iasworldofficial) -
భారీ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేసిన నటుడు
ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన పాలి హిల్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ పాలి హిల్‌లో ఉన్న ఒక ఖరీదైన ఫ్లాట్‌ను దాదాపు రూ.29.4 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ విలాసవంతమైన ఫ్లాట్ పాలి హిల్‌లోని నవ్రోజ్ అపార్ట్మెంట్లో ఉంది.ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు..విక్రయ ధర: రూ.29.37 కోట్లురిజిస్ట్రేషన్ తేదీ: ఫిబ్రవరి 5, 2026స్టాంప్ డ్యూటీ: రూ.1.76 కోట్లుఅమ్మినవారు: కపిల్ ఎం.మహతానీఈ అపార్ట్మెంట్ 2,989.05 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మార్కెట్లో పలికిన ధర ప్రకారం చదరపు అడుగుకు సుమారు రూ.98,000 చొప్పున ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాంద్రా, పాలి హిల్ మైక్రో మార్కెట్లలో ఉన్న రేట్లకు అనుగుణంగానే ఈ ధర నిర్ణయించారు. ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో బాంద్రాలోని పాలి హిల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ) ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతారు. ఈ ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.80,000 నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతున్నాయి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్.. రూ. 56 కోట్లు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు సమీపంలో బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్ లేఅవుట్లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్ స్వగహ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్‌కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్! -
ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.➤2024లో గ్రేటర్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
గ్రీన్ గోదాంలకే డిమాండ్.. ఈ ఏడాది భారీ లీజులు!
భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్‌ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగంలో డిమాండ్ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.పట్టణాల్లోనూ.. తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.హైదరాబాద్‌లో.. గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్‌హౌస్ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో 22 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది. -
శంషాబాద్‌కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్ హబ్‌గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టరి్మనల్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందిన శంషాబాద్.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్ హబ్‌గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్‌కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్(త్రిబుల్ ఆర్)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్‌లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లలో రాజీవ్‌గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్‌లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్‌లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్ ట్రాన్సిట్ ఆఫీస్‌గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్ హబ్‌తో శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్‌ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్‌లకు, కార్పొరేట్లకు సీ–సూట్‌కు ట్రాన్సిట్ ఆఫీస్‌గా మారుతుంది. ఫైవ్‌స్టార్ హాస్పిటాలిటీ, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్: పెరిగిన ఇళ్ల ధరలు
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్‌టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్‌ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.హైదరాబాద్‌లో 8 శాతం ధరల వృద్ధి2025లో హైదరాబాద్‌లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్‌ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్‌కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్‌ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చింది.బెంగళూరు ముందంజదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్‌లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్‌లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్‌లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.2026పై అంచనాలుప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్‌టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు. -
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్మెంట్ మేనేజర్ 'కోమల్ ఝా'.కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్‌ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు. -
ఇంటికి మంచి రేటు రావాలంటే.. ఇవిగో చిన్న టిప్స్..
కొనేటప్పుడు తక్కువ ధర, అమ్మేటప్పుడు ఎక్కువ ధర కావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. నివాసం ఉండేందుకు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు ఇంకొందరు. ఏదేమైనా భవిష్యత్తు అవసరాల కోసం ఇంటిని విక్రయించే సమయంలో అధిక ధర రావాలని కోరుకోవడం సహజం. అయితే సాధారణ ఇళ్లతో పోలిస్తే నిర్వహణ బాగున్న ఇంటికే ధర అధికంగా వస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న టిప్స్‌తో సొంతింటిని లాభదాయక ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చో ఒకసారి చూద్దాం.ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకోవడంతోనే సరిపోదు. ఎలాంటి సమయంలో విక్రయించాలో కూడా తెలిసుండాలి. లేకపోతే ప్రాపర్టీ అమ్ముడుపోకపోవడమే కాదు ఇష్టం వచ్చిన రేటుకు అడిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మార్కెట్ బాగున్నప్పుడే ఇంటిని విక్రయించాలే తప్ప ప్రతికూల సమయంలో అమ్మాలనుకుంటే మాత్రం మనం పెట్టిన ధర కంటే తక్కువకు పోయే ప్రమాదం ఉంటుంది.రీసెర్చ్ చేశాకే నిర్ణయం.. ముందుగా మీ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్ల ధరలు ఎంత ఉన్నాయో పరిశోధన చేయాలి. రీసేల్ ప్రాపరీ్టల మార్కెట్ ఎలా ఉంది? ఎంత రేటుకు పోతున్నాయో పరిశీలించాలి. ఒకట్రెండు రీసేల్ ప్రాపర్టీ యజమానులతో మాట్లాడి.. ఇల్లు కొనేందుకు ముందుకొచ్చే కొనుగోలుదారుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు విక్రయించాలనుకున్న ఇంటికి ఒక ధరను నిర్ణయించుకోవాలి. అంతే తప్ప మీ పెట్టుబడి, అవసరాలు, లాభం అన్నీ కలుపుకొని ఇంటికి రేటు కట్టకూడదు. అలా చేస్తే అంత రేటుకు రీసేల్ ప్రాపర్టీ కొనేబదులుగా కొత్త ఇల్లే వస్తుందని కస్టమర్లు భావిస్తారు. అందమైన ఇంటికే అధిక ధర.. సాధారణ ఇళ్లతో పోలిస్తే మీ ఇంటికి ధర రావాలంటే ముందుగా కొంత ఖర్చు పెట్టక తప్పదు. కంటికి ఇబ్బెట్టుగా, బెదురుకొట్టే రంగులు కాకుండా లేత రంగులను వేసుకోవాలి. మనసుకు ప్రశాంతత కలిగించే తెలుపు, నీలం వంటి వర్ణాలను ఉపయోగించాలి. సాధారణ ఇళ్లతో పోలిస్తే ఆహ్లాదకరంగా, అందంగా ఉండే ఇళ్లు 40–50 శాతం వేగంగా అమ్ముడవుతాయని, 10 శాతం ధర అధికంగా పలుకుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నల్లాలు, పైప్లైన్ల లీకేజీలు ఉంటే రిపేర్ చేయించాలి. దీంతో ఇంటి యజమానిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తెగిపోయిన విద్యుత్ వైర్లు, పలికిన స్విచ్ బోర్డ్‌లు వంటివి ఏమైనా ఉంటే సరిచేయాలి. లేకపోతే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పరిసరాలు పరిశుభ్రంవిక్రయించే ఇంటిని మాత్రమే అందంగా తీర్చిదిద్దితే సరిపోదు.. పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వరద, మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అందమైన పువ్వులు, సువాసన వెదజల్లే మొక్కలను పెంచాలి. దీంతో కొనుగోలుదారులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇల్లు కొనేందుకు వచ్చే కస్టమర్లు ఇంటి లోపల గదులు, కిచెన్, బాత్రూమ్ వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటి లోపల వస్తువులను ఆకర్షణీయంగా సర్దుకోవాలి. ఇష్టం వచి్చనట్లు వస్తువులు ఉంటే అందవిహీనంగా కనిపించడమే కాకుండా ధర కాస్త తగ్గే ప్రమాదం ఉంటుంది.మొదటి 5 నిమిషాలు కీలకం.. రీసేల్ ప్రాపర్టీలు కొనే కస్టమర్లు ఇల్లు చూసే తొలి ఐదు నిమిషాలు కీలకం. అందుకే ఇంటి లోపలికి రాగానే ఆహ్లాదభరిత వాతావరణం కనిపించేలా అందమైన కర్టెన్లు, లేతరంగులతో స్వాగతం పలికేలా చూసుకోవాలి. బెడ్రూమ్, కిచెన్‌లో వస్తువులను సరైన రీతిలో సర్దిపెట్టుకోవాలి. వంట గదిలో నూనె మరకలు వంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి. బాత్రూమ్లో దుర్గంధం లేకుండా చూసుకోవాలి. బాల్కనీలో దుస్తులు ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసే తీగలు వంటివి అడ్డుగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. పూల కుండీలలో అందమైన మొక్కలు పెంచుకోవాలి.రీసేల్ చెక్ లిస్ట్ ఇంటిని శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా ఉండాలి. ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి.మార్కెట్లో వాస్తవ ధర ఎంతో ఉందో తెలుసుకున్న తర్వాతే ఇంటికి ధరను నిర్ణయించాలి. అత్యాశకు పోకుండా కస్టమర్‌కు బేరసారాలకు అవకాశం ఇవ్వాలి.అశుభ రోజులు, ప్రతికూల సమయంలో కాకుండా పండుగలు, శుభదినాలలో ఇంటిని విక్రయించడం వల్ల కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.నమ్మకమైన మధ్యవర్తులు, ఏజెంట్లు, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రాపరీ్టల రీసేల్ చేస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.కస్టమర్లతో విక్రయ ఒప్పందం, ఇతరత్రా డాక్యుమెంటేషన్ పక్కాగా చేసుకోవాలి. పక్కా డాక్యుమెంట్లు.. ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఇల్లు కొనే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ధర అధికంగా వస్తుంది. ఇంటిపై బ్యాంక్ రుణం, ఇతరత్రాలు ఏమైనా ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలి. -
మార్కెట్లో ఫుల్ డిమాండ్!.. అందుబాటు ధరలోనే..
ఎవరు ఇంటికొచ్చినా స్వాగతం పలికేవి ఇంటి తలుపులే.. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించినవి వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్(యూపీవీసీ) తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. – సాక్షి, సిటీబ్యూరోసౌకర్యాలెన్నో..యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం.సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీలు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారు 30 ఏళ్లు.యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పుపట్టడం వంటివి ఉండవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. నష్టం చాలా వరకు తగ్గుతుంది.యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే యూపీవీసీ పర్యావరణహితమైనవి. అంతేకాకుండా వీటికి ఉండే స్కూలు, గ్రిల్స్ బయటకు కనిపించవు. -
రియల్ఎస్టేట్: 12 నెలలు.. 65 లక్షల చదరపు అడుగులు
హెచ్–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ హాట్ ఫేవరెట్‌గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది హైదరాబాద్‌లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్ రిపోర్ట్ వెల్లడించింది.గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.వేకెన్సీ 18.2 శాతం.. ఏటేటా హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల మార్కెట్ సరికొత్త రికార్డ్లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్ క్వార్టర్లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్‌కేర్ అండ్ లైఫ్‌సైన్సెస్ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.97 శాతం ఆఫీసు స్పేస్ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి (పెరిఫెరల్ బిజినెస్ట్ డిస్ట్రిక్ట్) పీబీడీ–వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్ స్పేస్ ఆఫీసులలో హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం
భారత కార్యాలయ వసతుల లీజింగ్‌లో (ఆఫీస్ స్పేస్) అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోంది. 2025లో దేశ వ్యాప్తంగా టాప్–7 నగరాల్లో 58 శాతం మేర ఆఫీస్ వసతులను అంతర్జాతీయ కంపెనీలే లీజింగ్‌కు తీసుకున్నట్టు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా టాప్–7 నగారల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగి 83.3 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) చేరింది. ఇందులో 48.6 మిలియన్ ఎస్ఎఫ్టీని అంతర్జాతీయ కంపెనీలు తీసుకున్నాయి. 2024లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 77.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, కోల్‌కతా నగరాల్లోని లీజింగ్‌ను విశ్లేషించిన అనంతరం జేఎల్ఎల్ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వ్యూహాత్మక వ్యాపార కేంద్రంగా భారత్ స్థానం మరోసారి రుజువైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్ నైపుణ్యాలున్న మానవ వనరుల లభ్యతకుతోడు ప్రముఖ నగరాల్లో అందుబాటు ధరలకే ప్రీమియం ఆఫీస్ స్పేస్ లభ్యత అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడుల దిశగా ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. 60 శాతం జీసీసీల్లోనే..అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో గేతడాది 48.6 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ వసతులను అద్దెకు తీసుకుంటే.. అందులో 31.4 మిలియన్ ఎస్ఎఫ్టీ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల్లోనే (జీసీసీలు) ఉండడం గమనార్హం. 7 నగరాల్లో గతేడాది మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దేశీ సంస్థలు 34.7 మిలియన్ ఎస్ఎఫ్టీని లీజుకు తీసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల వ్యాపార విస్తరణకు బెంగళూరు అత్యంత ప్రాధాన్య నగరంగా ఉంది. భారత ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్లో జీసీసీలు ప్రముఖ శక్తిగా ఉన్నట్టు జేఎల్ఎల్ భారత ఎండీ రాహుల్ అరోరా పేర్కొన్నారు. గతేడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు కూడా కీలక పాత్ర పోషించినట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. భవిష్యత్‌కు వీలైన పని ప్రదేశాలుగా, నిపుణుల లభ్యత, నిర్వహణ సౌలభ్యంతో జీసీసీలు కీలకంగా మారినట్టు భైవ్ వర్క్‌స్పేస్ సీఈవో శేష్ రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే -
హైదరాబాద్‌లో పాతకాలపు ఇళ్లకు ఫుల్ డిమాండ్
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత మనలో చాలా మందికి తెలిసిందే.. అయితే చాలా మంది కొత్త విషయానికి ఆకర్షితులయ్యినంతగా.. అలవాటు పడిన పాతదానికి ఆకర్షితులు కారనేది ఒక కోణమైతే.. పాత విషయాన్నీ అలా వదిలేయకుండా నిలబెట్టుకుంటూ.. కొత్త వాటిని తొందరపడి వదులుకోకూడదు అనే మరో కోణాన్నీ ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఇదే చెవికెక్కించుకున్నారో! ఏమో గానీ నగరంలో పాత ఇళ్ల (వింటేజ్ హౌస్)కు ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఇంటి వరండాలో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ సేవించడం, లివింగ్ రూమ్‌లో ఆసీనులై పుస్తక పఠనం చేయడం, మిద్దె మీదకు ఎక్కి నక్షత్రాల నీడలో నచి్చన సంగీతాన్ని ఆస్వాదించడం.. వంటి సంప్రదాయ అభిరుచులన్నీ సిటీలోని ఏ ఆధునిక కేఫ్‌కి వెళ్లినా సుసాధ్యమే. సిటీలో ప్రస్తుతం ఈ తరహా ట్రెండీ కేఫ్స్ పాత ఇళ్లలోనే ఏర్పాటవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో నివసించాలి అనుకునేవారు మాత్రమే కాదు.. కేఫ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు కూడా ఇళ్లనే అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేఫ్స్ అంటే ఆహారం, పానీయాలు మాత్రమే అందించే చోటు కాదు.. పాత కథలను చెప్పే కొత్త వేదికలు కూడా. నగరంలో కేఫ్ సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇటీవల ఒక కొత్త ధోరణిని సంతరించుకుంటోంది. పాత ఇళ్లు, బంగ్లాలు హాయిగా, అందమైన గొప్ప కేఫ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి.ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్.. వీలైనంత పాత ఇళ్లనే కేఫ్స్ కోసం ఎంచుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కేఫ్స్‌లో 1970ల నాటి హెరిటేజ్ విల్లాలు సైతం కేఫ్స్గా అవతరించాయి. నగరంలో కేఫ్‌లుగా మారిన ఇళ్లు సాధారణ వాణిజ్య సెటప్‌ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తూ ‘ఇంటి నుంచి దూరంగా ఉన్నవారి ఇల్లు’ లాగా సేద తీరుస్తున్నాయి. వీటిలో సూర్యకాంతి ధారాళంగా ప్రవహించే వరండాలు, పాతకాలపు కిటికీలు, ద్వారాలతో గత జీవితాల జాడలను గుర్తుచేస్తాయి. అలా నగరంలో పాత ఇంటి నుంచి కొత్త కేఫ్స్గా మారినవి కొన్ని..వారసత్వ నిర్మాణాలు.. 80 ఏళ్ల వయసు గల ఓ పురాతన భవనం బంజారాహిల్స్‌లో ప్రస్తుతం రోస్టరీ కాఫీ హౌస్‌గా ఆధునిక సొబగులు అద్దుకుంది. అతిగా మార్పు చేర్పులు లేకుండా ఈ భవనంలోకి వెళుతుంటే ఓ పాత ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందవచ్చు. ఈ వింటేజ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను కేఫ్‌గా మార్చారు. దాని పాతకాలపు అందాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచిన ఫలితంగా వారసత్వ నిర్మాణాన్ని తాజా కాఫీ సువాసనతో మిళితం చేస్తూ సరికొత్త ఫ్యూజన్ ప్లేస్‌గా నిలుస్తోంది. కేరళ తరహా నిర్మాణం.. దాదాపు కేరళ శైలి నిర్మాణాన్ని అనుకరించే వారసత్వ భవనానికి ప్రస్తుతం సృజనాత్మక, కళాత్మకను అద్ది ఆరోమలే కేఫ్ పేరిట రూపుదిద్దారు. జూబ్లీహిల్స్‌లోని ఆ ఇంటిలోని తోట సహా నాటి నివాస అనుభూతిని అచ్చంగా భద్రపరిచారు. దీనిని వాణిజ్య అవసరాలతో పునఃరూపకల్పన చేయడానికి బదులుగా, యజమానులు పాత ఇంటిలోని ప్రతి గదినీ చదవడం, సంగీతం, సంభాషణలు, కమ్యూనిటీ సమావేశాల కోసం ప్రత్యేకంగా మార్చారు.గాలి, వెలుతురుకు అనుకూలంగా.. జూబ్లీహిల్స్లోనే మరో కేఫ్ గ్లాస్ హౌస్. ఇంటి సుపరిచితమైన లేఅవుట్‌ను కొనసాగిస్తూనే కేఫ్‌గా మారిన నివాస స్థలం. ఇది ఇప్పటికీ ఇల్లులా కనిపిస్తుంది. వరండా, ప్రాంగణం సీటింగ్ ప్రదేశంగా మారింది. అలాగే ఒకదానితో ఒకటి అనుసంధానించిన ‘గదులు‘ ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తాయి. సైనిక్‌పురిలో ఉన్న దిస్ ఈజ్ ఇట్ కూడా దాని గత గృహశైలి లేఅవుట్‌ను యథాతథంగా ఉంచింది. లైటింగ్‌తో నివాస భవనాన్ని తలిపించేలా ఆలోచనాత్మకంగా పునర్నిర్మితమైంది.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ నివేదిక ప్రకారం 1970లో నిర్మించిన ఇంటి లోపల ఏర్పాటైంది రేషియో. జూబ్లీహిల్స్‌లో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్‌ను దాని పురాతన ఆత్మను నిలుపుకునేలా ఆలోచనాత్మకంగా వాస్తుశిల్పులు పునఃరూపకల్పన చేశారు. పొడవైన పైన్–వుడ్ కిటికీలు, సూర్యకాంతి పడేలా ప్రత్యేక స్థలాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసలు ఇంటి సారం చెక్కుచెదరకుండా ఉంచారు.అలంకరణలు చెక్కు చెదరకుండా.. హిమాయత్‌నగర్‌లోని మిరోసా కేఫ్ మరో నివాస విల్లా. ఇది ఓపెన్ సీటింగ్‌తో రెండు అంతస్తుల లేఅవుట్. సన్నిహిత సీటింగ్, వెచ్చని రంగుల పాలెట్.. అతిథులకు సుపరిచితమైన ఇంటి అనుభూతిని ఇస్తుంది. ఫిల్మ్ నగర్‌లోని వైబేయార్డ్ బిస్ట్రో కేఫ్‌లోని ఆక్సైడ్ గోడలు, చెక్క తలుపులు/ కిటికీలు, విశాలమైన గార్డెన్.. పురాతన ఇంటి అనుభవాన్ని అందిస్తాయి.జూబ్లీ హిల్స్‌లోని ది ఫిఫ్త్ స్ట్రీట్ కేఫ్ ఇదే కోవకు చెందింది. చెక్క అలంకరణలు, ఒకదానితో ఒకటి అనుసంధానించిన గదులు, ఇంటి ఫీల్‌ను సజీవంగా ఉంచుతాయి. -
సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు!
మెట్రో నగరాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే సామాన్య, మధ్యతరగతికే కాదు ధనిక కుటుంబాలకూ పొదుపు తప్పనిసరి. వార్షిక ఆదాయ, పొదుపు, తలసరి వ్యయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహాల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే కనిష్టంగా 23 ఏళ్ల సేవింగ్స్ అవసరం. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఏకంగా వందేళ్లకు పైగా పొదుపు చేస్తేనే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.2022–23లో దేశ స్థూల పొదుపు, స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 30.2 శాతంగా ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని.. రాష్ట్రంలోని అత్యంత ధనవంతులైన 5 శాతం మంది సగటు కుటుంబ ఆదాయం, రాష్ట్ర రాజధానిలోని 110 చదరపు మీటర్లు(1,184 చ.అ.) ఇంటి సగటు ధరతో పోల్చి ఈ డేటాను రూపొందించారు.ఠి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ తలసరి వ్యయం(ఆర్బీఐ ఎంపీసీఈ) ప్రకారం హైదరాబాద్‌లో ఐదు శాతం ధనిక కుటుంబాల వార్షిక ఆదాయం రూ.12.5 లక్షలుగా ఉంది. దీనికి ఆయా ఫ్యామిలీలకు 30.2 శాతం పొదుపు రేటును వర్తింపజేస్తే వారి వార్షిక పొదుపు దాదాపు రూ.3.8 లక్షలుగా ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బోర్డ్ (ఎన్‌హెచ్‌బీ) డేటా ప్రకారం 645 చ.అ. నుంచి 1,184 చ.అ. మధ్య కార్పెట్ ఏరియా ఉన్న ఇంటి చ.అ. ధర గతేడాది మార్చిలో రూ.89 లక్షలుగా ఉంది. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ.3.8 లక్షల పొదుపుతో రాష్ట్ర రాజధానిలోని టాప్–5 అర్బన్ కుటుంబాలు ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కనిష్టంగా 23 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది.ఢిల్లీలో 35 ఏళ్ల పాటు.. ఇదే విధమైన లెక్కల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు కొనాలంటే 35 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ ప్రవేశం చేయాలంటే ఏకంగా 109 ఏళ్ల పాటు సేవింగ్స్ చేయాల్సిందే. దేశంలో పది కంటే ఎక్కువ రాష్ట్రాల రాజధానుల్లో ఇల్లు కొనాలంటే 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిల్లో ముంబై, గుర్గావ్, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్ రాజధానులు ఉన్నాయి.దక్షిణాదిలో మన దగ్గరే తక్కువ..దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంతో పోలిస్తే భాగ్యనగరంలోనే తక్కువ కాలం పొదుపు చేస్తే సరిపోతుంది. చెన్నైలో 37 ఏళ్ల పాటు సేవింగ్స్ చేస్తేనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇక, బెంగళూరులో 36 ఏళ్లు, తిరువనంతపురం, విశాఖపట్నంలలో 26 సంవత్సరాలు పొదుపు చేస్తే సొంతిల్లు సొంతవుతుంది. ఇక, అత్యల్పంగా కేవలం 15 ఏళ్ల పొదుపుతో సొంతింటి కలను సాకారం చేసుకునే ఏకైక నగరం చంఢీగడ్. ఆ తర్వాత 16 ఏళ్లతో జైపూర్ నగరాలున్నాయి. -
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్మెంట్
స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్‌హౌస్‌ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్మెంట్లు హాట్ ఫేవరెట్స్‌గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరోఎవరు కొంటారంటే? సాధారణంగా బెడ్ కమ్ లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.మన దగ్గర తక్కువే.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో అపార్ట్మెంట్ల ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భళా!
హైదరాబాద్ ఇళ్ల మార్కెట్ 2025లో మెరిసింది. అమ్మకాలు 6 శాతం పెరిగి 54,271 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో విక్రయాలు 51,337 యూనిట్లుగా ఉన్నాయి. దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో అమ్మకాలు గతేడాది 15 శాతం పెరిగి 1.33 లక్షల యూనిట్లకు చేరినట్టు ప్రాప్‌టైగర్ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2025లో 3,86,365 యూనిట్లుగా ఉన్నట్టు, 2024లో విక్రయాలు 4,36,992 యూనిట్లతో పోల్చితే 12 శాతం తగ్గినట్టు పేర్కొంది. బెంగళూరులో 54,414 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు 2025లో నమోదయ్యాయి. 2024లో విక్రయాలు 48,272 యూనిట్ల కంటే 13 శాతం పెరిగాయి. చెన్నైలోనూ గతేడాది ఇళ్ల విక్రయాలు 55 శాతం దూసుకెళ్లి 24,892 యూనిట్లకు చేరాయి. కోల్‌కతాలో విక్రయాలు 15,172 యూనిట్లుగా ఉన్నాయి. 2024తో పోల్చితే 12 శాతం పెరిగాయి. ముంబై రీజియన్‌లో విక్రయాలు 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 13 శాతం తగ్గాయి. 35,711 యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో అమ్మకాలు 12 శాతం తగ్గి 29,223 యూనిట్లకు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 37,087 యూనిట్లుగా ఉన్నాయి. టాప్–8 నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం తగ్గి 2025లో 3,61,096 యూనిట్లుగా ఉంది. 2021 తర్వాత ఇదే కనిష్ట సరఫరా అని ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది. డిమాండ్ దెబ్బతినలేదు.. ‘‘2025 సంవత్సరంలో డిమాండ్‌కు విఘాతం కలగలేదు. సర్దుబాటు జరిగిందంతే. కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. డెవలపర్లు మాత్రం సరఫరా పరంగా సమయోచితంగా వ్యవహరించారు. ఈ ధోరణి నిల్వపరమైన ఒత్తిళ్లు తగ్గి, ధరలు స్థిరంగా ఉండేలా సాయపడింది’’అని ఆరమ్ ప్రాప్‌టెక్ ఈడీ ఓంకార్ షెట్యే తెలిపారు. -
గ్రీన్లాండ్: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్లాండ్. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్లాండ్లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్లాండ్లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్లాండ్లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి. -
ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్!
మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్ ఫేవరేట్ ప్లేస్‌గా మారింది. గతేడాది జులై–డిసెంబర్ (హెచ్–2)లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగింది. 2025 హెచ్2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోమెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్‌కు ప్రధాన కారణాలు.పెరిగిన దక్షిణం, తూర్పు..సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ వంటి తూర్పు హైదరాబాద్ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.తగ్గిన ఉత్తరం, సెంట్రల్..ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్ వంటి ఉత్తర హైదరాబాద్ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్‌లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్ హైదరాబాద్ వాటా 3 శాతానికి తగ్గింది.ప్రీమియం ఇళ్లకే మొగ్గు..2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.ఆఫీసు అ'ధర'హో..నగరంలో హెచ్ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్(ఎస్‌బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట వంటి సెంట్రల్ బిజినెస్ డి్రస్టిక్ట్(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.లాంచింగ్స్‌లో వెస్ట్దేనివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్‌లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్–2తో పోలిస్తే లాంచింగ్స్ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్ సిటీ వాటా 5 శాతంగా ఉంది.నగరంలోని ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, రాండ్‌స్టాడ్, గోల్డ్‌మన్ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్ స్పేస్ విభాగం ఉంది. థర్ట్ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి. -
మారుతున్న ఇష్టాలు.. వసతులకే ప్రాధాన్యం!
ఇంటి కొనుగోలుదారుల ఇష్టాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ధరకు ప్రాధాన్యం ఇచ్చిన గృహ కొనుగోలుదారులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్యం వసతులు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి వెళ్లవచ్చు? ఎంత దగ్గరలో ఆరోగ్య సేవలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇల్లు విశాలంగా ఉండటమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కస్టమర్ల డిమాండ్. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. నివాస ప్రాజెక్ట్‌లలో ఎక్కువ స్థలం ఖాళీ వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే అలాంటి కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా పాలనా చూసే డే కేర్ సెంటర్లు ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది.వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నా.. పిల్లలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే కమ్యూనిటీలలో డే కేర్ సదుపాయాలను ఉండాలని కోరుకుంటున్నారు. వీకెండ్ వసతులు అవసరమే.. ఇంటి నుంచి ఆఫీసు ఎంత దూరంలో ఉందనేది గృహ కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారు. సిటీ ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతోంది కాబట్టి.. దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి.అదే సమయంలో ప్రజారవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటున్నారు. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్ క్లబ్స్ వంటివి ఎంత దూరంలో ఉన్నాయనేవి సైతం ఇంటి కొనుగోలుదారులు చూస్తున్నారు. -
54878 ఇళ్లు.. ఫర్ సేల్!
ఒకవైపు హైదరాబాద్‌లో గృహ విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రారంభమైన అందుబాటు, మధ్యస్థ ధరల ఇళ్ల వాటా అధికంగా ఉండటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం నగరంలో 54,878 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం మేర పెరిగింది. ముంబై, ఎన్సీఆర్(ఢిల్లీ) ల తర్వాతే అత్యధికం మన దగ్గరే ఇన్వెంటరీ అధికంగా ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరోరూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్టాక్‌లో అధికంగా ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్లు ఏకంగా 20,069 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 7.4 త్రైమాసికాలు పడుతుంది. ఇక, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు 5,638 ఉన్నాయి. వీటి అమ్మకానికి ఏకంగా 10.4 త్రైమాసికాలు పడుతుంది. అఫర్డబుల్ ఇళ్ల కొనుగోలుదారులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల వాటా గణనీయంగా తగ్గాయి. 2024 హెచ్–2తో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గగా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల లాంచింగ్స్ వాటా 25 శాతం నుంచి 23 శాతానికి క్షీణించాయి.ప్రీమియం యూనిట్లు తక్కువే..ఇన్వెంటరీలో ప్రీమియం ఇళ్ల వాటా కాస్త తక్కువగానే ఉన్నాయి. రూ.1.2 కోట్ల ధర ఉన్న గృహాలు 18,825 ఉన్నాయి. రూ.2.5 కోట్ల ధర ఉన్న యూనిట్లు 8,468, రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న ఇళ్లు 1,628, రూ.10 నుంచి రూ.20 కోట్ల ధర ఉన్నవి 92, రూ.20 నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న యూనిట్లు 158 ఉన్నాయి.38,403 ఇళ్ల విక్రయం..2025లో నగర నివాస మార్కెట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్లలో నమ్మకం, ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. గతేడాది హైదరాబాద్‌లో 38,403 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇక, 2025లో నగరంలో కొత్తగా 40,737 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ప్రాజెక్ట్ లాచింగ్స్ కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం, నియంత్రణ పరిమితుల కారణంగా 2024 హెచ్–2తో పోలిస్తే లాచింగ్స్ 7 శాతం మేర క్షీణించాయి.2025లో హైదరాబాద్ కార్యాలయ సముదాయాలు వార్షిక లావాదేవీలు 1.14 కోట్ల చ.అ.లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే ఆఫీసు స్పేస్ సప్లై పరిమితంగా ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు కారణంగా లావాదేవీలు పెరిగాయి. -
ఇల్లు కొనే సమయంలో వచ్చే సందేహాలు..
అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. డెవలపర్లు కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే చెబుతుంటే.. చాలా మందికి వీటిపై అవగాహన ఉండదు. బిల్డర్ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏయే ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్ ఏరియా పోనూ మనకు వచ్చే ఏరియా ఎంత? మనం ఇంటి కోసం వెచ్చించే డబ్బులకు మన ఫ్లాట్‌లో ఎంత ఏరియా వస్తుంది? ఇలాంటి సందేహాలను ఈ కథనంతో నివృత్తి చేసుకుందాం.. -సాక్షి, సిటీబ్యూరోసాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణాన్నే. వారి అవసరాలకు అనుగుణంగా ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇల్లు కొనుగోలు చేసేందుకు వెళ్తే వారికి కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియాలపై అవగాహన ఉంటే తమ కుటుంబ అవసరాలకు ఆయా విస్తీర్ణం సరిపోతుందో లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. అలాగే మనం వెచి్చంచే ఇంటికి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందనే అంశంపై స్పష్టత వస్తుంది.మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసే సమయంలో కార్పెట్ ఏరియా ప్రధానమైనది. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్ ఏరియా కిందికి వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంట గది, స్నానాల గదులు వరకు కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవచ్చు.ఆ తర్వాత ఇంటికి సంబంధించి ప్రధానమైంది బిల్టప్ ఏరియా. కార్పెట్ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్ బిల్టప్ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్టప్ ఏరియాతో పాటు మిగిలిన ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్ హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటా కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్‌గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్ లేదా సూపర్ బిల్టప్ ఏరియాగా పరిగణిస్తుంటారు. అంటే మనం బిల్డర్ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్ ఏరియా సుమారుగా 70 శాతంగా వస్తుంది.ఇలా లెక్కించండి..ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలలో డెవలపర్లు వసతులకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్ నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30 శాతం కామన్ ఏరియా కలుపుకొని సూపర్ బిల్టప్ ఏరియాను లెక్కేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్ దగ్గర 2,000 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా సుమారుగా 1,400 చ.అ.లు మాత్రమే ఉంటుందన్నమాట.ఉదాహరణకు మనం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుందాం. ఈ లెక్కన మనం వ్యక్తిగతంగా వినియోగించే 1,400 చ.అ. కార్పెట్ ఏరియాకు మనం చెల్లించాల్సిన సొమ్ము మొత్తం రూ.1.40 కోట్లు. కానీ, మనం బిల్డర్‌కు చెల్లించేది మాత్రం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌కు రూ.2 కోట్లు చెల్లిస్తాం. అంటే మన కార్పెట్ ఏరియాకు మనం చెల్లించే సొమ్ము చ.అ.కు రూ.14,285లకు పెరిగిందన్నమాట.మిగిలిన సొమ్ము బిల్టప్, కామన్ ఏరియాలకు చెల్లించామన్నమాట. కాబట్టి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనం చెల్లించే సొమ్ముకు, మనకు వచ్చే విస్తీర్ణం ఎంతనేది డెవలపర్ల నుంచి స్పష్టత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కోట్లు పెట్టి కొత్త అపార్ట్మెంట్ కొన్న నిర్మాత
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం సర్వ సాధారణం. ఇందులో భాగంగానే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఒక కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసిన కొత్త అపార్ట్మెంట్ ధర రూ. 8.05 కోట్లు. ఇది పాలి వింటేజ్ భవనంలో 1,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐదవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను రెండు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కొనుగోలు చేశారు. దీనికోసం రూ. 48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ లావాదేవీ నవంబర్‌లో జరిగినట్లు సమాచారం.ఖార్‌లో పాలి వింటేజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన లెవల్ 6 అనే కంపెనీ ద్వారా ఈ అపార్ట్‌మెంట్‌ను కరణ్ జోహార్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని లెవల్ 6 గ్రూప్ చీఫ్ ప్రమోటర్ ప్రీతేష్ సంఘ్వి ధృవీకరించారు.ఈ కొత్త అపార్ట్మెంట్ మాత్రమే కాకుండా.. కరణ్ జోహార్ బాంద్రాలోని కార్టర్ రోడ్‌లోని ది రెసిడెన్సీలో సముద్రానికి ఎదురుగా ఉన్న పెద్ద డ్యూప్లెక్స్ కలిగి ఉన్నారు. అదే విధంగా 8,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను 2010లో దాదాపు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ప్రైవేట్ టెర్రస్ & గౌరీ ఖాన్ రూపొందించిన నర్సరీ ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రౌలిలో కూడా ఈయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్! -
ఇంటికి లగ్జరీ లుక్.. కిటికీలోనే ఉంది కిటుకు!
ఇంటీరియర్‌లో అద్దాలు భాగమైపోయాయి. రంగులు, మొక్కలు, ఫర్నీచర్ మాత్రమే కాదు విండోలతోనూ ఇంటికి లగ్జరీ లుక్ వస్తుంది. ఇన్సులేషన్ కిటికీలతో ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే గుణం ఉండటమే వీటి ప్రత్యేకత అని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలతో పాటు శబ్ధాబ్దాలను ఇంటి లోపలికి రాకుండా ఈ కిటికీలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.కాలుష్యం, రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉంటే మెట్రో నగరాలలో నిశ్శబ్ద, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకోవడం సహజమే. అందుకే గృహ కొనుగోలుదారులు హరిత భవనాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల డిజైనింగ్ దశ నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లగ్జరీ లుక్‌తో పాటు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు పెద్ద కిటికీలను ఎంపిక చేస్తున్నారు. గ్లేజింగ్, సీలింగ్ సాంకేతికతలతో తయారైన కిటికీలు మార్కెట్లో హాట్ ఫేవరేట్‌గా మారాయి.సంప్రదాయ సింగిల్ గ్లేజ్ విండోలతో బయటి నుంచి శబ్దాలు, దుమ్ముధూళి వంటివి సులభంగా ఇంటి లోపలికి వస్తాయి. అలాగే అపార్ట్మెంట్లలో పైఅంతస్తులలోని నివాసితుల హడావుడి, పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్, నిర్మాణ సంబంధిత ధ్వనులు కిటికీ ఫ్రేమ్‌ల చుట్టూ ఉన్న చిన్న ఓపెనింగ్‌ల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో నివాసితులకు చికాకు, ఒత్తిడి వంటివి కలుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది కస్టమర్లు మెరుగైన ఉష్ణోగ్రతలను నిర్వహించే ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలను ఎంచుకుంటున్నారు.రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు షీట్లతో తయారైన ఈ విండోల మధ్యలో గాలి లేదా ఇతర వాయువుతో నిండి ఉంటుంది. దీంతో వేసవి కాలంలో ఇంటి లోపల వాతావరణం వెచ్చగా ఉండకుండా శీతాకాలంలో వేడిని బయటకు వెళ్లకుండా ఇన్సులేషన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలు ఉన్న ఇంట్లో ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది.లామినేటెడ్ గ్లాస్ కిటికీలకు ధ్వనిని నియంత్రించే గుణం ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు పొరలతో తయారయ్యేదే లామినేటెడ్ గ్లాస్లు. ఇవి హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఇంటి లోపల అధిక వేడిని తగ్గిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కోసం టెంపర్డ్ గ్లాస్ ఉత్తమమైంది. దీనికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వినియోగిస్తుంటారు.ఇది చదివారా? ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!మీ ఇల్లు అధిక ధ్వనులు విడుదలయ్యే ప్రాంతాలైన విమానాశ్రయం, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులకు చేరువలో ఉంటే.. మీ ఇంట్లో తప్పనిసరిగా అకౌస్టిక్ విండోలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అదనపు సౌండ్ ఫ్రూఫింగ్ వీటి సొంతం. బహుళ గాజులు, ఇతరత్రా పదార్థాలతో తయారైన ఈ కిటికీలు బయటి శబ్దాలను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో ఎళ్లవేళలా ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. -
ఆ సంవత్సరం.. రియల్ ఎస్టేట్‌కు బంగారం!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల వరద పారుతోంది. గతేడాది సిటీ స్థిరాస్తి రంగంలోకి రూ.3,892 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2024లో వచ్చిన రూ.2,704 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. 2025లో దేశంలోని 8 ప్రధాన మెట్రోల్లోకి 8,474.8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 5 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉందని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.– 2025 సంవత్సరం భారత స్థిరాస్తి రంగానికి బంగారంలాంటిది. గతేడాది దేశీయ రియల్ ఎస్టేట్‌లోకి 8.5 బిలియన్ డాలర్ల గరిష్ట పెట్టుబడులు వచ్చాయి. 2024తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, సుంకాల పెంపు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్‌లోకి ఈ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం గమనార్హం.విభాగాల వారీగా చూస్తే.. 2025లో అత్యధికంగా ఆఫీసు విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ సముదాయంలోకి 4,534.6 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఆ తర్వాత నివాస విభాగంలోకి 1,566.9 మిలియన్ డాలర్లు, మిశ్రమ వినియోగ విభాగంలోకి 819.3 మిలియన్ డాలర్లు, పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి 734.2 మిలియన్ డాలర్లు, రిటైల్‌లోకి 380 మిలియన్ డాలర్లు, డేటా సెంటర్లు, సీనియర్ లివింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ వంటి ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి 272.5 మిలియన్ డాలర్లు, హాస్పిటాలిటీ రంగంలోకి 167.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ మార్కెట్ అదుర్స్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ మార్కెట్ 2025లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. నగరంలో వార్షిక కార్యాలయ లీజింగ్ 11.4 మిలియన్ చదరపు అడుగులకు చేరి, చరిత్రలో రెండవ అత్యధిక స్థాయిని సాధించింది. అదే సమయంలో 2025 ద్వితీయార్ధంలో లగ్జరీ గృహాల అమ్మకాలు మొత్తం విక్రయాలలో 71 శాతంగా నమోదయ్యాయి.ఈ వృద్ధికి ప్రధాన కారణం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ. హైదరాబాద్‌లో కొత్త జీసీసీలు 40 శాతం పెరిగి, భారత్‌లో రెండవ అత్యంత డిమాండ్ ఉన్న నగరంగా నిలిపాయి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు ముందంజలో ఉన్నప్పటికీ, జీసీసీల ద్వారా కార్యాలయ స్థల వృద్ధిలో హైదరాబాద్ బెంగళూరును (33%) అధిగమించింది. ప్రస్తుతం నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో జీసీసీల వాటా సుమారు 50 శాతం.గోల్డ్‌మన్ సాచ్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, సర్వీస్‌నౌ వంటి గ్లోబల్ సంస్థలు భారీ లావాదేవీలతో హైదరాబాద్‌ను హై-వాల్యూ కార్యకలాపాల కోసం కీలక కేంద్రంగా నిలిపాయి. ఈ డిమాండ్ వల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో కార్యాలయ అద్దెలు నెలకు 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.77కు చేరాయి.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.కోటి పైబడిన ఇళ్లు ఇప్పుడు మార్కెట్‌ను నడుపుతున్నాయి. ఇవి మొత్తం లావాదేవీ విలువలో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025లో రెసిడెన్షియల్ అమ్మకాలు 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరగా, బెంగళూరులో వృద్ధి స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో సగటు ఆస్తి ధరలు 13 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,721కు చేరాయి. కొత్త సరఫరా పరిమితంగా ఉండటంతో అమ్ముడుపోని ఇన్వెంటరీ 2 శాతం తగ్గింది.రూ.2–5 కోట్ల సెగ్మెంట్లో అమ్మకాలు 22 శాతానికి పెరిగాయి. రూ.10–20 కోట్ల అల్ట్రా-లగ్జరీ గృహాలు కేవలం 1.1 త్రైమాసికాల్లోనే అమ్ముడవుతున్నాయి. దీనికి విరుద్ధంగా, రూ.50 లక్షల లోపు గృహాల వాటా 4 శాతానికి పడిపోయింది.కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలు లగ్జరీ హౌసింగ్‌కు కేంద్రాలుగా మారాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బెంగళూరుతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, టీఎస్ ఐపాస్ వంటి ప్రభుత్వ చర్యలు హైదరాబాద్‌ను హై-గ్రోత్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిపాయి. -
హైదరాబాద్‌లో మెరుగ్గా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు గతేడాది మెరుగ్గా కొనసాగాయి. 2024తో పోల్చితే 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరాయి. ఇళ్ల ధర చదరపు అడుగునకు (ఎస్ఎఫ్టీ) 13 శాతం పెరిగి రూ.6,271కు చేరుకుంది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాది ఒక శాతం తగ్గి 3,48,207 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఇళ్ల ధరలు మాత్రం ఎస్ఎఫ్టీకి 19 శాతం పెరిగాయి. రేట్లు పెరగడంతో డిమాండ్ నెమ్మదించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ గృహ రుణాలపై రేట్లు తగ్గడం, బలమైన ఆర్థిక వృద్ధితో ఇళ్ల డిమాండ్‌ను స్థిరంగా కొనసాగేలా చేసింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రధాన ప్రాంతాల్లోని ఇళ్ల అమ్మకాల డేటా ఆధారంగా ఈ వివరాలు ప్రకటించింది. పట్టణాల వారీ.. ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 97,188 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 7 శాతం పెరిగి రూ.8,856కు చేరింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు ఎలాంటి మార్పు లేకుండా 55,373 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 12 శాతం పెరిగి రూ.7,388గా ఉంది. పుణెలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం తగ్గి 50,881 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక్కడ ధర 5 శాతం పెరిగి రూ.5,016కు చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్మకాలు 9 శాతం తగ్గి 52,452 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 19 శాతం ఎగసి రూ.60,28గా ఉంది. అహ్మదాబాద్‌లో విక్రయాలు 2 శాతం పెరిగి 18,752 యూనిట్లుగా నమోదయ్యాయి. ధర 3 శాతం పెరిగి రూ.3,197కు చేరింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. 18,262 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 7 శాతం వృద్ధితో రూ.5,135గా ఉంది. కోల్‌కతాలో అమ్మకాలు 3 శాతం పడిపోయి 16,896 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 6 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.4,037గా నమోదైంది. -
బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్ విల్లా
ఇప్పటివరకూ భారత్‌లో విలాసవంత కార్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన గ్లోబల్ ఆటో దిగ్గజాలు తాజాగా దేశీ రియల్టీ రంగంపై కన్నేశాయి. ప్రధాన ప్రాంతాలలో రియల్టీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దేశీయంగా సరికొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయనున్నాయి. ఇందుకు 2026 కేలండర్ ఏడాదిలో తెరతీయనున్నాయి. ముంబై, చెన్నై సహా ప్రధాన నగరాలు, గుర్గావ్, హైదరాబాద్ తదితర అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు వివిధ రియల్టీ డెవలపర్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగ్జరీ కార్ల దిగ్గజం లాంబోర్గిని ప్రమోటర్ కుటుంబం దేశీ రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుర్గావ్లో విలాసవంత బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మెర్సిడిస్ బెంజ్ రియల్టీ డెవలపర్స్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఎండబ్ల్యూ సైతం దేశీ రియల్టీ గ్రూప్‌లతో చర్చలు నిర్వహిస్తోంది. అయితే బ్రాండెడ్ ప్రాజెక్ట్ చేపడుతుందా లేక .. రియల్టీలో కార్యకలాపాలు కలిగిన క్రియేటివ్ డిజైన్ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ డిజైన్వర్క్స్పై ముందుకెళుతుందా అనే విషయంపై సందిగ్ధత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ముంబై, చెన్నైలలో హైపెర్ఫార్మెన్స్ కార్లు, ఎస్‌యూవీలు రూపొందించే లాంబోర్గిని ప్రమోటర్ టోనినో ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు లాంబోర్గిని టోనినో ఎస్పీఏ ద్వారా చర్చలకు తెరతీశారు. కార్ల దిగ్గజం లాంబోర్గినీ వ్యవస్థాపకుడు ఫెరూసియో లాంబోర్గిని కుమారుడితడు. కాగా.. ఇప్పటికే దుబాయ్, మియామీ(ఫ్లోరిడా)లలో ప్రాజెక్టులు చేపట్టిన గ్లోబల్ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ దేశీ ప్రణాళికలు వెల్లడికావలసి ఉంది. ఈ బాటలో ఆటోమొబైల్ దిగ్గజాలేకాకుండా దేశీయంగా రియల్టీ రంగ కార్యకలాపాలపట్ల ప్రీమియం వెల్నెస్ బ్రాండ్లు, ఫ్యాషనబుల్ క్లాతింగ్ సంస్థలు, యూరోపియన్ డిజైన్ స్టూడియోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన నగరాలలో బ్రాండెడ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు రంగాల గ్లోబల్ దిగ్గజాలు ఇప్పటికే డెవలపర్స్‌తో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. సరికొత్త బ్రాండ్లతో సరికొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు.. నాణ్యతా ప్రమాణాలకు హామీనిచ్చేందుకు వీలుండటంతో దేశీయంగా రియల్టీ డెవలపర్లు సైతం గ్లోబల్ దిగ్గజాలవైపు చూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సంప్రదాయ బ్రాండెడ్ రెసిడెన్షియల్ మార్కెట్లయిన యూఎస్, యూఏఈ, థాయ్‌లాండ్, వియత్నాం తదితరాల జాబితాలో భారత్ సైతం చేరనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బ్రాండెడ్ రెసిడెన్స్ సరఫరాలు 55 శాతం జంప్‌చేసినట్లు శావిల్స్ బ్రాండెడ్ రెసిడెన్స్ 2025–26 నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా వియత్నాం, థాయ్‌లాండ్‌తోపాటు.. భారత్‌లో వృద్ధి సహకరించినట్లు తెలియజేసింది. ఈ ప్రభావంతో టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(తాజ్ హోటళ్లు) సైతం చెన్నైలో బ్రాండెడ్ రెసిడెన్సీవైపు దృష్టి పెట్టడం గమనార్హం! కారణాలున్నాయ్.. ప్రస్తుతం లైవ్ బ్రాండెడ్ రెసిడెన్స్ ప్రాజెక్టుల విషయంలో భారత్ ప్రపంచంలో ఆరో ర్యాంకును ఆక్రమిస్తోంది. గ్లోబల్ సరఫరాల్లో నాలుగో స్థానంలో నిలుస్తోంది. చేపట్టనున్న ప్రపంచ ప్రాజెక్టులలో పదో ర్యాంకును అందుకుంది. దేశీ రియల్టీ రంగంలో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించిన గ్లోబల్ బ్రాండ్లలో ఫోర్ సీజన్స్, రిట్జ్ కార్ల్టన్, మారియట్, అర్మాణీ కాసా, వెర్సేస్ హోమ్, ట్రంప్ ఫ్యామిలీ, హయత్, పుల్‌మ్యాన్, ఐటీసీ, హిల్టన్ తదితరాలున్నాయి. ఈ బాటలో తాజాగా లగ్జరీ బ్రాండ్ల ఆటో దిగ్గజాలు క్యూ కట్టడం గమనించదగ్గ అంశం!ఆకర్షణీయ మార్కెట్‌గా ఒకప్పుడు దిగ్గజాల లక్ష్యంగా నిలిచిన దుబాయ్, మియామీ, లండన్ బాటలో ఇప్పుడు భారత్ భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రాండెడ్ రెసిడెన్స్‌లకు దేశీయంగా అత్యంత సంపన్నవర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. నోయిసిస్ క్యాపిటల్ అడ్వయిజర్స్ విశ్లేషణ ప్రకారం టైర్–1 మార్కెట్లు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల బాటలో టైర్–2 పట్టణాలు సైతం దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, గోవా, సూరత్ తదితరాలున్నాయి. గత మూడేళ్లుగా లగ్జరీ ప్రాజెక్టులు జోరందుకోవడం ఇందుకు తోడ్పాటునిస్తోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ధర ఎక్కువైనా.. ఆ ఇళ్లకే డిమాండ్!
నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన.. ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్.. జూలై నుంచి డిసెంబర్ 2025 వరకు మొత్తం అమ్మకాలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో మొత్తం 3.48 లక్షల ఇళ్ల అమ్మకాలు జరగడం ద్వారా.. మార్కెట్ బలాన్ని నిలుపుకున్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 1 శాతం స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైందని స్పష్టం చేసింది.నగరాల వారీగా చూస్తే, ముంబై దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కెట్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2025లో ముంబైలో సుమారు 97 వేల ఇళ్లు అమ్ముడయ్యాయి. భూమి లభ్యత పరిమితంగా ఉన్నప్పటికీ, ధరలు పెరుగుతున్నా కూడా ఇక్కడ డిమాండ్ నిలకడగా కొనసాగింది. మరోవైపు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ, ఇళ్ల ధరలు ఏకంగా 19 శాతం పెరిగాయి.బెంగళూరు మార్కెట్ స్థిరంగా కొనసాగుతూ, ఎండ్-యూజర్ డిమాండ్ ఆధారంగా అమ్మకాలను నిలబెట్టుకుంది. చెన్నై & హైదరాబాద్ నగరాలు 2025లో గణనీయమైన వృద్ధిని చూపాయి. ముఖ్యంగా చెన్నైలో 12 శాతం అమ్మకాల వృద్ధి నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో కూడా ధరలు & అమ్మకాలు రెండింటిలోనూ పెరుగుదల కనిపించింది.ధరల విషయానికి వస్తే.. 2025లో అన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల అమ్మకాలు.. మొత్తం మార్కెట్లో సగం వాటాను దక్కించుకున్నాయి. కాగా 50 లక్షల రూపాయల ఖరీదైన ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. -
రియల్ ఎస్టేట్‌కి పెట్టుబడులు బూస్ట్
రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (సంస్థాగత) గతేడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 8.47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. 2024లో వచ్చిన 6.56 బిలియన్ డాలర్ల కంటే 29 శాతం అధికమని పేర్కొంది. ఇందులో దేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగ్గా, విదేశీ పెట్టుబడులు తగ్గాయి. దేశీ ఇన్వెస్టర్ల నుంచి 4.82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.2024లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2.24 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 120 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2025లో 16 శాతం తగ్గి 3.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ వివరాలతో కొలియర్స్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఫండ్–డెవలపర్స్, ఎన్బీఎఫ్సీలు, రీట్లు, సావరీన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.‘‘2025లో అధిక శాతం పెట్టుబడులను ఆఫీస్ ఆస్తులు ఆకర్షించాయి. మొత్తం పెట్టుబడుల్లో 54 శాతం (4.53 బిలియన్ డాలర్లు) ఆఫీస్ ఆస్తుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నివాస ప్రాజెక్టులు, పారిశ్రామిక, గోదాముల్లోకి వెళ్లాయి’’అని కొలియర్స్ ఇండియా ఎండీ, సీఈవో బాదల్ యాజ్ఙిక్ తెలిపారు. 2026లో సంస్థాగత పెట్టుబడులు మరింత బలపడతాయని, అంతర్జాతీయంగా పెట్టుబడులకు రిస్క్ ధోరణి పెరగడం, దేశీ ఇన్వెస్టర్లు ఇందుకు మద్దతుగా నిలవనున్నట్టు పేర్కొంది. -
ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!
రవి ఏడాది కిందటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. మళ్లీ ఇపుడు రవి కంపెనీ బెంగళూరుకు వెళ్లమంటోంది. మరి ఇలా మారినపుడల్లా ఇల్లు మారాలి సరే...! ఇంటితో పాటు మొత్తం సామగ్రిని తరలించుకోవాలా? ఇలా ఫర్నిచర్‌ను, ఎల్రక్టానిక్ వస్తువుల్ని తీసుకెళ్లటం తలకుమించిన పని. పైపెచ్చు కొన్ని పాడవుతాయి. పోనీ ఇక్కడే కొన్నింటిని విక్రయించేద్దామంటే... కొన్న ధరలో కనీసం 50 శాతం కూడా రాదాయె!. పైపెచ్చు అక్కడ మళ్లీ కొత్తవి కొనుక్కోవాలి. మరి దీనికి పరిష్కారమేంటి?అందుకేనేమో! రవి బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌కు వచ్చాక కూడా పెద్దగా సామగ్రి తెచ్చుకోలేదు. కావాల్సిన ముఖ్యమైన వస్తువుల్ని నెలవారీ అద్దెకు తీసుకున్నాడు. ఇంటద్దెతో పాటే వాటికీ ప్రతినెలా కొంత చెల్లిస్తున్నాడు. ఇపుడు మారేటపుడు వాటిని ఇక్కడే ఇచ్చేసి... మళ్లీ బెంగళూరులో వేరే వస్తువులు అద్దెకు తీసుకోవచ్చునని అనుకున్నాడు. అందుకే తనకు ఇలా మారటం పెద్దగా ఇబ్బంది అనిపించటం లేదు. మరి ఈ పద్ధతి ఎవరికి మంచిది? నానాటికీ ప్రాచుర్యం పొందుతున్న ‘రెంటింగ్ ఫర్నిచర్’ విధానం ఎవరికి అనుకూలం? ఇదంతా వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’ నవతరం ఉద్యోగాల్లో విపరీతంగా మార్పులొస్తున్నాయి. కొన్నాళ్లు ఓ చోట ఇంకొన్నాళ్లు మరో చోట పనిచేయాల్సి వస్తోంది. ఐటీ, స్టార్టప్‌లలో పని చేసేవారు, గిగ్ వర్కర్లు ప్రతి 18– 30 నెలలకు వేరే నగరాలకు మారుతున్నారు. ఇలా మారినప్పుడల్లా పాత ఫర్నిచరును విక్రయిద్దామంటే 30–50% నష్టపోవాల్సి వస్తోంది. కొత్త ఊళ్లో సాధారణంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఫర్నిచర్ వగైరా కొనుక్కోవాలంటే సుమారు రూ.2– 3 లక్షల వరకు అవు తోంది. అదే అద్దెకు తీసుకుంటే నెలకు రూ. 4,000 నుంచి రూ. 6,000 వరకు కడితే సరిపోతోంది. ఇక సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి న మొత్తం పెద్దగా ఉండటం లేందు. ఉన్నా.. చాలా తక్కువ. పైపెచ్చు గడువు తీరాక వెనక్కి తిరిగి వస్తుంది. దీనివల్ల ముందస్తుగా పడే భారం గణనీయంగా తగ్గుతుంది.మెయింటెనెన్స్ భారం ఉండదు..సొంతంగా కొనుక్కున్న ఫర్నిచరుకు, ఉపకరణాలకు సమస్యలేవైనా వస్తే రిపేర్లు చేయించేందుకు కంపెనీలు, టెక్నీషియన్ల వెంట పడాల్సి వస్తుంది. వాళ్లు వచ్చే దాకా నమ్మకం ఉండదు. వారు తీరా వచ్చి, ఎస్టిమేషన్ చెబితే, రిపేరు కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే పాత దాన్ని ఎంతో కొంతకు ఎక్స్ఛేంజీకి పెట్టేసి, కొత్తదే కొనుక్కోవచ్చు కదా అనే ఫీలింగూ కలుగుతుంది. అంటే ఒక రకంగా వేలు పోసి కొనుక్కున్న వస్తువుకు రిపేరు వస్తే మనశ్శాంతి లేకుండా పోవడంతో పాటు పర్సుకూ ఫ్రెష్‌గా చిల్లుపడే పరిస్థితి ఉంటోంది. ఇలా కొనుక్కునే బదులుగా అద్దెకే తీసుకుంటే.. ఈ రిపేర్లు గట్రా వచ్చినప్పుడు, సమాచారం ఇస్తే, బాదరబందీ అంతా సదరు కంపెనీయే చూసుకుంటుంది. ఏసీ బ్రేక్‌డౌన్ అయ్యిందా. కంపెనీయే మారుస్తుంది. వాషింగ్ మెషీన్ సమస్య వచ్చిందా. ఉచితంగా సర్వీస్ అందిస్తుంది. మరమ్మత్తుల తలనొప్పి గానీ రీసేల్ గురించి ఆందోళన గానీ చెందనక్కర్లేదు.పరిస్థితిని బట్టి నిర్ణయం..ఫర్నిచర్, గృహోపకరణాలను అద్దెకు తీసుకోవాలా లేదా కొనుక్కుంటే మంచిదా అనేది పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 24– 30 నెలలకు మించి మారే అవసరం లేకపోతే అద్దెకు తీసుకోవడం కన్నా కొనుక్కోవడమే మంచిది. ఎందుకంటే అంత సుదీర్ఘ వ్యవధిలో కొనుగోలు కోసం ఖర్చు పెట్టే దానికన్నా అద్దె రూపంలోనే ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. పైగా రీసేల్ చేసే అవకాశం గానీ సొంతం చేసుకునే పరిస్థితి గానీ ఉండదు. సొంతిల్లు ఉండి, ఒకే చోట చోటే ఉద్యోగం చేస్తూ స్థిరపడిన వారికైతే అద్దెకన్నా కొనుక్కోవటమే శ్రేయస్కరం.చూసుకోవాల్సిన విషయాలివీ..అద్దెకు తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బయటకు చెప్పని రహస్య చార్జీలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే గడువుకన్నా ముందుగానే తిరిగి ఇచ్చేస్తే భారీగా పెనాల్టీలేవైనా ఉంటాయేమో కనుక్కోవాలి. సాధారణంగా వాడకం వల్ల పాడవడం కాకుండా ఇతరత్రా ఏవైనా కారణాలతో పాడైతే విధించే డ్యామేజీ చార్జీలు ఏ స్థాయిలో ఉంటాయనేది కూడా చూసుకోవాలి. అలాగే మొదటి విడత తర్వాత రెంటు ఎంత మేర పెరుగుతుందో తెలుసుకోవాలి. షరతులు మొదలైనవన్నీ క్షుణ్నంగా తెలుసుకుని స్మార్ట్‌గా నిర్ణయం తీసుకోవాలి. -
15 నిమిషాల్లోనే ఇల్లు.. రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండు
మెట్రో, బస్, రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 15 నిమిషాల్లోనే ఇల్లు.. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లేంత దూరంలో ఆఫీసు.. సైకిల్ మీద వెళ్లేంత సమీపంలోనే మార్కెట్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్..సింపుల్‌గా 15 మినిట్స్ సిటీ అంటే ఇదీ! గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విసుగు పడే బదులు మనకు ఇష్టమైన అభిరుచిలో గడిపేందుకు వీలు కల్పించేవే ఈ 15 నిమిషాల ప్రాజెక్ట్‌లు.వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో చాలా మంది డెవలపర్లు మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా నిర్మాణ సముదాయాల్లో నివాసాలతో పాటు వర్క్‌ప్లేస్‌లు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వినోదం వంటి అన్ని రకాల వసతులు కేవలం వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉంటాయి. ఈ రోజుల్లో గృహ కొనుగోలుదారులు గేటెడ్ కమ్యూనిటీ, సౌలభ్యం, కనెక్టివిటీలను కోరుకుంటున్నారు. కస్టమర్లు అనుభవపూర్వక జీవనాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నారు.బీమా, వెల్నెస్ సెంటర్లే కాదు ఫిజియోథెరపీ స్టూడియోలు, ప్లే స్కూళ్లు, పెంపుడు జంతువులను పెంచే ప్రత్యేక పార్క్‌లు ఇతరత్రా ఆధునిక వసతులు ఒకే చోట ఉండాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కస్టమర్లకు పర్యావరణ స్పృహ పెరిగిపోయింది. నివాసం ఉండే చోటే గ్రీనరీ అధికంగా ఉండాలని భావిస్తున్నారు. ఐసోలేటెడ్, హైరైజ్ ప్రాజెక్ట్‌ల కంటే నడకకు వీలుండే బహిరంగ ప్రదేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిత్యావసరాలతో పాటు వారాంతంలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అందుబాటులో ఉండే వసతుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీది కిలో మీటరులోపే ఉండాలని కోరుకుంటున్నారు. స్వయం సమృద్ధి నగరాల వైపు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల నుంచి స్వయం సమృద్ధి గల పర్యావరణ వ్యవస్థల వైపు మళ్లుతోంది. రిటైల్, ఎంటర్టైన్ మెంట్ విభాగాలు నివాస సముదాయాలకు చేరువలోకి మారాయి. 15–20 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఆయా వసతులు, సౌకర్యాలు అందుకునే వీలు కలిగింది. కానీ, ఆఫీసు విభాగం మాత్రం ప్రధాన నగరంలో కంటే దూరంగా ఉంటున్నాయి. ఇందుకు అధిక అద్దెలు, ట్రాఫిక్ రద్దీ వంటి కారణాలనేకం.కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ విధానాలతో కంపెనీలు కూడా నివాస సముదాయాలకు చేరువలోనే ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని ఐటీ రంగంలోని 60–70 శాతం మంది సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైటెక్ సిటీ ప్రాంతానికి ప్రయాణిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీతో పాటు కర్బన ఉద్గారాలతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లో 15మినిట్స్ సిటీ కాన్సెప్ట్ ప్రాచుర్యంలోకి వచ్చింది.ఏంటీ 15 మినిట్స్ సిటీ? 15 నిమిషాల నగరాలనేవి ప్రధానంగా పని, విద్య, విశ్రాంతి వంటి ముఖ్యమైన అంశాలతో కూడుకున్న కాన్సెప్ట్. ఇవన్నీ వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉండే ప్రాంతాలు. ఇక్కడ నివాసితులు ఇంటి నుంచి నడక లేదా సైక్లింగ్ రైడ్‌లో పని, విద్యా, వైద్యం, వినోదం, విశ్రాంతి వంటి రోజువారీ అవసరాలను పొందవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాంతాలే 15 మినిట్స్ సిటీలు. వాహనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ వ్యవస్థను పెంపొందించే మౌలిక, సామాజిక వసతులను కల్పించడమే ఈ నగరాల ప్రధాన లక్ష్యం.ఈ ప్రాంతాలలో ఎక్కువగా.. ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా దక్షిణ భారతీయ నగరాలలో కనిపిస్తుంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 10,101 కొత్త నివాస యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 39 శాతం వాటా కేవలం పశ్చిమం, ఆ తర్వాత 32 శాతం వాటా దక్షిణ హైదరాబాద్ కలిగి ఉంది. కొండాపూర్, మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, నియోపొలిస్, మోకిలా, కొల్లూరు, కోకాపేట వంటి ప్రాంతాలు స్వయం సమృద్ధి గల మినీ నగరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమం వైపు పరిమితమైన ఐటీ పరిశ్రమను తూర్పువైపు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఉప్పల్, పోచారం, ఎల్బీనగర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలు 15 నిమిషాల్లోనే కార్యాలయానికి చేరుకునే విధంగా అభివృద్ధి చెందాయి.ఈ నగరాల్లో ఏముంటాయంటే.. దట్టమైన పచ్చని ప్రదేశాలు, మిశ్రమ వినియోగ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. వాక్ లేదా సైక్లింగ్ మార్గాలు, మెరుగైన ప్రజా రవాణాపై దృష్టిపెడతారు. పని చేసే ప్రాంతాలు, దుకాణాలు, పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఇలా అన్నీ కిలో మీటరు దూరంలోనే ఉంటాయి. బైక్‌లు, కార్లు వంటి వాహనాలకు బదులుగా నడక, సైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మెరుగైన మౌలిక, సామాజిక వసతులతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి. కార్బన్ ఉద్గారాలను, ట్రాఫిక్‌ను తగ్గిస్తుంది. శారీరక శ్రమను ప్రోత్సహిస్తుంది. మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. -
ఇంటికి అద్దె ఇప్పిస్తారు.. అన్నీ చూసుకుంటారు!
హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె డబ్బులను ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న రాజు ప్రతినెలా అందుకుంటున్నాడు. విద్యుత్తు, ఆస్తి పన్ను బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ‘ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (పీఎంఎస్)తో ఇది సాధ్యమే. మీ చిన్నచిన్న పనుల్ని దగ్గరుండి చేసి పెట్టడానికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఒకటో రెండో సంస్థలే ఇలాంటి సేవల్ని అందించేవి. ప్రస్తుతం డజనుకు పైగా నిర్మాణ సంస్థలు ఈ తరహా సేవల్ని అందిస్తున్నాయి.ఈ బాధ్యతలు వీరివే.. పీఎంఎస్ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజనం అంతాఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. నెల వచ్చేసరికి అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారుడికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే.. అద్దెదారులు పాటించాల్సిన రూల్స్‌ను మీ తరఫున సంస్థనే ఖరారు చేస్తుంది. క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమచేయడం వీరి సేవలో భాగమే.నిర్వహణ భారం కూడా.. మీది ఫ్లాట్ అయితే అపార్టుమెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. విద్యుత్, ఆస్తి పన్ను బిల్లులను చెల్లిస్తారు.వివాదం తలెత్తితే.. మీకు అద్దెదారుడికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే.. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేది కూడా వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతో కొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు. -
రియల్ ఎస్టేట్ ఏజెంట్లూ.. బీ కేర్ ఫుల్!
కమీషన్లకు ఆశ పడి గృహ కొనుగోలుదారులకు ఏవేవో మాయమాటలు చెప్పి ప్లాట్, అపార్ట్మెంట్ విక్రయించేశామా.. చేతులు దులిపేసుకున్నామా? అంటే కుదరదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు, బ్రోకర్లు టీజీ రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం నేరం. గృహ కొనుగోలుదారులకు సరైన సమాచారం అందించి వారు మోసాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులది. రెరా నిబంధనలు పాటించని ఏజెంట్లకు రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, పెట్టుబడులకు భద్రత కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) ప్రధాన లక్ష్యం. ఏజెంట్లు, మధ్యవర్తులు ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనలకు 43 ఆఫ్ 1961 ప్రకారం తన ఖాతా పుస్తకాలు, రికార్డులు, ఇతరత్రా పత్రాలను నిర్వహించడంతో పాటు తరచూ సమీక్షించాలి.ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, డీటీసీపీ, యూడీఏ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు రెరా అథారిటీ ఆమోదం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు, అపార్ట్మెంట్ల అమ్మకం, బుకింగ్, ఆఫర్లు, మార్కెటింగ్, ఇతర ప్రచారాలు చేయకూడదు. రెరా నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాజెక్ట్‌లు, బిల్డర్లకు రెరా చట్టంలోని సెక్షన్–59 ప్రకారం అపరాధ రుసుములు విధిస్తుంది.ఇది చదివారా? రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!10,408 ప్రాజెక్ట్‌ల నమోదు.. ఇప్పటి వరకు టీజీ రెరాలో 10,408 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 4,729 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10 మంది ప్రాజెక్ట్‌లు/ఏజెంట్ల రిజి్రస్టేషన్లను రద్దు చేశారు. జయాస్ ప్లాటినం, బీఆర్ మోడోల్యాండ్ అపార్ట్మెంట్స్, కేసినేని నార్త్స్కేప్, సిగ్నిఫా సిగ్నేచర్, లక్ష్మీ ఇన్ఫోబాన్ టవర్–23, ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ–ఫేజ్ 2, వియాన్ వన్80, గంగిడీస్ రాయల్ అడోబ్, స్పెక్ట్రా టెక్ టవర్స్ వీటిల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు టీజీ రెరాలో 2,619 ఫిర్యాదులు నమోదు కాగా.. 1,709 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి. -
పాత కాలనీలకు కొత్త సొబగులు!
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న పాత కాలనీలు కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. పాత, శిథిలావస్థలో ఉన్న తక్కువ ఆదాయ సమూహం(ఎల్ఐజీ), మధ్యతరగతి ఆదాయ సమూహం(ఎంఐజీ) గృహ నిర్మాణాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఐజీ యూనిట్ల యజమానులతో చర్చలు ప్రారంభించింది. దీంతో పాత కాలనీలు నివాస, వాణిజ్య హైరైజ్ భవనాలతో అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పటికే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ), సైదాబాద్‌లోని ఓ కాలనీలోని ఫ్లాట్ల యజమానులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయా అపార్ట్మెంట్లు 20-40 అంతస్తుల ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి.పీపీపీ విధానంలో..రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం నగరంలో నిర్మించిన అన్ని ఎల్ఐజీ, ఎంఐజీ బ్లాక్‌లను తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ఒకే చోట భారీ భూమిని పొందడంతో పాటు బహుళ అంతస్తుల ప్రాజెక్ట్ నిర్మాణాలకు వీలు కలుగతుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పర్యావరణ సమస్యలను తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం, పాత స్థలాలను తిరిగి ఉపయోగించడం ద్వారా పట్టణ విస్తరణను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రధాన నగరంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్) కాలనీలు ఎకరం కంటే తక్కువ ఉన్న భూములు బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి చెందనున్నాయి.ఈడబ్ల్యూఎస్ కాలనీల పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లకు తెలంగాణ హౌసింగ్ బోర్డ్, హౌసింగ్ కార్పొరేషన్లు నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. క్యూర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి హైరైజ్ ప్రాజెక్ట్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో చేపడతారు.ఇదీ చదవండి: నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!మెరుగైన మౌలిక సదుపాయాలుబ్రౌన్ఫీల్డ్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లతో ఎల్ఐజీ, ఎంఐజీ ఫ్లాట్ యజమానులకు మరింత నిర్మాణ ప్రాంతం, మెరుగైన రోడ్లు, పౌర, రవాణా మౌలిక సదుపాయాలు, పార్క్‌లతో కొత్త ఫ్లాట్లు ఇస్తారు. కాలనీల పునరాభివృద్ధి పూర్తయ్యే వరకూ ఫ్లాట్ యజమానులను వేరే చోట ఉంచుతారు. ఇప్పటికే ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ వెలుపల నాలుగు ప్రాంతాలలో సరసమైన గృహ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కో ప్రాంతంలో దాదాపు 10 వేల యూనిట్లను నిర్మించనున్నారు. -
నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!
బిల్డర్ నిర్మాణాన్ని పూర్తి చేయగానే కొనుగోలుదారుల్లో పలు సందేహాలు నెలకొంటాయి. ఎప్పటిలోగా బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను అప్పగించాలి? అతడి నుంచి ఏయే పత్రాలు తీసుకోవాలి? సంఘం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి? వీటిపై అవగాహన పెంచుకుంటేనే బదిలీ ప్రక్రియ ఎంతో సులువుగా జరుగుతుంది.అపార్ట్మెంట్ చిన్నదైనా, పెద్దదైనా.. లగ్జరీ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం పూర్తవగానే ఫ్లాట్లు కొన్నవారంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్ ప్రతిపాదించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సంఘం పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ మొత్తాన్ని అందులో జమ చేయాలి. నిర్మాణానికి సంబంధించిన కీలకమైన పత్రాలను బిల్డర్ నుంచి తప్పకుండా తీసుకోవాలి.బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే..➤బిల్డింగ్ ప్లాన్, అప్రూవల్ ప్లాన్➤కంప్లీషన్ సర్టిఫికెట్➤ఆమోదం పొందిన ఫ్లోర్ ప్లాన్లు➤పొల్యుషన్ బోర్డు, విద్యుత్తు, జలమండలి, ఫైర్ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు➤విద్యుత్, తాగునీరు వంటి కనెక్షన్లు➤రిజిస్ట్రేషన్ పత్రాలు, అపార్ట్మెంట్కి సంబంధించిన డ్రాయింగులు➤కార్పస్‌ఫండ్, అన్ని సౌకర్యాలను సంఘానికి బిల్డర్ బదిలీ చేయాలిఓసీ తప్పనిసరి..నగరంలో అపార్ట్మెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూకట్పల్లి, నిజాంపేట, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మదీనాగూడ, తెల్లాపూర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, కోకాపేట, నార్సింగి వంటి నగరం నలువైపులా అనేక అపార్ట్మెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి కాగానే బిల్డర్ స్థానిక సంస్థ(జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ) నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) తీసుకోవాలి. ఈ ఓసీ వచ్చాక సుమారు రెండేళ్ల వరకు బిల్డర్ అపార్ట్మెంట్ నిర్వహణ బాధ్యత తీసుకోవచ్చు.సాధారణ శుభ్రత, భద్రత, బిల్లుల చెల్లింపులు, ఆస్తిపన్ను చెల్లింపులు, డీజీ(డీజిల్ జెనెరేటర్) సెట్ల నిర్వహణ, నివాసితులకు కావాల్సిన ఇతరత్రా పనులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండేళ్లయ్యాక నివాసితులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్ ప్రతిపాదించాలి. ఫ్లాట్ కొన్నప్పుడు.. కొనుగోలుదారులు చెల్లించిన కార్పస్ ఫండ్‌ను బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్ ప్రకారమే బిల్డర్ నిర్మాణం చేపట్టాడని తెలియజేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థ నుంచి తీసుకోవాలి. నిర్మాణాన్ని అప్పగించేటప్పుడు బిల్డర్ నుంచి కొత్తగా ఏర్పడిన అపార్ట్మెంట్ సంఘం పలు పత్రాలను తప్పకుండా తీసుకోవాలి. -
నగరాల్లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో జోరు తగ్గింది. ఈ ఏడాదిలో డిసెంబర్ 25 నాటికి 5.45 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘స్క్వేర్యార్డ్స్’ తెలిపింది. క్రితం ఏడాది 5.77 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లతో పోల్చి చూస్తే 5 శాతం తగ్గినట్టు వెల్లడించింది. కానీ, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ల విలువ 11 శాతం పెరిగి 4.46 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది. 2024లో టాప్–9 నగరాల్లో ప్రాపర్టీ రిజి్రస్టేషన్ల విలువ 4.03 లక్షల కోట్లుగానే ఉంది. ఈ మేరకు ఒక నివేదికను స్క్వేర్యార్డ్స్ విడుదల చేసింది. హైదరాబాద్, పుణె, థానే, ముంబై, నవీ ముంబై, బెంగళూరు, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల గణాంకాల ఆధారంగా వివరాలను వెల్లడించింది. మొదటిసారి రిజి్రస్టేషన్తోపాటు, సెకండరీ సేల్ (అప్పటికే వినియోగించిన ఇళ్లు విక్రయించడం) గణాంకాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయి.లగ్జరీ, ప్రీమియం ఇళ్ల హవా..‘‘ఖర్చు పెట్టేందుకు వీలుగా అధిక ఆదాయం కలిగిన ధనవంతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో 2025 ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి’’అని స్క్వేర్యార్డ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో తనుజ్ షోరి పేర్కొన్నారు. గత మూడు నుంచి ఐదేళ్ల కాలంలో పలు మార్కెట్లలో ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతూ రావడంతో కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తోందన్నారు.‘‘డిమాండ్ బలంగా ఉంది. 2026లో లగ్జరీ విభాగంలో వృద్ధి అన్నది మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చు. మార్కెట్ నిదానించడం కాకుండా స్థిరీకరణకు గురి కావొచ్చు’’అని పేర్కొన్నారు. అయితే 2026లోనూ ఇళ్ల మార్కెట్లో స్థిరమైన పురోగతి నెలకొంటుందని, మధ్యాదాయ మార్కెట్లో డిమాండ్ క్రమంగా సర్దుబాటుకు గురికావొచ్చని స్క్వేర్యార్డ్స్ నివేదిక తెలిపింది. ట్రిబెకా డెవలపర్స్ గ్రూప్ సీఈవో రజత్ ఖండేల్వాల్ ఈ నివేదికపై స్పందిస్తూ.. కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టుల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రీమియం, పెద్ద ఇళ్లకు డిమాండ్ నిలకడగా ఉన్నట్టు ఆల్ఫా కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ సీఎఫ్‌వో సంతోష్ అగర్వాల్ వెల్లడించారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా? -
ఇళ్ల విక్రయాలు.. నేలచూపులు
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది నీరసించింది. విక్రయాలు క్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 23 శాతం తగ్గి 44,885 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది అమ్మకాలు 58,540 యూనిట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ఒక్క చైన్నై నగరంలో మాత్రం డిమాండ్ పుంజుకుంది. ఇళ్ల యూనిట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, విలువలో మాత్రం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసింది. ప్రాపర్టీ ధరలు పెరగడం, ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు విక్రయాలు తగ్గడానికి కారణాలుగా అనరాక్ పేర్కొంది. ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది సగటున 8 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. విక్రయాలు ఇలా..మొత్తం ఏడు నగరాల్లో 2025లో ఇళ్ల అమ్మకాలు ఇప్పటి వరకు 3,95,625 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 4,59,645 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది అమ్ముడుపోయిన ఇళ్ల విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది అమ్మకాల విలువ రూ.5.68 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 1,27,875 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది కంటే 18 శాతం తగ్గాయి.పుణెలోనూ క్రితం ఏడాదితో పోల్చితే 20 శాతం తక్కువగా 65,135 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.బెంగళూరులో 5 శాతం తక్కువగా 65,135 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 57,220 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 61,900 కంటే 8 శాతం తగ్గాయి.కోల్‌కతాలో 16,125 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాదితో పోలి్చతే 12 శాతం పడిపోయాయి. చెన్నైలో మాత్రం అమ్మకాలు క్రితం ఏడాదితో పోల్చితే 15 శాతం పెరిగాయి. 22,180 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2024లో ఇళ్ల ధర చదరపు అడుగునకు రూ.8,590గా ఉంటే, ఈ ఏడాది 8 శాతం పెరిగి రూ.9,260కు చేరుకుంది. 2026 అమ్మకాలు ఎలా ఉండొచ్చు?క్రితం ఏడాది డబుల్ డిజిట్ స్థాయిలో ఇళ్ల ధరలు పెరగ్గా.. ఈ ఏడాది సింగిల్ డిజిట్ పెరుగుదలతో ఆగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. 2026లో ఇళ్ల మార్కెట్ పనితీరు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, ఇళ్ల ధరల తీరు అమ్మకాలను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
చిన్న అపార్ట్మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్!
ఇంటికొచ్చే అతిథులకు తలుపులు స్వాగతం పలుకుతాయి. అందుకే ప్రధాన ద్వారం వద్ద తలుపుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడుగు స్థలం కూడా ఖరీదైన మహానగరంలో వెడల్పాటి తలుపుల స్థానంలో స్థలాన్ని ఆదా చేసే డోర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్లైడింగ్, ఓపెన్, ఫోల్డింగ్ డోర్స్ జోరు మార్కెట్లో కొనసాగుతోంది. విభిన్న రంగులు, డిజైన్లతో లభ్యమవుతుండటంతో యువ కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. మధ్యలో మడతపెట్టి.. సాధారణ తలుపుల మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో, మడతపెట్టే వీలుగా ఉండటమే ఈ డోర్స్ ప్రత్యేకత. వీటిని కలప, అల్యూమీనియంతో తయారు చేస్తారు. తలుపులు తెరిచినప్పుడు మధ్యలో 1/2 లేదా 1/3 లేదా 2/3 నిష్పత్తిలో మడత పడుతుంది. వీటినే ఫోల్డింగ్ డోర్స్ అంటారు. రెండు ప్యానెల్స్ సమాన పరిమాణంలో ఉండొచ్చు లేదా అసమాన పరిమాణంలో ఒక ప్యానెల్ కంటే మరోటి వెడల్పుగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా ఒకవైపు తిరగానికి, మధ్యలో ఫోల్డ్ కావడానికి వీలుగా స్క్రూలను అమరుస్తారు. కస్టమర్ల అభిరుచి, అవసరాలను బట్టి తలుపులు ఎడమ లేదా కుడి వైపునకు తెరుచుకుంటాయి. ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్‌కు అద్దాలను జోడించి మరింత అందంగా తయారు చేస్తున్నారు.గాలి, వెలుతురు సులువుగా.. చిన్న సైజు అపార్ట్మెంట్లకు, తక్కువ స్థలంలో నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఈ తరహా తలుపులు బాగుంటాయి. ప్రధాన ద్వారం వద్ద కాకుండా ఇతర గదులకు ఈ డోర్స్ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు వంద శాతం స్థలం వినియోగం అవుతుంది. అలాగే కప్బోర్డ్లు, వార్డ్ రోబ్‌లు, కారిడార్లు, వంటగది, బాత్రూమ్లు ఇతర యూటిలిటీ ప్రాంతాలలో ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా వీటిని ఇన్స్టాల్ చేయడం చాలా సులువు. నిర్వహణ కూడా తేలిక. ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్‌తో ఒక గది నుంచి మరో గదిలోకి గాలి, వెలుతురు సులువుగా ప్రసరిస్తుంది.కర్టెన్ ఉందిగా.. ఇంట్లో వెచ్చగా.. నగరంలో రోజురోజుకూ చలి పెరుగుతోంది.. ఉదయం నుంచే ఇంట్లోంచి బయటకు రావాలంటే గజగజలాడాల్సిందే.. సాయంత్రమైతే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఈ చలికాలంలోనూ ఇంటి లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలంటే కిటికీలకు ఉండే కర్టెన్లే కీలకమని అంటున్నారు కర్టెన్ ఇంటీరియర్ డిజైనర్లు. అయితే వాటిలోని రకం, రంగులను బట్టి ఇంటి లోపలి వాతావరణం గడ్డకట్టే చలిలోనూ వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు.ఈ కాలంలో కర్టెన్లకు పలుచటి, కాటన్, లెనిన్ కర్టెన్లు కాకుండా మందంగా లేదా థర్మల్ కర్టెన్లను వెల్వెట్, ఉన్ని, స్వెడ్ లేదా థర్మల్ లైన్డ్, బ్లాక్అవుట్ కర్టెన్లను వినియోగించడం ఉత్తమం. ఇంటి లోపల వేడి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో కర్టెన్ల రంగులు కూడా కీలకమే. ఎరుపు, నారింజ, పసుపు వంటి రంగులకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంచుతాయి. -
నగరాల్లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ దుకాణ వసతులకు, ప్రధాన వీధుల్లోని రిటైల్ వసతులకు డిమాండ్ పెరుగుతున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది డిమాండ్ 15 శాతం పెరిగి 9 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) లీజింగ్ చేరుకోవచ్చని అంచనా వెల్లడించింది. రిటైలర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగనున్నట్టు తెలిపింది. 2024లో ఇవే నగరాల్లో రిటైల్ వసతుల లీజింగ్ 7.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల డేటా ఇందులో ఉంది. ప్రముఖ ప్రాంతాల్లో ఇలా.. టాప్–8 నగరాల్లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో (హై స్ట్రీట్ లొకేషన్లు) ఈ ఏడాది రిటైల్ వసతుల లీజింగ్ 5.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చన్నది కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అంచనా. 2024లో ఇది 5.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక షాపింగ్ మాల్స్‌లోని రిటైల్ దుకాణాల లీజంగ్ పరిమాణం 3.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చని తెలిపింది. 2023లో ఇది 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2020లో కరోనా విపత్తు అనంతరం ఒక ఏడాదిలో రిటైల్ వసతుల అధిక లీజింగ్ ఈ ఏడాదే నమోదు కానున్నట్టు, క్యూ4లో (అక్టోబర్–డిసెంబర్) కొత్త మాల్స్ అందుబాటులోకి రానున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈడీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. వచ్చే ఏడాది కూడా రిటైల్ వసతుల సరఫరా (కొత్తవి ప్రారంభం) మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కస్టమర్లు భౌతికంగా చూసి, కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ప్రీమియమైజేషన్‌కు అనుగుణంగా రిటైల్ వసతుల విస్తరణ చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్త గ్రేడ్–ఏ మాల్స్ పూర్తి 0.9 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితం కావొచ్చని, 2025లో కొత్త డెలివరీలు 4.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని ఈ నివేదిక వెల్లడించింది. మారుతున్న జీవనశైలులు, వినియోగదారుల ప్రాధాన్యతలతో రిటైల్ వసతులకు డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు భారతి రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో ఎస్కే సన్యాల్ తెలిపారు. పట్టణాల్లో అనుసంధానత రిటైల్ వసతుల డిమాండ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. -
రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్‌ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్‌లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్‌తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.విశాలమైన ఇళ్లు.. విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.లగ్జరీదే హవా.. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు. -
అద్దె.. సొంతిల్లు.. ఏది బెటర్?
ఏటేటా పెరుగుతున్న ఇంటి అద్దెలు ఒకవైపు.. తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్న గృహ రుణాలు మరోవైపు.. మధ్యలో సగటు కొనుగోలుదారుడు నలిగిపోతున్నాడు. అద్దె ఇంట్లోనే జీవితం సాగదీద్దామా లేక సొంతిల్లు కొనుగోలు చేసి జీవితంలో మరో మెట్టు ఎక్కుదామా? అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. పోనీ, ధైర్యం చేసి ముందడుగు వేయాలంటే డౌన్ పేవ్మెంట్, ఈఎంఐల భయం.. అలా అని అద్దె ఇంట్లోనే సరిపెట్టుకుందామంటే పెరిగే అద్దెలు, అడ్వాన్స్‌లు భారంగా మారుతున్నాయి. ..ప్రతీ గృహ కొనుగోలుదారుల సంకట పరిస్థితి ఇదే. వాస్తవానికి దేశంలోని పట్టణాలలో ఇది సర్వ సాధారణమైపోయింది. పెరుగుతున్న ఇంటి అద్దెలు, ఆకర్షణీయమైన గృహ రుణాలతో చాలా మంది తమ నెలవారీ వ్యయాల గురించి పునరాలోచిస్తున్నారు. అద్దె చెల్లిస్తూ ఉండటం మంచిదా? లేక ఈఎంఐ చెల్లిస్తూ సొంతింటిని కొనుగోలు చేయడం మంచిదా? అని! ∙సొంతిల్లు అనేది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇది సమాజంలో గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారడం అంత సులభమేమీ కాదు. జీవితకాలం కష్టపడి చేసిన పొదుపు ఖర్చవడంతో పాటు బ్యాంక్ నుంచి తీసుకునే గృహ రుణానికి నెలవారీ వాయిదా(ఈఎంఐ) ఆర్థిక వ్యయం భారీగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె వంటి మెట్రో నగరాలలో అద్దెలు గణనీయంగాపెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులను పునరాలోచిస్తున్నారు. ఇంటి యాజమాన్యం తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇల్లు కొనడం ప్రయోజనకరం.. అద్దె పెంచుతామనో, నచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఇంటి యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంటిని మనకు నచి్చనట్లు డిజైన్ చేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. పైగా సొంతింటి కొనుగోలులో ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్–80(సీ) కింద అసలు చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుతో పాటు సెక్షన్ 24(4) కింద గృహరుణంపై చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. ఇల్లు కొనడంలో సవాళ్లు.. తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసే చాలా మందికి అతిపెద్ద అడ్డంకి డౌన్ పేమెంట్. సాధారణంగా బ్యాంక్‌లు ఆస్తి విలువలో 75–80 శాతం వరకు గృహ రుణాన్ని అందిస్తాయి. అంటే మీరు మిగిలిన 20 శాతం సొమ్మును ఏర్పాటు చేసుకోవాలి. దీనికి తోడు రిజి్రస్టేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు, మధ్యవర్తులెవరైనా ఉంటే వాళ్ల కమీషన్ భరించక తప్పదు. ఉదాహరణకు.. రూ.60 లక్షల ఇంటిని కొనుగోలు చేద్దామని మీరు భావిస్తే.. ముందుగా రూ.15–18 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణ అర్హత అంశం. ఆదాయం, వయస్సు, క్రెడిట్ స్కోర్, అప్పటికే ఉన్న అప్పులు.. ఇవన్నీ మీరు ఎంత రుణానికి అర్హత సాధిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరమైన ఆదాయం ఉన్న వేతన జీవులకే రుణం మంజూరుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఎందుకంటే గృహ రుణమనేది సుమారు 15– 20 ఏళ్ల కాలం పాటు ఉండే దీర్ఘకాలిక నిబద్ధతతో కూడుకున్న అంశం. అందుకే అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకోవాలి. దీన్ని మీ ఆదాయం తట్టుకోగలదని నిర్ధారించుకోవాలి.ఆర్థిక స్థోమత చెక్ చేసుకోవాలిఈ రోజుల్లో పెరిగిన ప్రాపర్టీ ధరలకు సొంతిల్లు కొనాలంటే బ్యాంక్ నుంచి గృహ రుణం తప్పనిసరి. తీసుకునే రుణానికి ఈఎంఐ ఎంత కట్టాలని మాత్రమే చూడకూడదు. కొనే ఇంటికి నిర్వహణ చార్జీలు, సొసైటీ రుసుములు, గృహ బీమా, భవిష్యత్తులో ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవాలి బ్యాంక్ గృహ రుణానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. ఆదాయం ఎక్కువ ఉండగానే సరిపోదు క్రెడిట్ స్కోర్‌కు కూడా బాగుండాలి. అందుకే మంచి క్రెడిట్ స్కోర్(750, అంతకంటే ఎక్కువ) ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందే వీలుంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు, వ్యక్తిగత, వాహన రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని క్లియర్ చేసి ఆ తర్వాత గృహ రుణానికి వెళ్లడం ఉత్తమం.పొదుపును ప్రారంభించండి తీసుకున్న గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తుండంతోనే సరిపోదు. మధ్యలో ఏమైనా అత్యవసర ఖర్చులు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డౌన్ పేమెంట్ కోసం ప్రత్యేక పొదుపు నిధిని ప్రారంభించండి. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు.. కానీ అంతిమంగా మీ రుణ భారాన్ని తగ్గిస్తుంది. సరసమైన గృహాలను వెతకండి: ఠి ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడుస్తుంటే మాత్రం సాధ్యమైనంత వరకు సరసమైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవడం బెటర్. విలాసం, ఆధునిక వసతుల జోలికి వెళ్లకుండా.. మెరుగైన మౌలిక, సామాజిక వసతులు కల్పిపంచే ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాకుండా సరసమైన గృహ నిర్మాణాలకు ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద రుణ సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.పెరుగుతున్న అద్దెలు.. మెట్రో నగరాలలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో అద్దెలు ఏకంగా 72 శాతం మేర పెరిగాయి. ప్రజా రవాణా, మెట్రోలతో అనుసంధానమై ఉన్న చాలా ప్రాంతాల్లో అయితే ప్రాపరీ్టల ధరల కంటే ఇంటి అద్దెలే అధికంగా పెరిగాయి. నగరంలో ఇంటి అద్దెలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం మేర పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్పల్లి వంటి ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో 2బీహెచ్‌కే అద్దె సుమారు రూ.35 వేల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాలలో అయితే రూ.25 వేల నుంచి ఉంటున్నాయి. కోకాపేట, మోకిల, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో రూ.50–70 వేల మధ్యలో చెబుతున్నారు.ఆ పరిస్థితుల్లో అద్దె బెటర్.. స్థిరమైన ఉద్యోగం కాకపోయినా లేదా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా అద్దెకు ఉండటమే ఉత్తమం. జీవితంలో స్థిరపడ్డాక సొంతిల్లు కొనాలనే ముందస్తు ఆలోచన అత్యంత తెలివైన దీర్ఘకాలిక నిర్ణయాలలో ఒకటి. అందుకోసం ముందునుంచే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ఉత్తమం. ఇది మొదట్లో కాస్త భారం, భయం అనిపించినా.. ప్రతి ఈఎంఐ చెల్లింపు సమయంలో నా జీవిత కలను సొంతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులనే ధైర్యం వస్తుంది. -
భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు డీలా..!
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోలి్చతే 16 శాతం తక్కువ అని తెలిపింది. 2021 జూలై–సెపె్టంబర్ త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ విక్రయాలు మళ్లీ ఇదేనని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న విక్రయ గణాంకాల ఆధారంగా డిసెంబర్ త్రైమాసికంపై తన అంచనాలతో ఒక నివేదికను విడుదల చేసింది. నవీ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ మినహా మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గినట్టు తెలిపింది. ఆయా నగరాల్లోని ప్రధాన నివాస ప్రాంతాలకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రాప్ ఈక్విటీ ఈ అంచనాలు రూపొందించింది. ‘‘సంప్రదాయంగా అక్టోబర్–డిసెంబర్లో అమ్మకాలు బలంగా ఉంటుంటాయి. పండుగల సీజన్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కనిపిస్తుంటాయి. ఇటీవలి అమ్మకాల క్షీణత అన్నది మార్కెట్లో ప్రీమియమైజేషన్‌ను సూచిస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గినప్పటికీ విలువలో వృద్ధి కనిపిస్తోంది’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీ అంచనాలు.. → హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చు. → చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చు. → బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఒక శాతం తక్కువ. → కోల్‌కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయి. → పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయి. → థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయి. → నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయి. → ఇక ఈ నగరాల్లో కొత్త ఇళ్ల యూనిట్ల సరఫరా సైతం 10 శాతం తగ్గి 88,427 యూనిట్లుగా ఉంటాయన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా. -
హౌసింగ్ మార్కెట్లో మందగమనం
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. 2025 సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాప్‌ఈక్విటీ అనే రియల్టీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికంలో మొత్తం 98,019 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైంది. ముఖ్యంగా 2021 మూడో త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప విక్రయాల వాల్యూమ్ ఇదే కావడం గమనార్హం.నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ల జోరుమొత్తం మార్కెట్ డీలా పడినా నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్లు మాత్రం సానుకూల వృద్ధిని కనబరిచాయి. నవీ ముంబై అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసి స్టార్ పర్ఫార్మర్గా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ 4 శాతం వృద్ధితో నిలకడను చాటుకుంది. అయితే, మిగిలిన ఏడు ప్రధాన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 31 శాతం వరకు పడిపోయాయి.ప్రధాన నగరాల్లో అమ్మకాల పరిస్థితిబెంగళూరు: 15,603 యూనిట్ల విక్రయాలతో గతంతో పోలిస్తే 7 శాతం క్షీణతను చూసింది.హైదరాబాద్: ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.పుణె: అత్యధికంగా 31 శాతం క్షీణతతో 15,788 యూనిట్లకు పడిపోయింది.చెన్నై, కోల్‌కతా: వరుసగా 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గుఅమ్మకాలు తగ్గినప్పటికీ డెవలపర్ల ఆదాయం, ఇళ్ల విలువల విషయంలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. 2023లో 4.81 లక్షల ఇళ్ల లాంచ్ విలువ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే, 2024లో లాంచ్ అయిన ఇళ్ల సంఖ్య (4.11 లక్షలు) తగ్గినప్పటికీ, వాటి విలువ మాత్రం రూ.6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొనుగోలుదారులు, డెవలపర్లు లగ్జరీ/ప్రీమియం విభాగం వైపు మళ్లుతున్నారని స్పష్టం చేస్తోంది.తగ్గిన సరఫరాకేవలం అమ్మకాలే కాకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ త్రైమాసికంలో 10 శాతం తగ్గి 88,427 యూనిట్లకు చేరుకుంది. పెరిగిన నిర్మాణ వ్యయం, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్ట్‌ల సరఫరాలో వరుసగా 16%, 7% మేర తగ్గుదల నమోదైంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
నరెడ్కో తెలంగాణ 30వ వార్షికోత్సవ వేడుకలు
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO), తెలంగాణ సభ్యులు తమ 30 సంవత్సరాల వార్షికోత్సవాన్ని నిర్వహించకునేందుకు సిద్ధమయ్యారు. మొదటగా 1995లో స్థాపించబడిన నరెడ్కో సంస్థ రాష్ట్ర శాఖ దాని ప్రత్యక్ష వాటాదారుల భాగస్వామ్యం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించింది.ప్రభుత్వం, పరిశ్రమ,కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా, నరెడ్కోతెలంగాణ పారదర్శక, విధాన-అనుగుణ్య, వృద్ధి-ఆధారిత రియల్ ఎస్టేట్ వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధాన వార్షిక ప్రాపర్టీ షోలు, ఇతర పరిశ్రమ వేదికల ద్వారా, అసోసియేషన్ అర్థవంతమైన సంభాషణను ప్రారంభించింది.మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన విధాన సంస్కరణలకు మద్దతు ఇచ్చింది. నగర రియల్ ఎస్టేట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. విశ్వసనీయ డెవలపర్లు, ధృవీకరించబడిన ప్రాజెక్ట్‌లకు ప్రాప్యతను అందిస్తూ, పారదర్శకత, నైతిక పద్ధతులు, నియంత్రణ అవగాహనను ప్రోత్సహించడం ద్వారా ఇది గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు తగిన సమాచారంతో, నమ్మకంగా నిర్ణయాలు తీసుకునేలా సాధికారికతను అందిస్తుంది.నేడు, నరెడ్కోలో తెలంగాణలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లతో సహా 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు – ఇది నరెడ్కో ఒక పటిష్టమైన స్వీయ-నియంత్రణ సంస్థగా పరిణామం చెందింది అనడానికి నిదర్శనం. హైదరాబాద్ నివాస, వాణిజ్య ఆస్తులకు ఒక ప్రీమియం కేంద్రంగా ఎదుగుతున్న సందర్భంలోనరెడ్కో తెలంగాణ రాష్ట్రానికి తన సేవలను అందిస్తూనే ఉంటుంది.దీనితో కలసి పని చేసే వారు కూడా ఈ మహానగరంతో పాటు అభివృద్ధి చెందేలా చూస్తుంది. రాబోయే మరో 30 ఏళ్లు కూడా ఈ ప్రస్థానం కొనసాగాలని ఆశిస్తోంది. -
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది. -
ఇళ్ల ధరలు 5 శాతం అప్
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడంతో వచ్చే ఏడాదిలో (2026) ఇళ్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల 5 శాతం పైగా ఉంటుందని దాదాపు 70 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15–25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10–15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5–10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు. స్పెక్యులేషన్ కన్నా డిమాండ్‌కే ప్రాధాన్యం.. 2026 క్యాలెండర్ సంవత్సరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్ సానుకూలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గృహాలకు డిమాండ్ 5 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్‌ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ జి. పటేల్ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపరీ్టలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. ఈ వృద్ధి గతిని నిలబెట్టుకోవాలంటే వేగవంతమైన అనుమతులు, రెగ్యులేటరీపరంగా మరింత స్పష్టత అవసరమవుతుందని పటేల్ వివరించారు. క్లియరెన్స్‌లను క్రమబదీ్ధకరిస్తే వివిధ మార్కెట్లవ్యాప్తంగా కొత్త గృహాల సరఫరా పెరుగుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాలు పర్యావరణహితంగా, సమంగా అభివృద్ధి చెందగలవని చెప్పారు. డిమాండ్ స్థిరంగా ఉండబోతోందని, ఒక పద్ధతి ప్రకారమే కొత్త గృహాల సరఫరా పెరగబోతోందని నివేదిక తెలియజేస్తోందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల పాలసీని సమీక్షిస్తాం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చే విషయంలో తమ పాలసీని పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. చాలా సంస్థలు గతంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి రుణాల విషయంలో దూకుడుగా వెళ్లి, చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుల రుణాల్లో ఎస్బీఐ వాటా చాలా తక్కువే ఉంటోంది. అయితే, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగానికి రుణాలను క్రమంగా పెంచుకుంటోంది. ‘ప్రాజెక్టు నిర్వహణ, రిస్కు మేనేజ్మెంటు, పారదర్శకత విషయాల్లో స్థిరత్వం ఉంటే కాస్త నమ్మకం కలుగుతుంది. అలాగే జవాబుదారీతనం కూడా మాలాంటి బ్యాంకులకు కీలకంగా ఉంటుంది. అప్పుడు (పరిశ్రమ) తక్కువ వడ్డీ రేటుకే కన్స్ట్రక్షన్ రుణాలను పొందేందుకు వీలుంటుంది‘ అని క్రెడాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శెట్టి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటే, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించేందుకు వీలవుతుందని శెట్టి సూచించారు. -
కొత్త ఏడాదిపై రియల్ ఎస్టేట్ గంపెడాశలు
2025లో.. ఔటర్ వరకూ గ్రేటర్ పరిధి విస్తరణ..భారత్ ఫ్యూచర్ సిటీతో నగరంలో నాలుగో నగరి అవతరణ..మూసీకి పునరుజ్జీవంతో నైట్ ఎకానమీ ఆవిష్కరణ..మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ల ప్రణాళికలతో కొంగొత్త ఉత్సాహం....హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే ఈ మెగా ప్రాజెక్ట్‌లకు శ్రీకారం పడింది. ఇక, వీటి కార్యాచరణతో కొత్త ఏడాదిలో నగర స్థిరాస్తి రంగం దూసుకెళ్లడం ఖాయమని నిర్మాణ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో రియల్ అభివృద్ధికి ఢోకా లేదని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల రాకతో ఐటీ నిపుణులు, సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టిసారిస్తున్నారు.స్థిరాస్తి రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికే రికార్డ్ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క చదరపు అడుగు(చ.అ.) కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చ.అ. నివాస స్థలానికి డిమాండ్ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం ఏర్పడుతుంది. రెండేళ్ల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. మన భాగ్యనగరం బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అందుబాటు ధరలు, నిపుణుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి రకరకాల కారణాలతో బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఔటర్ గ్రేటర్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. 27 నగర, పురపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో కొత్త ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. పాత మున్సిపాలిటీల్లోనూ మెరుగైన మౌలిక వసతులు రావడంతో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఏర్పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లకు నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ముందుకొస్తారు.మెట్రో బూమ్..హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగోల్–శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్ – చాంద్రయాణగుట్ట, మియాపూర్– పటాన్చెరు, జేబీఎస్–మేడ్చల్/శామీర్‌పేట వంటి కీలక మార్గాలలో మెట్రో పరుగులు పెట్టనుంది. సుమారు 76–86 కి.మీ. మేర మెట్రో కొత్త లైన్ రానుంది. మెట్రో విస్తరణతో శివారు ప్రాంతాలు ప్రధాన నగరంతో అనుసంధానమవుతాయి. ప్రీమియం గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారతాయి. మెట్రో లైన్లలోని ఆస్తి విలువలు 10–20 శాతం మేర పెరుగుతాయి. కొత్త స్టేషన్ల చుట్టూ 2–3 కి.మీ. వరకూ బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు వస్తాయి.ఫ్యూచర్ బెటర్ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్ఖాన్పేటలో సుమారు 30 వేల ఎకరాలలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి పునాదులు వేసిన సంగతి తెలిసిందే. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ ఏడు మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ గ్రామాలలో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్–2047ను కూడా నిర్వహించింది. రెండు రోజుల సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.మూసీ అభివృద్ధికేసి..భాగ్యనగరం నడిబొడ్డున వడ్డాణం మాదిరిగా అందంగా పొదిగిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నైట్ ఎకానమీకి మూసీని కేరాఫ్ మూసీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. మూసీ నదిని బ్లూ, గ్రీన్ అని రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు. బ్లూ మాస్టర్ ప్లాన్‌లో వరద నీటి నివారణ, వంతెనల నిర్మాణం తదితర అంశాలుంటే.. గ్రీన్ మాస్టర్ ప్లాన్‌లో నదీ తీరంలో గ్రీనరీ, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అంశాలుంటాయి.మూసీ నదీ తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు–పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35–40 కి.మీ. కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్ చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నది తీరం వెంబడి ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్ ట్రాక్స్ వంటి స్థిరమైన రవాణా ఏర్పాట్లు వంటివి ఏర్పాట్లు చేయనున్నారు. వరదల నిరోధకత, జీవ వైవిధ్యం, సమ్మిళిత రూపకల్పనపై దృష్టిసారించనున్నారు. అలాగే ఆగ్యుమేటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్) ఆధారిత స్టోరీ టెల్లింగ్ జోన్లు, కల్చరల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు.త్రిబుల్ ఆర్ రయ్.. ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30–50 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్)కు ప్రణాళికలు చేసింది. హైదరాబాద్ చుట్టూ 340 కి.మీ. ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ ఇదీ. త్రిబుల్ ఆర్తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్ ఛేంజ్‌లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులు, శాటిలైట్ టౌన్షిప్లకు ఆస్కారం ఉంటుంది. -
Real Estate: రిటైల్ పెట్టుబడులకు క్యూ..
పొద్దున లేస్తే ఆన్లైన్లో ఒక్కసారైనా క్లిక్‌మనిపించాల్సిందే. షాపింగ్, ఫుడ్, లైఫ్‌స్టైల్.. ప్రతీది ఈ–కామర్స్‌లో కొనేందుకే నేటి యువత మొగ్గు చూపిస్తోంది. అయితే ఈ–కామర్స్ ఎంత పెరుగుతున్నా.. నేటికీ షాపింగ్ మాల్స్‌కు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల్లో రిటైల్ స్థలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. మన దేశంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో మాల్స్ కేవలం షాపింగ్ కేంద్రాలే కాదు వినోదం, ఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్ స్పేస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో రిటైల్ రంగం వృద్ధిని సాధిస్తుంటే.. అమెరికాలో పతనం అవుతున్నాయి.మన దేశంలో 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ మాల్స్ ఉన్నాయి. అయితే ఇందులో వంద కంటే తక్కువ మాల్స్ మాత్రమే గ్లోబల్ ఫండ్స్‌ను ఆకర్షించే సంస్థాగత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కొరతే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు దేశీయ మాల్స్‌లో పెట్టుబడులకు ప్రధాన కారణం. అధిక రాబడి, యువ వినియోగదారుల డిమాండ్, సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్, సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాలు, విదేశీ బ్రాండ్లు, పెట్టుబడిదారులు రిటైల్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్ రంగం 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.పాశ్చాత్య దేశాల్లో పతనం.. పాశ్చాత్య దేశాలలో మాల్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త మాల్స్ స్టోర్లలో 78 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020 నుంచి నికర మాల్ స్టోర్ మూసివేతలు పెరుగుతున్నాయి. అమెరికాలో రికార్డ్ స్థాయిలో 1,200 మాల్స్ మూతపడ్డాయి. ఉన్న మాల్స్‌లో దాదాపు 40 శాతం ఖాళీలు ఉన్నాయి. అదే మన దేశంలో 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. గ్రేడ్–ఏ మాల్స్ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. దాదాపు పూర్తి ఆక్యుపెన్సీలో ఉన్న గ్రేడ్–ఏ మాల్స్‌లో 95–100 శాతం లీజులు పూర్తయ్యాయి. కీలక జోన్లో రిటైల్ స్థలం కోసం దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.తలసరి రిటైల్ స్పేస్.. మన దేశంలో తలసరి రిటైల్ స్టాక్ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్ స్టాక్ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 4–6 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2–3 చ.అ.లుగా ఉంది. ఇక, గ్రేడ్–ఏ మాల్స్‌లో తలసరి స్థలం కేవలం 0.6 చ.అ.గా ఉంది. అదే అమెరికాలో సగటు తలసరి రిటైల్ స్థలం 23 చ.అ., చైనాలో 6 చ.అ.లుగా ఉన్నాయి.రిటైల్‌లో రాబడి.. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణ విస్తరణ కారణంగా భారతదేశం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వినియోగ స్థాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. దేశంలో గ్రేడ్–ఏ రిటైల్ ప్రాపర్టీలు ఏటా 14–18 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మన దేశంలో నాణ్యమైన రిటైల్ స్థలం కొరతే డిమాండ్‌కు ప్రధాన కారణం. మన దేశంలో రోజుకు మాల్స్ ఫుట్‌ఫాల్స్ సగటున 20 వేలకంటే ఎక్కువగా ఉంటాయి. వీకెండ్లో అయితే 40 వేల కంటే అధికంగా ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎంటర్టైన్మెంట్ స్పేస్‌లలో ఫుట్ ఫాల్స్ 30–35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. దీంతో ఆన్లైన్ రిటైల్ ప్రభావం భౌతిక మాల్స్‌పై ప్రభావం లేదు.ఫిజికల్ స్టోర్లు.. మన దేశంలో రిటైల్ స్టోర్లు ‘ఫిజికల్’గా మారుతున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్లు కస్టమర్లకు అనుభూతిని, విశ్వాసాన్ని పెంచే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మన దేశంలో ప్రముఖ డైరెక్ట్ టు కన్జ్యూమర్(డీ టూ సీ) బ్రాండ్లు ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ విక్రయాలను అధికంగా చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. అయితే మన దేశంలో ఈ–కామర్స్ వాటా 8 శాతంగా ఉంది. అదే చైనా, అమెరికాలో 20 శాతం కంటే అధికం. -
అబ్బే.. రూ.అరకోటి ఇళ్లా!! మారిన డిమాండ్
నాలుగు గోడలు, పైకప్పుతో ఉండే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. విస్తీర్ణమైన గదులు, ఆధునిక వసతులు, గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి కారణంగా లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని విలాసవంతమైన ఇళ్లలో 45 శాతం ఐదేళ్లలో వచ్చినవే..పర్యావరణ అనుకూలమైన, ఇంధన సమర్థవంతమైన నివాసాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవే స్థిరాస్తి రంగంలో స్థిరమైన అభివృద్ధికి కీలకంగా మారాయి. దేశంలోని లగ్జరీ గృహ విక్రయాలలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైల కంటే భాగ్యనగరంలోనే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటం గమనార్హంఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. లగ్జరీ గృహ విక్రయాలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో రూ.20–40 కోట్ల మధ్య ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు సైతం నమోదవుతుండటం దీనికి ఉదాహరణ. -
కో–లివింగ్.. ఇన్వెస్ట్‌మెంటే!
ఒకప్పుడు సింగిల్‌గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్‌లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్‌గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్‌తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్‌స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్‌లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్‌లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్‌లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
రీసేల్..ఈజీ డీల్..
కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసేల్ మార్కెట్ అంటూ ప్రత్యేకమైన ఒరవడిని సృష్టిస్తోంది. కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులతో పాటు రీసేల్ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించి ఈ రంగంలోకి అనేక మంది ప్రవేశిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాల్లో వినియోగదారులు, ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు సమానంగా లాభాలు అందించడంలో ఈ రీసేల్ సెగ్మెంట్ కీలకపాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నగర జీవనశైలిపై కూడా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగావకాశాలు పెరిగే కొద్దీ, వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరమైన నివాసాల కోసం డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది రెడీ టు మూవ్ ఇళ్లు, వెంటనే ఉపయోగించుకునే ఫ్లాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కన్స్ట్రక్షన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కంటే రీసెల్ ప్రాపర్టీ తీసుకోవడం సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.సులభంగా బ్యాంక్ లోన్లు.. రీసేల్‌లో ప్రధానంగా పెట్టుబడి తక్కువ. కొత్త వెంచర్లు వంటి భారీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు, ప్రీలాంచ్ ప్రకటనలు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వంటి ఖర్చులు ఉండవు. ఇప్పటికే ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల రిస్క్ కూడా తక్కువ. రీసేల్ ప్రాపర్టీలకు సాధారణంగా రెడీ డాక్యుమెంటేషన్ ఉండటం, బ్యాంక్ లోన్లు సులభంగా లభించడం, వాస్తు/ప్రాంతీయ వివరాలు ఇప్పటికే తెలిసి ఉండటం కొనుగోలుదారులకు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.ఇదే కారణంగా ఈ రంగంలో ఇన్వెస్టర్లు కూడా వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రంగంలో ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇచ్చే వ్యవస్థ తగ్గిపోతోంది. డిజిటల్ ప్లాట్ఫార్మ్లు, రియల్ ఎస్టేట్ లిస్టింగ్ యాప్‌లు, సోషల్ మీడియా మార్కెటింగ్‌తో ప్రాపర్టీ యజమానులు నేరుగా కస్టమర్లతో మాట్లాడే అవకాశం పెరిగింది. ప్రధానంగా మధ్యవర్తి ఖర్చులు తగ్గి, విక్రేతలకు ఎక్కువ లాభం, కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మార్పు రియల్ ఎస్టేట్ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేస్తోంది.రెడీ ఇళ్లకు అధిక డిమాండ్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు.. శంషాబాద్, షాద్‌నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లోని ప్లాట్లు, వెంచర్లు.. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మణికొండ, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రీసెల్ మార్కెట్ చురుగ్గా మారింది. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో రెడీ ఇళ్లకు డిమాండ్ నిరంతరం ఉంటుంది. ఇక అపార్ట్మెంట్లతో పాటు విల్లాలు, సొంత గృహాలు, జీ ప్లస్–1, జీ ప్లస్–2 హౌసింగ్ యూనిట్లు కూడా పెద్ద సంఖ్యలో రీసేల్ అవుతున్నాయి.లైఫ్‌స్టైల్ కోణం నుంచి చూస్తే రీసేల్ మార్కెట్ నగర జీవనశైలిలో కొత్త అనుభవాన్ని తెచ్చింది. ఉద్యోగ మార్పులు, నగరాల మధ్య తరలింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విస్తరణ.. వంటివి వేగంగా జరిగే ఈతరం వెంటనే మకాం మార్చుకునేందుకు వీలైన ఇళ్లు ప్రధాన అవసరంగా మారాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో రీసేల్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. భద్రత, రవాణా సౌకర్యాలు, స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు తదితర వాటిని చూసుకునే ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.భవిష్యత్‌లో మరింత బలపడే అవకాశంప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే, రెంటల్ ఇన్కమ్ కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారికి రీసేల్ ప్రాపరీ్టలు తక్షణ లాభం అందిస్తున్నాయి. నగర వృద్ధి వేగం పెరగడంతో భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ విభాగం సంప్రదాయ కొనుగోలు, అమ్మకాల నమూనాను మార్చి, కొత్త తరానికి అనుగుణంగా జీవన శైలిని ప్రతిబింబించే ట్రెండ్‌గా ఎదుగుతోంది. ఈ వినూత్న మార్పులు, తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు, స్మార్ట్ లివింగ్ అవసరాల కలయికగా ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యంతో ముందుకు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్‌లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..నెల రోజుల్లో నిర్మాణంఎన్ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్‌కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.గతంలో వచ్చిన టెక్నిక్లుదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్‌లు.వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు. -
గ్లోబల్ సమ్మిట్‌తో రియల్ మార్కెట్ రైజింగ్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రూపాయి పతనం, ఉద్యోగాల తొలగింపు, స్థిరమైన వడ్డీ రేట్లు వంటి రకరకాల కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల రాయదుర్గం, నియోపొలిస్ భూముల వేలంలో రూ.వందల కోట్ల బిడ్డింగ్‌తో నగర స్థిరాస్తి మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్–2025తో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. సమ్మిట్‌లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047తో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. విద్యా, వైద్యం, తయారీ, క్రీడలు, పర్యాటకం, నివాసం, పరిశ్రమలు.. అన్ని రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో.. స్థానిక స్థిరాస్తి రంగంలో సానుకూల దృక్పథం ఏర్పడింది. ప్రధానంగా సామాన్య, మధ్యతరగతి గృహాలు, పర్యాటకం, గిడ్డంగులు, డేటా సెంటర్లలో రియల్టీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. – సాక్షి, సిటీబ్యూరోఅంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ రూపంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ ప్రశంసనీయం. రియల్ ఎస్టేట్‌కు జీవం.. ఉపాధి.. ప్రస్తుతం తరుణంలో ఈ ప్రాథమిక అంశంపై ప్రభుత్వం దృష్టిసారించడం కీలకం. విజన్ డాక్యుమెంట్‌తో ప్రభుత్వ దీర్ఘకాల విజన్‌పై స్పష్టత ఇవ్వడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంటోంది. జాయింట్ వెంచర్లు, విదేశీ పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు, అనుమతుల్లో వేగం, పాలసీలతో సెంటిమెంట్ బలపడుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో తయారీ, ఐటీ, ఫార్మా వంటి రంగాలే కాదు సినిమా, క్రీడలు, సెమీ కండక్టర్లు, అంతరిక్షం, జీవ ఉత్పత్తులు, జీవ వైవిధ్యం వంటి అన్ని రంగాలతో సమగ్రంగా ఉంది. దీంతో నివాస, ఆఫీసు స్పేస్‌లోనే పర్యాటకం, క్రీడలు, గిడ్డంగులు, డేటా సెంటర్ల వంటి ఇతర రియల్టీ మాధ్యమాలలో కూడా పెట్టుబడి అవకాశాలు ఏర్పడ్డాయి.వెస్ట్ టు సౌత్..నగర రియల్టీ మార్కెట్లో ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్‌దే ఆధిపత్యం. బహుళ జాతి ఐటీ, ఆర్థిక సంస్థలు, డేటా సెంటర్లు పశి్చమంలో కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఈ ప్రాంతానికి శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు సులువైన కనెక్టివిటీతో పాటు విశాలమైన రహదారులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, నిరంతరం విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. దీంతో బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు, అంతర్జాతీయ విద్యా, వైద్యం, వినోద సంస్థలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి వెస్ట్ హైదరాబాద్‌లో భూములు హాట్‌కేక్‌లుగా మారాయి.ప్రభుత్వం నిర్వహించే వేలంలోనే ఎకరం రూ.వందల కోట్లు పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన ప్రాంతంలో సామాన్య, మధ్యతరగతికి సొంతిల్లు కలే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కొత్త ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించడం హర్షించదగిన పరిణామం. నగరానికి దక్షిణ భాగమైన శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ నెట్ జీరో సిటీ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగవుతాయి. ఫలితంగా నివాస, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అందుబాటు ధరల్లోనే సొంతింటి కలను సాకారం చేసుకునే వీలు ఏర్పడుతుంది.మాస్టర్ ప్లాన్స్‌పై స్పష్టత వస్తేనే..ఏ ప్రాజెక్ట్‌కైనా బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) కీలకం. రాష్ట్రాభివృద్ధిని మార్చే కీలక ప్రాజెక్ట్‌లలో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం కీలకమని పదే పదే ప్రభుత్వం చెబుతోంది. అలాంటి కీలకమైన ప్రాజెక్ట్‌లకు మాస్టర్ ప్లాన్ వస్తేనే పెట్టుబడులపై స్పష్టత వస్తుంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు ఎవరికైనా సరే మాస్టర్ ప్లాన్‌లో ఏ జోన్ ఎక్కడ వస్తుంది? బహుళ వినియోగ జోన్ ఏరియా ఎంత? వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకొనే ముందడుగు వేస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం బృహత్తర ప్రాజెక్ట్‌ల సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల అయితేనే ఆయా ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలపై స్పష్టత వస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.కార్యరూపం దాలిస్తేనే ఫలాలు..‘అన్ని రహదారులు రోమ్కు దారితీస్తాయి’ విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్‌ను దాని రాజధానికి అనుసంధానించే క్రమంలో ఉద్భవించిన ప్రాచీన రోమ్ నానుడి లాగే.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా రియల్ ఎస్టేట్‌కు ఊతమిస్తుంది. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో పాక్షికంగా కార్యరూపంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది.పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. దీంతో రియల్టీలో పెట్టుబడులు పెరుగుతాయి. అసలు సమస్య ఏంటంటే.. ఫ్యాబ్ సిటీ, ఎల్రక్టానిక్ సిటీ, ఫార్మా సిటీ.. ఇలా ఏ పేరుతోనైనా ఏ ప్రభుత్వమైనా భూములు సమీకరించడం సర్వ సాధారణమే. కానీ, అవి కార్యరూపం దాలిస్తేనే అభివృద్ధి. లేకపోతే ఇతర రాష్ట్రాలు నిర్వహించే సాధారణ సమ్మిట్ మాదిరిగానే ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా వారం, నెల రోజుల్లో మరుగునపడిపోతుంది. స్థానిక అవసరాలు, బలాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. -
సామాన్యుడి కల.. 29 లక్షల ఇళ్లు అవసరం!
హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంతిల్లు కలే. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. నిజం చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలోనే సామాన్య, మధ్యతరగతి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రైవేట్ సంస్థలను ఆకర్షించాల్సి ఉంటుందని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కొరతను అధిగమించేందుకు చిన్న, తక్కువ ధరల ఇళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీ అభివృద్ధి ఔటర్ దాటింది. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీంతో సామాన్యులకు గృహాలు కొనగలుగుతారు. – సాక్షి, సిటీబ్యూరోరాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఇళ్ల డిమాండ్‌పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు 20.30 లక్షలు, పేద వర్గాలకు 8.70 లక్షల ఇళ్లు కలిపి.. మొత్తం 29 లక్షల ఇళ్ల డిమాండ్ ఉందని తేలింది. ఈ కొరతను అధిగమించాలంటే పీపీపీ విధానం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) మధ్య పీపీపీ విధానంలో సరసమైన గృహాలను నిర్మించే యోచన చేస్తున్నట్లు ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.మౌలిక వసతుల కల్పన..అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక వసతులను కల్పించాలి. అలా చేస్తే అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి.ప్రభుత్వం ఉచితంగా స్థలాలను కేటాయించి.. జాయింట్ వెంచర్‌గా అందుబాటు గృహాలను నిర్మిస్తే విజయవంతం అవుతాయి. ఎలాగంటే.. ప్రైవేట్ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాయి కనుక నిర్మాణంలో నాణ్యతతో పాటూ వారికి దక్కే వాటా ఫ్లాట్లు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకుంటారు. దీంతో ప్రాజెక్ట్‌లో భిన్నమైన సంస్కృతి వస్తుంది. నిర్వహణ కూడా బాగుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి.ముచ్చటగా మూడు పద్ధతులు➤ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తుంది.➤కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేయనున్నారు. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకురానున్నారు.➤పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్) పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టిపెడతారు.➤మిగిలిన ప్రాంతం పరిధిలో చిన్న, మధ్య తరహా టౌన్íÙప్లు, పారిశ్రామిక పార్క్‌లు, లాజిస్టిక్ హబ్‌లతో గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. -
కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు..!
1 కోకాపేట్ మరోసారి రియల్ ప్రకంపనలను సృష్టించింది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గత నవంబర్, ఈ డిసెంబర్ నెలల్లో మూడు దఫాలుగా నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ఎకరాలపైన రూ.3,862 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఇక్కడ భూమి హాట్కేక్లాగే అమ్ముడు కావడం విశేషం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కొలువుదీరిన పడమటి ప్రాంతం కార్పొరేట్ సంస్థలకు కొంగు బంగారంగా మారింది. కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్లో 2021లో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై సుమారు రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలను విక్రయించగా, రూ.3,300 కోట్లు లభించాయి. ఈసారి 29 ఎకరాలపైన రూ.3,862 కోట్లు లభించింది. 2023లో ఎకరం గరిష్టంగా రూ.100.75 కోట్లకు విక్రయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.151 కోట్లు పలికింది. రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి ఇంతటి భారీ స్థాయిలో స్పందన లభించడంతో ఇదే ప్రాంతంలో ఉన్న మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది.2 ఒకేచోట సకల సదుపాయాలు.. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలో మీటర్ల పరిధిలోనే వందలాది కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు రూ.కోట్లలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు అన్ని రకాల సదుపాయాలతో నియోపోలిస్ లే అవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించారు. మూడో దశలో 15 నుంచి 20 వరకు ఉన్న భూములకు బిడ్డింగ్ నిర్వహించారు. 3 రూ.7వేల కోట్లు లక్ష్యంగారియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న ఈ స్పీడ్‌ను ఇలాగే కొనసాగించేందుకు కొత్త సంవత్సరంలో మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. దీని ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎకరం సగటున రూ.100 కోట్ల చొప్పున విక్రయించినా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్–47లో భాగంగా భారీ ఎత్తున ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.కోకాపేట్ ప్రత్యేకతలు.. కోకాపేట్ నియోపోలిస్ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంది. సుమారు రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్లు వెడల్పుతో అంతర్గత రోడ్లను నిర్మించారు. నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తులైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించుకోవచ్చు. ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. -
భారత్‌లో పెరుగుతున్న ‘ఘోస్ట్ మాల్స్’
దేశంలో రీటెయిల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. వీధికో షాపింగ్ మాల్ వెలుస్తోంది. అయితే.. అన్ని షాపింగ్ మాల్స్ నిండుగా ఉంటున్నాయా? ఊహూ లేదు. చాలా వాటిల్లో షాపులు పెట్టుకునే స్థలాలుంటున్నాయి కానీ.. ఎవరూ అద్దె/ లీజుకు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఏటికేడాదీ ఘోస్ట్మాల్స్ పెరిగిపోతున్నాయి!ఘోస్ట్మాల్స్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ ఏ మాల్‌లోనైనా సగం కంటే ఎక్కువ స్పేస్ మూడేళ్లపాటు ఖాళీగా ఉందంటే దాన్ని ఘోస్ట్మాల్ అంటారు. ప్రస్తుతం భారత్‌లోని 32 నగరాల్లో మొత్తం 72 మాల్స్ ఈ స్థితికి చేరుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ లెక్కకట్టింది. మొత్తం 365 షాపింగ్ సెంటర్స్‌లో 13.4 కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటే.. కోటీ యాభైఐదు లక్షల చదరపు అడుగులు (15.4 శాతం) ఖాళీగా ఉన్నట్లు ఈ సంస్థ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ పేరుతో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.నైట్ ఫ్రాంక్ ఇండియా ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ నివేదిక ప్రకారం భారతదేశంలోని రిటైల్ రంగంలో ఖాళీ స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. దేశంలోని 32 ప్రధాన నగరాల్లో ఉన్న 365 షాపింగ్ సెంటర్లలో మొత్తం 134 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో 15.4% అంటే 15.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది.మూడేళ్లుగా మాల్స్ల్లో 40% కంటే ఎక్కువ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్‌గా పరిగణిస్తారు. ఈ 74 ఘోస్ట్ మాల్స్‌లు మొత్తం రిటైల్ స్థలాల్లో 20% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవి ప్రధానంగా టైర్-2 నగరాల్లో (ఉదా: నాగ్‌పూర్, అమృత్సర్, జలంధర్) ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మైసూరు, వదోదర వంటి నగరాల్లో 2-6% మాత్రమే ఖాళీగా ఉన్నాయి.ఘోస్ట్ మాల్స్‌కు దారి తీస్తున్న కొన్ని కారణాలు..మాల్స్ల్లో ప్రధానంగా టెనెంట్ మిక్స్, మాల్స్ నాణ్యత ఖాళీ స్థలాలకు కారణంగా ఉంది. చాలా మాల్స్ బలమైన ఆంకర్ టెనెంట్స్ (హైపర్‌మార్కెట్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి) లేకుండా ప్రారంభమవుతున్నాయి. ఆంకర్ టెనెంట్స్ కస్టమర్లను ఆకర్షించి చిన్న షాపులకు మద్దతు ఇస్తాయి. వీటి లేమి కారణంగా కస్టమర్ ఫుట్‌ఫాల్ తగ్గుతుంది.గ్రేడ్-సీ మాల్స్‌లో ఖాళీ 36% వరకు ఉంది. వీటిలో చాలా వరకు డిజైన్, లేఅవుట్‌ల్లో ఆధునిక అవసరాలకు దూరంగా ఉన్నాయి (ఉదాహరణకు, మురికిపడిన కారిడార్లు, బ్యాడ్ లైటింగ్, అన్ఫ్రెండ్లీ లేఅవుట్లు).కొన్ని నగరాల్లో (ముఖ్యంగా టైర్-2) డిమాండ్‌కు మించి అధిక స్థలాలు అందుబాటులో ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.సైట్ లొకేషన్ సెలక్షన్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయి.ఆన్లైన్ షాపింగ్ఆధునిక కస్టమర్ షాపింగ్ అలవాట్లలో వచ్చిన మార్పు, ప్రత్యేకించి ఈ-కామర్స్ పెరుగుదల, మాల్స్‌కు తీవ్రమైన సవాలుగా మారింది. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ 2023లో 883 బిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు అందించే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారు. కొవిడ్ తర్వాత గ్లోబల్‌గా మాల్ విజిటర్లు 42% తగ్గారు. ఇది భారతదేశంలోనూ చిన్న మాల్స్‌లను తీవ్రంగా ప్రభావితం చేసింది.అద్దెలు, నిర్వహణ ఖర్చులుహై-క్వాలిటీ మాల్ స్థలాలకు డిమాండ్ పెరగడంతో అద్దెలు పెరిగాయి. పాత, తక్కువ నాణ్యత గల మాల్స్ అద్దెలు తగ్గినప్పటికీ, అవి ఆధునిక మాల్స్‌తో పోటీపడలేకపోతున్నాయి. ఫలితంగా టెనెంట్స్ వాటిని వదిలి వెళ్తున్నారు.పరిష్కారాలు.. భవిష్యత్తు అవకాశాలుఘోస్ట్ మాల్స్‌గా మారినప్పటికీ ఈ ఖాళీ స్థలాలను అవకాశాలుగా మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలను కో-వర్కింగ్ స్పేస్‌లు, సర్వీస్ అపార్ట్మెంట్లు లేదా హెల్త్ సెంటర్లు వంటి ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. మాల్ డిజైన్, లేఅవుట్, లైటింగ్‌ను ఆధునీకరించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. మొత్తంగా భారతదేశంలో ఘోస్ట్ మాల్స్ సమస్య రిటైల్ రంగంలో జరుగుతున్న డిజిటల్, భౌతిక మార్పులను ప్రతిబింబిస్తోంది. సరైన వ్యూహాలు, పునరుద్ధరణ ద్వారా ఈ ఖాళీ స్థలాలను తిరిగి ఉత్పాదక ఆస్తులుగా మార్చవచ్చు.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి -
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫీస్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన ఐస్ప్రౌట్ టాటా క్యాపిటల్ నుంచి డెట్ ఫండింగ్ ద్వారా రూ.60 కోట్లు సేకరించింది. తాజా మూలధనం ప్రధాన భారతీయ మెట్రోల్లో కంపెనీ వృద్ధి వ్యూహానికి తోడ్పడుతుందని కంపెనీ చెప్పింది. ఇది ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తుందని, వేగంగా విస్తరిస్తున్న మేనేజ్డ్ ఆఫీస్ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది.మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేషన్ అనేది కార్యాలయాల సాంప్రదాయ లీజు, కో-వర్కింగ్ స్పేస్ లక్షణాలను మిళితం చేసే విధానం. ఒక కంపెనీ తరఫున థర్డ్ పార్టీ ఆపరేటర్ కార్యాలయ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సాంప్రదాయ లీజు మాదిరిగా ఒప్పందాలు, రోజువారీ నిర్వహణ, యుటిలిటీ బిల్లులు వంటివి ఈ మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు చూసుకుంటాయి. అద్దె, యుటిలిటీలు, ఫర్నిచర్, ఐటీ మౌలిక సదుపాయాలు, భద్రత, నిర్వహణతో సహా అన్ని సర్వీసుల కోసం ఒకేసారి ప్యాకేజీ తీసుకుంటాయి.ఈ ఆపరేటర్లు కంపెనీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారి బ్రాండ్‌ను ప్రతిబింబించే ప్రైవేట్ కార్యాలయాన్ని అందిస్తాయి. అద్దె నుంచి మెయింటెనెన్స్ వరకు అన్నీ అందులో కవర్ అవుతాయి. ఇవి సాంప్రదాయ లీజుల కంటే తక్కువ కాలానికి (ఉదాహరణకు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు) ఒప్పందాలు చేసుకోవచ్చు.భారత్‌లో అభివృద్ధిభారతదేశంలో మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటింగ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగాలలో ఒకటి. ముఖ్యంగా 2021 నుంచి ఈ రంగం ఎంతో వృద్ధిని కనబరిచింది. కొవిడ్-19 అనంతర పరిణామాలతో కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నాయి. దీనికి అనుగుణంగా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్య పెరిగినా లేదా తగ్గినా సులభంగా సర్దుబాటు చేసుకోగలిగేలా ఫ్లెక్సిబుల్ స్పేస్‌ల కోసం చూస్తున్నాయి.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్బహుళజాతి సంస్థలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశంలో విస్తరించడం ఈ డిమాండ్‌ను పెంచే ప్రధాన అంశం. బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి దక్షిణ భారతదేశ నగరాలు ఈ వృద్ధికి కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌లు, మధ్య తరహా సంస్థలు భారీ ప్రారంభ పెట్టుబడులు లేకుండా స్థిరమైన నిర్వహణ ఖర్చులతో కార్యాలయాలను ప్రారంభించడానికి ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నాయి.ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు -
‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్ హోటల్ ‘తాజ్ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.ఐకానిక్ తాజ్ బంజారాఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్‌గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్ బంజారా హోటల్‌ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి. -
హైదరాబాద్‌లో ఎకరా రూ.151.25 కోట్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ డెవలపర్లు చారిత్రక విజయాన్ని సాధించారు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ కన్సార్టియం తెలంగాణలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన 3వ ఫేజ్ వేలంలో ఈ కన్సార్టియం నియోపోలిస్ ప్లాట్ 15ను దక్కించుకుంది. ఈ మేరకు 4.03 ఎకరాల కోసం డెవలపర్లు ఎకరానికి రూ.151.25 కోట్లు రికార్డు స్థాయిలో బిడ్ వేశారు.ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఎకరాకు నమోదైన రెండో అత్యధిక వేలంగా నిలిచింది. రాష్ట్రంలో అత్యధిక బిడ్ అక్టోబర్ 2025లో రాయదుర్గ్‌లోని నాలెడ్జ్ సిటీలో నమోదైంది. అక్కడ భూమి ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఈ భారీ పెట్టుబడి నియోపోలిస్‌ను హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మక, వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్మెంట్ కారిడార్‌గా సూచిస్తుంది.నియోపోలిస్‌లో కన్సార్టియం దృష్టిఈ తాజా బిడ్ నియోపోలిస్‌లో కన్సార్టియం ప్రాబల్యాన్ని బలోపేతం చేస్తుంది. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను జూన్ 2025లో ఆవిష్కరించారు. ఇది రూ.3169 కోట్ల లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇందులో 217 మీటర్ల వరకు ఎత్తు ఉన్న ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయని కన్సార్టియం తెలిసింది.ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే.. -
ఇంటి కంటే స్పీడ్‌గా ఇంటీరియర్..
దేశంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఇంటీరియర్స్‌పై చేసే ఖర్చుల పెరుగుదల వేగం మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఇంటీరియర్స్ మార్కెట్, గృహ ధరల వృద్ధిని మించిన వేగంతో ముందుకు సాగుతోంది.భారతదేశ హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2024లోని రూ.1.27 లక్షల కోట్ల నుండి 2030 నాటికి ఇది రూ.2.75 లక్షల కోట్ల స్థాయిని చేరుకోనుందని మ్యాజిక్‌బ్రిక్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వృద్ధికి ప్రధానంగా ప్రేరణనివ్వబోతున్నవి టైర్-2 నగరాలు. ఇవి 19% వార్షిక వృద్ధితో పెరుగుతాయని, టైర్-1 నగరాల (12%) కంటే దాదాపు రెట్టింపు వేగమని అధ్యయనం చెబుతోంది.2024లో రూ.25,536 కోట్లుగా ఉన్న టైర్-2 మార్కెట్ విలువ, 2030 నాటికి దాదాపు రూ.72,500 కోట్లకు పెరగనుంది. ఇక్కడి ఇంటీరియర్ డిమాండ్‌లో 82% రీసేల్ ఇళ్ల నుంచే వస్తోంది. కొత్త తరహా మాడ్యులర్ ఫర్నిచర్, స్మార్ట్ స్టోరేజ్, ఆధునిక డిజైన్ల వైపు గృహయజమానులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. టైర్-2 నగరాల్లో ఒక్క ఇంటికి సగటు ఇంటీరియర్ ఖర్చు రూ.3.9 లక్షలు, ఇది టైర్-1 సరాసరి ఖర్చులో 74 శాతానికి సమానం.మ్యాజిక్‌బ్రిక్స్ సీఎంవో ప్రసూన్ కుమార్ మాట్లాడుతూ, “టైర్-2 నగరాల్లో హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా పెరగడం భారత వినియోగదారుల అభిరుచుల్లో పెద్ద మార్పునకు సంకేతం. ఇళ్లు మరింత వ్యక్తిగతీకరణ, ఫంక్షనల్, డిజైన్ ఆధారితంగా మారుతున్నాయి” అని అన్నారు.వేగవంతమైన నగరీకరణ, పెరిగిన ఆదాయాలు, మారుతున్న జీవన శైలి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం ప్రధాన వృద్ధి కారకాలు. బెడ్రూమ్లు, లివింగ్ రూమ్‌లు ఖర్చులో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. లక్నో, జైపూర్, గోవా, కొచ్చి వంటి నగరాలు ఇంటీరియర్ డిమాండ్‌లో ముందంజలో ఉన్నాయి.జాతీయ స్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ భాగాలు మొత్తం ఇంటీరియర్ వ్యయంలో 45 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆన్లైన్ ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా టైర్-2 నగరాలలో వేగంగా పెరుగుతున్నాయి. -
ఇంటి విలువను పెంచే మెట్లు..
కుర్చీని మడత పెట్టినట్టుగానే ఇంటి పైకప్పునకు ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. అవును.. ఫోల్డబుల్ స్టేర్కేస్లు మార్కెట్లోకి వచ్చేశాయి. తక్కువ స్థలంలో, అందంగా ఇమిడిపోవడం వీటి ప్రత్యేకత. తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు, బాల్కనీలోకి వెళ్లేందుకు, చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్లకు ఈ మడత పెట్టే మెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మడతపెట్టే మెట్లు సురక్షితంగానే ఉంటాయి కానీ వీటిని సరిగ్గా బిగించాలి.. లేకపోతే ప్రమాదకరం. ఈ మెట్ల మీదుగా ఎక్కేటప్పుడు ఇరువైపులా హ్యాండ్ రెయిల్స్, యాంటీ స్లిప్ రింగ్‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు, వృద్ధులు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.ఇంటి విలువను పెంచే మెట్లు.. నిరంతరం, రోజువారి అవసరాలకు వినియోగించే మెట్ల స్థానంలో ఈ మడతపెట్టే మెట్లు అంత శ్రేయస్కరం కాదు. స్టోర్ రూమ్‌లు, చిన్న స్థలం ఉండే ఇళ్లు, బాల్కనీలోకి ఎక్కేందుకు, అప్పుడప్పుడు వినియోగించే ప్రాంతాలలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి విలువను పెంచడంలో మెట్లు కూడా భాగస్వామ్యమే. కాబట్టి చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్ ఇళ్లలో ఈ మడత పెట్టే మెట్లను వినియోగించేటప్పుడు ఇంటీరియర్, రంగులకు అనుగుణంగా ఈ మెట్లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఇంటి అందం దెబ్బతింటుంది.నాణ్యమైన కలప లేదా అల్యూమీనియంతో ఈ మడతపెట్టే మెట్లను తయారు చేస్తారు. పిల్లల గది, చిన్న హాల్లో, ఇరుకైన స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిచ్చెనలు పాదాల కింద స్థిరంగా ఉండవు కాబట్టి బరువైన వస్తువులను మోసుకెళ్తూ ఈ మెట్లను ఎక్కకూడదు. సంప్రదాయ మెట్లతో పోలిస్తే ఇవి చౌక ధరల్లోనే లభిస్తాయి. -
ఇంటి కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్నెస్ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్ కిచెన్‌లో హెడ్ చెఫ్‌కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్ చెఫ్’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్పుట్ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్ కుక్‌టాప్‌లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్.. ఏఐ కిచెన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్ కుకింగ్ అసిస్టెంట్లు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్‌లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్ బేస్డ్, విజువల్ గైడ్లు ఏఐ కిచెన్ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. -
లగ్జరీ హౌసింగ్ మార్కెట్ రయ్.. రయ్..
భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ పరిపక్వత దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ విపణి విస్తరిస్తుందని పేర్కొంది.ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్(ఎల్పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, టౌన్‌షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గుర్గావ్లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్‌కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి. లగ్జరీ యూనిట్లకు ఆసక్తి.. 2021 నుంచి దేశంలో లగ్జరీ హౌసింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో లగ్జరీ గృహాల సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు 14 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. -
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్..
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్ సిటీలో అఫర్డబుల్ హౌసింగ్‌కు కూడా ప్రత్యేకంగా జోన్ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని తీసుకురావడం అత్యవసరం.రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్.. కో–ఆపరేటివ్ సొసైటీ, ఎంప్లాయిస్ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్‌కు ప్రత్యేకంగా జోన్ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్ చేసి, అఫర్డబుల్ హౌసింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.నిర్మాణ అనుమతుల్లో వేగం.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్‌లు, కమ్యూనిటీ స్పేస్‌లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్‌ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్‌ను అందించాలి. క్లబ్‌హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్‌లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్ సుంకాల భారం నుంచి మినహాయించాలి. -
చిన్న ఇళ్లు చవకైపోయాయ్..!!
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది. -
ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.మార్గదర్శకాల్లోని వివరాలునివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్‌తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్‌గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్‌పై కచ్చితమైన పరిమితిని విధించింది.నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవచ్చు.వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ -
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్లోకి వచి్చన హౌసింగ్ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది. ⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్‌పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి. ⇒ భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్ ఎస్టేట్ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ⇒ సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు. -
గృహ రుణానికి ముందే గుడ్‌బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్‌తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్‌గ్రేడ్ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్‌గ్రేడ్ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా! అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్మెంట్ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...రూ.5,000 చేసే మ్యాజిక్ ఇదీ...ఉదాహరణకు శ్రీకర్ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... → శ్రీకర్ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 → 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. → కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... → 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. → ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది. → ఇలా స్మార్ట్ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.ఒకే విడతా లేక నెలవారీనా..?→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం → దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది → బోనస్ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. → అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.అంత ఆదా సాధ్యమా?→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. → ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. → ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. → రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. ఫ్లోటింగ్ – ఫిక్స్డ్ రేటు రుణం→ ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. → ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. → ప్రస్తుతం బ్యాంక్‌లు/ ఎన్బీఎఫ్సీలు ఫ్లోటింగ్ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్డ్ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. -
కోట్లు గుమ్మరించి 10 ఆఫీసులు కొన్న హృతిక్ రోషన్
సెలబ్రిటీలు తమకు ఇష్టమైన కార్లు, బైకులు కొనుగోలు చేయడంతో పాటు.. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే.. నటుడు హృతిక్ రోషన్.. అతని తల్లిదండ్రులు రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్లతో కలిసి అంధేరీ వెస్ట్‌లో 10 ఆఫీస్ యూనిట్లను రూ.28 కోట్లకు కొనుగోలు చేశారు.హృతిక్ రోషన్.. యురా బిజినెస్ పార్క్ 3వ, 4వ అంతస్తులలో ఉన్న 10 ఆఫీస్ యూనిట్లను రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. వీటిని హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.మొత్తం 10 ఆఫీసులలో.. ఐదు ఆఫీసులను హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసినట్లు, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ మిగిలిన ఐదు ఆఫీసులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లావాదేవీలు 2025 నవంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది.మొత్తం ఆఫీస్ స్థలం 6968 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్ పరిమాణం 769 చదరపు అడుగుల నుంచి 852 చదరపు అడుగుల వరకు ఉంటుంది. విక్రేత పేరు యురా బిజినెస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (పెకాన్ అండ్ ట్రాన్స్‌కాన్ గ్రూప్) అని తెలుస్తోంది..హృతిక్ రోషన్ కుటుంబం.. నవంబర్ 19, 2025న అంధేరీలో రూ.19.68 కోట్ల విలువైన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ప్రకారం, వీటిని వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు. ఆ తరువాత నవంబర్ 24 హృతిక్ సోదరి సునైనా రోషన్ కూడా అంధేరీ ఈస్ట్‌లో రెండు ఆఫీస్ యూనిట్లను రూ. 6.42 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఇల్లే ప్రపంచం.. అందుకే వీటికి డిమాండ్!
కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కరోనా తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవటం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటాని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.2013లో 7 ప్రధాన నగరాలలో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం..స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. -
ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్!
బ్రాండ్ హైదరాబాద్‌కు పునాదులు బలంగా పడుతున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న విశ్వనగరికి రాచబాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) వెలుపల ఔటర్ రింగ్ రోడ్ వరకూ, దాని ఆనుకొని ఉన్న 27 పురపాలికలను విలీనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ.. దాదాపు 2 వేల చ.కి.మీ. మేర పెరగనుంది. కార్పొరేషన్ విస్తీర్ణం పెరుగుదలతో ఏకీకృత పాలన, నగరం నలువైపులా సమాంతర అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనాణ్యమైన సేవలు.. శివారు మున్సిపాలిటీల విలీనంతో ప్రణాళికాబద్ధమైన మెట్రోపాలిటన్ విస్తరిస్తుంది. హైదరాబాద్ మెగా పొలిస్ ఇమేజ్ ఏర్పడుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఏకీకృత పాలనకు అవకాశం ఉంటుంది. వ్యూహాత్మక అమలు, బలమైన ఆర్థిక ప్రణాళిక, సమర్థవంతమైన పాలనతో సమాన వనరుల కేటాయింపు, నాణ్యమైన, వేగవంతమైన మున్సిపల్ సేవలను అందుకోవచ్చు. రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి వ్యవస్థలు, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాలలో పౌర సేవల, నాణ్యమైన సేవలు అందుతాయి. వేగవంతమైన అనుమతులు, ప్రాజెక్ట్‌ల అమలుకు వీలు కలుగుతుంది.ఏకీకృత నగర ప్రణాళిక..రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ నీటి వనరుల పరిరక్షణ, ప్రజా రవాణా వంటి అంశాలలో సమగ్ర ప్రణాళిక చేయడం సులభమవుతుంది. భవన అనుమతులు, జోనింగ్ రూల్స్ వంటి విషయాల్లో స్పష్టమైన, సమర్థవంతంగా అమలవుతాయి. శివార్లలో కూడా విస్తృత రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, పార్క్‌లు, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మొబలిటీ కారిడార్లు వంటి ప్రాజెక్ట్‌లు సులభంగా అమలవుతాయి. పురపాలక సంఘాల మధ్య ఉండే అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం తగ్గుతుంది. మెగా జీహెచ్ఎంసీతో కేంద్రం నిధులు, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు పొందడం సులభమవుతుంది. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో భూముల విలువ పెరుగుతుంది. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, డెవలపర్లు, పెట్టుబడులకు ముందుకు వస్తారు.ట్రాఫిక్ నిర్వహణ..మెగా నగరంలో ప్రజా రవాణాకు భారీ పునరుర్ధరణ అవసరం. అలాగే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించాలి. ట్రాఫిక్ నిర్వహణ అతిపెద్ద సవాలు. ట్రాఫిక్ పరిపాలన, ప్రణాళికలో భారీ సంస్కరణలు అవసరం. మెట్రో, ఎంఎంటీఎస్‌తో లాస్ట్ మైల్ కనెక్టివిటీని వేగవంతం చేయాలి. విచి్ఛన్నమైన అభివృద్ధిని నివారిస్తుంది. మెట్రో ప్రాంతమంతటా స్థిరమైన పట్టణ ప్రమాణాలను సృష్టిస్తుంది. రోడ్లు, డ్రైనేజ్, నీటి సరఫరా, రవాణా వంటి జోనింగ్ కోసం సమగ్ర మాస్టర్ ప్లానింగ్‌కు అవసరం.సిబ్బంది సవాలే..జీహెచ్ఎంసీ ఇప్పటికే సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. పరిమిత సిబ్బందితో మెగా మెట్రోకు పౌర సేవలను అందించడం అతిపెద్ద సవాలు. సిబ్బందిని, వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయకపోతే మున్సిపాలి టీల విలీనం వ్యర్థమే. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటాయి. ఆయా మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయాలంటే జీహెచ్ఎంసీ బడ్జెట్ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న మున్సిపాలిటీలలో తక్కువ పన్నులు, జీహెచ్ఎంసీ రేట్లకు పెరగడంతో గృహ యజమానులకు అదనపు భారం పడుతుంది.విలీనమైన మున్సిపాలిటీలివీ.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్ రంగారెడ్డి జిల్లా: బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిబట్ల, తుక్కుగూడ. సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్. -
హాస్టల్, కో-లివింగ్ మధ్య తేడాలివే!
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు, ఉద్యోగులు, ప్రవాసులు ఎవరైనా సరే వేరే నగరానికి వెళ్తే ముందుగా వెతికేది, ఉండేందుకు మంచి వసతి ఎక్కడుందనే! అందుబాటు ధరల్లో ఎక్కడ దొరకుతాయని ఎంత మంది వెతుకుతారో.. అంతకు రెట్టింపు జనాలు అద్దె కాస్త ఎక్కువైనా పర్వాలేదు అంతర్జాతీయ వసతులతో కూడిన అపార్ట్మెంట్ల కోసం శోధిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే డెవలపర్లు కో–లివింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు.హాస్టల్స్ – కో లివింగ్ మధ్య తేడా ఏంటంటే..సాధారణంగా మనం చూసే హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లు రెండు, మూడు బెడ్స్‌ను వేసి వాటిని అద్దెకు ఇస్తుంటారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్ నిర్వాహకులే చూసుకుంటారు. ఒకవేళ భార్య భర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఒకటే హాస్టల్లో ఉండటం కుదరదు. మగవాళ్లకు, ఆడ వాళ్లకు వేర్వేరుగా వసతి గృహాలుంటాయి. అదే కో లివింగ్‌లో అయితే ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్ మాదిరిగానే కో లివింగ్‌లో కూడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంట, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. నేటి యువతరం జీవన శైలికి అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. కాబట్టి వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి.సాధారణ ప్రజలూ వినియోగం..కో లివింగ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్ వంటి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా 24 గంటలు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత, రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. 24 గంటలు వైద్య సదుపాయాలు, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతీరోజూ కల్చరల్, మోటివేషన్ కార్యక్రమాలుంటాయి. వారాంతాల్లో నైట్ బజార్, ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. వీటిని కోలివింగ్ నివాసితులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు డిమాండ్: కారణం ఇదే!
దేశంలో ఆఫీసు స్పేస్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ స్టాక్ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది.ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్)విస్తరణ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు కారణం.కాస్త తడబడి..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ఎన్సీఆర్, ముంబై లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్లను కలిగి ఉన్నాయి. -
ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?
దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ అనరాక్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలా..ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది. -
ఇల్లా.. స్థలమా.. !
ఫ్లాటా... ప్లాటా? ఇల్లా... స్థలమా? కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే... లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండాల్సిందే... అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం కొందామనుకున్నది బాగా పెరిగి... కొన్నది అంతగా పెరగనప్పుడు!!. మరి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఏది కొంటే బెటర్? దీనిపై అవగాహన కోసమే ఈ కథనం.. – సాక్షి, వెల్త్ డెస్క్నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది కూడా. అనరాక్లాంటి మార్కెట్ వర్గాల గణాంకాలను బట్టి అయిదారేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఫ్లాట్ల రేటు చ.అ.కు సగటున రూ.4,750గా ఉండగా గతేడాది ప్రథమార్ధంలో రెట్టింపై ఏకంగా రూ.9,000కు ఎగిసింది. మరికొన్ని మార్కెట్ వర్గాల ప్రకారం ఇదే వ్యవధిలో విశాఖపట్నంలోని మధురవాడలో రూ. 3,800–4,300గా ఉన్న ధర రూ. 5,2,00–6,200 స్థాయికి చేరింది. అదే మధురవాడ ప్రాంతంలో స్థలాల రేట్లు 2019లో దాదాపుగా గజం 40వేల వరకూ ఉండి... గతేడాది రూ.75000 దాటేశాయి. ఇక హైదరాబాద్‌లో ఇదే కాలంలో చూస్తే ఫ్లాట్ల ధరలు రెట్టింపయ్యాయేమో కానీ... స్థలాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పెరిగాయి. ఈ లెక్కన చూసినపుడు రెండూ పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి స్థలాలు ఇంకాస్త ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఎంచుకోవటం ఎలా? అవసరానికే పెద్ద పీట... స్థలమైనా, ఫ్లాటైనా... మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే తరువాత రేట్లు పెరగకపోయినా, పెరిగినా పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కొత్త ప్రాజెక్టులొస్తూ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి అక్కడ డిమాండ్ పెరగటం, దానికి తగ్గట్లే రేటూ పెరగటం సహజం. స్థలం ఉంటే అవకాశాలెక్కువ. ఇక ఫ్లాట్ల విషయానికొస్తే అపార్ట్మెంట్ పరిమాణం పరిమితం. పైపెచ్చు పాతబడిపోతూ ఉంటుంది. పెచ్చులూడిపోవడం, పెయింట్లు వెలిసిపోవడం, పైపులు లీక్ కావడం, కామన్ ఏరియాలు పాడైపోవడంలాంటి సవాళ్లుంటాయి. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా, స్థలం మాదిరిగా ఫ్లాట్ విలువ పెరగదు. కాబట్టి ఇన్వెస్టరు కోణంలో ఆలోచించే ఎవరికైనా ఫ్లాట్ కన్నా స్థలం అర్ధవంతంగా ఉంటుంది. స్థలం కొనుక్కుని కాస్త 5–10 ఏళ్లు ఆగితే దాని విలువ రెండు రెట్లు, మూడు రెట్లు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్థలంపై చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను సరైన పెట్టుబడిగా చెబుతారు.స్థలం కొనేముందు జాగ్రత్తలెన్నో.... సాధారణంగా ఫ్లాట్లనేవి కొన్ని సందర్భాలు మినహా చాలా మటుకు చట్టపరమైన అన్ని అనుమతులతో లభిస్తాయి. అదే పేరున్న బిల్డర్ దగ్గర్నుంచి కొంటున్నారంటే లీగల్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే, రెరా రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టి ఫికెట్ వంటివి తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా... ఓవరాల్‌గా రిస్కు తక్కువే ఉంటుంది. స్థలం విషయానికొచ్చే సరికి మాత్రం చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. టైటిల్ ఓనర్íÙప్ ఎవరి పేరిట ఉంది? రెసిడెన్షియలా లేక వ్యవసాయ భూమా? కన్వర్షన్ పరిస్థితి ఏంటి? లీగల్ వివాదాలేవైనా ఉన్నాయా? లే అవుట్‌కి ఆ ప్రాంత డెవలప్మెంట్ అథారిటినీ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయా? ఇలాంటి విషయాలెన్నీ నిశితంగా చూసి తీరాలి. వీటిల్లో ఏ చిన్న తేడా జరిగినా, మీరు కొనుక్కున్న స్థలాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు. లేదా అది పూర్తిగా చేయి జారిపోనూ వచ్చు. కాబట్టి, స్థలంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయినప్పటికీ పేపర్‌వర్క్ 100 శాతం కరెక్ట్‌గా ఉన్నప్పుడే మంచిదవుతుంది. ఇక మెయింటెనెన్స్ విషయంలో ఫ్లాట్‌తో పోలిస్తే ప్లాట్దే పైచేయి. ఫ్లాట్ కొంటే మనం ఉన్నా... అద్దెకు ఇచ్చినా ప్రతి నెలా లిఫ్టులు, సెక్యూరిటీ, క్లీనింగ్ ఇలాంటివాటన్నింటికీ సంబంధించి మెయింటెనెన్స్ బిల్లు భారం ఉంటుంది. స్విమ్మింగ్ పూళ్లు.. జిమ్ములు గట్రా మీరు వాడకపోయినా కచి్చతంగా కట్టాల్సిందే. అదే స్థలం విషయానికొస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ తప్ప ప్రతి నెలా కచి్చతంగా ఇంత చెల్లించాలనే బాదరబందీ ఉండదు. ఒకవేళ అందులో మీరు కట్టుకున్న నిర్మాణాన్ని బట్టి ఏవైనా మెయింటెనెన్స్ ఉండొచ్చు. ఫ్లాట్లకు రుణాలు సులభం .. స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80–90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60–70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిరీ్ణత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్‌గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచి్చనప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.ఫ్లాట్ కొనటం, అమ్మటం కాస్త ఈజీ నివసించడం కోసమైతే ఫ్లాట్లను కొనుక్కోవడం సరైన నిర్ణయమని చెప్పాలి. కొనటం కూడా చాలా సులువు. కొనుక్కుని, పేపర్‌వర్క్ పూర్తి చేసి, షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఒకవేళ నిర్మాణ దశలో ఉన్నదైతే, ఎప్పటికల్లా పూర్తవుతుందనేది ముందే తెలుస్తుంది. అదే స్థలం విషయానికొస్తే కేవలం ప్లాట్ చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని, అందులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అంతా సవ్యంగా సాగి, ఎలాంటి జాప్యాలు జరగకుండా ఉంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి, సత్వరం నివసించేందుకు ఇల్లు కావాలంటే ఫ్లాట్‌ను ఎంచుకోవచ్చు. అదే కొ న్నాళ్ల తరవాత మారాలనుకుంటే ప్లాట్ ఎంచుకోవచ్చు. -
ఇవి బిగించుకునే ఇళ్లు..
కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్ ప్లాట్లకు, ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్ హోమ్స్‌కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్‌లో సరదాగా గడుపుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్స్(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు.ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్(పీపీవీసీ)లతో రూపొందిస్తారు. తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్యులేషన్తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్ హోమ్‌లో తక్కువగా ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయంటే?విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్ హోమ్‌కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్ హోమ్‌లో హాల్లోనే ఓపెన్ కిచెన్, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.కంటైనర్ హోమ్స్‌లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.మన్నిక ఎన్నేళ్లంటే? ఈ కంటైనర్ హోమ్స్ స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్‌మెంట్‌కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్ హోమ్స్‌కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్‌కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్‌తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! -
ఏ రంగమైనా.. హైదరాబాద్ టాప్!
ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్.. రంగమేదైనా సరే.. హైదరాబాదే టాప్ లీడర్. అవునండీ.. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబైని దాటేసి బహుళ జాతి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. కొత్త జీసీసీల ఏర్పాటే గానీ ఇప్పటికే ఉన్న జీసీసీల విస్తీర్ణంలో గానీ భాగ్యనగరాన్నే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి.అందుబాటు ధరలు, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య కార్మికుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య కాలంలో దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు, విస్తరణ కాగా.. ఇందులో 46 శాతం వాటాతో భాగ్యనగరం తొలి స్థానంలో నిలిచింది. మన తర్వాతే 33 శాతం వాటాతో బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ముగింపు నాటికి రాష్ట్రంలో 120 జీసీసీలు, 1.2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ - ఉమెన్తెలంగాణలోని మొత్తం జీసీసీ నైపుణ్య కార్మికులలో 59 శాతం మంది, అంటే సుమారు 1.82 లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నారు. బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, తయారీ రంగాల జీసీసీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జీసీసీ నిపుణులలో మహిళలు 33 శాతం మంది ఉండగా.. 19 శాతం మంది నాయకత్వ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉపాధిలో ఇంజనీరింగ్, ఐటీ రంగాలు 57 శాతం వాటాతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. -
ఇదిగో ఇల్లు కొనాల్సింది ఇప్పుడే..
రాష్ట్రంలో కొంతకాలం వరకూ స్థిరాస్తి మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పోత్సాహకర నిర్ణయాలు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు తదితరాలతో మార్కెట్ మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రతికూల వాతావరణంలోనే ధరలు, వసతుల విషయంలో కస్టమర్లకు బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. నగదు లభ్యత కావాలి కాబట్టి డెవలపర్లూ అంగీకరించే వీలుంటుంది. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడి దారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.ఢోకా లేదు.. హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! -
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
‘మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్న జహీరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. నిమ్జ్‌కు సమీపంలో ఉండటంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఆశ పెట్టడంతో ఓ ప్రైవేట్ ఉద్యోగి గజం రూ.8 వేలు చొప్పున 150 గజాల స్థలాన్ని కొన్నాడు. కొడుకు పైచదువుల కోసమని ఏడాది క్రితం నుంచి ప్లాట్ అమ్మకానికి పెడితే పోవడం లేదు. రెట్టింపు ధర కాకపోయిన కనీసం బ్యాంకు వడ్డీ చొప్పున ధర కలిసొచ్చినా విక్రయిద్దామని చూసినా లాభం లేకుండా పోయింది. దీంతో ప్లాట్ కొన్న కంపెనీ ఆఫీసుకు వెళ్లి తన ప్లాట్ విక్రయించి పెట్టమని చెబితే.. ఇప్పుడక్కడ మార్కెట్ బాగాలేదని, మరో ఏడాది పాటు ఆగాలని సర్దిచెప్పి పంపించేశారు... ఇదీ రీసేల్ ప్లాట్ల పరిస్థితి. – సాక్షి, సిటీబ్యూరోఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు? పిల్లల చదువుకోసమో, అమ్మాయి పెళ్లి కోసమో, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు గిరాకీ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా వెంచర్లు రావడం, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ప్రభుత్వ ప్రతికూల విధానాలతో స్థిరాస్తి మార్కెట్ మందగించింది. దీంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ పూర్తిగా తగ్గింది.నగరం చుట్టూ ఇదే పరిస్థితి.. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండ్రస్టియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్ట్‌లు వచ్చేస్తున్నాయంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల వంటి ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. ప్లాట్ కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతుంది. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి మౌలిక వసతులను కల్పించకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లను విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.రెరాలో నమోదు లేకుండానే.. నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíÙయా, దుబాయ్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి ఆదివారం నుంచి బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు వెంచర్ల వద్ద టెంట్లు, ఏసీ గదులను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తున్నాయి. కొనుగోలుదారులకు మందు, విందు అందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!అమ్ముకోలేక అగచాట్లు.. కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మానుశ్య ప్రాంతాలు, జంగిల్లలో కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాలలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరం అయితే అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. అలాంటి వారంతా రెండు, మూడేళ్లుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే అమ్ముడుపోవడం లేదు. -
ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!
రియల్ ఎస్టేట్ మార్కెట్లో సాధారణంగా ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటం చవక. కానీ అమెరికా నగరం పిట్స్బర్గ్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఇక్కడ ఇల్లు కొనడం నిజంగా అద్దె కంటే చవకగా మారింది. అందుకే కొత్త గృహ కొనుగోలుదారులకు ఇది ఆకర్షణీయ గమ్యస్థానం అవుతోంది.రియల్టర్.కామ్ (Realtor.com) సీనియర్ ఎకనామిక్ రీసెర్చ్ విశ్లేషకురాలు హన్నా జోన్స్ వివరాల ప్రకారం.. అక్టోబర్‌లో పిట్స్బర్గ్, అమెరికాలో అత్యంత చవకైన ప్రధాన హౌసింగ్ మార్కెట్‌గా ర్యాంకయింది. ఇక్కడ ఇళ్ల సగటు లిస్టింగ్ ధర 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) ఇది జాతీయ సగటు కంటే 1.5 లక్షల (సుమారు రూ.1.25 కోట్లు) డాలర్లపైగానే తక్కువ. ఈ నగరంలో ఐదు సంవత్సరాల క్రితం ఇళ్ల సగటు ధర 234,900 డాలర్లు ఉండగా, ఇప్పటి ధరలు కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. మిగతా పెద్ద నగరాలతో పోలిస్తే ఇది చాలా స్థిరమైన పెరుగుదల.ఇంకా ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ ఒకటి వేసవిలో ఇచ్చిన వివరాల ప్రకారం..ప్రధాన యూఎస్ మెట్రో నగరాల్లో అద్దె కంటే ఇల్లు కొనడం మరింత చవకగా ఉన్న ఏకైక నగరం పిట్స్బర్గ్.30% స్థోమత నియమం ప్రకారం కూడా మధ్యస్థ ఆదాయ కుటుంబాలు ఇక్కడ ఇల్లు కొనగలగడం చాలా సులభం.జూలైలో పిట్స్బర్గ్ మాత్రమే మధ్యస్థ ఆదాయ కుటుంబం మార్కెట్లో ఉన్న ఇళ్లలో 50% కంటే ఎక్కువను భరించగల మెట్రోగా నిలిచింది.యూఎస్ వ్యాప్తంగా ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నా, పిట్స్బర్గ్ మాత్రం ఇప్పటికీ చాలా కుటుంబాలకు అరుదైన అవకాశాన్ని అందిస్తోంది.రియల్టర్.కామ్ ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో 5,842 ఇళ్లు ఉన్నాయి. అంటే ప్రతిఒక్కరి బడ్జెట్‌కీ అనువుగా ఇక్కడ ఇల్లు లభిస్తుంది. ఇంకా మంచి వార్త ఏమిటంటే ఈ నగరం మొదటిసారి ఇల్లు కొనుగోలు దారులకు గ్రాంట్లు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. -
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం: తొలిరోజే 59 ప్లాట్ల సేల్
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్ఆర్కు సమీపంలోని తొర్రూర్, కుర్మల్ గూడ, బహదూర్ పల్లి ప్రాంతాలలోని 163 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు.రెండు రోజుల పాటు జరిగే ఈ బహిరంగ వేలంలో తొలి రోజున తొర్రూరులోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ విక్రయాల్లో అత్యధికంగా చదరపు గజానికి రూ. 39 వేల ధర పలికింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో చదరపు గజానికి సగటున రూ. 28,700 ధర పలికింది. ఇక్కడి భూములకు కనీస ధర రూ. 25 వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించారు.సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తం రూ. 46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వేలం పాటలో 110 మంది బిడ్డర్లు పాల్గొన్నారన్నారు. కాగా తొర్రూర్ ప్రాంతంలోని మిగిలిన 65 ప్లాట్లకు, కుర్మల్ గూడలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలోని 13 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
సొంతిల్లు.. దాదాపు ప్రతి ఒక్కరికీ జీవిత ఆశయం. కొంత మంది తక్కువ వయస్సులోనే సొంతిల్లు సమకూర్చుకుంటారు. కానీ చాలా మంది 40 ఏళ్లు వచ్చాక కూడా దీని కోసమే పోరాడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కుదురుకోవడం, పెళ్లి, పిల్లలు ఇలా అన్నీ అయ్యాక సొంతింటి పని పడతారు. అయితే 40ల వయసులో ఇల్లు కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..40లలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా స్థిరంగా పెరుగుతాయి. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యయాలు కచ్చితంగా ఉంటాయి. అందుకే గృహ రుణం ఈ వాస్తవాలకు సరిపోయేలా ఉండాలి. ఈఎంఐలు మీ రిటైర్మెంట్ పొదుపులను తగ్గించకూడదు. నిత్య ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడేలా చేయకూడదు.ఎలాంటి ప్రాపర్టీ కొనాలి?40ల్లో ప్రాధాన్యతలు మారతాయి. ఇప్పుడు ‘హాట్’ లొకేషన్ కంటే రోజువారీ సౌలభ్యం ముఖ్యం. అంటే ప్రయాణ సమయం తక్కువ ఉండటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండే ప్రాపర్టీని ఎంచుకోవాలి. తెలిసిన ప్రాంతమైతే మరీ మంచిది. రెడీ-టు-మూవ్ అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఉత్తమం. ఇవి నిర్మాణ ఆలస్యం రిస్క్‌ను తగ్గిస్తాయి. క్యాష్ ఫ్లో ప్రణాళికను సులభతరం చేస్తాయి. అయితే కొనుగోలు ముందు రెరా (RERA) వివరాలు, కంప్లీషన్ సర్టిఫికేట్లు, సొసైటీ నిబంధనలు, పెండింగ్ బకాయిలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.40ల తర్వాత హోమ్ లోన్ తీసుకుంటే..సాధారణంగా బ్యాంకులు కానీ, రుణ సంస్థలు కానీ తామిచ్చే లోన్లను రుణగ్రహీత రిటైర్ అయ్యేలోపు రికవరీ అయ్యేలా చూసుకుంటాయి. అందులో భాగంగా రుణ చెల్లింపు వ్యవధి తక్కువ ఉంటుంది. ఫలితంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి చాలా మంది దంపతులు జాయింట్ లోన్ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లించదగిన స్థాయిలో ఉంటుంది.రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీయకూడదుమంచి ఇల్లు కొనాలన్న ఉత్సాహం రిటైర్మెంట్ సేవింగ్స్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈపీఎఫ్, వీపీఎఫ్, ఎన్పీఎస్, దీర్ఘకాల సిప్‌లు వంటి పొదుపులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఒక సింపుల్ పరీక్ష ఉంది. అదేంటంటే.. ఇంటి ఈఎంఐ కారణంగా మీ రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్లను రెండు మూడు నెలలకు పైగా నిలిపివేయాల్సి వచ్చేలా ఉంటే ఆ ఇంటి కొనుగోలు ప్లాన్ మార్చుకుని చిన్న ఇల్లు కొనడమో లేదా డౌన్ పేమెంట్ ఇంకాస్త పెంచుకోవడమో చేయాలి.ఎక్కువ డౌన్ పేమెంట్ మేలుడౌన్ పేమెంట్ ఎంత ఎక్కువైతే అంత మేలు. ఏళ్లుగా పోగుచేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువగా పెట్టగలిగితే నెల నెలా ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తద్వారా మీ అత్యవసర నిధికి ఎలాంటి డోకా ఉండదు. ప్రతినెలా పెద్దగా ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చు.ఇన్సూరెన్సులూ ముఖ్యమే..హోమ్ లోన్ మీ ఫైనాన్షియల్ రిస్క్‌ను పెంచుతుంది. అందుకే రుణ బకాయికి కనీసం సరిపడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరం. ఇవి లేకపోతే కుటుంబ రుణ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. -
విల్లాలకు దీటుగా హైరైజ్ అపార్ట్మెంట్లు
అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్ మహా నగరంలో ఆకాశహర్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. పది అంతస్తులపైన నివసించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీజనుల హైడ్రీమ్స్ను ప్రతిబింబించే విధంగా హైరైజ్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలకు దీటుగా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.నగరవాసుల అభిరుచికి తగినట్లు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గడిచిన 9 నెలల కాలంలో 77 హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సుమారు 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే న్యూయార్క్ వంటి నగరాలను తలపించే విధంగా కనిపిస్తున్న పడమటి ప్రాంతంలో మరిన్ని ఆకాశ సౌధాలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల క్రితం 37.03 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 55 హైరైజ్ భవనాలకు అనుమతి ఇవ్వగా ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే అంతకు రెట్టింపు సంఖ్యలో అందజేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కోకాపేట్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బహుళ వినియోగ జోన్లు, బహుళ అసంతస్తుల భవనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ మరోసారి భూముల వేలానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కోకాపేట్ నియోపోలిస్‌లో రెండు విడతలుగా స్థలాలను విక్రయించగా అనూహ్యమైన స్పందన లభించింది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈ క్రమంలో ఈ నెల 24, 26 తేదీల్లో మరోసారి ఆన్లైన్ బిడ్డింగ్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుతం కోకాపేట్లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులను అందజేసింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు సైతం అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.‘అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉండే నివాస సముదాయాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇందుకు అనుగుణంగా హైరైజ్ భవనాల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటోంది.’ అని ఒక హెచ్ఎండీఏ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం కోకాపేట్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 49 అంతస్తుల నుంచి 63 అంతస్తుల భవనాల వరకు నిర్మాణ అనుమతులను అందజేశారు.హోదాగా భావిస్తున్నారు.. ప్రపంచదేశాల్లోని పలు నగరాల్లో వంద అంతస్తులకు పైగా నివాస భవనాలు ఉన్నాయి. అంతస్తులు పెరుగుతున్న కొద్దీ ఆకాశంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్న అనుభూతి లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అత్యంత ఎత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వాహనకాలుష్యం, శబ్దకాలుష్యం వంటి సమస్యలకు హైరైజ్ భవనాలను పరిష్కారంగా భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హైరైజ్ భవనాల్లో నివసించడాన్ని కొంతమంది ఉన్నత హోదాగా భావిస్తున్నారు. దీంతో ఇది ఒక ట్రెండ్‌గా మారిందని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు సమీపంలో, సకల వసతులతో, పార్కింగ్ సదుపాయాలతో ఉండే ఈ భవనాల్లో పటిష్ట భద్రతా వ్యవస్థ కూడా ఉంటుంది. ఇలాంటి సానుకూలమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎన్ఆర్ఐలు హైరైజ్ భవనాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ నిపుణులు సైతం హైరైజ్నే ఎంపిక చేసుకుంటున్నారు. యూఎస్, కెనడా, యూరోప్ వంటి దేశాల్లో చాలాకాలంగా బహుళ అంతస్తుల భవనాలే నివాస సముదాయాలుగా కొనసాగుతుండగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అభివృద్ధి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 88.15 లక్షల చ.మీ.ల నిర్మాణాలు మరోవైపు నిర్మాణ రంగ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దీంతో ఈ ఏడాది సుమారు 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా భవన నిర్మాణాలకు అనుమతులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, తదితర నిర్మాణాల కోసం 3,677 దరఖాస్తులు హెచ్ఎండీఏకు అందాయి. వాటిలో 2,887 దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు మంజూరు చేశారు. దీంతో గతేడాది కంటే 79 శాతం ఆమోద రేటును సాధించినట్లు ఇది 2024లో 38 శాతం కావడం గమనార్హం.గతేడాది 3,209 దరఖాస్తుల్లో 1,216 మాత్రమే పరిష్కారమయ్యాయి. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి కాల పరిమితి తగ్గించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫైళ్లను పరిష్కరించేందుకు అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. పర్మిట్ ఫీజుల రూపంలో ఈ ఏడాది రూ.1,225 కోట్లు లభించాయి. గతేడాది పర్మిట్ ఫీజులపై మొదటి 9 నెలల కాలానికి రూ.355 కోట్లు మాత్రమే లభించడం గమనార్హం. బిల్డ్‌నౌ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థ కూడా నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో 22,345 యూనిట్లు సేల్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అస్థిరత, అధిక ధరలు వంటి ప్రతికూల మార్కెట్లో ఇండియాలో గృహ విక్రయాలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లు కుదుటపడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్–25 నుంచి మార్చి–26)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.6.65 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడువుతాయని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాలు 19 శాతం పెరగొచ్చని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది.హైదరాబాద్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.30,646 కోట్ల విలువ చేసే 22,345 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.59,243 కోట్ల విలువ చేసే 48,980 యూనిట్లను విక్రయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో విక్రయమైన ఇళ్ల విలువలో అత్యధికంగా 74 శాతంతో ఎన్సీఆర్–ఢిల్లీ, 71 శాతంతో చెన్నైలు అగ్రస్థానంలో నిలిచాయి. 45 శాతంతో ముంబై అత్యల్ప స్థానంలో నిలిచింది. లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో డెవలపర్లు కూడా కొనుగోలుదారుల అభిరుచుల మేరకు విలాసవంతమైన భవన నిర్మాణాలనే ప్రారంభిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్‌లలో 42 శాతం లగ్జరీ గృహాలే కావడమే ఇందుకు ఉదాహరణ.ఇప్పటికే 53 శాతం..గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.59 లక్షల కోట్లు విలువ చేసే 4,22,765 ఇళ్లు విక్రయమయ్యాయి. అయితే అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 14 శాతం మేర క్షీణించగా.. వాటి విలువ మాత్రం 6 శాతం మేర పెరిగింది. మెట్రో నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉంటాయని, 4 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు కాదని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని విక్రయమైన ఇళ్ల విలువలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే ఇప్పటికే 53 శాతం సాధించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ హెచ్1లో 2.98 లక్షల కోట్ల విలువ చేసే 1.93 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. -
ఆ రియల్ ఎస్టేట్ స్కీమ్‌లకు ఆశపడితే..
ప్రీలాంచ్, బైబ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్.. పేర్లు ఏమైనా ఇవన్నీ కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేసే స్కీమ్లే. నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం.. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి.ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవడం లేదు? సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్?భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారుడికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో నమ్మకమే కొరవడింది. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభం చూసే భూయజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. ఇలా అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు.నిధుల మళ్లింపుతో.. వ్యాపారంలో షార్ట్‌కర్ట్ దురుద్దేశంతో కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు.అధ్యయనం చేయకుండానే.. ప్రీలాంచ్, యూడీఎస్ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసేందుకు వందలాది మంది బిల్డర్లు పుట్టుకొస్తున్నారు. కొంత మంది కొనుగోలుదారులు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పిస్తుండటంతో ప్రీలాంచ్ మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను కఠినంగా శిక్షించాలి. కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో మోసపోకుండా జాగ్రత్తపడాలి. కొనేముందు గమనించాల్సినవి ఇవే..నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా తెలుసుకోవాలి.ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి. -
ఇప్పుడు డిమాండంతా ఇలాంటి ఇళ్లకే..
కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిందని ఓ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పాజెక్ట్‌ల గురించి విచారణ పెరిగింది. అలాగే ఆ ఏరియాల్లోనే కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కువగా లాంచింగ్స్ జరుగుతున్నాయి. మణికొండ, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి. -
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, ఎలా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, అనే విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం వల్ల.. ఇళ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇల్లు కొనడం అనేది ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమయంలో ఇల్లు కొనాలంటే అప్పు చేసి (బ్యాంక్ లోన్) కొనమంటున్నారు కియోసాకి. పర్సనల్ ఫైనాన్స్ యూట్యూబర్ శరణ్ హెగ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఇల్లు కొనడంలో తప్పు లేదు. కానీ జీతంతో, లేదా మీరు చేసిన పొదుపుతో ఇల్లు కొనాలని చూస్తే మాత్రం అప్పులపాలైపోతారని కియోసాకి పేర్కొన్నారు. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించాలి. ఆలా వచ్చిన డబ్బు ద్వారా లోన్ చెల్లించాలి. ఇలా చేస్తూ ఉంటే.. చివరికి ఇల్లు మీ సొంతం అవుతుందని ఆయన చెబుతారు. ఇక్కడ మీ చేతి నుంచి చెల్లించిన డబ్బు ఏమీ ఉండదు. అయితే చివరికి ఆస్తి మీదవుతుంది. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని కియోసాకి చెబుతారు.తనకు చాలా ఇల్లు ఉన్నట్లు కియోసాకి ఇంటర్వ్యూలో కియోసాకి పేర్కొన్నారు. ఆ ఇళ్లను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తాను అని కూడా ఆయన వెల్లడించారు. 2025 రెండవ త్రైమాసికంలో USలో సగటు ఇంటి ధర 4,10,800 డాలర్లు అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ తెలిపిందని కియోసాకి వివరించారు.డబ్బు మీ కోసం పనిచేయాలిరాబర్ట్ కియోసాకి తన ఆర్ధిక సూత్రాలలో కూడా డబ్బు కోసం మీరు పనిచేయకండి, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయండి అని చెబుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, నెలవారీ బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. ఇదే జీవితాంతం కొనసాగుతుంది. ఇదే డబ్బు కోసం పనిచేయడం అన్నమాట.ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకిడబ్బు మీ కోసం పనిచేయడం అంటే.. ఒక ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకు ఇస్తారు. మీకు ప్రతి నెలా డబ్బు వస్తుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెడితే, కంపెనీ లాభాల్లో భాగంగా డివిడెండ్ వస్తుంది. ఏదైనా వ్యాపారం ఉంటే.. మీరు పని చేయకపోయినా వ్యాపారమే మీకు డబ్బు సంపాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఒక బుక్ రాశినా, సాఫ్ట్వేర్ రూపొందించినా, మ్యూజిక్ క్రియేట్ చేసినా అవి అమ్ముడవుతాయి. తద్వారా మీకు డబ్బు వస్తుంది. -
పిల్లల పేరు మీద ప్రాపర్టీ కొంటున్నారా?
తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలని ప్రతి తల్లిదండ్రులు ఆరాటపడతారు. వారి కోసం డబ్బులు పోగుచేస్తారు. చాలా మంది ఆస్తులు సైతం కొంటుంటారు. అయితే పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టపరమైన హక్కులు, వారసత్వం, పన్నులు, సంరక్షణ వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీలునామా, గార్డియన్షిప్, పన్ను నిబంధనలు స్పష్టంగా ఉండాలి.పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి బాలల దినోత్సవం (Children's Day) సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం.. చట్టపరమైన హక్కులుపిల్లల పేరు మీద ఆస్తి కొంటే, ఆ ఆస్తి పిల్లలకే హక్కుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆ ఆస్తికి కేవలం సంరక్షకులుగా (Guardians) మాత్రమే ఉండగలరు. పిల్లలు పెద్దవారయ్యాక (18 ఏళ్లు పూర్తయ్యాక) ఆ ఆస్తిపై పూర్తి హక్కు పొందుతారు.వీలునామా అవసరంతల్లిదండ్రులు వీలునామా రాయకపోతే, హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆస్తి వారసత్వంగా ఇతర పిల్లలకు కూడా పంచబడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆస్తి ఎవరికీ చెందాలో స్పష్టంగా చెప్పే వీలునామా రాయడం చాలా అవసరం.పన్నులుపిల్లల పేరు మీద ఆస్తి కొనుగోలు చేసినా, ఆ ఆస్తి నుండి వచ్చే ఆదాయం అంటే అద్దెలు, వడ్డీలు వంటివి తల్లిదండ్రుల ఆదాయంలో కలిపి చూస్తారు. ఆ మేరకు పన్ను వర్తిస్తుంది. పిల్లలు పెద్దవారయ్యాక మాత్రమే ఆ ఆదాయం వారి పేరుతో పరిగణించబడుతుంది.గార్డియన్షిప్పిల్లలు మైనర్‌గా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఆస్తిని నిర్వహించాలి. ఆస్తి అమ్మకం, లీజ్, లేదా మార్పిడి చేయాలంటే కోర్టు అనుమతి అవసరం.భవిష్యత్ సమస్యలు రాకుండా జాగ్రత్తలుఆస్తి కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు పిల్లల పేరుతో సరిగా నమోదు చేయాలి. భవిష్యత్‌లో తోబుట్టువుల మధ్య వివాదాలు రాకుండా వీలునామా తప్పనిసరిగా ఉండాలి. ఆదాయం, పన్నులు, వారసత్వం విషయంలో ముందుగానే ప్రణాళిక అవసరం. -
లగ్జరీ అపార్ట్మెంట్ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్ వీడియో
ఇల్లు కొనాలంటే మాటలు కాదు. ఇంటి నాణ్యత, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు గురించి కచ్చితంగా తనిఖీ చేసుకుంటాం. ఒకటిరెండు సార్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని చెక్ చేసుకుని మరీ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం కదా. మరి కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న ఒక అపార్ట్మెంట్ గోడ ఒక్క పెన్సిల్ మొనకే రంధ్రం పడితే.. గుండె గుభిల్లు మనదూ.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. నోయిడాకు చెందిన వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ గోడకు పెన్సిల్‌తో రంధ్రం చేయడం చర్చనీయాంశమైంది. నోయిడా నివాసి తన రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ గోడకు చెక్క పెన్సిల్‌తో రంధ్రం చేశాడు.ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఖరీదైన గృహనిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే భద్రత , సామగ్రి గురించి ఆందోళనలను రేకెత్తించింది.kabeer.unfiltered' అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన వీడియోలో, తన ప్రీమియం అపార్ట్మెంట్ గోడలోకి చెక్క పెన్సిల్‌ను సుత్తితో కొట్టడాన్ని చూడొచ్చు. కేవలం పెన్సీల్‌తో గోడకు సుత్తి సాయంతో రంధ్రం చేశానని తెలిపాడు. మొదట డ్రిల్‌ను ఉపయోచాలని చూశా. కానీ డ్రిల్ కూడా అవసరం లేకుండానే, పెన్సిల్ నేరుగా గోడలోకి దిగిపోయింది. ఇది మనం పాఠశాలలో వాడే గ్రాఫైట్ పెన్సిలే. ఈ ఇల్లు అంత బలంగా ఉంది అని రాసుకొచ్చాడు.దీనిపై చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోవడం బాధాకరం అంటూ వాపోయారు. మరికొందరు భిన్నమైన దృక్పథాన్ని అందించారు. AAC (ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్) గోడలు అని, ఈ తేలికైన గోడలను ఎత్తైన నిర్మాణంలో ఉపయోగిస్తారని, భూకంపాల సమయంలో ఇది సురక్షితంగా, మరింత స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ గోడలు భారాన్ని మోసేవి కావు , సాంప్రదాయ ఇటుక, మోర్టార్ గోడల మాదిరిగా ఉండవని వివరణ ఇచ్చారు. పేరు తగ్గట్టే ఏఏసీ గోడలు. ఇవి డ్రిల్లింగ్కు ఈజీగా ఉంటాయ్.. అందుకే తెలుసుకొని మాట్లాడాలి అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kabeer.Unfiltered (@kabeer.unfiltered) కాగా ఈ వీడియో ప్రామాణికత, గోడ నాణ్యత లాంటి విషయాలపై క్లారిటీ లేదు. ఈ వీడియోలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా తన వ్యక్తిగత అనుభవాలు ,పరిశీలనల ఆధారంతో రాసింది . ఈ కంటెంట్ ఏ వ్యక్తిని, కంపెనీని లేదా సంస్థను కించపరచడానికి ఉద్దేశించింది కాదంటూ డిస్క్లైమర్ కూడా ఇచ్చాడు. ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లు తేలికైన, ప్రీకాస్ట్ నిర్మాణ సామగ్రి. వీటితో ఖర్చు తక్కువ. తేలికైనవి, సౌకర్యవంతమైనవి, మన్నికైనవి కూడా. అద్భుతమైన ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటి వలన భవనం చల్లగా ఉంటుంది. అగ్ని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. చెద లాంటి సమస్యలు కూడా ఉండవు. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద -
ఇళ్ల అమ్మకాలు @ రూ.2.98 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) సంఖ్యా పరంగా తక్కువ నమోదు కాగా, విలువ పరంగా వృద్ధి కనిపించింది. అమ్మకాలు 1.93 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2.27 లక్షల యూనిట్లతో పోల్చి చూస్తే 15 శాతం తగ్గాయి. కానీ, ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2.98 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల విలువ రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. అంటే విలువ పరంగా 7 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విక్రయాల విలువ క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 19 శాతం అధికంగా రూ.6.65 లక్షల కోట్లుగా ఉండొచ్చని అనారక్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ అంచనా వేశారు. సగటు ధరలు, అపార్ట్మెంట్ సగటు పరిమాణం ఆధారంగా ఈ అంచనా వ్యక్తం చేశారు. 2024–25లో దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 4,22,765 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.5.59 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. 2023–24లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరిన అనంతరం ఎన్నో ప్రతికూలతల మధ్య ఆ తర్వాత కొంత నెమ్మదించినట్టు పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాల విలువ అధికంగా నమోదు కావడం వెనుక ధరలు పెరగడాన్ని కారణంగా అనరాక్ నివేదిక పేర్కొంది. అలాగే, ప్రీమియం అపార్ట్మెంట్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. స్పెక్యులేటివ్ కొనుగోళ్లకు బదులు వాస్తవ, వినియోగ ఆధారిత కొనుగోళ్ల డిమాండ్ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు సర్వమ్ ప్రాపరీ్టస్ సహ వ్యవస్థాపకుడు ధావల్ హెమానీ తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో తదుపరి వృద్ధి అమ్మకాల పరిమాణం కంటే విలువ ఆధారితంగానే ఉంటుందని రియల్ స్టేట్ రంగ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ‘గోల్డెన్ గ్రోత్ ఫండ్’ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు. డెవలపర్లు ఎక్కువ ప్రాజెక్టుల కంటే.. నాణ్యత, సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పంగించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. -
రియల్ ఎస్టేట్ సంస్థకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.46.86 నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం భారీ తగ్గడం ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది క్యూ2లో రూ.4.15 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం విశేషం.వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.777.42 కోట్ల నుంచి రూ.372.51 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.12.42 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా రూ.1,205.40 నుంచి రూ.1,270.86 కోట్లకు పెరిగింది.గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,290 కోట్ల ప్రాపర్టీస్ విక్రయించింది. దీంతో సేల్స్ పరంగా దేశంలో అయిదవ అతిపెద్ద లిస్టెడ్ రియల్టీ కంపెనీగా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.12,500 కోట్ల ముందస్తు బుకింగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.👉 ఇదీ చదవండి: ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి! -
ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పొదుపు, రుణం, పెట్టుబడులతో కూడుకున్న అంశం. జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా లేకుంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో.. ఈ ఇల్లు కొని తప్పు చేశానే.. అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నో చట్టాలు, నిబంధనలు ఉన్నా.. సామాన్యుడి సొంతింటి కలను క్యాష్ చేసుకోవాలనే అక్రమార్కులు కనిపిస్తూనే ఉన్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న పలు జాగ్రత్తలివీ..టైటిల్ డీడ్డెవలపర్కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. గృహ కొనుగోలుదారులు దీని కోసం అడగాలి. స్థానిక సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదుల వంటి ఇతర కీలక పత్రాలను కూడా పరిశీలించాలి.అనుమతులుప్రాజెక్ట్ లేఅవుట్, భవన నిర్మాణ ప్రణాళికకు మున్సిపల్ అధికారుల ఆమోదం ఉండాలి. ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్ట్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోవాలి.సర్టిఫికెట్లుప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి కమెన్స్ సర్టిఫికెట్, అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అలాగే ప్రతీ ప్రాజెక్ట్‌కు అగ్నిమాపక, పర్యావరణం, నీటి సరఫరా, విద్యుత్ సహా బహుళ విభాగాల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) సరి్టఫికెట్లు అవసరం. ఇవన్నీ పునఃపరిశీలించిన తర్వాతే గృహ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.రిజిస్ట్రేషన్రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం కింద ప్రతీ ప్రాజెక్ట్‌ను నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, అమ్మకం వంటివి చేయకూడదు. అందువల్ల ఆయా ప్రాజెక్ట్‌కు రెరా అనుమతి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ -
10 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్!
సిటీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 50 లక్షలైనా అవుతుంది. కానీ 10 లక్షల రూపాయలకే రెండు పడకల ఫ్లాట్.. అది కూడా నగరంలో అంటే ఆశ్చర్యం కలగమానదు. ఇంత తక్కువకి ఎక్కడ అమ్ముతున్నారని అనుకుంటున్నారా? ప్రభుత్వమే కట్టించి, ముఖ్యమంత్రే స్వయంగా మీకు ఇంటి తాళాలు అప్పగిస్తే..! ఏంటి నమ్మడం లేదా? అయితే పదండి.. ఆ వివరాలు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణివేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇలాంటి చర్యల్లో భాగంగా మాఫియా నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఆక్రమించిన సుమారు 2,322 చదరపు మీటర్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పేదలకు ఇళ్లు నిర్మించింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ స్కీమ్ (Sardar Vallabhbhai Patel Housing Scheme) కింద లక్నో డెవలప్మెంట్ అథారిటీ (LDA) ఈ ఫ్లాట్లను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో మూడు G+3 బ్లాక్‌లలో 72 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొ ఫ్లాట్ 36.65 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో ఫ్లాట్ ధర ₹10.70 లక్షలు. ఈ గృహ సముదాయంలో స్వచ్ఛమైన నీరు, విద్యుత్, సెక్యురిటీ, ద్విచక్ర వాహన పార్కింగ్ ,రోడ్లు, పార్కులు వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.అక్రమార్కుల ఆటలు సాగవుకార్తీక పౌర్ణమి రోజున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ గృహ సముదాయం ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను చెరబట్టిన అక్రమార్కుల ఆట కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. "ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం కాదు, ఒకప్పుడు మాఫియా ఆక్రమించిన భూమిలో ఇప్పుడు పేదలు ఇళ్లు దక్కాయనే సందేశం ఇది. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పేదలను దోపిడీ చేసే వారి ఆటలు ఉత్తరప్రదేశ్‌లో ఇకపై సాగబోవు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటానికి మా ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. ఇది నూతన భారతదేశం, ఉత్తరప్రదేశ్ యొక్క గుర్తింపు. ఇక్కడ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి అభివృద్ధి నడుస్తుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన లక్నోలో మాఫియా లేని భూమిలో లబ్ధిదారులకు గృహాలను అందించడం నిజంగా గర్వకారణమ''ని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంఒక్కో ఫ్లాట్ విలువ రూ. కోటి!గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా బహుమతులు పంపిణీ చేశారు. నివాసితుల పిల్లలతో అప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచారు. నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. కాగా, లక్నోలోని ప్రైమ్ ఏరియాలో నిర్మించిన ఈ ఫ్లాట్లను దక్కించుకునేందుకు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,700 మంది అర్హులని గుర్తించారు. వీరిలో 72 మంది ఫ్లాట్లను దక్కించుకున్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు కోటి రూపాయలకు వరకు ఉంటుందని సీఎం యోగి చెప్పారు. संदेश स्पष्ट है...अगर गरीबों की व किसी सार्वजनिक भूमि पर कब्जा कर समाज को धमकाने का कार्य करोगे तो लेने के देने पड़ जाएंगे।आज लखनऊ में माफिया से मुक्त कराई गई भूमि पर दुर्बल आय वर्ग के 72 परिवारों के लिए निर्मित फ्लैट के आवंटन-पत्र का वितरण किया। इस अवसर पर सरदार वल्लभ भाई… pic.twitter.com/gNmE1FXvzT— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2025 -
ఇంటి అందాన్ని పెంచేవి.. ఇవే!
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు కనిపిస్తుంటే ఇల్లు అందవికారంగా కనిపించడమే కాదు ఇంటి యజమానిపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడతాయి. అందుకే అందమైన ఇంటీరియర్‌తో ఇంటికి వచి్చన అతిథులకు స్వాగతం పలుకుతున్నారు నేటి గృహ కొనుగోలుదారులు. ఇంటీరియర్‌లో అల్మారాలది ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సామాగ్రిని భద్రపర్చడానికి మాత్రమే కాకుండా ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో కీలకమైన అల్మారాలతో ఆధునిక డిజైన్లతో గృహ శోభను రెట్టింపు చేస్తాయి.స్లైండింగ్ డోర్ కబోర్డ్స్, వాక్ ఇన్ వార్డ్రోబ్స్, మిర్రర్ ఫినిష్, కార్నర్ కబోర్డ్స్, ఫ్లోర్ టు సీలింగ్ కబోర్డ్స్ వంటి ఎన్నో రకాల డిజైన్లు, రంగులతో అల్మారాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు చెక్క అల్మారాలు, ప్లైవుడ్, లామినేటెడ్, గ్లాస్, మెటల్‌తో కూడా అల్మారాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో లామినేట్, మెటల్ ఫినిషింగ్ అల్మారాలు వినియోగించడం ఉత్తమం. చెదల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అవసరం. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ
‘ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితం భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు వంద అపార్ట్మెంట్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి, ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను కూడా భరించలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం బిల్డర్ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాడు.’ ..ఒకరిద్దరు కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా మంది పరిస్థితి ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, అపరిమిత సరఫరా, వడ్డీ రేట్లు, అధిక ధరలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి రకరకాల కారణాలతో అపార్ట్మెంట్ల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో నగరంలో ఇన్వెంటరీ పెరిగిపోయింది. కస్టమర్ల వాకిన్స్ లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 5,61,756 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో 1.76 లక్షల యూనిట్లుండగా.. రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం నగరంలో 95,331 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఏకంగా లక్షకుపైగా ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతం కొంతమేర తగ్గాయి. అయితే దక్షిణాది నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఇన్వెంటరీ అత్యధికంగా ఉంది. బెంగళూరులో 59,244, చెన్నైలో 32,379 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి.పశ్చిమంలోనే ఎక్కువ..దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలోనే రెండు వేలు, మూడు వేల అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నగరంలో సగానికి పైగా ఇన్వెంటరీ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలలో డిమాండ్‌కు మించి అపార్ట్మెంట్ల సరఫరా రావడమే ఇందకు ప్రధాన కారణం.నాలాలు, చెరువులంటే భయం..నాలాలు, చెరువులకు సమీపంలో ప్రాజెక్ట్‌ల పేరు వింటేనే కస్టమర్లు జంకుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నా సరే లేక్ వ్యూ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏ కారణంతో ఎప్పుడు కూలుస్తారో? అక్రమ నిర్మాణం అంటారోనని గృహ కొనుగోలుదారులు వెనుకడుగేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందనో ధైర్యం చేసి అపార్ట్మెంట్ కొని, బ్యాంక్ ఈఎంఐ భారం భరించడం కంటే లేక్ వ్యూలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం కస్టమర్లలో నెలకొంది. దీంతో గతంలో లేక్‌వ్యూ అంటే ఎగబడి కొన్న జనం.. నేడు విక్రయాలు లేక ప్రాజెక్ట్‌లు విలవిల్లాడుతున్నాయి.లేఆఫ్‌లు కూడా కారణమే..స్థిరాస్తి రంగంలో సగానికి పైగా కొనుగోళ్లు ఐటీ సెక్టార్ నుంచే జరుగుతుంటాయి. కృత్రిమ మేధస్సు(ఏఐ) శరవేగంగా దూసుకొస్తుండటంతో ఐటీ విభాగంలో లే ఆఫ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రాపర్టీ విక్రయాలు మందగించాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని అయోమయంలో ఐటీ ఉద్యోగులు అపార్ట్మెంట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.ఎక్కువ లగ్జరీ ఇళ్ల ఇన్వెంటరీ..రూ.2–3 కోట్ల ధర ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్‌లలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో ఈ విభాగంలో ఇన్వెంటరీ పెరిగింది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరగడంతో బిల్డర్లు కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించారు. ఇది కూడా ఇన్వెంటరీ పెరిగేందుకు కారణమే. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రూ.60 లక్షల లోపు ధర ఉండే మధ్య తరగతి ఇళ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా కారణంగా ఈ విభాగంలో ఇన్వెంటరీ ఎక్కువగా లేదు. లగ్జరీ సెగ్మెంట్లో డెవలపర్లు పోటీపడి మరీ ప్రాజెక్ట్‌లను చేపట్టడంతో ప్రస్తుతం విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. -
అదరగొట్టిన ఆఫీస్ స్పేస్.. అందుకే అంత డిమాండ్
దేశంలో ఆఫీసు స్పేస్ లీజింగ్‌లు అదరగొట్టాయి. టారిఫ్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో తొలగింపులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు స్పేస్ డిమాండ్ బలంగానే ఉంది.2025 తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు నగరాలలో ఆఫీసు స్పేస్ వినియోగ రేటు 4.2 కోట్ల చ.అ.లను అధిగమించింది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. ప్రధానంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ ఆధారిత కంపెనీలు ఇందుకు దోహదపడ్డాయి.ఆఫీసు స్పేస్ వినియోగంలో 99.5 లక్షల చ.అ.లతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. తర్వాత ఢిల్లీ–ఎన్సీఆర్లో 82 లక్షల చ.అ., ముంబై 66 లక్షల చ.అ.లతో ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల 27 శాతం వాటాతో ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో అగ్రగామిగా కొనసాగుతుండగా.. కో–వర్కింగ్ స్పేస్‌లు 23 శాతం, బీఎఫ్ఎస్ఐ 18 శాతం వాటాలతో ఉన్నాయి.గతేడాదితో పోలిస్తే ఐటీ రంగంలో ఒక శాతం తగ్గుదల నమోదైంది. జీసీసీలు కీలకమైన డిమాండ్ డ్రైవర్లుగా ఉద్భవించాయి. 2025లో ఇప్పటి వరకు స్థూల లీజింగ్ కార్యకలాపాలలో 40 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు డిమాండ్ అధికంగా ఉంది.డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుదలదేశంలో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్ట్‌లను వేగవంతం చేస్తే 2030 నాటికి ఐదు రెట్లకు పెరుగుతుందని మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ వెల్లడించింది.డేటా లొకేలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వ సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఉండగా.. మరో 1.4 గిగావాట్ల ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, నాలుగు గిగావాట్ల ప్రాజెక్ట్‌లు ప్రణాళిక దశలో ఉన్నాయని తెలిపింది. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: బలమైన డిమాండ్ నేపథ్యంలో ఇళ్ల ధరలు వచ్చే రెండు దశాబ్దాలపాటు ఏటా 5–10 శాతం మేర పెరుగుతాయని సీఐఐ, కొలియర్స్ ఇండియా సంయక్త నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం వార్షికంగా ఇళ్ల అమ్మకాలు 3–4 లక్షల యూనిట్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరతాయని పేర్కొంది. అంటే 2047 నాటికి రెట్టింపు కానున్నట్టు అంచనా వేసింది. పరిశ్రమల మండలి సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా తమ నివేదికను తాజాగా విడుదల చేశాయి. పెరుగుతున్న ఆదాయం, ఇళ్లకు సంబంధించి సానుకూల విధానాలు, పట్టణాలకు వలసలు, ప్రీమియం ఇళ్ల పట్ల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచి్చస్తుండడం, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను సైతం ప్రస్తావించింది. ఇప్పటికే పేరొందిన ముఖ్య నివాస మార్కెట్లకు అదనంగా, టైర్ 2, 3 పట్టణాలు, ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఇళ్లకు వచ్చే దశాబ్ద కాలం పాటు డిమాండ్ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేసింది. 10 ట్రిలియన్ డాలర్లు.. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 5–10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని సీఐఐ, కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘మౌలిక వసతుల విస్తరణ రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ రూపురేఖలను మార్చేయనుంది. కొత్త మార్కెట్ల వృద్ధికి అవకాశాలు కలి్పంచనుంది. టైర్–2, 3 పట్టణాలనూ మార్చనుంది. బహుళ ట్రిలియన్ డాలర్ల రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచస్థాయి నిర్మాణాలు, సమగ్ర రవాణా కేంద్రాలు, బలమైన రవాణా పరిష్కారాలు ఇవన్నీ మరింత ప్రముఖంగా మారనున్నాయి’’అని ఈ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర రవాణా, రహదారుల శాఖ డిప్యూటీ సెక్రటరీ హర్లీన్ కౌర్ పేర్కొన్నారు. మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం ఒకదానికి మరొకటి ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘‘ఎక్స్‌ప్రెస్ రహదారులు, పారిశ్రామిక కారిడార్ల అనుసంధానతను పెంచుతాయి. పట్టణాభివృద్దికి దారితీస్తాయి’’అని చెప్పారు. స్థిరమైన వృద్ధికి వీలుగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల్లో టెక్నాలజీ అనుసరణను పెంచాలని సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదు..
సాక్షి, సిటీబ్యూరో: వాస్తు.. ఇంటి ఎంపికలో కీలకం. వాస్తును విశ్వసించేవారు అన్నీ అనుకూలంగా ఉంటే తప్ప కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా నిర్ణయానికి రారు. అయితే ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదని, పరిసరాల ప్రభావం కూడా ఇంటిపై, అందులోని నివాసితులపై ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇంటి చుట్టుపక్కల, సమీపంలో శ్మశానం, ఆస్పత్రులు ఉంటే కొందరిలో మానసిక ఆందోళనలకు దారితీయవచ్చు. ఏదో రూపంలో ఏదో ఒక సమయంలో మనసుపై ప్రభావం చూపే వీలుంది. లేనిపోని భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మురుగు కాల్వలు, భారీ శబ్ధాలు చేసే కాలుష్య కర్మాగారాలు వంటివి కూడా నివాసితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెబుతుంటారు. -
ఇరుకు ఇళ్లకు ఇదే కిటుకు..!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కనిపిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి.లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట.సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బాగుంటుంది. బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపుల ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి.గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి.ఇదీ చదవండి: ఇంటి విలువ పెరగాలంటే.. -
ఇంటి విలువ పెరగాలంటే..
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు.. గ్రేటర్ నగరానికే వన్నె తెచ్చాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్‌హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.నెలసరి నిర్వహణ సక్రమంగా ఉంటేనే ఫ్లాటు విలువ పెరుగుతుంది. క్లబ్‌హౌస్‌లోని జిమ్, టెన్నిస్ వంటి సదుపాయాల కోసం విడిగా రుసుముల్ని చెల్లించాలి. హౌస్‌కీపింగ్, భద్రత, పార్కింగ్, కామన్ ఏరియాలు, విద్యుత్తు, లిఫ్టులు, తాగునీరు వంటి నిర్వహణ పనుల్ని నిర్వహణ సంస్థలే నిర్వహిస్తాయి.ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు, పెద్దలు, మహిళలు, అందరికీ కావల్సిన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. ఇవి పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టింది.కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నగరంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవల్ని పక్కగా అందించే సంస్థలు పెద్దగా లేకపోవడమే. అయితే ఇలాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పచెబితే నివాసితులపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది బిల్డర్లే నిర్వహణ బాధ్యతల్ని చేపట్టారు. -
కొత్త ఇంటికి ఏం రంగులేద్దాం.. ఉందిగా ట్రెండింగ్ కలర్!
ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్‌లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.సోలార్ ఎల్లో.. సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్‌లో ట్రెండ్‌గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్‌తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
ఆర్థిక అనిశ్చితి.. స్థిరాస్తి రంగంపై ప్రభావం!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, పలు దేశాల నడుమ యుద్ధాలు, ముడి చమురు, బంగారం ధరలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం భారత స్థిరాస్తి రంగంపై పడింది. దేశీయ రియల్టీ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయని వెస్టియాన్ నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయ రియల్టీలోకి 1.76 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 క్యూ2లోని 1.80 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల కాగా.. గతేడాది క్యూ3లోని 0.96 బిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్‌తో పోలిస్తే మాత్రం 83 శాతం అధికం.2025 క్యూ3లోని సంస్థాగత పెట్టుబడులలో అత్యధికం వాణిజ్య సముదాయంలోకి వచ్చాయి. 79 శాతం వాటాతో ఈ విభాగంలోకి 1,397.21 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇక, 11 శాతం వాటాతో నివాస సముదాయంలోకి 191.67 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి 85.79 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో డైవర్సివైడ్ విభాగంలోకి 84.82 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. -
రియల్టీకి గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది!
‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలేదు. వచ్చింది’ ఇది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం! ప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగ పతనం.. 2014 వరకూ కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణ లపై అస్పష్టత వంటి కారణాలనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది.ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్‌లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పుడు కొనుడే కరెక్ట్పడేటప్పుడు కొంటేనే తక్కువ రేటుకు వస్తుంది. షేర్లలో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్క్ఔట్ అవుతుందని ఓ బడా బిల్డర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్ బాగాలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. మాడ్యులర్ కిచెన్, ఫర్నీచర్, కార్లు వంటి ఆఫర్లు, ఉచిత రిజిస్ట్రేషన్, ధరలో రాయితీలు వంటివి అందుకునే వీలుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉంటారు. ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు.ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు. మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో మార్కెట్ బాగాలేనప్పుడు ధరలు తగ్గుతాయేమోనని భ్రమలో వేచి చూసి, మార్కెట్ బాగున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు అర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.కొత్త ప్రాజెక్ట్‌లపై పునరాలోచన..విక్రయాలు అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చ.అ. రేట్లు పెరగవు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు.వేలంతో సామాన్యుడిపైనే భారం..హైదరాబాద్‌లో సొంతంగా భూమి కొనుగోలు చేసి, భవన నిర్మాణాలు చేపట్టే డెవలపర్లు చాలా తక్కువ. భూయజమానితో ఒప్పందం చేసుకొని చేపట్టే జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రాజెక్ట్‌కైనా విక్రయాలు చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని డెవలపర్లు తమ జేబులోంచి వెచ్చించరు. ప్రాజెక్ట్ రుణం, కొనుగోలుదారులకు అపార్ట్మెంట్ల విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతోనే నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో 50 వేల యూనిట్ల అపార్ట్మెంట్లు అవసరం ఉంటాయి. సొంత నిధులతో స్థలం భూమి కొనుగోలు చేసి ప్రాజెక్ట్‌లు చేపట్టే వాళ్లు ఎంత వరకు సప్లై చేయగలరు. ఎక్కువ రేటుకు భూములు కొన్నవారు ఆ మేరకు లాభాలపైనే ఫోకస్ చేస్తారు. వేలం వెర్రిగా భూముల వేలంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడినా అంతిమంగా ఆ భారం గృహ కొనుగోలుదారులపైనే పడుతోంది. సామాన్య, మధ్యతరగతికి ఇళ్లు అందుబాటులో ఉండవు.ప్రభుత్వం ఏం చేయాలంటే?ఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవితాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్‌కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి. -
ఆఫీసు అద్దెలు పెరిగాయ్.. ఖాళీలు తగ్గాయ్..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో అద్దె చ.అ.కు రూ.85గా ఉండగా.. ఇప్పుడది రూ.90కి చేరింది. అత్యధికంగా బెంగళూరులో 9 శాతం మేర ఆఫీసు అద్దెలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫీసు వేకన్సీలు గతేడాది 16.70 శాతంగా ఉండగా.. ఇప్పుడది 16.20 శాతానికి తగ్గింది.ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ తొమ్మిది నెలల్లో ఏడు నగరాల్లో 4.2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలోని 3.1 కోట్ల చ.అ. లీజులతో పోలిస్తే 34 శాతం అధికం. అలాగే కొత్తగా ఏడు నగరాల్లో 3.9 కోట్ల చ.అ. ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గతేడాది 9 నెలల కాలంలోని 3.4 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.ఐటీ హబ్ హైదరాబాద్‌లో..ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్ లీజులు బాగానే ఉన్నా కొత్త నిర్మాణాలలో క్షీణత నమోదైంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో నగరంలో 57 లక్షల ఆఫీసు లావాదేవీలు జరిగాయి. గతేడాది 9 నెలల్లో 44.2 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే 29 శాతం అధికం. అలాగే భాగ్యనగరంలో కొత్తగా 59 లక్షల చ.అ. ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయి. గతేడాది ఇదే కాలంలో పూర్తయిన 96.8 లక్షల చ.అ.లతో పోలిస్తే 39 శాతం క్షీణించింది. ప్రస్తుతం నగరంలో ఆఫీసు వేకెన్సీ 26.50 శాతంగా ఉంది. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. యమా స్పీడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రాప్‌టైగర్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 17,658 యూనిట్లు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయమైన 11,564 యూనిట్లతో పోలిస్తే ఇది 52.7 శాతం పెరుగుదల అని పేర్కొంది.అలాగే ఈ క్యూ3లో 12,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయని, గతేడాది ఇదే కాలంలో 8,546 ఫ్లాట్ల లాంచింగ్స్‌తో పోలిస్తే ఇది 46.6 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్ల చ.అ. ధర సగటున రూ.7,750గా ఉంది. 2024 క్యూలో ఇది రూ.6,858గా ఉంది.భవిష్యత్తు ఆశాజనకంగా..హైదరాబాద్ స్థిరాస్తి రంగ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ప్రాప్‌టైగర్ సర్వే అభిప్రాయపడింది. బలమైన, స్థిరమైన ఆర్థిక పునాదులు, ఐటీ రంగ వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి చోదకాలుగా నిలుస్తున్నాయని వివరించింది.అలాగే డిజిటలైజ్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విధానంతో పారదర్శకత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొంది. అలాగే పాత బస్తీ మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్లతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. -
ట్రాక్ రికార్డును చూశాకే ‘రెరా’ అనుమతి
న్యూఢిల్లీ: బిల్డర్ల (ఇళ్ల ప్రాజెక్టులు నిర్మించే వారు) ట్రాక్ రికార్డును (గత చరిత్ర) పరిశీలించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ రెరా చట్టంలో సవరణలు తీసుకురావాలని గృహ కొనుగోలుదారుల సంఘం (ఎఫ్‌పీసీఈ) డిమాండ్ చేసింది.ప్రాపర్టీ కొనుగోలుదారులు యూనిట్ కొనుగోలును రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేందుకు ఏకీకృత నిబంధనను తీసుకురావాలని కోరుతూ ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ ఉపాధ్యాయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. హామీ మేరకు సదుపాయాలు కలి్పంచడంలో బిల్డర్లు విఫలమైతే తగిన పరిష్కారం ఉండాలని కోరారు.ఇదీ చదవండి: రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే! -
ఇల్లా, ఫ్లాటా.. వాణిజ్య భవనాల్లో స్థలమా?
ఇల్లా, ఫ్లాటా.. లేక వాణిజ్య భవనాల్లో స్థలమా? దేంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ధర పెరగడానికి ఆస్కారముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి అందుకోవచ్చు? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి, నేటికీ అధికశాతం మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోఅందుబాటు ప్రాంతాలిక్కడే.. నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.పక్కాగా చూడాలి నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.వాణిజ్య సముదాయాలా? పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోలిస్తే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది.ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గృహరుణాలతో పోలి్చతే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు. నివాస సముదాయాలా? మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో 20 శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. 20–25 ఏళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. 20 శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది.నివాస సముదాయాల రంగంలో ఏటా 12–15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక నిర్వహణ మెరుగ్గా జరపాలి.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్!
శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కనిపించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. అనేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూసేందుకు చక్కగా కనిపించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోరెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–రూ.350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ 100 చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కు చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలప ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. ఒక్కరోజులో పని పూర్తవుతుంది. ఈ గచ్చు ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. దీనిపై గీతలు కనిపించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులు అక్కరలేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు. బుడతల గదికి ప్రత్యేకం.. సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్‌పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది. -
రియల్ కదలిక!.. పెరిగిన రిజిస్ట్రేషన్లు
రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ రంగంలో మళ్లీ కదలిక మొదలైంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికలకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. తర్వాత చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతలతో భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ ఊపందుకోవడం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,893.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,41,297 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా రూ.3,911.87 కోట్ల ఆదాయం వచ్చింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు 1,98,766 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి రూ.3,381.12 కోట్ల ఆదాయం సమకూరింది.రాయదుర్గం భూముల వేలంతో..రాయదుర్గంలోని పలు భూములకు ఇటీవల హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆర్థికమాంద్యం కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులకు కొంత వెనుకాడిన రియల్ సంస్థలు తాజా వేలంతో మళ్లీ జిల్లాపై దృష్టి సారించాయి.ఇదే సమయంలో ప్రభుత్వం మీర్ఖాన్పేట కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి రూపకల్పన చేయడం, పరిశ్రమలకు అనువైన వా తావరణం కల్పిస్తుండటం తెలిసిందే. ప్రతిష్టాత్మక 550 బడా కంపెనీలను ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించడం, రేడియల్ రోడ్లు, రింగు రోడ్లకు భూ సేకరణ ప్రక్రియను చేపట్టి, ఇప్పటికే ఆయా పనులకు శంకుస్థాపనలు చేయడంతో ఆయా పరిసరాల్లో భూముల కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో బడా రియల్టర్లే కాదు సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ముందే ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొనిపెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో రిజి్రస్టేషన్ల సంఖ్య కొంత పెరగడమే ఇందుకు నిదర్శనమని రిజి్రస్టేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. -
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించేందుకు అనువుగా ఉన్న స్థలాలను (ప్లాట్లను) కొనుగోలు చేయడానికి ఇది మరో చక్కటి అవకాశం అని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్ గుడ, తొర్రూర్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతాల్లోని మొత్తం 167 ప్లాట్లకు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. తొర్రూర్‌లో 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్ గుడలో 200-300 చ. గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, అలాగే బహదూర్ పల్లిలో 200 -1000 చ. గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నామన్నారు.ప్రజలకు చక్కటి వసతులతో కూడిన నివాస భూములను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో భాగంగా పూర్తి పారదర్శకమైన విధానంలో ఈ-వేలం ద్వారా వీటిని విక్రయిస్తున్నామని గౌతం వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా, ప్రస్తుతం ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా స్థలాలను కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఆన్లైన్లో MSTC పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం పాటల్లో పాల్గొంటున్న బిడ్డర్ల వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎవరికీ తెలియవని, అందువల్ల కొనుగోలు దారులు స్వేఛ్చగా వేలం ప్రక్రియలో పాల్గొని నచ్చిన ధరకు స్థలాలను కొనుగోలు చేయవచ్చు.ఈ ప్లాట్లన్నీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడిన, అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఉన్నాయి. తొర్రూర్‌లో సుమారు 100 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర గరిష్టంగా రూ. 67,500 వేల వరకు పలికి ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయినప్పటికీ ప్రస్తుత నోటిఫికేషన్లో చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలు ఉండనుంది.కుర్మల్ గుడలో సైతం గతంలో చదరపు గజానికి సుమారు రూ.29 వేల ధర పలికినప్పటికీ, ప్రస్తుత కనీస ధర రూ.20 వేలుగా నిర్ధారించారు. బహదూర్ పలిల్లో సైతం గతంలో ఆఫ్సెట్ ధర కంటే చాలా అధికంగా రూ.47 వేల వరకు చదరపు గజం ధర పలికినా గతంలోని కనీస ధరలకే (కార్నర్ ప్లాట్లు రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు) ప్రస్తుతం కూడా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు.ఈ-వేలం షెడ్యూల్ కుర్మల్ గుడ, బహదూర్ పల్లిలోని ఫ్లాట్లకు MSTC పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబరు 27. కాగా అక్టోబరు 28వ తేదీ ఉదయం కుర్మల్ గుడలోని 29 ప్లాట్లకు, మధ్యాహ్నం బహదూర్ పల్లిలోని 18 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే తొర్రూర్‌లోని 120 ప్లాట్ల కొనుగోలు దారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 29, 30 తేదీల్లో ఒక్కో సెషన్లో30 ప్లాట్లు చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్ -
విల్లాలకు అమ్మకాల కళ.. ఫ్లాట్స్ కంటే డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొంత కాలంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లకంటే విల్లాలు, వ్యక్తిగత గృహాలకు ఆదరణ పెరిగింది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది.పశ్చిమంలోనూ హవా..హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోపశ్చిమాది ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్ -
రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే!
విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లు ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీ పడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు.. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. – సాక్షి, సిటీబ్యూరోఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్థోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది.సదుపాయాల సంగతేంటి?నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్‌కు మంచి పేరుందా? స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణం ఎలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు.పరిసరాలెలా ఉన్నాయి?ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో ఇలాంటి హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులలో కార్యాలయ విభాగం అగ్రగామిగా ఉంటుంది. అయితే కొంత కాలంగా రీట్స్ ఇన్వెస్ట్మెంట్స్ క్రమంగా రిటైల్ విభాగంలో కూడా వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మాల్స్, సెంటర్లు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్ట్‌లలో రీట్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. నాణ్యమైన రిటైల్ స్పేస్ అందుబాటులోకి వస్తుండటం, కొనుగోలుదారుల వ్యయం పెరగడం, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి, స్థిరమైన ఆదాయ వనరుగా మారడం వంటివి రిటైల్ రంగంలో రీట్స్ పెట్టుబడులకు ప్రధాన కారణాలని అనరాక్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 2030 నాటికి దేశీయ రిట్స్ రూ.2 లక్షల కోట్లకు చేరుతాయని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ఇందులో 30-40 శాతం వాటా రిటైల్ రంగానిదే ఉంటుందని తెలిపింది. 2030 నాటికి రిటైల్ రీట్స్ రూ.60–80 వేల కోట్లుగా ఉంటాయని పేర్కొంది.ఆదాయ వనరుగా..గ్రేడ్–ఏ షాపింగ్ మాల్స్ స్థిరమైన ఆదాయ వనరుగా మారడంతో పెట్టుబడిదారులు రిటైల్ విభాగంలో రీట్స్ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే 3–5 ఏళ్లలో 2–3 రిటైల్ రీట్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఐదు రిటైల్ రీట్స్ నమోదు కాగా.. ఇందులో నెక్సస్ ఒక్కటే రిటైల్ కేంద్రీకృత రీట్స్ కాగా.. మిగిలిన నాలుగు కార్యాలయ కేంద్రీకృత రీట్స్. కొత్త షాపింగ్ మాల్స్‌లో సగానికి పైగా స్థలం రిటైల్ కేంద్రాలే ఉంటున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలలో సంస్థాగత పెట్టుబడులు వస్తుండటంతో రీట్స్ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఫీనిక్స్ మైల్స్, ప్రెస్టిజ్ ఎస్టేట్స్, నెక్సస్ మాల్స్ వంటి ప్రధాన సంస్థలు ఇండోర్, కోయంబత్తూరు, సూరత్, భువనేశ్వర్, చంఢీఘడ్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. -
భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో..
ఒక దేశంలో అధిక ఇళ్లు ఉండి.. కొనుగోలుదారులు లేక సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరో దేశంలో కోట్లాదిమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. చైనాలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు సొంత ఇళ్లు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో మాత్రం 31 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు ఇంకా సొంత గూడు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశ గృహనిర్మాణ రంగాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సవాళ్లకు ఇది అద్ద పడుతుంది. అసలు చైనాలో ఇంత అధిక సంఖ్యలో ప్రజలకు సొంతిల్లు ఉండటానికి కారణాలేమిటి? అదే సమయంలో భారత్‌లో సొంతింటి కల ఎందుకు సాకారం కావడం లేదో కారణాలను పరిశీలిద్దాం.చైనాలో సొంతిల్లు ఉండటానికి కారణాలుగత ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు1998కు ముందు చైనాలో పట్టణ గృహనిర్మాణ రంగం దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1998లో ప్రభుత్వం గృహనిర్మాణ సంస్కరణలను చేపట్టి ప్రజలు ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. అంతకుముందు ఉన్న ఇళ్లను అతి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించారు. దాంతో పెద్దమొత్తంలో సొంతింటి కల నెరవేరింది.సంపద పోగుచేసుకోవడంలో..చైనాలో ప్రజలు సంపదను పోగుచేయడానికి ఇళ్లను అత్యంత సురక్షితమైన, ప్రధాన సాధనంగా భావిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఇతర మార్గాలు పరిమితంగా ఉన్నప్పుడు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక సాంప్రదాయక పద్ధతిగా మారింది. ఇది ఇళ్ల కొనుగోలుకు ఉన్న డిమాండ్‌ను భారీగా పెంచింది.పట్టణీకరణవేగవంతమైన పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు తరలివచ్చారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు భూమిని స్థిరాస్తి డెవలపర్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నాయి. డెవలపర్లు భారీ స్థాయిలో గృహ నిర్మాణాలను చేపట్టారు. కొన్ని సందర్భాల్లో ఇది జనాభా అవసరాల కంటే అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించడానికి దారితీసింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో అధిక గృహ లభ్యత ఏర్పడింది.Breaking🇨🇳90% of people in China now own their own homes.Most Homeless People (2025)🇮🇳 India – 3.1M+🇺🇸 United States – 580K+🇳🇬 Nigeria – 500K+🇷🇺 Russia – 440K+🇵🇭 Philippines – 420K+🇧🇷 Brazil – 390K+🇮🇩 Indonesia – 380K+🇲🇽 Mexico – 320K+🇿🇦 South Africa – 280K+🇫🇷… pic.twitter.com/ZykA0EBKMX— World updates (@itswpceo) October 22, 2025భారత్‌లో ఇలా..స్థిరాస్తి ధరలు అధికం, ఆదాయాలు తక్కువపట్టణ ప్రాంతాల్లో భూమి, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీలు, టైర్-1 నగరాల్లో ఇది ప్రధాన సమస్య.బ్యాంక్ రుణాలు, ఫైనాన్సింగ్ సవాళ్లుగృహ రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ రుణం కోసం అవసరమయ్యే భారీ డౌన్ పేమెంట్‌ను చెల్లించలేని పరిస్థితులున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల వారికి బ్యాంకు రుణాలు పొందడంలో కఠినమైన షరతులు, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం అడ్డంకులుగా మారుతున్నాయి.భూమి కొరత, భూ సేకరణ సమస్యలుపెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లభ్యత లేదు. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గృహనిర్మాణ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.సామాజిక కారణాలుపట్టణ వలస, మురికివాడలుమెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరంతరం నగరాలకు వలస వస్తున్నారు. ఈ వలసలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యత, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మురికివాడలు (స్లమ్స్) ఏర్పడుతున్నాయి. ఈ వర్గాలకు సొంతింటి కల సుదూరంగానే ఉంటోంది.ప్రభుత్వ పథకాల అమలు సవాళ్లుకేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది పథకాల అమలు ఆలస్యం అవ్వడానికి కారణమవుతోంది.మౌలిక వసతుల లేమిప్రభుత్వం నిర్మించే తక్కువ ధర గృహాలు కొన్నిసార్లు నగరాలకు దూరంగా ఉంటున్నాయి. చాలావరకు కనీస మౌలిక వసతులు (రవాణా, నీరు, విద్యుత్) అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.భారత్‌లో సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వాలు తక్కువ ఆదాయ వర్గాలకు తగినంత ఫైనాన్సింగ్ సహాయం అందించాలి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యతను పెంచడం వంటివి చేయాలి. భూమి ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి సమగ్ర విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: 400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా? -
ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్
సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే క్రమంలో చాలా మంది వ్యక్తిగత ఆర్థిక స్థోమతను, భవిష్యత్తు అవసరాలను పక్కన పెడుతున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానంగా లేదంటే సామాజంలో హోదాను పెంచుకోవాలనే ఆరటంలో ఇండిపెండెంట్ ఇంటి (Individual House) కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సరైన ఆర్థిక స్థోమత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. భారీ ఈఎంఐలు, నిర్వహణ ఖర్చులు భరించలేక చివరికి ఆ ఇల్లు ఒక ‘ఖరీదైన అప్పు’గా మారి అభద్రతను మిగులుస్తుంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.1. కొనుగోలు వ్యయం, అప్పుల భారంఅంశంఇండిపెండెంట్ ఇల్లు (ప్లాట్ + నిర్మాణం)అపార్ట్మెంట్ ఫ్లాట్ప్రారంభ వ్యయంసాధారణంగా చాలా ఎక్కువ. స్థలం కొనుగోలు, నిర్మాణ వ్యయం, అనుమతులు, ఇతర ఖర్చులు.ఇండిపెండెంట్ ఇంటి కంటే వ్యయం తక్కువ. నిర్మాణ వ్యయం ఇందులో భాగమవుతుంది.అప్పుల భారంఅధిక వ్యయం కారణంగా గృహ రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇది దశాబ్దాల పాటు ఆర్థిక స్వేచ్ఛను అడ్డుకుంటుంది.తక్కువ వ్యయం కాబట్టి తక్కువ రుణం సరిపోతుంది. EMIలు తక్కువగా ఉంటాయి.నిర్మాణ సమయంసొంతంగా నిర్మాణం చేపట్టాలి కాబట్టి, సమయం, శ్రమ, ఒత్తిడి అధికం.నిర్మాణం పూర్తైన ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే ఒత్తిడి ఉండదు. 2. నిర్వహణ, జీవనశైలి వ్యయంఅంశంఇండిపెండెంట్ ఇల్లుఅపార్ట్మెంట్ ఫ్లాట్నిర్వహణభవనం, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని బాధ్యతలు ఉంటాయి.సాధారణ నిర్వహణ అనేది అపార్ట్మెంట్ అసోసియేషన్ చూసుకుంటుంది. నెలవారీ ఛార్జీ తక్కువగా ఉంటుంది.భద్రతసొంతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి (CCTV, వాచ్మెన్ మొదలైనవి).సామూహిక భద్రత (సెక్యూరిటీ గార్డులు) ఉంటుంది.సౌకర్యాలుసౌకర్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి (బోర్, జనరేటర్ మొదలైనవి).సామూహిక సౌకర్యాలు (జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, జనరేటర్ బ్యాకప్) తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇంటి కొనుగోలు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. అది ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. ఇండిపెండెంట్ ఇల్లు అనేది వ్యక్తిగత గౌరవాన్ని పెంచినా అది ఆర్థికంగా కొన్నిసార్లు భారం అవ్వొచ్చు. ఆర్థికంగా బలహీనపడి సొంత ఇంటికి వాచ్‌మెన్‌గా మారడం కంటే స్థోమతకు తగ్గ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఆర్థికంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించడమే అత్యంత ఆచరణాత్మకమైన నిర్ణయం అనేది కొందరి అభిప్రాయం.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
రాయదుర్గ్‌లో భూముల వేలం.. కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్‌లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.ఈ నేపథ్యంలో రాయదుర్గ్‌లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లే ఔట్లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్‌లోని టీ హబ్‌లో (t-hub) ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్ 4ను గడువుగా నిర్దేశించారు.ఎకరా రూ.200 కోట్లు? రాయదుర్గ్ (Raidurg) పాన్మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్సెట్ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్‌లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్ -
రియల్టీలో బ్లాక్‌మనీ చక్కర్లు.. ఎలాగంటే..
రియల్ ఎస్టేట్ రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం దశాబ్దాలుగా నల్లధనం (Black Money) లేదా లెక్కల్లో చూపని ధనం ప్రవాహానికి ప్రధాన వేదికగా మారిందనే వాదనలున్నాయి. ఇక్కడ జరిగే కొనుగోళ్లు, అమ్మకాలు, పెట్టుబడుల్లో గణనీయమైన భాగం నగదు రూపంలోనే జరుగుతుండటం దీనికి ముఖ్య కారణం. డిజిటలైజేషన్ అని చెప్పుకుంటున్న, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు వచ్చినా ఈ విభాగంలో ఇప్పటికీ చాలా వరకు నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతున్నాయనేది వాస్తవం. రియల్టీ రంగంలో నల్లధనం ఎలా ప్రవహిస్తుంది, అందుకు గల కారణాలు, దాని ప్రభావాలను విశ్లేషిద్దాం.నల్లధనం ప్రవాహం ఎలా జరుగుతుంది?సాధారణంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు రెండు రకాలుగా విభజిస్తారు. అధికారిక లావాదేవీలు.. ఇది బ్యాంక్ ద్వారా చెక్, ఆన్లైన్ బదిలీ (RTGS/NEFT) రూపంలో చెల్లిస్తారు. ఈ మొత్తం ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయబడి, దీనిపై కొనుగోలుదారు, విక్రేత పన్నులు చెల్లిస్తారు. డాక్యుమెంట్లలో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపించే ధర ఇదే.నగదు లావాదేవీఇది అధికారిక పత్రాల్లో చూపకుండా కొనుగోలుదారు నేరుగా విక్రేతకు నగదు రూపంలో ఇచ్చే మొత్తం. ఈ లావాదేవీ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు లేదా ప్రభుత్వానికి తెలియజేయరు. మార్కెట్ ధర, డాక్యుమెంట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఈ నల్లధనం.ప్రవాహ విధానంకొనుగోలు దశ: ఒక కొనుగోలుదారు తాను దాచుకున్న నల్లధనాన్ని ఉపయోగించి ఒక ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆస్తి యజమానికి డాక్యుమెంట్లో ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తాన్ని (అదనపు నగదు) చెల్లిస్తారు. ఈ అదనపు మొత్తం కొనుగోలుదారు నల్లధనంగా ఉంటుంది. ఇదే తర్వాత కాలంలో ఆస్తి యజమానికి సైతం నల్లధనంగా మారుతుంది.అమ్మకం దశ: కొనుగోలుదారు ఆస్తిని అమ్మే సమయానికి ఆ ఆస్తి విలువ పెరిగి ఉంటుంది. అప్పుడు అతను కొత్త కొనుగోలుదారు నుంచి మార్కెట్ విలువ ప్రకారం ధరను తీసుకుంటాడు. ఇందులో కొంత భాగం అధికారికంగా లెక్క చూపినా పెరిగిన విలువలో ఎక్కువ భాగం నగదు రూపంలో (నల్లధనం) తీసుకునేందుకు మొగ్గు చూపుతాడు. ఆస్తి అమ్మే సమయానికి పన్ను ఎగవేత కోసం ఇది నల్లధనంగా మారుతుంది.నిర్మాణం/డెవలప్మెంట్: రియల్ ఎస్టేట్ డెవలపర్లు భూమి కొనుగోలు, నిర్మాణ సామగ్రి, కార్మికుల వేతనాలు వంటి వాటిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇది వారికి లెక్కల్లో చూపని ఆదాయం (నల్లధనం) సృష్టించడానికి అవకాశం ఇస్తుంది.ప్రధాన కారణాలుఅధిక స్టాంప్ డ్యూటీ, పన్నులుఆస్తుల రిజిస్ట్రేషన్, అమ్మకాలపై ప్రభుత్వాలు విధించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) చాలా ఎక్కువగా ఉండటం. ఈ అధిక పన్నులను తప్పించుకోవడానికి కొనుగోలుదారులు, విక్రేతలు ఇద్దరూ డాక్యుమెంట్లలో ఆస్తి విలువను తక్కువగా చూపించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో లావాదేవీ చేస్తారు.ధరల్లో వ్యత్యాసంప్రభుత్వం నిర్ణయించిన సర్కిల్ రేటు కంటే మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం. విక్రేత మార్కెట్ ధరను డిమాండ్ చేసినప్పుడు కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీని ఆదా చేసుకోవడానికి సర్కిల్ రేటుకు మాత్రమే డాక్యుమెంట్ చేయించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తాడు.దాచుకునే అవకాశంనల్లధనం (లెక్కల్లో చూపని ఆదాయం) ఉన్న వ్యక్తులకు ఆ డబ్బును సులభంగా, సురక్షితంగా దాచుకోవడానికి రియల్ ఎస్టేట్ ఒక ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. నల్లధనాన్ని ఆస్తి రూపంలోకి మార్చడం ద్వారా వారు దానిపై వడ్డీ లేదా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటారు.రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత లేకపోవడం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వంటి వ్యవస్థలు ఉన్నా పాత లేదా వ్యక్తిగత ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో నగదు ప్రవాహాన్ని నియంత్రించే యంత్రాంగం బలహీనంగా ఉందనే వాదనలున్నాయి. రియల్ ఎస్టేట్‌లో తరచుగా ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ లాభాలపై పన్నులు కట్టకుండా ఉండటానికి విక్రేతలు నగదు రూపంలో అమ్మకాలు జరపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.పరిణామాలు ఇలా..రియల్ ఎస్టేట్‌లో నల్లధనం ప్రవాహం అనేక ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీస్తుంది. నల్లధనం వల్ల వాస్తవ మార్కెట్ ధర కృత్రిమంగా పెరుగుతుంది. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం కష్టమవుతుంది. పన్ను ఎగవేత కారణంగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మూలధన లాభాల పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. నల్లధనం ప్రవాహం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ రంగంలోని అధికారులకు లంచాలు ఇచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి అవినీతి కార్యకలాపాలకు ఇది ఆజ్యం పోస్తుంది.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
తేలికగా, దృఢంగా, వేగంగా, ఖర్చు తక్కువగా..
ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే నిరంతరం పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు సామాన్యులకు ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతులు, ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, కొత్త సాంకేతికతలపై సమగ్ర అవగాహన అవసరం.సంప్రదాయ విధానంభారతదేశంలో ఇళ్లు కట్టడానికి శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు ప్రధానంగా స్థానికంగా లభించే వస్తువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాల్చిన ఎర్ర ఇటుకలు, సిమెంటు, ఇసుక మిశ్రమంతో (మోర్టార్) గోడలను నిర్మించడం.. దీనిపై కాంక్రీటు (RCC) స్లాబ్‌తో పైకప్పు వేయడం సాధారణంగా వస్తున్న ఆనవాయితి. ఇది దృఢమైన, మన్నికైన పద్ధతి. ఇటుక గోడలు ఉష్ణ బంధకాన్ని (Thermal Insulation) అందించి వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. అయితే దీని నిర్మాణం శ్రమతో కూడుకుంది. సమయం ఎక్కువ పడుతుంది. పునాది ఖర్చు ఎక్కువ. ఇటుకల తయారీ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గడ్డి, వెదురు, కలప, రాళ్లను ఉపయోగించి ఇళ్లను నిర్మించేవారు. కచ్చా ఇళ్లుగా పిలిచే ఈ విధానంలో ‘కాబ్’ (మట్టి, గడ్డి మిశ్రమం), ‘అడోబ్’(ఎండబెట్టిన మట్టి ఇటుకలు) వంటి పద్ధతులను వాడేవారు. వీటికి ఖర్చు తక్కువ. వీటి వల్ల పర్యావరణహితం, ఉష్ణ నియంత్రణ (Thermal Regulation) ఉంటుంది. అయితే వీటి మన్నిక తక్కువ. తరచుగా మరమ్మత్తులు అవసరం. భారీ వర్షాలకు అంతగా నిలబడవు.రాతి నిర్మాణంస్థానికంగా లభించే రాళ్లను సున్నం లేదా మట్టి మోర్టార్తో కలిపి గోడలు కట్టేవారు. ఇవి దృఢమైనవి. దీర్ఘకాల మన్నిక, సహజ ఉష్ణ బంధక సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ సమయం పడుతుంది.ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే పద్ధతులునిర్మాణ సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఖర్చును తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.ప్రిఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ నిర్మాణంగోడలు, పైకప్పు స్లాబులు, కిటికీలు వంటి భవన భాగాలను ఫ్యాక్టరీలో ముందుగా తయారు చేయించి ఆపై నిర్మాణ స్థలంలో వాటిని నేరుగా బిగించవచ్చు. దీంతో నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శ్రమ తక్కువ. నాణ్యతలో స్థిరత్వం ఉంటుంది. వ్యర్థాలు తగ్గుతాయి.ఇన్సులేటెడ్ కాంక్రీట్ ఫారమ్లుఇది థర్మాకోల్ లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్‌తో చేసిన బోలు బ్లాకులను ఉపయోగించి గోడలను నిర్మించే విధానం. ఈ బోలు బ్లాకుల మధ్య తర్వాత కాంక్రీటు పోస్తారు. దీని వల్ల గోడలకు అధిక ఇన్సులేషన్ (ఉష్ణ బంధకం) లభిస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ సులభమై ఎయిర్ కండీషనర్ల వినియోగం, తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.స్టీల్ ఫ్రేమ్ నిర్మాణంస్టీల్ కాలమ్స్, బీమ్‌లను ఉపయోగించి భవనానికి ప్రధాన ఫ్రేమ్‌ను నిర్మించే విధానం. ఈ నిర్మాణం తేలికగా, దృఢంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకోగలదు. నిర్మాణ సమయం తక్కువ.ఫ్లై యాష్ ఆధారిత ఇటుకలు/ బ్లాకులుథర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం (ఫ్లై యాష్), ఇతర బైండర్లను ఉపయోగించి ఇటుకలు, బ్లాక్‌లను తయారు చేసే విధానం. ఉదాహరణకు ఏఏసీ బ్లాక్‌లు. ఇవి సాంప్రదాయ ఇటుకల కంటే తేలికైనవి. మెరుగైన ఉష్ణ బంధకాన్ని అందిస్తాయి. సిమెంట్ వినియోగాన్ని తగ్గిస్తాయి. పర్యావరణహితమైనవి.ఇంటి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా నిర్మాణ ప్రణాళిక, డిజైన్, సాంకేతికతలో మార్పులు తీసుకురావడం ముఖ్యం. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లోని మన్నికను, స్థానిక వస్తువుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రిఫ్యాబ్రికేషన్, ఏఏసీ బ్లాక్‌లు, సమర్థవంతమైన డిజైన్ వంటి ఆధునిక, తక్కువ ఖర్చు పద్ధతులను అనుసరించడం ద్వారా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఇల్లు కొనాలంటే.. చుట్టుపక్కల ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణలోకి తీసుకున్నారు. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు.అత్యవసరంలో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు? ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట.పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.వీకెండ్ ఎంజాయ్..వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్..
విలాసవంతమైన గృహాలే కానీ, అందుబాటు ధరల్లో..! ఇదీ ఇప్పుడు హైదరాబాద్ నగర రియల్టీ మార్కెట్లో కొత్త ట్రెండ్. ఆడంబరాల కంటే గృహ కొనుగోలుదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దడమే ఈ అఫర్డబుల్ లగ్జరీ యూనిట్ల ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ నిర్మాణ, నిర్వహణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటూ.. ధరలు అందుబాటు ఉండేలా చేసే అధిక సాంద్రత ప్రాజెక్ట్‌లతో ఇది సాధ్యమేనంటున్నారు రియల్టీ పరిశ్రమ నిపుణులు. - సాక్షి, సిటీబ్యూరోదేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనాకు ముందు, తర్వాత అని విభజించక తప్పదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి కాలంలో ఇంటి అవసరం తెలిసొచి్చంది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు రకరకాల కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంట్లో ప్రత్యేకంగా గది, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేక స్థలం అవసరమైంది. దీంతో క్రమంగా నాలుగు గోడల చౌక గృహాలకు బదులుగా విశాలమైన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది.ప్రాంతం, వసతులు, నాణ్యత, గడువు కంటే ఇప్పటికీ గృహ కొనుగోళ్లలో కస్టమర్ల తొలి ప్రాధాన్యత ధరకే.. అందుకే ధరను బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ గృహాలు, స్థోమత మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తుండటంతో నగరంలో సరసమైన లగ్జరీ హౌసింగ్ భావన ఊపందుకుంది. అఫర్డబుల్ లగ్జరీ గృహ విభాగం ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. డెవలపర్లు గృహ కొనుగోలుదారుల సంపూర్ణ అవసరాలను పరిగణలోకి తీసుకోవడమే. ప్రాజెక్ట్‌ను హైప్ చేయడానికి ఫ్యాన్సీ ఆడంబరాలు, అలంకరణలను జోడించడానికి బదులుగా ఖర్చులను ఆదా చేస్తూ కస్టమర్లకు అవసరమైన వసతులు, సౌకర్యాలను అందించడానికి ప్రయతి్నస్తారు.యువ కస్టమర్ల ఆసక్తి..ఈ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా యువ కస్టమర్ల నుంచే ఆదరణ ఎక్కువగా ఉంది. మీలినియల్స్, అధిక సంపాదన ఆర్జించే జెన్–జెడ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వంటి కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్ నగరాలలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ తరహా గృహ కొనుగోలుదారులు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ధర, ఎక్కువ వసతులు ఉండే నివాస సముదాయాలను కోరుకుంటున్నారు.అధిక అద్దెలు కూడా కారణమే..గృహాల అద్దెలు పెరగడం కూడా విలాసవంతమైన ఇళ్ల డిమాండ్‌కు కారణమే. ఐటీ హబ్ నగరాలలో ఏటా అద్దెలు 9–15 శాతం మేర పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులపై అధిక రాబడి ఆర్జిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు సరసమైన లగ్జరీ ప్రాపర్టీలను ఆర్థికంగా చురుకైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా పరిగణిస్తున్నారు. అద్దె ఆదాయంతో నెలవారీ వాయిదా(ఈఎంఐ) చెల్లింపులతో భర్తీ చేయాలని భావిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.అత్యాధునిక నిర్మాణ పద్ధతులుభూముల ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రాంతాలలో అధిక సాంద్రత కలిగిన ప్రాజెక్ట్‌లను నిర్మించడం ఒక కీలకమైన వ్యూహం. అలాగే డెవలపర్లు ఖర్చులను తగ్గించడానికి అత్యాధునిక నిర్మాణ పద్ధతులు, స్మార్ట్ డిజైన్లను అవలంభిస్తున్నారు. సాంకేతికత వినియోగంతో దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలనునియంత్రిస్తున్నారు. దీంతో నివాస సముదాయాలు పర్యావరణహితంగానే కాకుండా బడ్జెట్ అనుకూలంగా మారుస్తుంది. వ్యవస్థీకృతమైన ఆప్టిమైజ్ లే–అవుట్లతో సమర్థవంతమైన యూనిట్ పరిణామాలను అందించడంతో తక్కువ ధరకే లగ్జరీ వసతులను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.లగ్జరీ ఫీలింగ్..డెవలపర్లు కార్పెట్ ప్రాంతాన్ని పెంచడానికి స్మార్ట్ డిజైన్ లేఅవుట్లను ఎంపిక చేస్తారు. కాంక్రీట్‌ను సాధ్యమైనంత తక్కువ ఉపయోగించడంతో పాటు విశాలమైన, విలాసవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద సైజు కిటికీలు, తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన సీలింగ్‌తో ప్రవేశ ద్వారాన్ని సెవెన్ స్టార్ హోటల్ మాదిరి గా లగ్జరీ ఆంబియెన్స్ను కల్పిస్తున్నారు. వేగవంతమైన డెలివరీ, నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు మాడ్యులర్ నిర్మాణ పద్ధతులను అమలు చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, వెల్నెస్ ఫీచర్లు, స్థిరమైన పద్ధతులతో నివాస సముదాయాల విలువలను పెంచుతున్నారు.నిర్మాణ, నిర్వహణ వ్యయాలు..డెవలపర్లు ఉపయోగిస్తున్న మరో విధానం స్థిరత్వం. ఈ తరహా నిర్మాణాలు ఖర్చు, సమర్థవంతమైన ముందస్తు వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండేలా చేస్తుంది. ఈ నిర్మాణాలను తక్కువ ఆర్థిక భారం, పన్ను ప్రయోజనాలతో నిర్మించడంలో సహాయపడుతుంది. స్థిరమైన పద్ధతులను అవలంభించడం వల్ల దీర్ఘకాలిక కార్యాచరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే పర్యావరణ స్పృహ ఉన్న కస్టమర్లను ఆకర్షిస్తాయి. పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామగ్రి, శక్తి సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వాడకం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది.వెల్నెస్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యంకరోనా తర్వాత నుంచి ప్రజల్లో ఆరోగ్యం, పర్యావరణ స్పృహపై అవగాహన పెరిగింది. దీంతో సస్టెనబులిటీ, గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చే నివాసాల కొనుగోళ్లు, పెట్టుబడులకు కీలక అంశంగా మారింది. అఫర్డబుల్ లగ్జరీ ఇళ్లకు యువ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మిలీనియల్స్, జెన్–జెడ్ గృహ కొనుగోలుదారులు బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాపరీ్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెల్నెస్, ఫిట్నెస్ సౌకర్యాలు, సోషలైజింగ్ కోసం కమ్యూనిల్ ప్రాంతాలు, బహుళ ఈ–కామర్స్ డెలివరీలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు వంటి అనుకూలమైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ లైటింగ్ ఏర్పాట్లు, అధునాతన భద్రత వ్యవస్థ, తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు ప్రామాణికంగా మారుతున్నాయి.బయోఫిలిక్ డిజైన్లు..బయోఫిలిక్ డిజైన్ అనేది నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో పెరుగుతున్న ధోరణి. సమృద్ధిగా సహజ కాంతి, ఇండోర్ మొక్కలు, కమ్యూనిటీ గార్డెన్లు వంటి వివిధ అంశాల ద్వారా పచ్చని, ప్రకృతిని సృష్టించడం. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన పరిస్థితులు. స్థానిక జంతుజాలం, పచ్చని ప్రదేశాలు, స్థానిక మొక్కలతో మార్గాలను ఏకీకృతం చేస్తాయి. కలప, రాయి, టెర్రకోట వంటి సహజ పదార్థాలను ఫ్లోరింగ్, అలంకరణలో ఉపయోగిస్తారు. అలాగే ఆకుపచ్చ, నీలం, మట్టి రంగుల పాలెట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చిన్న ఇండోర్ ఫౌంటేన్లు, టేబుల్ టాప్ వాటర్ ఫౌంటేన్ల వంటివి ఏర్పాటు చేస్తారు. పెద్ద కిటికీలతో సహజ కాంతికి ప్రాధాన్యత ఇస్తారు. గాలి నాణ్యత, నివాసితుల మానసిక స్థితిని మెరుగుపర్చడానికి గాలి వీచేందుకు ప్రోత్సహిస్తారు.యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలను వాడతారు. ఈ తరహా ప్రాజెక్ట్‌ల కొనుగోలుదారులు మృదువైన ఫినిషింగ్, ఆధునిక డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే లగ్జరీ, సౌందర్యంపై ఏమాత్రం రాజీపడరు. కొనుగోలుదారుల కార్యచరణ ఖర్చులను తగ్గించే శక్తి సామర్థ్యం, స్థిరమైన లక్షణాలు ఉండే పర్యావరణ అనుకూల ఎంపికలను కోరుకుంటారు. ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ప్రాంతం, కనెక్టివిటీకి కూడా ముఖ్యమే. హైవేలు, మెట్రో లైన్లతో మంచి కనెక్టివిటీలతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలకు నివాసితులకు కోరుకుంటున్నారు. -
ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే..
ఇంధన వనరుల ధరలు రోజుకు ఒకలా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోజిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగం (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయిస్తాయని అంచనా.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి కనుక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా..ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవిన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవడమే అసలైన సవాలు.ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా అవసరాల కోసం బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరున్న డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 819మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 967 బిలియన్ డాలర్లతో పోలిస్తే 15 శాతం తగ్గాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అనుబంధ సంస్థ అనరాక్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2025–26 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పీఈ పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వచి్చన మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో విదేశీ పెట్టుబడుల వాటా 73 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో కాస్త ఆశావహ ధోరమి కనిపించినప్పటికీ అది కొన్నాళ్ల ముచ్చటే అయిందని, రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు నెమ్మదించాయని అనరాక్ క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. పూర్తి సంవత్సరం ప్రాతిపదికన చూస్తే పీఈ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 6.4 బిలియన్ డాలర్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాల జోరు.. రెసిడెన్షియల్ విభాగంలో రియల్ ఎస్టేట్ అమ్మకాల పరిమాణం భారీగా ఉందని, దీంతో డెవలపర్లకు నగదు ప్రవాహం గణనీయంగా మెరుగుపడిందని అగర్వాల్ తెలిపారు. దీనితో వారు ఖరీదైన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)పై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా పుష్కలంగా నిధులు ఉండటంతో, గతానికి భిన్నంగా, అవి రియల్టికి రుణాలిచ్చేందుకు మరింత సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. అటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ విషయం తీసుకుంటే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం చాలా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు. దీనితో ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా ఇతరత్రా స్థూల ఆర్థిక అనిశ్చితి కూడా పెరుగుతోందని వివరించారు. ‘అందుకే విదేశీ పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించంది. భారత్ గణనీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గానే కాకుండా పెట్టుబడులు వృద్ధి చెందేందుకు ఆస్కారమున్న అతి తక్కువ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది కాబట్టి ఇది తాత్కాలిక ధోరణే కావొచ్చు. అనిశ్చితులు తొలగిపోయి, స్పష్టత వచి్చందంటే చాలు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి పీఈ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయి‘ అని అగర్వాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగంలోకి పీఈ పెట్టుబడులు అసలు రాలేదు. రిటైల్, మిక్సిడ్–యూజ్, కమర్షియల్ అసెట్స్ విభాగంలో గణనీయంగా వచ్చాయి. హోటల్స్, డేటా సెంటర్లలోకి కూడా పెట్టుబడులు మెరుగ్గానే వచి్చనట్లు అనరాక్ క్యాపిటల్ తెలిపింది.జోరుగా ఈక్విటీ పెట్టుబడులుసెపె్టంబర్ త్రైమాసికంలో 3.8 బిలియన్ డాలర్లున్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడుల రాక సెపె్టంబర్ త్రైమాసికంలో బలంగా నమోదైంది. 48 శాతం అధికంగా 3.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చినట్టు సీబీఆర్ఈ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ పెట్టుబడుల రాక 2.6 బిలియన్ డాలర్లుగానే ఉంది. ప్రధానంగా భూ సమీకరణ, అభివృద్ధి, ఆఫీస్/రిటైల్ ఆస్తుల నిర్మాణంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 14 శాతం ఎగసి 10.2 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 8.9 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. 2024 సంవత్సరం మొత్తం మీద వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 11.4 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘వేగవంతమైన వృద్ధి దశలోకి రియట్ ఎసేŠట్ట్ రంగం అడుగుపెట్టింది. ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన విశ్వాసం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. రానున్న త్రైమాసికాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల అభివృద్ధికి బలమైన డిమాండ్ ఉంటుంది. ఇళ్లు, ఆఫీస్, మిశ్రమ వినియోగ వసతులు, డేటా సెంటర్లు, పారిశ్రామిక, రవాణా వసతుల వ్యాప్తంగా సమతూకం ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. పెట్టుబడుల్లో మరింత వైవిధ్యం ఉన్నట్టు, నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లోకి పెట్టుబడులు వస్తున్నట్టు సీబీఆర్ఈ ఎండీ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. -
వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేటే..
‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్ సర్వీసెస్ జీఎస్డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉంది’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని ప్రసంగించారు.‘హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యింది. ఇవి కేవలం గణాంకాలు కాదు... రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలు’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం’ అని చెప్పారు. ‘భారత్ లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే... అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా... చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే. ఇది మరింత పెరగాల్సిన అవసరముంది’ అని అభిప్రాయపడ్డారు.‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ – 2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నాం. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం’ అని వివరించారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా.లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ వసతులకు డిమాండ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.9 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైంది. ఈ ఏ డాది మొదటి తొమ్మిది నెలల్లో లీజింగ్ 8.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్-8 పట్టణాల్లో సెపె్టంబర్ క్వార్టర్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే 6% తగ్గి 17.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ నగరాల్లో స్థూల లీజింగ్ మాత్రం 24 శాతం పెరిగి 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరిందని, పూర్తి ఏడాదికి రికా ర్డు స్థాయిలో 85 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా..బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్లో 21 శాతం క్షీణించి 4.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.చెన్నై మార్కెట్లో ఆఫీసు వసతుల లీజింగ్ 9% పెరిగి 2.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం తగ్గి 2.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.పుణెలో 9 శాతం తగ్గి 2.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి ఆఫీస్ లీజింగ్ పరిమితమైంది.ముంబైలో సెప్టెంబర్ క్వార్టర్లో లీజింగ్ 27 శాతం తగ్గి 1.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. తొమ్మిది నెలల కాలంలో చూసినా 12 శాతం తగ్గి 7.4 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.కోల్‌కతాలో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్లో 190 శాతం పెరిగి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.అహ్మదాబాద్ మార్కెట్లో 13 శాతం పెరిగి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.ఇదీ చదవండి: ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు! -
ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు!
ఇప్పటివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎలా ఎంపిక చేసుకోవాలి?, ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?, ఇంటి నిర్మాణం కోసం కావలసిన మెటీరియల్స్ వంటి వివరాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్ని రంగాల్లోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరెలా ఉపయోగించుకోగలుతున్నారు? అనేదే ప్రశ్న. సరిగ్గా ఉపయోగించుకుంటే.. సమయాన్ని, ఖర్చుకు కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ విషయానికి వస్తే..ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీసాధారణంగా ఒకప్పటి నుంచి వస్తున్న పద్దతిలో ఇల్లు కట్టాలంటే.. గోడలు కట్టి నిర్మాణం చేయాల్సిందే. అయితే ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా గోడలను లేదా ఇంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారుచేసి.. మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. ఈ విధానం ద్వారా వేస్ట్, డస్ట్ పొల్యూషన్ వంటివి చాలా వరకు తగ్గుతాయి.3డీ ప్రింటింగ్ టెక్నాలజీఈ పేరును చాలామంది వినే ఉంటారు. అయితే దీనిని ఇంటి నిర్మాణంలో కూడా ఉపయోగించుకోవచ్చనే విషయం బహుశా కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది. కంప్యూటర్లో డిజైన్ చేసి.. ఇంటి నమూనాను, కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేసి నిర్మించడానికి ఈ 3డీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కేవలం గంటల వ్యవధిలోనే మీరు ఇంటిని ధృఢంగా నిర్మించుకోవచ్చు. కార్మిక ఖర్చు తగ్గడమే కాకుండా.. మెటీరియల్ కూడా పెద్దగా వృధా అయ్యే అవకాశం లేదు.కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది.. ఇంటి నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఖర్చు తగ్గించుకోవడం, మెటీరియల్ మేనేజ్మెంట్, సైట్ మానిటరింగ్ కోసం ఉపయోగించే డిజిటల్ టూల్స్. ఇల్లు కట్టుకోక ముందే.. కట్టుకోబోయే ఇల్లు ఎలా ఉంటుందో దీని ద్వారా చూడవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో ముందుగానే బడ్జెట్ అంచనా వేయవచ్చు.గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీగ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ద్వారా.. పర్యావరణానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేయవచ్చు. ప్రకృతి వనరులను సంరక్షించుకుంటూ.. సోలార్ పానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి నిర్మించుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు నిర్మించుకునే ఇంటిలోకి సహజంగా కాంతి, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ టెక్నాలజీ ఉపయోగించి కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించుకోవచ్చు.ఏఐ & స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ఈ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ చాలా అవసరం, అందరూ ఇష్టపడతారు కారు. ఇంట్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్, టీవీ, ఏసీ, డోర్ లాక్స్, సీసీటీవీ కెమరాలు అన్ని కూడా ఏఐ ఆధారంగా.. ఆటోమేటెడ్‌గా పనిచేసేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఇంట్లో లేకపోయినా, అవసరం అనుకుంటే, లైట్స్ ఆన్ చేయడం.. లేదా ఆఫ్ చేయడం, డోర్ బెల్స్ మోగినప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారో ముందుగానే చూడటానికి ఏఐ ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్ -
హైదరాబాద్‌లో పెరుగుతున్న కొత్త షాపింగ్ మాల్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వస్తువులు, సేవలను విక్రయించే వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) పెరుగుతోంది. దీంతో నగరంలో తలసరి రిటైల్ స్పేస్ 3.6 లక్షల చ.అ.లకు చేరింది. ప్రస్తుతం భాగ్యనగరంలో గ్రేడ్–ఏ, బీ షాపింగ్ మాల్స్ స్టాక్ 35.1 లక్షల చ.అ.లుగా ఉండగా.. ఇందులో వేకెన్సీ 1.85 శాతంగా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ∙నగరంలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 5.1 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 9.3 శాతం ఎక్కువ. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నగరంలో 20.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా పరిమితంగా కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ లీజులు హైస్ట్రీట్ ప్రాంతాలలో జరిగాయి.మొత్తం లీజులలో 42 శాతం కొంపల్లి, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి సబర్బన్ కారిడార్లలో జరిగాయి. బంజారాహిల్స్, పంజగుట్ట, హిమాయత్‌నగర్ వంటి కోర్ సిటీలో 32 శాతం, సుచిత్ర, బోడుప్పల్ వంటి శివార్లలో 26 శాతం లీజులు జరిగాయి. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్, యాక్ససరీస్ కేటగిరీల్లో రిటైల్ స్పేస్ లీజులు అధికంగా జరిగాయి. లైఫ్ స్టయిల్ విభాగం 16 శాతం, ఫరీ్నచర్ 10 శాతం, హెల్త్ కేటగిరీలో 10 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం లీజుల్లో దేశీయ బ్రాండ్లు 88 శాతం, అంతర్జాతీయ బ్రాండ్లు 12 శాతం వాటాలున్నాయి.కొత్త మాల్స్.. ప్రస్తుతం నగరంలో 28 లక్షల చ.అ. కొత్త షాపింగ్ మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నాల్గో త్రైమాసికం నాటికి 17 లక్షల చ.అ. గ్రేడ్–ఏ మాల్స్ స్థలం డెలివరీ అవుతుంది. కొంపల్లి, శంషాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో నివాసితులు వినోద అవసరాలను తీర్చేందుకు ఈ మాల్స్, రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొంపల్లి, ఎంజీ రోడ్, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, మాదాపూర్, నల్లగండ్ల, హబ్సిగూడ, కోకాపేట, మణికొండ వంటి ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దె నెలకు చ.అ.కు రూ.135–250 వరకు ఉన్నాయి. -
రీసేల్ ప్రాపర్టీ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించాల్సిందే. అదే ఐటీ హబ్ పరిసరాలు, సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే మాత్రం కనీసం రూ.కోటిన్నరకు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇక గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం ప్రాజెక్ట్‌లలో అయితే కోట్లు ఖర్చు చేయాల్సిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి వారికి హైదరాబాద్‌లో సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఇటువంటి సమయంలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుపై దృష్టిసారించారు. అందులోనూ పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.సెకండ్ సేల్స్ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని రియల్టీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెకండ్ సేల్స్ ఫ్లాట్స్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.మార్కెట్ రేటు కనుక్కోండి..రీసేల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే ప్రాంతంలో అసలు ఆ ప్రాంతంలో చ.అ. ధరలు ఎంత ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే మీరు ఆ ప్రాంతంలోని ధరను బట్టి బేరం ఆడుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్రాండ్ న్యూ ఫ్లాట్ ధరతో పోలిస్తే పాత అపార్ట్మెట్లలోని ఫ్లాట్ ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. చ.అ.కు ప్రాంతాన్ని బట్టి కనీసం 20-40 శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఫ్లాట్స్ ధరలను తెలుసుకుని బేరమాడి తక్కువ ధరకు ఫ్లాట్ కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.డాక్యుమెంట్లను పరిశీలించాలిపాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు సమయంలో డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. అవసరమైన న్యాయ నిపుణులను సంప్రదించాలి. యాజమాన్య హక్కులు, ప్రభుత్వ రంగ ఏజెన్సీల అనుమతులు, బ్యాంక్ రుణాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా బ్యాంక్‌లలో ఫ్లాట్‌లో ఎంత రుణం నేరుగా సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి కనుక్కోవాలి. కొనుగోలుకు ముందే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కమ్యూనిటీ నిబంధనలు తెలుసుకోవడం వల్ల నివాసిత సంఘంతో చిక్కులు లేకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్రోకర్లపై ఆధారపడొద్దు..ఫ్లాట్ కొనుగోలు కోసం బ్రోకర్లపై ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా ఫ్లాట్ ఓనర్‌తో మాట్లాడుకొని డీల్ కుదుర్చుకుంటే ధర తగ్గే అవకాశం ఉంటుంది. -
ఇలాంటి ఇళ్ల కొనుగోలుకు కస్టమర్ల ఆసక్తి!
సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన వాటికే ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను 7.8 శాతం వద్ద అధిగమించింది. స్థిరమైన దేశీయ పెట్టుబడులు, జీఎస్టీ సవరణలు, వడ్డీ రేట్ల తగ్గింపులతో దేశంలో స్థిరాస్తి విక్రయాలు ఆశాజనంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (జులై–సెప్టెంబర్, క్యూ3)లో ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు సేల్ కాగా.. 88,655 యూనిట్లు లాంచ్ అయినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.పెరుగుతున్న ఇన్వెంటరీ..2025 క్యూ3లో 87,603 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. పుణె మినహా అన్ని నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా 24,706 యూనిట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ అమ్ముడుపోని ఇన్వెంటరీ 2020 నుంచి స్థిరంగా పెరుగుతూనే ఉంది. విక్రయాల కంటే సరఫరా మించిపోతున్నాయి. ఈ ఏడాది క్యూ3 నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ 5,06429 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. వీటిల్లో అత్యధికంగా రూ.50 లక్షలలోపు ధర ఉన్న ఇళ్లు 1,8,0616 ఉన్నాయి. హైదరాబాద్‌లో..హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 9,601 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. అలాగే ఈ క్యూ3లో 9,764 యూనిట్లు లాంచ్ అయ్యాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. నగరంలో ఏడాదితో ఇళ్ల ధరలు 13 శాతం మేర పెరిగాయి.ఆఫీసు అధరహో..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే మాత్రం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్లు లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్లను కలిగి ఉన్నాయి.బ్యాక్ ఆఫీసు టు జీసీసీ..ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతిభ, నైపుణ్యం కలిగిన కారి్మకులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. 2025 క్యూ3లో లీజుకు తీసుకున్న వ్యాల్యూమ్‌లో గ్రేడ్–ఏ ఆఫీసు లావాదేవీలు 88 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) విస్తరణ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం. ఈ క్యూ3లో జీసీసీలు 57 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకోగా. ఆ తర్వాత థర్డ్ పారీ్ట/ఐటీ సరీ్వస్ ప్రొవైడర్లు 32 లక్షల చ.అ., ఫ్లెక్సిబుల్ ఆఫీసు స్పేస్ 38 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.100 కోట్ల చ.అ. స్టాక్..ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ స్టాక్ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఈ క్యూ3లో 1.24 కోట్ల చ.అ. కార్యాలయ స్థలం పూర్తయ్యింది. ఈ త్రైమాసికంలో డెలివరీ అయిన కార్యాలయ స్థలంలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరంలో 59 లక్షల చ.అ. స్థలంతో 48 శాతం వాటాను కలిగి ఉంది. అత్యధికంగా కోల్‌కతాలో 14 శాతం, ముంబైలో 11 శాతం, ఎన్సీఆర్(న్యూఢిల్లీ)లో 9 శాతం, బెంగళూరులో 6 శాతం మేర ఆఫీసు స్పేస్ అద్దెలు పెరిగాయి.ఇదీ చదవండి: నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్నగరంలో.. హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 29 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. అయితే 2025 క్యూ2లో 19 లక్షల చ.అ., క్యూ1లో 40 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో ఈ క్యూ3లో 16 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ డెలివరీ అయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 61 శాతం ఎక్కువ. నగరంలో ఈ క్యూ3లో ఆఫీసు స్పేస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. -
ఎకరం భూమి రూ.177 కోట్లు!: పాన్ ఇండియా రియల్టీగా హైదరాబాద్
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశంలోకి దూసుకుపోయాయి. కోకాపేట, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం రూ.42.59 కోట్లకు గౌరా వెంచర్స్ దక్కించుకోగా.. తాజాగా నాలెడ్జ్ సిటీలో ఎంఎస్ఎన్ సంస్థ ఏకంగా రూ.177 కోట్లు వెచ్చించింది. కేవలం 8 ఏళ్లలో రాయదుర్గంలో భూముల ధరలు 320 శాతం మేర పెరిగాయి. ఇది కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు ఇది అభివృద్ధికి సంకేతం. నగర మౌలిక సదుపాయాలు, వాణిజ్య సాంద్రత, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై సంస్థాగత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. – సాక్షి, సిటీబ్యూరోపాన్ ఇండియా మూవీ లాగే..బాహుబలి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఎలాగైతే పాన్ ఇండియా స్థాయి మొదలైందో.. అలాగే గత ప్రభుత్వ హయాంలో కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100 కోట్లు పలకడంతో మొదలైంది. అగ్రశ్రేణి జాతీయ డెవలపర్లు నగరంలో భూములను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు ముంబై, బెంగళూరు కంటే మెరుగ్గా ఉన్నాయి. రాయదుర్గం వేలంతో మన నగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోటీ పడటం దాటి ముందుకు దూసుకుపోతుందనే సంకేతాన్ని అందిస్తోంది. పట్టణ విలువలను పునరి్నర్వచిస్తుంది.అర్బన్ బ్రాండింగ్పారదర్శక వేలం, విధాన స్థిరత్వంతో హైదరాబాద్ ఇప్పుడు ప్రాంతీయ పవర్‌హౌస్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. నాలెడ్జ్ సిటీ ప్రాంతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్, ఇన్నోవేషన్ కారిడార్. ఇది హెటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు చేరువలో ఉండటం అదనపు అడ్వాంటేజ్. గత ఆర్థిక సంవత్సరంలో నగరంలో 1.2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను నమోదు చేసింది. ఐటీ, ఐటీఈఎస్‌లో 52 శాతం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగంలో 18 శాతం, రిటైల్, హాస్పిటాలిటీలో 12 శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇది రియల్టీ రంగానికి వైవిధ్యభరితమైన గ్రోత్ ఇంజిన్.విశ్వాసం పెరుగుతోందివేలంలో రికార్డ్ ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ సామర్థ్యానికి, పెట్టుబడి దారుల్లో విశ్వాసానికి సూచిక. అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), క్లియర్ ల్యాండ్ టైటిల్స్, ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో కూడిన ప్రైమ్ ల్యాండ్స్‌కు బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తుంటాయి. టెక్ సంస్థలు, కార్పొరేట్, సంస్థాగత పెట్టుబడిదారులు నుంచి నిరంతర డిమాండ్‌ను ముందుగానే అంచనా వేస్తున్నారనేది సూచిస్తుంది. రాయదుర్గంలో భూమి విలువ వృద్ధితో మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది.➤ అధిక ధరలకు భూములను కొనుగోలు చేసే ధోరణి దీర్ఘకాలంలో స్థిరాస్తి రంగానికి ఏమాత్రం మంచిది కాదు. 95 శాతం బిల్డర్లు, తుది వినియోగదారులు(ప్లాట్లు లేదా వాణిజ్య స్థల కొనుగోలుదారులు) ప్రతికూలమే. భూమి విలువలు స్థిరంగా పెరగాలే తప్ప రాత్రికి రాత్రే పెరిగితే తుది కొనుగోలుదారులకు అఫర్డబులిటీ ఉండదు. నగరం శివార్లకు విస్తరించే బదులుగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ట్రాఫిక్ జామ్‌లు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడికి దారి తీస్తుంది.➤ ఏ ఉత్పత్తి ధర అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డిమాండ్, సరఫరా అనేది ఇందులో అత్యంత కీలకం. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే అతి ముఖ్యమైనది ప్రాంతం. అందుకే దేశ ఆర్థిక రాజధానిలో దక్షిణ ముంబైలో ఫ్లాట్ కొనుగోలుకు అత్యధిక ధర చెల్లిస్తుంటారు. అక్కడ 10 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే భారీ భూమి లభ్యత ఉన్నప్పటికీ, అనేక సమాంతర రోడ్లు అభివృద్ధి చేసినా, మురికివాడలు కొత్త రూపు సంతరించుకుంటున్నా, కొత్త విమానాశ్రయం వచ్చినా.. దక్షిణ ముంబైలోని ప్రాపరీ్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలదీ ఇదే కథ. సేమ్ అలాగే మన నగరంలో పశ్చిమ హైదరాబాద్ పరిస్థితి. మన దగ్గర భారీ మూలధనాన్ని సేకరించగల డెవలపర్లు చాలా తక్కువ. ధరలు అసాధారణంగా పెరిగి భారీ మూలధనం అవసరమైతే అది ధనవంతులైన కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో స్థిరమైన డెవలపర్లు కూడా మార్కెట్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతుంది.ఇదీ చదవండి: ఇలాంటి ఇళ్ల కొనుగోలుకు కస్టమర్ల ఆసక్తి!➤ అపార్ట్మెంట్లో రూ.3-4 కోట్లతో ఫ్లాట్ కొనాలంటే మధ్యతరగతి ఉద్యోగులు జీవితకాలం ఈఎంఐ చెల్లించే పరిస్థితి. వేలం మధ్యతరగతి ప్రజలకు మంచిది కాదు. కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డ్ తరహాలో ప్రభుత్వమే మహేశ్వరం, శామీర్‌పేట, మేడ్చల్, సంగారెడ్డి, కొత్తూరు, శంషాబాద్ ప్రాంతాలలో వెంచర్లను అభివృద్ధి చేయాలి. ల్యాండ్ పూలింగ్ విధానంతో ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు స్కీమ్‌లలో భారీ లేఅవుట్‌ను వేయాలి. -
రెరా ఉన్నా 10 శాతం మార్టగేజ్ క్లాజ్ అవసరమా?
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అపారమైన వృద్ధిని సాధిస్తోంది. అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్లు, డెవలపర్లు, కస్టమర్లను ప్రభావితం చేసే కొన్ని నియంత్రణలు, విధానాలు అమలులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే 10 శాతం మార్టగేజ్ (కుదవపెట్టడం) క్లాజ్ కీలకంగా ఉంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) వంటి పకడ్బందీ నియంత్రణ సంస్థల ఉనికి ఉన్నా ఈ క్లాజ్ అమలుపై విభిన్న వాదనలున్నాయి.10 శాతం మార్టగేజ్ క్లాజ్ అంటే ఏమిటి?తెలంగాణ ప్రభుత్వం అధీనంలో మార్టగేజ్ క్లాజ్(Mortgage Clause) బిల్డింగ్/లేఅవుట్ అనుమతుల జారీ కోసం ప్రభుత్వానికి 10 శాతం చెల్లించే మొత్తం. ప్రాజెక్ట్ నిర్మించే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించకుండా నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లకు లేఅవుట్ లేదా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడు మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 10 శాతం భాగాన్ని ప్రభుత్వానికి ‘కుదవ’ (mortgage) పెట్టాలని డిమాండ్ చేస్తుంది.ఎందుకోసం అంటే..భవన నిర్మాణంలో అనుమతి పొందిన ప్లాన్ల నుంచి బిల్డర్లు తప్పుకోకుండా (deviation) నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకవేళ బిల్డర్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ కుదవ పెట్టిన 10 శాతం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.RERA ఉన్నప్పటికీ ఈ క్లాజ్ అవసరమా?రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం RERA (Real Estate Regulatory Authority) చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా TG-RERA పటిష్టంగా అమలులో ఉంది. రెరా చట్టం కింద బిల్డర్ ప్రాజెక్టును తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతం ప్రత్యేక ఖాతాలో ఉంచాలి. అలాగే ప్రాజెక్టు ప్లాన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదు. రెరా ఉల్లంఘనలకు జరిమానాలు, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.వ్యతిరేకత ఎందుకు?బిల్డర్ల సమాఖ్య (TBF - Telangana Builders Federation) వంటి సంస్థలు రెరా చట్టం పకడ్బందీగా ఉన్నందున 10 శాతం స్థలాన్ని కుదవపెట్టే (Mortgage Clause) నిబంధన అనవసరం అని వాదిస్తున్నాయి. ఎందుకంటే రెరా అనేది భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనను సమర్థవంతంగా నియంత్రించగలదని భావిస్తోంది.బిల్డర్లు, ప్రాజెక్ట్ డెవలపర్లపై ప్రభావం10 శాతం మార్టగేజ్ క్లాజ్ వల్ల రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రాజెక్ట్ డెవలపర్లపై కొంత ప్రభావం ఉంటుంది. బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌లో 10% స్థలాన్ని ఉపయోగించుకోలేరు. అంటే ఆ 10% స్థలాన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు కోల్పోతారు. ఇది వారి ఆర్థిక లభ్యత (cash flow)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్లాక్ చేసిన 10 శాతం స్థలంపై నిర్వహణ ఖర్చులు, పన్నులు వంటి అదనపు భారం పడుతుంది. ఇది మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని (Project Cost) పెంచుతుంది. అనుమతుల ప్రక్రియలో ఆలస్యం లేదా క్లాజ్ అమలులో సమస్యలు ప్రాజెక్ట్ డెలివరీలో ఆలస్యం కావడానికి దారితీయవచ్చు.రియల్టీ కస్టమర్లపై ప్రభావంనిర్మాణ వ్యయం పెరిగినప్పుడు, బిల్డర్లు ఆ భారాన్ని సర్దుబాటు చేయడానికి ఫ్లాట్లు లేదా నివాస స్థలాల ధరలను పెంచే అవకాశం ఉంది. 10 శాతం స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాజెక్టులో అమ్మకానికి ఉండే యూనిట్ల సంఖ్య తగ్గిపోతుంది. సానుకూల కోణం నుంచి చూస్తే బిల్డర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కస్టమర్ల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం వద్ద ఒక ఆస్తి (10% స్థలం) హామీగా ఉంటుంది.క్లాజ్ తొలగిస్తే ప్రభుత్వంపై ప్రభావం ఎంత?తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (TBF) వంటి రియల్ ఎస్టేట్ సంఘాలు రెరా ఉన్నందున 10 శాతం మార్టగేజ్ క్లాజ్‌ను రద్దు చేయాలని కోరుతున్నాయి. లేదా రెరా కింద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ 10 శాతం క్లాజ్ అనేది ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని (revenue) ఇచ్చే పన్ను కాదు. ఇది ఒక నియంత్రణ సాధనం (Regulatory Tool)గా పని చేస్తుంది. దీన్ని తొలగిస్తే భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రధాన సాధనం కోల్పోతుంది. రెరా ఉన్నప్పటికీ ఈ స్థల హామీ అనేది స్థానిక సంస్థలకు (GHMC వంటివి) తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ఈ నిబంధన తొలగిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణం, అమ్మకాలు పెరిగి, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి పరోక్షంగా మరింత ఆదాయం రావడానికి అవకాశం కూడా ఉందని ఇంకొందరు అంటున్నారు.ఇదీ చదవండి: రుణమే.. బంగారమాయెనే! -
రియల్టీ బూమ్ నిజంగా తగ్గిపోయిందా?
రాష్ట్రంలో చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో రియల్టీ రంగం కీలకం ఉందని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ‘నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో’ను ప్రారంభించిన ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ప్రాపర్టీ షోను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘రాష్ట్రం రియల్టీ రంగంలో దూసుకుపోతుంది. చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రాష్ట్రంలో రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదు. సామాన్యులు నగరంలో ఉన్న చాలా ప్రాపర్టీ వెంచర్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడం కొంత వ్యయప్రయాసలతో కూడుకుంది. ఏటా నారెడ్కో ఆధ్వర్యంలోని ఇలాంటి ప్రాపర్టీ షోల వల్ల వందల కంపెనీలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. దాంతో గృహ కొనుగోలుదారులు మెరుగైన ప్రాపర్టీని ఎంచుకోవడం సులువవుతుంది. నారెడ్కో హైదరాబాద్ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు ఇదో అవకాశం. ప్రభుత్వం నగరంలోని మౌలిక సదుపాయాల వృద్ధికి ఎంతో కృషిచేస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో సిటీ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సుల ఏర్పాటు, ట్యాక్స్ రాయితీలివ్వడం, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను ఏర్పాటు చేస్తోంది. త్రాగునీరు కల్పన, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. హైడ్రా వంటి చట్టాలు వచ్చిన మొదట్లో స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చినా నెమ్మదిగా ప్రజలు దాని ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. నారెడ్కో, రియల్టీ సంస్థలు కూడా స్పందించి కమర్షియల్ కోణంతోపాటు సామాజిక బాధ్యత కింద సీఎస్ఆర్ నిధులను వివిధ కార్యక్రమాలకు వెచ్చించాలి’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి మేక మాట్లాడుతూ..‘ప్రీమియం, లగ్జరీ ప్రాపర్టీ విభాగాల్లో బలమైన డిమాండ్ ఉంది. ఇది వృద్ధికి దోహదపడుతోంది. కొనుగోలుదారులు ప్రధాన ప్రదేశాల్లో తమ జీవనశైలి ఆధారిత గృహాల కోసం ఎక్కువగా చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, వేతవంతమైన పట్టణీకరణతో హైదరాబాద్ నివాస మార్కెట్ జాతీయంగా మెరుగైన పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది’ అన్నారు. ఈ సందర్భంగా రెరా వంటి పకడ్బందీ రెగ్యులేటర్లు ఉండగా ప్రభుత్వం డెవలపర్ల నుంచి 10 శాతం మార్టగేజ్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోందని గుర్తుచేస్తూ దీన్ని వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై బట్టి విక్రమార్క స్పందిస్తూ..‘ప్రభుత్వం అందరి అభివృద్ధికి తోడ్పడుతుంది. బిల్డర్లు, రియల్టీ డెవలపర్లు సంబంధిత ప్రతిపాదనలతో వస్తే తప్పకుండా దీనిపై సమాలోచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ కె.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టెక్నాలజీ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాపార సంస్థలకు కేంద్రంగా హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతాన్ని ప్రముఖంగా నిలుపుతున్నాయి. నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు, అనుకూలమైన దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ వాతావరణం ఉంది. దాంతో నగరాన్ని నివాస, వాణిజ్య పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చుకోవాలని భావిస్తున్నారు’ అని అన్నారు.ఇదీ చదవండి: మార్పు మంచిదే! ఎవరిపై ఎంత ప్రభావం? -
రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్‌దే ప్రధాన పాత్ర
రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వంహించిన ''నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో''ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు.రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇటీవల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లభించడం పెట్టుబడిదారులు, రియల్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నారెడ్కో ప్రెసిడెంట్ విజయ్ సాయి మేక, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, కిరణ్, నారేడ్కో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పీఎస్ రెడ్డి, ఎం. వెంకయ్య చౌదరి, పి.రవిరెడ్డి, స్వామీనాథన్, కాళీప్రసాద్, వెంకటేష్, హరిబాబు, దశరథ్ రెడ్డి, కిరణ్ ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 ప్రముఖ నగరాలకు సంబంధించి ఇళ్ల ధరల సూచీ (హెచ్పీఐ) 3.6 శాతం పెరిగింది. 18 నగరాల్లో ఇళ్ల కొనుగోలు/విక్రయ లావాదేవీల వివరాలను రిస్ట్రేషన్ విభాగాల నుంచి సమీకరించి, ఆర్బీఐ ప్రతీ త్రైమాసికానికి సంబంధించి హెచ్‌పీఐని విడుదల చేస్తుంటుంది. 2022–23 మూల సంవత్సరం (బేస్ ఇయర్)గా ఆర్బీఐ 2025–26 క్యూ1 హెచ్‌పీఐని ప్రకటించింది. ఇంతకుముందు వరకు 2010–11 బేస్ సంవత్సరంగా ఉంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఇళ్ల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పెరుగుదల 7.6 శాతంగా ఉంది. నాగ్‌పూర్, చండీగఢ్, చెన్నై, కోచిలో ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇక త్రైమాసికం వారీగా పోల్చి చూస్తే (మార్చి క్వార్టర్ నుంచి) సూచీ 2 శాతం పెరిగింది. హైదరాబాద్, తిరువనంతపురం, పుణె, ఘజియాబాద్, థానే, గౌతమ్ బుద్ధ నగర్, చండీగఢ్, నాగ్‌పూర్‌ను ప్రస్తుత 10 నగరాలకు అదనంగా సూచీలో ఆర్బీఐ చేర్చింది. ఇవి కాకుండా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, కోచి పట్టణాలు ఈ సూచీలో భాగంగా ఉన్నాయి. ఈ నగరాల్లో ధరల తీరు తెన్నులను సూచీ ప్రతిఫలిస్తుంటుంది. -
మెట్రోల్లో ఇళ్ల అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 87,603 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఎలాంటి మందగమనం ఛాయలు లేవంటూ, రానున్న కాలంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలతో దీనిపై స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గడం, జీడీపీ అధిక వృద్ధి, బడ్జెట్లో కల్పించిన పన్ను ప్రయోజనాలతో అమ్మకాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. రెపో రేటు 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల తగ్గింపు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్ను తగ్గింపు (జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ) నేపథ్యంలో పెరిగిన వినియోగ విశ్వాసం ఇళ్ల అమ్మకాలపై ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2,57,804 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ గణాంకాలు ఇందులో కలసి ఉన్నాయి. సంస్థాగత పెట్టుబడులు 11 శాతం అప్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం పెరిగి 1.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ఆఫీస్ వసతుల్లోకి మెరుగైన పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 1.15 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు పేర్కొంది. 780 మిలియన్ డాలర్లు ఆఫీస్ వసతుల్లోకి రాగా, 320 మిలియన్ డాలర్లు నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలపై ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్యాజ్ఞిక్ తెలిపారు. 1.27 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 60 శాతం దేశీ ఇన్వెస్టర్ల రూపంలో రాగా, మిగిలిన మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 51 శాతం పెరగ్గా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 21 శాతం తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ, రానున్న రోజుల్లోనూ ఈ రంగంలోకి సంస్థాగత పెట్టుబడుల రాక బలంగా కొనసాగుతుందని యాజి్ఞక్ అంచనా వేశారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో మోడ్‌లో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్‌లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఆర్ఈడీఏ అని పిలిచేవారు. నరెడ్కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్‌లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్‌లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..హైదరాబాద్‌లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డినరెడ్కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్‌లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ‘పార్కింగ్’ దందా..
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్‌లోని ఓ ప్రాజెక్ట్‌లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్‌లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్‌ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్.. ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్‌ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్డ్ టు సాటిస్ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.టీడీఆర్తోనూ పార్కింగ్ సమస్యలే.. సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్‌లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్‌లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్‌లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో కారు పార్కింగ్‌ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8 అపార్ట్మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.డ్రైవ్ వేలు కూడా పార్కింగ్గానే.. ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్‌గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. – కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా -
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్‌కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్‌కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్‌తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్‌ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్‌ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
మూడు నెలల్లో 97,080 ఇళ్ల అమ్మకం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ.. మన దేశంలో నివాస విభాగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, గృహ యజమానుల అభిరుచులతో గృహాల కొనుగోళ్లు స్థిరంగానే ఉంటున్నాయి.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 97,080 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది క్యూ3లో విక్రయమైన 1,07,060 యూనిట్లతో పోలిస్తే 9 శాతం తగ్గగా.. ఈ ఏడాది క్యూ2లో సేల్ అయిన 96,290 నివాసాలతో పోలిస్తే 1 శాతం వృద్ధి చెందాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.ఇక, 2025 క్యూ3లో 96,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో సరఫరా అయిన 98,630 యూనిట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించగా.. గతేడాది క్యూ3లో సప్లయ్ అయిన 93,750 యూనిట్లతో పోలిస్తే మాత్రం 3 శాతం పెరిగాయి. అయితే ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం 14 శాతం పెరిగింది. గతేడాది క్యూ3లో అమ్ముడైన ఇళ్ల విలువ రూ.1.33 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ3లో విక్రయమైన గృహాల విలువ రూ.1.52 లక్షల కోట్లుగా ఉంది.లగ్జరీ ఇళ్లదే హవా..ఇళ్ల విక్రయాలు, లాంచింగ్స్‌లో ముంబైలో అత్యధికంగా జరిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో 2025 క్యూ3లో 30,260 గృహాలు అమ్ముడుపోగా.. 29,565 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పుణెలో 16,620 ఇళ్లు విక్రయం కాగా.. 19,375 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. లాంచింగ్స్‌లో అత్యధికంగా లగ్జరీ గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల వాటా 38 శాతంగా ఉండగా.. అందుబాటు గృహాల వాటా 16 శాతంగా ఉంది. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 24 శాతం, రూ.40–80 లక్షల ధర ఉన్న మధ్యతరగతి ఇళ్ల వాటా 23 శాతంగా ఉంది.5.64 లక్షల ఇన్వెంటరీ..అమ్మకానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) యూనిట్ల సంఖ్య గతేడాది క్యూ3లో 5.64 లక్షలుగా ఉండగా.. ఈ క్యూ3 నాటికి 5.61 లక్షలకు తగ్గాయి. ఏడాదిలో ప్రాపరీ్టల ధరలు 9 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా ఎన్సీఆర్లో ధరలు 24 శాతం పెరగగా.. బెంగళూరులో 10 శాతం వృద్ధి చెందాయి.హైదరాబాద్‌లో..ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 8,630 గృహాలు లాంచింగ్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ప్రారంభమైన 13,890 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. ఏడాది కాలంలో నగరంలో లాంచింగ్స్ 22 శాతం మేర తగ్గాయి. నగరంలో ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాల డిమాండ్ కొనసాగుతోంది. అందుకే ఈ క్యూ3లో లాంచింగ్ అయిన యూనిట్లలో రూ.80 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 87 శాతంగా ఉంది. ఇక, 2025 క్యూ3లో నగరంలో 11,305 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయమైన 12,735 ఇళ్లతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఇల్లు కొనేవాళ్లకు భరోసా.. అక్రమ డెవలపర్లకు కొరడా!
ప్రీలాంచ్‌లు, సాఫ్ట్ లాంచ్‌ల పేరుతో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.1.50 లక్షల ప్రాజెక్ట్‌ల నమోదు..ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్‌లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.ఎస్క్రో అకౌంట్..దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.తెలంగాణ రాష్ట్రంలో..2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్‌లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.రెరా ఎందుకొచ్చిందంటే?గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్‌లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్(హెచ్డీబీ)1965: యూఎస్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (హెచ్యూడీ)1985: యూకే, హౌసింగ్ యాక్ట్1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..
పండగ అంటే ప్రతి ఇంటా ఆనందమే.. ఫెస్టివల్ సీజన్ (Festive Season) వస్తుందంటే చాలు మార్కెట్లు కళకళలాడుతుంటాయి. దీనికి స్థిరాస్తి రంగం మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితితో ఆరంభమయ్యే పండగ సీజన్ హోలీ వరకూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచింది. దీంతో ఈసారి పండగ ప్రాపర్టీ కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారింది. - సాక్షి, సిటీబ్యూరోదీంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు 25–30 శాతం అధికంగాఉంటాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. డెవలపర్లలో నూతనోత్తేజం నెలకొంది. పండగ సీజన్లో రియల్ రంగానికి (Real Estate) పండగే. కాకపోతే ఈసారి కొనుగోలుదారులకే సిసలైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ భారం తగ్గింది. అందుకే ఈ పండగ సీజన్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి డబుల్ ధమాకాగా చెప్పొచ్చు.హైదరాబాద్‌లో ఏడాదిన్నరగా ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. కాకపోతే ఇళ్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాలని కొందరు ఎదురుచూస్తుండగా.. మార్కెట్ మెరుగ్గా లేని తరుణంలో కొంటేనే మెరుగని, ఒకసారి అమ్మకాలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమని భావించిన కొందరు కస్టమర్లు నచ్చిన ప్రాజెక్ట్‌లలో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.ఔత్సాహిక బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ.. కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నియోపొలిస్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేమనే ఆలోచన బయ్యర్లలో ఏర్పడింది. అందుకే ఆయా ప్రాంతాలలో ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ఈ చిన్న టెక్నిక్స్‌తో నిర్మాణ సామగ్రి ఖర్చు సేవ్
ఇల్లు నిర్మించడం అనేది ప్రతివ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక, భావోద్వేగ పెట్టుబడుల్లో ఒకటి. కానీ, నిర్మాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్న కాలంలో మెటీరియల్ ధరలు, ద్రవ్యోల్బణం, కార్మిక కొరత సవాళ్లుగా మారుతున్నాయి. అయినప్పటికీ సొంతింటి నిర్మాణంలో నాణ్యత విషయంలో గృహ యజమానులు రాజీపడడం లేదు. అందుకోసం తెలివైన, మరింత సమర్థవంతమైన మార్గాల కోసం చూస్తున్నారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి మెటీరియల్ కొనుగోలు విషయంలో డబ్బులు మిగుల్చుకునే మార్గాలు ఏమిటో.. నిర్మాణదశలో కొత్త టెక్నాలజీలు ఏమున్నాయో తెలుసుకుందాం.డబ్బు మిగిలే మార్గాలు..బల్క్ ఆర్డర్లుపెద్ద మొత్తంలో మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సరఫరాదారులు తరచుగా సిమెంట్, స్టీల్, ఇటుకలు, టైల్స్ బల్క్ ఆర్డర్లపై రాయితీ ఇస్తారు. నిత్యం చిన్నమొత్తంలో కొనుగోలు చేయడం కంటే బల్క్‌గా కొంటే రిటైలర్‌తో బేరమాడి తక్కువ ధరకే పొందవచ్చు.సీజనల్ కొనుగోలుమెటీరియల్ ధరలు సీజన్‌ను అనుసరించి మారుతుంటాయి. మార్కెట్ డిమాండ్‌తో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. ఉదాహరణకు, వర్షాకాలంలో ఉక్కు, సిమెంట్ ధరలు చౌకగా ఉండే అవకాశం ఉంటుంది.ప్రత్యామ్నాయ మెటీరియల్ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ్లై యాష్ ఇటుకలు, ఏఏసీ బ్లాక్స్ వంటివి తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయి. ఈ మెటీరియల్స్ నిర్మాణ, రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తాయి.పునర్వినియోగంపాత భవనాలు లేదా కూల్చివేసిన సైట్ల నుంచి కిటికీలు, తలుపులు, శానిటరీవేర్ లేదా టైల్స్ వంటి సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్‌ను తిరిగి వాడుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా రీయూజబుల్ మెటీరియల్‌ను అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకొని అవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చు.ప్రభుత్వ పథకాలుప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవనాలకు కావాల్సిన మెటీరియల్స్‌పై తగ్గించిన జీఎస్టీ రేట్లు, సరసమైన గృహాలకు సబ్సిడీలు (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటివి), పన్ను మినహాయింపులు ఇవన్నీ మొత్తం నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.టెక్నాలజీలునిర్మాణంలో 3డీ ప్రింటింగ్టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 3డీ-ప్రింటెడ్ గృహాలు నిర్మాణం ఎక్కువైంది. టెక్నాలజీ ఆధారంతో ఎలాంటి డిజైనింగ్ ఇళ్లు కావాలనేదానిపై ముందుగానే అంచనాలు ఏర్పరుచుకొని ఖర్చు తగ్గించుకునేలా 3డీ ప్రింటెడ్ గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగంలో కొన్ని స్టార్టప్‌లు తక్కువ సమయంలోనే గృహాలను నిర్మిస్తున్నాయి. దీనివల్ల సమయం, కార్మిక ఖర్చులు రెండింటినీ మిగుల్చుకోవచ్చు.ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ప్రీ-కాస్ట్ గోడలు(ముందుగానే కట్టిన గోడలు), ఫ్లోర్ ప్యానెల్స్, పైకప్పులు బయట ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇంటి అవసరానికి తగినట్లుగా నిర్దిష్ట కొలతలతో అసెంబ్లింగ్ కోసం నిర్మాణ స్థలానికి రవాణా చేస్తున్నారు. ఇది ఆన్-సైట్ వ్యర్థాలను తగ్గిస్తుంది. నిర్మాణ సమయాన్ని 50% వరకు తగ్గించగలదు.బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం)బీఐఎం వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు భాగస్వామ్య 3D మోడల్‌ను ఉపయోగించి వారికి సహకరిస్తుంది. ఇది కచ్చితమైన పదార్థ అంచనాను నిర్ధారిస్తుంది. డిజైనింగ్ అవరోధాలను నిరోధిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీఐఎం అనేది కట్టే ఇంటికి నమూనాలాంటిది.ఏఐ-ఆధారిత ఎస్టిమేటర్లుకృత్రిమ మేధ సాధనాలు డిజైన్ బ్లూప్రింట్లను విశ్లేషించగలవు. కచ్చితమైన మెటీరియల్ అంచనాలను అందించగలవు. ఇది అధిక ఆర్డర్లు, తక్కువ వినియోగం లేదా చివరి నిమిషంలో మెటీరియల్ కోసం కంగారు పడడం వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.గ్రీన్ కాంక్రీట్ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థ ఉత్పత్తుల నుంచి తయారైన జియోపాలిమర్ కాంక్రీట్ సాంప్రదాయ సిమెంట్‌కు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ మెటీరియల్ మన్నికగా ఉంటూ పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో తోడ్పడుతుంది.డ్రోన్ ఆధారిత సైట్ సర్వేలుహై-రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన డ్రోన్లు వివరణాత్మక టోపోగ్రాఫిక్ మ్యాప్‌లు అందిస్తాయి. భారీ నిర్మాణ సైట్‌ల్లో డెవలప్మెంట్ను ట్రాక్ చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’


